# వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
# హైద్రాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించి రైతు నేస్తం
విడియో కాన్ఫరెన్స్ లో
నర్సంపేట రైతు వేదిక నుండి పాల్గొన్న కలెక్టర్.
నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు.
హైదరాబాద్ నుండి నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు, రైతులలో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు.నర్సంపేట కేంద్రంలోని రైతు వేదిక నుండి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్ తో కలిసి హాజరయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సాగు రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు, రైతులు వ్యవసాయ రంగంతో పాటు అనుబంధంగా చేపలు పాడి పశువుల పెంపకం వంటివి చేపట్టాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన అలవాట్లను విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొంటారని, రైతులు సమస్యలను వారి దృష్టికి పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
# విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య…
నర్సంపేట మండల కేంద్రంలోని పలు విత్తనాలు విక్రయించే డీలర్ షాపులను, ఆగ్రో సెంటర్లను వరంగల్ జిల్లా కలెక్టర్ టీ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాలతో కలిసి. విత్తనాల, యూరియా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని, సంబంధిత షాప్ ను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతులు ప్రసిద్ధిలేని విత్తనాలు కొనుగోలు చేయకూడదని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్, ఆర్డీఓ కృష్ణవేణి,వ్యవసాయ అధికారులు ఏడిఏ సురేష్,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్,శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.