నల్లబెల్లి, నేటి ధాత్రి:
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ముగ్గుల పోటీ నిర్వహించారు అదేవిధంగా గాలిపటాలు ఎగరవేసి విద్యార్థులచే సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను ప్రదర్శించారు అనంతరం ప్రిన్సిపాల్ ఉషారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు పండుగను సంతోషంగా సంబరంగా చేసుకోవాలని పాడిపంటలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని ఆమె అన్నారు కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియా దాస్, వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు బొద్దుల సాంబమూర్తి, బాబు, సింధు, విద్యార్థి విద్యార్థినులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు