బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు
నేటిధాత్రి చర్ల
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో 42 శాతం బీసీ బిల్లును ఆమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ను ఆమోధించి 9 షెడ్యూల్ లో పెట్టాలని కొండా చరణ్ కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేసారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు వాక్యాలు ను ఖండిస్తూ బీసీ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని వారు తెలిపారు
బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలనీ మహిళా రిజర్వేషన్ లలో బీసీ కోటను అమలు చేయాలి
మండల్ సిపార్సులను వెంటనే అమలు చేయాలి
చట్ట సభల్లో విద్య ఉద్యోగం లలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనీ 50 శాతం నిధులతో బీసీ సబ్ ప్లాన్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ ను రద్దు చేయాలనీ
కొండా చరణ్ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేసారు తెలంగాణ బీజేపీ ఎంపి లు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు ను అమోదించే విధంగా బాధ్యత తీసుకోవాలి అని లేకపోతె తెలంగాణ బీజేపీ నాయకులు బీసీ సమాజం ముందు దోషిగా మిగిలిపోతారు అని తెలిపారు