బిజెపి జిల్లా నాయకుడు పోలేపల్లి బాలరాజ్
హసన్పర్తి (నేటిధాత్రి) :
వర్షాకాలం ప్రారంభమై రైతులు విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ సహకార సంఘాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న విత్తనాలు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని బిజెపి జిల్లా నాయకుడు , ఏబీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పోలపల్లి బాలరాజ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఆరు నెలలు ముగిసిన ప్రజల ఇబ్బందులను, రైతుల ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు.తొలకరి జల్లులు కురుస్తున్న వేళ రైతుల ఏ షాప్ కి వెళ్లిన పచ్చిరొట్ట విత్తనాలు, పత్తి విత్తనాలు దొరకడం లేదు అని అన్నారు.రైతులకు కావలసిన విత్తనాలను అందించకుండా నాసిరకం విత్తనాలు మాత్రం అందిస్తూ ఇవి మాత్రమే ఉన్నాయని తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని వ్యాపారాలు చెప్తున్నా రని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతులకు లభించాల్సిన అన్ని రకాల సబ్సిడీలను అందించాలని కోరారు.