నూతన ఏఎంసి చైర్మన్ గా చందుపట్ల రాజిరెడ్డి

రైతుల పక్షాన ఉంటూ మార్కెట్ బలోపితం చేస్తా

క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరికి,పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్ గా చందుపట్ల రాజిరెడ్డి ని నియమించడం జరిగింది.ఈ సందర్బంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.అనంతరం చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో నాపై ఎంతో నమ్మకంతో వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నన్ను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.సహకరించిన పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పరకాల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్,మాజీ ఎంపీపీ స్వర్ణలత,చైర్మన్ సోద అనితరామకృష్ణ మరియు కౌన్సిలర్లకు,వివిధ గ్రామాల ఎంపిటిసి లకు,సర్పంచులకు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వివిధ గ్రామాల అధ్యక్ష,కార్యదర్శి లకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ పరకాల మార్కేట్ నూ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మరియు వ్యాపారస్తులను,అధికారులను ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ రైతులకు న్యాయం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పరకాల పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,రాయపర్తి ఎంపిటిసి పర్నెం మల్లారెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,చందుపట్ల రాఘవరెడ్డి,పుట్ట రాజు, మహ్మద్ అలీ,లక్కం శంకర్, దార్న వేణుగోపాల్,సాయి,మార్క కిరణ్,నాగారం బీరప్ప దేవాలయ చైర్మన్ పోతురాజు కోటి,రాంకొంరు,మోహన్ రావు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *