– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల ( నేటి దాత్రి):
విద్యార్థినులను, మహిళలను ఆకతాయిలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలోని షీ టీం ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో ను పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ షీ టీమ్స్ ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మే నెలలో షీ టీంకు వచ్చిన ఫిర్యాదులను మూడు ఎఫ్ఐఆర్, నాలుగు పెట్టి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మహిళల చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థినులను మహిళలు ఆకతాయిలు వేధిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే ఆకతాయిలపై కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్నా తమను నిర్భయంగా సంప్రదించాలని కోరారు.