మనభూమి మన భవిష్యత్తు.
సమస్త ప్రాణకోటికి పుట్టినిల్లు మన భూమి.
అభివృద్ధి పేరుట భూమిని నాశనం చేస్తున్నామా?
ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుందా ?
చిట్యాల, నేటిధాత్రి :
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను నేటిదాత్రితో పంచుకున్న ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్ సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన భూమి నేడు నేడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది దానికి కారణం మనమే, అభివృద్ధి పేరిట మన భూమిని మనమే నాశనం చేస్తున్నాము.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం
నేటి పారిశ్రామిక విప్లవంతో భూమి అంతం తప్పదా.
ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుందా.
అరుదైన జీవజాతులు ప్రపంచంలో అంతరించిపోతూనే ఉన్నాయి
రోజురోజుకు పర్యావరణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి దీనితో అకాల వర్షాలు తీవ్రమైన ఎండలు తీవ్రమైన కరువు ఇలా ఎన్నో బీభత్సవాలకు కారణం పర్యావరణంలో వచ్చే మార్పులే
ఎందుకు పర్యావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి కారణం మనుషులు చేసేటువంటి కాలుష్యం వాతావరణ కాలుష్యం పలు రకాలుగా జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ లో ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ మరియు రైతులు వాడేటువంటి రసాయన ఎరువులు మరియు ప్లాస్టిక్ రెవల్యూషన్ ఇలా ఎన్నో కారణాల వల్ల ఈరోజు పర్యావరణము సమతుల్యతను కోల్పోయింది.
ఐక్యరాజ్యసమితి 1972 సంవత్సరంలో ఈ పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది మొదటి పర్యావరణ దినోత్సవం 1973 జూన్ 5న ఒకే ఒక్క భూమి అనే థీమ్ తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సౌదీ అరేబియా దేశము నిర్వహిస్తుంది దీని యొక్క థీమా
మనభూమి మన భవిష్యత్తు.
అభివృద్ధి భూ వినాశనానికి కారణం.*
అభివృద్ధి పేరుతో అడవులు నరికి వేయటం విచ్చలవిడిగా ఫ్యాక్టరీలు నిర్మించడం అందులో నుండి వ్యర్థపదార్థాల ద్వారా భూ కాలుష్యము వాయు కాలుష్యం జరిగి విపరీతమైనటువంటి వాతావరణ అసమతుల్యత ఏర్పడుతుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ల ప్రభావం వల్ల భూ వాతావరణం వేడెక్కి మంచు ఖండాలు కరిగి సముద్ర మట్టం నిత్యం పెరుగుతూనే ఉంది దీనివల్ల ఎన్నో జీవరాసులకు అనువైనటువంటి ఈ భూమి కాస్త ఈ నీటిలో మునిగిపోతుంది.
అదేవిధంగా ప్లాస్టిక్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక పెద్ద సమస్య ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది దీనివల్ల వాతావరణంలో అనుకొని మార్పులు సంభవిస్తున్నాయి ఇకముందు మనం ఊహించలేనటువంటి మార్పులు సంభవించే ప్రమాదం ఉంది ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల ఇప్పటికే పలు దేశాలు ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో బ్యాన్ చేసినప్పటికీ ఇంకా ప్లాస్టిక్ ను అన్ని దేశాలు పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి పనికిరాని భూమి ఎడారిగా మారిపోతుంది. అడవులతో పచ్చగా ఉండవలసిన భూమి ఈరోజు ఎడారులతో చెట్లు చేయమని లేకుండా నిరుపయోగం గా మారిపోతుంది.
అదేవిధంగా ప్రపంచంలో కొన్ని జీవజాతులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
మనిషివాడేటువంటి రసాయనాలు మరియు ఫ్యాక్టరీలను వచ్చేటువంటి వ్యర్థ పదార్థాల వల్ల కొన్ని అరుదైన జీవజాతులు అంతరించిపోతూనే ఉన్నాయి.
ఇప్పటికే అంతరించిపోయిన జీవజాతులు కొన్ని మిలియన్ సంఖ్యలు ఉన్నాయంటే అతిశక్తి కాదు వీటికి కారణం పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పి ఇది మానవుని తప్పిదం వల్లే జరుగుతుంది.
ఈ భూమిని కాపాడడం ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలో లేకపోతే ఎన్జీవోలదో లేకపోతే ఏదో కొద్ది మంది వ్యక్తులతో కాదు ప్రతి పౌరుడు భూగ్రహం పైన ఉన్నటువంటి ప్రతి పౌరుడు భూమిని కాపాడడానికి తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహించాలి.
కాలుష్య నిరంతర కరువులు కూడా తట్టుకునేటువంటి విధంగా పంటల్లో రూపొందించడం వ్యవసాయ భూములను పునరుద్ధరించడం అదేవిధంగా సేంద్రియ వ్యవసాయానికి తగిన మార్గదర్శకాలు రూపొందించడం ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి వర్ధపదార్థాల నియంత్రణ
అదేవిధంగా జనాభా నియంత్రణ కూడా ఇందులో భాగంగానే ఉంది.
పర్యావరణ పరిరక్షణలో భారతదేశం
భారతదేశం అతి పురాతన కాలం నుండే పర్యావరణ పరిరక్షణ ఒక ధ్యేయంగా ఉండేది అందుకే భారతదేశంలో ప్రతి సంస్కృతి సంప్రదాయం పర్యావరణ పరిరక్షణ గానే ఉంటుంది. భారతదేశమే ప్రపంచ దేశాలకు ఆదర్శం రాజుల కాలం నుండి పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది విధిగా నిర్వహిస్తుండేవారు. వేద కాలం నుండి కూడా భారతీయులు పర్యావరణాన్ని దేవుడుగా భావిస్తూ భూతల్లిని గాలిని పశుపక్షాదులను కూడా దేవుళ్ళుగా భావించి పూజిస్తూ ఉండేటువంటి ఆచారాన్ని కొనసాగించేవారు. అందుకే పురాతన కాలంలో భారత దేశమే ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండేది. కానీ రాను రాను పాఠ్య విష సంస్కృతి భారతీయులు చొరబడి పర్యావరణానికి విఘాతాన్ని కలిగిస్తుంది.
అందుకే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటించి ఈ భూమిని మరికొన్ని సంవత్సరాలు బ్రతికేలాగ చేద్దాం.
ప్రతి దేశం ప్రతి పౌరుడు, మూడు సూత్రాలు అనుసరించాలి,అవి
రెడ్యూస్. రీస్, రీసైకిల్,
మనందరం చేయి చేయి కలుపుదాం భూమిని కాపాడుదాం.
ఇది మన బాధ్యత, మనభూమి, మన భవిష్యత్తు.