పట్టించుకోని అధికారులు
ధర్మ రావు పేట గ్రామ ప్రజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామ ఊర చెరువు కబ్జాకు గురౌతందని చెరువు ఆయకట్టు రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా అధికారులకు ప్రభుత్వ పాలకులకు చెప్పినప్పటికి పేడ చెవునా పెడుతున్నారు ప్రతి ఏటా కొంత చెరువు శిఖం భూమిని వ్యవసాయ భూమిగా మారుస్తూ చెరువును పుడుస్తున్నారు ఇప్పటికే దాదాపు 30ఎకరాల చెరువు శిఖం కబ్జాకు గురైందని రైతులు మోరపెట్టుకుంటున్నారుఈ చెరువు భూమిని సింగరేణి వారికి
వ్యవసాయభూమిగా రికార్డ్ లొ ఎక్కిస్తూ కబ్జాదారులు డబ్బులు తీసుకునుటకు సింగరేణి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు
ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఊర చెరువు కబ్జాకు గురవుతుందని రైతులు వాపోతున్నారు