జెండా ఎగరవేసిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
వడ్డెర సంఘం భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు మల్లయ్య ప్రధాన కార్యదర్శి రవి ఆధ్వర్యంలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర సంచార జాతి కులమునకు చెందిన వడ్డెర ఓబన్న రేనాటి ప్రాంతంలో జన్మించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో ఘర్షణలు జరిగినాయి. ఘర్షణలు క్రమేపి సాయుధ పోరాటాలుగా మారాయి. ఆ పోరాటాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాట పోరులో సైన్యాధ్యక్షుడుగా వడ్డెర ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను చరిత్రలో మర్చిపోరానిది పోరాటాన్ని ఉరుకులు పెట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన వీరుడు వడ్డేర ఓబన్న నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడుగా తన నాయకుడినితో వారి కుటుంబాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషించిన ఓబన్న వడ్డెర జాతీనే కాకుండా సభ్య సమాజం గర్వించదగ్గ వ్యక్తి అని సంఘ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య ప్రధాన కార్యదర్శి రవి ఉపాధ్యక్షులు విజేందర్ జిల్లా కన్వీనర్ రవి మండల అధ్యక్షుడు సారయ్య తదితరులు పాల్గొన్నారు