బలమైన శక్తిగా బిఆర్‌ఎస్‌

 

`దేశవ్యాప్తంగా మారుతున్న ప్రజల ఆలోచనా సరళి

`భరించలేని పన్నుల భారం నుంచి బిఆర్‌ఎస్‌ తోనే విముక్తి

` రైతుకు పరిహారం పదివేలతో కేసిఆర్‌ నిర్ణయం అపూర్వం.

`దేశ వ్యాప్తంగా కొనియాడుతున్న రైతాంగం.

` కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా రైతులను ఆదుకుంటున్న వైనం.

`రాజకీయ కక్ష సాధింపులపై ఎత్తిన పిడికిలి బిఆర్‌ఎస్‌.

`ప్రభుత్వ రంగ సంస్థల దుర్వినియోగంపై గళం కవిత.

`బిజేపిని ఎదుర్కొని నిలబడిన నాయకుడు కేసిఆర్‌.

`కేంద్రాన్ని నిలదీయగల శక్తి కేసిఆర్‌ 

`మార్పు మొదలైంది… దేశం బిఆర్‌ఎస్‌ కోసం చూస్తోంది. 

` నిస్పక్ష రాజకీయాలు మళ్ళీ చిగురించాలి.

` అందుకు నడుంబిగించిన బిఆర్‌ఎస్‌. 

` రైతు సంక్షేమ రాజ్య స్థాపన.

` పేద ప్రజల ఆలంబన.

`దేశ స్వావలంబన.

` దేశానికి కేసిఆర్‌ నాయకత్వంలోనే వికాసం.

` రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రజాస్వామ్యమైనా, రాజరికమైనా ప్రజల మీద ఒత్తిడి ఎప్పుడూ పనికి రాదు. రాజకీయాలలో ఆధిపత్య రాజకీయాలు వేరు. ఇతర పార్టీల మీద ద్వేషం వేరు. మేం మాత్రమే రాజకీయాలు చేయాలనుకునే దురుద్దేశ్యం రాజకీయ పార్టీలకు అసలే మంచిది కాదు. ఇప్పుడు బిజిపి చేస్తున్నది అదే…అందులో భాగంగా బిజేపి రాజకీయాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలించమని ప్రజలు అధికారం అప్పగిస్తే, ప్రజాసేవ పక్కన పెట్టి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారనర్న భావన బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ, ధరల మోతలు, పన్నుల వాతలు సామాన్యుడి బతకు దినదిన గండంగా మారే దశకు చేరుకుంటున్నాయి. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు, బ్యాంకులు రుణాలు మాఫీలు, అదే సామాన్యులకు వేధింపులు బిజేపిని పతనం అంచుకు తీసుకుపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. కరోనా సమయంలో వ్యాక్సినేషన్‌ ఉచితం వేశామని, ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి వచ్చిన అనేక రుగ్మతలకు అవససరమైన వ్యాక్సినేషన్‌ అప్పటి ప్రభుత్వాలు ఉచితంగానే అందిస్తున్నాయి. కాని బిజేపి శ్రేణులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాని ప్రజల ఆరోగ్యంగా వుంటేనే రాజకీయాలు చేయగమలమన్న సోయి వుంటే బిజేపి ఇలాంటి ప్రకటనలు చేయదు. కాని నిత్యం ప్రజలకు మేం చేసిన మేలు ఎవరూ చేయలేదని, పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తున్నామంటూ గొప్పలు తమకు తామే చెప్పుకుంటే సరిపోతుందా? ప్రజలు చెప్పాలి. ప్రజలు మెచ్చుకోవాలి. ఏడాదికి నాలుగు సిలిండర్లు సరిపోవా…నెలకో సిలిండర్‌ ఎందుకు? వాడకం తగ్గిస్తే సరిపోదా? ఇదా ప్రభుత్వాలు చెప్పాల్సిన మాటలు. ఒకనాడు సిలిండర్‌ ధరల పెంపును రాజకీయం చేసిన బిజేపి పార్టీయే నేడు దాన్ని మూడొందల శాతం పెంచి, దేశం కోసం, ధర్మం కోసం పెంచామని చెప్పడాన్ని ఏమంటారు? ఉల్లి దర పెరిగితే రాజీకయం చేసిన బిజేపి, అదే ఉల్ల గడ్డను మేం తినమని ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించడాన్ని ఏమని సమర్ధించుకుంటారు? ఉల్లిగడ్డను తినడం ఆపేస్తే వాటి ధర అదే దిగిస్తుందన్న సూచనలు చేయడాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారు? బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో వుంటూ ఇలాంటి మాటలు చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోవడం లేదు. చెప్పే మాటలకు, చేసే చేతలుకు ఎక్కడ పొంతన లేని బిజేపి, రాజకీయలు తప్ప, వేధింపులు తప్ప మరేం చేయలేదని ప్రజలకు అర్ధమైందని ప్రతి పక్షాలు చరకలు అంటిస్తున్నాయి. ఓ వైపు దేశంలో అదానీ లాంటి వారికి ప్రభుత్వ రంగ సంస్ధలు కట్టబెడుతూ, బ్యాంకులను దోచి పెడుతూ, కంపనీలు దివాళా తీస్తే రుణాలు మాఫీ చేయడాన్ని ఏమంటారు? పైగా ప్రభుత్వం వ్యాపారం చేయదంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోడీయే వ్యాఖ్యానించడాన్ని ఏమని సమర్ధించుకుంటారు. గతంలో పాలన చేసిన వారికి తెలియకుండానే, పాలన తెలియకుండానే, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండానే అనేక ప్రభుత్వ రంగ సంస్ధలు ఏర్పాటు చేశారా? వాటి ద్వారా ప్రజలు సేవలందించారా? ఇలాంటి మాటలు చెబుతూ, ప్రైవేటు వ్యక్తులకు దేశ సంపద దోచి పెట్టేలా చేయడం కూడా దేశం కోసం..ధర్మం కోసమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వ్యక్తి కోసం దేశ సంపదను దారాధత్తం చేసేలా కేంద్రం సాగడంపై వస్తున్న విమర్శలకు ఎవరు సమాధానం చెబుతారు? అంతే కాకుండా దేశంలో వేధింపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. లేని కేసుల పేరుతో,వేధింపులే రాజకీయాలు అనే దిశగా సాగుతూ, లిక్కర్‌ స్కామ్‌ అంటూ కవిత లాంటి మహిళా నాయకురాలను పదేపదే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్దలతో విచారణ జరపడాన్ని ప్రజలు ఆహ్వానించడం లేదు. 

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

భవిష్యత్తు రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ సంచలనం నమోదు చేయబోతోంది. దేశంలో బిజేపికి ప్రజలకు రెండుసార్లు అవకాశం కల్పించారు. ఏదో అధ్భుతాలుచేస్తారని ప్రజలు కలలు గన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణం అన్న ఒకే ఒక్క లక్ష్యం తప్ప మరే లక్ష్యం లేని రాజకీయాలు చేసిన బిజేపిని నమ్మిన ప్రజలకు ఇప్పుడిప్పుడే బిజేపి అసలు స్వరూపం అర్ధమౌతోంది. దేశంలో మరే రాజకీయా పార్టీలు, ప్రాంతీయపార్టీలు లేకుండా చేసి, బహురాజకీయ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఏకఛ్చత్రాధిపత్యం కోసం బిజేపి ఆరాటపడడం అత్యాశే అవుతుంది. ఇతర పార్టీలు దేశంలో మనుగడ సాగించకుండా చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం. గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే, ఇప్పుడు బిజేపి కేంద్రలో అధికారంలోకి వచ్చేది కాదు. అనేక రాష్ట్రాలలో దాని పాలన సాగేది కాదు. ప్రతిసారి 1975 ఎమర్జెన్సీ బూచిని చూపి, రాజకీయం చేసిన బిజేపి, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ రాజకీయం చేస్తుందన్న విమర్శలకు మాత్రం ఎక్కడా సమాధానం లేదు. అందుకే ప్రజల్లో మార్పు వస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తున్నారు. అందులో ఆశాజనకంగా,ప్రజారంజకంగా పాలన చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలపై చర్చించుకుంటున్నారు. తెలంగా ణలో అన్ని వర్గాల ప్రజల సుఖశాంతులు తెలుసుకుంటున్నారు. ఒకనాడు వెనక్కునెట్టేయబడిన, అభివృద్ధికి దూరం చేసిన తెలంగాణలో ఇప్పుడు ప్రగతి విప్లవం సాధ్యమైందన్న దానిపై అధ్యయనాలు సాగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలను నుంచి ఎంతో మంది నిపుణులు వస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూశారు. కొనియాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాధించిన విజయాలను ప్రశంసిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని కీర్తిస్తున్నారు. కేసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరమని ఆహ్వానిస్తున్నారు. 

 దేశంలోనే రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నది.

 ఎందుకంటే ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు ద్వంసమైన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలకు పరిహారం అందించలేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన గంటలోపే జీవో జారీ కావడం, నిధులు విడుదల జరగడం అన్నది గతలో ఎన్నడూ చూడలేదు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్ధితులు ఎదురైతే ముందు కంటి తుడుపు చర్యలు చేపట్టడం, కేంద్రానికి ఉత్తరాలు రాశామని ప్రకటించి, ప్రజల్ని నమ్మించి చేతులు దులుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రైతుల పక్షాన ఏ ప్రభుత్వాలు నిలిచేవి కాదు. కాని నేడు తెలంగాణలో వున్న రైతు ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతులు మేలు కోరి పనిచేస్తోంది. ఇదే ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో దేశమంతా రైతు సంక్షేమం వెల్లివిరియాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి విపత్కరమైన పరస్ధితుల్లో కేంద్రాన్ని సాయం అడమని ప్రకటన చేయలేదు. మా రైతులను మేం కాపాడుకుంటామని ప్రకటించలేదు. నేనున్నాని..భరోసా ఇచ్చింది లేదు. కాని మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే అంత ధైర్యంగా ప్రకటన చేశారు. రైతులను ఆదుకుంటున్నారు. ఇప్పటికైనా బిజేపి నేతలు గ్రహించాలి. తెలంగాణ ప్రభుత్వం పరిహారాన్ని మరింత పెంచాలని డిమాండ్‌ చేస్తుందే గాని, కేంద్రం దృష్టికి తెచ్చి, తెలంగాణ రైతులకు పరిహారం అందిస్తామని ఏ ఒక్క బిజేపి ఎంపి మాట్లాడడం లేదు. అంటే వారికి రైతులపై ఎంత ప్రేమ వుందో ఇక్కడే అర్ధమౌతోందని బిఆర్‌ఎస్‌ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ అంటే మమకారం లేని బిజేపి నాయకులు రాష్ట్ర్రంలో వున్నారు. తెలంగాణ అంటేనే గిట్టని నాయకులు కేంద్రంలో వున్నారు. ఇలాంటి వారంతా కలిసి తెలంగాణకు న్యాయం చేస్తారని ఎదురుచూడడం కూడా ఆతిశయోక్తే అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ హుటాహుటిన రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాడు. రైతులనుకాపాడుకున్నాడు. తానున్నానని భరోసా కల్పించాడు. దేశానికి రైతు ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటాడు. అదీ కేసిఆర్‌ అంటే దేశమంతా కొనియాడలేలా చేసుకున్నాడు. ఆయన నాయకత్వం కోసం దేశమంతా ఎదరుచూసేలా చేసుకుంటున్నాడు. నాయకుడంటే కేసిఆర్‌లా వుండాలని వేనోళ్ల పొగిడేలా చేసుకున్నాడు.

తెలంగాణ ధీర..కవిత.

`ఈడీతో డీ..అంటే ఢీ.

`ఈడీ నో క్రెడిబిలిటీ!

`ఈ వేధింపులేంటి? కవిత సూటి ప్రశ్న.

`నేను సాక్షినా..?

`అనుమానితురాలినా?

`నిందితురాలిగా ప్రచారం ఎలా సాగుతోంది…అని నిలదీత?

`నా ఫోన్లు పగలగొట్టానన్న అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నారు? 

`ఈడీని కవిత నిలదీత?

`ఇవిగో..నా ఫోన్లు? 

`నేను సాక్షినే అన్నారు.. ఎన్నిసార్లైనా విచారించుకోండి?

`ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఇన్ని సార్లు ఎందుకు విచారిస్తున్నారు?

`కవిత ధైర్యానికి దేశమంతా ప్రశంసలు.

`రాజ్యాంగ బద్ద సంస్ధ వ్యవహరించాల్సిన తీరిది కాదు?

`రాజకీయ క్షక్ష ఈడికెందుకు కవిత ఘాటు వ్యాఖ్య!

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

కవిత అంటే ఒక ప్రశ్న. కవితంటే ఒక ధైర్యం..స్ధైర్యం..ఆత్మవిశ్వాసం..ఉద్యమం..పోరాటం..తిరుగబాటుకు నిర్వచనం..నిజాయితీకి నిలువెత్తురూపం.. ప్రజాసేవకు నిలువుటద్దం..తెలంగాణ ప్రజలంటే ప్రాణం..ప్రగతి సోపానం..ప్రగతి శీల సమాజ నిర్మాణానికి తార్కాణం..కవిత. ఆమె గురించి తెలియక, ఆమె అడుగులు తెలియక, ఆమె మనోబలం తెలియక, ఆమె త్యాగం తెలియక చాలా మంది చాల రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు ఆమెను ఎలా ఎదుర్కొవాలో తెలియక, బిఆర్‌ఎస్‌ను ఎలా అంతర్మధనంలో పడేయాలో తెలియక బిజేపి అల్లిన కట్టుకధ…అల్లిబిల్లి ఆట.. కవితను లిక్కర్‌ కేసులో ఎలాగైనా ఇరికించాలన్న కుట్ర కోణం…బిజేపి ఈడీ వెనకుండి ఆడిస్తున్న బాగోతం….అన్నది భారతరాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త చెప్పే మాట. అవును ఇందులో బిజేపి చెప్పే మాటలకు, ఈడీ ప్రచారం చేస్తున్న వార్తలకు, కవిత విషయంలో అసలు వాస్తవాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఇది జనం అనుకుంటున్న మాట. ఇదే నిజం కూడా అంటూ దేశంలోని ఇతర పార్టీలు చెబుతున్న మాట. అయినా ఈడీ అనేదానికి ఇప్పటిదాకా ఒక క్రెడిబిలిటీ వుంటుంది. వుండాలికూడా…కాని కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు వాటిని వాడుకోవడం అలవాటుగా మార్చుకున్నాయి. ఆ పార్టీలకు వ్యతిరేకంగా వున్న పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి ఈడిని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇది రాజకీయ పార్టీలు అనుకుంటున్న మాట. బిజేపిని తప్పుపడుతున్న మాట.

కల్వకుంట్ల కవిత.. ఒక్కరే ఇంత కాలానికి ఈడీ అనే సంస్ధకు చుక్కలు చూపించిందని చెప్చొచ్చు. 

ఈడీ అత్యుత్సాహాన్ని ప్రశ్నించిన ఏకైక రాజకీయ నాయకురాలు. ఇప్పటి వరకు ఈడీ అంటే భయపడిన వాళ్లే కాని, ఎవరూ దాన్ని నిందించలేదు. నిలదీయలేదు. ఎదిరించలేదు. లోపాలు ఎత్తి చూపలేదు. కాని మొదటిసారి ధైర్యంగా కల్లకుంట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..ఈడీకే ప్రశ్నలు సంధించింది. కేసు పూర్వాపరాలు పక్కన పెడితే రాజ్యాంగ బద్ద సంస్ధ అసంబద్దంగా వ్యహరిస్తుంటే కూడా ప్రశ్నించలేకపోవడం నాయకుల తత్వం కాదు. అందుకే నింద చెరిపేసుకోగల నమ్మకం, ధైర్యం వున్న వాళ్లు మాత్రమే కవితలాగా మాట్లాడగలరు. ఆమె ఏకంగా ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌కు ఉత్తరం రాయడం ఒక సంచలనం. ఇప్పటి వరకు కనీసం అలాంటి ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. అందుకే కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ పతాక అన్న పేరు మరోసారి సార్ధకం చేసుకున్నారు. తెలంగాణ ధీర అంటే కవిత అని మరోసారి నిరూపించారు. అసలు ఈడీ చెబుతున్నట్లు లిక్కర్‌ కేసులో తనకేం సంబంధం అన్న ప్రశ్నను ఆమె ముందునుంచి చెబుతూనే వస్తుంది. అయినా ఈడీ చేస్తున్న విన్యాసాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. వారి అసంబద్దమైన ప్రశ్నలకు కౌంటర్లు కూడా భహిరంగంగానే ఇస్తున్నారు. అంతటి ధైర్యవంతురాలని ఎందుకు ఈ కేసులోకి లాగామా? అని అటు బిజేపి, ఇటు ఈడీలు తలలు పట్టుకునే స్ధితిని తెచ్చిన కవితను దేశం మొత్తం హాట్సాఫ్‌ అంటున్నారు. 

ఈ నెల 11న రమ్మన్నారు..వచ్చాను..! 

మళ్లీ రమ్మన్నారు…సమన్లు ఇవ్వలేదు..కాని ముందే లీక్‌ చేశారు..నా ఫోన్‌తో మీకేం పని..ఇంటికి పంపించి ఫోన్‌ తెప్పించేలా చేశారు..తెప్పించాను..దాన్ని సీజ్‌ ఎందుకు చేశారు..ఇదీ కవిత అభ్యంతరం. మహిళగా తనకున్న హక్కులను కాలరాసే హక్కు ఈడీకి లేదు. ఇది కవిత వాదన. ఇందులో నిజముంది? ఒక మహిళకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించడం కూడ నేరమే అవుతుంది. ఈ విషయంలో సుప్రింకోర్టు ఎలా స్పందిస్తుందనేది త్వరలోనే తేలనుంది. సరే చట్టాలు చెబుతున్నాయి..అని..అంత ఖచ్చితంగా వున్నాయని ఒక మాజీ ఎంపి..ప్రస్తుత ఎమ్మెల్సీ , మహిళ అని కూడా చూడకుండా రాత్రి పొద్దుపోయేవరకు ఎనమిది తొమ్మిది గంటల దాకా విచారించాల్సినంత అవసరం ఏముంటుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. అయినా పలిగిలిపోని ఫోన్లును పగిలిపోయినట్లు, పగలగొట్టినట్లు ఎవరు ప్రచారం చేశారు? ఎందుకు ప్రచారం చేశారు? ఎవరు చేయమన్నారు? ఈడీ ఈ విషయాన్ని ఎలా బైటపెట్టింది? అన్న వాటికి కూడా సమాధానాలు రావాల్సివుంది. లిక్కర్‌ కేసులో నిందితులుగా చెప్పబడుతున్న వారి ఫోన్ల వివరాలు బైట పెట్టడం వరకు ఓకే..కాని కవిత ఇప్పటికీ నిందితురాలి జాబితాలో లేదు. ఎఫ్‌ఐఆర్‌ ఏమీ నమోదు కాలేదు? కేవలం సాక్షిగానే కవితను పిలున్నామన్న సంగతి కూడా ఈడీయే చెబుతోంది. మరి సాక్షుల హక్కులను కాలరాయమని చట్టం చెబుతోందా? అన్నదే కవిత అభ్యంతరం. ఫోన్‌ అన్న తర్వాత అనేక అంశాలుంటాయి. ఆమె ప్రజా నాయకురాలు. ప్రజా సమస్యలకు సంబంధించిన వివరాలుంటాయి. కుటుంబ విషయాలుంటాయి. వ్యక్తిగత గోప్యతలుంటాయి. ఇలా అనేక రకాల విషయాలు ఫోన్‌లోనే నిక్షిప్తమై వుంటున్న రోజులివి. ఆమె ప్రమేయంలేకుండా, ఆమె సమ్మతం లేకుండా బలవంతంగా సీజ్‌ చేయడాన్ని ఆమె సవాలు చేస్తోంది. సుప్రింకోర్టును కూడా ఆశ్రయించింది. ఇలా ప్రజల హక్కులను కాలరాయడం రాజ్యాంగబద్ద సంస్ధల విధి కాదని ప్రపంచానికి తెలియజేసేందుకు కవిత మొదలుపెట్టిన ప్రశ్నల వర్షం రేపటి సమాజానికి జవాబులను అందిస్తుందని చెప్పడంలో సందేహంలేదు. అంతే కాకుండా బిజేపి వాషింగ్‌ పౌడర్‌ నిర్మా కథలను కవిత ఈడీ అధికారులను ప్రశ్నించడం కొసమెరుపు. అసలు కవిత వ్యక్తపరుస్తున్న సందేహాల మీద చర్చ చేయాల్సిన మీడియా అదిగో అరెస్టు…ఇదిగో అరెస్టు అన్న వార్తలు తప్ప…హక్కుల రక్షణల గురించి చర్చించకపోవడం గమనార్హం.

సీఎం కేసీఆర్ రైతుబాందవుడు….

 

ప్రతీ రైతుకు సహాయం తప్పక అందుతుంది..

# ప్రస్తుత ధ్వంసమైన పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

# రైతులకు పెద్దమొత్తంలో పంటల నష్టం జరిగింది

# సీఎం ఆదేశాలతో పంటలు పరిశీలన చేశా.

# పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

# వరంగల్ జిల్లాలో 13 కోట్ల 76 లక్షల 86 వేల నష్టపరిహారం

 

# పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన పరిస్థితిని పరిశీలించండి 

# కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి చురుకలు

# నష్టపరిహారం రావడం రాష్ట్రంలో నర్సంపేట మొదటిది

# ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

# పూర్తిస్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావిణ 

# నర్సంపేట డివిజన్ కు 8 కోట్ల 89 లక్షల 43 వేల నష్టపరిహారం పంపిణీ

 

నర్సంపేట,నేటిధాత్రి :

 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు బాంధవుడు అకాల వర్షాలు వడగళ్ల వానకు ధ్వంసమైన పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి తప్పక సహాయం అందుతుంది అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతినగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పరిశీలన చేశామని అలాగే నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న రైతుల నష్టాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నదని అన్నారు అకాల వర్షాల వలన పంటలు ధ్వంసం కాగా కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లమీద ధర్నాలు చేస్తున్నారని మీ కాంగ్రెస్ పార్టీ పాలించే పక్కా రాష్ట్రాలలో ఒకసారి పరిశీలన చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి హితువు పలికారు. గత సంవత్సరం జనవరి నెలలో అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మిర్చి మొక్కజొన్న లతోపాటు వివిధ పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యి రైతులు నట్టేట మునిగారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు సర్వేలు నిర్వహించి పంటల నష్టాన్ని అంచనా వేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. ఈ మేరకు 28,567 ఎకరాలలో వివిధ రకాల పంటలు ధ్వంసం కాగా 26 వేల మంది రైతులు నష్టపోయారు. ఈ నష్టం పై అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇటీవల 13 కోట్ల 86 లక్షల 76 వేల రూపాయల విలువ గల నష్టపరిహారాన్ని విడుదల చేశారు. కాగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలకు చెందిన నష్టపరిహారం జరిగిన రైతులకు 8 కోట్ల 89 లక్షల 43 వేల 54 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ ప్రావీణ్యతో హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల చిన్న సూపు చూస్తున్నదని అన్నారు. గత సంవత్సరం జనవరిలో కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానల వలన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారని దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తో పాటు పలువురు అధికారులు ఎమ్మెల్యేలతో నష్టపోయిన పంటలను పరిశీలన చేసి అంచనా వేశామన్నారు. నష్టపరిహారం అందించడం రాష్ట్రానికి ఇబ్బంది అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో రైతులు ఆదుకోవడం కోసం పరిహారం అందిస్తున్నామని కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 28 వేల 567 ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతినగా 26వేల మంది రైతులు నష్టపోయారని ముఖ్యంగా నర్సంపేట పరకాల వర్ధన్నపేట డివిజన్ లలో అత్యధికంగా నష్టం జరగక భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాలో స్వల్ప నష్టం జరిగిందన్నారు.అందులో భాగంగా 13 కోట్ల 86 లక్షల 76 వేల రూపాయల నష్ట పరిహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాగా నర్సంపేట నియోజకవర్గం 8 కోట్ల 89 లక్షల 89 లక్షల 43 వేల 54 రూపాయలు చెక్కుల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా చెక్కులను రైతు వేదికల ద్వారా నేరుగా రైతులకు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతినగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పరిశీలన చేశామని అలాగే నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నట్లు మంత్రి తెలిపారు.అకాల వర్షాల వల్ల పంటలు నష్టం జరగగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లపైన ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని తెలుపుతూ గత సంవత్సరంలో ఇక్కడ జరిగిన విధంగానే చత్తీస్ ఘడ్, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో పంటలకు నష్టం జరిగిందని అక్కడ పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అని తెలుపుతూ అక్కడ నేటికీ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లి పరిశీలన చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుపుతూ గత నాలుగు రోజుల క్రితం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వర్షాల బీభత్సంతో పంటలు నష్టపోగా కనీసం నేటికీ నష్టం అంచనా కూడా వేయని పరిస్థితి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. గత అకాల వర్షాల వలన నియోజకవర్గంలో రోడ్లు ధ్వంసం కాగా వాటి నిర్మాణాల కోసం 64 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరి ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నష్టపరిహారం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నష్టపరిహారం అందించడం వలన మిగతా రైతు సంక్షేమ పథకాలు ఆగేది లేదన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నష్టపరిహారాలు అందించడంలో వారి వారి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకునే వారిని నేడు కెసిఆర్ పార్టీలకతీతంగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. గ్రామ సభలు ద్వారా నష్టపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి పరిహారం ఇస్తున్నామని రైతు వేదికల ద్వారా రైతులకు చెక్కులు పంపిణీ 20 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. దురదృష్టవశాత్తు అదే పరిస్థితి మరల సంభవించిందని వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా నష్టపోయిన ప్రతి పంటను సర్వే చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన అకాల వర్షాల నష్టపరిహారం గత వారం రోజుల క్రితమే జిల్లాకు వచ్చిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచన వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాల్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఆర్డీవో శ్రీనివాసులు, ఏడిఏ అవినాష్ వర్మ, ఎంఆర్ఓలు వాసం రామ్మూర్తి, సంపత్ కుమార్, ఎంపీపీలు మోతే కళావతి పద్మనాభరెడ్డి ,కాట్ల కోమల భద్రయ్య, జెడ్పిటిసి జయ గోపాల్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారులు కృష్ణ కుమార్, దయాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రాయిని రవీందర్ రెడ్డి, నాగేల్లి వెంకట నారాయణ గౌడ్, రాజేశ్వర్ రావు,గంప రాజేశ్వర్ గౌడ్, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

సిపిఐ మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐ. పి. ఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచం ద్రాపురం గ్రామ శివారులో ములుగు పోలీసులు కారు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురిని

పట్టుకున్నారు.20.03.2023న 05:30 గంటలకు వాహన తనిఖీ చేస్తున్నప్పుడు విశ్వసనీయ సమాచారంపైతగిన జాగ్రత్తలు

తీసుకుని వారి వాహనాలను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఐఈడీ మెటీరియల్‌లోని లోహ భాగాలు సీపీఐ మావో యిస్ట్ పార్టీ విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని

మందులను పోలీసులు గుర్తించారు నిందితులను విచారించగా కొంత కాలం క్రితం ఇతర నింది తులతో కలిసి నిషేధిత సీపీఐని కలిశామని చెప్పారు. మావోయిస్టు గ్రూపు ప్రధాన నాయకుడు దామోధర్ మరియు కొంతమంది దళ సభ్యులు తమ భూ సమస్యలను పరిష్కరించడం కోసం

నిషేధించబడిన సీపీఐ మావోయిస్టు గ్రూపు విప్లవ భావజాలానికి ఆకర్షితులయ్యారు. సీపీఐ మావో యిస్టు పార్టీ నేతలు చంద్రన్న దామోధర్‌పై నిషేధం విధించేందుకు వీరంతా క్రియాశీలకంగా పనిచేస్తు న్నారని వెల్లడించారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేత దామోధర్ సూచనల మేరకు నిందితు లు కొన్ని పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం మందులను సేకరించి వారికి ఇచ్చేందుకు ముందు కొచ్చారు. కూంబింగ్ ఆపరేషన్ల కోసం అడవికి వచ్చిన పోలీసులను చంపాలనే ఉద్దేశ్యంతో దామోధర్‌ ప్రణాళిక వేశారు.నిందితుల వివరాలు అరెస్టయిన వ్యక్తులు ఎల్ అందె రవి s/o రాజయ్య, వయస్సు 39 సంవత్సరాలు, కులం: వడ్ల (విశ్వ బ్రాహ్మణ) టెంట్ హౌస్ వ్యాపారం. r/o నాగారం గ్రామం జయశంక ర్ భూపాలపల్లి మండలం & జిల్లా A2 శ్రీరామోజు మనోజు తండ్రీ భిక్షపతి వయస్సు 30 సంవత్స రాలు కులం కుమ్మరి Occu: ఫ్లెక్స్ ప్రింటింగ్ r/o పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం A3. దిడ్డి సత్యం s/o నర్సయ్య, వయస్సు: 50 సంవత్సరాలు, కులం: పద్మశాలి, Occu: ఫోటోగ్రాఫర్, r/o దీక్షకుంట గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. A4. శ్రీరామోజు భిక్షపతి s/o శంకరయ్య, వయస్సు: 53 సంవత్సరాలు, కులం: కుమ్మరి, Occu: ఆటో డ్రైవర్, r/o పల్లారుగుడ గ్రామం, వరంగల్ జిల్లా, సంగెం మండలం.A5. అనసూరి రాంబాబు s/o లక్ష్మయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: కుమ్మరి, Occu: పూజారి, r/o పెద్దతండా గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మల్హారరావు మండలం.A11. గణపురం ఘనపురం చంద్రమౌళి s/o మదన గోపాల్, 51 సంవత్సరాలు, కులం: పద్మశాలి. r/o H.No: 12-49/1, బాలాజీ నగర్, జవహర్ నగర్ PS, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

A13. ఘనపురం పృథ్వీ రాజ్ s/o చంద్రమౌళి, 24 సంవత్సరాలు, కులం:పద్మశాలి, r/o H.No: 12-49/1, బాలాజీ నగర్, జవహర్ నగర్ PS, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా A14. అందె మానస w/o రవి, వయస్సు: 34 సంవత్సరాలు, కులం: వడ్ల (విశ్వ బ్రాహ్మణ), n/o నాగారం గ్రామం, జయశంకర్ భూపాలపల్లి మండలం & జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల లో నిందితులు అందరూ సాధారణ నేరస్థులు మరియు (4 UAPA చట్టం కేసులు) సహా 5 కేసులను కలిగి ఉన్నారు

 

*స్వాధీనం చేసుకున్న వస్తువులు*

 

1) IEDs-45 యొక్క ఇనుప భాగాలు,

 

2) కార్డెక్స్ వైర్-10 మీటర్లు,

 

3) డిటోనేటర్లు-02,

 

4) బ్యాటరీ-01.

 

5) విప్లవ సాహిత్యం-04.

 

6) సిపిఐ (మావోయిస్ట్) పార్టీ యొక్క అనారోగ్య UG క్యాడర్‌లకు ఉద్దేశించిన మధుమేహం మరియు ఇతర అనారోగ్యాలకు మందులు

 

7) కారు బేరింగ్ నెం: TS11 EY 0306 (వైట్ కలర్ కియా సెల్టోస్)-01.

 

8) హోండా మోటార్ బైక్ బేరింగ్ నెం: TS25A1007 (నలుపు రంగు)-01.

 

9) మొబైల్ ఫోన్లు-08

 

10) నగదు రూ: 4140/-.

 

ఈ సంఘటన ఆధారంగా,ములుగు జిల్లా పీఎస్ వెంకటాపురంలో కేసు నమోదైంది.

 Cr . నం: 39/2023, U/Sec.120(b), 143, 307 IPC r/w 149, TSPS చట్టంలోని సెక్షన్ 8(1)(2), ES చట్టంలోని సెక్షన్ 5, UAPA యొక్క 10,13, 18 చట్టం ప్రకారం.

 

 జిల్లా ఎస్పీ శ్రీ గౌష్ ఆలం ఐ. పి. ఎస్ గారు మాట్లాడుతూ — నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి సహకరించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలందరిని కోరారు . మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేసి వారి జీవితాలను నక్సల్స్ నాశనం చేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మరియు వారి స్వంత ప్రయోజనాలను నెరవేర్చ డానికి అమాయక ప్రజలను ఉపయోగించుకు న్నారు సిపిఐ (మావోయిస్ట్‌) పార్టీ నాయకులు తమ సమస్యలను పరిష్కరి స్తామనే సాకుతో అమాయకులను పిలిపించి వారికి పేలుడు పదార్థాలు ఇతర సరుకులు సరఫరా చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ప్రజలు దీనిని గమనించి మావోయి స్టులకు ఎవరు సహకరిం చవద్దని ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో ములుగు భూపాలపల్లి ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఐ. పి. ఎస్, ఏ.ఎస్పీ సిరి శెట్టి సంకీర్త ఐ. పి ఎస్, సి. ఐ వెంకటాపురం శివప్రసాద్, ఎస్. ఐ వెంకటాపురం తిరుపతి రావు గారు సిబ్బంది పాల్గొన్నారు.

బండి తొండి?

 

-సొంత పార్టీలో రగులుతున్న కుంపటి?

– సీనియర్లలంటే లెక్కేలేదండి?

-బండితో నలుగుతున్న పువ్వు?

– వచ్చిన అవకాశం సద్వినియోగంలో బండి ఫెయిల్‌?

– ఒంటెద్దు పోకడలతో తంటాలు?

– ఆది నుంచీ బండిమీద విమర్శలే?

-నోటి దురుసు వ్యాఖ్యలు… పసలేని వాదనలు?

– ప్రతిసారీ జైలు సిద్ధమంటూ వ్యాఖ్యానాలు?

– బండి వ్యాఖ్యలతో ఇతర వర్గాలు దూరం?

– సీనియర్లు అసంతృప్తికి ఇదొక కారణం?

– సీనియర్లంటే లెక్కలేని తనం?

– సీనియర్లను పక్కన పెట్టేంత పెత్తనం?

-జిల్లా నాయకుల నియామకాలలో సీనియర్లకు సంకటం?

-బండి దూకుడు బిఆర్‌ఎస్‌ కు వరం?

