మన్నెకే మాట!

-దానం పార్లమెంటు బాట.

-గోవర్ధన్‌ రెడ్డికి హామీ?

-ఈసారి ఉద్యమ కారులకు ప్రాధాన్యత.

-ఆ క్రమంలో మన్నెకు ఛాన్స్‌!

-ఆది నుంచి పార్టీకి సేవలు.

-నగరంలో బిఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి.

-పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం.

-ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో అభిమానం.

-ఖైరతాబాద్‌ లో ఉద్యమ నేతగా గుర్తింపు.

-ప్రజలకు అందుబాటులో వుండే నేతగా పేరు.

-ప్రజా సమస్యల మీద స్పందనతో మంచి పేరు.

-అటు పార్టీకి, ఇటు ప్రజలతో సత్సంబంధాలు.

-ఖైరతాబాద్‌ ను పార్టీకి కంచుకోట చేశారు.

-మంత్రి కేటిఆర్‌ కు అత్యంత సాన్నిహిత్యం.

-ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగుజాడలు ఆచరణం.

– అను నిత్యం ప్రజల అందుబాటులో…

-అర్థ రాత్రి తలుపు తట్టినా స్పందించే గుణం.

-పేదల కోసం పని చేసే నైజం.

– ఉద్యమ నేతగా అజాతశత్రువు గా ‘మన్నె’నలు.

  హైదరబాద్‌,నేటిధాత్రి:  

మన్నె గోవర్ధన్‌ రెడ్డి ( ఖైరతాబాద్‌ ఎంజిఆర్‌) తెలంగాణ ఉద్యమ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేలేని నాయకుడు. ముఖ్యంగా హైదరాబాద్‌ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల్లో ముందువరసలో నిలిచిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో యువకుడిగా చురుకైన పాత్ర పోషించిన మన్నె గోవర్ధన్‌ రెడ్డ ఖైరతాబాద్‌లో క్రియాశీలపాత్ర పోషించారు. అంతే కాదు పేదల ప్రజలకు నాయకుడయ్యాడు. ఒకనాడు ఖైరతాబాద్‌లో పేదల నాయకుడుగా పిజేఆర్‌ కు పేరుండేది. ఇప్పుడు అదే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఎంజిఆర్‌ పేదల దేవుడుగా కొలుస్తున్నారు. కీర్తింబపడుతున్నాడు. పేద ప్రజల చేత అభిమాననాయకుడిగా కొనియాడబడుతున్నాడు. ఎందుకంటే మన్నె గోవర్ధన్‌ రెడ్డికి తెలంగాణ అంటే ఎంత ప్రేమో, ఉద్యమాన్ని అంత బాధ్యతగా భుజాల మీద వేసుకున్నాడు. మన్నెకు పేదలంటే ఎంత ప్రేమో అంతగా బస్తీల ప్రజలకు అండగా వుంటాడు. బస్తీలంటే ఆయనకు ఎనలేని ప్రేమ. పేదల సాధకబాధకాలు తెలుసుకొని వారికి సేవ చేయడం ఎంతో ఇష్టం. అందుకే ఆనాడు పిజేఆర్‌కు ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు అంత ప్రేమగా ప్రజలు ఎంజిఆర్‌ అని పిలుచుకుంటున్నారు. అంతగా ప్రజల్లో మమేకమైన నాయకుడు హైదరాబాద్‌ రాజకీయాల్లో లేరు. 

తెలంగాణలో ఉద్యమ కారులైన నాయకుల్లో కేటిఆర్‌, హరీష్‌రావు ఇలా చాలా మంది నాయకులున్నారు.

 అలా వారి ఆశయాలు, ఆచరణలను పేదల పట్ల వారికి వున్న అంకితభావం కూడా ఎంజిఆర్‌లో వుంది. అందుకే పేదలకు ఆయనంటే, ఆయన నాయకత్వమంటే ఎంతో అభిమానం. నిత్యం ఆయన ఇంటి ముందు ఎంతో మంది పేదలు ఉదయమే కనిపిస్తుంటారు. తమ సమస్యలు మన్నె గోవర్ధన్‌రెడ్డికి వివరిస్తుంటారు. కొన్ని సార్లు వాళ్లు తమ బస్తీలకు ఆహ్వానించి వారి సమస్యలు విన్నవిస్తుంటారు. ఇలా ప్రజల్లో ఒకడిగా, ప్రజలకు వున్న పెద్ద దిక్కుగా , వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకునే నాయకుడిగా, అండగా వుంటూ వారికి సేవలందిస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనను అజాతశత్రువు అని కూడా అంటారు. ఆయన అన్ని వర్గాల ప్రజలతో ఆప్యాయంగా వుంటాడు. వివాదాల జోలికి ఎక్కడా వెళ్లరు. ఇతర రాజకీయ పార్టీలతో ఘర్షణలు వుండవు. కాని తెలంగాణ విషయంలో మాత్రం ఆయన ఎంతో దూకుడుగా వుండేవారు. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ పార్టీని బలమైన పునాదుల మీద నిలపడంలో మన్నె గోవర్ధన్‌ రెడ్డి పాత్ర చాలా వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన తీరుతో అందరి ప్రశంశలు అందుకున్నారు.. ఇక మంత్రి కేటిఆర్‌ అంటే ఎనలేని అభిమానం. అందుకే కేటిఆర్‌ అంటే ప్రాణ సమానంగా అభిమానిస్తుంటాడు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో చేసిన జాగృతి కార్యక్రమాలతోపాటు, తెలంగాణ ఉద్యమానికి చేజేదోడు వాదోడుగా నిలిచిన నాయకుల్లో మన్నె ముందుండేవారు. ఇక ఇటీవల కవిత డిల్లీ లిక్కర్‌ కేసుల పేరుతో వేధింపులు చేస్తున్న బిజేపిని తూర్పారపట్టడంతో పాటు, అరెస్టు కూడా కాబడ్డాడు. ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం అంటే ఎంతో అభిమానాన్ని పెంచుకున్న నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి. 

మన్నె గోవర్ధన్‌రెడ్డి ఉద్యమకారుడు, తెలంగాణ రాజకీయాలపై పట్టున్న నాయకుడే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఎంతో అవగాహన వున్న నాయకుడు గోవర్ధన్‌రెడ్డి.

 ఎందుకంటే దేశకాల మాన పరిసి ్ధతులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటుంటాడు. ముఖ్యంగా బిజేపి చేస్తున్న అరాజకీయాలును సునిశింగా గమనిస్తుంటాడు. బిజేపి చేసే తప్పులను ఎత్తి చూపడంలో అందరికంటే ముందు వుంటాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై పూర్తి స్ధాయి అవగాహన వున్న నాయకుడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న అభిమానంతో ప్రజలకు ఆ పధకాలు అందేలా చేయడంలో మన్నె గోవర్ధన్‌ రెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పధకాల మీద చాలా మంది నాయకులకు పట్టుండదు. కాని మన్నె గోవర్ధన్‌రెడ్డి మాత్రం వాటి మీద అవగాహన కల్గి వుండడమే కాకుండా, ప్రతిపక్షాలకు దీటైన సమాదానం ఇవ్వడంలో కూడా సిద్ధహస్తుడు. అందుకే మంత్రి కేటిఆర్‌ ఉద్యమ కాలం నుంచి మన్నెను ప్రోత్సహిస్తూ వుంటారు. ఆయన నాయకత్వం మీద వున్న నమ్మకంతో 2014 ఎన్నికల్లో మన్నెకు టిక్కెట్‌ పార్టీ ఇచ్చింది. కొద్ది తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాలు, మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు త్యాగం చేశారు. అప్పటి నుంచి ఎలాంటి పదవులు కూడా ఆశించకుండా ఎంతో అంకితభావంతో పార్టీకోసం పనిచేస్తున్న మన్నెకు ఈసారి ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా వున్న దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ వున్నట్లు తెలిసింది. అందుకే ఖైరతాబాద్‌ నుంచి పోటీకి సిద్దం చేసుకో…అన్న సంకేతాలు మన్నెకు అందినట్లు కూడా తెలుస్తోంది.   

  తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీలో ఈసారి సరికొత్త నాయకత్వాలు తెరమీదకు రానున్నాయి.

 ఒకనాడు తెలంగాణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కొంత మంది నాయకులకు సరైన ప్రాదాన్యాలు దక్కలేదు. అప్పటి పరిస్ధితులు, కొత్త రాష్ట్రం, పాలనాపరమైన అవసరాలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే ఎత్తుగడలు, ఇలా రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని అవకాశాలు అందలేదు. కాని ఈసారి వారందరికీ సరైన గుర్తింపునివ్వనున్నట్లు తెలిసింది. వారికి న్యాయం జరగనున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడానికి, తెలంగాణ అంటే ఏమాత్రం ప్రేమ లేని బిజేపి కేంద్ర నాయకత్వం విషం కక్కుతూనే వుంది. బిజేపి మూలంగా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందనేది బిఆర్‌ఎస్‌ వాదన. అందుకే ఈసారి ఉద్యమ కారులను సరైన ప్రాధాన్యత కల్పించి, ఎన్నికలను ఎదుర్కొనాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. గత ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకున్నందున ఈసారి చాల స్ధానాల్లో ఉద్యమకారులకు పెద్ద పీట వేయనున్నారట. అందులో భాగంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఖరారు చేయనున్నట్లు తెలిసి, బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టిక్కెట్‌ త్యాగం చేసిన మన్నె గోవర్ధన్‌ రెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఇవ్వడం కూడా న్యాయం చేసినట్లౌవుందని మంత్రి కేటిఆర్‌ కూడా అభిప్రాయపడ్డట్లు ప్రగతి భవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పేదల నాయకుడిగా ఇప్పటికే ఎంతో పేరున్న మన్నె గోవర్ధన్‌రెడ్డి గెలుపు ఎంతో సునాయాసమౌతుందంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకున్న వున్న పేరుతోపాటు, 2014లో ఓటమి, 2018త్యాగం వెరసి, ఈసారి అన్ని రకాల సానుకూల అంశాలు తోడు కానున్నాయంటున్నారు. ఏదేమైనా ఈసారి ఉద్యమాకారులకు సరైన ప్రాదాన్యత కల్పించడాన్ని బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ నాయకుడు మన్నె ప్రజా నాయకుడు కావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటినుంచే ఆయన అభిమానులు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టేందుకు సిద్దపడుతున్నారు. ఆల్‌దిబెస్ట్‌ అంటూ పార్టీ శ్రేణులు అభినందనలుకూడా తెలియజేస్తున్నాయి.

మోడీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి!?

`సందర్భం లేకున్న తెలంగాణ మీద విషం కక్కే దుర్ణీతి?

`తెలంగాణలో వున్నది కుటుంబ పాలన కాదు..ఉద్యమ పాలన?

`అభివృద్ధి పాలన…బంగారు తెలంగాణ.

`అవినీతి గురించి మాట్లాడే నైతికత మోడీకి లేదు.

`ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేసే మోడీకి ప్రగతి నచ్చదు?

`ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే మోడీ అభివృద్ధి గురించి ఆలోచించరు?

`‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో. మోడీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ‘‘పల్లా రాజేశ్వర్‌ రెడ్డి’’ ఫైర్‌

`తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ తెలంగాణకు సాయపడతారా?

`తేనె పూసిన మాటలు కట్టిపెట్టండి!

`తెలంగాణకు ఎక్కువ చేసిందేమిటో చెప్పండి?

`విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి.

`తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులేవి?

`ఉత్తరాధికి మూటలు – దక్షిణాధికి మాటలు.

`చెప్పేవి గొప్పలు..చూపించేవి రిక్త హస్తాలు.

`ఎన్ని సార్లు వచ్చినా మోడీ తెలంగాణకు ఇచ్చేదేమీ వుండదు?

`తెలంగాణ ప్రజలను మోడీ మాయచేయలేరు?

`తెలంగాణ ప్రజలు బిజేపిని నమ్మరు?

`గొప్పలు చెప్పుకోవడం అంటే అబద్దాలు చెప్పడమే?

`ఆంద్రప్రదేశ్‌ కు ఉపయోగపడేదే వందే భారత్‌ రైలు?

`తెలంగాణ ప్రజలకు అందుబాటులో వుండదు?

`తెలంగాణ వనరులను దోచుకోవడానికే మోడీ వస్తున్నాడు?

`సింగరేణి అమ్మకానికే మోడీకి తెలంగాణ మీద కుట్ర ప్రేమ?

`మోడీకి తెలంగాణ అంటే ఆది నుంచి చిన్నచూపే?

`తెలంగాణ ఎదగడం ఆయన కు కంటగింపే?

`బిఆర్‌ఎస్‌ పార్టీతో నష్టమని అర్థమయ్యే పదేపదే వస్తున్నాడు?

`ప్రజలను మభ్యపెట్టి మాయచేయాలని చూస్తున్నాడు?

`ప్రజలను విభజించి రాజకీయం చేయడమే మోడీ కుతంత్రం?

`తెలంగాణలో బిజేపి ఆటలు సాగనివ్వం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:     

తెలంగాణ ఏర్పాటు కావడమే బిజేపికి ఇష్టం లేని పని. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి అసలే నచ్చని పని. మనసులో ఒకటి పెట్టుకొని,తెలంగాణకు వచ్చి కపట ప్రేమ నటించడంలో కూడా ఇష్టంలేకుండా చెప్పే మాటలు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్ధమౌతున్నవే. నిజాలు ఎలాగూ బిజేపి నేతలు మాట్లాడలేరు. కనీసం చెప్పే అబద్దాలు కూడా నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మోడీకి తెలంగాణ అంటే ఏ కోశానా ఇష్టం లేదు. అందుకే తెలంగాణకు ఆయన వచ్చినా, మనస్పూర్తిగా మాట్లాడలేరు. ఇష్టం లేని మాటలు ఎప్పుడూ వినసొంపుగా వుండవన్నట్లే మోడీ మాట్లాడతారు. కొత్త రాష్ట్ర్రం తెలంగాణ సాధించుకొని, అరవైఏళ్లపోరాటం ఫలించి, కొత్త అడుగులు వేసేందుకు సిద్దమౌతున్న తెలంగాణకు శుభాకాంక్షలు చెప్పాల్సిన మోడీ, తల్లిని చంపి బిడ్డను బతికించారని తన మనసులో వున్న అక్కసు కక్కేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తారా? తెలంగాణ సాధించుకొని, కొత్తగ ఏర్పాటైన రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేయాల్సిన సమయంలో మాట్లాడే మాటలేనా? శుభం పలకమంటే ఏదో పలికినట్లు? చేసిన మోడీకి తెలంగాణ అంటే ప్రేమ వుంటుందనేది భ్రమ. తెలంగాణ ఏర్పాటై నాడే, కాదు ప్రతి అవకాశాన్ని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేందుకు ఉపయోగించుకొనే మోడీకి తెలంగాణ పట్ల ఎన్నడూ ప్రేమ రాదు. అందుకే ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన వుండదు. అరచేతిలో వైకుంఠం చూపించడం అలవాటు చేసుకున్నాడు. బిజేపి శ్రేణులకు ఇది ఎప్పటికీ అర్ధం కాదు. మోడీ మాయలో పడి బిజేపి శ్రేణులు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాని విరుచుకుపడిన ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ తెలంగాణకు మోడీ చేస్తున్న అన్యాయాలను ఎండగట్టారు. ఆ వివారాలు పల్లా రాజేశ్వరరెడ్డి మాటల్లోనే…

చెప్పుకోవడానికి ఏమీ లేక, గాయి గాయి చేయడం, చెసిన పనినే పదే పదే చేయడం, వార్తల్లో నిలవడం తప్ప మోడీ చేసిందేమీ లేదు.

 పేద దేశమైన మన దేశంలో పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి. కాని సంపన్నులకు దోచి పెట్టే నాయకుడు పేదలకు సేవ చేస్తాడని నమ్మడం ప్రజల అమాయకత్వమౌతోంది. దేశంలో గత ప్రభుత్వాలు అనేక స్పీడ్‌రైళ్లను ప్రవేశపెట్టారు. దేశంలో పేదలకు కూడా సంపన్నులలాగా సౌకర్యాలు అందాలని గతంలో గరీభ్‌రధ్‌ రైలు ప్రవేశపెట్టారు. దేశమంతా ఆ రైళ్లు పేద ప్రజలకు సేవలందిస్తున్నాయి. అయినా వాటిని ఒకేసారి ప్రవేశపెట్టారు. కాని వందేభారత్‌ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్లను ఇప్పటికి ప్రధాన మంత్రి మోడీ 14సార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఇంతపెద్ద దేశానికి ప్రధానమంత్రి కొత్త రైళుకు జెండా ఊపి ప్రారంభించడం తప్ప మరో పనిలేదా? ఇదేనా పరిపాలన తీరు. పైగా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి తిరుపతి వెంకన్నసన్నిధికి వందేభారత్‌తో అనుసంధానం చేస్తున్నామని చెప్పడమన్నంత మాటలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతారో వారికే తెలియాలి. గతంలో తిరుపతికి హైదరాబాద్‌ నుంచి రైల్వే ట్రాక్‌ లేకపోతే, ఇప్పుడు కొత్తగా లైన్‌ వేసి, కొత్తగా ట్రైన్‌ సౌకర్యం కల్పించి, రైలుకు జండా ఊపి ప్రారంభించినంత పచ్చి అబద్దాన్ని గొప్పగా చెప్పుకోవడం మోడీకే చెల్లింది. ఇంత కన్నా అన్యాయమైన మాట మరొకటి వుంటుందా? అయినా సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్‌ రైలు తెలంగాణ ప్రజలకు కోసం వేసింది అసలే కాదు. పేరు పెరుమాళ్లది, ఆరగింపు అయ్యవారిది అన్నట్లు, ఆంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే వేసిన రైలు వందేభారత్‌. ఎందుకంటే సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ తెలంగాణలో ఒక్క నల్గగొండ మీదుగానే ప్రయాణం చేస్తుంది. అది దాటితే మొత్తం ఆంధ్రాలోనే ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్‌ ప్రజలు వందేభారత్‌ రైలులో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్‌కు వచ్చి వెళ్లాల్సిందే? కనీసం కాజీపేట, వరంగల్‌ మీదుగా వెళ్లినా ఎంతో కొంత తెలంగాణుకు ఉపయోగపడిరదన్న సంతోషం వుండేది. కాని తెలంగాణ ప్రజలకు ఆ అవకాశమే లేదు. కాని తెలంగాణకు ఏదో వరం ఇచ్చినంత గొప్పగా చెప్పి, ఆంద్రాకు మేలు చేసిన మోడీకి తెలంగాణ మీద ప్రేమ వుందంటే నమ్ముతామా?

సికింద్రాబాద్‌ హైక్లాస్‌ రైల్వే స్టేషన్‌ ప్రతిపాదన బిజేపి ప్రభుత్వానిది కాదు. 

గతకేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే..తెలంగాణ మీద మోడీ ప్రేమతో చేసిందేమీ కాదు. దక్షిణమధ్య రైల్వే ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.5వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతోంది. మరి అంత ఆదాయం అందిస్తున్న సికింద్రాబాద్‌కు ఎన్ని నిధులు సమకూర్చినా తక్కువే. అయినా నవ్విపోదురుగాక..నాకేమీ అన్నట్లు కేంద్రం కేవలం సికింద్రాబాద్‌ మీద ప్రేమతో ఏ స్టేషన్‌ను చేయనంత అభివృద్ది చేస్తున్నట్లు కలరింగ్‌ ఇచ్చారు. ఇక బిబినగర్‌ ఎయిమ్స్‌కు శంకుస్ధాపన ఒక పెద్ద డ్రామా. శంకుస్ధాపనలు నిర్మాణాలకు ఎప్పుడు చేస్తారో కూడా తెలియనంత అమాయకులా తెలంగాణ ప్రజలు. అక్కడ భవనం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. ఓపి కూడా పనిచేస్తోంది. నిమ్స్‌గా ఇప్పటికే వైద్య సేవలు అందిస్తోంది. కాకపోతే కేంద్రానికి, బిజేపి పార్టీకి హటాత్తుగా బిబినగర్‌ ఎయిమ్స్‌ మీద ప్రేమ తెలంగాణ ప్రజల కోసం రాలేదు. చంద్రబాబు బంధువు భూమల ధరలకు రెక్కలు తెచ్చేందుకు చేశారు. తెలంగాణ ప్రజలకు బిజేపి రాజకీయాలు తెలియనివి కాదు. ఉన్న ఫలంగా బిబినగర్‌ ఎయిమ్స్‌ మీద ప్రేమ అన్నది బిజేపి నటన అన్నది తేలిపోయింది. పైగా ఎయిమ్స్‌ స్దాయి ఆసుపత్రికి వెయ్యికోట్లు వెచ్చిస్తామని మాటలు చెప్పడం కాదు, ఎప్పటిలోగా అన్ని సౌకర్యాలు పూర్తి చేస్తారో మాత్రం చెప్పరు. ఇదీ బిజేపి నీతి లేని రాజకీయం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడానికి కనీసం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా చెప్పడం విడ్డూరం. రైతులు వాడే కరంటుకు మీటర్లు పెట్టమంటారు? దీనికి సహకరించాలా? రైతుల కోసం ఎంత దూరమైన వెళ్లే ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టనని తేల్చడం మోడీకి నచ్చలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లు విడుదల చేయకుండా ఆపేశారు. ఇక ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసినా స్పందిచనిది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన కాజీపేట రైల్లే కోచ్‌ ప్యాక్టరీ ఇస్తానన్నారా? అది ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం లేదా? భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని ఎన్ని సార్లు ప్రకటించినా స్పందన లేనిది కేంద్రం. కాని ప్రధాని స్ధాయిలో వున్న నాయకుడు బహిరంగంగా అబద్దాలు ఆడడం మనం చేసుకున్న దౌర్బాగ్యం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. గిరిజన యూనివర్సిటీ లేదు. మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. 

 సింగరేణి గనులు ప్రైవేటీకరించొద్దు అంటే వినడంలేదు.

 కనీసం ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. కాని రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞులు. గతంలో మిషన్‌ భగీరధ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణకు రూపాయి ప్రకటన కూడా చేయకుండా వెళ్లిపోయారు. అలాంటి మోదీ మేం సహకరిస్తున్నామని చెప్పడం ప్రపంచంలో ఎనమిదో వింతౌతుంది. ఇక పదే పదే దేశంలో 80 కోట్ల మందికి రేషన్‌ ఇచ్చి ఆదుకుంటున్నామని ఓవైపు పదే పదే చెబుతూ, దేశాన్ని ధనిక దేశంగా మార్చుతున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. 130 కోట్ల జనాభాలో 80 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నామంటే దేశంలో పేదరికం తగ్గనట్లే అన్న సోయి కూడా లేకుండా మాట్లాడడం మోడీకే చెల్లింది. ఇక బిజేపి నేతలు ప్రధాని మోడీ సభకు ముఖ్యమంత్రి రాలేదని చెప్పడమంత పచ్చి అవకాశవాద రాజకీయాలు మరెక్కడా వుండవేమో! ప్రధాన మంత్రి మోడీ రాష్ట్ర పర్యటనలో అధికారిక సభ ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా బిజేపి నాయకులు వివిఐపి పాసులు జారీ చేస్తారా? ఇంత దుర్మార్గమైన వ్యవస్ధ ఎక్కడైనా వుంటుందా? ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. తరలించినా పార్టీ పరమైన అంశాలు అక్కడ కనిపించొద్దు. పైగా అధికారిక కార్యక్రమంలో మోడీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఎవరిని మోసం చేయానులనుకుంటున్నారు. బిజేపి నేతలు ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణ ప్రజలు వారిని నమ్మరు. ఆ పార్టీకి తెలంగాణలో స్ధానమే లేదు.

వస్తారు సరే..ఏమిస్తారు!?

ప్రధాని మోడీ తెలంగాణను కనికరిస్తారా?

`తెలంగాణ మీద వరాలు కురిపిస్తారా?

`మాటలే మూటలనుకొమ్మంటారా?

`విభజన హామీలేమైనా ప్రకటిస్తారా?

`జాతీయ ప్రాజెక్టులు మంజూరు చేస్తారా?

`నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతారా?

`పార్టీ శ్రేణులకు బాగా కష్టపడండి మాత్రమే చెప్పి ఊరడిస్తారా?

`సభ సూపర్‌ అని భుజం తట్టి పండగ చేసుకోమంటారా?

`బిజేపి నాయకులు చెప్పుకోవడానికేమైనా మాటిస్తారా?

`బయ్యారం ముచ్చట చెబుతారా?

` గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడతారా?

` రైల్వే కోచ్‌ తూచ్‌ అనలేదనేమైనా అంటారా?

`పాలమూరు-రంగారెడ్డి ముచ్చటెత్తుతారా?

`ఈసారైనా దయచూపుతారా?

 హైదరాబాద్‌,నేటిధాద్రి: 

దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికైనా పర్యటనకు వెళ్తున్నాడంటే ఆ రాష్ట్ర ప్రజలు సహజంగా ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడైనా ఏ ప్రధాన మంత్రి వచ్చినా అనేక నిధులు, ప్రత్యేక పధకాలు ప్రకటనలు, అమలు మొదలైనవి చేసేవారు. దేశంలో ప్రతష్టాత్మకంగా అమలౌతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం యూపిఏ 1లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2005 సెప్టెంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్‌నుంచి పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా సార్లు వచ్చారు. కాని ఏనాడు తెలంగాణకు ఎలాంటి ప్రకటనలు పెద్దగా చేయలేదు. అందుకే ఆసారైనా తెలంగాణకు ఏవైనా వరాలు కరిపిస్తారా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజేపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకుంటే ప్రధాని వచ్చాడు. వెళ్లాడు అంటే రేపటి రోజు బిజేపి నేతలు చెప్పుకోవడానికి కూడా ఏమైనా వుండాలంటే కూడా ఈసారి తప్పనిసరిగా ప్రధాని హమీలు ఇస్తారన్న నమ్మకంతో వున్నారు. గతంలో కూడా ఎన్ని సార్లు వచ్చినా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఎన్నికల సమయంలో వచ్చినా ఎలాంటి హమీలు లేకుండానే వెనుదిరిగారు. కాని ఈసారి ప్రధాని మోడీ పర్యటన మీద బిజేపి శ్రేణులు బోలెడు ఆశలుపెట్టుకున్నారు. వారిని నెరవేర్చుతాడా? లేక ఎప్పటిలాగా నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతాడా? అన్న సందేహం కూడా వ్యక్తమౌతోంది. 

సహజంగా ప్రధాన మంత్రి మోడీ పర్యటన చాలా విభిన్నంగా సాగుతుంది. 

ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ వరాలు కురిపించడం అలవాటు. కాని గత ఎన్నికల సమయంలో బిజేపి ప్రచారానికి ఒకటి రెండుసార్లు వచ్చిన ఆయన ప్రచారం చేశాడే గాని వరాలు ప్రకటించలేదు. నిజానికి ఈసారి పర్యటన ఎన్నికల మూడ్‌లోనే వుంటుందన్న వాదనలు వినిస్తున్నాయి. పొరుగున కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. మరో ఏడెనమిది నెలల్లో తెలంగాణలోనూ ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో కూడా ప్రధాని మోడీ ఎప్పటిలాగే వచ్చి వెళ్లిపోతే మాత్రం అది బిజేపి నష్టమే అంటున్నారు. ప్రధాన మంత్రి మోడీ ఇలాంటి సమయంలో వచ్చినా తెలంగాణకు కొన్ని పనులైనా ప్రకటించకపోతే ప్రజలుకు బిజేపి శ్రేణులు సమాధానం చెప్పుకోలేరు.

ఎందుకంటే ఉత్తరాధి రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే అక్కడ వరాలు కురిపించిన అనుభవం మోడీకి వుంది. బీహార్‌ లాంటి రాష్ట్రానికి సుమారు 80వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రకటించిన అనుభవం మోడీకి వుంది. అలా ఉత్తరాధిలోని అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. పొరుగన వున్న మహారాష్ట్రకు అనేక నిధులు మంజూరుచేశారు. గుజరాత్‌ విషయంలో ఇక చెప్పనవసరం లేదు. అన్నీ అక్కడికే అన్న అపవాదలు వుండనే వున్నాయి. దక్షిణాదిపై బిజేపి చిన్న చూపు చూస్తుందన్న అపవాదు ఎలాగు వుంది. దాన్ని తుడిచేసేందుకైనా ఈసారి ప్రధాని తెలంగాణకు ఏవైనా ప్రకటిస్తారన్న నమ్మకం బిజేపి శ్రేణుల్లో వుంది. నిజానికి తెలంగాణపై బిజేపి పెద్దలకు ఎలాంటి ప్రేమ లేదన్న ప్రచారం కూడా వుండనే వుంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో సాక్ష్యాత్తు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, బిఆర్‌ఎస్‌ నాయకులు గుర్తు చేస్తూనే వుంటారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు ఇప్పటికే అనేక సార్లు ప్రధాని మోడీ మాట్లాడడం తెలిసిందే. అంతే కాకుండా ఎలాంటి సమయం సందర్భం లేకుండానే కూడా తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటు తలుపులు మూసి, ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని అన్నారు. ఇది కూడా తెలంగాణ ప్రజలు మనస్సు చివుక్కుమన్నదే. మరి అలాంటి వ్యాఖ్యలు ప్రజలు గుర్తు చేసుకోకుండా వుండాలంటే తెలంగాణ మీద బిజేపికి కూడా ప్రేమ వుందని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రధాని తెలంగాణకు వరాలు కురిపిస్తే గాని లాభం వుండదు. 

 ఆర్థికంగా దేశానికి ఆదాయాన్ని సమకూర్చుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అన్నది రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్‌ఎస్‌ ఫార్టీ లెక్కలతో సహా అనేకసార్లు ప్రజల ముందు వుంచిన సంగతి తెలిసిందే.

 తెలంగాణను నుంచి వెళ్తున్న నిధులకు, కేంద్రం వాటా అందుతున్న నిధులకు పొంతన లేదన్నది కూడా అనేక సార్లు చర్చకు వచ్చింది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు ఈ విషయంపై అటు బిఆర్‌ఎస్‌కు, ఇటు బిజేపికి పెద్ద మాటల యుద్దమే జరిగింది. తెలంగాణకు ఇప్పటికే రెండులక్షల కోట్లరూపాయలు అందించినట్లు బిజేపి నేతలు చెప్పుకునేవారు. కాని ఆ లెక్కలు తప్పని బిఆర్‌ఎస్‌ వాదించినట్లే అధికారిక లెక్కలు కేంద్ర బిజేపి పెద్దలు బైట పెట్టడంతో రాష్ట్ర బిజేపి నేతల నోటికి తాళంవేసినట్లైంది. ఇక తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా, ఉత్తరాలు రాసినా స్పందన లేదు. విభజన హామీలే కాకుండా గతంలో యూపిఏ 2 ఇచ్చిన హహాలు కూడా కొన్ని అమలు జరగలేదు. తెలంగాణకు ఐటిఐఆర్‌ అనే ప్రతిష్టాత్మక సంస్ధను యూపిఏ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనుల కూడా సిద్దం చేసింది. ఆ ప్రాజెక్టు మూలంగా తెలంగాణకు ఐటి రంగంలో పెద్దఎత్తున్న పెట్టుబడులు, కంపనీలు వచ్చేవి. లక్షలాది ఉద్యోగాలు యువతకు కల్పించబడేవి. కాని ఆ అవకాశం బిజేపి ప్రభుత్వం చేజార్చింది. ఆ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించింది. యూపిఏ హయాంలో ఇచ్చిన మరి కొన్ని హామీలలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి. కాని దాని ఊసే లేదు. కేంద్రం ఏనాడు స్పందించింది లేదు. ఇక కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అన్నది తెలంగాణ కల. ఆ కలను అలాగే పదిలంగా కూడా వుంచలేదు. దానిని కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఇక నల్లబంగారమైన సింగరేణి బ్లాక్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా, కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి బిజేపి చెప్పే సమాధానం, బిఆర్‌ఎస్‌ చెప్పే విషయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. కాని ప్రజల్లో గందరగోళం మాత్రం వుంది. అలాంటి సమస్యను నివృత్తిచేయాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపైనే వుంది. మరి ప్రధాని మోడీ దీనిపై ఏమైనా మాట్లాడతారా? లేదా? అన్నది తేలాల్సివుంది.. ఇక తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అన్నదానిపై ఎన్నో ఆశలున్నాయి. కాని ఇప్పటికీ నెరవేరలేదు. నిజామాబాద్‌లో గెలిచిన వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తామన్నారు. కాని దాని బదులు అంతకన్నా గొప్పదే ఇచ్చారని బిజేపి నేతల వాదన. పసుపు బోర్డు మాత్రం రాలేదన్నది బిఆర్‌ఎస్‌ వాదన. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే మెడికల్‌ కాలేజీలలో తెలంగాణకు చోట దక్కకపోవడం విచారకరం. అంతే కాదు వాటికి అనుబంధంగా వుండే నర్సింగ్‌ కాలేజీలు కూడ ఇవ్వకపోవడం శోచనీయం. మరి ఆ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారా చూడాలి. ఇక సాగునీటిప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకోసం పలుమార్లు అడిగింది. కాని కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడేళ్లలోనిర్మాణం చేసి, తెలంగాణకు నీళ్లు అందిస్తున్నారు. మరో పెద్ద ప్రాజెక్టు పాలమూరు` రంగారెడ్డి కూడా మొదలుపెట్టనుంది. కనీసం దాని కోసమైనా కేంద్రం ఏమైనా ప్రకటన చేస్తుందా? చూడాలి. ఎందుకంటే పొరుగున వున్న కర్ణాకటలోని అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇచ్చింది. కాని తెలంగాణకు ఒక్కటి కూడ ఇవ్వలేదు. ఇలాంటి కోరికల నడుమ ప్రధాన మంత్రి తెలంగాణ పర్యటన సాగుతున్న వేళ ప్రజలు ఎదురుచూడడం సహజం. మరి తన సహజమైన శైలితో ప్రధాని వరాలు ప్రకటిస్తారా? లేక ఎప్పటిలాగా నేతలను భుజం తట్టి, బాగా కష్టపడండి? అధికారంలోకి తేండి! సూచిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే…నేడు ప్రధాని నోటి వెంట మాటలా? తెలంగాణకు మూటలా? అన్నది మాత్రం అందరూ ఎదురుచూస్తున్నదే? తెలంగాణకు ఆల్‌ద బెస్ట్‌ అనుకోకతప్పదు.

బిజేపిది దివాళాకోరు రాజకీయం.

అడ్డగోలు రాజకీయాలతో, తెలంగాణ పరువు తీస్తూ, అభివృద్ధిని అడ్డుకుంటూ, నీతిమాలిన పనులు చేసుకుంటూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, కుట్రలు పన్నుతున్న బిజేపి వ్యవహారశైలిని తూర్పార పడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ‘‘మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌’’ పంచుకున్నా ఆసక్తికర విషయాలు పాఠకుల కోసం…

`బిజేపి వ్యవహారంపై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

`అభివృద్ధి చేసే దమ్ము లేదు.

`ప్రజల మెప్పు పొందలేరు.

`బిజేపి అంటేనే అవద్దాలు..అన్యాయాలు.

`జనం ఉసురుపోసుకుంటున్నరు.

`బిజేపి కుట్రలు సాగనియ్యం

`ప్రగతి నిరోధకులకు తెలంగాణలో స్థానం లేదు.

`ప్రజా వ్యతిరేక బిజేపికి రాజకీయాలు చేసే అర్హత లేదు.

` కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఇచ్చిందేదో చెప్పున్రి

`బిజేపి ఎంపిలు తెచ్చిన ప్రాజెక్టులేమిటో సూపెట్టున్రి

`విభజన చట్టంలో ఒక్క హామీ గూడ నెరవేర్చలేదు.

`యూపిఏ ఇచ్చిన వాటిని గూడా గుంజపోయిన్రు.

`ఏ మొఖం పెట్టుకొని రాజకీయాలు చేస్తరు.

`పిల్లల జీవితాలతో ఆడుకుంటరా?

`అధికారం కోసం అడ్డదారులు తొక్కుతరా?

`విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేస్తరా?

`బిజేపి చెప్పే ధర్మం..ఇదేనా?

`బిజేపి నాయకులకు సిగ్గు, ఎగ్గు లేదు.

`తెలంగాణ అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.

`బిజేపిని విద్యార్థుల తల్లిదండ్రులు ఛీ కొడుతున్నరు. 

`ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలే.

`తప్పయిందని ప్రజలకు క్షమాపణ చెప్పాలే!                               

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

బిజేపి పార్టీకి, నాయకలకు అభివృద్ది అంటే ఏమిటో తెలియదు. అభివృద్ధి ఎలా చేయాలో తెలియదు. అభివృద్ధికి సహకరించాలన్న సోయి లేదు. కేంద్రంలో అధికారంలో వున్నపార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాపటం తెలియదు. ఎంత సేపు రాజకీయం చేయాలి. ప్రజలను రెచ్చగొట్టాలి. యువతలో లేనిపోని అనుమానాలు సృష్టించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి. గందరగోళం సృష్టించాలి. యువతను పెడదోరణలు పట్టించాలి. ఇదా రాజకీయం. బిజేపి నేర్చుకున్న దేశంకోసం, ధర్మ కోసమంటే ఇదేనా..ఇంతేనా…చదువుకునే విద్యార్ధులు జీవితాలను ఆగం చేయాలనుకోవడం రాజకీయమా? దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కోవడం రాజకీయమా? మత రాజకీయాలు, మతాల మధ్య వున్న స్నేహబావాలలో చిచ్చురేపి చలికాచుకోవడమా? రాజకీయం. ఇక సాగదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రాజకీయం ముసుగులో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే దుర్మార్గపు పనులు చేస్తూపోతామంటూ ఇక ఉపేక్షించే పరిస్థితే లేదు. అడ్డగోలు రాజకీయాలతో దేశంలోనే తెలంగాణ పరువు తీస్తున్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే కళ్లు ముండుతున్న బిజేపి నేతలు తెలంగాణను ఆగం చేయాలన్న పన్నాగం పన్నుతున్నారు. తెలంగాణ పచ్చగా వుంటే చూడలేని బిజేపి గుజరాతీ నాయకుల పెత్తనానికి ఊడిగం చేస్తున్న రాష్ట్ర బిజేపి నేతలకు తెలంగాణ మీద కనీసం ఒక్క శాతం కూడా ప్రేమలేదు. గౌరవం లేదు. ప్రజలంటే అసలే లెక్కే లేదు. అడ్డగోలు రాజకీయాలతో తెలంగాణలో రాజకీయ అస్దిరతను సృష్టించాలని చూస్తున్నారు. అభివృద్దిని అడ్డుకుంటూ, అడుగుడునా అబద్దాల ప్రచారాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. కాని ప్రజలు బిజేపి నేతల మాటలు నమ్మడానికి సిద్దంగా లేరు. వారిని పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులుపెట్టాలని చూస్తున్నా వారి పప్పులు ఉడకడవు. ఎన్ని రకాల రాజకీయ విన్యాసాలుచేయాలో అన్ని బిజేపి నేతలు చేస్తున్నారు. అయినా వారి ఆటలు సాగడంలేదు. దాంతో కుట్రలకు తెరతీశారు. ఆఖరుకు విద్యార్ధుల జీవితాలతో కూడా ఆడుకోవడానికి వెనుకాడడం లేదు. ఎంతటి నీతి బాహ్యమైన పనులైనా చేస్తామని, అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతామని నిరూపించేందుకే పరీక్ష పత్రాల లీకులకు కూడా తెబడుతున్నారు. ఇంకా వారి చర్యలను ఉపేక్షిస్తూపోతే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రమాదం. అలాంటి నేతలు సమాజానికే చిన్నతనం. అంటూ బిజేపి నేతలను తూర్పాపడుతూ, బిజేపి తెలంగాణకు చేసిన అన్యాయాలను పూసగుచ్చినట్లు వివరిస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నా ఆసక్తికరమైన విషయాలు పాఠకుల కోసం ఆయన మాటల్లోనే…

తెలంగాణలో బిజేపి అనుసరిస్తున్న దుర్మార్గపు వేశాలు నిజంగానే దివాళాకోరు తనం రాజకీయాలే.

