BRS Protest Against Political Harassment by Congress Government
కాంగ్రెస్ సర్కారు రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ నిరసన
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నీరసిస్తూ
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కురాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ
బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశంతో మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తా వద్ద పెద్దెత్తున ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు గంటకు పైగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు, మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమ కేసులు, సిట్ నోటీసులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు సిగ్గుచేటని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతోందని అన్నారు. ఇలాంటి చర్యలకు ప్రజలు తగిన సమయంలో చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు ఉడుత సాంబయ్య తోట రాకేష్ కొడారి హైమ ధనంజయ్ గ్రామ కమిటీ అధ్యక్షులు హఫీజ్ వెంకటేష్ కృష్ణ రాజ్ కుమార్ గాద శేఖర్ రాం నరసింహారావు మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి నాయకులు భైరగాని కుమారస్వామి డాక్టర్ జానయ్య మార్త శీను పేరాల దేవేందర్రావు పెంచాల రవీందర్ పల్లె వేణి సదయ్య గాజర్ల చింటూ వీసం భరత్ రెడ్డి బొట్ల స్వామి పాపిరెడ్డి మన్తుర్తి భద్రయ్య కొడారి ఓదెలు పేరాల భాస్కరరావు ఆకుల తిరుపతి నల్లబెల్లి సంపత్ రావు తిప్పని విష్ణు పబ్బ రవి మామిండ్లసాంబయ్య జయపాల్ కొత్తపల్లి కుమార్ జంజర్ల రాకేష్ రామకృష్ణ వాజిద్ అభి సాయిరాం తదితరులు పాల్గొన్నారు..