-తొలగిపోతున్న బండి మబ్బులు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొండ అద్దమందు కొంచెమై వుండదా? అని పెద్దలెందుకన్నారో…బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ను చూస్తే అదే అనిపిస్తుందని బిజేపి నేతలే అంటున్నారు. రాజకీయాల్లో కొన్ని అవకాశాలు కొందరికి ఎందుకు వస్తాయో తెలియదు? అనుకోని అవకాశాలు చాలా విచిత్రంగా వస్తాయి. అలా వచ్చిన అవకాశాలను చాలా పదిలంగా వాడుకొని, పైకొచ్చినవారు చాల మందే వున్నారు. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకొని, కలిసొచ్చిన రాజకీయం జీవితం మళ్లీ మొదటికి తెచ్చుకున్నవాళ్లు కూడా చాలా మందే వున్నారు. అలాంటి కోవకే బండి సంజయ్‌ వస్తాడా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి బండి సంజయ్‌ కిందిస్ధాయి నుంచి ఎదిగిన నేత. అంత వరకు ఓకే…కాని ఆయనకు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. కార్పోరేటర్‌గా వున్న బండిసంజయ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసొచ్చింది. కాని గెలవలేదు. అలా గెలవకపోవడం కూడా బండికి వరంగా మారింది. అదృష్టం కలిసొచ్చింది. ఆ క్షణం పడిన బాధకు మంచి, రెట్టించిన సంతోషం దక్కింది. ఎంపి పదవి వరించింది. ప్రజల ఆశీస్సులు అందాయి. పార్టీ పెద్దలు కూడా మెచ్చారు. ఇదే సమయంలో పార్టీ బండి సంజయ్‌ కలలోకూడా ఊహించని పార్టీ అధ్యక్ష పదవి వచ్చి వాలింది. నిజానికి బండి సంజయ్‌ ఒక్కసారి ఎమ్మెల్యే కావలనుకున్నాడు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆ కల నెరవేరకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. కార్యకర్తల సమక్షంలో దుఖించాడు. ఆయనతోపాటు కార్యకర్తలు కూడ ఏడ్చారు. కట్‌ చేస్తే ఇదంతా డిల్లీ పెద్దల దాకా చేరింది. ఆ ఏడుపే బండికి కలిసొచ్చింది. ఆయనను ఎంపినిచేసింది. అలా ఒక్కొసారి ఓడుపు కూడా కలిసొచ్చినవాళ్లు వున్నారని చెప్పుకోవడానికి బండి సంజయ్‌ ఉదంతం కనిపిస్తుంది. అదేంటో వచ్చే అవకాశాలు కూడా అలా తన్నుకుంటూ వస్తాయన్నట్లు వచ్చి వాలిన అధ్యక్షపదవి చేపట్టిన కొద్ది కాలానికే బండిలో కూడా మోనోపలి పెరిగిందనేది పార్టీలో చెప్పుకుంటున్న మాట. 

ఇక పార్టీ బరువు బాధ్యతలు మోయడం నా వల్ల కాదు అనుకుంటూ ఎన్నోసార్లు మెరపెట్టుకున్నా లక్ష్మణ్‌ను పార్టీ అలాగే కొనసాగించింది.

చివరికు తన ఆరోగ్యం సహకరించడంలేదని పార్టీకి నివేదించడంతో తప్పని పరిస్ధితుల్లో మాత్రమే బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఈ సమయంలో కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒక దశలో దుబ్బాక శాసనసభ్యుడు రఘునందర్‌ పేరు బాగా వినిపించింది. అయితే ఆయన అప్పటికే గొప్ప మాటకారి అన్న పేరు బాగా నాటుకుపోయింది. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపిగా, కనీసం ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. కాకపోతే పలుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా వుంటే అప్పుడే ఎంపిగా ఎన్నికైన నిజామాబాద్‌ ఎంపి. ధర్మపురి పేరు కూడా అప్పట్లో బాగానే వినిపించింది. అదేంటో పార్టీ అధ్యక్షపదవి ఎంపిక జరిగిన సమయంలో ధర్మపురి అరవింద్‌ దూకుడు స్వభావం వున్న నాయకుడు నాయకుడు అన్న ముద్ర బలంగా వుంది. అందువల్ల అరవింద్‌తో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు? అని అధిష్టానం ఆలోచించింది. కొంత సౌమ్యుడుగా వున్న బండి సంజయ్‌ని ఎంపిక చేస్తే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. అప్పటి నుంచి బండికి దూకుడు పెరిగింది. భ్రేకులు లేకుండా పోయాయి. ఏమాటకామాట చెప్పుకోవాలి. బండి సంజయ్‌ వల్లనే పార్టీ ఇప్పుడు ఈస్ధితికి చేరుకున్నది చెప్పడంలో ఎలాంటి శషభిషలు అవసరంలేదు. కాకపోతే ఆ దూకుడే మళ్లీపార్టీకి కష్టాలు తెచ్చిపెడుతోందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు బండి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా కూడా మారిందంటున్నారు. 

ఇటీవల బండి దూకుడు అధికార బిఆర్‌ఎస్‌ మీదనే కాకుండా, సొంత పార్టీ నేతల మీద కూడా కనబర్చుతున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు.

పార్టీలో నాయకుల మధ్య కూడా పొగ పెట్టడంలో బండి సంజయ్‌ ఆరితేరినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఓ ఇద్దరు నేతల ఆర్ధిక సంబంధాలను ఆసరా చేసుకొని వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు కూడా బండి సంజయ్‌ కారణమన్న మాటలు వినిపించాయి. అత్తమీదకు కోడలును, కోడలు మీదకు అత్తను ఎగేసినట్లు ఆ ఇద్దరి నేతలకు చెప్పాల్సిందంతా చెప్పి, నూరిపోశానడి అంటుంటారు. అందుకే ఇద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఇక ప్రతి దగ్గర హిందుత్వానికి తాను ప్రతీకగా ప్రచారం చేసుకుంటే ఎవరూ అడ్డుచెప్పకపోవచ్చు. కాని బిజేపి కేవలం హిందుత్వానికి ప్రతీక అన్నంత దోరణిలో, శివం, శవం అన్నది పెద్దఎత్తున వివాదాలకు తెర తీసింది. దాంతో కొందరు నాయకులు బండి సంజయ్‌ను సూటిగానే వ్యతిరేకించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అనేక సంక్షేమ పధకాల లబ్ధిదారుల్లో అన్ని వర్గాల శ్రేణులున్నారు. వారి సంక్షేమం కోసం కూడా బిజేపి పనిచేస్తుందన్న సంకేతాలు పార్టీ పంపాల్సిన అవసరం వుంది. కాని అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు పార్టీ దూరమయ్యే ప్రమాదముందని ఆక్షేపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న పార్టీగా బిజేపి ప్రజలకు చేరువ కావాలి. కొన్ని వర్గాలకే పరిమితయ్యేలా బండి వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. సామెతలైనా వాడాల్సిన చోట వాడాలని, అన్నింటికీ అన్వయించలేమన్న సోయి లేకుండా ఒక ఎంపి ఎలా మాట్లాడతాడని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడ పెద్దతెత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దానితోపాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్‌ఎంపి. అరవింద్‌ ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్‌ లిమిట్స్‌ గురించి కూడా మాట్లాడాడు. ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన పవర్‌ పవర్‌సెంటర్‌ కాదన్న మాట అరవింద్‌ అన్నాడు. అంతే కాకుండా ఆయన కవిత విషయంలో అన్న మాటను సమర్ధించడం లేదన్నారు. ఆమాట వెనక్కి తీసుకోవాలని కూడా సూచించారు. ఇలాగే ఆయన వ్యవరిస్తే పార్టీకి నష్టమేర్పడుతుందన్న మాట కూడా అరవింద్‌ అన్నారు. ఇలా పార్టీలోని చాలా మంది కూడా బండికి సూచించారు.  

ఇదే ఊపు మీద ఊపు పార్టీలో కూడా నిరసన స్వరాలు మరిన్ని పెరిగితే గాని బండికి ఉద్వాసన జరగదన్న నిర్ణయంలోనే చాలా మంది సీనియర్లు వున్నట్లు కూడా తెలుస్తోంది. 

రాష్ట్రంలో బిజేపి కొంత బలపడిరదని చెప్పడంలో సందేహం లేదు. రెండు ఎన్నికలు గెలిచారు. ఇటీవల ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో బాగానే కార్పోరేటర్‌ సీట్లు సాధించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బండి సంజయ్‌ ఒంటెద్దుపోకడలు సీనియర్లకు ఆశని పాతంగా మారుతున్నాయి. ఒక వేళ ఎన్నికల బండిసంజయ్‌ నేతృత్వంలో వెళ్తే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు, పార్టీ గెలిస్తే, సీనియర్లందరినీ కాదని ఆయనకు సిఏం చేయొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఇప్పుడే బండిని నిలువరిస్తే తప్ప, ఆయన భవిష్యత్తులో ఆయనకు ఎదురు లేకుండాపోతుంది. కాని బండి నోటి దురుసు కూడా పార్టీకి తీరని నష్టం కూడా తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి క్రూయిషియల్‌ సమయంలో అన్ని వర్గాల నాయకులను, ప్రజలను కలుపుకుపోయే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు బిజేపిని ఆదరిస్తున్న సమయంలో బండి దూకుడు స్వభావం ఎన్నికల వేళ కష్టాలు తెచ్చిపెట్టకుండా వుండాలంటే రాష్ట్ర పార్టీ బాధ్యుడిని మార్చాలన్న డిమాండ్‌ బాగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా తన బలం పెంచుకోవడం కోసం సీనియర్లను, పక్కన పెట్టడాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేపోతున్నారు.

మరి కాసేపట్లో TSPSC పై కేసీఆర్ సంచలన నిర్ణయం?

నేటిధాత్రి హైదరాబాద్

TSPSC పేపర్ లీకేజ్ ఘటనపై CM KCR సీరియస్ అయ్యారు.బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించారు. *ఇప్పటికే ఈ విషయంపై ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ఆయన భేటీ అయ్యారు.* పరీక్షల రద్దు, పేపర్ లీక్ పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. జనార్దన్ రెడ్డితో భేటీ అనంతరం *TSPSC బోర్డును రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.*

కవిత జీవితమే ఒక ఉద్యమం

తెలంగాణ పోరాటమే ఆమె జీవితం.

కవిత పట్ల ఈడీ అనుసరిస్తున్న వైఖరి మహిళా హక్కులను కాలరాడమే!

బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు వివరించిన ఆసక్తికరమైన విషయాలు.

చట్టాలు చేసే సభ్యురాలికే హక్కులు అందకపోతే…సామాన్యుల పరిస్థితి ఏమిటి?

ఈడీ పరధి దాటడానికి కేంద్ర పెద్దల ఒత్తిడి కారణం కాదా?

మహిళలకు రక్షణ చట్టాలు ఈడీ ముందు బలాదూరా?

ఈడీ చెబుతున్నదేమిటి? చేస్తున్నదేమిటి?

ఈడీ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిరదా?

అసలు కవిత విషయంలో మనీ లాండరింగ్‌ ఆపాదించడమే తప్పు?

కవిత నిందితురాలు కాదు…అనుమానితురాలు కూడా కాదు?

బిజేపి పెద్దల కక్ష సాధింపులో కవితను ఇరికించే ప్రయత్నం చేశారు?

మహిళా హక్కుల కోసం పోరాటం చేసే కవితకే రక్షణ కరువౌతోంది?

బిజేపికి మహిళలంటే ఎంత చిన్న చూపో ఇక్కడే తేలిపోయింది.

ఇప్పటికైనా బిజేపి తన వైఖరి మార్చుకోకపోతే పతనమే!

బిజేపి అప్రజాస్వామిక ధోరణి దేశమంతా గమనిస్తోంది?

ఈడీ విచారణలో ఏం జరుగుతుందో బిజేపి ఎంపిలకు ఎలా తెలుస్తోంది?

గోప్యంగా వుండాల్సిన విచారణ ఎలా లీకౌతోంది?

కవిత మీద బండి సంజయ్‌ వ్యాఖ్యలు కేంద్ర మహిళా కమిషన్‌ ఎందుకు స్పందించలేదు?

ఒక్క కవిత మీద అంత దాడి చేస్తున్నారంటేనే బిజేపి ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవతా! అన్నారు పెద్దలు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ నిత్యం సుద్దులు వల్లించే బిజేపి పార్టీ పెద్దలు,నేతలకు మహిళలు రాజకీయాల్లో రాణించడం ఇష్టం లేదా? మహిళలు రాజకీయాల్లోకి రావొద్దా? రాణించొద్దా? ప్రజా సమస్యలపై మాట్లాడొద్దా? మిగతా నాయకులకన్నా గొప్పగా ప్రభావం చూపొద్దా? ప్రగతి శీల సమాజంలో రాజకీయాలను ప్రభావితం చేయొద్దా? అసలు బిజేపి ఆలోచన ఏమిటి? మహిళపట్ల బిజేపికి వున్న చిన్న చూపు ఏమిటో ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. వాళ్లు చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడా పొంతన లేదన్నది అనేక సార్లు రుజువు చేసుకుంటూనే వున్నారు. ప్రజలకు బిజేపి పార్టీ అసలు రంగు తెలిసిపోయింది. ఈసారి ఖచ్చితంగా బిజేపికి దేశ వ్యాప్తంగా బుద్ది చెప్పేరోజులు దగ్గరనే వున్నాయి. తెలంగాణ రాజకీయ యవనికపై కల్లకుంట్ల కవితది సామాన్యమైన పాత్ర కాదు. నిజానికి ఆమె తెలంగాణ ఉద్యమానికి అందించిన చేయూత అంతా ఇంతా కాదు. సహజంగా ఎవరైనా రాజకీయావకాశాలు కలిసి వచ్చినప్పుడు చేస్తుంటారు. అంతదాకా ఎందుకు సినిమా నటులు రిటైర్‌ అయ్యే దశలో రాజకీయాల్లోకి వస్తుంటారు. ప్రజా సేవ అంటూ చెబుతుంటారు. రాజకీయాలలో అనూహ్యంగా కొందరు తెరమీదకు వస్తుంటారు. కాని కవిత రాజకీయాలు అందుకు భిన్నం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టి, ఎండనక, వాననక సాగిస్తున్న పోరాటాన్ని చూసి, తాను కూడా తెలంగాణ ఉద్యమంలో తరుపుకు ముక్కనౌతానని వచ్చిన నాయకురాలు కవిత. ఉన్నతమైన విద్య, చక్కని ఉద్యోగం, కుటుంబ జీవనం,చిన్న పిల్లలు, అమెరికాలో జీవనం అన్నీ కాదనుకొని, మళ్లీ తెలంగాణ గడ్డ మీద అడుపెట్టి ఉద్యమంలో చురుకైన, ప్రత్యేకమైన పాత్ర పోషించిన నాయకురాలు కవిత. ఇంట్లో చిన్న పిల్లల్ని వదిలేసి, తెలంగాణ ప్రజల జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకురాలు కవిత. ఇప్పుడన్న పరిస్ధితుల్లో అప్పటి కాలం చిన్నగా కనిపించొచ్చు..కాని ఆనాడు ఉద్యమ కారులు పడిన శ్రమ ఎంతో అనుభవించినవారికే తెలుస్తుంది. తాడు బొంగరం లేని బిజేపి నాయకులు ఏవోవో మాట్లాడతారు? ఎందుకంటే బిజేపిలో సీనియర్లమని చెప్పుకునేవారికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఉద్యమంలో వాళ్లు పాల్గొన్నది లేదు. ఇక ఇప్పుడు పెద్ద నాయకులమైనట్లు వ్యవహరిస్తున్న వారికి అసలు తెలంగాణ ఉద్యమస్వరూపమే తెలియదు. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కవిత లాంటి ఉద్యమ కారులను పదేపదే అవమానిస్తున్నారు. రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు…ఏది ఏమైనా కవిత లాంటి నాయకురాలు తెలంగాణ రాజకీయాల్లో వుండడం అన్నది తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం. ఉద్యమ కాలం నాటి కుట్రలు, కుతంత్రాలు చూసిన కవితకు, బిజేపి ఉడుత ఊపులకు భయపడదు. ఆమె వెంట మొత్తం తెలంగాణ మహిళా సమాజమే కాదు, దేశంలోని మహిళలంతా కదలుతారు…అంటున్న బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’,నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చిట్‌చాట్‌… ఆమె మాటల్లోనే…

కవిత విషయంలో కావాలనే బిజేపి రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. 

ఇదంతా దేశమంతా చూస్తోంది. ఒక మహిళ పట్ల బిజేపి ప్రభుత్వం చేస్తున్న దాడి, మొత్తం మహిళా సమాజం మీద జరుగుతున్నట్లే లెక్క. పూట పూటకు, రోజు రోజుకు కవిత మీద ఎన్నో ఆరోపణలు, చిల్లర విమర్శలు సాగిస్తున్నారు. కవిత ఏ పని చేసినా అది భవిష్యత్తు సమాజానికి దిశా నిర్ధేశం చేసేలా వుంటుంది. అందులో భాగంగానే ఈడీ విచారణ అన్నది కూడా రాజ్యాంగ బద్దంగా సాగాలి. చట్టబద్దంగా వుండాలి. మహిళల హక్కుల రక్షణ అమలు కావాలి. అంతే గాని ఎంపిగా కేంద్ర అత్యున్నత చట్ట సభకు ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రాష్ట్రంలో పెద్దల సభ సభ్యురాలైన కవిత పట్లనే ఈడీ ఇలా వ్యవహరిస్తుంటే, ఇక సామాన్యమైన మహిళకు దేశంలో రక్షణెక్కడిది. దర్యాప్తు న్యాయంగా జరగాలని కవిత కోరుతోంది. అది కూడా తప్పేనా…పక్షపాతంగా కక్ష పూరితంగా సాగొద్దని మహిళా సమాజం కూడా కోరుతోంది. ఎంత సేపు పిఎంఎల్‌ఏ చట్టంలో అది వుంది..ఇది వుంది…అంటూ లేని భాష్యాలు బిజేపి నేతలు చెప్పడంలో ఆంతర్యమేమిటి? ఈ చట్టంలో ఇప్పటికే అనేక సార్లు మర్పులు చేశారు… మన దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగంలోనే కాలనుగుణంగా అనేక మార్పుల చేశారు..అలాగే ఈడీ నిబంధనలు కూడా మార్చారు. కాని ఈడీ ముందు ఎవరైనా ఒక్కటే అంటూ వితండ వాదాలు చేస్తూ, మహిళల హక్కులను కించపర్చడమేనా బిజేపి నేతలు నేర్చుకున్న విలువలు. కవిత ఇప్పటికే నాలుగు సార్లు అటు ఈడీకి గాని, ఇటు సిబిఐకి గాని సహకరించిన విషయం తెలిసిందే..అయినా ఆమె సహకరించడంలేదని బిజేపి అసత్య ప్రచారం చేయడం సరైంది కాదు. నిజానికి సిఆర్‌పిసిచట్టం 160 ప్రకారం ఒక మహిళను ఏ సందర్భంలోనైనా విచారించాల్సి వస్తే కచ్చితంగా ఆమెకున్న హక్కులకు లోబడే దర్యాప్తు జరగాలి. కాని ఈడీ ఇందుకు మినహాయింపు కాదు..ఈడీ కవిత సెల్‌ఫోన్‌ లాక్కోవడం నిబంధనలకు వ్యతిరేకం అన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇదే ఆమె ఈడీని ప్రశ్నిస్తోంది. పైగా ఈడీ తన పరిధిలో లేని, తనకు సంబంధం లేని అంశాల ప్రస్తావన తీసుకురావడం కూడా తన పరిధి దాటి వ్యవహరించడం కాదా? ఇదిలా వుంటే ఈడి విచారణ సమయంలో అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కవిత లేఖాస్త్రం సంధించారు. ఆమె ధైర్యానికి ఇది ఒక సంకేతం. ఎందుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండాపోరాటం చేసిన వనిత కవిత. అలాంటి కవితను ఈడి బెదిరిస్తే కవిత బెదురుతుందా? అదురుతుందా? 

ఈ రోజు కొన్ని మీడియా సంస్ధలు కవిత మళ్లీ సుప్రింకోర్టును ఆశ్రయించినట్లు, కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చినట్లు ఎవరికి వారు కట్టుకధలు అల్లి ప్రచారం సాగించారు.

ఇదేనా మీడియాకు ఒక మహిళా నాయకురాలు, ఉద్యమకారురాలు పట్ల వ్యవహరించాల్సిన తీరు..మీడియా కూడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా సమజాంలో జరిగే విషయాలపై నిజానిజాలు తెలియజేసేలా వుండాలే, గాని మీడియాకూడా లేనిపోనివి సృష్టించడం తగదు. ఈడీ కూడా తన పరిధి దాటి చేస్తున్న విన్యాసాలు కూడా సరైనవి కాదు. ఆ సంస్ధ మీద బిజేపి పెద్దల ఒత్తిడి ఎంతో వుందనేది వాస్తవం. అయినా రాజ్యాంగబద్దమైన సంస్ధ ఇలా వ్యవహరిస్తూ, సమన్లు జారీ చేసిన సమయంలో చెప్పని విషయాలను కూడా ప్రస్తావించడాన్ని కవిత ఎంతో ధైర్యంగా ప్రశ్నించింది. అందుకు కవితను ప్రతి మహిళ అభినందించాలి. కవిత ఫోన్‌తో ఈడీకి ఏం సంబంధం? ఫోన్‌అనేది వ్యక్తిగతమైనది. అందులో అనేక అంశాలుంటాయి. అలాంటి ఫోన్‌ను తెప్పించి, స్వాదీనం చేసుకోవడం వ్యక్తిగత హక్కును, స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సహజంగా ఆరు గంటల వరకే దర్యాప్తు జరగాలి. కాని కవితను రాత్రి 8గంటలదాకా విచారణ చేయడం అంటే కుట్ర కోణం దాగి లేదా? ఈ నెల 11న జరిగిన విచారణలో నిందితుల ముందు ఈడీకి వున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే అనుమానితురాలిగా కవితను విచారణకు పిలిచారు. మరి కవిత ప్రశ్నించినట్లుగా నిందితులను ఆమె ముందుకు ఎందుకు తీసుకురాలేదు? ఇది ఈడీ ఉల్లంఘన కాదా? ఒక మహిళా నేతమీద ఈడీ వ్యవరిస్తున్న తీరుపై దేశమంతా చర్చజరుగుతోంది. బిజేపి కుట్రనంతా గమనిస్తోంది. కవిత లాంటి నాయకులనే భయపెట్టామన్న ప్రచారం చేసుకోవడం కోసం, బిఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్న బిజేపికి తగిన బుద్ది ప్రజలే చెబుతారు..దేశం నుంచి బిజేపిని తరిమికొడతారు..వినేశ కాలే వివపరీత బుద్ది అని బిజేపి తన అహంకార పూరిత రాజకీయాలకు కాలం చెల్లే రోజులు దగ్గరనే వున్నాయి. కవిత విషయంలో దేశంలోని మహిళా సమాజమంతా ఆమెకు మద్దతుగా వుంటుంది. కేంద్రాన్ని ఎండగట్టేందుకు ఎల్లప్పుడు మహిళా లోకం సిద్దంగానే వుంటుంది.

దేశాన్ని అమ్మడం ఆపండి

*మోదీ అధానీ భాయ్ భాయ్*

*తక్షణమే జేపీసీ వేయాలి*

*దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ*

*ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా అట్టుడికిన పార్లమెంట్*

*అదానీ వ్యవహారంపై జేపీసీకి ప్రతిపక్షాల డిమాండ్*

*అధికార పక్షం మొండివైఖరితో సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, డీఎంకే ఎంపీలు*

*”మోదానీ” వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర,యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పట్టుబట్టారు*

ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ పాల్పడిన ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఐదో రోజు కూడా పార్లమెంటు అట్టుడికింది.శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్, డీఎంకే తదితర పక్షాలు అదానీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పట్టుబట్టాయి.అధికార పక్షం అందుకు ససేమిరా అనడంతో ఉభయ సభలలోని ప్రతిపక్షాలు సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం చేరి ఆందోళనకు దిగాయి.ప్రధాని మోడీ అండదండలతోనే అదానీ తీవ్ర ఆర్థిక నేరాలకు ఒడిగట్టారని, అందుకే ఆయన వ్యవహారాలపై జేపీసీ వేయకుండా వెనుకేసుకు వస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు.మోడీ-అదానీల స్నేహాన్ని గుర్తు చేస్తూ “మోదానీ”అనే ప్లకార్డులను ప్రదర్శించారు.”వేయాలి వేయాలి వెంటనే జేపీసీ వేయాలి”,”స్వస్తి పలకాలి స్వస్తిపలకాలి సీబీఐ,ఈడీ,ఐటీల దుర్వనియోగానికి వెంటనే స్వస్తిపలకాలి”అంటూ ఎంపీలు నేలపై బైటాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే,రాహూల్ గాంధీ, చిదంబరం,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,కే.ఆర్.సురేష్ రెడ్డి,బీ.బీ.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని,పీ.రాములు తదితరులతో కలిసి పాల్గొన్నారు.

మహిళా హక్కులకు విలువలేదా?

`ఈడీ విషయంలో మినహాయింపా?

`డిల్లీ మద్యం కేసు విషయంలో కవిత నిందుతుల జాబితాలో లేదు?

`ఇప్పటి వరకూ అనుమానితురాలు కూడా కాదు?

` కేవలం సాక్షిగానే ఆమెకు నోటీసులు?

`అలాంటప్పుడు పదే పదే విచారణకు పిలువడంలో ఆంతర్యమేమిటన్నదే బిఆర్‌ఎస్‌ ప్రశ్న?

`ఇప్పటికే ఓసారి తన వద్ద వున్న సమాచారం కవిత ఇచ్చానంటోంది?

`మీడియా అత్యుత్సాహం?

`బిజేపి రాజకీయ కక్ష వ్యవహారం?

`ఎలాగైనా కవితను ఇబ్బందులకు గురి చేయాలన్నదే బిజేపి లక్ష్యం?

`బిజేపి పై బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ పెంచిన దూకుడు సహజంగా రాజకీయాలలో ప్రత్యర్థులకు ఉత్సాహ వాతావరణాన్ని కలిగించొచ్చు…కానీ రాజకీయాలలో ఈర్ష్యతో, దురుద్దేశ్యాలతో కక్ష సాధింపులు సరికావు. ఈడీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో, వారి ఆదేశాల మేరకే పని చేస్తుందని తెలిసిందే..ఇదే ఇక్కడ అసలు సమస్య. నిజానికి డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఎమ్మెల్సీ కవిత మీద అభియోగాలు మోపబడలేదు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో లేదు. కేవలం సాక్షిగా మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అంతే కాకుండా ఇప్పటికే ఒకసారి కవిత ను ఈడీ. డిల్లీలో ప్రశ్నించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. మరో సారి కవిత ఈడీ విచారణకు హజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ పొందుపర్చిన కేసులో కవిత పేరు లేదు. కేవలం అనుమానం పేరుతో ప్రస్తావన మాత్రమే వుంది. అలాంటప్పుడు ఆమెకు రాజ్యాంగ రిత్యా సంక్రమించిన హక్కులు వున్నాయి. వాటి ఉల్లంఘనకు ఆస్కారం లేదు. మహిళలు, చిన్న పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక వెసులుబాటులున్నాయి. సిబిఐ వాటిని అమలు చేస్తోంది. ఈడీ విషయంలో మినహాయింపు ఎలా వుంటుంది? అన్న సందేహం అందరి మదిని తొలుస్తోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ ఆక్ట్‌( పిఎమ్‌ఎల్‌ఏ) 2002 ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈడీ 1947లో ఏర్పాటైన సంస్థ. అ తర్వాత 1957 దానిని మరింత పటిష్ఠం చేశారు. 1999లో ఫెమా చట్టం తెచ్చారు. తాజాగా 2018లో ఎఫ్‌ఈఓయే చట్టం జత చేశారు. ఇంతవరకు బాగానే వుంది. కానీ ఇటీవల 2022లో పార్లమెంటులో జరిగిన చర్చలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కేంద్ర ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశ్యపూరితంగా జరుగుతున్నవే అన్న అందరూ చెబుతున్న మాట. నిజానికి మనీలాండరింగ్‌ కేసుల విషయంలో జప్తుకు ఆస్కారం వుంటుంది. కానీ డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఆరోపణలు , ఆధారాలు నగదు రూపంలో దొరికింది లేదు. జప్తు జరిగింది లేదు…అసలు దానిపై సరైన లెక్కలు లేవు…కేవలం ఊహాగానాలతో మొదలైన కేసు మాత్రమే అన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట.. బిఆర్‌ఎస్‌ నేతలు అంటున్న మాట కూడా! ఈడీ ముందు సోనియా గాంధీ హాజరుకాలేదా? అని ఒకరంటారు? తమిళనాడులో ఓ మహిళ కోర్టుకు ఆశ్రయిస్తే అంగీకరించలేదని ఒకరు ఉటంకిస్తారు? మనీలాండరింగ్‌ చట్టాలు కఠినంగా వుంటాయని భయపెడతారు. అసలు డిల్లీ లిక్కర్‌ కేసు అసలు నిలబడేదే కాదని దేశమంతా అంటుంటే సూడో మేధావులు తమకు తోచింది చెప్పడం, రాయడం మరీ విచిత్రం. 

మహిళా హక్కులకు విలువలేదా? 

ఇక్కడ సందేహమేమిటంటే మహిళా హక్కులు, సాధికారిత, వాటి పరిరక్షణలు, మహిళా బిల్లు వంటి అంశాలలో నిరంతరం చర్చ జరిపే, వాటి గురించి కొట్లాడే కవిత విచారణలో అవేవీ హక్కులు పట్టించుకోకపోవడమే అభ్యంతరం వ్యక్తమౌతోంది.

 కవిత లేవనెత్తిన అంశాలలో మహిళల విచారణ వారి అనుమతి, ఇష్టపూర్వకంగా జరక్కపోవడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుంది. ఐపిసి సెక్షన్లు అమలు చేసే అన్ని పోలీసు వ్యవస్థలు మహిళలను విచారించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. చట్టాలకు లోబడి దర్యాప్తు నిర్వహిస్తారు. విచారణ చేపడతారు. అసలు మహిళలను అరెస్టు చేసే సమయంలో అయినా, వారి విచారణలో కూడా కచ్చితంగా మహిళా అధికారులుండాలి. న్యాయవాది సమక్షంలో జరగాలి. ఈడీ. విచారణలో అలాంటి అవకాశం ఎందుకు లేదన్నదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతయన్న చర్చ. ఈడీ ప్రధాన కార్యాలయం డిల్లీలో లో వున్నా, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ కార్యాలయాలు కూడా వున్నాయి. అందులో హైదరాబాదు కూడా వుంది. కవిత లిక్కర్‌ కేసులో నిందుతుల జాబితాలో లేదు. అలాంటప్పుడు ఆమెను హైదరాబాదులో కూడా విచారించే అవకాశం కూడా వుందని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. డిల్లీ కేసు కావడం మూలాన అక్కడ విచారణ జరిపినా సమయపాలన లేకుండా విచారణ జరగడాన్ని కవిత ప్రశ్నించడం ఆమెకున్న హక్కులో భాగం. కవితను రాజకీయంగా కుంగదీయంలో భాగంగానే బిజేపి కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందనేది బిఆర్‌ఎస్‌ వాదన. 

మీడియా అత్యుత్సాహం?

 సమకాలీన రాజకీయాలు, ప్రజా చైతన్యం, ప్రభుత్వాల పని తీరు, ప్రజా సమస్యలు, సామాన్యుల బాగోగులు, రైతుల అవస్థలు, చిరు వ్యాపారుల కష్టాలు, నిత్యావసర వస్తువుల ధరలు… సమాజంలో వున్న రుగ్మతలు, ఎన్నికలు, దేశ భవిష్యత్తు ఇవేమీ ఈ తరం మీడియాకు పట్టకుండా పోయింది. ఎంత సేపు సెన్సేషనల్‌ వార్తలు…టిఆర్పి రేటింగ్లులు, అత్యుత్సాహాలు, జ్యోతిష్యాలు, నిమిష నిమిషానికి అప్‌ డేట్లు, డిబేట్లు…ఇదేనా మీడియా చేయాల్సిన పని. అదిగో పులి అంటే ఇదిగో తోక అని ప్రచారం చేయడం బాగా అలవాటైపోయింది. గత 11 ప్రజలను ఎంటర్టైన్మెంట్‌ చేస్తూ,కవిత అరెస్టు… అంటూ ఊదరగొట్టింది…ఆ వార్తలు వాస్తవ రూపం దాల్చకపోవడంతో, మీడియా ఆశలు 16కు వాయిదా వేసుకున్నారు. ఇదిగో, అదిగో…మద్యాహ్నం అరెస్ట్‌ చేయొచ్చని రకరకాల వార్తలు వండి వార్చారు. కవిత విచారణకు హజరుకాకపోవడంతో ఖంగుతిన్న మీడియా మళ్ళీ రకరకాల వదంతులు మొదలుపెట్టింది. ఈడీ నుంచి వచ్చిన మరో వాయిదాను ఆసరా చేసుకొని 20 కోసం మీడియా కంటి మీద కునుకు లేకుండా చూసుకోనుంది.

మహిళా లోకపు ఆర్తి, తెలంగాణ స్పూర్తి కవిత.

` చెట్టు పేరు చెప్పి రాజకీయాల బతుకు షర్మిలది? 

`వైయస్సార్‌ టిపి అధ్యక్షురాలు షర్మిలపై చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో, కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి చిట్‌ చాట్‌….

`అడుగడుగునా వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అడ్డంకే!

`తెలంగాణ మీద షర్మిల మాటలన్నీ మొసలికన్నీళ్లే?

`కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్థాయి షర్మిలకు వుందా?

`షర్మిల తన జీవితంలో సామాజిక సేవ అనే పదం వుందా?

` తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర కల్వకుంట్ల కవితది?

`జాగృతి పేరుతో యువతలో చైతన్యం నింపిన శక్తి కవితది?

`ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచింది.

`ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేసింది.

`అనర్గళంగా ఐదారు బాషలు కవిత మాట్లాడుతుంది?

`కవితలో వున్న ఒక్క క్వాలిటీ అయినా షర్మిలలో వుందా?