 అసలు ఇంతగా దిగజారి రాజకీయాలు చేసిన పార్టీలు ఎక్కడా వుండవు. దేశంలో ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరించే అనేక రాష్ట్రాలలో దొడ్డిదారిన అధికారం చెలాయిస్తున్నారు. తెలంగానలో కూడా అదే చేద్దామని చూశారు. కాని వారి వల్ల కాలేదు. దాంతో విద్యార్ధుల జీవితాలతో కూడా ఆడుకోవడానికి సిద్ధపడ్డారు. అసలు కేంద్రంలో అధికారంలో వుంది. ప్రజలు కూడా ఓ నలుగురు ఎంపిలను ఆ పార్టీకి అందించారు. అంతగా ఆదరించినప్పుడు ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలన్నది ఆలోచించాలి. ప్రజలకు ఎలా మేలు జరగాలన్నదానిపై దృష్టిపెట్టాలి. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై ధ్యాస వుండాలి. కాని అభివృద్ధి చేసే గుణం లేదు. సోయి లేదు. ఆ ఆలోచనే లేదు. కాని రాజకీయాలు చేయాలి. అబద్దాలు చెప్పి, చెప్పి, నిజాలు కనపడకుండా చేయాలి. ఇవా చేయాల్సిన రాజకీయాలు. ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు అభివృద్దిని చూపించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలు వేరు. మన తెలంగాణ వేరు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం సాగించి, పద్నాలుగేళ్లపాటు ఎన్నో ఆటుపోట్లు, వ్యయప్రయాసలకోర్చి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, ప్రజలను మెప్పించి, ఉద్యమంలోకి తీసుకొచ్చి, కోట్ల గొంతుకలు ఒక్కటి చేసి తెలంగాణ సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నాయకుడి పాలనలో అలజడి సృష్టించాలిన చూస్తే, ప్రజలు క్షమించరన్న సోయి బిజేపి నేతలకు వుండొద్దా? నాలుగు సీట్లకే ఎగిరెగిరి పడుతున్నారు. కేంద్రలో అధికారంలో వున్నామని మిడిసిపడుతున్నారు. తెలంగాణలో ఈ బిజేపికి దిక్కులేదు,సక్కిలేదు. కార్యకర్తలు లేరు. నాయకులు లేరు. ఉనికి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాల్సిందిపోయి,కేంద్రం నుంచి నిధులు తెచ్చి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిపోయి, తెలంగాణ ప్రగితికి మోకాలడ్డుతామంటే చూస్తూ ఊరుకుంటామా? 

  ఓ పక్క దేశంలో ధరలో ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.

 తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ మీద అడుగడుగునా విషం చిమ్ముతున్నారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటల గురించి ఇక్కడి బిజేపి నేతలు మాట్లాడరు. కేంద్ర పెద్దలతో సంప్రదించరు. తెలంగాణలో కేంద్ర జాతీయ ప్రాజెక్టు ఒక్కటీ ఇవ్వరు. పొరుగున వున్న కర్ణాకటలో అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. ఇప్పటికే కృష్ణానది మీద ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నరు. పైనున్న కర్నాటక ఆల్‌మట్టి పూర్తిగా నిండితే తప్ప మనకు నీళ్లొచ్చే పరిస్దితి లేదు. తెలంగాణ రాక ముందు తెలంగాణ పరిస్దితి ఏమిటి? ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి? ఇవన్నీ చూస్తూ కూడా తెలంగాణకు అన్యాయం చేయాలని చూడడం బిజేపి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కాదా? పచ్చగున్న తెలంగణను మళ్లీ ఎండబెట్టాలని చూస్తున్నారా? తెలంగాణ రైతులు బాగుపడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారా? బిజేపి పాలిత రాష్ట్రాలలో తెలంగాణలో అమలౌతున్న ఒక్క పథకమైనా అమలౌతుందా? రైతాంగానికి మేలు చేసే పని ఒక్కటైనా బిజేపి చేస్తుందా? ఇలాంటివి బిజేపికి అక్కర్లేదు. మతరాజకీయాలు అడ్డంపెట్టుకొవాలి పొద్దు బుచ్చుకోవాలి. అబద్దాలు చెప్పి పూటగడుపుకోవాలి. ఇప్పటికైనా బిజేపి నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎటుపోతున్నామన్నది సోయి తెచ్చుకొని నడుచుకోవాలి. తెలంగాణ ప్రజల మనసు చూరగొనే రాజకీయాలు చేస్తే ఎవరూ వద్దనరు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంతో నిత్యం కయ్యాలు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఎంతటి అన్యాయాలకైనా దిగుతామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పుడు విధానాలు మానుకోండి. మీకు చిత్తశుద్ది వుంటే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. అంతే కాని తెల్లారిలేస్తే దిక్కుమాలని రాజకీయాలే చేస్తాం…అంటూ అప్రజాస్యామిక రాజకీయాలే చేస్తామంటే ప్రజలు ఎక్కడ వుంచాలో వారికి తెలుసు. బిజేపి నేతలకు ప్రజల్లో ఇప్పటికే చోటు లేదు. సమాజంలోస్ధానం లేదు. పైన పటారం ,లోన లొటారమని అందరికీ తెలుసు. లేని గొప్పలకుపోయి తప్పులు చేసి ఇంకా చులకన కాకండి. రాజకీయాల మీద ప్రజలకు నమ్మకంలేకుండా చేసుకోకండి. ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయమని వేడుకోండి.

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన

జాతీయ జెండాలు చేబూని పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ చేసిన ప్రతిపక్ష ఎంపీలు

ఎంపీ రవిచంద్ర త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి మల్లికార్జున ఖర్గే, కేశవరావు,నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి,సురేష్ రెడ్డి,రాములు, లింగయ్య యాదవ్ తదితరులతో కలిసి మార్చ్

కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ఖర్గే, కేశవరావు,బాలు,సంజయ్ సింగ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, ఎస్పీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎంలు ఆందోళనకు దిగాయి.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాల ఎంపీలు నినాదాలివ్వడంతో ఉభయ సభలు స్తంభించిపోయాయి.అధికారపక్షం సభలను మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో ప్రతిపక్షాల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలిస్తూ బయటకు వచ్చి జాతీయ జెండాలు చేతబట్టి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,ఎంపీలు పార్థసారథి రెడ్డి, కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్,పీ.రాములు,బాలు (డీఎంకే),సంజయ్ సింగ్ (ఆప్) తదితర ప్రముఖులతో కలిసి ఈ మార్చ్ లో అగ్రభాగాన ఉన్నారు. “ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ”, “రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెనక్కి తీసుకోవాలని”,”ప్రతిపక్షాలపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించడాన్ని ఆపేయాలని”,”మోడీ దాదాగిరి చెల్లదు కాక చెల్లదు”,”మోడీ నిరంకుశ విధానాలను ఎండగట్టండి”, “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి”అంటూ ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.అనంతరం ప్రతిపక్ష నాయకులు కానిస్టిట్యూషనల్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ విధానాలను ఎండగట్టారు.

ఈటల కు నోటీసులు

“నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్

ఈటల కు నోటీసులు

పదవతరగతి హిందీ పేపర్ లికేజ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది….నిన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైల్ కు పంపిన పోలీసులు తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేశారు ..ఈటల తో పాటు ఆయన పీఏ కు సైతం నోటీసులు అందజేశారు…మరోవైపు లికేజ్ వ్యవహారంలో కమలపూర్ పోలీసులు విచారణను స్పీడ్ అప్ చేశారు …కమలపూర్ కేంద్రంగానే పేపర్ లికేజ్ ఎందుకు జరుగుతుందనే కోణంలో పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు*

బండితో బిజేపి ఢమాల్‌!?

`పిల్లల జీవితాలతో రాజకీయాలా?

` నీచం…నికృష్టం!

`ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా?

`రాజకీయ అలజడి కోసం ఇంత పన్నాగమా?

` విద్యార్థుల జీవితాలతో ఆటలా?

` వారి భవిష్యత్తు అంధకారం చేస్తారా?

` రాజకీయ పార్టీగా బిజేపికి బాధ్యత లేదా?

`పార్టీ అధ్యక్షుడే ఇంతలా దిగజారొచ్చా?

` అడ్డదారిలో అధికారం కోసమే రాజకీయమా?

` ఇంత దుర్మార్గం ఎక్కడైనా వుంటుందా?

`దీనిని ప్రభుత్వంపై పోరామంటారా?

`రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి తప్పులు దేనికి సంకేతం?

` కుట్రలు, కుతంత్రాలు, అబద్దాలు, కట్టు కథలతో అధికారం వస్తుందా?

` రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం కాదా?

` ప్రజా ప్రభుత్వాలను కూల్చడం అనైతిక కాదా?

`దేశం కోసం, ధర్మం కోసమంటే అడ్డదారిలో అధికారమా?

`అధికారంలోకి వస్తే చేసే మేలేమిటో చెప్పాలి.

`అది మర్చిపోయి అయితే మతం లేకపోతే, అణచివేస్తాం…ఇదేనా బిజేపి సిద్దాంతం?

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

అనుమానాలతో కాపురాలు, అబద్దాలతో రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలంటేనే అబద్దాలైపోతున్నాయి. మోసాల మాటున స్నేహలు, ప్రజాసేవ ముసుగులో నాయకత్వాలు వుండొద్దు. కాని అలాంటి నాయకత్వాలే ఎక్కువౌతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రలో వున్న పార్టీలు, నేతలు సాగిస్తున్న రాజకీయాలు ఇలాగే వున్నాయనేది ఒక వాదన. అసలు భారతీయ జనతా పార్టీ లక్ష్యమేమిటో ఇప్పటికీ ఆ పార్టీ నేతలకుగాని, కార్యకర్తలకు , ప్రజలకు అర్ధం కావడంలేదనే అంటున్నారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎంత ముఖ్యమో? నైతికత కూడా అంతే ముఖ్యంగా వుండాలి. బిజేపి చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేదని తేలిపోయిందని విశ్లేషకులు అంటున్న మాట. అసలు రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే బిజేపి చేయాల్సిన పనులేమిటి? అన్నదానిపై ఆ పార్టీలో ఎక్కడా చర్చ జరిగినట్లుగాని, ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై తీర్మాణాలుచేసినట్లు గాని ఎక్కడా లేదు. కేవలం ఒకటే ఎజెండా? రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా రావాలి. ప్రభుత్వాన్ని పడగొట్టైనా రావాలి? ఏక్‌నాధ్‌ షిండేలను తయారు చేసైనా రావాలి? అది ఎలా వచ్చినా ఫరావాలేదా? అన్నదానిపై ఇంతకు మంచి స్పష్టత లేదు? రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన బిజేపిలో ఎవరికీ లేదు. తెలంగాణకు నిధులు తేవాలన్న సోయి లేదు. కనీసం ఇచ్చిన హాహీలన్నా అమలు చేయాలన్నది అసలే లేదు. కాని తెలంగాణలో అధికారం మదే కావాలి? ఇది మాత్రమే వారికి తెలుసు. ఇది అనైతిం కాదా? అని అడిగితే నైతిక, అనైతిక అన్న పదాలకు చోటు లేదన్న రాజకీయాలే బిజేపి చేస్తుందని చెప్పడంలో సందేహం లేదని బిజేపి పెద్దలే ఆఫ్‌ద రికార్డు చెబుతున్నారు. సరే ఇవన్నీ ఒకెతైతే రేపటి తరం ఎలా వుండాలన్నదానిపై కూడా బిజేపికి సరైన అవగాహన, చిత్త శుద్ది లేదనేది ఇటీవల కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు విద్యార్దులు జీవితాలను బిజేపి తీర్చిదిద్దాలనుకుంటుందా? లేక వారి జీవితాలతో ఆటలాడుకొని రాజకీయాలు ఏలాలనుకుంటుందా? అన్నదానిపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం సాగుతోంది. 

   బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్‌ నియామకం తర్వాత బిజేపి పెరుగుతోందని అందరూ అనుకున్నారు.

 పాల పొంగులాంటి వాపును చూసి సంబరపడ్డారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కొన్ని సీట్లురావడంతో బిజేపికి తిరుగులేదన్నంత అహం తలకెక్కించుకున్నారు. అనుకోకుండా కలిసొచ్చిన రెండు ఉప ఎన్నికల్లో గెలవడంతో మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారు. మనం ఇకపై ఏది చెబితే అదే నమ్ముతారన్న భ్రమల్లో బిజేపి నేతలు తేలియాడుతున్నారు. వారు వేసే అడుగులు, చెప్పే మాటలు నిజాలని నమ్మించాలని ఒకటికి రెండుసార్లు అబద్దాలు వల్లిస్తూ, నిజాలు చేస్తున్నామనుకుంటున్నారు. కాని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 

అసలు తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే దానికి ఎంతో కొంత ఉద్యమ నేపధ్యం వుండాలి. 

కనీసం ఆ పార్టీ నాయకుల్లో కొందరైనా చెప్పుకోవడానికి ఉద్యమం సాగించిన నేతలైవుండాలి. కాని బండిసంజయ్‌కు ఆ పేరు లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది లేదు. కాని దూకుడు స్వభావం బాగా వుంది. అదే తన రాజకీయ ప్రస్తానానికి తోడ్పాటౌతుందనుకున్నాడు. ఇతర నేతలను దూరం పెడుతూ వస్తున్నాడు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంతోనూ కోరికోరి సమస్యలు తెచ్చుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విషయంలో చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అబద్దాల పర్వం తెలంగాణ వడ్లు కొనుగోలుతో మొదలైంది. కేంద్రం ఎన్ని కొర్రీలు పెడుతుందో తెలిసి కూడా, తెలంగాణ ప్రజలను బండి సంజయ్‌ మాయ చేయాలని ప్రతీసారి చూశాడు. కాని ప్రజలు నమ్మలేదు. బిజేపి నేతలే విశ్వసించలేదు. కేంద్రం ప్రతిపాదించిన గోదుమల లెక్కలు, తెలంగాణ లో బియ్యం లెక్కలుగా చూపించి అబాసు పాలయ్యారు. కాళేశ్వరం విషయంలో అనేక సార్లు తెలిసీ, తెలియిని తనమో, లేక ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారనున్నాడో గాని అబద్దాలు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అభాసుపాలయ్యాడు. ఇక ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అంటూ రకరకాలు కామెంట్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తర కుమారుడైపోయాడు. 

 ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌ను ట్రాక్టర్‌ తో దున్నేస్తా! అంటూ వ్యాఖ్యానించాడు. 

దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందనతో ఇక మళ్లీ ఆ విషయాలు మాట్లాడలేదు. ఇక మత రాజకీయాలు చేయడంలో సంజయ్‌ దిట్ట? అవకాశం చిక్కినప్పుడల్లా పాత బస్తీ గురించి ప్రాస్తావించడం, భాగ్యనగర్‌ అమ్మవారి మీద ఒట్లు వేయడం, ఆఖరకు ఓసారి యాదాద్రిలో తడి బట్టలతో కూడా ప్రమాణాలు చేసేంత స్ధితికి దిగజారిన రాజకీయం చేశాడు. ఇక తెలంగాణలోని మసీదులు తవ్వుతామంటూ విపరీత వ్యాఖ్యలు చేసి వివాదాలు కొని తెచ్చుకున్నారు. శివం ఎల్తే మాకు, సమాధి వుంటే మీకూ అని ముస్లింకు పార్టీని దూరం చేసుకున్నారు. ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని నిరుద్యోగుల మీద లేని ప్రేమ కురిపించడం మొదలుపెట్టాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజేపి ఉద్యోగ కల్పన గాలికి వదిలేసింది. కాని తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్నా రాజకీయం చేయాలని చూశాడు. 

 తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఒక్కొక్కటీ నెరవేరుస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ప్రకటిస్తూ వస్తోంది.

 దాంతో ఇక యువత తమ వైపు వచ్చే అవకాశం లేదని అర్ధమైపోయిన బండి సంజయ్‌ యువతను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు వేస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయదనుకొని బండి సంజయ్‌ ఉద్యోగాల భర్తీపై నోరు పారేసుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో మహిళా కమీషన్‌ చీవాట్లు కూడా తిన్నాడు. చేయకూడని వ్యాఖ్యలు చేసి నాలుక కర్చుకున్నాడు. ఏకంగా బిజేపి నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కవిత కోసం తీహార్‌ జైలులో రూం తయారు చేస్తున్నారన్నంత అహంకారపూరితమైన మాటలు మాట్లాడాడు. ఇది ఎవరికీ నచ్చలేదు. మెచ్చలేదు. అందుకే మరో ఎంపి అరవంద్‌ స్పందిస్తూ బండి వ్యాఖ్యలను భహిరంగంగానే వ్యతిరేకించడాడు. ఇక ఇంతలో జరిగిన గ్రూప్‌ వన్‌ పరీక్ష విషయంలో లీకు వీరుడు? ఎవరు? అన్నదానిపై జరిగిన చర్చలో అందరి వేళ్లూ బిజేపి వైపు, బండి సంజయ్‌ వైపే చూపాయి. దాని దర్యాప్తు సాగుతూనే వుంది. ఎన్ని రకాల ఆరోపణలైనా, విమర్శలైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేద్దామనుకున్నా సక్సెస్‌ కాలేకపోతున్నాడు. పిదప అభాసుపాలౌతున్నాడు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయొచ్చని తలనచినట్లున్నాడు. పదోతరగతి పరీక్షల వైఫల్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకున్నట్టున్నాడు. కాని మొదటి రోజు కుదరలేదు. అన్ని వేళ్లూ బిజేపి వైపే చూపించాయి. దాంతో పార్టీ మొత్తం ఇబ్బందిపడే పరిస్ధితి వచ్చింది. అయినా బండి సంజయ్‌ తన పంతం వదిలేయద్దొనుకున్నాడో ఏమో? కాని రెండో రోజూ హిందీపేపర్‌ విషయంలో ఇరుక్కుపోయాడు. పోలీసులు అరెస్టు చేశారు.

కేసిఆర్‌ నాయకత్వమే శరణ్యం.

`ప్రతిపక్షాల ఏకం కేసిఆర్‌ తోనే సాధ్యం.

`రాజకీయ పునరేకీకరణ విజయం కేసిఆర్‌ సొంతం.

`తెలంగాణ సాధనలో విజయమే ఆ బలం.

`కేసిఆర్‌ ఒక్క గొంతు కోట్లాది గొంతులతో సమానం.

`కేసిఆర్‌ ఒక్క మాటతో ఉలిక్కిపడిన బిజేపి నాయకత్వం.

`అణచివేతపై ఎక్కుపెట్టిన బాణం కేసిఆర్‌.

`తిరుగుబాటుకు అసలైన నిర్వచనం కేసిఆర్‌.

`కేసిఆర్‌ ప్రశ్నకు ఎదురు నిలబడడం ఎవరి తరం?

` కేసిఆర్‌ అంటేనే తిరుగుబాటుకు అర్థం. 

`కేసిఆర్‌ నరనరాల్లో వుండేదే చైతన్యం.

` తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం.

`కేసిఆర్‌ మాట ఉప్పెనతో సమానం.

`ఆ సునామికి బిజేపి మునక ఖాయం

`బిజేపి అడ్రసు గల్లంతు తధ్యం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ రోజుల్లో నీ గురించి ఆలోచించేవారు ఎవరు? నీకు మేలు జరగాలని కోరుకునేది ఎవరు? మనం అన్న భావన వున్నది ఎంత మందికి? మన ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు, ఆశయాలు, కోరికలు, వారి అవసరాలు తీరేలా వారి జీవితాల్లో వెలుగులు నిండేలా బతుకులు మారాలని కోరుకునేవారు ఎవరు? ఎంత సేపు రాజకీయాలు, పదవులు, ప్రభుత్వాలు ఇవేనా రాజకీయమంటే! అన్నం పెట్టే రైతన్న ఎందుకు దుఖిస్తున్నాడు? ఎందుకు వేధన చెందుతున్నాడు. తాను కూడా నాలుగు వేళ్లు నోట్లోకి పోకుండా ఎందుకు రోధిస్తున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ఏది? చేతికందిన పంటకు రాబడి ఏది? ఆరు గాలం శ్రమించిన దానికి కూలీ ఏది? సాగుకు నీళ్లేవి? ప్రాజెక్టులేవి? రైతుకు నిరంతర విద్యుత్‌ ఏదీ? దోపిడీ సమాజంలో రైతును కాపాడాల్సిన వాళ్లు ఎందుకు కళ్లు మూసుకుంటున్నారు. కుళ్లును ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. దేశ సంపదన మీద పడి దోచుకుంటున్నవారు ఎవరు? ప్రజల సొమ్మును ఎవరికి దారాధత్తం చేస్తున్నారు. సొమ్మొకొరిది, సోకొకరిది ఎందుకౌతోంది? దేశ వ్యాప్తంగా బిజేపి మీద రాజకీయ వేత్తలు, నాయకులు, పార్టీల అభిప్రాయం. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రశ్న. ఎంత సేపు రాజకీయ అవసరాల కోసమే రాజకీయ పార్టీలు పబ్బం గుడపుకుంటూ పోతే దేశ ప్రగతికి దారేది? దేశ ప్రజలకు సుఖమేది? సంతోషమేది? ఆనందకరమైన వాతావరణం ఏది? 

అందుకే చీకటినీ చీల్చుకొని వచ్చే వేకుక కిరణసూర్యుడు కేసిఆర్‌ రూపంలో ప్రతిసారి ఉదయిస్తూనే వుంటాడు. సమాజానికి ఇబ్బందులు, తలవంపులు వచ్చిన ప్రతీసారి తానున్నానని ప్రజలకు భరోసా కల్పిస్తుంటారు. వారి ఆశలకు వారధిగా నిలుస్తుంటాడు. వారి కోసం పోరాటానికి మరో రూపమైన పోరు బాటను ఎంచుకుంటాడు. అలా తెలంగాణ సాధించాడు. ఇప్పుడు దేశ గతిని మార్చేందుకు మరోసారి తన ప్రయాణం మొదలుపెట్టారు. సమాజ చైతన్యం కోసం, సమాజ గతి మార్పు కోసం, ప్రజల కోసం, వారి జీవితాలలో వెలుగులు నిండడం కోసం, నింపడం కోసమే కేసిఆర్‌ రాజకీయం. కేసిఆర్‌ రాజకీయ ప్రయాణం. కేసిఆర్‌ లక్ష్యం. సమాజం బాగు కోసమే ఆయన ఎంచుకునే మార్గం. అంతిమ గమ్యం. ఒక్కడుగా మొదలై, ఒక్కొ అడుగువేస్తూ, సమాజాన్ని తనదారిలోకి, తన అడుగుల్లో అడుగులు వేసేలా చేసుకోవడం ఈ తరం నేతల్లో కేసిఆర్‌ అగ్రగణ్యుడు. 

దేశంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట. బిజేపిని ఎదుర్కొనే నేత లేరా? బిజేపిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదా?

దేశమంతా బిజేపి అంటే భయపడే నేతలేనా? అన్న ప్రశ్నలకు సమాధానంగా నేనున్నాను…నేను ఎదిరిస్తున్నాను. నేను అన్న ప్రశ్నలో నుంచి ఉద్భవించిన ఉద్యమ కణాన్ని, కంకణాన్ని..నిప్పుకణాన్ని, ఉద్యమ పధాన్ని, పోరాట నిర్మాణాన్ని, ప్రజాస్వామ్య ఫలాలు అందించే విజేతను అని ప్రజలందరకీ తెలిసే, నేతలందరూ గుర్తెరిగేలా మరోసారి పిడికిలి బిగించిన నేత కేసిఆర్‌. తెలంగాణ కోసం కొట్లాడి, సాధించి బంగారు తెలంగాణ ఆవిష్కరించి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన రైతు నేత కేసిఆర్‌. ఇప్పుడు దేశమంతా సస్యశ్యామలం చేసేందుకు రైతును సంఘటిత పర్చి, బిజేపిని ఎదుర్కొనేందుకు సిద్దమౌతున్నాడు. అందుకే దేశంలోని ప్రతిపక్షాలన్నింటీనీ ఏకం చేసే పని మొదలుపెట్టాడు. దేశంలో ఎప్పుడు రాజకీయ సంక్షోభం వచ్చినా తెలుగు నేతలు చాతుర్యం, చాణక్యం గతంలో చూపించారు. ఇప్పుడు కేసిఆర్‌ రూపంలో మరోసారి ప్రజాస్వామ్య పునరుద్దరణ మొదలౌతోంది. ఒకనాడు నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఎన్టీఆర్‌ దేశ రాజకీయాలను ఏకం చేశాడు. ఆ తర్వాత దేశాన్ని గాడిలో పెట్టే బాద్యత పివి. నర్సింహారావు తీసుకున్నాడు. దేశం పారిశ్రామికరంగంలో దూసుకుపోవడానికి కారణం పి.వి. అని తరతరాలు చెప్పుకునేలా చేశాడు. తన నాయకత్వ ప్రతిభను, పటిమను చూపించి, దేశానికి దారి చూపించాడు. అదే అవసరం మళ్లీ ఇప్పుడు కూడా వచ్చింది. దేశంలో బిజేపి పాలనలో ప్రజలు ఆక్రందనలు పెడుతున్నారు. ధరల మోతలను మోయలేకపోతున్నారు. పన్నుల వడ్డింపులను చెల్లించలేకపోతున్నారు. మోయలేని బారాలను మోపుతున్న బిజేపిని తగిన పాఠం చెప్పాలనుకుంటున్నా, అందుకు ముందుకు నడిచే నేత కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే కేసిఆర్‌ భయలుదేరాడు. దేశ గతిని మార్చే బాధ్యతలు తన భుజాల మీద వేసుకుంటున్నాడు. 

దేశ రాజకీయ పార్టీలనన్నింటినీ ఏకం చేయడం అంటే ప్రజల స్వేచ్ఛకోసం, సమానత్వం కోసం, సౌభ్రతృత్వంకోసం. 

అంతే గాని దిక్కుమాలిన విశ్లేషణలు చేస్తూ, రాజకీయాలను కలుషితం చేస్తోన్న సోకాల్డు మీడియా అర్ధం పర్ధం లేని రాతలు, వ్యాఖ్యలు కాదు. దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత కేసిఆర్‌ తీసుకుంటే తప్పేమిటి? చినుకు చినుకు కలిస్తేనే వర్షమౌతుంది. చెరువు నిండుతుంది. వాగులు, వంకలై, నదులై సముద్రం చేరుతుంది. అడుగు , అడుగు కలిస్తేనే ప్రయాణమౌతుంది. గమ్యం చేరడానికి వీలౌతుంది. మాటా మాటా కలిస్తేన పదమౌతుంది. పలికే బావాలకు వేదికౌతుంది. అది చైతన్యమౌతుంది. ప్రేరణౌతుంది. ప్రజల మేలు కోరే వేధికౌతుంది. ఇదే కాదా? అందరూ కోరుకోవాల్సింది. కేసిఆర్‌ దేశంలోని ప్రతిపక్షాలకు అవసరమైనంత చేయూత నిందిస్తానన్న మాటలకు వక్ర భాష్యాలు అద్ది, వార్తలు వండి, వార్చి ప్రజల్లో అపోహలు సృష్టించడాన్ని ఏ ప్రజా స్వామ్య వాది స్వాగతించడు. అదే నిజమైతే జాతీయపార్టీలు ఆయా రాష్ట్రాలలో ఆపార్టీలకు అవసరమైన నిధుల సమీకరణ, పంపణీ మాటేమిటన్నది కూడా చర్చ జరగాల్సిన అసవరం వుంది. రాజకీయ పార్టీ అంటే నిధులు లేకుండా ప్రచారం కూడా సాగని రోజులివి. అలాంటిది నిధులు సంగతి తప్ప, విధుల సంగతి మర్చిపోయిన పార్టీలకు మీడియా వంతపాడడం అలవాటుగా మారితే, కేసిఆర్‌ లాంటి ప్రజా నాయకుడి సేవలను ప్రజలకు దూరం చేయడమే అవుతుంది. 

కేసిఆర్‌ అంటే ఒక శక్తి, యుక్తి. ఆయన మాటే ఒక ఉప్పెన. ఇది గతంలో తెలంగాణలో రుజువైంది. ఇప్పుడు బిజేపితో ఢీ, అంటే ఢీ అంటుండడంతో దేశానికంతటికీ తెలిసిపోయింది. అందుకే బిజేపి భయపడుతోందనేది రాజకీయ వాదుల వాదన. పైకి చాలా మంది ఈ విషయం చెప్పలేకపోవచ్చు కాని, కేసిఆర్‌ తన రాజకీయ చాణక్యం చూపడం మొదలుపెడితే ఎవరి రాజకీయమైనా సరే అక్కడితో ఆగిపోవాల్సిందే..!

ఏజెన్సీ లో హై అలర్ట్

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా లోని పూర్తి ఏజెన్సీ మండలలైన కొత్తగూడ గంగారం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏజెన్సీ గ్రామాలలో మహోయిస్టు యాక్షన్ టీం సంచారిస్తుందని ఇంటిలిజీన్స్ పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ అధికారులు కొత్తగూడ సబ్ ఇన్స్పెక్టర్ నగేష్ గంగారం సబ్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర ఆధ్వర్యం ముమ్మర తనిఖీలు చెపాట్టారు మండల కేంద్రలైన కొత్తగూడ గంగారం సరిహద్దు లోకి వచ్చి వెళ్లే వాహనలను తనిఖీ చేస్తూ వివరాలు తెలుసుకుంటు సరిహద్దు గ్రామాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు దీనితో ఒ వైపు పోలీసులు మరో వైపు మహోయిస్టు యాక్షన్ టీం అని ప్రచారం ఎ క్షణ న ఎం జరుగుతుందని గంగారం కొత్తగూడ మండలాల ప్రజలు భయపడుతున్నారు.

ఖైరతాబాద్‌ కహాని! జనగామ పరేషాని!!

 

ఖైరతాబాద్‌ లో దానం నిర్లక్ష్యం!

-పార్టీ బలోపేతానికి కృషి శూన్యం?

-తనతో వచ్చిన వారికే ప్రాధాన్యం!

-ఉద్యమ కారులు దూరం… దూరం!

-వ్యక్తిగత పనులు తప్ప ప్రజా సమస్యలకు మంగళం!

-రాష్ట్రస్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలకు అనేక సార్లు అవమానం!

-ప్రజలతో మమేకాని సందర్భాలు అనేకం!

-జూబ్లీ హిల్స్‌ గుడిసె వాసుల విషయం పార్టీపై ప్రభావం?

-ఎమ్మెల్యే దానం తీరు ఎండగట్టిన జనం?

-జనగామలో ముత్తిరెడ్డికి జనం నుంచి ఎదురౌతున్న నిరసన గళాలు?

-ఎంత గుండెల్లో పెట్టుకొని గెలిపించారో ఆ ప్రజలనుండే అంత చీత్కారాలు?

-కబ్జాలపై ఆది నుంచి విమర్శలు?

-సొంత పార్టీ నేతలకే బెదిరింపులు?

-అధికారులకు ముత్తిరెడ్డి చేసిన అవమానాలు?

-కొమురవెళ్లి వివాదాలు?

-దుర్గమ్మ గుడి విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలు?

-జనగామ,చేర్యాల చెరువుల ఆక్రమణలు?

-దుర్గమ్మ గుడి స్థలంపై ఇప్పటికీ కొనసాగుతున్న విమర్శలు?

-ముత్తిరెడ్డి మూలంగా నిరాశ్రయులైన ఏసి.రెడ్డి నగర్‌ వాసులు?

-ఎనాడు బడి వైపు చూడని ముత్తిరెడ్డికు చీపురు తెచ్చిన తంటాలు? 

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

పదవులు రాక ఎందరో ఎదరుచూస్తుంటే, ప్రజా ప్రతినిధి కాలేకపోయానని మధనపడుతుంటే, పదవులు వచ్చిన వారిలో కొందరు మాత్రం ప్రజల్లో వుండడం లేదు. ప్రజలకు సేవ చేస్తున్నది లేదు. ఆ పదవులకు వన్నె తెవాలన్నది మర్చిపోతున్నారు. ప్రజలు ఆదరించి గెలిపించినా, అదేదో తమ అదృష్టమన్నట్లు వ్యవహరిస్తున్నారు. పదవులు లేని నాడు పాకులాడడం, పదవులు వున్ననాడు ప్రజలకు దూరంగా వుండడం అలవాటు చేసుకుంటున్నారు. గెలిచాక ప్రజా సేవ పక్కన పెట్టి, పెత్తనం చేయడం, ఆస్ధులు పోగేసుకోవడం, ప్రజలను లెక్క చేయలేకపోవడం వంటివాటిని అనుసరిస్తూ, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి నేతల మూలంగా ఉద్యమ పార్టీకి తీరని నష్టం చేస్తున్నారు. ఇలాంటి నాయకులు వుండడం నష్టదాయకమే అని ప్రజలే అంటున్నారు. నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న వారు తెలంగాణలో చాలా మంది వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో నమ్మకంతో, వారికి పదవులు అందించారు. టిక్కెట్లిచ్చి గెలిపించారు. పార్టీ కోసం పనిచేస్తారని అనుకున్నారు. ప్రజలకు సేవ చేస్తారని నమ్మారు. కాని వారు ఈ రెండూ తప్ప అన్నీ చేస్తున్నారు. అన్న విమర్శలే సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నారేందర్‌ వున్నారు. 

ముందుగా దానం నాగేందర్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు కాదు. 

ఒక వేళ తెలంగాణ ఇవ్వాల్సివస్తే హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేయాలంటూ అంతర్లీనంగా సమైక్యాంద్రకు జై కొట్టిన నేత. అంతే కాదు అనేక సందర్బాలలో ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌పై కూడా ఎంత మాట్లాడకూడదో అంత మాట్లాడాడు. అసలు కేసిఆర్‌ను హైదరాబాద్‌ అడుగు పెట్టనీయమన్నారు. ఇలా వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ రaులిపించినంత పనిచేసి నాయకుడు దానం నాగేందర్‌. తాను మంత్రిని అన్న సంగతి కూడా మర్చిపోయి, ఓసారి సికింద్రాబాద్‌లో ఉద్యమ కారులను తరమికొట్టిన ఘనత దానం నాగేందర్‌ది. అంతేకాదు ఆయన మంత్రిగా వున్న సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అన్న సందర్భంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు బల్లరు చరుస్తుంటే తాను కూడా బల్లలు చర్చిన నాయకుడు దానం నాగేందర్‌. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతుంటే మరో వైపు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను ఆ సమయంలో ఎలా ముఖ్యమంత్రిని చేయాలన్నదానిపై కసరత్తు చేసిన నాయకుడు దానం నాగేందర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి, అణచివేయడానికి చేయాల్సినంత చేశాడన్నది జగమెరిగిన సత్యం. ఇక ఆయనకు రాజకీయ జీవితానికి చేయూతనిచ్చిన పిజేఆర్‌తో విభేధించి, చివరికి ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికర పరస్ధితులు దానమే సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఆయన ఏర్పాటుచేసిన సభకు హజరైన సమయంలోనే పిజేఆర్‌ గుండెపోటుతో మరణించాడు. తన శిష్యుడే తనకు అన్యాయం చేస్తున్నాడని పిజేఆర్‌ మధనపడేవాడని అంటారు. పిజేఆర్‌కు గుండెపోటుకు గురయ్యాడని తెలిసినా, పక్కనే కిమ్స్‌ ఆసుపత్రి వున్నా, అక్కడకు చేర్చడంలో ఆలస్యం చేశారనన్న ఆరోపణలు అనేకం వున్నాయి. అంతే కాదు ఆయనకు 2004 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్టు ఇవ్వకపోతే, రాత్రికి రాత్రి కండువా మార్చుకొని, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలో సిఎల్పీ నేతగా వున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి , దానం నాగేందర్‌కు టిక్కెట్టు ఇవ్వడంలో చొరవ చూపలేదు. దాంతో తనకు కాంగ్రెస్‌పార్టీ అన్యాయం చేసిందని ప్రచారం చేసుకొని సానుభూతితో దానం గెలిచారు. కాని కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వెంటనే పదవికి రాజీనామా చేశారు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌ పార్టీ చిదిమేసిందని గగ్గొలు పెట్టిన ఆయనే ఒక్కరోజులో తెల్లారేసరికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. మళ్లీ కాంగ్రెస్‌ తీర్దం పుచ్చుకున్నాడు. ఉప ఎన్నికల బరిలో నిలిచి బోల్తాపడ్డాడు. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని ఎక్కడైతే సానుభూతి విజయం సాధించాడో అక్కడినుంచి మళ్లీ పోటీ చేసి, వున్న పదవి పోగొట్టుకున్నాడు. 2009 ఎన్నికల్లో గెలిచి పదవి కోసం తెలంగాణను వ్యతిరేకించాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఎంతో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ గతాన్నంతా మర్చిపోయి టిక్కెట్టు ఇస్తే, గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు చేరువైంది లేదు? మేలు చేసింది లేదు? కరోనా కాలంలో ప్రజలను ఎమ్మెల్యేగా ఆదుకున్నది లేదన్నది నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్న మాట. ఇక పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఏనాడో విస్మరించాడన్నది ఆయనపై వున్న అపవాదు. ఇప్పటి వరకు ఆయన స్వయంగా పార్టీని కంచుకోటగా మార్చలేకపోయాడు. కేవలం తనతో టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఉద్యమ కారులను దూరం పెట్టాడన్న అపవాదు వుంది. గతంలో ఆయన అనుచరులుగా వున్నవారి పెత్తనం తప్పితే, ఉద్యమ కారులైన టిఆర్‌ఎస్‌ సీనియర్లనాయకులను పనిగట్టు కొని దూరం పెట్టారన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే పదవిని తన వ్యక్తిగత పనుల కోసం, ప్రతిష్ట కోసం, వ్యాపారాల కోసం తప్ప ప్రజలకు ఏనాడు చేరువైంది లేదంటున్నారు. తన నియోజకవర్గంలో వున్న టిఆర్‌ఎస్‌ రాష్ట్ర స్దాయి, జిల్లా స్దాయి, నియోజకవర్గ స్దాయి నాయకులను ఆయన పనిగట్టుకొని అవమానించి, పార్టీకి దూరం చేసే పనులే నిర్వహించారని అంటుంటారు. ఇక జూబ్లిహిల్‌ గుడిసే వాసుల విషయంలో ఎమ్యెల్యే దానం అనుసరించిన విదానాన్ని ప్రజల ఎండగట్టిన వైనం తెలిసిందే. 

ఇక జనగామ ఎమ్మెల్యే ఉద్యమ కారుడే…కాని ఆయన కేవలం తన రాజకీయ జీవితం కోసమే ఉద్యమాన్ని ఎంచుకున్నాడన్న వాదన మొదటినుంచి వుంది. 

