మూడోసారి కూడా సారు, కారు సర్కారే?

https://epaper.netidhatri.com/

`హాట్రిక్‌ విజయం తధ్యమే!

`మెజారిటీ సీట్లు ఖాయమే

`తెలంగాణ అంతటా మళ్ళీ గులాబీ పరిమళమే.

`ప్రజల మద్దతంతా కారు పార్టీకే.

`ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ మరో సారి ప్రభంజనమే.

`పల్లెలు, పాడి పంటలు పరవశమే…

`పట్నంలో ప్రగతి పరుగులే.

`తెలంగాణ అన్ని వర్గాల అభ్యున్నతే…

`కాంగ్రెస్‌ పాపపుకాలం పాయే…

`బీఆర్‌ఎస్‌ తో పుణ్య కాలమొచ్చె.

`పదేళ్లలో తెలంగాణ మెరిసే…`ప్రజలంతా మురిసే.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా కారు, సారు,సర్కారు అనే నిదాదమే వినిపిస్తోంది. ప్రచారంలో కారు దూసుకుపోతోంది. ఎక్కడ విన్నా సారు పేరే వినిపిస్తోంది. తెలంగాణ సర్కారుకు ఎదరులేదని తెలుస్తోంది. కంగ్రెస్‌ ఎంత దుష్ట్రప్రచారం చేయాలని చూసినా,ప్రజలు నమ్మడం లేదు. రేవంత్‌ను అసలే నమ్మే పరిస్ధితి లేదు. ఎందుకంటే పూటకో మాట మాట్లాడడంతో రేవంత్‌ ఆరి తేరిపోయాడు. ఓవైపు సీనియర్లను సాగనంపి, దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వస్తున్న వారిని తరిమేసి కాంగ్రెస్‌ నిండా తన అనుచర వర్గాన్ని నింపుకున్న రేవంత్‌ ఎన్నటికైనా కాంగ్రెస్‌ ముంచేస్తాడని భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి నిత్యం జపం చేసేది ఆంధ్రాబాబు చంద్రబాబు పేరే. అందుకే రేవంత్‌ను నమ్మడం అంటే ప్రశాంతంగా వున్న తెలంగాణలో ప్రజలే అల్లకల్లోలం రేపుకోవడం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ అంటేనే కరువు. కాంగ్రెస్‌ అంటేనే జనాలకు బరువు. ఆది నుంచి ఓసారి చూస్తే దేశం మొత్తం కాంగ్రెస్‌ పాలించిన డెబ్బైవ దశకం దాకా దేశం మంతా కరువే. ఆనాడు కరువులో దేశంలో కొన్ని వేల మంది మరణించినట్లు కూడ లెక్కలున్నాయి. కరువు పరిస్ధితుల దృష్ట్యా నాలుగో పంచ వర్ష ప్రణాళికలను కూడా నిలిపిసేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. దేశమంతా కరువు నెలకొని వున్నా ఎలాంటి కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోపాటు, రాజకీయ అస్ధిరత దేశంలో ఎమర్జెన్సీలను పెట్టి, వేధించడంతోనే ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. ఇదీ కాంగ్రెస్‌ చరిత్ర. అంత దాకా ఎందుకు కర్నాకటలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అక్కడ కరువు మొదలైంది. ఆ ప్రభావం తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పడిరది. చలికాలంలో కూడా రాజమండ్రి లాంటి ప్రాంతాలలో చినుకు లేక ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నారని సమాచారం. అలాగే తెలంగాణలో కూడా ఈ మధ్య వాన చినుకు కరవైంది.

గడచిన తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో కరువు ఛాయలు లేవు. 

