సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు మంత్రి హరీశ్ రావు భరోసా.యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి హరీశ్ స్పష్టమైన ఆదేశం.
క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పరిశీలనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
-షర్మిల మాత్రం దౌర్జన్యంతో రాజకీయం చేయాలనుకుంటున్నారు?
-విధి నిర్వహణలో వున్న పోలీసులను దుర్భాషలాడడం ఏ రాజకీయం?
-ప్రభుత్వ నిర్బంధం తప్పించుకోవడానికి మార్గాలు అనేకం వున్నాయి?
-ఉద్యమాల గడ్డ తెలంగాణలో అతి తెలివితేటలకు తావులేదు?
-తెలంగాణ ప్రశాంతంగా వుంది.
-లేని రాజకీయ అలజడి రేపకండి!
-జనం నమ్మడం లేదని షర్మిలకుఎప్పుడో అర్థమైంది?
-ప్రచారం చేసి, ఓట్లేసి, గెలిపించిన ఆంధ్ర ప్రదేశ్ ఎందుకు వదిలేసినట్లు?
-అత్యాశకు కూడా హద్దుండాలి
-తెలంగాణలో రాజన్నకు తావులేదు? వారి వారసుల రాజకీయాలు ఎవరూ కోరుకోవడం లేదు?
-తెలంగాణ వ్యతిరేకి షర్మిలకు రాజకీయం చేసే నైతికత లేదు?
హైదరబాద్,నేటిధాత్రి:
పాలివాడు,పాలి వాడు పంచాయితీ పెట్టుకుంటుంటే పక్కింటి వాడు పండగ చేసుకున్నాడట. షర్మిల వ్యవహారం అలావుంది. తెలంగాణ నేతల్లో, రాజకీయ పార్టీలలో బేధాభిప్రాయాలే తప్ప, కోపతాపాలు వుండదు. తెలంగాణ కోసం కొట్లాడిన వారందరిలో ఒక విజన్ వుంటుంది. విజన్ ప్రకారం వెల్లడం లేదన్న అసంతృప్తితో కొందరు తెలంగాణ వాదుల సూచనలే ఆరోపణలు. వాటిని తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకోలేం. తెలంగాణ సమాజం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురౌతుందని పగటి కలలు కని షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినట్లుంది. అదేదో సినిమాలో అన్నట్లు ఆక్రమించుకోవడం ఇష్టం, దోచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం అనే రాజకీయాలు తెలంగాణలో చేస్తానంటే కుదరదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ. ఈ గడ్డ మీద కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలు పన్నిన వారు ఎవరూ చరిత్రలో స్ధానం సంపాదించుకోలేదు. తెలంగాణ సమాజం ముందు దోషులుగానే మిగిలిపోయారు. ఆఖరుకు షర్మిల తండ్రిగారైనా వైఎస్. రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణ పచ్చి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడు ఆయన గౌరవించలేదు. తెలంగాణ వాదులను నమ్మలేదు. అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించాడు. తెలంగాణ ఉద్యమమే లేదని అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు ఇచ్చాడు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను గుప్పెట్లో పెట్టుకున్నాడు. అయితే బెదిరింపులు, లేకుంటే కాంట్రాక్టుల పేరుతో బతుకు జీవుడా అని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా భయపడుతూ బతికేలా చేశాడు. ఇది అప్పటి నేతలు ఇప్పటికీ చెప్పుకునే మాట. అలాంటి తెలంగాణలో రాజకీయం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అహంకారం పనికిరాదు. ఆవేశం అక్కర్లేదు. ఆలోచన వుండాలి. ప్రజలకు సేవ చేయాలన్న తలంపు వుండాలి. అంతే కాని పదవుల కోసమే వచ్చా, వచ్చేసారి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పడమంటేనే షర్మిల రాజకీయ పరిణతి ఎంతో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా తెలంగాణ పోలీసులతో షర్మిల వ్యవహరించిన తీరు ఆక్షేపనీయం. ఎవరూ సమర్ధించరు. తెలంగాణవాదులెవరూ స్వాగతించరు. ఏ ప్రభుత్వమైనా శాంతి భద్రతల నేపధ్యంలో సమాజంలో అలజడి వుండకూడదని కోరుకోవడం సహజం. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకులు చేసిన దాష్టికాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు కనీసం హౌజ్ అరెస్టు చేస్తున్నారు. కాని తెలంగాణ ఉద్యమంలో ఏకంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి రెండు మూడు రోజులు వుంచుకునేవారు. ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారు. ఉద్యమ కార్యాచరణకు ముందే బైండోవర్ల పేరుతో యువతను తీసుకెళ్లి పోలీసు స్టేషన్ల చుట్టూ తింపి, ఉద్యమంలో లేకుండాచేసేశారు. ఎంతో మంది తెలంగాణ నాయకులను కూడా చిత్రహింసలకు గురి చేసిన సందర్భం వుంది. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడని ఎంపి. రఘురామా కృష్ణం రాజుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఓ డాక్టర్ ప్రభుత్వం మాస్కులు అందించడం లేదంటే నడి రోడ్డు మీద ఆయనను ఏం చేశారో ప్రజలే గమనించారు. అలాంటి పరిస్ధితులు ఆంధ్రాలో వుంటే…ఇక్కడ షర్మిల చిలకపలుకులు పలకడాన్ని ఎవరూ క్షమించరు. తెలంగాణ వాదులంతా మిలియన్ మార్చుకు పిలుపినిస్తే, ఎవరూ హైదరాబాద్‌కు రాకుండా పోలీసులు అడ్డుకుంటే తప్పించుకొని వచ్చి, హుస్సేన్ సాగర్‌లో పడవలపై మంత్రి హరీష్‌రావు లాంటి వారు ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అదీ నాయకుల లక్షణం. ఉద్యమ కార్యాచరణపై వున్న చిత్తశుద్దికి నిదర్శనం. నాడు పోలీసులు ఎంతో మంది నాయకులను ఎత్తి జీపుల్లో పడేసేవారు. జీపులపై నుంచి తోసేసేవారు. ఎంతో మంది మహిళా నాయకులనుకూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసేవారు. అయినా ఎక్కడా ఏ ఒక్క ఉద్యమ కారులు పోలీసులపై తిరగబడ్డ సన్నివేశం లేదు. సందర్భం అసలే లేదు. మరి షర్మిల ఏకంగా మహిళా పోలీసుపై చేయిచేసుకోవడం, ఎస్సైపై చేయి చేసుకోవడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను గాడిదలు కాసుకోండ్రి అని మాట్లాడడం అహాంకారానికి నిదర్శనమే కాదు.
నేరం కూడా…విధి నిర్వహనలో వున్న పోలీసులను అడ్డుకోడం తప్పని కూడా షర్మిలకు తెలియదా? పైగా వాహనం షర్మిల వెళ్తున్న సందర్భంలో పోలీసులు కారును అడ్డగిస్తే, తొక్కు, తొక్కు అంటూ డ్రైవర్‌ను బెదిరించడం, ఏకంగా గేర్ మార్చడం అహంబావానికి నిదర్శనం. ఒక రకంగా హింసను ప్రేరేపించే లక్షణం. అలాంటి ఆవేపరులకు రాజకీయాల్లో తావు లేదు. వాళ్లు ప్రజా సేవ చేస్తారంటే జనం కూడా నమ్మరు. ఇదిలా వుంటే షర్మిలను అరెస్టు చేశారని తెలిసి విజయమ్మ పోలీసు స్టేషన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆమెను అడ్డుకున్న మహిళా పోలీసులపై విజయమ్మ కూడా చేయి చేసుకున్నారు. రాజకీయాల్లో వున్నవారికి ఎంత ఓర్పు, సహనం వుండాలి. గతంలో ఐదేళ్లు ఆమె భర్త రాజశేఖరరెడ్డి అధికారం చెలాయించాడు. ఇప్పుడు ఆమె కొడుకు జగన్మోషన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వున్నారు. రాజకీయ నాయకులను అరెస్టు చేయడం పెద్ద విషయమేమీ కాదు. సర్వ సాదారణమే అన్న సంగతి తెలిసి కూడా కావాలని రాజకీయం చేయడం కాకపోతే మరేమిటి? హైప్ క్రియేట్ చేసుకుంటే మైలేజీ వస్తుందన్న దుర్బిద్ది రాజకీయం అంత సమ్మతం కాదు. అయినా తెలంగాణలో వుంటూ తెలంగాణ పోలీసులన దుర్భాషలాడడం, చేయి చేయిచేసుకోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే? తెలంగాణ పోలీసులంతా తెలంగాణ ఉద్యమకారులే. తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వచ్చిన వారే..అలాంటి తెలంగాణ పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన షర్మిల ఖచ్చితంగా తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పాలిందే..అన్నది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న డిమాండ్.
ఇక షర్మిలది, ఆమె తల్లి విజయమ్మది వింత రాజకీయం.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేశారు. అన్న కోసం చెల్లె, కొడుకు కోసం తల్లి ప్రచారం చేశారు. ఓట్లేశారు. గెలిపించుకున్నారు. తెలంగాణలో ఓటు హక్కు వారికి లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి అక్కడి ప్రజలకు ఇచ్చిన హమీల అమలుకు కృషి చేయాలిన బాధ్యతను గాలికి వదిలేసి, తెలంగాణ రాజకీయాల్లో ఏదో పొడిచేద్దామని వచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కే…కాదని ఎవరూ అనడం లేదు. అన్ని రాష్ట్రాలు వేరు. తెలంగాణ వేరు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు చెప్పుకున్న తెలుగువారి ఆత్మగౌరవం, తెలంగాణ విషయంలో కనిపించడం లేదా? తెలంగాణ కూడా ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్నదే అన్న సంగతి షర్మిలకు తెలియందా? అయినా తెలంగాణలో వైఎస్ కుటుంబానికి తావు లేదని ఉద్యమ కాలమే నిరూపించింది. మానుకోట జగన్మోహనరెడ్డిని రాళ్లతో తరిమింది. ఇంతకన్నా చరిత్ర సాక్ష్యం ఏముంటుంది? అవన్నీ షర్మిల మర్చిపోయి, స్వార్ధపూతిర రాజకీయ ముసుగేసుకొని వస్తే తెలంగాణ సమాజం నమ్ముతుందా? ఇప్పటికైనా షర్మిల చిల్లర రాజకీయాలు మానుకోవాలని తెలంగాణ వాదులంతా ముక్తకంఠంతో సూచిస్తున్నారు. తెలంగాణతో వున్న కొంత మంది శకునిపాత్ర పోషిస్తున్నవారు, శల్య సారధ్యం చేస్తూ, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అందుకు కారణం వారికి పదవుల అందలేదనో , లేక గుర్తింపు రావడం లేదనో అసంతృప్తితో వున్న వాళ్లే..తప్ప నిజంగా వాళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లు కాదు. వాళ్లను నమ్ముకొని తెలంగాణలో రాజకీయం చేయడమంటే గుడ్దెద్దు చేలో పడ్డట్టే..అంటే అర్ధమైట్టే అనుకుంటున్నాం! ఎద్దుగుడ్డిది కదా? అని చేలు మేస్తుంటే ఏ రైతు ఊరుకోడు…అలాగే తెలంగాణలో వుంటూ తెలంగాణపై విషపూరితకుట్రలకు తెరతీస్తే తెలంగాణ వాదులు కూడా ఊరుకోకపోవచ్చు…ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజలను కడుపులో పెట్టుకొమ్మని వేడుకోవాలే గాని, తెలంగాణ పోలీసులకు గాడిదలను కాయమంటే స్వాగతించరు. తాజాగా షర్మిలను పొలిమేర దాకా తరమాలని కూడా కొంత మంది తెలంగాణ వాదులు కూడా డిమాండ్లు చేస్తున్నారు..అది కూడా ఒకసారి తెలుసుకుంటే చాలా మంచిది.
`అవకాశవాదులకు బిఆర్‌ఎస్ లో చోటు లేదంటున్న ‘‘రవిచంద్ర తో ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు’’ ముఖాముఖి.
-ఖమ్మంలో బిఆర్‌ఎస్ తప్ప మరో పార్టీకి తావులేదు.
-ఆ పార్టీలకు లీడర్ లేడు.
-క్యాడర్ అసలే లేదు.
-పొంగులేటి పొంకనాలు ప్రచారం కోసమే?
-ప్రజల గుండెల్లో వున్నది కేసిఆరే
-ఉమ్మడి ఖమ్మం కళకళలాడుతుందంటే కారణం కేసిఆరే.
-తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు?
-పొంగులేటిని నమ్మకనే ఏ పార్టీ ముందుకు రావడం లేదు?
-అసలు పొంగులేటి జనం నాయకుడు కాదు?
-జనంలో వున్నది లేదు?
-బలం, బలగం వున్నది ఒక్క బిఆర్‌ఎస్ కే
-పొంగులేటి రాజకీయం అడవికాచిన వెన్నెలే?
-పొంగులేటి తొందరపాటు తప్పటడుగు?
-పొంగులేటి మాటలు నమ్మి ఆయన వెంట నడిచేవారే లేరు?
-బిఆర్‌ఎస్ కు ఎదురులేదు
– కారుకు తిరుగులేదు.
హైదరబాద్,నేటిధాత్రి:
ఏమీ చేయని వాళ్లకు ఏతులెక్కువ..చెల్లని కాసుకు గీతలెక్కువ అని సామెత. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్‌ర్‌రెడ్డి రాజకీయం అచ్చంగా అలాగే వుంది. నిజానికి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్ చేరడం మూలంగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో పలుకుబడి పెరిగింది. కాని ఆయన బిఆర్‌ఎస్‌కు చేసిందేమీ లేదు? ఉద్దరించింది అంతకన్నా లేదు. ఏడాది కాలంగా సాగిస్తున్న బ్లాక్ మొయిల్ రాజకీయాలకు కొదువలేదు. రెండేళ్ల నుంచి నన్ను గుర్తించండి? నన్ను చూసుకోండి? నాకేదైనా పదవి ఇవ్వండన్న రాజకీయాలు తప్ప, నేపు పార్టీకి సేవ చేస్తాను. పార్టీకి బలం చేకూర్చే పనులు చేస్తాను. సామాజిక సేవ చేస్తానని చెప్పింది లేదు. చేసింది లేదు. పదవుల గోల తప్ప మరొకటి లేదు. కాని గొప్పలు చెప్పుకోవడంలో పొంగులేటి ఆరితేరాడు. రెండేళ్లుగా గోడ మీది పిల్లి వాటం రాజకీయాలు చేస్తూ, అదిగో పులి, ఇదిగో తోక అన్నట్లు నేను వెళ్తున్నా…నేను వెళ్తున్నా.. సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సభల మీద సభలు పెట్టి సాధించిందేమిటి? ఇంత కాలమైనా ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ఏ పార్టీలో చేరితే ఏం లాభం చేకూరుతుందన్న ఆలోచన తప్ప, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఏ పార్టీ అయినా ఒక్కటే. కాని పొంగులేటికి పదవులమీద ఆశ తప్ప, పరపతి మీద యావ తప్ప మరొకటి లేదు. అందుకే బిఆర్‌ఎస్‌లోవున్నా, ఎక్కడున్నా రాజకీయం శూన్యమే. అసలే చేతకాని స్ధితిలో వున్న ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజేపిలకు బిఆర్‌ఎస్ నుంచి ఎవరు వచ్చిన కళ్లకు అద్దుకోవడానికి, దొడ్లో కట్టేసుకోవడానికి తప్ప మరెందుకు ఉపయోగం వుండదు. అందులో చేరేవారికి ప్రాధాన్యత వుండదు. అసలు విలువే వుండదు. కాకపోతే ఎట్లాడు ఎదురుచూసే ప్రతిపక్షాలున్నాయన్న ఆలోచనతోతలకు మించిన భారమైనా మోస్తానని లేనిపోనివి పొంగులేటి చెబుతుండడంతో ప్రతిపక్షాలు నమ్ముతున్నట్లు నటిస్తున్నాయి. ఎందుకంటే పొంగులేటి బేరసారాలు అందరూ చూస్తున్నదే. అటు బిజేపితో మంతనాలు, ఇటు కాంగ్రెస్‌తో సంప్రదింపులు చేస్తూ రెంటికి చెడ్డ రేవడి కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జోస్యం చెబుతున్నారు. పొంగులేటి అత్యాశ రాజకీయాలను ఎండగడుతున్నారు. నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో వద్దిరాజు మాట్లాడుతూ పొంగులేటి రాజకీయం అంతా కపట నాటమని అన్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
ఖమ్మం జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్ధానాలు గెలిచేది బిఆర్‌స్సే.
ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చి, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రజలు మరోసారి బ్రహ్మరధం పట్టనున్నారు. ప్రతిపక్ష నియోజకవర్గాలను సైతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, దళిత బంధు లాంటి పధకాన్ని ఉమ్మడి ఖమ్మంలో అమలు చేశారు. ఖమ్మం జిల్లా విషయంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి ఎంతో సానుకూత చూపిస్తూ వస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. ఖమ్మం జిల్లాలో అటు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం, ఇటు చెరువుల మరమ్మత్తులతో జలసిరులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. అలాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది. ఖమ్మం ప్రగతికి బాటలు పడిరది. తెలంగాణలో ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఖమ్మంకు ప్రత్యేక స్ధానమిస్తూ, ప్రోత్సహిస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తున్నారు. గతంలో ఖమ్మం ప్రజల ఆలోచనలకు, ఇప్పటి ఆలోచనలకు చాల తేడా వుందని, తమ కళ్ల ముందు వున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఎంతో మురిపిపోతున్నారు. కళ్లముందు ఇంత అభివృద్ధిని పెట్టుకొని, కేవలం తన రాజకీయ పబ్బం గడవడం లేదన్న అక్కసుతోనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ది చేస్తున్న బిఆర్‌ఎస్‌ను వదిలి, ప్రజల కోసం కాకుండా, తన స్వప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేసే పొంగులేటి వంటి వారికి ప్రజల ఆదరణ ఎప్పుడూ వుండదు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ఉద్యమాలకు పురిటి గడ్డ. అది మర్చిపోయి వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాలను వాడుకునే పొంగులేటి వంటి వారిని ప్రజలు ఆదరించే సమస్యే లేదు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలకు లీడర్ షిప్ లేదు. క్యాడర్ లేదు. ఆకాశంలో మబ్బును చూసి ముంత ఒలకబోసుకోవడం తప్ప, ఆ పార్టీకి పనిచేసే వాళ్లు లేరు. ఎందుకుంటే ఆ పార్టీలు ప్రజల్లో లేవు. ఆ పార్టీలతో ప్రజలకు అవసరం కూడా లేదు. మాకు ఇది కావాలని ప్రజలు ఏది కోరుకోక ముందే అన్నీ సమకూర్చుతున్న పాలకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. అందుకే ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. వయసు మళ్లిన వారిని ఆసరా పించన్ ఇచ్చి ఆదుకుంటున్నాడు. వారి జీవితంలో సంతోషాలు నింపుతున్నాడు. ఒకప్పుడు వయసు మళ్లిన వారు , పెద్దలు తమ కొడుకుల మీద ఆధారపడి రూపాయికి కూడా ఇబ్బందులు పడేవారు. కనీసం వారు కడుపు నిండా తినడానికి కూడా కన్నీళ్లు పెట్టుకునేవారు. కాని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పించన్‌తో హాయిగా జీవిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా వున్నారు. రైతులు రైతు బంధు అందుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు వాడుకుంటున్నారు. చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలతో పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. దేశానికి అన్నం పెడుతున్నారు. పండిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజవరకు కొని వారికి ఆదాయం సమకూర్చుతున్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ప్రజల సంక్షేమం కోసం , తెలంగాణ సాధన ద్వారానే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన మూలంగానే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కాని కాళేశ్వరం వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన ప్రాజెక్టును మొదలుపెట్టి, యజ్ఞంలా పూర్తి చేశారు. ఎండిన తెలంగాణలో పన్నీరు చిలికించారు. చుక్క నీరు కానరాని భూములు సస్యశ్యామలం చేశాడు. ఒకనాడు తొండలు గుడ్డు పెట్టడానికికూడా తెలంగాణ భూములు పనికి రావని హేళన చేసిన వారి కళ్ల కుళ్లుకునేలా చేశాడు. ప్రజా శ్రేయస్సు కాంక్షించే నాయకుడంటే కేసిఆర్‌లా వుండాలని కొనియాడేలా చేస్తున్నాడు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా కావాలని ప్రజలు కోరుకునేలా చేశాడు. బిఆర్‌ఎస్‌తో దేశమంతా వికాసవంతమైన సమాజ నిర్మాణం కోసం భయలుదేరాడు. దేశానికి కొత్త దిశ, దశ చూపించేందుకు కేసిఆర్ మరో ఉద్యమం మొదలుపెట్టారు. రైతును రాజును చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. రైతురాజ్యం స్ధాపించే పయనంలో వున్నారు. దేశంలో కొత్త రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించనున్నాడు. అదీ కేసిఆర్ అంటే.. కాని కేంద్రంలో వున్న బిజేపి బియ్యం కొనుగోలులో కొర్రీలు పెడుతోంది. అలాంటి బిజేపిరాష్ట్రంలో ఎదో ఉద్దరిస్తుందని ప్రజలు ఆశపడడం లేదు. కాకపోతే రాజకీయ స్వార్ధ పరమైన నాయకులు పొంగులేటి లాంటి వారు ఆశ్రయం పొందడానికి మాత్రం పనికొస్తాయి. అంతే కాని ప్రతిపక్షాలు ప్రజాసేవ చేయడానికి మాత్రంపనికిరాదు. ఇది సాక్ష్యాత్తు ప్రజలు చెబుతున్నమాట. అందుకే తెలంగాణలో వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్సే…ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమే!
` నేటిధాత్రి చీఫ్ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో బిజేపివి నీతి లేని రాజకీయాలంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
` నిలకడ లేని రాజకీయాలు?
` నమ్మకం లేని సొంత పాలనలు?
` ప్రజాతీర్పు అభాసుపాలు?
` రాజ్యాంగ ఉల్లంఘనలు?
` నైతికతకు తిలోదకాలు?
` అధికారమే లక్ష్యంగా పోకడలు?
` ప్రజాస్వామ్య పరిహాసాలు?
` ప్రజా సంక్షేమం పట్టని పాలనలు?
` అధికారం నిలబెట్టుకోవడం కోసం దొడ్డి దారులు?
` గతంలో బిహార్ లో..
` తర్వాత కర్ణాటకలో..
`మొన్ననే మేఘాలయలో…
`తాజాగా మళ్ళీ మహారాష్ట్రలో…
` ఇప్పటికే ఎక్ నాధ్ షిండేతో…
`మళ్ళీ కొత్తగా ఎన్సీపితో..
`ఛీఛీ అంటున్న జనం!
`ఇక బిజేపి పతనం ఖాయం?
హైదరబాద్,నేటిధాత్రి:
ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కాంక్షించాలి. వారి కోసం పనిచేయాలి. ప్రజలకు మెరుగైన సదుపాయల కల్పన కోసం శ్రమించాలి. ప్రజాభ్యున్నతి కోసం పాటు పడాలి. ప్రజల మీద భారం పడుకుండా చూసుకోవాలి. వారికి మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తుండాలి. ప్రజావసరాలు ఎప్పటికప్పుడు తీర్చుతుండాలి. ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయల కల్పన జరుగుతూ వుండాలి. దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాలి. వారికి మెరుగైన ప్రోత్సాహకాలు అందించాలి. పేదలకు అండగా నిలవాలి. వారి ఆకలి తీర్చాలి. ఇలా చెప్పుకుంటూ ఒకటికాదు, రెండు అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. వాటన్నింటినీ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సంపూర్ణంగా నిర్వహిస్తుందా? అంటే క్షణం కూడా తడబాటు లేకండా చెప్పాల్సిన పేరు తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన అందుకు నిదర్శనం. దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం. కాని కేంద్రాన్ని పాలిస్తూ, అనేక రాష్ట్రాలలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చి, దొడ్డిదారిన పాలన చేస్తూ బిజేపి ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదైనా చేశారా? అని చెప్పుకోవాల్సివస్తే, కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అందుకే ఈ తొమ్మిదేళ్లలో ఏం చేశారంటే బిజేపిలో అందరూ చెప్పే ఒకేమాట…ఎప్పుడూ చెప్పుకునేది ఒక్కటే…ఇప్పటికీ, ఎప్పటికీ చెప్పుకొని పబ్బం గడుపునేది ఒక్కటే మాట.. అదే కరోనా సమయలో దేశంలోని పేదలను ఉచితంగా రేషన్ ఇచ్చామని చెప్పుకోవడం బాగా అలవాటు చేసుకున్నారు. కరోనా సమయంలో మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా ఇదే జరిగింది. ప్రజలను ఆదుకోలేక పోతే ప్రభుత్వాలు ఎందుకు? ఈ మాత్రం కూడా బిజేపి నేతలకు సోయి లేదు. మన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి నెల తెలంగాణలో వుంటున్న పేదలందరికీ నెలకు రూ.1500 అందజేశారు. ప్రజల ఎక్కడైతే తిరస్కరిస్తారో అక్కడే మళ్లీ దొడ్డిదారిన అక్కడే బిజేపి అధికారంలోకి రావడం వంటి అప్రజాస్వామ్య రాజకీయాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్‌లోకి అధికారంలోకి వచ్చింది. కమల్‌నాధ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది కూడా గడవకముందే దాన్ని కూల్చి మళ్లీ బిజేపి అధికారంలోకి వచ్చింది. ఇంత దుర్మార్గమైన రాజకీయాలు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. నీతి లేని రాజకీయాలు, చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, ధర్మాన్ని వల్లిస్తూ, సెంటిమెంటు రాజకీయాల మీద కాలం గడుపుకుంటున్న బిజేపి పతనం ఖాయం అంటున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ అస్ధిరతను బిజేపి ఎలా ప్రేరేపిస్తుందో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడిరచి, బిజేపిని తూర్పారపట్టారు. ఆ విషయాలు..వివరాలు ఆయన మాటల్లోనే…
నిలకడ లేని, విలువలేని తనంతో బిజేపి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోంది. ప్రజలను ఎల్లకాలం మోసంతో నమ్మించలేరు.ఎల్ల కాలం వంచించలేరు. ప్రజలు ఎంతో చైతన్య వంతులు. ఈసారి దేశ ప్రజలు బిజేపికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఎందుకంటే తాజాగా మహారాష్ట్రలో చిల్లర రాజకీయాలను బిజేపి సాగిస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసి, కూటమి ప్రభుత్వాన్ని కూల్చి, శివసేను నుంచి ఏక్‌నాధ్‌షిండేను లాగేసుకొని, ప్రజలు తిరస్కరించినా అధికారం చేపట్టింది. ఎన్నటికైనా ఏక్‌నాధ్ షిండేతో ఇబ్బందే అన్న ఆలోచనకు వచ్చి, మళ్లీ ఎన్సీపితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నీతిమాలిన రాజకీయాలు మేం ఎలాంటి పరిస్ధితులలోనైనా కొనసాగిస్తామని బరితెచించి చేస్తున్నారు. గతంలో మధ్య ప్రదేశ్‌లో బిజేపిని ప్రజలు ఓడిరచారు. కాంగ్రెస్ గెలిచింది. ఏడాది గడవకముందే అక్కడ కాంగ్రెస్‌ను చీల్చి జ్యోతిఆదిత్యాసిందియాను బిజేపి వైపు తిప్పుకొని, మళ్లీ బిజేపి అధికారంలోకి వచ్చింది. ఇంత నీతిమాలిన చర్యలు ఎక్కడైనా వుంటాయా? త్రిపురలో అదే చేశారు. మేఘాలయాలో ఎన్నికల ముందు ఏ పార్టీనైతే తిట్టిపోశారో అదే పార్టీతో చేతులు కలిపి, అధికారం పంచుకుంటున్నారు. కర్ణాటకలోనూ అలాగే వ్యవహరించారు. ఇలా గోవాలో మెజార్టీ సీట్లురాకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని అధికారం చేపట్టారు. బిహార్‌లో కూడా ఈ ఫార్ములాను అమలు చేయాలనుకున్నారు. కాని నితీష్ తెలివిగా బిజేపికి దూరమయ్యారు. తన పదవి పదిలం చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి వేలుపెట్టని రాష్ట్రం లేదు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి ప్రభుత్వాన్ని దింపేసేందుకు కుట్ర చేసినా, ప్రజలు తిరిగి మమతా బెనర్జీవైపు నిలవడంతో ఆగిపోయారు. అయినా ఎంతో మంది ఎమ్మెల్యేలను బిజేపిలో చేర్చుకున్నారు. పంజాబ్‌ను ఏలేద్దామనుకున్నారు. కాని కుదరలేదు. డిల్లీని గెవలేక, రెండుసార్లు బొక్క బోర్లా పడి ప్రభుత్వ సంస్ధలను చేతిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని చూస్తున్నారు. ఇదా దేశం కోసం, ధర్మం కోసం నిలబడం అంటే? రాజకీయాలను ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సిన తరుణంలో విలువలు దిగజారిన బిజేపి నేతల్లో చేతుల్లో పడి రాజకీయాలు విలవిలలాడుతున్నాయి.