` కనీసం వార్డు మెంబరుగా ఒక్కసారైనా షర్మిల గెలిచిందా?

` కవిత గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకుందా?

` షర్మిల తెలంగాణ గురించి మాట్లాడడం అవి వేదాలు వల్లించడమే!

`కల్వకుంట్ల కుటుంబం మీద మాట్లాడితే తెలంగాణ చోటు కాదు కదా? ఒక్క ఓటు పడదు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజన్న బిడ్డని.. జగనన్న బాణాన్ని అని ఇంకా ఎంతకాలం చెప్పుకుంటావు? చెట్టుపేరు చెప్పుకొని ఎంత కాలం రాజకీయాలు చేస్తావు? తెలంగాణకు ఏం చేశావు? తెలంగాణ అంటే ఏం తెలుసు? తెలంగాణలో రాజన్న రాజ్యానికి రూపు లేదు. వైఎస్‌ అన్న పదానికే తావు లేదు. రాజన్న రాజ్యం. ..జగన్న బాణం అని పాచిపోయిన పాట తప్ప చెప్పుకోవడానికి షర్మిలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడ జగనన్న కూడా షర్మిలను పట్టించుకోవడం లేదు..అది కూడా ఆమే స్వయంగా చెప్పిందే…అందుకే షర్మిలా…ఒట్టి మాటలు కట్టిపెట్టు. తెలంగాణకు ఏనాడైతే వైఎస్‌ కుటుంబం వ్యతిరేకం అని గుర్తించిందో ఆనాడే తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని చీ కొట్టింది. దూరం పెట్టింది. మానుకోటలో రాళ్ల వర్షం కురిపించి, తరిమేసింది. అయినా ఇంకా తెలంగాణ రాజకీయాలు పట్టుకొని షర్మిల వేలాడుతోంది. తెలంగాణ అంటే ఒక ఆత్మాభిమానం..ఆత్మగౌరవం. అవేవీ లేని వాళ్లకు తెలంగాణ రాజకీయ వేధిక కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. తను పుట్టిన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేని, రుణం తీర్చుకోలేని షర్మిల తెలంగాణ కోసం మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్ముతారా? కన్న తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిస్తానంటే నమ్ముతారా? తెలంగాణ కోసం నిలువు కాదు..అడ్డూ కాదంటూ ప్రతి క్షణం అడ్డుపడిన వైఎస్‌ కుటుంబాన్ని తెలంగాణ సమాజం క్షమిస్తుందా? తెలంగాణ ప్రజలు ఇంకా వంద సంవత్సరాలైనా వైఎస్‌ కుటుంబాన్ని, షర్మిలను నమ్మరు. అయినా తెలంగాణలో రాజకీయం చేస్తా…గెలిచి ఏలుతా షర్మిల పగటి కలలు కంటా అనుకుంటే ఎవరూ కాదనరు…ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే కూడా ఎవరూ అడ్డుపడడం లేదు. కాని తెలంగాణ అస్ధితత్వం మీద, ఉద్యమ కారులు మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత మీద షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించం… అంతో ఇంతో జనానికి వైఎస్‌ కుటుంబం అనే సానుభూతైనా వుండేది. కాని ఎప్పుడైతే జగన్‌ పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించాడో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లో షర్మిల కుటుంబం తుడిచిపెట్టుకపోయింది. అయినా ఇంకా ఇక్కడ రాజకీయాల పేరుతో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపి. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో షర్మిల చిల్లర మాటలు, వెకిలి దెప్పిపొడుపులు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు అసలే ఊరుకోరు. అయినా మా తాతలు నేతులు తాగారు…మా మూతులు వాసన చూడన్నట్లు రాజన్న పేరు చెప్పుకుంటే పబ్బం గడవని రాజకీయాలు ఎందుకు? అసలు నువ్వేంటో…నీ రాజకీయమేంటో…మహిళా సమాజ చైతన్యంలో నీ పాత్రేమిటో…తెలంగాణకు నువ్వు చేసిన మేలేమిటో ఒక్కటి చెప్పు? చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే ఇలా చేత్త మాటలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకో..తెలంగాణలో రాజకీయాలు చేసుకో…కాని తెలంగాణ సాధనలో, తెలంగాణ మహిళా ఉద్యమానికి చైతన్య దీపికైన కల్వకుంట్ల కవిత విషయంలో ఇంక్కొక్క మాట మాట్లాడినా షర్మిలను క్షమించేది లేదు..వదిలిపెట్టేది లేదు…ఇంత కాలం పోనీ..పోనీ అనుకుంటూనే ఓపికతో వుంటున్నాం.. పాదయాత్ర పేరుతో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై మాట్లాడుతూ, వారి చేత చీవాట్లు పెట్టించుకోవడం షర్మిలకు అలవాటైనట్లుంది. మహిళగా సభ్యత, సంస్కారంతో మాట్లాడాల్సిన విధానం వదిలేసి, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని షర్మిల చూడడం విడ్డూరం. వెకిలి తనానికి నిదర్శనం. తెలంగాణలో అలాంటి సభ్యత లేని మాటలకు తావులేదు. దుర్భాషలకు చోటు లేదు. వెలికి మాటలను తెలంగాణలో ఉచ్చరించరు. వాటిని తెచ్చి తెలంగాణ రాజకీయాలను, సమాజాన్ని కలుషితం చేయాలని షర్మిల చూస్తోంది. ఇది ఏ తెలంగాణ వాది ఆహ్వానించరు. అంతేకాకుండా మరొక్కసారి కల్వకుంట్ల కవిత గురించి ఒక్క మాట మాట్లాడినా షర్మిలకు తెలంగాణ మహిళా సమాజం తగిన బుద్ది చెబుతుంది. అంటున్న బిఆర్‌ఎస్‌ నాయకురాలు, చర్లపల్లి కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చిట్‌ చాట్‌…బొంతు శ్రీదేవి మాటల్లోనే…

తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల కవిత అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదులకొని వచ్చింది.

తెలంగాణ పోరాటంలో పాల్గొన్నది. ఎండనక, వాననక ఉద్యమాన్ని సాగించింది. అసలు కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్దాయ షర్మిలకు వుందా? కవితకు చేసిన త్యాగం, ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. కాని షర్మిలది చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే చిల్లర రాజకీయం. అయినా పదేపదే తెలంగాణ మీద విషం చిమ్ముతూ, కల్వకుంట్ల కవిత అక్రమాస్తులంటూ పొద్దస్తమానం లేనిపోని మాటలు మాట్లాడుతోంది. ఇంతకీ షర్మిలకు తెలంగాణలో రాజకీయాలు చేయడానికి డబ్బు ఎక్కడినుంచి వస్తోంది. పాదయాత్రకు అవుతున్న ఖర్చు ఎవరిస్తున్నారు? వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాలన పోయి దాదాపు పద్నాలుగేళ్లవుతుంది. అప్పటి అక్రమ సంపాదన తప్ప షర్మిల రాజకీయాలకు నిధులెక్కడివి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను పీల్చిపిప్పి చేసి, తెలంగాణ భూములు తెగనమ్మి, ఆస్ధులు పోగేసుకొని, అక్రమ సంపాదనకు ఎగబడి వెనకేసుకున్న సొమ్ముతో ఇంకా జపం చేస్తున్న షర్మిలకు తెలంగాణలో రాజకీయం చేసే నైతిక హక్కులేదు. రాజ్యాంగపరంగా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. కాని నైతికత అన్నది ఒకటుంటుంది. అది లేకుంటే రాజకీయాలు కూడా సాధ్యం కాదు…

 కల్వకుంట్ల కవిత ఒక ఉద్యమ నాయకురాలు..ఉన్నత విద్యావంతురాలు..ఉన్నత ఉద్యోగం చేశారు.

 తెలంగాణ ఆశ, ఆశయం, సాధన, ప్రజల ఆర్తి కవితకు తెలుసు. తెలంగాణ స్ధితిగతులు తెలుసు. తెలంగాణ గోస తెలుసు. అందుకే ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే రాజకీయాలు చేయలేదు. తెలంగాణ సమాజంలో చైతన్యం కోసం, విద్యా వ్యాప్తి కోసం, యువత కోసం, వారికి సాంకేతిక విద్యలో నైపుణ్యం కోసం, వారి ఉన్నతి కోసం జాగృతి అనే స్వచ్చంధ సంస్ధను ఏర్పాటు చేసి, ఎంతో మందికి మేలు చేసింది. సేవ చేసింది. సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పుడు జాగృతిని దేశమంతా విస్తరించే పనిలో వుంది. తన శక్తి యుక్తులను సమాజ ఉన్నతి కోసం వినియోగిస్తోంది. దేశంలోని యువతకు మేలు చేసే పనిలో వుంది. అదీ కవిత అంటే…ఇందులో షర్మిల ఏ ఒక్క పనైనా చేసిందా? తన జీవితంలో ఏనాడైనా సామాజిక బాధ్యతను నిర్వర్తించిందా? వైఎస్‌ కాంగ్రెస్‌కు అధికారం తెచ్చారని గొప్పలు చెప్పుకోవడం, తమకు అన్యాయం జరిగిందని సానుభూతి కోసం మొసలి కన్నీరు కార్చడం తప్ప షర్మిల ఏం చేసింది? తెలంగాణలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్ధికైనా సాయం చేసిందా? ఏ ఒక్క సామాజిక కార్యక్రమం చేపట్టిందా? ఎంత సేపు రాజకీయం…అధికారం…ఇదే షర్మిల అసలు స్వరూపం…కుటిల స్వభావం..గోతి కాడి నక్క వినయం.

 కల్వకుంట్ల కవిత అంటేనే ఒక బ్రాండ్‌…ఆమె పోరాట యోధురాలు…తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు…

తెలంగాణ వచ్చాక ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. అనేక సందర్భాలలో గొప్ప స్పీకర్‌గా గుర్తింపు పొందరు. విదేశాలకు పార్లమెంటు డెలిగేషన్‌ వెళ్లినప్పుడు వారికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు నిర్వర్తించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్‌ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు పార్లమెంటులో ప్రస్తావన చేశారు…ఇటీవలే డిల్లీలో జంతర్‌ మంతర్‌ వేధికగా ధర్నా కూడ నిర్వహించారు. ఇదీ కల్వకుంట్ల కవిత అంటే…మరి షర్మిల అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది…లేకుంటే తన పరువు తానే తీసుకున్నట్లౌతుంది. మరోసారి నోరేసుకొని కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణ మహిళా సమాజం ఊరుకోదని మాత్రం హెచ్చరిస్తున్నాను..

కాళేశ్వరంపై పిచ్చి కూతలు కట్టిపెట్టు.

`తెలంగాణ వరదాయిని కాళేశ్వరం.

`కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం.

`ప్రపంచంలోనే కాళేశ్వరం ఒక అద్భుతం. 

`కేంద్రం సహకారం లేకుండా చేసిన నిర్మాణం.

`కేంద్రమే పార్లమెంటు సాక్ష్యిగా అవినీతికి జరగలేదని చెప్పింది.

`ఐదేండ్లు అడిగినా, తెలంగాణలో చిన్న రిజర్వాయర్‌ కూడా వైఎస్‌ కట్టలేదు?

`తెలంగాణ వచ్చాక కాళేశ్వరం కట్డుకుంటే షర్మిల కళ్లు మండుతున్నాయా?

`జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసి తెలంగాణను దోచుకున్నది వైఎస్‌.

`బతకమ్మ తెలియదు, బోనం తెలియదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం షర్మిలకు తెలియదు.

`తెలంగాణలో భూకంపాలా? ఏ సన్నాసి చెప్పిండు?

 `అక్కడ అన్నను అడగలేదు! ఇక్కడ బడాయి తక్కువలేదు!!

`స్థాయికి మించి షర్మిల పేకుడు ముచ్చట్లు?

`ఏతులెన్ని చెప్పినా తెలంగాణలో చెల్లవు?

`ప్రతి వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడే వాళ్లే?

`అన్నను పోలవరం సంగతేమిటని అడిగే శక్తి లేదు?

`ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌. పెంకాసులు పోగేసుకున్నాడా?

`వైఎస్‌ బతికుండగానే లక్ష కోట్లు దోచుకున్నాడని పుస్తకాలు వేశారు?

`ఎన్నికల ముందు ఇల్లు అమ్ముకునే స్థితి నుంచి వైఎస్‌ కు ఇన్ని ఆస్థులెక్కడివి?

`రాజన్న రాక్షస రాజ్యం తరిమేసే…తెలంగాణ సాధించుకున్నాం.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో డిల్లీలో షర్మిల ధర్నానుద్దేశించి, తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. తెలంగాణ యాస తెలియదు. అసలు మాట్లాడనే రాదు…తెలంగాణ పేరెందుకొచ్చిందో తెలియదు. అసలు తెలంగాణకు అర్ధమే తెలియదు. తెలంగాణ కట్టు తెలియదు. బొట్టు తెలియదు. బోనం తెలియదు. బతుకమ్మ అంతకన్నా తెలియదు. తెలంగాణలో బతుకమ్మను ఎందుకు పూజిస్తామో తెలియదు. తెలంగాణ ఉనికి తెలియదు. తెలంగాణ చరిత్ర తెలియదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారో తెలియదు. నైసర్గిక స్వరూపం అసలే తెలియదు. ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేదో తెలియదు? ఇప్పుడు ఎలా వుందో చూడలేరు. నిజాలు మాట్లాడేందుకు నోరు రాదు. కాని తెలంగాణ రాజకీయాలు కావాలి. తెలంగాణలో నాయకత్వం కావాలి. మన దౌర్భాగ్యం కాకపోతే తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతూ, తాను అడ్డూ కాదు,నిలువూ కాదంటూ వెటకారం చేసిన రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల తెలంగాణపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా లేదా? తెలంగాణను నిలువెల్లాదోచి, తెలంగాణను ఎండబెట్టి, పండబెట్టిన వైఎస్‌ కూతురొచ్చి చిలకపలుకులు పలుకుతుంటే తెలంగాణ ఉద్యమ కారులైన మేం వినాల్సి వస్తోంది. 2004లో బిఆర్‌ఎస్‌తో పొత్తు లేకుంటే అసలు ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే కాదు…వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు… కేవలం తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం, తాను ముఖ్యమంత్రి కావడంకోసం, తన కల నెరవేర్చుకోవడం కోసం , కాకమ్మ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తెలంగాణపై విషం కక్కడం మొదలుపెట్టాడు. తెలంగాణ వాదం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మాయచేసి, మభ్యపెట్టి, అదిరించి, బెదిరించి కాంగ్రెస్‌లో కలుపుకున్నాడు. తెలంగాణ వాదం లేదనే కుటిల ప్రయత్నం చేశాడు… ఆఖరకు 2009 ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసి, తెలంగాణకు వెళ్లాంటే పాస్‌పోర్టు కావాలా? అంటూ సీమాంధ్రులను రెచ్చగొట్టి గెలిచిన వైఎస్‌. కుటుంబం నుంచి షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఆశలు పెంచుకోవడం మరీ దుర్మార్గం…మాట్లాడొస్తే చాలు నీతులు చెప్చొచ్చు…ఒర్రడమొస్తే చాలు బూతులు తిట్టొచ్చు అని షర్మిల మాటలు చూస్తేనే అర్ధమౌతుంది. తెలంగాణకు రాజశేఖరరెడ్డి చేసిన అన్యాయం బరించలేకే, తెలంగాణలో వైఎస్‌ కుటుంబానికి స్ధానం లేదని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో చెప్పింది. ఆ సమయంలో జరిగిన పరాకాల ఉప ఎన్నిక ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే…వైఎస్‌ అన్న పదానికే తెలంగాణలో స్ధానం లేదని మహబూబాబాద్‌ రైల్లే స్టేషన్‌ రాళ్లు ఇప్పటికీ చెబుతాయి. చరిత్ర వున్నంత వరకు ఆ రాళ్లు నాటి తెలంగాణ పౌరుషం గురించి మీసం మెలేస్తాయి. ఆనాడు ఏం జరిగిందో ఆ రాళ్లనడిగితే వివరిస్తాయి. అంటూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం…

మొన్నటిదకా జగనన్న బాణాన్ని అంటూ చిలకపలుకులు పలికి, ఇప్పుడు తగుదునమ్మా? 