ఇలాంటి పరిస్ధితుల్లో కర్నాటక రైతులకు కరంటు ఇవ్వలేకపోతోంది. కాని మన తెలంగాణలో వర్షాలు లేకపోయినా తెలంగాన పల్లెలో సమృద్ధిగా నీరుంది. చెరువులు నిండుగా వున్నాయి. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణలో మూడేళ్లపాటు వాన చినుకు లేకుండా కరువు రాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో చినుకును ఒడిసిపట్టి, రిజర్వాయర్లు నింపేశాడు. ఇదీ విజన్‌ ఉన్న నాయకుడి పాలనకు నిదర్శనం. ఒకప్పుడు తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలలాడిరది. కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు మళ్లీ నేనున్నా, తెలంగాణ ప్రజలను పీక్కు తింటాను..కరువును తెస్తాను… జనాన్ని విలవిలాడిస్తాను అన్నట్లు కాంగ్రెస్‌ నేతల ప్రచారం వుంది. ఎందుకంటే పది హెచ్‌పిల మోటార్‌తో ఎకరం మడి మూడు గంటల్లో పారుతుందని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. అసలు బోర్లలో 10 హెచ్‌ పి మోటర్‌ వేసే అవకాశం వుంటుందా? అసలు తెలంగాణలో ఎన్ని బోర్లు వున్నాయో లెక్కలు కూడ తెలియని రేవంత్‌రెడ్డి మోటర్ల గురించి మాట్లాడితే రైతులు నవ్వుకుంటున్నారు. తెలంగాన రాకముందు 17 లక్షల బోర్లు వుండగా, ఇప్పుడు 26లక్షల బోర్లు సాగుకు నీరందిస్తున్నాయి. తెలంగాణలో భూగ్భజలాలు విపరీంతా పెరిగాయి. 10హెచ్‌ పి మోటార్లు కేవలం బావులకే పరిమితం. కాంగ్రెస్‌ పాలకుల పుణ్యమా అని తెలంగాణలో చాలా బావులు ఎప్పుడో కనుమరుగయ్యాయి. పూడికలు నిండిపోయాయి. వాటిని తీయడానికి రైతుకు లక్షల్లో ఖర్చవుతుంది. అందుకు అంత ఖర్చు చేయలేక, బోర్లను నమ్ముకొని తెలంగాణ రైతు వ్యవసాయం సాగిస్తున్నారు. అందుకే 24 గంటల కరంటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. సాగు మీద కనీస అవగాహన లేని రేవంత్‌ మాటలు నమ్ముకొని రైతు నిండా మునిగేందుకు సిద్దంగా లేడు. కాంగ్రెస్‌ ఓటేస్తానని రైతు ఎక్కడా చెప్పడంలేదు. కాని కాంగ్రెస్‌ అసత్య ప్రచారం మొదలుపెట్టి, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని పగటి కలలు కంటున్నారు. యాభై ఏళ్లు కష్టాలు, నస్టాలు, గోసలు చూసిన పల్లె జనం ఇంకా కాంగ్రెస్‌ నమ్ముతారని అనుకోవడం భ్రమ. అందులోనూ రేవంత్‌ నాయత్వం అంటే అది కాంగ్రెస్‌ కాదు. తెలుగుదేశం. తెలంగాణను మరింత గోస పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, పాలమూరును దత్తత తీసుకుంటున్నానని నమ్మించి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్క చెరువులో పూడిక తీయలేదు. ఒక్క పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అలాంటి దుర్మార్గపు పాలన తెలంగాణకు రుచిచూపించిన నాయకుడిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం ఆలోచిస్తాడని అనుకుంటే పొరపాటు. తెలంగాణ ఉద్యమకారులను తుపాకితో బెదిరించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాడా? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేసిన రేవంత్‌ తెలంగాణ ప్రయోజనాలు చూస్తాడా? యాభై లక్షలతో అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి. అలాంటి రేవంత్‌రెడ్డిని నమ్మితే నిండా ముంచకుండా వుంటాడా? ఇరవై నాలుగు గంటల కరంటును మూడు గంటలు చేసి రైతులను గోస పెట్టకుండా ఊరుకుంటాడా?

ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.

 తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రానున్నది. వెల్లివిరిసిన చైతన్యంతో తెలంగాన సాధించుకున్న ప్రజలకు ఏ పార్టీని గెలిపించుకోవాలన్న దానిపై ఎవరి ప్రభావం వుండదు. మూడోసారే కాదు, ఎన్ని సార్లైనా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌నే ఆదరిస్తారు. కేసిఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారు. హాట్రిక్‌ విజయం ఖాయమన్నది జనం చెబుతున్న మాట. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పనిచేసినా, తర్వాత ఆయనకు దూరమైన ఉద్యమకారులంతా కాంగ్రెస్‌, బిజేపిల కోసం పనిచేశారు. అయినా ఆ పార్టీల అసలు స్వరూపం తెలిసి, మళ్లీ ఉద్యమకారులంతా బిఆర్‌ఎస్‌వైపు వస్తున్నారంటే ఉద్యమ పార్టీకి వున్న ప్రాదాన్యత, ముఖ్యమర్రతి కేసిఆర్‌మీద వున్న నమ్మకం ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నాగం జనార్ధన్‌ రెడ్డి ఆనాడే బిఆర్‌ఎస్‌లోకి వస్తే ఎంతో గొప్పగా వుండేది. ఆలస్యమైనా ఏ చెట్టు పక్షులు ఆ గూటికే చేరుతాయన్నట్లు ఉద్యమ కారులంతా మళ్లీ బిఆర్‌ఎస్‌కు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అంటున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఇప్పుడు ఆయన కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చెరుకు సుధాకర్‌ గౌడ్‌, గాయకుడు ఏపూరి సోమన్న దాకా ఉద్యమ కారులంతా బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు తుల ఉమ కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ఉద్యమ కారులంతా కేసిఆర్‌ వైపు వచ్చారంటేనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిబద్దత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తారని అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ సమాజం ఎటు వైపు వుంటుందో బిఆర్‌ఎస్‌ అక్కడ వుంటుంది. బిఆర్‌ఎస్‌ ఎక్కడ వుంటుందో అక్కడ ఇతర పార్టీలకు చోటు వుండదు. ఇది ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌కు, తెలంగాణ సమాజానికి వున్న అవినాభావ సంబంధం. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ జనం గుండెల్లోనుంచి బిఆర్‌ఎస్‌ను తప్పించలేరు. తెలంగాణ సాదన, సంక్షేమపాలన చూపిన ఏకైక నాయకుడు కేసిఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *