– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఈ నెల 9వ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై చీప్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న నిర్వహించే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలకు గాను 4699 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి చంద్రయ్య, అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, చీఫ్ సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు