ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపతి రాములు

*మంచిర్యాల జిల్లా*

హైదరాబాద్ పరిధిలో చేపట్టిన హైడ్రా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపతి రాములు అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూముల్లో కబ్జాదారులు పాగా వేసుకున్నారని, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. జిల్లాలో హైడ్రాను కొనసాగించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్, క్యాతం రాజేష్, ఉప్పులేటి రవి, తలారి సమ్మయ్య, కుమ్మరి సతీష్, గురునాధం నరేందర్ గౌడ్, ఆవుల శ్రీధర్, దాసరి నరేందర్, కలవేన స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!