మంచినీటి సరఫరా ప్రక్రియకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పక్కాగా ఇంటింటి సర్వే జరగాలి

రానున్న 10 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
స్వర్వే ప్రక్రియ పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కర్కపల్లి ఎస్సి కాలనిలో నేటి నుండి ప్రారంభమైన మంచి నీటి సరఫరా సర్వే ప్రక్రియను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటింటి సర్వే చేపట్టినట్లు తెలిపారు రానున్న 10 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని అన్నారు. సర్వేలో ప్రతి ఇల్లు కవరు కావాలని సూచించారు సమస్యలు లోపాలను క్షేత్రస్థాయిలో వివరాలు సేకరణ చేయనున్నట్లు తెలిపారు
ఇంటింటికి మంచినీరు అందించేందుకు జిల్లాలో దాదాపు 97,791 వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియలో వివరాలు
నమోదుకు ఎంత సమయం పడుతుందన్నది నమోదు చేస్తున్న వివరాలను ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు ఏ ఒక్క ఇల్లు విడిచి పెట్టకుండా అన్ని ఇళ్లు సర్వే చేయాలని సూచించారు క్షేత్ర స్థాయిలో చాలా ఇళ్లకు నీరు అందడం లేదని, పైపులైన్లు పగిలిపోయి వాల్వ్ లీకేజీలతో నీరు వృథా అవుతోందనే ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ ఇంటిని సర్వే చేయనున్నట్లు తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా సర్వే 10 రోజుల్లోగా పూర్తి చేసి మిషన్ భగీరథ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు సర్వే నిర్వహణలో పంచాయతి కార్యదర్శులు ఐకెపి వ్యవసాయ శాఖ ఏఈవోలు గ్రామీణాభివృద్ధి క్షేత్రస్థాయి సిబ్బంది అంగన్వాడీ సూపర్ వైజర్లు తదితరులు పాల్గొనున్నారని అన్నారు
సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీల్లో
ప్రతి ఇంటి యాజమాని పేరు చిరునామా నల్లా ఫొటోలను సర్వేలో తీసుకుంటారని తెలిపారు సర్వే ప్రక్రియకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు
మంచినీటి సరఫరా తీరుతెన్నులను తెలుసుకునేందుకు అలాగే ప్రజలు నీటిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఎక్కడైనా నీటి సమస్య ఉందా ఏదైనా కాలనీలకు నీరు సరఫరా చేయాలా అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరిస్తారని తెలిపారు వీటన్నింటినీ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో నమోదు చేసి పది రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అన్నారు మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలు తెలుసుకున్న అధికారులు యాజమాని పేరు చిరునామా ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ తో సహా కుటుంబ సభ్యుల వివరాలు సరిపడా నీళ్లు వస్తున్నాయా లేదా తదితర 11 రకాల వివరాలు సేకరిస్తారన్నారు వీటన్నంటినీ ఈ వివరాలను పారదర్శకంగా యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారన్నారు సర్వే వల్ల రానున్న రోజుల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుందని అన్నారు సర్వేపై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరేష్, ఎంపిడిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *