జైపూర్, నేటి ధాత్రి:
యువతకు క్రీడల వలన శారీరక,మానసిక శ్రేయస్సు మెరుగుపడి లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెన్నూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మహామ్మద్ ఇలియాజ్ ఉద్దీన్ పేర్కొన్నారు.అదే క్రమంలో చెన్నూర్ కాంగ్రెస్ వివిధ మండలాల యువజన నాయకులతో కలిసి గురువారం కోటపల్లి మండలంలో జాతీయస్థాయి,రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఇలియాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో ముందుకు సాగవచ్చననే ఉద్దేశంతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి యువతని ప్రోత్సహించిన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి అసంపెల్లి నందకిషోర్,భీమారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరం రాజశేఖర్ రెడ్డి,గౌస్,రాజకుమార్ నాయక్, పలువురు కాంగ్రెస్ యువ నాయకులు పాల్గొన్నారు.