రాజ్యాంగ ఉల్లంఘనలు యదేచ్చగా సాగిస్తున్నారు. ఎలాగైనా తెలంగాణ రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని, దేశ రాజకీయాల్లోకి ఒక ప్రభంజనంలా దూసుకువస్తున్న బిఆర్‌ఎస్‌తో భవిష్యత్తులో నష్టమని గ్రహించి, బిజేపి పెద్దలు కుట్రలు మొదలుపెట్టారు. డిల్లీ ప్రభుత్వంలో లేని స్కీమ్‌లో స్కామ్‌ను తెరమీదకు తెచ్చి, తెలంగాణకు లింకులుపెట్టి దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది బిజేపికి ఏమాత్రం మంచిది కాదు. అంతే కాదు బిజేపి శ్రేణులు కూడా దేశమంతా ఆలోచించాల్సిన అసవరం వుంది. దేశమంతా విస్తరించిన బిజేపిని ఇద్దరు నేతలు, ఇద్దరు పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దారాదత్తం చేస్తూ, బిజేపికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రాష్ట్రాల సర్కారులను కూలుస్తున్నారు. ప్రజలు బిజేపి పేరు చెబితే చీకొట్టేలా చేస్తున్నారు. మొత్తంగా తిన్నింటి వాసాలు ఇద్దరు నేతలు లెక్కబెడుతున్నారు. తమ ఇష్టాను సారం వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని, ఇతర సీనియర్లను చిటికిన వేలు మీద ఆడిస్తున్నారు. సొంత బిజేపి నేతలనే నమ్మకుండా, సొంత నిర్ణయాలు,ఏకపక్ష నిర్ణయాలతో ఎవరికీ వాయిస్‌లేకుండా చేస్తున్నారు. పార్టీపరంగా బిజేపిని వుంచుకుంటారో? తుంచుకుంటారో? ఎవరికీ అసవరం లేదు. కాని ప్రజలను ఇబ్బందుల పాలు చేసే రాజకీయాలు బిజేపి చేస్తుంటే బిఆర్‌ఎస్ ఊరుకోదు. తాజాగా మహారాష్ట్ర రాజకీయాలలో బిఆర్‌ఎస్ దూసుకుపోతోంది. పెద్దఎత్తున మహారాష్ట్రలోని పలు రాజకీయ పార్టీల నేతలు, యువకులు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. బిజేపిపతనం బిఆర్‌ఎస్‌తోనే మొదలౌతుంది. మహారాష్ట్ర నుంచే బిజేపిని తరిమికొట్టే యజ్ఞం మొదలౌతుంది. త్వరలో కర్నాటక రాజకీయాలతో బిజేపి ఉనికి మీద దెబ్బ పడడం మొదలౌతుంది. నోట్ల రద్దు నుంచి మొదలు ప్రజలను నానా రకాల ఇబ్బందులు పెడుతూ వస్తున్న బిజేపి పతనం అంచుల్లో వుంది. బిజేపి శకం త్వరలో ముగుస్తుంది. ఇంతకాలం ఎంతో కొంత చెప్పుకోవాడానికైనా వుండేది. ఇక బిజేపిఅనే పార్టీ వుండేదని చరిత్ర చెప్పుకునే కాలం త్వరలోనే వస్తుంది. ఇదే సత్యం..ఇదే తధ్యం.
మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఫోర్ట్ రోడ్ ఈద్గాలో నిర్వహించిన దావత్- ఏ- ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తో పాటు ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ పాల్గొని ముస్లిం సోదరులతో కలసి విందును ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనారిటీల పట్ల ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం తాను ఇప్తార్ విందును ఏర్పాటు చేసామని ఈ ఏడాది మరింత గొప్పగా నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్తార్ విందు విజయవంతానికి కృషి చేసిన జబ్బార్ వారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరర్లతో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముస్లిం మత పెద్దలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జెడ్పీ ఛైర్మన్,బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంఛార్జి లింగాల కమల్ రాజు నాయకత్వాన ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధు,విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటేశ్వరరావుతో కలిసి అతిథిగా హాజరయ్యారు
ఈ కార్యక్రమానికి మహిళలు,యువత పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా జనరంజక పాలన కొనసాగుతున్నదని, తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురంలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ బీడువారినట్లు ఉండేదని, కేసీఆర్ పాలనలో ఇప్పుడు పాడిపంటలతో కళకళలాడుతున్నదని చెప్పారు.దండుగ అనుకున్న వ్యవసాయాన్ని కేసీఆర్ ఆచరణలో పండుగ చేసి నిరూపించారని కొనియాడారు.ఒకటేమిటి ఈ తొమ్మిదేళ్ల అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాలలో ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని,ఈ ఫలాలు, సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరాయని వివరించారు.దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు,ఒంటరి మహిళలు,గీత,నేత,బీడి కార్మికులకు 2,016 రూపాయల చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయాన్ని రవిచంద్ర గుర్తు చేశారు.ఈవిధంగా కేసీఆర్ సమర్థవంతమైన పాలనలో కొనసాగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాల వాళ్లు తెలుసుకుని,చూసి బీఆర్ఎస్ లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని, కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని భావిస్తున్నారని వద్దిరాజు వివరించారు.ఈ సమ్మేళనంలో విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటరమణ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మహిళలు,యువతతో పాటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై భారత్”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్”అంటూ గులాబీ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.
`సాటి నాయకుడు అద్దంకిని దూషించినప్పుడు ఆ గౌరవం ఎటు పోయింది?
`ముందైతే పార్టీలో కలిసికట్టుగా పని చేయండి?
`రాష్ట్ర నాయకుల చేతిలో లేని అధికారం గురించి లొల్లెందుకు?
`ఎన్నికలు దగ్గరకొస్తున్నా నేతలది ఎడమొహం…పెడమొహమే?
`మారితే మీరు కాంగ్రెస్ నేతలెలా అవుతారు?
హైదరబాద్,నేటిధాత్రి:
దేశంలో ఎన్ని పార్టీలలో మార్పులు వచ్చినా కాంగ్రెస్‌లో మార్పు రాదు. అంతర్గత సమస్యలు తీరిపోవు. ఎవరికి వారే యమునా తీరే అన్నది ఆగిపోదు. అందరూ రాజులే ఆ పార్టీలో..అందుకే తెల్లారిలేస్త కయ్యాలే తప్ప,కలుపుగోలు తనాలు కనిపించవు. సఖ్యతకు తావు లేదు. కేంద్రంలో ఎటూకాని పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతున్నా, రాష్ట్రాలలోనన్నా దారిలో వుందా? అదీ లేదు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. కోలుకుంటుందన్న నమ్మకం లేదు. కోలుకోవాలన్న సోయి నాయకులకు లేదు. తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రాలకన్నా మెరుగైన పరిస్ధితుల్లో పార్టీ వున్నప్పటికీ నాయకులే అగాధం సృష్టించుకుంటున్నారు. వారి మధ్య అంతర్గత విభేదాలు పార్టీని నిండా ముంచేస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీకి మరిన్ని గడ్డు పరిస్దితులు వచ్చి పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కోలుకోవడం లేదు. కోలుకుంటుందన్న నమ్మకం లేదు. కాని తెలంగాణలో కాంగ్రెస్ బలంగానేవుంది. అయినా ఆ పార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం వల్ల క్యాడర్ అయోమయంలో వుంది. మేమంతా కలిసి గెలిపిస్తామని క్యాడర్ చెబుతున్నా, లీడర్లకు మధ్య సానుకూలత లేదు. నాయకత్వపోరు ఆగడం లేదు. ముఖ్యంగా పిపిసి. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ బలపడిరదో..మరింత బలహీనపడిరదో ఎవరికీ అర్ధంకాకుండాపోయింది. పార్టీ బాగా బలపడిరదా? అంటే ఈమధ్య జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పెద్దగా పోషించింది లేదు. డిపాజిట్లు కూడా రానంత దుస్ధితిని ఎదుర్కొంటోంది. బలహీనపడిరదా? అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జోష్ పెరిందనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరసగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో సభలు,సమావేశాలు సాగుతున్నాయి. సమస్యల మీద స్పందన కనిపిస్తోంది. ఉద్యమాలు సాగుతున్నాయి. పోరాటాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డ పాదయాత్ర చేస్తున్నారు. అది సాగుతుండగానే సిఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క కూడా పాదయాత్ర సాగిస్తున్నారు. ఇది ఎవరు కాదన్నా,ఔనన్నా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పోటీగా సాగుతున్న పాదయాత్రే అన్నది అందరూ చెప్పుకుంటున్న మాట. పాదయాత్రలకు ఇటీవల శ్రీకారం చుట్టింది తెలంగాణలో అంటే రేవంత్‌రెడ్డి అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆ పార్టీలో పెద్దఎత్తున ఆయన యాత్ర చేపట్టిన తర్వాతే తమెక్కడ వెనుకబడి పోతామో? అన్న ఆందోళనతో మిగతా నాయకులు కూడా కొద్దో గొప్పో యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇదంతా బాగానే వుంది కాని నేతల మధ్య దూరం తగ్గడం లేదు. వారి చేతులు కలవడం లేదు.
కొత్తగా దళిత ముఖ్యమంత్రి నినాదం కాంగ్రెస్‌లో తెరమీదకు వచ్చింది.
దీనికి పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వున్నాయా? లేదా? అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కాకపోతే భువనగిరి ఎంపి. వెంకటరెడ్డి తన మీద వస్తున్న విమర్శలనుంచి దృష్టి మళ్లించేందుకు మల్లు భట్టివిక్రమార్క యాత్ర సందర్భంగా దళిత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. నిజానికి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టిన నాడు ఆయనకు మద్దతు పలికి పాదయాత్రలో కూడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఆయన కొంత కాలం పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. ఓ వారం రోజుల క్రితం వెంకటరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారంటూ కొన్ని వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. పైగా ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగింది. కాని వాటిని వెంకటరెడ్డి ఖండిరచారు. తాను కాంగ్రెస్‌లోనే వున్నానని ప్రకటించారు. దానికి బలం చేకూరాలంటే భట్టి పాదయాత్రలో కనిపించారు. కాంగ్రెస్‌సభకు హజరయ్యారు. పనిలో పనిగా కాంగ్రెస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ ముందు డిమాండ్ వుంచారు. అంటే ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఇప్పటినుంచే మోకాలడ్డే పనిని వెంకటరెడ్డి మొదలుపెట్టారని చెప్పాలి. ఆలు లేదు..చూలు లేదన్న సామెతను కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్‌లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించే సంప్రదాయం ఎప్పుడూ లేదు.
ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత పార్టీ కేంద్ర నాయకత్వం పంపే సీల్డ్ కవర్ ను బట్టి సిఎల్పీ నాయకుడిని ఎంపిక జరుగుతుంది. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినా, ఎన్నికల ముందు ఆయన పేరు ప్రకటించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే ఆయన పేరు ప్రతిపాదించారు. ముఖమంత్రిని చేశారు. అయితే అప్పటి పరిస్ధితి వేరు..ఇప్పటి పరిస్ధితి వేరు. అప్పుడు పిసిసి. అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్ కంటే సిఎల్పీ నాయకుడు వైఎస్ పవర్‌ఫుల్ నాయకుడు. అందువల్ల 2004 ఎన్నికల ఫలితాల తర్వాత పిపిసి. అధ్యక్షుడిని కాదని సిఎల్సీ నేతైన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. అయితే 1989 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పిపిసి. అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రినిచేశారు. అంటే ఆనాడు పిపిసి. అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డి పవర్‌ఫుల్‌లీడర్. ఇలా నాయకత్వ పటిమను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరూ నాయకులు పార్టీలో పవర్ ఫుల్ నాయకులే. ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఇదే… పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటే సీనియర్లకు ఎవరికీ ఇష్టం లేదు. ఆయన ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా సీనియర్లు ఎవరూ సహకరించడం లేదు. దాంతో భట్టిని రంగంలోకి దింపి రేవంత్‌రెడ్డికి పోటీగా యాత్రకు పురిగొల్పారనేది ఒక వాదన. నిజానికి బిఆర్‌ఎస్ తర్వాత రాష్ట్రంలో బిజేపి కన్నా ఎక్కువ బలంగా వున్నది కాంగ్రెస్ పార్టీయే. అందుకే నాయకులకు ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయి. అందువల్ల రేవంత్‌ను అడ్డుకునే ఎత్తుగడతోపాటు, దలిళ ముఖ్యమంత్రి ప్రభావం ఏ కాలంలో కాంగ్రెస్‌క కలిసి వస్తుందని సీనియర్ల ఆలోచన. అందుకే వెంకటరెడ్డి రూపంలో ఆ చర్చను ముందుకు తెచ్చి పెట్టారన్నది కొందరు నేతలు అంటున్న మాట. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతల చేతులు కలవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని మాత్రం తెలుస్తోంది.
-జనగామ ప్రజల తరుపున ఎమ్మెల్సీ పోచంపల్లి కృతజ్ఞతలు.
-తెలంగాణలో ఆరోగ్య విప్లవం.
– ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం.
– ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయం.