అని తెలంగాణకొచ్చి అన్నతో చెడిరదని చెప్పి, అయ్య రాజశేఖరెడ్డి తెలంగాణ రాసిచ్చినట్లు రాజకీయాలు చేస్తానంటే ఇక్కడ వినడానికి ప్రజలు సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో అన్నకు అధికారం కోసం ప్రచారం చేసి, అక్కడ పోలవరంలో తట్టెడు మట్టి ఎత్తిపోయని అన్న గురించి మాట్లాడే శక్తి లేదు…కాని ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం మీద షర్మిల మాట్లాడుతుంటే వింతగా వుంది. అసలు కాళేశ్వరం అంటే ఏమిటో కూడా షర్మిలకు తెలుసా? తెలంగాణలో పలలేని,పని లేని వాళ్లు చెప్పే ముచ్చట్లు విని మాట్లాడడం కాదు… ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలుసుకో…తర్వాత దాని మీద ఏం జరిగిందనేది మాట్లాడుతువుగాని…కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణం అన్నది ఒక అధ్భుతం. ఈ ఎనమిదేళ్ల కాలంలో తెలంగాణలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మాణం జరిగిందో షర్మిలకు తెలుసా? ఆ రిజర్వాయర్లు ఎక్కడెక్కడున్నాయో? తెలుసా…వాటిపేర్లుకూడా తెలియవు…కాని కాళేశ్వరం అన్న ఒక్క పదం పట్టుకొని డిల్లీకి వెళ్లి గోల చేస్తే, గాయి, గాయి చేస్తే సరిపోతుందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టు. ఇందులో కేంద్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదు. అంతే కాదు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని కేంద్ర ప్రభుత్వమే సాక్ష్యాత్తు పార్లమెంటులో పలు సార్లు వివరణిచింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. కనీసం వాటి గురించైనా షర్మిల తెలుసుకుంటే బాగుండేది. కాళేశ్వరం అన్నది ఒక్క ప్రాజెక్టు కాదు..దాని కింద మొదలైన మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటు, తెలంగాణలో నిర్మాణం జరిగిన రిజర్వాయర్లన్నీ దాని పరిధిలోకే వస్తాయి. ఆ మాత్రం అవగాహన కూడా లేదు. కాని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరుంది కదా? అని మాట్లాడితే సరిపోదు…

నేను ముఖ్యమంత్రికావాలి…నేను ముఖ్యమంత్రి కావాలి…

అని ఇరవై ఏండ్లు పార్టీలోనే అసమ్మతి నేతగా ఎవరూ మెచ్చని నేతగా, ఆనాటి సీనియర్లతో పంటి కింద రాయిలా, కంటిలో నలుసులా వ్యవహరించి రాజశేఖరరెడ్డి మనస్తత్వాన్ని ఏ కాంగ్రెస్‌ వాది మెచ్చలేదు. నచ్చలేదు. అలాంటి వైఎస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, తెలంగాణ భూములమ్మి ఆంధ్రలో రిజర్వాయర్లు పూర్తి చేసిన దుర్మార్గుడు వైఎస్‌. అలాంటినేత పేరు చెప్పుకొని ఓట్లు రాల్చుకుంటా…రాజకీయాలు చేస్తా అంటే ఎవరూ నమ్మరు…మీ అన్న జగన్‌నే తెలంగాణలో ఎవరూ నమ్మలేదు. సాక్ష్యాత్తు పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొన్న జగన్‌ను తెలంగాణ ప్రజలే తిరస్కరించారు. తండ్రి వైఎస్‌ తెలంగాణకు అలా అన్యాయం చేస్తే, అన్న జగన్‌ ఈ విధంగా తెలంగాణను అడ్డుకున్నాడు. ఇప్పుడు చెల్లె షర్మిల వచ్చి, తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే నడుస్తుందా? జగనన్న బాణాన్ని అని నిన్నటిదాకా చెప్పుకున్న షర్మిల, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ఎందుకు పూర్తి కావడం లేదో అన్నను అడిగే పని వదిలేసి, తెలంగాణలో చిలక జోస్యం తనకు తానే చెప్పుకొంటోంది. తెలంగాణలో ఎవరూ మెచ్చని, నచ్చని రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. ఐదేళ్ల కాలం పాటు తెలంగాణలో ఒక్క చెరువు కట్టకు కూడా నిధులు ఇవ్వని వైఎస్‌. రాజశేఖరెడ్డి కూతురొచ్చి, కాళేశ్వరం మీద మాట్లాడే అర్హత వుందా? షర్మిలను తెలంగాణ జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం భూకంపాలకు ఆస్కారమందా? అసలు తెలంగాణ ప్రాంత నైసర్గిక స్వరూపం గురించి చదువుకొని మాట్లాడు…తెల్లారి లేస్తే భూమి కంపిస్తోందని జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టే ప్రకాశం జిల్లాలో రాజధాని రావాలని కోరుకున్నది జగన్‌…తాను అనుకున్న ప్రాంతలో రాజధాని నిర్మాణం జరగలేదని విశాఖకు మార్చేందుకు సిద్దమౌతున్న జగన్‌కు నిలదీయాల్సిన షర్మిల ఇక్కడ నీతులు చెబుతోంది. జనం ఉసరు తీసేందుకు కారణమౌతున్న జగన్‌ను రాజకీయాన్ని ప్రశ్నించు? అప్పట్లో డిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరిని నుంచి డిల్లీకి మార్చినట్లు ఆంధ్రప్రదేశ్‌లో వుంది పాలన. దాని సంగతి చూడు…? తెలంగాణ రాజకీయాలపై షర్మిల కపట ప్రేమ అందరికీ తెలిసిందే!! ఒక్కసారి కాకతీయ కాలువ చూడు…దానిలో పారుతున్న నీరు చూడు…ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయకాలువ ఎండబెట్టేవారు…కనీసం నీళ్లు వదిలేవారు కాదు…కాని ఇప్పుడు నిత్యం నిండుకుండలా పారుతుంది. ఏడాది పొడవునా, నిండుగా నీళ్లు మోసుకెళ్తోంది. 9700 క్యూసెక్కుల వ్రాహ సామర్ధ్యంతో కాళేశ్వరం నీళ్లుతో గళగళ సవ్వడులు దుంకుతున్నాయి. కాలువ పొడవునా వున్న పొలాలకు అవసరమైన నీరు నేరుగా రైతులు వాడుకునే అవకాశం కల్గింది. 289కిలోమీట్ల పొడవుతో కాళేశ్వరం నీళ్లు మోసుకుపోతోంది. తెలంగాణ మొత్తం సస్యశ్యామలమౌతోంది. ఇదే కాళేశ్వరం నీళ్లు…నిజాలు..ఇదీ తెలంగాణ సాధించిన విజయాలు..ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలుగన్న బంగారుతెలంగాణ ఆవిష్కారాలు…రైతన్నల జీవితాల్లో వెలుగులు…పాలన అంటే ఇదీ…ప్రజల సంక్షేమం అంటే ఇది! షర్మిల ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

కవితపై అంత కక్షెందుకు?

`మితిమీరిన అక్కసు మీడియా కెందుకు ?

`సీమాంధ్ర మీడియా అంత విరుచుకుపడుతుంటే నమస్తే తెలంగాణ ఏం చేస్తున్నట్లు?

`టి. న్యూస్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్లూ?

`నిజా నిజాలు ఎందుకు చెప్పకపోతున్నట్లు?

`టి. న్యూస్‌ మౌనం దేనికి సంకేతం? 

`ఇతర మీడియాలు డిబేట్ల మీద డిబేట్లు పెడుతుంటే టి. న్యూస్‌ ఏం చేస్తున్నట్లు?

`డిల్లీ లిక్కర్‌ పాలసీ కేసెలావుతుంది?

`స్కామ్‌ అనడానికి ఆస్కారమేముంది?

`అయితే గియితే అది డిల్లీ ప్రభుత్వానికి సంబంధించినది?

`డిల్లీ ప్రభుత్వం స్కీమ్‌ విరమించుకున్నాక తవ్వకం కక్ష కాక మరేమిటి?

`అది ప్రభుత్వ వ్యాపారం కాదు… కుంభకోణానికి ఆస్కారమే లేదు?

`నష్టపోతే వ్యాపారులకు దెబ్బ?

`రాజకీయాలలో ఎన్నికల ప్రచారానికి కూడా మీడియేటర్లు కావాలి? మీడియా కూడా అందరికీ కావాలి?

`మరి మీడియా కూడా స్కామ్‌ చేస్తున్నట్లేనా?

`ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఆదేశాలు కూడా తప్పేనా?

`వ్యాపారమన్నాక మధ్య వర్తులు లేకుండా జరుగుతుందా?

`ఆదాని వ్యాపారంలో ఇతరుల పాత్ర లేదా?

`దేశమంతా కవితపై కక్ష సాధింపు అన్నది చర్చ జరుగుతోంది?

`కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయకతప్పదని తెలుస్తోంది?

`అనవసరంగా రాష్ట్ర బిజేపి నేతల మాట విని అధిష్టానం అంతర్మధనంలో పడినట్లుంది?

` అందుకే అరవింద్‌ వాయిస్‌ లో మార్పు వచ్చింది?

`బండి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అరవింద్‌ నోట వచ్చింది?

`ఈ సంకేతాలు చాలు కవితపై కక్ష నిజమే! అని చెప్పడానికి?

ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు విశ్లేషణాత్మక కథనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ తరం రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్ధానం. దేశ రాజకీయాల్లో కీలక స్ధానం. తెలంగాణ రాజకీయాల్లో విశిష్ట స్ధానం. ప్రతిభ, సేవాభావం, రాజకీయం, ప్రగతి పధకం, జాగృతి పదనిర్ధేశం అన్నవి గొప్ప అంశాలు. ఇవన్నీ పునికి పుచ్చుకున్న నాయకురాలు కవిత. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి నాయకురాలు మా పార్టీలో లేదన్న అసూయ, ఆక్రోశం కూడా ఇతర రాజకీయ పార్టీలలో చాలా కాలంగా వుంది. నిరంతరం ప్రజల్లోవుండడం, ప్రజా సమస్యలపై స్పందిచే తత్వం కవితది. అందరికీ తెలిసిందే. కల్వకుంట్ల కవిత లాంటి డైనమిజం వున్న నేత మరే రాష్ట్రంలో లేదు. బిజేపి, కాంగ్రెస్‌పార్టీలో అంతకన్నా లేదు. దాంతో ఆమె నాయకత్వం భవిష్యత్తు తరంలో పెద్ద పెద్ద నాయకులకు కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుంది. నిజామాబాద్‌ ఎంపిగా ఆమె చేసిన సేవలను ప్రజలు మర్చిపోయేట్లు చేసి, మభ్యపెట్టిన బిజేపి గెలిచింది. గెలిచిన ఆ మరుక్షణం ఆ పార్టీ మాట మార్చి అభివృద్ధి కుంటుపర్చడాన్ని ప్రజలుకూడా గమనిస్తున్నారు. ఈసారి నిజామాబాద్‌లో బిజేపికి కాలం చెల్లినట్లే..దేశ రాజకీయాల్లో కూడా బిజేపికి గడ్డుకాలమే…అందుకే కల్వకుంట్ల కవిత లాంటి నాయకురాలు బిజేపిలో వుంటే ఆ పార్టీకి తిరుగులేకుండా వుంటుందన్న ఆలోచన కూడా బిజేపి చేసినట్లు కూడా గతంలోనే తేలిపోయింది. బిజేపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కవిత బిజేపిలో చేరే అవకాశాలు లేవని తేలిపోయింది. దాంతో నయానో, భయానో బిజేపిలోకి చేర్చుకునే ఎత్తుగడ కూడా బిజేపి చేసిందనేది విధితమే..ఈ సంగతి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా బిజేపి అరాజకీయ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపే క్రమంలో వెల్లడిరచారు. అయినా బిజేపి తన ప్రయత్నాలు ఆపలేదు. ఎంత ప్రయత్నించినా కవిత బిజేపిలోకి వచ్చే అవకాశాలు మృగ్యమైపోవడంతో, డిల్లీ మద్యం పాలసీ కేసుతో ఇబ్బందులకు గురిచేయాలని నిర్ణయించారు. ఒక రకంగా చెప్పాలంటే కక్షకట్టారు. బిజేపికి తెలియని విషయం ఏమిటంటే? అందరిలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చెప్పుకొని ఎదిగిన నేత కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు చెప్పుకొని పదవులు పొందిన నేత కాదు. ఆమె స్వయంకృషితో ఎదిగిన నేత. ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న నేత. 

చాలా మందికి తెలియని విషయమేమిటంటే 2014 ఎన్నికల ముందు వరకు ఆమె టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు కూడా కాదు. బిఆర్‌ఎస్‌ సానుభూతి పరురాలు మాత్రమే… అయినా ఆమె తెలంగాణ ఉద్యమంలో తాను ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నది. తన ప్రత్యేకతను చాటుకున్నది. 

 ఒక నాయకురాలుగా చెప్పుకోలేదు. బిఆర్‌ఎస్‌ పేరుతో రాజకీయాలు చేయలేదు. అలా అనుకుంటే ఆమె 2009లోనే రాజకీయాలు చేసేది. పదవులు అందిపుచ్చుకునేది. కాని ఆమె జాగృతి అనే స్వచ్ఛంధ సంస్ధ ద్వారా యువతకు సేవ చేసింది. వారికి ఉపాధి కల్పనలో మెలుకవలు నేర్పించేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. కొన్ని వేల మందికి ఐటి రంగంలో పోటీ పడేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. ఎంతో మందికి ఆ రోజుల్లో లాప్‌టాప్‌లు కూడా అందించి ప్రోత్సహించింది. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో మహిళల తరుపున ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. ఒక నిఘంటువు. ఆ రోజు ఉద్యమంలో ఎక్కడా లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నించినవారు కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవితను నానా రకాలుగా విమర్శిస్తున్నారు. అయినా ఆమె ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో వాటిని వింటూ వదిలేస్తారు. నాటి నుంచి నేటిదాకా ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. ఉద్యమ కాలంలో కూడా ఇలాగే కొంత మంది విమర్శలు చేశారు. అయినా ఆమె అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోలేదు. ఆమె చేసిన ఉద్యమం మూలంగా తెలంగాణ యాసను కించపర్చేలా వున్న అనేక సినిమాలను అడ్డుకున్నారు. ఒక దశలో సీమాంధ్ర సినీ పరిశ్రమ శంకర్‌ తీసిన జై బోలో తెలంగాణ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తే, అల్లు అర్జున్‌ ఆర్యా2, మహేష్‌బాబు సైనికుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ అదుర్స్‌ లాంటి సినిమాలు తెలంగాణలో ఒక్క షో కూడా పడకుండా చేశారు. తెలంగాణ శక్తి ఏమిటో చూపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఎంత శక్తివంతమైనదో ఆ ఒక్క సంఘటనతో చూపించారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరైనా ఆ పని ఆనాడు చేశారా? అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారా? కల్వకుంట్ల కవిత సాగించిన తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో అధ్భుతమైన కొన్ని వందల సంఘటనలున్నాయి. కాని ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నవారికి చెప్పుకోవడానికి కనీసం ఒక్క ఘటనైనా వుందా? నోరుంది కదా! మాట్లాడుతున్నవారికి కనీసం బిఆర్‌ఎస్‌ నేతలు కూడా సరైన కౌంటర్లు ఇవ్వకపోవడం బాధాకరం. 

 అసలు డిల్లీ లిక్కర్‌ది కేసే కాదు…అసలు అది సమస్యే కాదు…అది ఒక పాలసీలో భాగమైన చర్య…చర్చ…అంత వరకే…

అయినా ఆ పాలసీ ఎప్పుడో డిల్లీ ప్రభుత్వం ఉప సంహరించుకున్నది. ఈ విషయాలు రాష్ట్ర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇతర సీనియర్‌ నాయకులకు తెలియదా? బిఆర్‌ఎస్‌కు దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల యంత్రాంగం వుంది. సమారు 66లక్షల మందికార్యకర్తలున్నారు. కొన్ని వేల మంది క్రియాశీలక నాయకులున్నారు. రాష్ట్ర స్ధాయిలో అనేక పదవుల్లో వున్న నాయకులువందల్లో వున్నారు. వీళ్లెవరికీ అసలు డిల్లీ లిక్కర్‌ పాలసీ మీద అవగాహన లేకపోవడం విడ్డూరం. అంతే కాదు ఏడెనమిది నెలలుగా నలుగుతున్న ఈ సమస్యపై కనీసం ఏ ఒక్క బిఆర్‌ఎస్‌ నాయకుడు కూడా పెద్దగా స్పందించకపోవడం బాదాకరం. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నాయకులు బిజేపిని ఉతికి ఆరేయాల్సింది. కాని బిఆర్‌ఎస్‌ నేతల ఉదాసీనతే బిజేపికి మరింత బలం చేకూరింది. బిజేపి చేసిన అసత్య ప్రచారంలో నిజానిజాలు కూడా తెలుసుకోకుండా బిఆర్‌ఎస్‌ నేతలు కూడా లిక్కర్‌ స్కామ్‌ నిజమే అని నమ్మడం గమనార్హం. పదవుల కోసం వున్న శ్రద్ద బిఆర్‌ఎస్‌లో చాలా మందికి పార్టీని కాపాడుకోవడంలో లేదు. పార్టీమీద చిత్త శుద్ది లేదు. పార్టీ బలోపేతానికి వారు చేస్తున్నదేమీ లేదు. బిఆర్‌ఎస్‌లో అంతో ఇంతో ఉద్దండులైన నాయకులు, పాలన మీద అవగాహన వున్న సీనియర్‌ నేతలు కూడా స్పందించకపోవడం విచారకరం. అసలు లిక్కర్‌ అంశం డిల్లీలో అదొక పాలసీ మేటరే గాని, స్కామ్‌ అనే మాటకే అవకాశం లేదని నేటిధాత్రి చెప్పేదాక బిఆర్‌ఎస్‌ నేతలు చాలా మందికి అవగాహన లేకపోవడం మాత్రం శోచనీయం. 

కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు అనగానే రాజకీయ పార్టీలకన్నా, ఎక్కువగా సీమాంధ్రకు చెంది, తెలుగు తెగులును ముందు పెట్టుకున్న ఓ పార్టీకి మీడియాకు ఎనలేని సంతోషం కలిగినట్లుంది.