 

ఆయన ఉద్యమ కాలంలో నియోకవర్గ స్దాయి నాయకుడిగా వున్నప్పటికీ, ఉద్యమ కారులకు ఎలాంటి చేయూతనివ్వలేదన్నది అప్పట్లోనే చెప్పుకునేవారు. తెలంగాణలోని చాలా నియోజకవర్గాలలో ఉద్యమ కారుల మంచీ చెడులు చూసుకున్న నాయకులే ఎక్కువ. కాని జనగామకు సంబంధించి కేసులెదుర్కొనా, పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందాలకు గురైనా ఏనాడు ముత్తిరెడ్డి చొరవ తీసుకున్న సందర్భాలు లేవని అంటుంటారు. అలా ఉద్యమకారులకు అవసరమైన న్యాయ సాయం చేసింది స్యయంగా జనగామకు చెందిన లాయర్లే గాని, ఏనాడు ముత్తిరెడ్డి వాటిని పట్టించుకునేవారు కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది అడ్వకేట్లు ఉద్యమ కారులకు అండగా నిలిచారు. ఒక దశలో ఉద్యమకారులను అప్పటి సిఐ రోడ్దు మీదనే లాఠీలతో కొడుతూ, బూట్లతో తొక్కిన సందర్భం వుంది. కారణం కేవలం అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫ్లెక్సీని చించారని, పొన్నాలపై నిరసనగా కోర్టు సమీపంలో ప్లెక్సీకి చెప్పుల దండ వేవారని, ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపణలో తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా హింసించిన సందర్భం వుంది. కాని ఆ సమయంలో ఏనాడు ముత్తిరెడ్డి వారికి మద్దతుగా రోడ్డెక్కింది లేదు. పోలీసు నిర్భంధాలను ఎదిరించి పోరాటం చేసింది లేదు. కేవలం ఉద్యమ కారులు చేసిన ఉద్యమమే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాజకీయ జీవితానికి ఉపయోగపడిరదేగాని, ఆయన వల్ల ఏ ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరగలేదని అంటారు. ఇప్పటికీ ఆయన ఉద్యమకారులకు సరైన ప్రాదాన్యతనివ్వడం లేదన్న ఆరోపణలు వుండనే వున్నాయి. కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందని నేతలకే ప్రత్యేక ప్రాదాన్యతనిస్తారన్న విమర్శలున్నాయి. ఎందుకంటే జనం ఎంతగా గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారో ఇప్పుడు అంతకు పది రెట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముత్తిరెడ్డి విషయంలో కబ్జాలు, సొంత పార్టీ నేతలకు బెదిరింపులు, అధికారులకు అవమానాలు, దుర్గమ్మ గుడి విషయంలో ఎదుర్కొన్న ఆరోపణలు మొత్తంగా ఈసారి ముత్తిరెడ్డిని బరిలో నిలిపితే మాత్రం ఇబ్బందే అన్నది సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ నేతలే భహిరంగంగా చెప్పుకుంటున్న మాట…

దయామయుడు ఎదురులేదు! తిరుగులేదు!

`ఎదురు నిలబడే వాళ్లు లేరు?

`నిలిచి గెలిచిన వాళ్లు లేరు.

`అప్రతిహత విజయాలను అడ్డుకున్న వాళ్లు లేరు.

`కనీసం గట్టి పోటీ ఇచ్చిన వాళ్లు లేరు.

`మెజారిటీని అడ్డుకోలేకపోరు.

`ఇప్పటికే ఏడుసార్లు వరుసగా గెలిచారు.

`ఓసారి ఎంపి కూడా అయ్యారు.

`ఎక్కడి నుంచైనా గెలవడం కొత్త కాదు.

`పాలకుర్తి కొత్త అయినా వరుస విజయాలు ఆగలేదు.

`దయాకర్‌ కు పోటీగా నిలబడే నాయకుడే పాలకుర్తిలో లేడు.

`పాలకుర్తిలో ప్రతిపక్షాలకు దిక్కు లేదు.

`దయాకర్‌ రావుతో పోటీపడితే ఓటమే మిగులు.

`అందుకే అందరూ డైలమాలోనే..

`దయాకర్‌ రావు వేసుకున్నది గెలుపుబాటనే.

` నియోజకవర్గాన్ని సొంత ఊరులా చూసుకుంటారు.

`ప్రజలను సొంత మనుషులుగా ఆదరిస్తారు.

`విద్య, వైద్యం, పథకాలు అందరకీ అందేలా చూస్తాడు.

`ఉపాధి హామీ పనులను ఎంతటి ఎండనైనా లెక్క చేయక కూలీలకు ధైర్యమౌతాడు.

`ప్రజా సేవ అంటే పరమ భక్తితో నిర్వర్తిస్తాడు.

`మినిస్టర్‌ గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాడు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో ప్రశంసింపబడ్డాడు.

`పంచాయతీ రాజ్‌ శాఖకు వన్నెలద్దాడు.

`పల్లెల ప్రగతిని ప్రపంచానికి చాటాడు.

`ఢల్లీి నంచి అవార్డు తెచ్చిపెట్టాడు.

`పల్లె సిరులకు శ్రీకారం చుట్టాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పరిచయం అక్కర్లేని నాయకుడు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్ర్రంలోలోనే కాదు, తెలంగాణలోనూ క్రియాశీలక రాజకీయ, పాలక పాత్ర పోషిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ ప్రస్తానం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్న నాయకుడు. తాను రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటినుంచి పోటీ చేసిన తొలిసారి తప్ప, రెండోసారి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరగని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాజకీయాల్లో ఓటమి లేని నాయకుడిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తర్వాత వరసలో వున్న మూడో నాయకుడు దయాకర్‌రావు. ఆ తర్వాత ఎవరూ లేరు. అలా తిరుగులేని రాజకీయ జీవితాన్ని నిర్మించుకొని, ఎక్కడున్నా రాణించడం ఆయన ప్రత్యేక శైలి. ప్రతిపక్షంలో వున్నా, అధికార పక్షంలో వున్నా ఆయనది ప్రత్యేక పాత్రే. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టి, ఆపార్టీ అధికారంలో వున్నంత కాలం, ఆ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడైనా ఓటమెరుగని నాయకుడు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. అంతే కాదు మొదట్లో ఆయన పోటీ చేస్తూ గెలిచిన వర్ధన్నపేట నియోజకవర్గం 2009 ఎన్నికల సమయంలో డీలిమిటేషన్‌లో రిజర్వుడు స్ధానమైంది. దాంతో ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాలకుర్తిని ఎంచుకున్నాడు. అక్కడి నుంచి మూడుసార్లు ఇప్పటి వరకు గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాజకీయ జీవితంలో మరో విశేషం కూడా వుంది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమ పార్టీ అయిన బిఆర్‌ఎస్‌(అప్పుడు టిఆర్‌ఎస్‌) మీద కూడా గెలిచిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసినా, ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు బలం లేకుండా చేయడంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును మించిన నాయకుడు లేడని చెప్పడంలో ఆశ్యర్యం లేదు. ఎందుకంటే ఆయనతో పోటీ చేసిన వారు ఎక్కడా పెద్దగా రాజకీయాల్లో రాణించలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో కీలకంగా లేరు. ఒక్కసారి ఆయనకు ఎదురుగా నిలబడ్డారంటే వారి రాజకీయ జీవితానికి సన్యాసమే అని ప్రజలు చెప్పుకుంటారు. ఎందుకంటే దయాకర్‌రావు అంటే ప్రజలకు అంత ప్రేమ. తెలుగుదేశం పార్టీలో ఉద్దండులైన నాయకులు ఓడిపోయిన సమయాల్లో కూడా ఆయన ఎప్పుడూ ఓటమి చవి చూడలేదు. 2014 ఎన్నికల్లో ఎంతో మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు అడ్రస్‌ లేకుండా పోయినా, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తానేంటో, తన ప్రజాబలం ఏమిటో నిరూపించిన నాయకుడు దయాకర్‌రావు. అలాంటి దయాకర్‌రావుపై వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఒక్క మాట చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో చాలా చోట్ల అటు బిజేపికి, ఇటు కాంగ్రెస్‌కు పోటీ చేయడానికి అభ్యర్ధులు లేరు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం పాలకుర్తి. ఈసారి ఆయన గెలిస్తే ఇక మరో రికార్డు ఆయన ఖాతలో పడుతుంది. ప్రత్యర్ధులు ఏనాడు ఓడిరచలేని నాయకుడిగా చరిత్ర లిఖిస్తాడు. అదేంటో గాని పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి ప్రతిపక్షాల నుంచి ఏ నాయకుడు ముందుకు రావడం లేదట. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలలో రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే, భూపాల పల్లి నియోజకవర్గంలో నువ్వా, నేనా అన్నట్లు అధికార పక్షంతోపాటు, ప్రతిపక్షంలో కూడా పోటీ రసవత్తరంగా వుంది. వరంగల్‌ తూర్పు నుంచి నేనంటేనేనే అని బిఆర్‌ఎస్‌లో కూడా పోటీ వుంది. ప్రతిపక్షాలనుంచి కూడా మేమంటే మేమే అన్నంతగా పోటీ తీవ్రంగా వుంది. వరంగల్‌ పశ్చిమ నుంచి కూడా పోటీ బాగానే వుంది. ప్రతిపక్షాలు కూడ బలంగానే వున్నాయి. జనగామలో కూడా ప్రత్యర్దులు కాచుకొనే కూర్చున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అసలు పోటీ అన్న పదానికి ప్రతిపక్షాలలో స్ధానం లేని ఏకైక నియోకవర్గం పాలకుర్తి.

ఈ నియోజవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, ఎర్రబెల్లిని ఓడిస్తానని గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ముందుకొచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది.. అంతే కాదు దయాకర్‌ రావు రాజకీయ జీవితాన్ని చెడుగా చిత్రీకరించేందుకు ఏకంగా కొండా అనే సినిమా తీసి కూడా విడుదల చేశారు. కనీసం ఆ సినిమాను ప్రజలు ఒక్కరోజు కూడా ఆదరించినట్లు లేరు. దాంతో కొండాసురేఖ తన ఆలోచన మార్చుకొని, తూర్పు రాజకీయాల్లో క్రియాశీలకమౌతున్నారు. పాలకుర్తి నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకోవడం, ఓటమి మరోసారి ఖాతాలో వేసుకోవడం వేస్టని యూటర్న్‌ తీసుకున్నారని సమాచారం. ఇక గతంలో ఎర్రబెల్లి మీద పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఈసారి పాలకుర్తినుంచి పోటీ చేయమని పార్టీ బలవంతం చేసినా ససేమిరా ఆనే పరిస్దితిలోనే వున్నట్లు సమాచారం.గతంలో పాలకుర్తిలో పోటీ చేసేందుకు సుముఖంగానే వున్న జంగా, ఈ మధ్య కాలంలో పాలకుర్తిని వదిలేసినట్లే అని ప్రచారం జోరుగానే సాగుతోంది. ఎందుకంటే ఆయన వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువగా సుముకంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. అంతే కాదు వీలైతే అవకాశం వస్తే జనగామ నుంచైనా పోటీకి సై అనేలా వున్నారే గాని, పాలకుర్తి అంటే పారిపోయేందుకు రెడీగా వున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ శాఖ ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఒక దశలో తాను పాలకుర్తినుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సందర్భం వుంది. కాని ఆయన పాలకుర్తి పరిస్ధితులు తెలుసుకున్నాక ఆ మాట మరోసారి మాట్లాడడమే  మనేశారు. మర్చిపోయారు. అంతే కాకుండా ఈ మధ్య రేవంత్‌రెడ్డి పాదయాత్రలో ఆయనను పాలకుర్తిలో కొందరు మహిళలు గుర్తించడం లేదని మొహం మీదే చెప్పడంతో అవాక్కయ్యారు. తనను పరిచయం చేసుకున్నారు. అంటే దయాకర్‌రావు తన నియోజకవర్గంలో ప్రజలతో ఎంత మమేకమౌతారో ఈ ఒక్క విషయంతో అర్దం చేసుకోవచ్చు. తను తప్ప మరో నాయకుడు ప్రజలు తెలియకుండా సేవ అందించడంలో దయాకర్‌రావు ఆది నుంచి ముందు వరసులోనే వుంటూ వస్తున్నాడు. ఇలా ఒక నాయకుడు తన స్ధానాన్ని ప్రజల నమ్మకాన్ని పొంది, తనకు ఎదురులేని రాజకీయాలు నిర్మించుకోవడం అందరి వల్ల కాదు. ఒక దశలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో రాజకీయంగా నన్ను తీవ్రంగా విమర్శించే, ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసే ప్రజా సేవ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అందుకే ఎవరికీ ఇవ్వనన్ని సిఎం. రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు ఆయనకే ఇవ్వడం జరిగిందని కూడా ప్రకటించారు. ఇదీ దయాకర్‌రావు ప్రజాసేవకున్న నిబద్దతకు నిదర్శనం. అన్నం ఉడికిందా? అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. దయాకర్‌రావు ప్రజా సేవలో ఎందుకు పెరెన్నిక గన్నారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సందర్భంచాలు. ఇప్పుడు ఆయన చిరకాల కోరికైన మంత్రి పదవి నిర్వహిస్తున్నారు. ఆయన ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో చెప్పాలంటే చాల వుంది. దటీజ్‌ దయకర్‌రావు. ఆయన గురించి రాయడం మొదలు పెడితే రామాయణం అవుతుంది. భవిష్యత్తులో దయాకర్‌ రావు మరిన్ని రాజకీయ విశేషాలు కూడా నేటిధాత్రి పాఠకులకు అందిస్తుంది..

చేరికల నేతలకు షాకింగ్‌ న్యూస్‌?  నో టికెట్‌?

`సంతోష్‌జి చేసిన సర్వేలో వెల్లడ్కెన ఆసక్తికర విషయాలు?

`సిద్దాంతాలకు కట్టుబడిన నేతలకే టిక్కెట్లు?

` ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న వారినే బరిలో దింపుదాం?

`బిజేపి బలపడినప్పుడు అరువు నేతలెందుకు?

`ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వాళ్లకు టిక్కెట్లిద్దాం?

`బిఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారి పూర్వోత్తరాలపై బిజేపి తవ్వకాలు ప్రారంభం!

`ఏ నేత ఎందుకు చేరాడన్న దానిపై లోత్కెన మధనం?

`బిఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు బ్కెటకొచ్చారన్న దానిపై ఆరా?

` ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం… అసలు బిజేపి నేతలకు సంకటం?

`అరువు నేతలు గెలిచినా, ఓడిగా బిజేపిలోనే కొనసాగుతారన్న నమ్మకం లేదు?

` బిజేపి అధికారంలోకి రాకపోతే మాత్రం అసలే వుండరు?

`ఇంకో ఐదేళ్లు ఏ పదవి లేకుండా వుండలేరు?

`కచ్చితంగా ఎవరి దారి వారు చూసుకుంటారు?

`ఈటెల వెంట వచ్చిన వారి విశ్వసనీయతపై అనుమానాలు?

`బిజేపి ఆధిపత్య రాజకీయాలలో సమిధలు కానున్న ఈటెల అనుచరులు?

` టిక్కెట్లుపై ఆశలు వదులుకోవాలని పరోక్ష సంకేతాలు?

`ఈటెలనే హుజూరాబాద్‌ కు పరిమితం చేస్తున్నారు?

`ప్రాధాన్యత పక్కన పెట్టేశారు?

`అరువు నేతలు ఆగం కానున్నారు?

`రిటర్న్‌ టు పెవీలియన్‌ అని అనుకుంటున్నారు?

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాలం చాలా విచిత్రమైంది. పాఠాలు,గుణపాఠాలు నేర్పుతుంది. ఎప్పుడు ఎవరికి ఏది నేర్పాలో ఆ సమయానికి ఖచ్చితంగా నేర్పుతుంది. పూలమ్మిన వారిని కట్టెలమ్మేలా చేస్తుంది. కట్టెలమ్ముకున్న వారిని కూడా అందలమెక్కిస్తుంది. అంతటి కాలానికి ఎదురీదడం ఎవరి వల్ల కాదు. కాలం కలిసొస్తుందని ఆశ పడడంలో తప్పులేదు కాని అత్యాశపరులకు కాలం మంచి సమాధానమైతే చెబుతుంది. ఇప్పుడు బిజేపిలో చేరిన అరువు నేతల పరిస్ధితికి అలాగే కనిపిస్తోంది. ఇది ఎవరో అంటున్న మాట కాదు. అరువు నేతల వల్ల తమ రాజకీయ జీవితాలు ఆగమౌతాయేమో! అనుకున్న నేతలు ఇప్పుడు సంతోషంగా చెబుతున్న మాట. ఎందుకంటే పార్టీలోకి వచ్చిన అరువు నేతలు బిజేపి బలంగా వుంది. భవిష్యత్తు వుంది. కేంద్రంలో అధికారంలో వుంది. అవకాశాలు వచ్చేందుకు అవకాశం వుంది. అరువు నేతలందరూ ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలం బాగుంటుందన్న ఆశతో చేరిన వారే అని అందరికీ తెలిసిందే..అదే ఇప్పుడు చేరిక పేరుతో చేరిన నేతలకు బిజేపి పెద్దల నిర్ణయాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా వుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్ధాయిలో జరుగుతున్న దేమిటో అరువు నేతలకు కూడా ఇప్పుడిప్పుడే అర్ధమౌతోందన్నది కూడా చర్చ జరుగుతోంది. దాంతో ఆ నేతలకు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి కనిపించి కుమిలిపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల బిజేపి పెద్దలనుంచి అసల్కెన బిజేపి నాయకులకు అందుతున్న సమచారం మేరకు పార్టీలో ఎవరికి ప్రాధాన్యత కల్పించాలన్నదానిపై విసృతంగా సమీక్షలు చేస్తున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి తోడు సంతోష్‌ జీ లాంటి వాళ్లు చేయించిన సర్వేలలో కూడా ప్రజలు చెప్పిన అనేక విషయాల మీద కూడా పార్టీలో మధనం జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణలో బిజేపి బలం పెరిగిన తర్వాత ఇతర పార్టీల్లో పదువులు అనుభవించినవారు మళ్లీ పదవుల కోసం పార్టీలో చేరితే, అసలు బిజేపి వాదులకు నష్టం జరగదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమైట్లు చెప్పుకుంటున్నారు. దాంతో బిజేపి కేంద్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీకి చెందిన నేతలు చర్చించుకుంటున్నారు. అసలు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎందుకు ఇవ్వాలన్నదానిపై కూడా అనేక సూచనలు అందుతున్నట్లు సమాచారం. ఉనికే లేని చోట కొత్త నాయకత్వం వచ్చి ఊపు నిచ్చిందనుకుంటే వేరు. కాని పార్టీ బలపడిన తర్వాత వచ్చిన నేతలతో ఒరిగింది లేదు. కొత్తగా పార్టీకి బలమొచ్చింది లేదన్న వాదనలే వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో బలమైన వాదన కూడా కేంద్ర స్ధాయిలో వినిపిస్తోంది. కొత్తగా చేరిన నేతలెవరు పోరాటాలు చేస్తున్న సందర్భమేమీ లేదన్న విషయాలు అధిష్టానం దృష్టికి వెళ్తున్నాయి. కొత్తగా చేరిన నేతలు ఎక్కడిక్కడ వారికి ఎంతో బలముంటే ఆయా స్ధానాల్లో ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు. ప్రజల దృష్టిని ఎందుకు మరల్చడం లేదు. తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం వున్న నేతలుగా చెప్పుకుంటన్న వాళ్లు ఇంత కాలం చేసిన పోరాటాలేవి? రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించిన విజయాలేవి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయట. అందుకే బిజేపి కేంద్ర నాయకత్వం చేయించిన సర్వేలలో పార్టీకి క్యాడర్‌ చెప్పిన అనేక విషయాలను తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాలని నిర్ణయం తీసుకుంటారన్న సంకేతాలు అందుతున్నాయి. 

బిజేపి ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తున్న నమ్మకం బిజేపి పెద్దలకే లేదు. 

అందుకే ఈ ఎన్నికల్లో మరింత బలపడి వచ్చే 2029 ఎన్నికల్లో కుంభస్ధలాన్ని కొట్టాలన్న ఆలోచనతో వుందట. ఎందుకంటే బిజేపి ఆది నుంచి ఇలాంటి స్కెచ్‌లు వేయడం, ఆచరించడం, గెలిచి చూపించడం అలవాటే. ఇప్పుడు కూడా దక్షిణాదిన అదే ఫార్ములా అనుసరించాలని చూస్తున్నారట. అందులో భాగంగా తాజగా కర్ణాటకలో జరిగే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఎలా ముందుకు సాగాలన్నదానిపై కూడా పార్టీ శ్రేణులకు పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బిజేపి సిద్దాంతాలు, ఆరెస్సెస్‌ భావ జాలానికి కట్టుబడి పనిచేస్తున్న సీనియర్లకే పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం యోచిసున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఆరెస్సెస్‌ మూలాలున్నవారినే ఎన్నికల బరిలో దింపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇంత కాలం పార్టీని నమ్ముకొని సేవ చేసిన వారికే టిక్కెట్లు ఇద్దాం. దాంతో కష్టపడిన నేతలకు పార్టీ టిక్కెట్లు అన్న సంకేతాలు వెళ్తాయి. లేకుంటే ఎంత కష్టపడినా , కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేసేది వుంటే మేం కష్టపడడం ఎందుకున్న నిస్తేజం వారిలో ఆవహిస్తుంది. పైగా డబ్బున్న నేతలు, అరువు నేతలే అక్కరకు వస్తారా? అన్న ప్రశ్నలే మిగులుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అరువు నేతలు పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన భరోసాను కాదనలేనప్పుడు, పొమ్మన లేక పొగ ఎలా పెట్టాలన్నదానిపై పార్టీ రకరకాల ఆలోచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. 

మాటకు ముందు ఉద్యమ కారులం అంటూ చెప్పుకొని బిజేపిలో చేరిన నేతల పూర్వాపరాలపై బిజేపి ఆరా తీస్తోందని సమాచారం.

 పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం కల్పించడం కూడా మొదటికే మోసం వస్తుందన్న ఆలోచన పార్టీ చేస్తోందట. అంతే కాకుండా ఒక వేళ భవిష్యత్తు ఈ నేతలు పార్టీలో వుంటారా? పార్టీ అధికారంలోకి రాకున్నా పార్టీని పట్టుకని వేళాడతారా? లేక అవకాశావాదులుగా మారిపోతారా? ఐదేళ్లు పదవులు లేకుండా పార్టీకి సేవ చేస్తారా? అన్న విషయాలపై లోతన్కెన అధ్యయనం జరుగుతోందట. అలాంటి నేతల్లో ఈటెల రాజేందర్‌ తోపాటు వచ్చిన మాజీ మహిళా ఎమ్మెల్యే బొడిగ ఒకరు. ఆమె తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల రోజున ఆంధ్రాకు చెందిన మీడియా చేసిన హడావుడి, తెలంగాణ ఎమ్మెల్యేల పట్ల ప్రదర్శించిన దుష్టవైఖరిని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. అందులో బొడిగ శోభ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని హేళన చేసిన మీడియాను ఏకంగా తెలంగాణలో బ్యాన్‌ చేశారు. అంతగా ఆమెకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ భరోసా కల్పించారు. ధ్కెర్యాన్ని ఇచ్చారు. ప్రాధాన్యతనిచ్చారు. కాని ఆమె ఎమ్మెల్యేగా పార్టీనుంచి,ప్రజలనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె టిక్కెట్టు నిరాకరించారు. అయినా సంయమనంతో వుంటే పదవులు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట ఇచ్చారు. కాని ఆమె వెంటనే బిజేపిలో చేరి రాజకీయ జీవితాన్ని త్రిశంకు స్వర్గం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్‌ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంతే గాని ఆయనను ప్రత్యేకంగా పక్కన పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదు. ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గినట్లు స్పష్టమైనసమాచారం వుండడం కూడా తెలిసిందే. బిజేపిలో చేరగాని బలమైన నేతగా మారారా? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇక కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిషత్‌ చ్కెర్మన్‌గా అవకాశం అందుకున్న తుల ఉమ కూడా ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డారు. అందులో తప్పు లేదు. కాని సమయం కోసం ఎదరుచూడాల్సివుండే. కాని ఆమె కూడా తొందరపడి బిజేపిలో చేరింది. ఇలా ఉద్యమ కారులమన్న కార్డుతో ప్రతి పదవి తమకే కావాలని, ప్రతిసారి తమకే అవకాశం ఇవ్వాలని పదవులు పొందని వారే డిమాండ్‌ చేస్తూ పోతే, మరి మిగతా నేతలకు ఎప్పుడు అవకాశాలు వస్తాయి. వారికి కూడా సరైన ప్రాతినిద్యం అవసరం లేదా? అన్నది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్న మాట. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒకసారి ఎంపిగా అవకాశం కల్పించారు. కాని ఆ స్ధాయిలో ఆయన ఫెర్మార్మెన్స్‌ కనిపించలేదు. ఇప్పుడు మీడియాలో చేస్తున్న హడావుడిలో అప్పుడు పది శాతం చేసినా, ప్రజల్లో వుండేవారు. పార్టీలో అవకాశాలు అందుకునేవారు. కాని పదవి పోయిన తర్వాత గాని రాజకీయాల విలువ తెలియదు. పైగా ఆయన బిజేపిలో చేరడానికి ఓ ఫ్రధాన కారణం కూడా వుందన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి నేతలకు పార్టీ ప్రాదాన్యత కల్పించడం ఎంత వరకు సమంజసమన్న చర్చ మాత్రం బాగానే జరుగుతోందన్నది మాత్రం నిజం అంటున్నారు.

జనగామ జననేత పోచంపల్లి

`ఈసారి పోచంపల్లికే టికెట్‌?

` గతం నుంచి నేటిధాత్రి చెబుతున్నదే!

`జనగామ బిఆర్‌ఎస్‌ లో జనాదరణ పోచంపల్లి కే.

`తక్కువ సమయంలోనే పార్టీ శ్రేణుల మనసు చూరగొన్న పోచంపల్లి.

`మళ్ళీ ముత్తిరెడ్డి అంటే మునుగుడే?

`పార్టీ నాయకుల మదిలో మాటే?

`ఈసారి ముత్తిరెడ్డి ని మార్చకపోతే నష్టమే!

`సమస్యల పరిష్కారంలో ముత్తిరెడ్డి నిర్లక్ష్యం.

`గతంలో వున్న ముత్తిరెడ్డి రెడ్డి హడావుడి ఇప్పుడు లేదు.

`ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా అంత శ్రద్ధ పెట్టడం లేదు?

`పార్టీ పటిష్ఠం కోసం పెద్దగా దృష్టి పెట్టడం లేదు?

`ముత్తిరెడ్డి కి ఇప్పటికే అందిన సంకేతాలు?

` జనగామలో బిజేపి పెరగడానికి సైతం ముత్తిరెడ్డే కారణమంటున్న బిఆర్‌ఎస్‌ శ్రేణులు.

`ముత్తిరెడ్డి వ్యవహార శైలిలో నష్టపోయిన ఎంతో మంది ఉద్యమకారులు.

` అధికారుల మనస్తాపం, ప్రజల కోపం, ముత్తిరెడ్డి జనగామ సీటు గండం?

` జనగామకు మెడికల్‌ కాలేజీ మంజూరులో పోచంపల్లిదే కీలక పాత్ర!

` పోచంపల్లి జనానికి దగ్గర!

`ముత్తిరెడ్డి వివాదాలకు చేరువ?

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జనగామలో మళ్లీ మొదలైన చర్చ…నిజంగా ఇది పెద్ద రచ్చే.. వచ్చే ఎన్నికల్లో జనగామకు బిఆర్‌ఎస్‌ కొత్త నాయకత్వం కావాలి. లేకుంటే పార్టీ పరిస్ధితి ఆగమ్య గోచరమౌతుంది? అన్నది సర్వత్రా వినిపిస్తోంది. కాలాలు మారుతుంటాయి. తరాలు అంతరిస్తుంటాయి. అలాగే కాలానుగుణంగా నాయకత్వాలు కూడా మారుతుంటాయి. కొత్త నాయకత్వాలు అవరమౌతుంటాయి. పాత నీరు పోయి కొత్త నీరొచ్చినట్లు పాత తరం నేతలు పక్కకు వెళ్లాల్సిన సమయం కూడా కొన్ని సార్లు ఆసన్నమౌతుంది. కొత్త తరాన్ని యువతరం కోరుకుంటుంది. ఆ కొత్త నాయకత్వం ప్రజలకు చేరువకావాల్సి వస్తుంది. కొత్త తరం రాజకీయాలు చిగురుతొడినప్పుడే మరింత పటిష్టమైన యువ నాయకత్వం ప్రజలకు చేరువౌతుంది. ఆ యువ నేతలు ప్రజల చేత ఆదరింపబడుతారు. ఆశీర్వాదాలు అందుకుంటారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతుంటారు. రాజకీయాల్లో ప్రచారం వేరు. వాస్తవం వేరు. ఆదరణ వేరు. ఆధిపత్యం వేరు. నాయకత్వం వేరు. నాయకత్వంలో ఉత్తమ లక్షణాలు వేరు. నాయకత్వం మీద నమ్మకం వేరు. నాయకుడి పని తనం వేరు. ఇవన్నీ ఒకే నాయకుడిలో వుంటే ఆ నాయకుడికి గుర్తింపు వేరే లెవల్‌ అని మాత్రం చెప్పొచ్చు. అలాంటి యువతరం నేతలు తెలంగాణలో చాలా మందే వున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌లో కొత్త తరం వెలుగులోకి వస్తుంది. నూతన నాయకత్వాలను కూడా నియోజకవర్గాలు కోరుకుంటున్నాయి. అలాంటి నాయకుడిపట్ల ప్రజల్లో అచెంచలమైన విశ్వాసం ఏర్పడితే మరో తరం వరకు చెక్కు చెదరదు. ఆ నాయకుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి నాయకుడే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి. భవిష్యత్తు జనగామ జిల్లా నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా వున్న నాయకుడు. ఇప్పటికే వరంగల్‌ జిల్లా రాజకీయాలతోపాటు, మఖ్యంగా జనగామ జిల్లా రాజకీయాలకు ఎంతో సుపరిచిడైపోయాడు. అందుకే జనగామ కొత్త నాయకుడిగా ఈ తరం, యువతరం ఆయనను నాయకుడిగా కావాలని కోరుతోంది. అందుకు అనేక కారణాలున్నాయి. 

ఈసారి జనగామ నుంచి బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా కొంత కాలం వరకు ఉత్కంఠగానే వుండేది.

 కాని ఈ మధ్యే జనగామ రాజకీయాల మీద స్పష్టత వస్తోంది. గతం నుంచి నేటిధాత్రి కూడా ఇదే చెబుతూ వస్తోంది. జనగామ నుంచి ఈసారి ముత్తిరెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు అడ్డుకునేందుకు కూడా సిద్దంగానే వున్నట్లు సమాచారం. ఎందుకంటే గత ఎన్నికల్లోనే ముత్తిరెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా మాకు ఓకే అన్నంత తరహాలో చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన నాయకులు అనేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానానికి సూచనలు చేశారు. కాకపోతే ఆ సమయంలో వున్న పరిస్ధితులను బట్టి తీసుకున్న నిర్ణయంలో జనగామ నియోజక వర్గ నాయకులకు కూడా అంగీకరించారు. కాకపోతే ఈసారి మాత్రం ఎట్టిపరిస్ధితుల్లోనూ ముత్తిరెడ్డికి ఇస్తే సహించలేమని, సహకరించలేమని తేల్చిచెబుతున్నారు. గతంలో చేర్యాల, మద్దూరు, నర్మెట్ట మండలాలు సరిగ్గా సహకరించలేదన్న కోపమో ఏమో కాని ముత్తిరెడ్డి చేర్యాల మీద పెద్దగా దృష్టిపెట్టలేదన్న ఆరోపణలు మాత్రం వున్నాయి. జిల్లాల విభజన తర్వాత చేర్యాల రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ కోరుతున్నారు. కాని ముత్తిరెడ్డి ఆ విషయం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రికి చెప్పి ఒప్పించినట్లు వార్తలు లేవు. గతంలో కూడా ఇలాగే జనగామ జిల్లా ఏర్పాటు కోసం ఎద్దఎత్తున ఉద్యమం సాగుతుంటే ముత్తిరెడ్డి పెద్దగా సహకరించలేదు. పైగా జనగామలో ఏడాదికాలం పాటు 144 సెక్షన్‌ అమలు చేయించిన ఘనత ముత్తిరెడ్డిది అన్న విమర్శలుండనే వున్నాయి. ఆనాటి నుంచి వున్న చేర్యాల రెవిన్యూ డివిజన్‌ సమస్య అలాగే వుంది. ఇలా జనగామ నియోజకవర్గంలో వున్న సమస్యలను పరిష్కరించడంలో ముత్తిరెడ్డి ఏమాత్రం చొరవ చూపలేదన్నది బిఆర్‌ ఎస్‌ నాయకులే చెప్పుకునే మాట. 

ఇదే సమయంలో గత కొంత కాలంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి జనగామ నియోజకవర్గ ప్రజలకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు బాగా చేరువైనట్లు వార్తలు వస్తున్నాయి. 

యువతరానికి బాగా దగ్గరైనట్లు కూడా చెప్పుకుంటున్నారు. పైగా సమస్యల పరిష్కారానికి నేరుగా పోచంపల్లి వద్దకు వెళ్లి చెప్పుకునే పరిస్ధితి వుంది. కాని ఆనాటి నుంచైనా సరే ముత్తిరెడ్డి వద్దకు నేరుగా వెళ్లే పరిస్దితి ఎవరికీ లేదన్నది అందరికీ తెలిసిన ముచ్చటే అంటున్నారు. పైగా ఆయన వద్ద సమస్యల ప్రస్తావన తీసుకొచ్చినా, ఆయన చెప్పిందే వినాలే తప్ప, ప్రజలు చెప్పినా, ఇతర నాయకులు చెప్పినా వినే పరిస్దితి ఎప్పుడూ లేదన్నది బిఆర్‌ఎస్‌ నాయకుల వాదన. ఇదిలా వుంటే ఆది నుంచి నియోజకవర్గంలో ముత్తిరెడ్డి వివాదాలు షరా మామూలే అంటున్నారు. జనగామ కలెక్టర్‌తో గొడవతో మొదలు, జిల్లా వాసులు ముత్తిరెడ్డి వివాదాలు కథలు, కథలుగా చెప్పుకుంటారు. అందుకే ఈసారి పొరపాటను కూడా ముత్తిరెడ్డికి టికెట్‌ ఇవ్వకూడదన్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా కొందరు నాయకులు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈసారి ముత్తిరెడ్డికి టిక్కెట్‌ ఇస్తే గెలిచే సీటును ప్రతిపక్షాలకు పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్లే అంటున్నారు. జనగామ జిల్లాలో బిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. జనగామ నియోజక వర్గంలో బిఆర్‌ఎస్‌లో ఇంత వరకు అంతర్గత పోరు లేదు. కాని ఇతర పార్టీలలో చోటా మోటా నాయకుల అంతర్గత పోరుతో సతమతమౌతున్నాయి. అందువల్ల ప్రజలకు ఎట్టిపరిస్ధితుల్లో ప్రతిపక్షాల వైపు చూసే అవకాశం లేదు. కాకపోతే బిఆర్‌ఎస్‌ కూడా అభ్యర్ధిని మార్చితేనే గెలుపు నల్లేరు మీద నడకౌతుందంటున్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఆధిపత్య పోరు మూలంగా ఇప్పటికీ ఆ పార్టీలో స్పష్టత లేదు. ఎన్నికల సమయం వరకు స్పష్టత వస్తుందన్న నమ్మకం లేదు. గత ఎన్నికల్లోనే ఆఖరు నిమిషంలో పొన్నాలకు టిక్కెట్‌ ఇచ్చారు. ఈసారి కూడా తనకే కావాలని పొన్నాల కోరుతున్నాడు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జంగారాఘవరెడ్డిలు పోటీ పడుతున్నారు. అందువల్ల ముత్తిరెడ్డికి బిఆర్‌ఎస్‌ నుంచి ఒకవేళ టిక్కెట్‌ ఇస్తే మాత్రం చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, మండలాలు కాంగ్రెస్‌వైపు మళ్లేందుకు అవకాశాలున్నాయి. ఒక వేళ పోచం పల్లికి ఇస్తే బిఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తి స్ధాయిలో పనిచేసి బిఆర్‌ఎస్‌ గెలుపును సునాయాసం చేస్తారు. ఇక జనగామ టౌన్‌ తోపాటు, మండల పరిధి గ్రామాలలో, బచ్చన్నపేట మండలంలో బిజేపి బలపడడానికి కూడా ముత్తిరెడ్డి వ్యవహరించిన తీరే కారణమన్న ఆరోపణలున్నాయి. ముత్తిరెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఇస్తే, జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలో బిజేపికి ఆయుధం అందించినట్లే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా వుంటే ఈసారి టెక్కెట్‌ తనకు దక్కకపోవచ్చ సంకేతాలు ముత్తిరెడ్డికి ఇప్పటికే అందినట్లు కూడా తెలుస్తోంది. 

అందుకే ఆయన పార్టీపరమైన కార్యక్రమాలలో గాని, ప్రభుత్వ పరమైన విషయాలలో పెద్దగా దృష్టిపెట్టడం లేదని అంటున్నారు. ఇటీవల కాలంలో జనగామలో వీధి కుక్కల బెడద పెద్దఎత్తున పెరిగిపోయిందని, నిత్యం ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని జనగామ సాధన సమితి సభ్యులు ముత్తిరెడ్డి పట్టింపు లేని తనంతోనే మున్సిపల్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. అంతే కాకుండా జనగామలో పెరిగిపోయిన కోతులను పట్టుకొని అడువుల్లో వదిలేయాని ఎన్ని సార్లు కోరినా, ముత్తిరెడ్డి ఈ విషయంలో పట్టించుకోలేదంటున్నారు. ఇవి చిన్న సమస్యలుగా కనిపించినా ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలు. ప్రాణాలకు సంబంధించిన సమస్యలు. వీధికుక్కలు బైట తిరగనివ్వడం లేదు. కోతులు బైటకు రానివ్వడంలేదంటూ ప్రజలు గగ్గొలు పెడుతున్నారు. ఇలా ప్రజా సమస్యల విషయంలో ముత్తిరెడ్డి నిర్లక్ష్యం, నిర్వాకం కనిపించడం కూడా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ బలంగా ప్రాంతాల్లో నాయకత్వ మార్పులో నిర్ణయం తీసుకోకపోతే, ప్రతిపక్షాలు బలపడేందుకు దోహదముందుని అంటున్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన నాయకుల్లో కనిపిస్తోంది.

భద్రాద్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారు

భద్రాద్రి శ్రీసీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామి వారి ఆలయం,మిథిలా స్టేడియం,దాని పరిసరాలను వివిధ రకాల పూలు,మామిడి ఆకు తోరణాలు,కాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

వేలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాలు,మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాన్ని టీవీలు, సామాజిక మాధ్యమాలలో లక్షల మంది తిలకించారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు సీతారాముల వారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.సీతమ్మ వారికి 

సిరిసిల్ల నేత కార్మికులు ప్రత్యేకంగా నేసిన పట్టు చీరను ఈ సందర్భంగా అందజేయడం విశేషం.ఈ కళ్యాణ బ్రహ్మోత్సవానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత,శ్రీత్రిదండి చినజీయర్ స్వామి,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, ఎమ్మెల్యేలు పోడెం వీరయ్య,కందాళ ఉపేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రముఖ వ్యాపారవేత్తలు వద్దిరాజు నిఖిల్ బాబు, వద్దిరాజు నాగరాజు బాబు,ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికార, అనధికార ప్రముఖులు సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు.కళ్యాణం అనంతరం వేద పండితులు ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ పుణ్య దంపతులకు తలంబ్రాలు అందజేశారు.ఎంపీ వద్దిరాజు,ఆయన కుమారుడు నిఖిల్ బాబు సీతారామ చంద్రస్వామి వారి పల్లకీ మోశారు.