హైదరబాద్,నేటిధాత్రి:
జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు జిల్లా ప్రజల తరుపున ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నేటిధాత్రి ప్రతినిధితో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా మెరుగైన వైద్యసదుపాయల కల్పన, పేదలకు వైద్య భరోసా కల్గిందని అన్నారు. ఇప్పటికే జనగామలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశీస్సులతో మొదలైన మాతా శిశు సంక్షేమ కేంద్రంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. కేసిఆర్ కిట్‌తో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు. జనగామలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఖరీదైన నేపధ్యంలో మాతాశిశు సంక్షేమ కేంద్రం అందుబాటులోకి వచ్చాక పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు. పైగా మామూలు కాన్పులు చేస్తూ, మహిళల ఆరోగ్యాన్ని కూడా ప్రభుత్వం కాపాడుతోందని గుర్తు చేశారు. జనగామ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు గురించి కొన్ని దశాబ్ధాలుగా డిమాండ్ వుంది. కాని ఉమ్మడి పాలకులు తెలంగాణలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అసలు తెలంగాణలో ఆసుపత్రుల నిర్మాణమే చేపట్టకుండా, తెలంగాణకు వైద్యం అందుకుండా చేశారు. ప్రజలకు ప్రైవేటు వైద్యమే దిక్కు చేశారు. కాని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో వైద్య సదుపాయలు విసృతంగా పెంచి, పేదల ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నాడు. తెలంగాణ రాకపోతే తెలంగాణలో జిల్లాకో వైద్య కళాశాల చూసే అవకాశమేవుండకపోయేది. దేశంలోనై వైద్యవిప్లవం సృష్టించిన రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెబుతున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుతో ఖరీదైన వైద్యంతోపాటు, అత్యవసర సేవలు కూడా ఉచితంగా వైద్య కళాశాలలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటి వరకు ఏదైనా సీరియస్ కండీషన్ కేసులను అటు వరంగల్‌కు గాని,ఇటు హైదరాబాద్‌కు గాని వెళ్లాల్సిన పరిసి ్ధతి వుండేది. పేదలకు ఎంతో ఖర్చుతో పాటు ప్రాణాలకు కూడా భరోసా వుండేది కాదు. ఇప్పుడు సకాలంలో సీరియస్ కేసులకు కూడా ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాల ఏర్పాటుతో జనగామ జిల్లా పరిసర ప్రాంతాలైన సుమారు 300 గ్రామాలకు పైగా ఈ వైద్య సేవలు వేగంగా అందుకునే అవకాశం వుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో పెద్దఎత్తున వైద్య విప్లవం సృష్టిస్తున్నారని పోచంపల్లి కొనియాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో వైద్య కళాశాల ఏర్పాటు. వరంగల్‌లో సుమారు 2500 పడకల ఆసుపత్రి నిర్మాణం. హైదారాబాద్ చుట్టుపక్కల నాలుగు వైపుల నాలుగు అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక పల్లెలతోపాటు,పట్ణణాలన్నీంటిలిలో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వవైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
`పథకం ప్రకారం రెడ్డి నేతల చేరికలు కొనసాగిస్తున్నారు?
`బిసి.సామాజిక వర్గాలను దూరం పెడుతున్నారు?
`బిజేపిని వీడుతున్న వారంతా బిసి లే?
`చేరుతున్న వారిలో ఎక్కువ రెడ్డి లే?
`సంజయ్ ఆధిపత్యానికి అడ్డకట్ట కోసమే?
`బిసిలు బలపడితే రెడ్డిల ఆధిపత్యానికి గండే?
`ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యత తగ్గుతోంది?
`రెడ్డి లంతా ఏకమైతే బలం, బలగం వారిదే?
`ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని తగ్గించాల్సిందే?
`బండిని తప్పించేలా ఎదిగితే ఇంకా మంచిదే?
`అంతర్గత పోరు…తెరమీద కొట్లాట షురూ!
`జిల్లాలోనూ రెడ్డిలకే ప్రధాన్యం?
`ఆది నుంచి వారిదే పెత్తనం?
`కాపులు కాపుకాసేనా? రెడ్డిల కింద నలిగిపోయేనా!?
హైదరబాద్,నేటిధాత్రి:
అగ్రకులాలు ఆధిపత్యం ముసుగులో బలహీన వర్గాలకు సానుభూతి తప్ప ప్రోత్సాహం లేదు. మాటల మాటున దాగి వున్న ఆదరణ, చేతల్లో వుండదు. ఏ రాజకీయ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లే బిజేపిలో కూడా బలహీన వర్గాల నేతలపై ఎప్పటికప్పుడు పెత్తనం చేసేందుకు, వారిని ఎదగకుండా చూసేందుకు, అణచివేసే రాజకీయాలే కనిపిస్తున్నాయి. దేశంలో బీసినేత నరేంద్ర మోడీ నాయకత్వం అని గొప్పలు చెప్పుకుంటూ, రాష్ట్రంలో మాత్రం బడుగు నేతలకు ప్రాధాన్యమివ్వడం లేదు. నిజానికి బిజేపికి ఉన్నత వర్గాల నాయకులు నాయకత్వం వహించిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా బిజేపి ముందుకు పడలేదు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బి టీమ్‌గా వుండేందుకే ఓ పెద్ద నాయకుడు బిజేపిని ఎదగనీయలేదన్న ఆరోపణలు అనేకం వున్నాయి. అయన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సామాజకవర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఒకనాడు ఎన్టీఆర్‌కు, తర్వాత చంద్రబాబు నాయుడుకు సహకారం అందించే రాజకీయం చేశారే గాని, బిజేపి బలపడేందుకు ఏనాడు కృషి చేయలేదన్న విమర్శ వుంది. అంతే కాదు ఆ నేత జాతీయ స్ధాయి పార్టీ పగ్గాలు చేపట్టినా దక్షిణాదిన పార్టీ ఎదుగులలో ఒక్కఅడుగు కూడా ముందుకు పడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్ధితి కొనసాగింది. అయితే జాతీయ స్ధాయిలోనూ ఓ దళిత నేత బిజేపి పార్టీ పగ్గాలు చేపట్టి, పార్టీని పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెహల్కా డాట్.కామ్ పేరుతో కేసుల్లో ఇరుక్కున్నారు. ఆనాడు కూడా సొంత పార్టీ నేతలే అన్యాయం చేశారన్న అపవాదు వుండనే వుంది. దళిత నేత కావడం వల్లనే ఆనాడు ఆ నాయకుడు ఎదిగితే పార్టీలో ఆయన ఆధిపత్యం కింద పనిచేయలేని అగ్రకులాల కుట్ర రాజకీయమే ఆ నేత పతనానికి కారణం అన్న విమర్శలు అనేకం వున్నాయి. ఆ తర్వాత బిజేపి ఆ పార్టీనేతను పట్టించుకోకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురై, మరణించారన్న వార్తలు అందరూ విన్నవే. ఏది ఏమైనా బిజేపి కూడా అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే అగ్ర కులాల పెత్తనం చట్రంలో ఇరుకున్నదని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలోనూ బిజేపిలో అగ్రకుల పెత్తనం సాగేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అగ్ర కుల పెత్తనమే సాగుతూ వచ్చింది. అయినా వారి నాయకత్వంలో పార్టీ ఎదిగినట్లు చరిత్ర లేదు. కాని బండారు దత్రాత్రేయ లాంటి నాయకుడు అధ్యక్షుడు వున్నప్పుడు పార్టీ కొంత పటిష్టంగా మారింది. ఇక లక్ష్మణ్ అధ్యక్షుడుగా వున్న సమయంలోనూ ఆయనకు కూడా పెద్దగా ఎవరూ సహకరించలేదు. ఆయనను కూడా అనేకసార్లు దింపేసే కుట్ర చేశారు. కాకపోతే కాలం అనుకూలంగా లేదన్న కారణంలో బిజేపి పగ్గాలు నిర్వహించేందుకు కొంత కాలం ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో బిజేపి కొంత బలపడిరదన్న సంకేతాలు వున్నాయి. నాయకుల్లో కూడ నమ్మకాలు పెరిగాయి. దాంతో మళ్లీకథ మొదటికి తీసుకురావాలని చూస్తున్నారు. బిసి నాయకత్వాన్ని ఎలా అణచివేయాలా అన్నది రచిస్తున్నారు.
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా, బండి సంజయ్ వచ్చిన తర్వాతే బిజేపికి తెలంగాణలో జవసత్వాలు వచ్చాయి.
పార్టీ బలం పెరిగింది. గతంలో కనీసం కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్ధితి నుంచి పెద్దఎత్తున పోటీ పెరిగేదాకా బిజేపి ఎదిగిందంటే కారణం బండి సంజయ్. ఒక రకంగా బండి సంజయ్ చేసే రాజకీయ విన్యాసం, మాట కారి తనం, తిమ్మిని బమ్మిని చేయగలిగే నేర్పరితనం బిజేపిలో ఏ ఒక్క నాయకుడి దగ్గరలేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎందుకంటే ఎవరైతే పెత్తనం కోసం ఆరాటపడుతున్నారో, అంతర్లీనంగా పోరాటం చేస్తున్నారో, అధిష్టానం వద్ద పలుకుబడిని ఉపయోగించాలని చూస్తున్నారో వారెవరికీ ప్రజల్లో గుర్తింపు లేదు. నాయకత్వంలో జోష్ లేదు. ప్రజలను ఆకట్టుకునేంత మాట కారి తనం లేదు. సానుభూతిని సంపాదించే డైలాగ్‌లు కొట్టే నేర్పరితనం లేదు. ఈ విషయంలో బండి సంజయ్ అందరికన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడని చెప్పొచ్చు. కొన్ని సార్లు పార్టీని బండి సంజయ్ వ్యాఖ్యలు ఇరుకున పెట్టే పరిస్ధితులు సృష్టించినా, ఏదైనా నెగిటివ్ అవుతుందని అనుకునే ప్రతి పని ఆయనకు పాజివివ్‌గా మారుతుండడంతో, అగ్ర కుల నాయకులకు మింగుడు పడడం లేదన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. నిజానికి బండి సంజయ్ చేసే వ్యాఖ్యలన్నీ వివాదాస్పమౌతుండడం పెద్ద విచిత్రం. అవే మళ్లీ కొంతకాలానికి బండికి అనుకూలమైపోవడం, ఆయన నాయకత్వం మరింత బలపడడం చూస్తూనే వున్నాయి.
ఇలా ప్రతీ సందర్భం బండి సంజయ్‌కు అనుకూలంగా మారుతుండడం కూడా అగ్ర కుల నేతలకు మింగుడు పడడం లేదు.
గతంలో కల్వకుంట్ల కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక బండి సంజయ్‌ను ఇరుకున పెట్టొచ్చు అని అందరూ అనుకున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధ్యక్షుడి మార్పు ఖాయమన్న ప్రచారం సాగించి, బండిని సాగనంపాలన్న కలలు బాగానే కన్నారు. కాని వారి కలలు నెరవేరడం లేదు. గతంలో ఓసారి బిజేపి జాతీయ స్ధాయి సమావేశాల ముగింపు తర్వాత జరిగిన భహిరంగ సభలో బండి సంజయ్‌ను ప్రధాని నరేంద్రమోడీ మెచ్చుకోవడం ఒక రకంగా అగ్ర కుల నేతల్లో కలవరానికి కారణమైంది. ఇక ఇటీవల పదోతరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసు బండి మెడకు బాగానే చుట్టుకున్నన్నదని సంబరపడ్డ అగ్ర కుల నేతలకు మరోసారి షాక్ అయ్యింది. అది కూడా జాతీయ స్ధాయి నేతలు బండికి పూర్తి స్ధాయి మద్దతు లభించడంతో అగ్రకుల సామాజిక వర్గ నేతలు దిక్కు తోచని స్దితిలో వున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఆగుతాయని ఎవరూ అనుకోవడం లేదు. బిజేపిలో గత కొంత కాలంగా చేరుతున్న నేతల పరపంరను బాగా పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా క్యూ కడుతున్నారు. బిజేపిలో చేరిన బిసినేతలు అనేకం వెనక్కి వచ్చేశారు. అంటే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుగా బిసి నాయకుడు వున్నప్పటికీ బిసి నేతలను కాపాడుకునే పరిస్దితి లేకుండాపోతోందన్న ఆందోళన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు బండి సంజయ్ తన పదవి కాపాడుకోవడంతోపాటు, పార్టీ పటిష్టం కోసం చేస్తున్న ప్రయాత్నాలను కూడా ఇరుకున పడేలా చేస్తున్నది కూడా బిజేపిలో వున్న పెద్దలే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు బిజేపిలో బిసిల నేతల మనుగడ, ఎదుగుదల ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు.
కార్యక్రమానికి మహిళలు,యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తరలి వచ్చారు
మాజీ ఎంపీ పొంగులేటి కుట్రలు, కుయుక్తులు సాగవని, చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎంపీగా 5ఏళ్ల పదవీ కాలంలో ఆయన జిల్లాకు,ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని,ఏమీ చేయలేదన్నారు.ఆయన పగటి కలలను కల్లలు చేస్తూ జిల్లాలోని పదికి పది సీట్లను ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడం, సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని రవిచంద్ర ధీమాగా చెప్పారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం చెన్నూరులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వాన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే పలు కార్యక్రమాలకు సొంతంగా పథక రచన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెడుతున్నదని చెప్పారు.కేసీఆర్ సుపరిపాలనలో కరువు కాటకాల జాడే లేదని, పల్లెలు పాడిపంటలు,పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. మన పల్లెలకు నిన్న కాక మొన్న 13 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ,మొత్తం 46 అవార్డుల్లో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కు ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదని రవిచంద్ర వివరించారు.మహనీయులు అంబేడ్కర్ 125అడుగుల కాంస్య విగ్రహాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా ఆవిష్కరించుకోవడం, సచివాలయాన్ని అద్భుతంగా కట్టించి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని యావత్ దేశం చర్చించుకుంటున్నదని,ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు.ఈ విధంగా సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ వైపు,అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందిన, చెందుతున్న తెలంగాణ రాష్ట్రం వైపు దేశ ప్రజలంతా చూస్తున్నారని,ఆయన పాలన కోరుకుంటున్నారని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు,రైతు సంఘాల నాయకులు,ఇతర పార్టీలకు చెందిన వాళ్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు.
`పదిమందిని గెలిపించే సత్తానే వుంటే గత ఎన్నికలలో గెలిపించిన సీట్లెన్ని?
`దగ్గరుండి ఓడిరచిన కుట్రదారు పొంగులేటి?
హైదరబాద్,నేటిధాత్రి:
చిలక పలుకులు చిన్న పిల్లలు పలికితే బాగుంటుంది. పెద్దలు మాట్లాడితే అసహస్యంగా వుంటుంది. మాజీ ఎంపి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా అలాగే వున్నాయి. తనకేదో అన్యాయం జరిగిందని సరిగ్గా ఎన్నికల ముందు ప్రజలను గందరగోళపర్చాలన్న దురుద్ధేశ్యంతో పొంగులేటి ఎన్ని కట్టు కధలు అల్లినా ప్రజలు నమ్మే పరిస్ధితి లేదు. ఎవరూ ఆయన వెంట వెళ్లరు. ఆయనకు అంత సీన్ కూడా లేదు. ఒక వేళ ఆయనే అంత నాయకత్వ పటిమ వుంటే గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రతిభా పాటవాలు ఎటు పోయాయి? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ప్రతిరూపమేది? ఉట్టికెగరనమ్మ, ఆకాశానికి ఎగరాలని ప్రయత్నం చేసినట్లు వుంది. గత ఎన్నికల్లో పొంగులేటి ఎన్నికల్లో నిబడ్డా ఓడిపోయే పరిస్ధితే. అందుకే ఆయనకు పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఆయన పర్యవేక్షణ లోపం ఎంతో వుందో ఎప్పుడో అర్ధమైంది. పైగా పొంగులేటి బాధ్యతారాహిత్యం గత ఎన్నికల్లోనే తేలిపోయింది. అయినా మంత్రి కేటిఆర్ ఎంతో ఓపిగా పొంగులేటికి ఎంతో విలువిస్తూ వచ్చారు. ఆయన మాట కూడా లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి కేసిఆర్‌ను అప్రదిష్టపాలు చేయాలనుకుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేదు. ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్ మీద మాట్లాడిన వారినెవ్వరినీ ప్రజలు ఆదరించలేదు. వారెవరూ మళ్లీ రాజకీయాల జోలికి కూడా రాకుండా ప్రజలే తగిన బుద్ది చెప్పారు. ఇప్పుడు ప్రగల్భాలు పలుతుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా అందుకు భిన్నంగా ఏమీ వుండదు. తెలంగాణ సాధకుడు, తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చుతూ, దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలిపారు. తెలంగాణ గడ్డమీద నిలబడి పొంగులేటి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఊహించకోవచ్చు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమపథకాలు ఎక్కడా లేవని దేశమంతా కొనియాడుతుంటే, పొంగులేటికి ఎన్టీఆర్ పరిపాలన కాలం స్వర్ణయుగమనడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కాదా? దీంతో తెలంగాణపై పొంగులేటికి ఎంత చిత్తశుద్ది వుందో అర్ధంచేసుకోవచ్చు. ఆత్మవంచనకు కూడా వెనుకాడని వ్యక్తినని నిరూపించుకున్న పొంగులేటి నయవంచన ప్రజలు బాగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి తూర్పారపట్టారు. ఇంత కాలానికైనా పొంగులేటి అసలు స్వరూపం తెలిసిపోయిందని అంటున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డితో నేటిదాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావు చిట్‌చాట్…పూర్తి వివరాలు పల్లా మాటల్లోనే..
ఇంత కాలమైనా సీమాంధ్ర పాలకుడైన ఎన్టీఆర్ పాలన స్వర్ణయుగమంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడడం ఆయన నీతిబాహ్వానికి నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన కష్టాలు ఏమిటో తెలిసిన వాళ్వెవ్వరూ అలా మాట్లాడరు. తెలంగాణ గుక్కెడు మంచినీళ్ల కోసం ఆరాపడుతున్న సమయంలో తెలుగు గంగ పేరుతో చెన్నై నగరానికి మంచినీరు తరలించి, తెలంగాణకు చుక్క నీరివ్వని ఎన్టీఆర్ గొప్ప పాలకుడయ్యాడా? ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ వాదులెవరైనా మాట్లాడతారా? అసలు తెలంగాణ రాకపోతే ఖమ్మం జిల్లా రూపురేఖలు ఇలాగే వుండేవా? ఖమ్మం జిల్లా రాజకీయ ఉద్యమ చరిత్ర తెలిస్తే పొంగులేటి అలా మాట్లాడేవారు కాదు. పొంగులేటి తెలంగాణ బాధలు తెలియదు. తెలంగాణ వాదం తెలియదు. తెలంగాన ఉద్యమంలో ఆయన పాల్గొన్నది లేదు. కేవలం వ్యాపారవేత్తగా ఎదిగి, దన అహాంకారంతో తెలంగాణ మీద ఆయనకు వున్న అక్కసు ఏమిటో ఆయనే స్వయంగా బైట పెట్టుకుంటున్నాడు. తెలంగాణలో అభివృద్ధి జరగడంలేదంటాడు? లక్షల కోట్ల పనులకు టెండర్లు వేశారంటున్నారు? అంటే తెలంగాణలో కొన్నిలక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పరోక్షంగా ఆయనే ఒప్పుకున్నారు. మరి తెలంగాణలో ఏమీ జరగలేదని అనడం వెనుక రాజకీయకుత్సితం తప్ప మరేం లేదు.
తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందో తెలిస్తే తెలంగాణ ఎంత ముందంజలో వుందో తెలుస్తుంది.
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ స్వరూపం ఏమిటో? ఇప్పుడున్న తెలంగాణ ఎలా వుందో కళ్లారా చూస్తూ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్న పొంగులేటిని ప్రజల గమనిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ నాయకులకు చిన్న తరహా నీటి పారుదల శాఖను అప్పగించి, రూపాయి కూడా కేటాంపులు లేకుండా మంత్రులను ఉత్సవవిగ్రహాలుగా చేసిన ఘనత సీమాంధ్ర పాలకులది. అరవైఏళ్ల ఉమ్మడి పాలనల్లో తెలంగాణలోని ఒక్క చెరువైనా బాగుచేశారా? తుమ్మల నాగేశ్వరరావు నాయకుడి వల్ల ఆర్ధికపరమైన లబ్ధిపొంది, ఆయనకే వెన్నుపోటు పొడిచిన నాయకుడు పొంగులేటి. రాజకీయంగా కూడా జీవితాన్ని ఇచ్చిన తుమ్మల ఓటమికి కారణమైన పొంగులేటి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే వున్నాయి. తెలంగాణ రాకపోతే పాలేరు ఎత్తిపోతల పధకం వచ్చేదా? సీతారామా ప్రాజెక్టు వచ్చేదా? ఖమ్మం జిల్లాలోని అనేక చెరువులు బాగయ్యేవా? కిన్నెరసాని రిజర్వాయర్‌కు మరమ్మత్తులు జరిగేవా? 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడైన పొంగులేటి కేంద్రంతో కొట్లాడి తెచ్చిన నిధులెన్ని? చేసిన పనులెన్ని చెప్పగలడా? కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో జరిగిన అభివృద్దే తప్ప, కేంద్రం చేసిందేమైనా వుందా? అన్నీ నాకే కావాలి. పనులు నాకే కావాలి. పదవులు నాకే కావాలి. అంటే పార్టీ కోసం పనిచేస్తున్న ఇతర నాయకులేమైపోవాలి? వేలాది కోట్లరూపాయల పనులు తీసుకొని నీతిమాలిన మాట్లాడుతూ, విశ్వాసఘాతుకుడా పొంగులేటి మిగిలిపోవడం ఖాయం.
ఒకనాడు వంద కోట్ల వ్యాపారం మాత్రమే చేశానని చెప్పుకొచ్చిన పొంగులేటి ఇప్పుడు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎలా చేస్తున్నాడో సమాధానం చెప్పాలి.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. కాకపోతే రాజకీయ అవసరాల కోసం జగన్ పంచన చేరి, వ్యక్తిగత రాజకీయ లాభాఫేక్ష కోసమే బిఆర్‌ఎస్‌లో చేరి, వేలకోట్ల పనులు దక్కించుకొని ధన మధంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు. ఖమ్మం జిల్లా మొత్తం గెలిపించే సత్తా వున్న నాయకుడిగా గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. దేశంలోనే ఇప్పుడు బలమైన శక్తిగా మారిన బిఆర్‌ఎస్ మీద నిందలేస్తే జనం చీకొడతారు? సానుభూతి వస్తుందన్న భ్రమల్లో పొంగులేటి వున్నట్లున్నారు. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమం ప్రపంచంలోనే ఎక్కడా జరగడం లేదు. ముందు అది తెలుసుకో! కూర్చున్న కొమ్మను నరికేస్తున్నాన్న పగటి నిద్రలో చెట్టు మీద నుంచి జారిపడిపోయానన్న నిజం త్వరలోనే తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది.
`ఎనమిదేళ్లలో కూల్చుడు, అమ్ముడు తప్ప చేసిందేమీ లేదు?
`దేశం మొత్తం మీద ఒక్క ప్రాజెక్టు కట్టలేదు?
`ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని నమ్మించి ఇచ్చింది లేదు?
`జనం బిజేపిని నమ్మానికి సిద్ధంగా లేరు?
`బిజేపికి ఎక్కడా ఆదరణ లేదు?
`రెండు సార్లు అవకాశం ఇస్తే అంతా ఊడ్చేశారు?
`మళ్ళీ నమ్మితే ఇంకేం మిగల్చరు?
`ప్రభుత్వం అంటేనే సంక్షేమం?
`పేదల అభ్యున్నతే దేశానికి అవసరం?
`పేదలకు పన్నులు, వ్యాపారులకు సంపదలు?
`ఇదా బిజేపి నీతి? రీతిలేని రాజకీయ దుర్నీతి?
` ప్రజల మధ్య అగాధం బిజేపికి శాపం?
`కరీంనగర్ కు పైసా పని చేయని బండి, కారుకూతలు ఆపు?
హైదరబాద్,నేటిధాత్రి:
నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. దేశంలో బిజేపి పరిస్దితి చూస్తే అలాగే వుంది. రాష్ట్రంలో మరింత అద్వాహ్నంగా వుంది. రాష్ట్రంలో అసలు ఏ లెక్కన పగటి కలలు గంటున్నారో అర్ధం కావడంలేదు. దేశంలో గత ప్రభుత్వాన్ని కాదని ప్రజలు బిజేపికి అధికారం కట్టబెడితే పెనంలోనుంచి పొయ్యిల పడ్డట్టు చేస్తున్న బిజేపికి మరోసారి అధికారం కోరే అర్హత ఎప్పుడో కోల్పోయింది. నమ్మి ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం కట్టబడితే దేశ ప్రజలను నానాగోసలు పెట్టిన ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూసింది లేదు. పైగా తెలంగాణ అంటేనే గిట్టని ప్రధాని నేతృత్వంలో తీరని నష్టం జరుగుతోంది. వివక్షకు గురౌతోంది. తెలంగాణను అన్ని రంగాలలో వెనకబాటును గురిచేసేందుకు చేయాల్సినంత కుట్ర బిజేపి చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ మీద విషం చిమ్మే మోదీని నమ్మి ఓట్లేస్తారా? తెలంగాణలో బిజేపిని ప్రజలు నమ్మడం అనేది కలలో కూడా జరగదు. అయినా తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. అసలు కేసిఆర్ తెలంగాణ సాధించకపోతే తెలంగాణ పరిస్ధితి ఎలా వుండేదో తెలిసి కూడా అబద్దాలలో బతికే బిజేపికి తెలంగాణలో స్ధానం లేదు. ఆపార్టీకి కనీసం ఆదరణ లేదు. ఏం చూసుకొని బిజేపి పగటి కలలు కంటోందో అర్ధంకాని ప్రశ్న. అయినా దేశంలో అధికారం ఆ పార్టీకి కట్టబెడితే ఇప్పటికే యాభై ఏండ్ల వెనక్కుపోయింది. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. అందుకే గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితం చేశారు. అయినా ఆ పార్టీకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. ఆసారి దేశం మొత్తం ప్రజలు బిజేపికి కర్రుకాల్చి వాత పెట్టే రోజులు ఎంతో దగ్గర్లోనే వున్నాయంటూ ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ పోచంపల్లి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మటల్లోనే.
దేశంలో బిజేపి తుడిచిపెట్టుకుపోయవడం ఖాయం. కర్నాకట ఎన్నికలతో బిజేపికి పతనం మొదలు కానుంది.
కర్నాటక లో బిజేపి నేతలు, ఆ పార్టీ కార్యకర్తలే కర్రు కాల్చేందుకు సిద్దంగా వున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజలను ఒత్తిడికి, ఇబ్బందులకు గురి చేసిన వాళ్లెవరు చరిత్రలో నిలవలేవు. ప్రజల సంక్షేమం పట్టని ఏ పార్టీ మనుగడలో లేదు. బిజేపి అంతో ఇంతో గతంలో ప్రజలు కాని ఇక భవిష్యత్తులో దేశ ప్రజలు నమ్మే పరిస్దితే లేదు. జనసంఫ్‌ు నుంచి జనతా వచ్చింది. అది పీసులు పీసులై, బిజేపి వచ్చింది. ఇక ఆ బిజేపి కూడా మోడీ మూలంగా కనుమరుగైపోయినట్లే అని చెప్పక తప్పదు. ఇక దేశ రాజకీయాలలో బిఆర్‌ఎస్ కీలకంగా మారే తరుణం ఆసన్నమైంది. అటు బిజేపి పతనం, ఇటు బిఆర్‌ఎస్ విజృంభనం ఏక కాలంలో సాగి, దేశానికి కొత్త శక్తి రానున్నది. పొరుగును వున్న మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ అభివృద్దిని చూసి, తమ ప్రాంతం కూడా అలా అభివృద్ది చెందాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారు. బిఆర్‌ఎస్ దేశ వ్యాప్తంగా బలపడుతున్న తరుణం ఒక వైపు సాగుతుంటే, దేశంలో కనుమరుగయ్యేందుకు సిద్దంగా వున్న బిజేపి పార్టీ తెలంగాణలో దింపుడు కల్లెం ఆశతో పగటి కలలు కంటున్నారు. అసలు ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్లాలన్న కనీసం సోయి కూడా లేకుండా సిగ్గూ, ఎగ్గూ లేని మాటలు మాట్లాడుతున్నారు. తెల్లారి లేవగానే నోర్లు కడుకుంటున్నారో…లేక అదే పాచి నోటితో మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోదు. నిజం మాట్లాడాలే..నీతిగా మాట్లాడాలే! తెలంగాణ ప్రగతిని ప్రజల కళ్లతో చూడలేని బిజేపి నేతలు అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. బిజేపి నేతలకు నిజంగా తెలంగాణ మీద చిత్త శుద్ది వుంటే తెలంగాణ ప్రగతిలో వారి బాగస్వామ్యమేమిటో చెప్పాలి. చెప్పుకోవడానికి కనీసం ఒక్క పని కూడా లేదు. అందుకే రాష్ట్ర ప్రగతిని, తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్దిని తమ అభివృద్దిగా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకుంటున్న బిజేపిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. ఇంకా ఆ విషయం వారికి అర్ధం కావడం లేదు.
దేశంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారన్న కనీసం అవగాహన బిజేపి నేతలకు లేకపోవడం దురదృష్టకరం.
పేరులో వున్న జనతా అంటే ఆ పార్టీ నాయకుల దృష్టిలో పేదలు కాదన్నది తేలిపోయింది. జనతా వారి దృష్టిలో గుజరాత్ వ్యాపారులు తప్ప, మరొకరు కాదు. అందుకే దేశ ప్రజల చెమట, రక్తంతో కట్టే పన్నులను పోగేసి, వ్యాపారులకు కట్టబెడుతూ, సామాన్యులను గోస పుచ్చుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వున్న ధరలకు ఇప్పటి ధరలకు వున్న తేడా ప్రజలందరికీ తెలుసు. మొదటిసారి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధను అతలాకుతలం చేసి, ప్రజలను మరింత పేదలను చేసిన బిజేపికి ఆర్ధిక ప్రగతి మీద, అర్ధ శాస్త్రం మీద కనీసం అవగాహన లేదు. ఉల్లి పాయల రేటు తగ్గించమంటే వాడకం మానేయమనే పాలకులు ప్రపంచంలో ఎక్కడా వుండరేమో! రేషన్ దుకాణాల దగ్గర ప్రదాని ఫోటో లేదని పేచీ పెట్టుకునే కేంద్ర మంత్రి వ్యవహారం ప్రపంచంలో ఎక్కడా వినీ చూసి వుండకపోవచ్చు. ఎంత సేపు మతం రాజకీయం, పొరుగు దేశాల బూచిని చూసి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం తప్ప, ప్రజల సంక్షేమం బిజేపికి పట్టదని తేలిపోయింది. ఇక ఇలాంటి కథలు నమ్మేందుకు దేశ ప్రజల సిద్దంగా లేరు. దేశంలో మసీదులను కూల్చుడు రాజకీయం నిర్మాణాలు చేసిన చరిత్ర బిజేపి నిఘంటువులోనే లేదు. ఎనమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. చెప్పుకోవడానికి ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు. నిర్మాణం జరగలేదు. దేశం గర్వించదగ్గ స్ధాయిలో ఒక్క ఆసుపత్రి చేపట్టలేదు. దేశంలో అదనంగా వేసిన రైల్లే లైను లేదు. రోడ్ల విస్తరణను కూడా కొత్తరోడ్లు అని ప్రచారం చేసుకునే దిక్కుమాలని రాజకీయం బిజేపి మాత్రమే చేయగలదు. సామాన్యులు అందుబాటులో వున్న అనేక ప్యాసెంజర్ రైళ్లును రద్దు చేసి, వందేభారత్ అంటూ సామాన్యులు ఎక్కలేని రైళ్లను ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం బిజేపికే చెల్లింది. ఎంతో గొప్పగా రైల్లే బడ్జెట్‌ను, ఆర్ధిక బడ్జెట్‌ను కలిపి, దేశంలో ఇన్నేళ్లకు వందేభారత్ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్లు 14. ఇదా ఒక ప్రభుత్వం చేయాల్సిన పని. పైగా అదే వందేభారత్ రైలును రాష్ట్రాలన్నీ తిరుగుతూ ప్రధాని మాత్రమే ప్రారంభించడం అన్నది గతంలో ఎన్నడూ లేదు. చెప్పుకోవడానికి ఏదీ లేదు. చేసింది లేదు. గత ఎన్నికల సమయంలో పుల్వామా ఘటనకు కారణం ఎవరో? ఏం జరిగిందో? అన్న విషయం తాగాజా అప్పటి జమ్ము కాశ్మీర్ గవర్నర్ చెప్పిన విషయాలతో బిజేపికి ఇక కాలం చెల్లినట్లే. పైకి బిజేపి చెప్పేదొకటి. చేసేదొకటి అన్నట్లు ప్రజల ముందు తెల్ల మొహం వేసుకునే రోజులు వచ్చాయి. సైనికులకు కనీసం హెలీకాప్టర్‌లు ఇవ్వకపోవడం మూలంగానే ఘోరం జరిగిపోయిందన్న సత్యం వెలుగులోకి వచ్చింది.
ఇక ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చి దేశంలో ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా నింపని బిజేపికి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన బండి సంజయ్ కౌంటింగ్ అయిపోగానే ఏడ్చి సానుభూతి సంపాదించి, పార్లమెంటుకు పోటీ చేసి గెల్చి కరీంనగర్‌కు ఏం చేశావో ముందు చెప్పు? కనీసం రైల్వే బ్రిడ్జి కూడా సాధించలేదు? అన్ని రంగాల్లో సమగ్రాభివృద్దితో, కలలో కూడా ఊహించనంత ప్రగతితో దేశంలోనే నెంబర్ వన్‌గా గుర్తింపు పొందిన తెలంగాణలోనే బిజేపి నేతల పిచ్చిగంతులు? అబద్దాల పునాదుల మీద నడిచే బిజేసి అసలు స్వరూపం ప్రజలకు ఎప్పుడో అర్ధమైపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేని దద్దమ్మలను మరోసారి నమ్మేందుకు తెలంగాణ సమాజం సిద్దంగా లేదు. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం అసలే లేదు. ఈసారి బిజేపికి కట్టగట్టి హుస్సేస్ సాగర్‌లో వేసుడే..? ప్రగతిని చూడలేని కళ్లు…బిజేపి పార్టీ నిండా కుళ్లు! ఇంతకన్నా ఆ కంపు గురించి చెప్పడం కూడా వృధానే! ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో శాంతి భద్రతలు జనం చూస్తున్నాదే… ప్రజలు చీకొడుతున్నదే! అది కూడా గొప్పగానే ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకుందామని చూసే దుర్మార్గపు రాజకీయం బిజేపిది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభం పల్లి వద్ద టిప్పర్ డికొనీ ద్విచక్ర వాహన దారుడు మృతి చెందాడు
స్థానికుల కథనం ప్రకారం బోయినిపల్లి మండలం గుండన్నపల్లి కి చెందిన గుంట మల్లేశం 31 తన ద్విచ్రవాహనంపై బోయినిపల్లి నుండి గుండన్నపల్లి వైపు వెళ్తుండగా వేములవాడ నుండి బోయినపల్లి వైపు వస్తున్న టిప్పర్ డికొనడం తో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలం కి వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్ బోయినిపల్లి ఎస్ ఐ మహేందర్ చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుని కి బార్య మౌనిక,కుమారుడు అవినాష్ 9 అనుశ్రీ 8 గల చిన్నారులు ఉన్నారు.
ఊరందరిదీ ఒకదారైతే ఉలిపిరి కట్టేది ఒక దారి అని సామెత. దేశ రాజకీయాలలో భారతీయ జనతాపార్టీది అలాంటి పరిస్ధితే కనిపిస్తోంది. దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో రెండుసార్లు పూర్తి మెజారిటీ అందించి పాలించమంటే సంక్షేమం అమలు చేయమనా? లేక ప్రభుత్వ రంగ ఆస్ధులు అమ్మకాలకు పెట్టమనా? అన్నదానిపై చర్చ చర్చ జరగాల్సిన అవసరం వుంది. స్వాంతంత్య్రానికి పూర్వం ఏం జరిగింది? ఆ సమయంలో ఏం జరిగింది? అన్నదానిపై నిర్ణయాలు చేయడానికి ఇది సరైన సమయంకాదు? అప్పటి పరిస్దితులను అధ్యయం చేసి సాధించేదేమీ వుండదు? దేశ ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం, ప్రజల మధ్య దూరం పెంచడం, మనుషుల మధ్య చిచ్చు రేపడం తప్ప మరొకటి వుండదు. అప్పటి కాల మాన పరిస్దితులలో ప్రజల సమ్మతంతోనే జరిగింది. ఇప్పుడు ఏ సమ్మతితో ప్రజలు బిజేపిని ఆదరిస్తున్నారో? అప్పుడు కూడా ప్రజలు అదే ఆదరణతో అప్పటి పార్టీలను, పరిస్దితులను ఆహ్వానించారు. ఇక వేళ ఆ సమయంలో ఎంతో కొంత బలంగా జనసంఘన్‌ను దేశ ప్రజలు ఎందుకు అక్కున చేర్చుకోలేదు. ఎందుకు ఆదరించలేదు. ఎందుకు ఎన్నికల్లో వారికి పట్టం కట్టలేదు? అంటే అప్పటి ప్రజల ఆలోచనలు వేరు. అప్పటి త్యాగాలను చూసిన ప్రజల నిర్ణయం అది. ఆ సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని డెబ్బై ఏళ్ల తర్వాత తప్పు పట్టడం అంటే ప్రజలనే బిజేపి తప్పుపట్టడమౌతుందే? గాని అప్పటి పాలకులను కాదు? ముందు బిజేపి ఈ విషయం తెలుసుకోవాలి? ఎంత సేపు పూర్వపు రోజులను బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్లాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్ధలు ప్రైవేటు వ్యక్తులకు పలహారం చేయాలి? ఇదేనా బిజేపి అనుసరిస్తున్న విధానం అని దేశమంతా ప్రశ్నిస్తోంది? ప్రతిపక్షాలన్నీ నిలదీస్తున్నాయి. ఒకనాడు ఖాయిలా పడ్డ పరిశ్రమలను ప్రైవేటు పరం చేయడం అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధలను మాత్రమే విక్రయించారు. అంతే కాని పూర్తి ప్రభుత్వ రంగ సంస్ధలను, విజయవంతంగా నడుస్తున్న సంస్ధలను ప్రైవేటు వ్యాపారులకు దారాధత్తం చేయలేదు. పైగా అదే మా విధానమని ఏ ప్రభుత్వం అంత మొండిగా చెప్పలేదు. దేశ ప్రజలు బిజేపి ప్రభుత్వం పెంచుతున్న ధరలను, వేస్తున్న పన్నులను, భారాలను మోస్తున్నారన్న భ్రమల్లో బిజేపి నేతలన్నారా? ప్రజలు ప్రశ్నించడం లేదు?
తిగబడడం లేదంటే సమ్మతిస్తున్నారని అనుకుంటున్నారో? అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా ప్రజల మీద తీవ్ర ఒత్తిడి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. ప్రశ్న బతికిన సమాజంలోనే సమసమాజం వెల్లివిరిస్తుంది. అసలు తమను ప్రశ్నించొద్దు? మేం ఏం చేసినా విమర్శించొద్దు? అన్న దోరణి ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు. 1975 ఎమర్జెన్సీ మీది జరిగిన తిరుగుబాటు పునాదుల మీద నిర్మాణమైన బిజేపి అదే దారిలో నడవడం అంటే తన పతనాన్ని తానే కోరుకోవడం అవుతుంది. ప్రజలు నమ్మినంత వరకే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసిన రాజులే చరిత్రలో చోటు సంపాదించుకోలేదు. అలాంటిది ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజల సంక్షేమం కాంక్షించకపోతే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవు. నాయకుల స్ధ్వార్ధ ప్రయోజనాలు దేశ సందను కొల్లగొట్టేదాకా వెళ్లొద్దు. దేశమంతా ఇదే మాట చెబుతోంది. కాని వినిపించుకోడం మా విధానం కాదనుకుంటే, తప్పించడం మా విధానమని ప్రజలు సమయం వచ్చినప్పుడు పక్కన పెడతారు. అప్పుడు ఆత్మావలోకనం చేసుకున్నా, ఆత్మపరిశీలన చేసుకున్నా, ఎక్కడ లోపం జరిగిందని చర్చించుకున్నా లాభం ఏమీ వుండదు. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేళ్ల క్రితం నాలుగువందలు వున్న సిలెండర్ ఇప్పుడు 1200లకు చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే ధరల మోత సామాన్యుడి నడ్డి విరిస్తోంది. ఎంత సేపు మత రాజకీయాలు తప్ప, మానవత్వం విలువలు మాయమైన రాజకీయాలు చేస్తామంటే ప్రజలు కూడా ఒప్పుకోరు. అంతే కాదు ఎంత సేపు హైందవ సమాజ మేలు కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటూ సాగించే బిజేపి రాజకీయాల్లో దేశంలో ధరల మోత మోసేందంతా హిందూ ప్రజలే మర్చిపోవద్దు? అఖండ భారతా వని అనే మాట పదే, పదే మాట్లాడేవారు ఇతర మతాలను కడుపులో పెట్టుకొని చూసుకునేలా వుండాలి. అంతే కాని శివమైతే మాకు, శవమైతే మీకు అన్న ధోరణి సామరస్యానికి విఘాతమౌతుంది.
ఇదిలా వుంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల సంపదను ఉత్తరాధి వ్యాపారులకు దారాధత్తం చేయడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఆక్షేపిస్తూ వస్తోంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను బిజేపి తన గుప్పిట్లో పెట్టుకొని,నేతల నోరు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నది ప్రధాన వాదన. ఆంద్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్న నినాదంతో మొదలైన విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకనటకే కొన్ని దశాబ్దాలు పట్టింది. ఆ ప్రకటన తర్వాతా దాని నిర్మాణానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఆఖరకు తెలుగు ప్రధాని పి.వి. నర్సింహారావు చేతుల మీదుగా ఎంతో సంతోషంగా ప్రారంభించుకొని, పరిశ్రమ సాధించుకున్నంత కాలం కూడా పని చేయకుండానే ప్రైవేటు పరం చేస్తామనడం న్యాయమా? ఇదే తెలుగు ప్రజల తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గుర్రుగా వున్న ప్రజలనుంచి తీవ్ర నిరసన రాకుండా వుండేందుకు ముందు నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నామన్న సాకును కేంద్రం చెప్పడంలోనే కుట్ర దాగి వుంది. ఇదే తెలుగు ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళన. దానికి ఆజ్యం పోసేలా తాగాజా కూడా కేంద్రం విశాఖ స్టీల్ అమ్మకం విషయంలో వెనకడుగు లేదని తేల్చడం కూడా తెలుగు ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. కాని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న వైపిసి స్పందనలేదు. తెలుగుదేశానికి పట్టింపు లేదు. జనసేన నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రకటన లేదు. అంటే ఆంద్రుల హక్కు అని పోరాడి, ఎంతో మంది ప్రాణాలొడ్డి సాధించుకున్న విశాఖ స్టీల్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టుపెడుతున్న సీమాంధ్ర పార్టీల కళ్లు తెరిపించే ప్రయత్నం కేసిఆర్ చేశారు. అయినా వారిలో ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే నిద్రపోయేవారిని లేపొచ్చు. కాని నిద్ర నటించేవారిని లేపలేము? సీమాంధ్రలోని అన్ని పార్టీలకు బిజేపి రక్షణ కావాలి. అండా దండ కావాలి. వారు గెలిచేందుకు ఆ పార్టీ తోడు కావాలి. మొత్తంగా ఆ మూడు పార్టీలకు కేంద్ర పెద్దల ఆశీస్సులు కావాలి. అంతే కాని ప్రజల ఆకాంక్షలతో వారికి పనిలేదు? ఇదేనా రాజకీయం? తెలంగాణలో సింగరేణిలోని నాలుగు బ్లాక్‌లను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సింగరేణి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే వుండాలని వాదిస్తోంది. అలాగే విశాఖ ఉక్కు ప్యాక్టరీ నిర్వహణ కోసం కూడా ముందుకు వస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు బిఆర్‌ఎస్‌తో కలిసి రావడం లేదు? పైగా బిఆర్‌ఎస్ ఆ రాష్ట్రానికి చేయాలనుకుంటున్న మేలు కూడా ఆ పార్టీలకు నచ్చడం లేదు. ఇలా ప్రజల మధ్య , రాష్ట్రాల మధ్య ఐక్యతా లేమి మూలంగానే బిజేపి మరింత బలపడుతోందన్నది ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. ఇటీవల పెరుగు ప్యాకెట్లపై హిందీలో పేరు వుండాలన్న కేంద్రం ఒత్తిడిని అటు కర్ణాటక, ఇటు తమిళనాడు తీవ్ర స్ధాయిలో నిరసన వ్యక్తం చేశాయి. అక్కడి రాజకీయ పార్టీలు ఒక్కమాట మీద నిలబడ్డాయి. కేవలం పెరుగు ప్యాకెట్ల మీద పేరు మీద మీదనే ఇంత ఐక్యత కనబర్చితే, తెలుగువారి హక్కు, సొత్తు, ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కు జోలికి వస్తే ఎందుకు స్పందించడం లేదో? ఆయా పార్టీలే ప్రజలకు సమాధానం చెప్పాలి?
`మంత్రి తలసానిని ఓడిస్తే భవిష్యత్తులో తానే మంత్రిని అని కలలు?
`టికెట్ దక్కేలా లేదని ఆందోళన?
`అయినా తన ప్రయత్నం ఆపనని సన్నిహితుల వద్ద ప్రస్తావన?
`అంబేద్కర్ జయంతి రోజు హంగామాతో మళ్ళీ అధినేత ఆశీస్సులు పొందాలని తాపత్రయం?
`బిఆర్‌ఎస్ డిల్లీ కార్యాలయం ప్రారంభానికి దూరం?
`అప్పటికే ఇతర పార్టీలతో సంప్రదింపులు?
`ఎక్కడా టికెట్ దక్కే అవకాశం కనిపించలేదు?
` కాంగ్రెస్ కాదన్నది?
`బిజేపి వద్దన్నది?
`బిఆర్‌ఎస్ లో కూడా అంతే సంగతులు అని తేలిపోయింది?
`ఏదైనా కొత్త కుంపటిలో దూరడమే అంటున్నారు?
`దానంను దూరం పెడుతున్నారని తెలిసి బిఆర్‌ఎస్ కార్యకర్తల్లో సంబరాలు?
`మా ఉసురు తగిలిందని గ్రూపులలో వాట్సన్ సందేశాలు?
హైదరబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో అన్ని రోజులు మనవి కాదు. ఎప్పుడూ మనకే అనుకూలంగా వుండవు. ఎత్తు పల్లాలు సహజం. కని అవాంతరాలు సహజంగా వచ్చేవే అయితే సరే..కాని నాయకులే సృష్టించుకుంటే..అహానికి పోయి తనే సర్వస్వం అనుకుంటే కాలం కూడా ఎదురుతిరుగుతుంది. అందుకే రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ చెడగొట్టరు. వాళ్లకు వాళ్లే తమ రాజకీయ జీవితంలో అలజడులు సృష్టించుకుంటారు. నిలకడలేని నాయకత్వం చేసేవారిలోనే ఇలాంటి సంఘటనలు, సందర్భాలు చూస్తుంటాం. అయినా వారిలో మార్పు రాదు. ఇలాంటి రాజకీయాలు చేసినా కొన్ని అవకాశాలు మళ్లీ తలుపుతడతాయి. అయినా వాటిని నిలుపుకోరు. అలాంటివారిలో దానం నాగేందర్ ఒకరు. ఆయనకు అనేక సందర్భాలలో అవకాశాలు కలిసొచ్చినా, కావాలని ఆయన చేజేతులా చేసుకున్న నిర్ణయాలే రాజకీయ అవకాశాలు తలకిందులు చేశాయి. పడుతూ లేస్తున్నట్టు కనిపించినా, అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడమే కాదు, నమ్మిన వాళ్లను కూడా నట్టేట ముంచే రాజకీయాలు చేయడమే అవుతుంది. ఇప్పుడు కూడా అదే చేసే కుయుక్తులు పన్నడమే కాకుండా, నమ్మి గెలిపించిన ప్రజల కోసం పనిచేయడం లేదని, పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఆది నుంచీ వున్నవే. సహజంగా ఎవరినీ లెక్కచేయిన మనస్తత్వం దానం నాగేందర్‌ది అంటారు. గత ఎన్నికల మందు బిఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి కేసిఆర్ ఖైరతాబాద్ టిక్కెట్టు ఇచ్చారు.
కాని ఆయన పార్టీ కోసం పెద్దగా పనిచేసినట్లు కనిపించదు. పార్టీ నేతలను కలుపుకుపోతున్నట్లు వుండదు. సహజంగా తాను హైదరాబాద్ బాద్‌షా అన్నంతగా మాట్లాడే దానం నాగేందర్ గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పెద్దగా పాత్ర పోషించలేదన్న వాదనలు వున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో వున్న సమయంలో ఆయన ఆ పార్టీ కోసం పనిచేసినంతగా ఇప్పుడు బిఆర్‌ఎస్ కోసం పనిచేయడం లేదన్నది చాలా మంది చెబుతున్న మాట. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో అటు బిజేపిపైగాని, ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్ పార్టీలంటే ఒంటి కాలు మీద లేచేవారు. నిత్యం వార్తల్లో వుంటూ వుండేవారు. దూకుడు ప్రదర్శిస్తూ వుండేవారు. అనేక సార్లు ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ వుండేవారు. ఇక అసెంబ్లీలో అయితే దానం తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ను , ఉద్యమ నాయకులైన ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతుండేవారు.కాని ఇప్పుడు బిఆర్‌ఎస్‌లోవున్నారు. బిజేపి పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇటీవల బిజేపి చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం లేదు. కల్వకుంట్ల కవిత విషయంలో బిజేపి అనుసరిస్తు తీరును ఆక్షేపించడం లేదు. ఎక్కడా దానం ఆ విషయాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఇలా పార్టీలోనే వుంటూ పార్టీకి అంటీ ముట్టనట్లు వుంటున్నాడు. బిఆర్‌ఎస్‌కు అండగా వుండడం లేదు. ఇదీ పార్టీ శ్రేణులు చెబుతున్న మాట. అంతే కాకుండా దానం ఉద్యమ నాయకుడు కాదు. ఉద్యమ సయమంలో కాంగ్రెస్‌లో వున్నా, ఉద్యమానికి ఏనాడు సహకరించింది లేదు. అప్పటి కాంగ్రెస్ ఎంపిలు, కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల ఉద్యమానికి పరోక్ష మద్దతు తెలిపినా, దానం మాత్రం పూర్తి విరుద్దంగా వ్యవహరించారు. దానంకు ఆది నుంచి తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రకటన చేయడమే నచ్చలేదు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం ఇష్టం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమ తీవ్రత, ముఖ్యమంత్రి కేసిఆర్ దీక్షకు తలొగ్గి, యూపిఏ తెలంగాణ ప్రకటన చేసింది.
అర్దరాత్రి స్వతంత్రంలాగా తెలంగాణకు స్వాత్యంత్య్రం వచ్చింది. కాని సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి అన్ని పార్టీలు ఏకమై, చంద్రబాబు నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేశారు. దాంతో తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది.
ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చాలా మంది రాజీనామా చేశారు.కాని దానం నాగేందర్ రాజీనామా చేయలేదు.
ఎందుకంటే ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదు. ఒకనాడు వైఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాసిన ఉత్తరంలో సంతకం చేసిన దానం నాగేందర్, అదే సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పక్కన చేరి తెలంగాణను అడ్డుకున్నాడు. అందుకే ఆయన ప్రతి సందర్భంలోనూ తెలంగాణను వ్యతిరేకించారు. పైగా శ్రీకృష్ణ కమిటికీ దానం నాగేందర్ ప్రత్యేక నివేదిక ఇచ్చారు. తెలంగాణ వద్దన్నారు. ఒక వేళ తెలంగాణ ఇవ్వాల్సి వస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ మొకాలడ్డిన నేత దానం నాగేందర్. అయితే సమైక్యాంద్ర ప్రదేశ్ వుండాలి. లేకుంటే మా హైదరాబాద్ మాకే అన్న నినాదంతో ఉద్యమం కూడా చేస్తానని అనేక సార్లు తెలంగాణ వాదులకు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఆంధ్ర నాయకులు చెప్పినట్టు వింటూ, వారు ఆడిరచినట్లు ఆడిన దానం నాగేందర్ బద్ద తెలంగాణ వ్యతిరేకి. బిఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు ఇంకా తెలంగాణ మీద మమకారం పెరిగినట్లు లేదని అంటున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌లో చేరినా, ఆది నుంచి ఆయనతో కొనసాగుతున్న అనుచర గణానికి ఇచ్చిన ప్రాదాన్యత ఉద్యమ కారులైన కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యతనివ్వడం లేదన్నది ప్రధాన ఆరోపణ.
అడుగడుగునా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న దానం నాగేందర్ ఉద్యమకారులైన నాయకులతో సఖ్యతగా వుంటాడని అనుకోవడం కూడా భ్రమే అవుతుంది.
తిట్టే నోరు..నడిచేకాలు ఊరుకోదని ఆనాడు తెలంగాణ వాదులను తిట్టి, తిట్టీ రాజకీయాలు చేసిన దానం నాగేందర్ బిఆర్‌ఎస్‌లో వున్నా ఆ పార్టీ మీద పెద్ద మమకారం లేదు. ఎందుకంటే ఇటీవల డిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభానికి తెలంగాణ ఎమ్మెల్యేలంతా వెళ్లారు. కాని దానం నాగేందర్ మాత్రం డిల్లీ వెళ్లలేదు. కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదన్నది నాయకులకు చెబుతున్న మాట. ఇదిలా వుంటే అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నాయకులతో సఖ్యత లేని దానం నాగేందర్ ఎలాగైనా ఈసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఓడిరచాలన్న స్చెచ్ వేస్తూ వస్తున్నాడని పార్టీ గుర్తించిందని సమాచారం. దాంతో దానం నాగేందర్ రాజకీయాన్ని పసిగట్టిన తలసాని తన రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టినట్లు కూడా తెలుస్తోంది. నగర ఎమ్మెల్యేగా మంత్రి తలసానితో సఖ్యతలో వుండాల్సిన సమయంలో ఆయనతో వైరం కొని తెచ్చుకోవడం దానంకు చెక్ పెట్టేదాకా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎలాగైనా ఈసారి దానంకు టిక్కెట్టు ఇచ్చేందుకు పార్టీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకున్నట్లే ప్రగతిభవన్ వర్గాల అంటున్నాయని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అందుకే తన ప్లాన్ బెడిసికొట్టేలా వుందన్న సంగతి తెలిసిన దానం ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరాలని అనుకున్నారట. కాని అక్కడ ద్వారాలు మూయబడ్డాయన్న సమాచారం అందడంతో అటు వైపు చూడకుండా, బిజేపి వైపు చూడాలని ప్రయత్నం చేశాడట. కాని అక్కడ కూడా చోటు లేదని తేల్చి చెప్పడంతో ఇక బిఆర్‌ఎస్‌లోనే వుండడమా? లేక తెలంగాణలో వచ్చే కొత్త కుంపటి ఏదైనా సరే అందులో చేరడమా? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్నట్లుంది వారి పరిస్థితి
బురదజల్లడం మానుకోవాలి..
నేటిధాత్రి హైదరాబాద్:కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నాపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణ, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని కవిత తెలిపారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని కవిత పేర్కొన్నారు.
తప్పుడు వార్తలు..
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. గతంలో మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్‌ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు ఉంది. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరింత దిగజారి వార్తలు ప్రసారం చేస్తారని తెలంగాణ సమాజం గ్రహించాలని, జాగ్రత్త పడాలంటూ కవిత సూచించారు.
తలవంచం.. తెగించి కొట్లాడుతాం..
తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఏంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ మీద కక్షతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. నా మీద బురదజల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత, దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం.. అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రకటన విడుదల చేశారు.
భారత గణతంత్ర ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాణ సారథి రాజనీతి దురంధరుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి చైతన్య శక్తి అంటరాని కులములో పుట్టి అపర మేదావిగా రాణించిన అంబేద్కర్ మాట మన బాట కావాలి కులం పేరున సమాజం కుళ్ళి పోవద్దు కులమనే వట వృక్షాన్ని.కూకటి వేళ్లతో పెకిలించాలి అంటరాని తనం వద్దు కుల మత రహిత సమాజమే ముద్దు వివక్షత అస్పృశ్యత పేదరిక రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా క్రియ శీల పాలన కార్యచరణకు ప్రభుత్వాలు పూనుకోవాలి సాంఘిక దురాచారాలను సమాధి చేసి సమ సమాజ స్థాపనకు కలలు కని ఉజ్జ్వల భవిష్యత్తు భారత్ కై మేథస్సును దారబోసిన విజ్ఞాన ఖని అంబెడ్కర్ ఆశించిన పీడిత వర్గాల విముక్తి అణగారిన వర్గాల హక్కుల రక్షణ సామాజిక ఆర్థిక న్యాయ కల్పనకు ప్రభుత్వాలు పాటు పడాలి ప్రగతి పురోగతి పథంలో ప్రజల భాగస్వామ్యంతో అన్ని వర్గాల అభివృధి కోసం పాటుపడాలి ఓటు హక్కు ఆయుధంతో సామాన్యుని సార్వభౌమున్ని చేసిన ఆధునిక ప్రజాస్వామ్య రూపశిల్పి ఎస్సీ ఎస్టీ బిసి మహిళ వెనుకబడిన వర్గాల రాజకీయ చైతన్య ప్రదాత అంభేడ్కర్ ఆశించిన రాజ్యాధికారం లో బహుజనుల మహిళల వాటా పెరగాలి నోటుకు ఓటును అమ్ముకోవద్దు నీతి నిజాయితీ వంతులకే పట్టం కట్టాలి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమ పంపిణీ న్యాయం జరగాలి అంబేడ్కర్ స్మరణ ప్రభుత్వాలకు పౌర సమాజానికి ప్రేరణ కావాలి అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవాలు అలంకార ఆర్బాటాలు కాకుండా దళిత పేద తాడిత పీడిత వర్గాల అభివృధికి నూతన దిశ దశ కావాలి అంబేడ్కర్ ఆశయాల సాధనే ప్రభుత్వాల కార్యాచరణ కావాలి అంబేడ్కర్ స్మరణ అభివృధికి ప్రేరణ (సంకల్పం ) కావాలి అంబేడ్కర్ మాటే పౌరసమాజం బాట కావాలి చదువుకోండి సంఘటితం కండి పోరాడండి అనే అంబేడ్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణే కర్తవ్యంగా ప్రభుత్వం పౌర సమాజం ఉద్యమించాలి
ప్రభుత్వం,పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసాన్నిచ్చిన కేటీఆర్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వర రావులతో కలిసి
చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.రవిచంద్ర గురువారం ఉదయం మంత్రులు కేటీఆర్,అజయ్ కుమార్,ఎంపీ నాగేశ్వరరావులతో పాటు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి,అందులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి ప్రభుత్వం,పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసాన్నిచ్చారు.వారు నిమ్స్ అధికారులు,వైద్యుల బృందంతో మాట్లాడి మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని,వీరి సహాయకులు,కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.
-ఇప్పుడు అదే దారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ?
-అసలు రహస్యం ఎందుకు చెప్పవు పొంగులేటి?
-పదవుల వంకతో అసలు ముచ్చటేమిటి?
-కరంటు మోటార్లకు మీటర్ల మతలబు ఏమిటి?
-ఆ కాంట్రాక్టు గుట్టేమిటి?
-బిజేపితో లోపాయి కారి ఒప్పందమేటి?
-కోవర్టు రాజకీయాల మాటేమిటి?
-అసలు సంగతి బైటపడితే పరిస్థితి ఏమిటి?
-లోగుట్టు మీటర్లకెరుక?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఎంచుకున్న దారిలో వెళ్లలేనప్పుడు, వున్నదారిలో వెళ్లలేని స్ధితిని తెచ్చుకున్నప్పుడు, ఏదారిలో వెళ్లాలో అర్ధం కాదు. గందరగొళాలు చుట్టు ముట్టినప్పుడు, చెప్పుడు మాటలు వినడం నేర్చుకున్నప్పుడు , చే జేతులా చెడగొట్టుకుంటున్నప్పుడు, కళ్లు మూసుకుపోయినప్పుడు, ఎంత వెలుగున్నా దారి కనిపించదు. అహం తెచ్చే చీకటికి ఏ దారి కనిపించదు. ఏ తోవలో వెళ్లాలో తోయదు. కూడలి మధ్య నిలబడినా అసలు దారి దొరకదు. సరిగ్గా ఇప్పుడు ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దారి కోసం ఎదురుచూస్తున్నాడు. వెళ్తున్న దారిలో తనకు తానే ముళ్లు పర్చుకొని కొత్త దారి కోసం ఆరాటపడుతున్నాడు. పక్కవారి మాటలు విని, అసలు దారినొదిలేశాడు. మొత్తం చీకటి పడితే గాని రహదారి విలువ అర్ధం కాదు. అర్ధం పర్ధం లేని మాట పట్టింపులకు పోయి, అనర్ధాలు కొని తెచ్చుకుంటున్నాడు. చెప్పే వారు ఎంతో మంది వుంటారు. కాని ఆదుకునే వారు ఎవరూ వుండరు. అవసరానికి ఒక్కరు కూడా చేతికందరు. బెల్లం వున్నప్పుడు ఈగలు వాలినట్లు, చెరువులో నీళ్లున్నప్పుడు కప్పలు చేరినట్లు కొంత కాలమే జనం పోగయ్యేది. కల చెదిరిన నాడు ఎవరూ మిగలరు. పలకరించేవారు కూడా కనిపించరు. ఇదే పొంగులేటి భవిష్యత్తు.
ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడిన తర్వాత పదవులు లేకుండా ఏ నాయకుడు వుండాలనుకోడు.
కాని అనూహ్యంగా వచ్చిన పదవులు కూడా కొన్ని సార్లు కలలా వచ్చి చెదిరిపోతుంటాయి. మళ్లీ మంచి రోజులు వచ్చేదాకా ఎదురుచూస్తే తప్ప, రాజకీయాలు ఏలలేరు. గతంలో ఇలా ఎంతో మంది సీనియర్ నాయకులు ఎత్తుపల్లాలు చూసినప్పుడు కూడా ఒకేలా వుండడంతోనే ఇప్పటికీ వారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఎత్తును చూసినప్పుడు ఎడిరిపడి, పల్లం చూసినప్పుడు ఓపిక లేని నేతలను ప్రజలే కాదు చరిత్ర కూడా మర్చిపోతుంది. అప్పుడు నేనున్నాని ఎంత మొత్తుకున్నా కాలం కనికరించదు. సమాజం గుర్తించదు. అలా ఉనికికి కోల్పోయిన నేతల్లో జితేందర్‌రెడ్డి ఒకరు. బిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం లో వెలుగు వెలిగాడు. తెలంగాణ రాష్ట్ర సమితి( ఇప్పుడు భారత రాష్ట్ర సమితి) ఉద్యమ పార్టీ. ఉద్యమ నేతలందిరకీ అవకాశాలు రావాలి. వచ్చిన వారికే అవకాశాలు వస్తూ పోతే, ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలంటే కొన్ని దశాబాద్దాల కాలం పడుతుంది. అందుకే మొదటి సారి 2014 ఎన్నికల్లో అవకాశం కల్పించి, టిక్కెట్టు ఇచ్చి జితేందర్‌రెడ్డిని ఎంపిని చేసింది పార్టీ. అయితే ముందస్తు ఎన్నికలు ఎవరి లెక్కలేమిటో? ఎవరి పనితనం ఏమిటో? ఎవరు పార్టీ కోసం ఎంత పనిచేశారో తేల్చేశాయి. అందులో జితేందర్‌రెడ్డి కూడా వున్నారు. దాంతో ఆయనను ముఖ్యమంత్రి కేసిఆర్ పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో జితేందర్‌రెడ్డికి తెలుసు. ముందస్తు ఎన్నికల్లో పార్టీకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ఆయనకు తెలుసు. అయినా నేను శుద్దపూసని అని చెప్పుకుంటే సరిపోతుందా? పార్టీకి ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు ద్రోహం చేస్తున్నారు? అన్నది శ్రేణులకు తెలియకుండా వుంటుందా? పార్టీ అధిష్టానానికి సమాచారం చేరకుండా ఆగుతుందా? ముందస్తు ఎన్నికల సమయంలో కొన్ని సర్వే సంస్ధలు, ముఖ్యంగా ఆనాడు ఆంధ్రకు చెందని ఓ నాయకుడి సర్వేలను చాలా మంది ఫాలో అయ్యేవారు. ఆ సర్వేలో బిఆర్‌ఎస్ ప్రభావం లేదంటూ ఆయన చేసిన సర్వేలను నమ్మి, పార్టీకి నమ్మకం ద్రోహం చేసిన వారిలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వున్నారు. నిజానికి ఈ ముగ్గురు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. కాని ఆ సమయంలో ముందస్తుకు వెళ్లడంతో వారికి అవకాశం దక్కలేదు. పైగా తమకు టిక్కెట్లు ఇవ్వలేదన్న అక్కసును పెట్టుకొని, పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేశారు. ఇది ఇంటిజెన్స్ ద్వారా తేలిపోయింది. పార్టీ శ్రేణుల ద్వారా రుజువైంది. వారు అనుకున్నట్లు కాకుండా, ప్రజా తీర్పుముఖ్యమంత్రి కేసిఆర్ ఆశించినట్లుగా వచ్చింది. తమ పాలన మీద తమకే నమ్మకం లేని నాయకులు వున్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకొని ముఖ్యమంత్రి కేసిఆర్ వారిని పక్కన పెట్టారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే టిక్కెట్లు ఇవ్వలేదు. దాంతో తామెంతో నిజాయితీ పరులమన్నట్లు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలు రాత్రికి రాత్రి పార్టీలు మారారు. జితేందర్‌రెడ్డి తన బలాన్ని అతిగా ఊహించుకొని బిజేపిలో చేరి ఓడిపోయారు. విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారు. అధికారంలో వున్నంత కాలం చేయాల్సినన్ని కాంట్రాక్టులు చేసుకున్నారు. సంపాదించాల్నింది సంపాదించుకున్నారు. కాని పార్టీకి మేలు చేయాలన్నది మర్చిపోయారు. మిషన్ భగీరధ కాంట్రాక్టులు బాగానే చేసుకున్న విశ్వేశ్వరరెడ్డి సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఎగ్గొట్టి వారి జీవితాలతో ఆటలాడుకొని, తాను సచ్చీలుడినని చెప్పుకుంటాడు. ఆయన మూలంగా ఎంతో మంది సబ్ కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం నుంచి మాత్రం విశ్వేశ్వరరెడ్డి బిల్లులు ఎత్తేసుకున్నాడు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను తూర్పారపడుతున్నాడు.
ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విషయంలో గత పార్లమెంటు ఎన్నికలలో టిక్కెట్టు ఇవ్వకున్నా, తాను చేసిన తప్పేంటో తెలిసి కొంత కాలం ఓపికపట్టారు.
నిజానికి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్‌కు సీట్లు రాకపోవడానికి ప్రధాన కారణం పొంగులేటి అన్నది అందరూ చెప్పే మాటే. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌గాని, మంత్రికేటిఆర్ గాని ఎంతో గౌరవంగానే చూసుకున్నారు. అయినా ఆయనలో మార్పురాలేదు. ఇటీవల కూడా ఆయనకు రాజ్యసభకు పంపిస్తామని చెప్పినా, భుజ్జగించినా ఆయన వినిపించుకోలేదు. అసమ్మతి వాదిగా వుండడనికే ఆయన ఇష్టపడ్డారు. అందుకు పైకి ఒక కారణం వుంటే, లోన మరో కారణం వుంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మోటర్లకు మీటర్లు అనే దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా? అన్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా అనేక సభల్లో చెబుతూ వచ్చారు. ఆఖరుకు అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటార్లకు మీటర్లుపెట్టే పరిస్ధితి లేదని తేల్చిచెప్పారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి తలగ్గలేదు. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్కడి జగన్ ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది. ఆ కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చింది. ఇక తెలంగాణలో ఆ కాంట్రాక్టు కూడా తానకే రావాలని బిజేపితో సత్సంబంధాలు మొదలుపెట్టాడు. కాని తెలంగాణలో ఆ కాన్సెప్ట్‌నే ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యతిరేకిస్తున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఇష్టం లేని సర్కారు కాంట్రాక్టు ప్రస్తావన లేకుండా చేసింది. ఇది పొంగులేటికి నచ్చలేదు. తెలంగాణలో సుమారు 25లక్షలకు పైగా పంపుసెట్లు వుంటాయి. తెలంగాణలోవున్న పంపుసెట్లలో ఆంధ్రప్రదేశ్‌లో కనీసం సగం కూడా వుండవు. అలాంటిది అక్కడ రూ.4వేల కోట్ల కాంట్రాక్టు దక్కింది. అదే తెలంగాణలో అమలు చేస్తే కనీసం పదివేల కోట్ల కాంట్రాక్టు అందుతుంది. లాభం కూడా వేలకోట్లలో వుంటుంది. ఇలాంటి అవకాశం వస్తుందనుకున్నప్పుడు పార్టీతో ఏం సంబంధం. అందుకే ఓ ఏడాది కాలంలో గిచ్చి కయ్యం పెట్టుకోవడం మొదలుపెట్టాడు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చాడు. అలిగినట్లు రాజకీయనటన ప్రదర్శిస్తూ వచ్చాడు. ఇక ఎన్నికల తరుణం దగ్గరపడుతోంది. బిఆర్‌ఎస్‌లోనే వుంటే మహా అయితే టిక్కెట్టు వస్తుంది? అంతే! కాని అదే బిజేపిలోకి వెళ్తే అంత పెద్ద కాంట్రాక్టు చేజిక్కుతుంది. ఇదీ అసలు మ్యాటర్! ఇప్పుడు శుద్దపూసలెవరో? రాష్ట్రానికి మేలు చేసేదెవరో? రాజకీయం మాటను రైతులకే నష్టం చేకూర్చాలని అనుకుంటున్నదెవరో? ప్రజలకు అర్ధమౌతుంది.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ వచ్చే 45 రోజులపాటు టిఆర్ఎస్ పార్టీని తూర్పు నియోజకవర్గంలో ప్రతి గడపకు చేరేలా కృషి చేస్తాం అని తెలియచేశారు. కార్యక్రమ వివరాలు తేదీల వారీగా తెలియచేశారు.
ఏప్రిల్ 12 నుండి 17 వరకు ఇంటింటికి బొట్టు పెట్టి, ఆహ్వాన పత్రిక అందచేసే కార్యక్రమం
ఏప్రిల్ 18 నుండి 24 వరకు ప్రతి డివిజన్లో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
ఏప్రిల్ 25వ తేదీన, వరంగల్ తూర్పు 35వ డివిజన్లో మొదటి ఆత్మీయ సమావేశం కానుంది
మే 13 నుంచి 31 వరకు ప్రతి డివిజన్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మే 7, 8 తేదీలలో కార్మికులతో సమీక్ష, వారికి లేబర్ కార్డు నన్నపనేని నరసింహమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పించడం జరుగుతుంది
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీ నుంచి తొలగించబడుతుంది
జీవో నెంబర్ 58, 59 ప్రకారం గుడిసె వాసులకు వారి వద్దకు వెళ్లే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలకు అయ్యే ఖర్చులు కూడా నన్నపనేని ట్రస్ట్ భరిస్తుంది అని తెలియచేశారు
కావాలని డిస్టర్బ్ చేసిన వారి మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. క్రమశిక్షణకు మారు పేరు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
ప్రతి డివిజన్ లో 2000 మందితో కూడిన సమ్మేళనం ఉంటుంది అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.