 ఇంత కాలం మొసలి కన్నీరు కార్చే మీడియా మొత్తం ఒక్కసారిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబంపై మాట్లాడే అవకాశం దొరికందన్నంతగా అత్యుత్సాహం ప్రదర్శించాయి. డిబేట్ల మీద డిబేట్లు…అసలు ఈడీ కేసులేమిటి? వాటి సెక్షన్‌లేమిటి? వాటి వల్ల ఏం జరగొచ్చు? కవితను అరెస్టు చేస్తే శిక్షేమిటి? నుంచి మొదలు ఇక కవిత అరెస్టు? అయినట్లే అన్నదాకా తీసుకెళ్లాయి? సాయంత్రం ఆరు గడిచినా ఎమ్మెల్సీ కవిత బైటకు రాకపోవడం, ఇక సీమాంద్ర మీడియా గొట్టాలకు పూర్తి స్ధాయి చెప్పింది. ఇక తాము చెప్పిందే జరిగిందన్న సంతోషాన్ని ఒక దశలో వ్యక్తం చేశాయి. ఆ రోజు బాగోతం అంతా ఇంతా కాదు…ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కవిత లాంటి నాయకురాలకు అన్యాయం జరిగితే అండగా నిలవాల్సిన మీడియా కూడా వెలికి వేశాలకు తెరతీసింది. ఇప్పటికీ ఆ మీడియాకు గుప్పిట దాగిన కసి చూపిస్తూనే వుంది. 

  తెలంగాణ మీడియా ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం ప్రటనలు ఇవ్వడం లేదు?

 అంటూ నిత్యం మాట్లాడే తెలంగాణ మీడియా అసలు స్కీమే కాని కేసులో స్కామ్‌ బూచి చూపి, ఎమ్మెల్సీ కవిత మీద క్షక్ష సాధింపు చర్యలు చేపడుతుంటే ఎందుకో తెలంగాణ మీడియాకు రాయడానికి అక్షరాలు రాలేదు? ఎలక్రానిక్‌ మీడియా నోరెందుకు పెగళ్లేదు? అంతే కాదు బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టి. న్యూస్‌ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు కూడా తెలంగాణ వాదుల నుంచి ఉత్పన్నమౌతున్నాయి. నిజాలేమిటో కూడా చెప్పలేకపోవడం ఏమిటని బిఆర్‌ఎస్‌ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. కనీసం నేటిధాత్రిలో వచ్చినంత సమాచారంలో కొంత భాగమైనా ఎందుకు రాయలేకపోయారు… టి. న్యూస్‌లో వినిపించలేపోయారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత రాజీకీయం భవిష్యత్తు దేశ ప్రగతికి, ప్రగతిశీల సమాజానికి ఎంతో అవసరం. ఆమెకు నేటిధాత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు…

కవిత కడిగిన ముత్యం…

`లిక్కర్‌ కేసు బిజేపి డ్రామా?

`బిజేపికి బిఆర్‌ఎస్‌ అంటే భయం పట్టుకున్నది?

` కేంద్రాన్ని ఎదిరించే శక్తి ఒక్క బిఆర్‌ఎస్‌ కే ఉంది?

`కవిత లాంటి డైనమిక్‌ మహిళా లీడర్‌ ఏ రాష్ట్రంలో లేదు?

`బిజేపి పార్టీలో ఒక్కరు కూడా లేరు?

https://netidhatri.com/integrity-thy-name-kavitha/

`కవిత పవర్‌ఫుల్‌ లీడర్‌… కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది?

`అందుకే బిజేపి భయపడుతోంది?

`కేసులతో బెదిరించాలని చూస్తోంది!

`అసెంబ్లీలో తీర్మానం చేసిన పాలసీని స్కామ్‌ అనొచ్చా?

`మంత్రి మండలి స్కామ్‌ లపై సంతకాలు చేస్తుందా?

`పాలసీ అమలుకాకముందే స్కామ్‌ అని ఎలా అంటారు?

`ఢల్లీి సర్కారు మద్యం పాలసీని ఉపసంహరించుకున్నది కూడా!

` ప్రభుత్వం పాలసీ ఉపసంహరించుకుంటే తప్పు చేసినట్లేనా?

`కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల ఉపసంహరణ జరిగింది?

`కేంద్రం తప్పు చేశామని ఒప్పుకున్నట్లేనా?

`బిజేపియేతర ప్రభుత్వాలపై బిజేపి కక్ష?

`బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వమే మద్యం అమ్ముతోందా?

`అసలు ప్రభుత్వమే నేరుగాఆ మద్యం అమ్మకాల షాపుల నిర్వహణ తప్పు?

` కేంద్రం దేశమంతటా మద్య నిషేదం అమలు చేయొచ్చు కదా?

`లిక్కర్‌ స్కీమే లేదు…స్కామ్‌ ఎక్కడిది?

`ఢల్లీి ప్రభుత్వం ఎప్పుడో ఉప సంహరించుకున్నది?

`లిక్కర్‌ పాలసీ ప్రభుత్వాల నిర్ణయం!

`ఢల్లీిలో వున్న షాపులే 800 పైచిలుకు?

`గతంలో సగం ప్రభుత్వం నిర్వహించేది?

`సగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వుండేవి?

`కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే తప్పులేదా?

`మిగతా 400 షాపులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం స్కామౌతుందా?

` ఒక్క ఢల్లీిలో నడిచే షాపుల ఆదాయం ఎన్నికలను ప్రభావితం చేసేంత శక్తి వుంటుందా?

`అంతా ఆదాని కోసమే….ఆదాని సమస్య పక్కదారి పట్టించడం కోసమే బిజేపి కుట్ర?

`వేల కోట్ల స్కామ్‌ చేసిన వారికి ప్రోత్సాహకాలా?

`ఢల్లీిి లిక్కర్‌ పాలసీలో గుజరాత్‌ వాళ్లుంటే బిజేపి కక్ష కట్టేదా?

`ఢల్లీి ప్రభుత్వం చేసిన పాలసీలో కవితకు ఎలా సంబంధం వుంటుంది?

`ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా చర్చ లేకుండా జరుగుతాయా?

` ప్రతి వస్తువును పిరం చేసినోళ్లకు,ఢల్లీి మద్యం పిరమైందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు, జిత్తులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కాని వేదింపులు సరికాదు. అందులోనూ రాజకీయ వేధింపులు అన్నవి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా కేసులు నమోదు చేశారు. కాని అందులో తేలినవి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వున్నాయి. అంటే మిగతా కేసులన్నీ రాజకీయ క్షక్ష సాధింపు చర్యలకు పురిగొల్పినవే అన్న స్పష్టమౌతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్ధ వుంది. దానికి అనుగుణంగా రాజకీయాలు చేయాలి. అధికారంలోకి రావాలి. అందుకు ప్రజల అభిమానం చూరగొనాలి. అంతే కాని కేంద్రంలో అధికారంలో వున్నామని, రాష్ట్రాల రాజకీయాలను కలుషితం చేస్తాం…. ఆ ప్రభుత్వాలను కూలుస్తాం…దొడ్డి దారిన మేం అధికారంలోకి వస్తాం అనే బిజేపి కుట్ర సరైంది కాదు. రాజకీయ పరిణతికి నష్టం జరగొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టొదు. అసత్యాలు, అర్ధసత్యాలు, విపీరత ప్రచారాల పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయాలు అసలే చేయొద్దు. ఇప్పుడు కేంద్రం చేస్తున్నది ఇదే అన్నది దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలుసు. అంతే కాదు దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద ఈడి కేసులు నమోదు చేయడం, వారు బిజేపిలో చేరగానే ఆ కేసులను అటకెక్కించడం ఆనవాయితీగా మార్చుకున్నది బిజేపి. తెలంగాణలో కూడా అనేక మంది బిఆర్‌ఎస్‌ నాయకుల మీద కూడా ఈడీ కేసులు పెట్టడం చూసిందే… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు కూడా అదే కోవలోకే చెందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య బిజేపిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా లిక్కర్‌ స్కామ్‌ అన్న పదమే తప్పని, స్కీము లేదు..స్కామ్‌కు అవకాశమేలేదు…ముడుపుల ముచ్చటే లేదంటూ, ఇందంతా బిజేపి రాజకీయ కుట్ర తప్ప మరేం లేదంటున్న రాజయ్య, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిని ఆయన మాటల్లోనే…

కల్వకుంట్ల కవిత. ఆమేమీ సామాన్యమైన నాయకురాలు కాదు.

తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నాయకురాలు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఆ జీవితాన్ని వదులకొని వచ్చి, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు. ఆమె తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. ఆమె పదవులు ఆశించి రాలేదు. కేవలం తెలంగాణ సాధనలో భాగాస్వామ్యం కావాలన్న ఆలోచనతో మాత్రమే వచ్చారు. అలా తెలంగాణ వచ్చి, ఉద్యమంలో పాల్గొన్నవారు బిజేపిలోగాని, కాంగ్రెస్‌లోగాని అలాంటి వారు ఒక్కరైనా వున్నారా? అసలు బిజేపిలో ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఎమ్మెల్యేలు, ఎంపిలే లేరు. కేవలం ఆనాటి యూపిఏ 2 ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాతనే బిజేపిలో కొద్దిగా కదలిక వచ్చింది. తెలంగా ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగానే, తెలంగాణకోసం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం… కాని ఆనాటి బిజేపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు. ఈనాడు రాజకీయాల కోసం తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వారిని రాజకీయంగా వేధించడం అన్నది సరైంది కాదు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన సమయంలోనే జాగృతి అనే స్వచ్ఛంద సంస్ధ ఏర్పాటు చేసింది. దాని ద్వారా తెలంగాణలోని అనేక గ్రామాల్లో యువతకు వృత్తినైపుణ్య శిక్షణలు ఇప్పించి, వారి భవిష్యత్తుకు ఒక దారి చూపింది. ఐటి రంగంలో ఉద్యోగార్ధులకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. మరో వైపు బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరో లెవల్‌కు తీసుకుపోయింది. సాంస్కృతిక పోరాటాన్ని పూలతో బతుకమ్మ రూపంలో సంస్కృతిని పునరుజ్జీవం కోసం పాటుపడిరది. అంతే కాదు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగినన్ని వంటావార్పు కార్యక్రమాలు మరే నాయకుడి ద్వారా జరగలేదు. ఎక్కువగా వాంటా వార్పు కార్యక్రమాలు ఆమె చేతుల మీదుగానే జరగడం విశేషం. ఇలా మహిళలను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా కవితకే దక్కింది. అలాంటి కవిత మీద లిక్కర్‌ కేసలన్న భూచీ చూపి, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అన్నది సరైంది కాదు. ఆమె రాజకీయ జీవితానికి ఇబ్బందులకు గురి చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న నాయకురాలు. కవిత లాంటి డైనమిక్‌ నాయకురాలు దేశంలో ఎక్కడా లేరు. అంతే కాదు బిజేపిలో అలాంటి అలాంటి నాయకురాలు ఒక్కరు కూడ లేదు. దేశ రాజకీయాల మీద పట్టున్న నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణాలో ప్రగతి శీల పాత్ర పోషిస్తున్నారు. దేశంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయి ఇప్పటికీ సుమారు 27 ఏడేళ్లు పూర్తవుతోంది. కాని ఇప్పటి వరకు దేశంలో ఏ మహిళా నాయకురాలు ఈ విషయం గురించి మాట్లాడిరది లేదు. కేవలం ఒక్క కవిత మాత్రమే మాట్లాడుతూ వస్తోంది. ఆమె ఎంపిగా వున్న సమయంలో అనేక సార్లు ప్రస్తావించింది. ఇప్పుడు జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. మహిళాభ్యుదయానికి,చైతన్యానికి కవిత అంకితభావం నిదర్శనం. ఒకనాడు తెలంగాణ కోసం, ఇప్పుడు మహిళా బిల్లు కోసం కవిత చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించాల్సిన సమయంలో కేసులు, ఈడీలు, సమన్లు అంటూ సమస్యను పక్కదారి పట్టించి, అసలు విషయం ప్రజల్లోకి పోకుండా బిజేపి అడ్డుకోవడం మహిళా సమాజాన్ని అవమాన పర్చడమే, చిన్న చూపు చూడడమే..వారికి అన్యాయం చేయడమే…మహిళల వాయిస్‌ లేకుండా చేయడమే? అవుతుంది. 

 కొన్ని విషయాలు లోతుగా విశ్లేషించుకోవాలి. 

లిక్కర్‌ పాలసీలపై రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందులో డిల్లీ ఆప్‌ సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నది. అది తప్పో, ఒప్పో ఆ రాష్ట్రానికి సంబంధించింది. అంతే కాని దానిని ఎక్కడికో ముడిపెట్టి, ఎవరెవరినో జత చేసి, బిజపిని ఎండగుడుతున్న బిఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బతీయాలని చూడడమే ఇందులో అసలు రహస్యం. ఇంతకన్నా ఏమీ లేదు. అంతా బిజేపి ఆడుతున్న డ్రామా… అసలు లిక్కర్‌ స్కామ్‌ అంటే ఏమిటి? సహజంగా స్కాములు ఎలా జరుగుతాయన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏదైనా పధకంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేస్తే స్కాం అవుతుంది. లిక్కర్‌ విషయంలో దానిలో దాపరికం అంటూ ఏమీ వుండదు. ఒక వేళ నకిలీ మద్యం సరఫరా చేస్తే నేరమౌతుంది. స్కాం అవుతుంది. అంతే కాని అసలు ఒక ప్రభుత్వం ప్రకటించిన పాలసీనలో వ్యాపారలు హక్కులు ఎలా స్కాం అవుతుందో బిజేపి నేతలే చెప్పాలి. ముడుపులు తీసుకుంటే స్కామ్‌ అవుతుంది? మరి అలాంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వచ్చాక కొన్ని కొత్త పాలసీలు తీసుకోవడం, పాత పాలసీలను పక్కన పెట్టడం సహజంగా జరిగిదే…అలాగే డిల్లీ ప్రభుత్వం కూడా గతంలో వున్న మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. డిల్లీ లో సుమారు 800పైగా మద్యం షాపులు వుంటాయి. వాటిలో సగం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే, మరో సగం ప్రైవేటు వ్యాపారులు నిర్వహిస్తుంటారు. దానిలో ఆప్‌ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చి, మొత్తం ప్రైవేటు వ్యాపారులకు ఆ డీలర్‌ షిఫ్‌లు అందించే పాలసీకి శ్రీకారం చుట్టింది. అందుకోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సుధీర్ఘమైన చర్యలు జరిపింది. అందుకోసం అధికారుల చేత ఒక కమిటీ వేసింది. ఆ అధికారుల కమిటీ నివేదిక మీద మరో ముగ్గురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సవరణలు చేసింది. ఆ నివేదికపై కూడా అక్కడి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సూచించిన సరవణలు కూడా పొందుపర్చి, అప్పుడు డిల్లీ శాసన సభ ఆమోంచింది. ఒక్కొ జోన్‌లో కేవలం 27 షాపులకే అనుమతులు అనే దానికి కూడా అంగీకారం తెలిపారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.9500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆప్‌ ప్రభుత్వం అంచానా వేసింది. 2021 జాన్‌లో క్యాబినేట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. అంతే కాదు షాపుల నిర్వహణ అన్నది డిల్లీ డెవలప్‌ మెంటు అధారిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందన్న నిబందన కూడా చేర్చారు. దాంతో 2021 నవంబర్‌ 17 కాకపోతే దీన్ని అక్కడి ప్రతిపక్షాలు రాజకీయం చేయడంతో ఆప్‌ సర్కారు ఆ పాలసీని కూడా రద్దు చేశారు. ఇదంతా 2021 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన. ఆదానికి చెందిన కంపనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించే పరిస్ధితుల్లో లేకపోతే వాటిని మాఫీ చేయడం తప్పుకానప్పుడు, ఆప్‌ సర్కార్‌ అమ్మకాలు లేని కారణంగా డీలర్లకు రూ.144 కోట్ల ఫీజు మాఫీ చేసిందనేది స్కామ్‌ అవుతుందా? దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు కరోనా సమయంలో రూ.10లక్షల కోట్ల బకాయిలు చెల్లించలేని కారణంగా వారికి కూడా రుణాలు మాఫీ చేసింది బిజేపి. కేంద్ర ప్రభుత్వం…ఇది తప్పుకాదా? సామాన్యులకు ఇచ్చే రేషన్‌ సరులకు ఉచితాలౌతాయి? అందరూ వంటకు వాడుకునే సిలెండర్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. విమానాల ఇంధన ధరలు తగ్గుతాయి…పెట్రోల్‌ డీజెల్‌ రేట్లు పెరుగుతాయి? వీటిని స్కామ్‌లని ఎందుకు అనకూడదు? ఇలాంటి ప్రశ్నలు బిజేపి మీద ఎన్నో వున్నాయి. అన్నింటి గురించి బిజేపి పెద్దలు పనిపాట లేని ముచ్చట్లు బాగానే చెబుతారు? కాని ఆదాని గురించి వచ్చే సరికి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడు…దేశంలో ఏ ఒక్కరికైనా రెండుకు మించి ప్రైవేటు ఎయిర్‌పోర్టులు వుండరాదు? ఇది చట్టం చెప్పే మాట… మరి ఆదానికి ఐదారు ఎయిర్‌ పోర్టులు ఇవ్వడం స్కామ్‌ కాదా? ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మకాలకు పెట్టడం స్కామ్‌ల కిందకు రాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అమ్మకాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదని సంస్ధలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినప్పుడు, ఆప్‌ సర్కారు లిక్కర్‌ వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మాణం చేయడం ఎలా స్కామ్‌ అవుతుంది? ఇంత చిల్లర రాజీకీయాలుంటాయా? అయితే ఆప్‌ సర్కార్‌ ఆ పాలసీని రద్దు చేసి, తన చిత్తశుద్దిని నిరూపించుకున్నది. స్కామ్‌ జరక్కపోతే ఎందుకు వెనక్కి తీసుకుంటున్నట్లు అని మళ్లీ ప్రశ్నిస్తున్న బిజేపి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. మొసలి కన్నీరు కార్చారు? అందులో స్కామ్‌ లేదా? అన్న ప్రశ్నకు ఇంత వరకు బిజేపి ఎందుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతోంది. దేశంలో ఇక బిజేపి పని అయిపోయింది. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే కుయుక్తులు తప్ప, ప్రజల మనసుల్లో బిజేపికి చోటు లేదు. బిఆర్‌ఎస్‌ను చూసి బిజేపి భయపడుతోంది. పైగా ప్రతిపక్షాలు పుంజుకోవడం చూసి జడుసుకుంటోంది. ఎలాగైనా ప్రతిపక్షాలను వీక్‌ చేసి, ప్రజల దృష్టి మళ్లించి, కుటిల రాజకీయాలు చేయాలని బిజేపి చూస్తోంది. కాని ప్రజలు అంత అమాయకులు కాదు….సరైన సమయంలో బిజేపికి తగిన బుద్ది చెబుతారు..

