బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది.
రఘునాథపల్లి.( జనగామ) నేటి ధాత్రి:-
బీసీలకు 43% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో కేటాయించాలని . కుల గణన చేసి బీసీలకు రావలసిన వాటా బీసీల కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి జనగాం జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి నేత డిమాండ్ చేశారు గురువారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డెకరేషన్ అమలు చేయాలని ఆరు కార్పొరేషన్ చైర్మన్ లో బీసీలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్య మైన డిమాండ్ లు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కులగణన బిల్లుకు ఆమోదం తెలపాలి.
కులగణనకు చట్టబద్ధత కల్పించాలి.
కులగణన విధివిధానాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.
కులగణనలో బిహార్ ర్రాష్టాన్ని మోడల్ గా తీసుకోవాలి అని సూచించారు.