చావులోనూ వీడని రక్త సంబంధం.

blood

చావులోనూ వీడని రక్త సంబంధం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో పొలంలో విద్యుదాఘాతంతో అన్నదమ్ములిద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో ఎరుకల జగన్ (48), ఆయన తమ్ముడు ఎరుకల మల్లేశం (42)లు మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్న అడవి పందుల కోసం కరెంట్ తీగలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. చిరాగ్ పల్లి పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!