లెక్క తేలని పంచాయతీ

ఏడు సంవత్సరాలు గడిచిన పట్టించుకోని అధికారులు

ఇద్దరు డి ఎల్ పి ఓ లు గ్రామపంచాయతీకి వచ్చి విచారణ చేపట్టిన ఫలితం శూన్యం

వారం రోజుల క్రితం ఒక లక్ష 3000 రూపాయలు గ్రామపంచాయతీలో జమ ఇంకా 1,40,000గ్రామపంచాయతీకి బకాయి

నేటి వరకు ఎటువంటి నోటీసులు అందించని వైనం

సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో2016,17సంవత్సరంలో ఇంటి పన్ను,నల్ల పన్ను వసూలు మొత్తం రూపాయలు2,43,103రూపాయలు గ్రామ ప్రజల వద్ద నుంచి వసూలు చేసి గ్రామపంచాయతీలో జమ చేయకుండా ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సొంతానికి వాడుకొని ఏడు సంవత్సరాలు గడిచిన పట్టించుకోని అధికారులు అని కత్తుల భాస్కర్ రెడ్డిఅన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ ఇద్దరు డిఎల్పిఓలు గ్రామపంచాయతీకి వచ్చినప్పటికీఏ పంచాయతీ కార్యదర్శి ఎంత చెల్లించాలని నేటి వరకు లెక్క తేల్చలేనిపరిస్థితులలో అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము గనుక మాకెందుకులే అని వదిలేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ ను,జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ ను కలిసినప్పటికీఫలితం శూన్యమని అన్నారు.ఇప్పటికే ఇద్దరు డిఎల్పిఓలు గ్రామపంచాయతీకి చేరుకొని విచారణ చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమన్నారు. మరో వారం రోజుల్లో మరో డిఎల్పిఓ విచారణ చేపిస్తామని డిపిఓ చెప్పడం జరిగిందని అన్నారు. గత వారం రోజుల క్రితం ఒక పంచాయతీ కార్యదర్శి ఒక లక్ష మూడు వేలురూపాయలు గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేసిందనిఅన్నారు.మరో డిఎల్పిఓ విచారణ పేరిట సమస్యను ఆలస్యం చేయకుండా మిగతా అమౌంట్ ను కట్టించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల సమస్యను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులు అతి త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!