తెలంగాణలో ఆంధ్రా బ్రోకర్లు?

`బండ్లు, బర్రెలు ఏవీ వదలరు?

`లబ్ధిదారులే లక్ష్యంగా తెలంగాణలో తిష్టవేశారు.

`తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.

`కొందరు అధికారులు వెనకుండి నడిపిస్తున్నారు.

` ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.

`దళితుల జీవితాలను బ్రోకర్లు దోచేస్తున్నారు.

`దళారుల పాలౌతున్న దళిత స్కీమ్‌ లు!

`దళితుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

`తాజాగా దళితులపై దళారుల దౌర్జన్యం!

`బర్రెలను లాక్కునేందుకు భేరం?

` పై అధికారుల అండతోనే రైతులకు బెదిరింపుల పర్వం.

`చెప్పినట్లు వింటే మంచిది…లేకుంటే ఆగం చేస్తం.

`బర్రెకు రూ. 60వేలు ఇస్తాం!

`మూసుకొని తీసుకోండి?

`మాకు డబ్బులొద్దు…యూనిట్లే కావాలి: రైతులు

` బిక్కు, బిక్కు మంటున్న రైతులను తీసుకెళ్ళిన అధికారులు.

`యూనిట్లు మాకు, ఫోటోలు మీకు అంటున్న దళారులు

`మీ దిక్కున్న చోట చెప్పుకొమ్మని బెదిరింపులు.

`అధికారులకు కూడా దళారుల హెచ్చరికలు.

`ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయమంటున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులే ఇదంతా చేయిస్తున్నారు?

`ఆంధ్రా దళారులతో దందా సాగిస్తున్నారు?

`మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?

మిలీనియం ట్రైన్లో ఏం జరిగింది?

`మధురలో దిగిందెంత మంది?

`హర్యానాలో ఏం జరుగుతోంది?

`దళారులు ఉచ్చులో చిక్కిన రైతులెక్కడ?

`దళారులు సృష్టించిన దొంగ వీడియోల మతలబేమిటి?

హైదరాబాద్‌,నటిధాత్రి: 

అది వరంగల్‌ రైల్వే స్టేషన్‌. దాదాపు ముప్పై మంది రైతులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారంతా నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల రైతులు. వారికి తోడుగా ఓ ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు.ఒకరు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారి, మరొకరు వైద్యురాలు. ఇంతలో చెన్నై నుంచి న్యూ డిల్లీ వెళ్లాల్సిన మిలీనియయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ వచ్చింది. రైతులంగా ట్రైన్‌ ఎక్కేశారు. రైలు కదిలింది. రైతులకు కేటాయించిన సీట్లలో అందరూ కూర్చున్నారు. ఎక్కడికక్కడ అందరూ కుదట పడ్డాక కొందరు కొత్త వ్యక్తులు రైతుల వద్దకు వచ్చి పలకరించడం మొదలుపెట్టారు. ముందు వాళ్లను వాళ్లు పరిచయం చేసుకున్నారు. రైతులతో మాటలు కలిపారు. మెల్లిగా రైతులకు కొత్త తరహా విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో బల్లార్షా రానే వచ్చేస్తోంది. రైతులను మీరేం తింటారు? అంటూ ఆ కొత్త వ్యక్తులు అడగడం మొదలుపెట్టారు. మీరెవరు? మాకు భోజనాలు చెప్పడానికి? మా బోజనాలు మేం తెచ్చుకున్నాం..అవసరమైతే అధికారులు వున్నారు. వారు మా అవసరాలు తీర్చుతారిన కొందరు రైతుల మొహమాటం లేకుండా చెప్పేశారు. కాని కొంత మంది రైతుల అమాయకత్వం..వారి బలహీనతలు తెలుసుకున్న అపరిచిత వ్యక్తులు అందులో కొంత మంది రైతులను మెప్పించి వారు కోరిన భోజనాలు తెప్పించారు. దాంతో వారికి, అపరిచితులైన వారికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే గెదెలు తీసుకొని మీరేం చేస్తారు? వాటిని కాయడం, నిత్యం దానా ఖర్చు భరించడం, పొద్దు, మాపు వాటిని సంరక్షించుకోవడం, రాత్రి పగలు తేడాలేకుండా కాపాడుకోవడం, జీవితాలకు ఎలాంటి సంతోషం లేకుండా వాటితోనే జీవితం గడపడం అవసరమా? అంటూ ముందు ఆలోచనలో పడేశారు. తర్వాత భయపెట్టారు. నిజమే కదా..? గేదెలుంటే ఊరు దాటి వెళ్లలేము… పెళ్లి పేరంటాలకు వెళ్లలేము..సంతోషంగా బందువుల ఇంటికి వెళ్లలేము..ఎక్కడికి వెళ్లినా మూగ జీవాల గురించి ఆలోచనే తప్ప, వెళ్లిన సంతోషం కూడా వుండదు..ఇదీ అక్కడ మొదలైన చర్చ. చెప్పుకోవడానికి బాగానే వుంటుంది కాని, గేదలను కాపుకాయడం అంటే అంత సులువేం కాదు..! అంటూ మాటలు కలిపారు. దాంతో మరేం చేయమంటారు? అని రైతులు ఆ అపరిచిత వ్యక్తులను అమాయకంగా అడిగారు. అప్పుడు మీకు గేదెకు రూ.60వేలు ఇస్తాము..గేదెలతో ఫోటోలు దిగి..వాటిని అధికారులకు అందజేయండి? అంతే సరిపోతోంది? అన్నారు. దాంతో కొందరు రైతులు కంగారు ప డ్డారు. కొందరు సరే అన్నారు. అయితే ఇంతా చేస్తే కొద్ది మంది రైతులు ఒప్పుకుంటే మనకేం లాభమనుకున్నారో…ఏమో? దళారులు..అందరు రైతులు ఒప్పుకునేలా చేయాలని అనుకున్నారు. రైతులందరినీ ఒప్పించాలని దళారులు చూశారు. కాని కుదర లేదు. దాంతో నయానో, భయానో అయినా సరే రైతులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. అయినా కొంత మంది దళితులు ససేమిరా? అన్నారు. తమ వద్దకు వచ్చిన అపరిత వ్యక్తులు చెబుతున్న విషయాలను రైలులోనే వున్న అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు రైతులతోపాటు వచ్చిన దళారులను నిలదీశారు. తెగించిన దళారులు పై స్ధాయి అధికారులతో సదరు అధికారులను బెదిరించడం మొదలుపెట్టారు. కాని సదరు అధికారి ప్రభుత్వ లక్ష్యాన్ని రైతులకు వారి జీవితాలలో మార్పుల గురించి విరవించారు. అయినా కొంత మంది అమాయక దళిత రైతులు దళారులనే నమ్మారు. వారి మాయ మాటలు విన్నారు. వారు ఏర్పాటు చేస్తామన్న సౌకర్యాలపై ఆసక్తి చూపారు. దళారులు చెప్పినట్లు విని వారితో మధురలో దిగారు. ఇంతటితో ఆగకుండా అదే రైతులతో దళారులు వీడియోలు సృష్టించి, అధికారులు తమకు సహకరించ లేదని, తమకు సదుపాయల కల్పన చేయలేదని నెపం అధికారుల మీద నేట్టేసే ప్రయత్నరం చేశారు. అక్కడున్న రైతులు ఆ వీడియోలు చూసి, అది వాస్తవం కాదంటూ నేటిధాత్రికి వివరాలు అందించారు. కొందరు రైతులు తమ ఎమ్మెల్యేలకు పిర్యాధు చేస్తామంటే కూడా దళారులు మేం ఏ ఎమ్మెల్యేలకు, మంత్రులకు భయపడం అంటూ రైతులను బెదించారని తెలుస్తోంది. దాంతో కొందరు రైతులు మరింత డైలామాలో పడినట్లు సమాచారం. దళారులకు తోడుగా మహారాష్ట్రలో కూడా కొంత మంది రౌడీలు ట్రైన్‌ ఎక్కినట్లు రైతులు చెబుతున్నారు. ఆ రైతులు ఇప్పుడు హార్యానా రాష్ట్రంలో మేలైన గేదెలను ఎంచుకుంటున్నారు.

దళారులతో వెళ్లిన రైతులు అధికారులతో లేకుండా, తోటి రైతులతో కాకుండా వేరే దగ్గర వున్నారని తెలుస్తోంది. ఇలా రైతులను మోసం చేస్తున్న వారిని ఇలాంటి సమయంలోనే గుర్తించి తగిన శాస్తి చేస్తే తప్ప మరోసారి ఇలాంటి తప్పులు జరిగే అవకాశం లేదు. వాళ్లంతా దళితులు..దళిత రైతులు. కొద్దో గొప్పో వున్న భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కూలీ నాలి చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటున్నారు. కానీ వారి జీవితాల్లో ఎదుగూ లేదు..బొదుగూ లేదు. శ్రమ దోపిడీ సమాజంలో వారి కూలీ గిట్టుబాటు కాక, సంపాదన సరిపోక అవస్ధలు పడుతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశయం. ఇదే కొందరు బ్రోకర్ల పాలిట వరమౌంతోంది. అసలు ఇలాంటి పధకాలు అందాల్సిన వారికి పండగ కావాలి. వారి జీవితాలు పండాలి. వారి ఆకలి బాధలు తీరాలి. సమాజంలో వారికి గుర్తింపు రావాలి. ఆర్ధిక స్ధితిగుతుల్లో పెరుగుదల కనిపించాలి. ఆర్ధిక స్వాలంబన దిశగా దళితుల జీవితాల్లో వెలుగులు నిండాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. ఆచరణ. కాని క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో వివరంగా నేటిధాత్రి అందిస్తున్న ఆసక్తికరమైన నిజం..

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంత కాలానికి దళితుల జీవితాలలో మార్పులు తీసుకురావడానికి సాగులో పంటతోపాటు, పాడి జతైతే వారి జీవితంలో పాలు పోసినట్లే అనుకున్నారు. దాంతో వ్యవసాయ భూమి కలిగి వున్న దళితులకు స్వయం ఉపాధి కింద నాలుగు గేదెలు( బర్రెలు) అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. అమలులో బాగంగా కొన్ని మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేసింది. ఈ పధకం విసృతంగా అమలు జరిగింది. ఇంతలో కరోనా విస్తరించడంతో ఈ పథకం అమలులో కొందరికి జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ దళితులకు గేదెలను అందిచే కార్యక్రమం మొదలైంది. ఇదే ఇప్పుడు దళారుల పాలిట వరమైంది. అనాదిగా దళితులు దగా పడుతూనే వున్నారు. కాదు..కాదు దళితులను దగా చేస్తూనే వున్నారు. మొదటి సారి దేశంలోనే దళితుల సంక్షేమం కోసం తెలంగాణలో విప్లవాత్మకమైన పధకాలు అమలౌతున్నాయి. దళిత సమాజం మిగత వర్గాలతో సమానమైన ఆత్మగౌరవమే కాదు, ఆర్ధిక స్వాలంబలన సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేకంగా కొన్ని పధకాల రూపకల్పన చేశారు. వాటిని అమలు చేస్తున్నారు. కాని కొంత మంది అధికారుల మూలంగ ఆ పధకాల అమలుతో కొంత ఇబ్బంది జరుగుతోంది. వారి మూలంగా ఆ పథకాల అమలు పక్కదారి పట్టేందుకు దళారులు రంగంలోకి దిగుతున్నారు. అది కూడా పక్కరాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణ సంక్షేమంలో వేలు పెడుతున్నారు. దళితులను మోసం చేస్తున్నారు. ఆర్ధికంగా సుస్దిరపడాల్సిన సమయంలో మళ్లీ అస్ధిరతలో పడేస్తున్నారు. దళితుల సంక్షేమం కోసం అందుతున్న పధకాలలో దళారులు చేసి దోచుకుపోతున్నారు. గద్దల్లా వారికి అందిన వాటిని ఎత్తుకు పోతున్నారు. డబ్బు ఆశ చూపి, దళితుల జీవితాలతో కొంత మంది బ్రోకర్లు తెలంగాణ దళితుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారు. పధకాలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వలక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అయితే ఇక్కడే అసలు లొసుగు దాగి వుంది. పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చొని దళితుల జీవితాలను తీర్చిదిద్దేందుకు దోహపడాల్సిన అధికారులు దళితులకు అందిన సొమ్ముకు ఆశపడడంతోనే ఇదంతా జరుగుతోంది. దళితుల జీవితాలు దగా పడుతున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త.

`మాటిచ్చిన కేటిఆర్‌ మీదే ఆశలు మా మొరవినుమా!

`మంత్రి కేటిఆర్‌ కు 51 మంది వేడుకోలు.

` గతంలోనే కేటిఆర్‌ హామీ.

`కొందరు నేతలతో జాప్యం.

`ఆరేళ్లుగా ఎదురుచూపులు.

`ఆకలి, పస్తులతో కాలం గడుపుతున్నాం.

`వరంగల్‌ కమీషనర్‌ ఖాళీలున్నాయ్‌?…ఇస్తామంటున్నారు!

`కనికరించండి…కాపాడండి…కొలువులియ్యండి.

`మా బతులుల్లో వెలుగులు నింపండి.

`బుక్కెడు కోసం అలమటిస్తున్నాం…ఆదుకోండి.

`ప్లీజ్‌… మీరే దిక్కు!

`మా ఆవేదన ఆలకించండి.

`మాకొక దారి చూపండి.   

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కొలువులు కోల్పోయి ఏడేళ్లవుతోంది. ఇప్పుడూ, అప్పుడూ అంటూ ఆశలతో బతుకులీడుస్తున్నారు. కేవలం ఒకే ఒక్క మాటతో చిగురించిన ఆశలలో కాలం గడుపుతున్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆల్‌ మోస్ట్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట ఇచ్చినట్టే అన్న నమ్మకంతో మళ్లీ కొలువులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఎక్కడో సమాచార లోపం తప్ప, ఇక్కడ ఇటు ఉద్యోగుల కోరిక నెరవేడరం లేదు. వాళ్లు ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ శాఖలో పనిచేసిన చిన్న ఉద్యోగులు. అప్పట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పనిలో నిమగ్నమై పనిచేశారు. కాకపోతే అప్పట్లో ఆశాఖలో జరిగిన తప్పులకు ఈ చిన్న ఉద్యోగులు బలయ్యారు. ఆ శాఖలో అవినీతికి తెరలేపిన వాళ్లు మాత్రం బాగానే వున్నారు. దాంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ శాఖను ప్రభుత్వం తొలగించింది. దాంతో ఈ ఉద్యోగులు వీధిన పడ్డారు. అయితే మన ప్రభుత్వం ఎలాగైనా తమకు ఏదో ఒక దారి చూపుతుందన్న నమ్మకంతో ఇంత కాలం ఎదురుచూస్తూనే వున్నారు. పడిగాపులు కాస్తూనే వున్నారు. ఎప్పుడెప్పుడు అప్పాయింట్‌ మెంటు లెటర్లు వస్తాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. 

నిజానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేసిన ఈ ఉద్యోగులను తీసుకుంటామని వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ గతంలోనే తీర్మాణం చేసింది.. 

ఒకసారి కాదు. రెండుసార్లు కూడా తీర్మాణాలు చేయడం జరిగింది. అదే సమయంలో ఓసారి ఖమ్మం పర్యటనలో, మరోసారి వరంగల్‌ పర్యటనలో మంత్రి కేటిఆర్‌ ఈ ఉద్యోగులకు మాట ఇచ్చారు. తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అందుకు వరంగల్‌ జిల్లా అధికారులకు కూడా సూచన చేశారు. మీ భరోసాతో మాట ఇస్తున్నాను. వీళ్లకు న్యాయం చేయండి. అని మంత్రి కేటిఆర్‌ ఒకటికి రెండుసార్లు చెప్పారు. అప్పటి నుంచి వీరి ఆశలు మరింత పదిలమయ్యాయి. మంత్రి కేటిఆర్‌ మీద నమ్మకంతో రోజూ ఎదురుచూస్తూనే వున్నారు. ఇప్పటికీ ఆ ఉద్యోగులను తీసుకునేందుకు వరంగల్‌ జిల్లా నగరపాలక సంస్ధలో అవకాశం వుందని, ఖాళీలున్నట్లు కూడా సమాచారం. ఇదే విషయం కూడా పాలక వర్గం సుముఖంగానేవున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక్కసారి మంత్రి కేటిఆర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే చాలు అప్పాయింటు మెంటు లెటర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్దంగా వున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో మంత్రి కేటిఆర్‌ చెప్పినప్పుడే వీరికి ఉద్యోగాలు రావాల్సివుంది. కాని కొందరు నాయకులకు చేసిన చిన్న చిన్న పొరపాట్లు వారి జీవితాలకు శాపాలుగా మారాయి. అయినా మంచి రోజు కోసం వారు ఎదరుచూస్తున్నారు. అంతే కాదు తెలంగాణ ఉద్యమానికి ఆనాడు పూర్తి మద్దతిచ్చినవాళ్లు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మిన వాళ్లు. ప్రతిపక్షాలు వీళ్లతో రాజకీయం చేయాలిన చూసినా వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నా వాళ్లు. అయితే వీళ్లును రాజీకయంగా ఉపయోగించుకొని, ప్రభుత్వం మీద లేని పోని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయి. ఎందుకంటే వీళ్లు గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో క్రియాశీలకపాత్ర పోషించారు. దాంతో సమాజంలో వారితో వీరికి పరిచయాలు బాగానే వున్నాయి. రాజకీయంగా వీరిని ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు ఇప్పటికీ చూస్తున్నాయి. కాని వారు తమ జీవితాలను ఫణంగా పెట్టి ప్రభుత్వానికి తలనొప్పులు తేవొద్దన్న సదుద్దేశంతో ఇంత కాలం ఎదురుచూస్తున్నారు. వీరికి ఓ దారి చూపిస్తామని చెప్పిన మంత్రి దృష్టికి వీరి సమస్యలు నాయకులు తీసుకెళ్లకపోండంతోనే ఇంత కాలం జాప్యం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు ఇస్తామన్న కొలువులు ఇవ్వండి. మా జీవితాలను నిలబెట్టండి అని వారు కోరుతున్నారు.

కచ్చితంగా విజయం తధ్యం

 

కవిత పోరాటంలో అర్ధముంది

మహిళా హక్కుల ప్రశ్నలో ధైర్యముంది.

చేయని తప్పుపై తిరుగుబాటు శక్తి వుంది.

వాషింగ్‌ పౌడర్‌ నిర్మా కావడం కష్టం.

కవిత త్యాగాల చరిత్ర తెలియని బిజేపి.

సహజంగా ఏ కేసులోనైనా పోలీసులు రుజువులు చూపించాలి!

ఈడీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే తప్పులేదని నిరూపించుకోవాలి!

ఇదే బిజేపికి కలిసి వచ్చిన అంశం.

కవితను ఇబ్బందులకు పెట్టేందుకు ఎంచుకున్న పన్నాగం?

బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి బిజేపి ఎంచుకున్న మార్గం?

 కేసిఆర్‌ మనో ధైర్యం దెబ్బతీయాలనే బిజేపి లోక్ష్యం?

