
Warangal-Khammam national highway
వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో
*దేవాదుల నీటి కోసం రైతుల పోరాటం
*దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను రక్షించాలి.
*భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి.
వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్ధన్నపేట మండలం చెరువును దేవాదుల నీటితో నింపాలని జాతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కట్ర్యాల గ్రామం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉండూరు మహేందర్ రెడ్డి. జిల్లా కార్యదర్శి జడ సతీష్.

కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ అధ్యక్షులు పింగిలి రాజేందర్ రెడ్డి . కడారి గూడెం మాజీ సర్పంచ్ మంద సతీష్. కంజర్ల రంజిత్ మరియు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం దేవాదుల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నీటి కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.