ఒకనాటి రాజకీయాలు వేరు… ఇప్పటి రాజకీయాలు వేరు. ఒకప్పటి ఎత్తులు వేరు..ఇప్పటి కుయుక్తులు వేరు.. ఎంతకైనా తెగించడమే నేటి రాజకీయాలు..ఎంత వేధింపులకైనా పెట్టింది పేరు ఇప్పటి రాజకీయాలు..అందుకే కల్లకుంట్ల కవిత లాంటి నాయకురాలని ఎలాగైనా బిజేపిలోకి తెచ్చుకోవాలి. అలాంటి నాయకురాలు బిజేపిలో లేరు. ఏ ఇతర పార్టీలలోనూ లేదు. అందుకే సమర్ధవంతమైన నాయకత్వ పటిమ వున్న నాయకురాలు కవిత. అలాంటి నాయకురాలు బిజేపిలో చేరాలన్నది బిజేపి పెద్దల ఆశ. నిజంగా రాజకీయాలు చేయాలనుకునేవారు..ఆదర్శవంతమైన రాజకీయాలు సాగించాలనుకునేవారు చేసే ఆలోచన కాదు. బిజేపి చేయాల్సిన ఆలోచన అసలే కాదు. ఎందుకంటే మాటకు ముందు దేశం..కోసం ధర్మం కోసం అని చెప్పే బిజేపి నాయకులు కవిత బిజేపిలోకి రావాలనుకోవడం ఏ ధర్మమో! చెప్పాలి? ఎందుకంటే ఆమె తెలంగాణ సాధకుడు, పరిపాలన దక్షుడు, సంక్షేమ సారధి, గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు, ప్రగతి రధసాధకుడు, తెలంగాణలో వెలుగులు ప్రసరించిన రాజనీతిజ్ఞడు,ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూతురు. ఆమె తొలుత రాజకీయాలలోకి రాలేదు. ఇది కవితను విమర్శించేవాళ్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. తెలంగాణ విముక్తి కోసం వచ్చారు. తెలంగాణ సాధనలో పనిచేశారు. పోరాటం చేయాలనే ఆరాటం అందరికీ వుంటుంది. కానీ పోరాటం చేసే శక్తి కొందరికే వుంటుంది. అలాంటి పోరాట యోధురాలు కవిత. తెలంగాణ సాధన కోసం, ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కీలక భూమిక పోషించారు. తెలంగాణ సాధనలో తనదైన పాత్ర పోషించారు. అందుకు ఆమె ఎంచుకున్న రూపాలు తెలంగాణ పాలిట వరాలు. ముందుగా ఆమె జాగృతి పేరిట తెలంగాణ సమాజంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పటికే ఎంతో నిస్తేజంగా వున్న తెలంగాణ యువ సమాజాన్ని తట్టి లేపేందుకు కృషి చేశారు. వారికి విద్యావకాశాలు పెరిగేందుకు దోహదం చేశారు. విద్యాపరంగా తెలంగాణ సమాజానికి దిశా, దశ చూపించారు. సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. సమాజ సేవకు అంకితమయ్యారు. యువతను తీర్చిదిద్దే యజ్ఞం మొదలుపెట్టారు. జాగృతి ఏర్పాటు చేసి, తెలంగాణ పల్లెలో సాంకేతిక విద్యపై యువతకు అవగాహన పెంచే కార్యక్రమం మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు తెలంగాణ యువతలో చదువుకోవాలని వున్నా, చదివించుకునే స్తోమత లేక, చదువకునే అవకాశాలు లేక, కుటుంబాలు గడవక విద్యను మధ్యలోనే వదిలేసే వాళ్లు చాలా మంది వుండేవారు. వారికి చదువు విలువ తెలిసేలా చేసి, చదవుకు దగ్గరగా చేసే గొప్ప కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా యువతకు సరైన మార్గాలు వేశారు. ఆ తర్వాత అదే జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మతో సాంస్కృతికపునరుజ్జీవం కల్పించారు. తెలంగాణలో కూడా బతుకమ్మ పండుగను మర్చిపోయే దశకు చేరుకుంటున్న తరుణమది. తెలంగాణ పల్లెలో పచ్చదనం కరువైపోయి, కరువు తాండవిస్తున్న దశలో బతుకు జీవుడా అని జనం ఊర్లను వదిలి పట్నాల వెంట కన్నీళ్లతో కదలి, కూలీనాలి చేసుకునేవారు. అయినా బతుకమ్మ పండగ సమయంలో ఊరు చేరుకునేవారు. కాని నిరంతర కరువు కాటకాలు వారిని ఊరికి దూరం చేశాయి.

పండుగలను లేకుండా చేశాయి. ఇదే సమయంలో కవిత తెలంగాణ ఉద్యమానికి అంతరించి పోతున్న కళారూపాలలో, ప్రకృతి ఆరాధనను మళ్లీ జనంలోకి తెచ్చారు. తెలంగాణ బతుకమ్మను ఉద్యమ రూపాన్ని చేశారు. తెలంగాణ బతుకమ్మగా కవిత కీర్తిపొందారు. అంతటి కవితను ఎలాగైనా బిజేపిలోకి లాగేసుకోవాలి. లేకుంటే రాజకీయంగా అణచివేయాలని బిజేపి తలచిందనేది ప్రధానంగా వినిపిస్తున్నదే. 

                        ఒకనాడు జాగృతి, తర్వాత తెలంగాణ ఉద్యమం, బతుకమ్మ స్వరూపం..ఆ తర్వాత తెలంగాణ ప్రగతి. ఇప్పుడు జనజాగృతి , మహిళా సాధికారిత, హక్కుల కోసం ఆమె పోరాటం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమెను సిబిఐ ఎందుకు విచారించిందో తెలియదు. తర్వాత ఎందుకు ఈడీ ఎంటరైందో ఎవరికీ తెలియదు. డిల్లీలో జరిగిన లిక్కర్‌ దందా గురించి వివరాల సేకరణ కోసం మాత్రమే కవిత వాంగూలం కావాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పటికీ ఇంతే…కాని ఈ విషయాన్ని చిలువలు పలువలు చేసి, రాజకీయంగా బిజేపి మైలేజీ పొందాలని చూసింది. కాని డామిట్‌ కధ అడ్డం తిరిగింది. ఈడి వివరాలు బైట పెట్టిందో…లేక బిజేపి కట్టుకథలు అల్లిందో గాని రాజకీయంగా కవితను బరింత బలోపేతం చేశారనే చెప్పాలి. అంతా లెక్క తేల్చినా వందకోట్ల దగ్గరే అటుతిరిగి, ఇటుతిరిగి విచారణ చక్కర్లు కొడుతోంది. దేశాన్ని ముంచి వేల కోట్లు దోచుకొని దేశాలు దాటి వెళ్తున్న వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు లక్షల కోట్లు మాఫీలు చేస్తున్నారు. ఎంతో మంది వ్యాపార వేత్తలు బ్యాంకులను ముంచేస్తున్నారు. అప్పులు ఎగ్గొడుతున్నారు. వారి రుణాలు బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి. కాని కవిత విషయంలో ఈడీ ఎంటరైంది. లేని లెక్కలు ముందేసుకొని మందు గురించి లెక్కల వివరాలు సేకరిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఒక మహిళగా తన హక్కుల సాధన కవితకు ఎంతో ముఖ్యం. మాజీ పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత శాసన మండలి సభ్యురాలికే ఈడీ విషయంలో వేధింపులు వుంటే, సామాన్య మహిళల పట్ల ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈడీకి చేసిన చట్టాలేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. కోర్టుకోర్టుకూ ఓ తీర్పు అని అదేదో సినిమాలో అన్నట్లు, విచారణ సంస్ధలకు వేర్వేరు చట్టాలు..ఏమిటో? సహజంగా సిఆర్‌పి చట్టాలు మహిళల విషయంలో కొన్ని మినహాయింపులు వున్నాయి. కాని ఈడీలో అవేవీ లేవని మహిళా హక్కులను కాలరాసే చట్టాలు కూడా మన సమాజానికి ఇబ్బందికరమే…అందుకే కవిత చేస్తున్న పోరాటం అందరిలోనూ స్పూర్తిని రగిలిస్తోంది. ఈ విషయంలో కూడా కవిత చరిత్రలో నిలిచిపోనున్నది. ఇప్పటికే చెప్పుకునే అనేక కేసులను పరిగణలోకి తీసుకొని తీర్పులు వెలువడినట్లే, భవిష్యతుల్లో కవిత చేసే పోరాటం కూడా అనేక సందర్భాలలో కూడా గుర్తు చేసుకునే అవకాశం వుంది. అందుకే డిల్లీ మద్యం విషయంలోనే కాదు, ఈడీపై కవిత అభ్యంతరాలన్నింటిలో కవిత కచ్చితంగా విజయం తధ్యమనే అంటున్నారు.

చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ ఢిల్లీలో ఆందోళన

జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీలు రవిచంద్ర,లింగయ్య యాదవ్,రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్

చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, నాయకులు, ఓబీసీలు ఆందోళనకు దిగారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీలు రవిచంద్ర, లింగయ్యలు మాట్లాడుతూ,లోకసభ, రాజ్యసభ,శాసనసభ,మండలి ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ జనాభాలో వెనుకబడిన కులాలకు చెందిన వారు సుమారు 60శాతం మంది ఉన్నారని,అయితే చట్టసభలలో వీరి ప్రాతినిథ్యం మాత్రం చాలా తక్కువగా ఉండడం శోచనీయమన్నారు.రాజ్యాధికారంలో అన్ని కులాల వారికి సముచిత ప్రాధాన్యత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు.చట్టసభలలో ఓబీసీలు,మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలనే న్యాయమైన డిమాండ్స్ కు

 బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.అలాగే, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని,ఉద్యోగులకు పదోన్నతులలో, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని ఎంపీలు రవిచంద్ర, లింగయ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభను స్తంభింపజేసిన బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు

రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఉపసంహరించాలంటూ కాంగ్రెసు సహా విపక్షాలు డిమాండ్

మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు.తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది.దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,తన సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి,కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్యలతో కలిసి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఆందోళనలో పాల్గొన్నారు.లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు మాలోతు కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి,బీ.బీ.పాటిల్,పీ. రాములు తదితరులు మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై చర్చకు పట్టుబట్టారు.అలాగే, రాహుల్ గాంధీపై అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని కోరుతూ కాంగ్రెస్ తదితర పక్షాలు ఆందోళనకు దిగడంతో అధికార పక్షం ససేమిరా అంటూ ఉభయ సభలను మధ్యాహ్నాం 2గంటలకు వాయిదా వేసింది.

రద్దుతో సానుభూతి! రాజకీయంగా మైలేజీ!!

 

` దేశ వ్యాప్తంగా రాహుల్‌ కు పెరిగిన మద్దతు.

` ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి…

` ఎమర్జెన్సీ తర్వాత పరిస్థితులు పునరావృతం కానున్నాయా?

` ప్రతిపక్షాలు అన్నీ ఏకమై బిజేపితో పోరాటం చేయనున్నాయా?

` మేధావులు సైతం రాహుల్‌ సస్పెన్షన్‌ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

`బిజేపి సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నదా?

` ఒక్కసారిగా రాహుల్‌ ఇమేజ్‌ పెరిగిందా?

`పప్పు అన్న వాళ్లకు నిప్పుగా తోస్తోందా?

`భారత్‌ జోడో యాత్ర రాహుల్‌ నాయకత్వ పటిమ పెరిగిందా?

` ఇటీవల లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగాలలో పదునుపెరిగిందా?

` అందుకే బిజేపి భయపడుతోందా?

` రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామికం.

` బిజేపి మాకేం సంబంధం అంటే ప్రజలు అమాయకులు కాదు.

` రాజకీయ ఆరోపణలపై కక్షలు సమంజసం కాదు.

` అలా అయితే చట్ట సభల్లో ఎవరూ వుండరు?

`రాహుల్‌ విషయంలో నేరపూరిత నిరూపణకు ఆస్కారం లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 అది త్యాగాల కుటుంబం. ప్రాణాలను సైతం లెక్క చేయని కుటుంబం. ఇద్దరు నేతలను కోల్పోయిన కుటుంబం. అయినా దేశం కోసం వారి ఆరాటంలో మార్పు రాలేదు. పోరాటంలో వెరవలేదు. ఆపలేదు. ప్రజల గుండెల్లో నిలిచింది ఆ కుటుంబం. ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని ప్రయాణం ఆపలేదు. ఆపదలున్నాయని తెలుసు. పసి వయసులోనే నానమ్మను కోల్పోయి, జీవితం అంటే ఏమిటో అర్ధం కాని దశలోనే నాన్నను కోల్పోయి, జీవితం అంధకారమైనా, దేశమే కుటుంబంగా బతికిన కుటుంబం. ఎప్పుడు ఏమౌతుందో అన్న భయం వెంటాడుతున్న వెవరని కుటుంబం. భాదలున్నాయి. బరువు బాద్యతలున్నాయి. అయినా అది తెగింపును నింపుకున్న రక్తం. ధైర్యాన్ని నిండుగా నింపుకున్న జాతి ప్రవాహం. భయాన్ని దరి చేరనివ్వని ధీటైన మనసు..పోరాటంలో అలసిపోయినట్లు చరిత్ర లేదు. అపజయాలకు కుంగిన క్షణం లేదు. స్వాతంత్య్రం కోసం పోరాటంలో ఆ కుటుంబమంతా ముందుండి నడిచి గొప్పచరిత్రకు నిదర్శనం. అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్‌ గాంధీని వేధించడం అంటే తమ రాజకీయ చరిత్రను తామే సమాధి చేసుకుంటున్నట్లే. 

  చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 

ఇది గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులపై వున్న కేసులలో ఎక్కడా పురోగతి లేకపోయినా, కేవలం రాహుల్‌ గాంధీ కేసు మాత్రమే ఎందుకు తెరమీదకు వచ్చిందన్నదానిపై దేశంలో విపరీతమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాజకీయ నాయకులు ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాల్సిందే..అవినీతి చేసిన వారిని తొలగించాల్సిందే..ఇంతవరకు బాగానే వుంది. కాని రాజకీయంగా చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని, పరువునష్టం దావాలో కూడా జైలు శిక్ష పడడం, దానిని ఆసరగా చేసుకొని రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం పెద్ద దుమారైపోయింది. దేశ వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి మూలాల్లోకి వెళ్లే వాయినాడ్‌ ఎంపి రాహుల్‌ గాందీ మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెక్షన్‌ 8(3) కింద లోక్‌సభ సెక్రెటరియేట్‌ అనర్హత వేటువేసింది. ఈ చట్టం ప్రకారం రాజకీయ నాయకులు దోషులుగా తేలితే వేటు పడుతుంది. కాని రాహుల్‌ విషయంలో ఆ చట్టం అమలు సమంజసం కాదన్నది కాంగ్రెస్‌ పార్టీ వాదన. న్యాయ నిపుణుల సూచన కూడా…నేరాల స్వభావం..తీవ్రతను బట్టి ఆ చట్టం అమలు చేయాలి. కాని వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన ఆర్టికల్‌ 14కు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ అనర్హత వేటు వుందన్నది నిపుణులు చెబుతున్న మాట. సహజ న్యాయ సూత్రాల అమలులో లోక్‌సభ సెక్రెటరియేట్‌ స్పందన న్యాయ సమ్మతం కాదన్నది కాంగ్రెస్‌ ఫార్టీ శ్రేణుల వాదన. నిజానికి రాహుల్‌గాంధీ చేసిన రాజకీయ ప్రసంగంలో దొర్లిన తప్పు తీవ్రమైన నేరం కాకపోవచ్చు. అందుకే ఆయన పడిన వేటు నాయకత్వం రాటు దేలేందుకు ఉపయోగపడుతుందని కొందరి అంచనా. ఎందుకంటే గతంలోనూ ఇందిరా గాంధీ కూడా ఇలాగే చిక్‌మంగళూర్‌ నుంచి గెలిచిన తర్వాత అనర్హత వేటును ఎదుర్కొన్నారు. తర్వాత ఆమె తిరుగులేని నాయకురాలుగా చరిత్రకెక్కారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ కూడా భవిష్యత్‌ దేశ నాయకుడుగా మారుతాడన్నది కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్న మాట. 

  రాహుల్‌ గాంధీ సభ్యత్వం రద్దు అన్నది ఒక రకంగా ఆయనకు ఊహించని రాజకీయ భవిష్యత్తుకు మార్గం వేస్తుందన్నది చాలా మంది చెప్పుకుంటున్న మాట. 

రాజకీయంగా ఆయనకు ఎంతో మైలేజీ తెచ్చిపెట్టేదే. ఎందుకంటే ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రజల కోసం ప్రశ్నిస్తూనే వుంటానని పునరుద్ఘాటించారు. దాంతో ఆయనకు దేశంలో మరింత మద్దతు పెరిగిందని అంటున్నారు. ఇదిలా వుంటే దేశంలోని అన్ని ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు దొరికింది. ఇంత కాలం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే తరుణం ఎలా వస్తుందని ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి సందర్భంగా మారింది. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో పాకిస్తాన్‌ను ఓడిరచి, ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మహిళగా గుర్తింపు పొందిన ఇందిరకు అప్పటి పార్టీ శ్రేణులు, ప్రపంచ దేశాల పొగడ్తలు ఆమెలో ఒక నియంతను నిద్రలేపాయి. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నంత ప్రచారం చవిచూసింది. దాంతో ప్రతిపక్షాల చేసే విమర్శలు ఆమెకు చిరాకును తెచ్చాయి. ఈ సమయంలో తన రాజకీయ జీవితానికి ఎవరూ ఎదురు రాకుండా చూసుకోవాలని, దేశంలో ఎమర్జెనీ ప్రకటించింది. అభాసుపాలైంది. ఆ సమయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై, జైలు జీవితం గడుపుతున్న వారు సైతం గెలిచి, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూలదోశారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ఇందిరా గాంధీ మారిన మనిషిగా పేదల కోసం గరీభీ హటావో వంటి పధకాలను అమలు చేసి మెప్పు పొందారు. అమ్మగా కీర్తించబడ్డారు. ఇప్పుడు కూడా రాహుల్‌ గాంధీకి మద్దతుగా ఏకమైన ప్రతి పక్షాలు మళ్లీ చరిత్రను తిరగరాస్తాయని చెప్పొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

     నిజానికి ఈ విషయంలో బిజేపి సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నదని అర్ధమౌతోంది.

 ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక, రాహుల్‌ గాంధీ లాంటి నాయకులను కట్టడి చేయాలన్న ఆలోచనతో కోర్టు తీర్పును అనుసరించి వెంటనే వేటు వేయడం రాహుల్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజేపి నేతలు మాజీ ఎంపి. రేణుకా చౌదరిని షూర్పనక అంటూ గేలి చేసిన సందర్భాలున్నాయి. అలా ప్రతి రాజకీయ విమర్శను కూడా పరిగణలోకి తీసుకుంటూ, వేదించాలని చూస్తూ పోతే చట్ట సభల్లో ఎవరూ మిగలరు. అందరూ ఏదో ఒక వివాదంలో లేకుండా వుండరు. అందరూ జైలు బాట పట్టాల్సిందే అనడంలో సందేహం లేదు. నిన్నటిదాకా పప్పు పప్పు అంటూ ఎగతాళి చేసిన వాళ్లే ఇటీవల కాలంలో రాహుల్‌ గాంధీ వాడుతున్న పదునైన పదజాలం బిజేపికి ఇబ్బంది కరంగా మారింది. పైగా ఆదాని విషయంలో రాహుల్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం, దాట వేయడం వంటివి దేశ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇది బిజేపి నేతలకు బాగా అర్ధమైంది. అందుకే రాహుల్‌ గాందీకి వాయిస్‌ లేకుండా చేస్తే సరిపోతుందనుకున్నారు. కాని దేశంలో ఏ జాతీయ నాయకుడు చేయని సాహసాలు రాహుల్‌ గాందీ చేస్తున్నాడు. ఇప్పటికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ దాకా భారత్‌ జోడో యాత్ర పూర్తి చేశారు. మరో విడత పాదయాత్రకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమయంలో ఆయన సభ్యత్వం రద్దు కావడం మరింత కలిసొచ్చే అంశమే అవుతుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రజా స్వామ్యంలో చోటు లేదు. రాజకీయ అరోపణలకు క్షక్షలు సమాధానం కాదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version