Integrity thy name Kavitha

Having been in politics since the inception of Telangana State, the BRS MLC

has never used or influenced as the daughter of chief minister K Chandra

Shekhar Rao. She tried to sustain on her own so that her individuality andhttps://netidhatri.com/కవిత-కడిగిన-ముత్యం/

integrity remain intact. As the cultural representative of Telangana, she has been

trying to highlight the core aspects pertaining to Telangana culture and tradition.

It is a fact that she has never attracted this kind of malicious propaganda which

is aimed at maligning her career and character.

Liquor case a drama of BJP?

It appears that for the last five months, Delhi liquor scam has become an

opportune weapon for BJP to target the Telangana government as well as its

leaders. Nobody knows for certain as to what is the scam and what are the issues

involved in it. As the liquor policy had already been scrapped by the Delhi

government itself, it seems that the BJP is doing much ado about nothing with

regard to that dismantled policy. The BJP is trying to bring something out of

nothing by implicating BRS senior leader Kavita.

BRS the potential force:

Ever since the Bharat RashtraSamithi(BRS) is formed, there has been

tremendous response to it across the nation. The president of the party and the

Chief Minister of Telangana K Chandra Shekhar Rao has brought such a wider

political as well as ideological strength to the party thereby making it a potential

political force in the ensuing Lok Sabha elections. Now it has become clear the

BRS has the nationwide political strength to face BJP at the hustings. It seems

that this is the only reason for the BJP leadership to target BRS so that it is

morally weakened. From the very beginning Mrs Kavita has proved her dynamic

leadership by undertaking many programmes for the cultural upliftment of

Telangana. We cannot find such a dynamic women leader even in BJP. Fearing

the political potentiality as well as the dynamism Mrs Kavita has, the BJP has

been trying to threaten her with cases. Can we consider or term a policy that has

been taken up by an assembly as scam? Even before the policy came into force

how can it be termed as scam ? it is also a fact that the Delhi government has

withdrawn that policy even before it coming into force. How can we say that the

Delhi government did wrong by withdrawing the policy?

In this background it is not out of the context why the central government has

withdrawn the agriculture policies. The farmers of north India severely oppose

the act and brought force on the government to retreat. Just withdrawing an act

does not mean that the government did something wrong.

Anti BJP governments are targeted:

In order to make the opposition ruled governments to submit to its dictacts, the

BJP run central government has been targeting opposition ruled states in a

number of ways.

Is it right to privatise PSUs?

It appears that privatising Public Sector Units has become order of the day. After

the BJP government came to power at the national level there has been selling spree of Public Sector 

Units. Is it not wrong to privatise Public Sector Units? In

what way central government’s action in this regard is justified?

Just to divert Adani issue :

Caught in the midst of Adani group issue and also the fallout from the turmoil,

the central government has been trying to divert the issue by targeting opposition

parties that tried to highlight the issue. Almost all the opposition parties united on

the Adani issue. The parties have also projected the investments made by PSUs

like LIC, SBI and other banks. It is also a fact that the BJP ruled central

government has been promoting crony capitalism. Just to coverup the scams

committed by its cronies the BJP government has been targeting opposition

parties and even went to the extent of implicating and arresting them.

How can BRS MLC Kavita influence a liquor policy of Delhi government? Just to

intimidate her politically and morally she has been targeted in the name of the

scam. The allegations against her involvement in the scam are surprising given

the fact that she is not at all involved in it. It is nothing but a political vendetta of

the BJP government to target a leader who has proved her innocence and integrity.

The central government has no time.

Common people burdened:

From soaps to biscuits and from cooking gas to petrol the prices of which have

been hiked so many times. The common people of the country have been

burdened and are heavily pained with the increases. The government has no time

to relieve the commoner from the price hikes for it is busy with targeting

opposition leaders and protecting cronies.

‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి?

`ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే!

`ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం.

`ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌?

`అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం!

`మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత.

`మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి…

`వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు.

`తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు.

`వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల గోల?

`గత ఎన్నికలలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్న కొందరు సీనియర్లు?

`ఈసారి కూడా సీనియర్లకే అనడం వారసులకు నిరాశే!

` ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇవ్వడం కుదరదు?

`తలలు పట్టుకుంటున్న సీనియర్లు.

`బలంగా వున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే సీనియర్లే కీలకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: రాజకీయాల్లో రాను రాను వారసత్వాలు పెరిగిపోతున్నాయి. ఇది వాంఛనీయం కాకపోవచ్చు. కాని వారసత్వ రాజకీయాలు తప్పుకాదు. రాజకీయ నాయకుల వారసులు రాజకీయాలను ఎంచుకోవడంలో తప్పులేదు. ఎటొచ్చి ఎల్లకాలం వాళ్లేనా…మాకు అవకాశం రావొద్దా? అని ఎదురుచూసే నాయకులు కూడా వుంటారు. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని, ఎంపి కావాలని, మంత్రి కావాలన్న కోరిక చాలా మందికి వుంటుంది. అత్యున్నత పదవులు పొందాలన్న లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నవారు కూడా వుంటారు. అయినా కొన్ని సార్లు అలాంటి వారికి జీవితాంతం అవకాశం రాకపోవచ్చు. కొందరికి అనుకోని వరంలా అవకాశాలు కలిసిరావొచ్చు. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నవారు..వారి వారసులను రాజకీయాల్లోకి చేర్చినవారు కొన్ని వందల మంది వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన తెలుగుదేశం మూలంగా కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. కొత్త తరం నేతలు రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ఆనాడు రాజకీయాలకు పరిచయం అయిన నేతలు ఇంకా క్రియాశీలక రాజకీయాలలో తమదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో వారి వారసులకు రాజకీయ భవిష్యత్తును సృష్టించిన వారు వున్నారు. కొన్ని కుటుంబాలలో ఒకటి రెండు తరాలు మారినా, వాళ్లే రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వున్నవాళ్లు కూడా వున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అందరూ అర్హులే. కాకపోతే రాజకీయ నాయకుల స్ధాయిని, హోదాను బట్టి ఆయా ప్రాంతాలో వారసులు కూడా తమ భవిష్యత్తు రాజకీయాలను తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. వారి వారి ప్రాంతాలలో రాజకీయాలను చేతిలోకి తీసుకొని నాయకత్వ పటిమ ప్రదర్శిస్తూ వుంటారు. ప్రజల ఆశీస్సులు వుంటే ఎవరైనా ప్రజా ప్రతినిధి కావొచ్చు. వారసత్వం అన్నది ఒక మెట్టు ఎక్కడానికో, రాజకీయాలకు పరిచయం చేయడానికో మాత్రమే పనికొస్తుంది. ఎల్ల కాలం ఉపయోపగపడదు. తనకు ప్రజా ప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఆ యువ నాయకుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్నది కూడా ప్రజలు గమనిస్తూ వుంటారు. ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్‌ అయితే మళ్లీ, మళ్లీ అవకాశం కల్పిస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే అభివృద్ధి చేస్తేనే, ప్రజలకు అందుబాటులో వుంటే, తమ సమస్యలు నాయకుడు తీర్చగలడన్న నమ్మకం వుంటేనే ఓట్లేస్తారు..గెలిపిస్తారు..అంతే కాని వారసులు అన్న ఒకే ఒక్క పదం మాత్రమే నాయకుడిని చేయదు…చేసినా అది ఎల్ల కాలం నిలబడదు..అలా రాజకీయాలు చేయలేక నిష్క్రమించిన వాళ్లు కూడా చరిత్రో అనేక మంది వున్నారు. 

 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది.

కాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ పార్టీ అంత ధైర్యం చేసే పరిస్దితి కనిపించడం లేదు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి, మూడోసారి గెలిచి హాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న అధికార బిఆర్‌ఎస్‌ పార్టీతోపాటు, ప్రతిపక్షాలు కూడా కొత్త తరం నాయకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంలేవు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ సీనియర్లదే హవా కొనసాగుతోంది. ఆ పార్టీలో కూడా మరోసారి అవకాశం కోసమే పాత తరం నేతలంతా ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశమే లేదు. పాతవారికే టిక్కెట్లు సర్ధలేక కాంగ్రెస్‌ పార్టీ తలలు పట్టుకునే అవకాశం వుంది. ఇక బిజేపిలో కూడా దాదాపు అంతే…ఇతర పార్టీలనుంచి వచ్చిన సీనియర్లు, గతం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల కొత్త తరానికి అక్కడా అవకాశం లేకుండాపోయింది. కాకపోతే అధికార బిఆర్‌ఎస్‌లో పోటీ మాత్రం విపరీతంగా వుంది. ఆ పోటీ మాత్రం విచిత్రంగా వుంది. ఈసారి టిక్కెట్లు మాకు కాకుండా మా వారసులకు ఇవ్వాలన్ని డిమాండ్‌ బిఆర్‌ఎస్‌లో బాగానే వుంది. తాము నాయకులుగా బలంగా వున్నప్పుడే, పార్టీ పటిష్టంగా వున్నప్పుడే తమ వారసులను రంగంలోకి దింపి ఎన్నికలలో గెలిపించుకోవాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. అందులో కూడా చాలా మంది గత ఎన్నికల్లోనే తమ వారసుల భవిష్యత్తును నిర్ధేశించుకోవాలనుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో ఆ అవకాశం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇవ్వలేదు. ఒకరికో, ఇద్దరికో అవకాశం ఇచ్చారు. కాని ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమకు కాకుండా టిక్కెట్టు తమ వారసులకు కావాలని కోరుకునే నేతలకు సీరియస్‌గానే సిఎం. కేసిఆర్‌ చెప్పనున్నారట. మీరు మాత్రమే పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం వుందన్నది తెలుస్తోంది. కాదూ, కూడదు అని ఎవరు నసిగినా వాళ్లకు కూడా టికెట్‌కట్‌ అన్న సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. అంటే ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ వారసులకు టిక్కెట్లు లేవు. ఇప్పుడున్న సీనియర్లే మళ్లీ పోటీ చేయాలి.. అందులో కూడా కొందరిని మార్చే అవకాశం వున్న చోట కొత్తవారికి అవకశం కల్పించనున్నారు. అంతే కాని నాయకుల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఎందుకుంటే ఇటీవల ఓ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాకతాళీయంగా అన్నా, అవే సీరియస్‌ సంకేతాలుగానే పరిగణించాలని నాయకులకు అర్ధమైపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఇండికేషన్లు వున్న తర్వాత కూడా టిక్కెట్‌ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు.

 ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం.

 అధికార బిఆర్‌ఎస్‌కు మరీ ముఖ్యం. ఎందుకంటే బిఆర్‌ఎస్‌దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన నాయకుల నాయకత్వమే ఎంతో అవసరం. వారికి వున్న అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నాయకులకు నియోజకవార్గల మీద, జిల్లా మీద పూర్తి పట్టు వుంటుంది. అదే వారసులకు అంతగా వుండకపోవచ్చు. పైగా ప్రజల్లో కొత్త వారసత్వ నాయకుల ప్రభావం కూడ పడొచ్చు. రెండుసార్లు అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలకు పూర్తి స్దాయి నమ్మకం, భరసా వున్నాయి. ఆయన నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. కాని కొందరు నాయకుల పనీతీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాంటి చోట్ల బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల స్దానంలో వారి వారసులకు అవకాశం కల్పిస్తే, మొదటికే మోసం రావొచ్చు. కొత్త తరానికి అవకాశం రావాలి. కాని దానికి కూడా సమయం సందర్భం వుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పును చూశాం…నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో తీర్పును చూశాం…రామలింగారెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తితో వుండడంతో మళ్లీ ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరించలేదు. సానుభూతి కూడా పనిచేయలేదు. అదే నాగార్జున సాగర్‌లో సానుభతి పనిచేసింది. నోముల నర్సింహయ్య నాయకత్వం ప్రజలకు వున్న నమ్మకంతో భగత్‌ను గెలిపించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో ముక్కొణపు పోటీ అనివార్యం. ప్రతిపక్షాలు కూడా కొంత బలపడ్డాయనే చెప్పాలి. గత ఎన్నికల పరిస్ధితి ఇప్పుడు లేదు. అందువల్ల ఆ పార్టీలను ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా సీనియర్‌ నాయకులనే మళ్లీ ఎంపిక చేయాల్సిందే..వారికే టిక్కెట్లు ఇస్తేనే సీనియర్‌ నాయకులపై వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న విశ్వాసంతో బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అందుకే ఈసారి వారసులకు టిక్కెట్‌ నో…!కాదూ..కూడదు…అంటే సీనియర్లకు కూడా కట్‌…!! ఇది ఫిక్స్‌…!!! అని సమాచారం. వారసులను రాజకీయాల్లోకి దింపాలన్న నాయకుల లిస్టు పెద్దగానే వుంది…అందుకే అందతా కాన్సిల్‌…? ఇదే ఫైనల్‌!?

బిసి నేతలు ఎదుగొద్దా! బతకొద్దా!?

` రాజకీయాలలో హత్యా రాజకీయాలకు తావులేదు.

`రాజకీయాలన్నీ ఆత్మహత్యా సదృశ్యాలే!

`బిసి. నేతలను నిర్మూలించి ఎన్నేండ్లు రాజకీయం చేస్తావు?

`వెయ్యేండ్లు బతికి పదవులు అనుభవిస్తావా?

`పార్టీయే నమ్మక పిసిసి ఇవ్వలేదు!

`కోమటి రెడ్డి సమర్థత ఎంతో అక్కడే తేలిపోయింది?

`చెరుకు సుధాకర్‌ చిన్న నాయకుడైతే అంత భయమెందుకు?

`రేవంత్‌ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు?

`బిసి.నేతల మీదనా నీ ప్రతాపం?

`తెలంగాణ ఉద్యమ సమయంలో పిడి.యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు చెరుకు సుధాకర్‌.

`నల్గొండ జిల్లాలో ఎంతో మంది బిసి నేతల రాజకీయ జీవితాలు నాశనం చేసినట్లు అనేక ఆరోపణలు?

`ఇప్పటికే పార్టీలో ఎవరూ నమ్మడం లేదు?

`కాంగ్రెస్‌ లో టిక్కెట్‌ వస్తుందో నమ్మకం లేదు?

`ఎప్పుడు గోడ దూకుతావో ఎవరికీ తెలియదు?

`పార్టీని ఖతం చేసే పనిలో, నేతలను కూడా లేపేస్తావా?

`ఇంతేనా ఇన్నేళ్ల రాజకీయం నేర్పిన పాఠం!

` ఇదేనా ఇంత కాలం అనుసరించిన అరాచక రాజకీయం!

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అసహనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో రాయలసీమలో ఇలాంటి వాతారణం వుంటుందని అంటుండేవారు. కాని కోమటి రెడ్డి వెంకటరెడ్డిలా తన రాజకీయ ప్రత్యర్ధులను ఏకంగా వంద మంది వెతుకుతున్నారు..వేసేస్తారు? అని చెప్పేంత ధైర్యం ఎవరూ చేసి వుండదు. రాజకీయాలకు దూరంగా వున్నవారో..లేక వ్యాపారాలలో ప్రత్యర్ధులలో..తగాదాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి చూసి వుంటాం…కాని ఒకే పార్టీలో వుంటూ, మరో నాయకుడిపై భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఇటీవల వీపతీరంగా అసహం పెరిగిపోయినట్లుంది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. పార్టీలో వుండాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేదనుకున్నాడు. తమకు ఎదురులేదనుకున్నాడు. ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ రావడంతో ప్రజలు తమ వైపు వున్నారన్న అహంభావం మరీ ఎక్కువైంద. ఎవరిని పడితే వారిని తిడుతున్న్డాడు. దూషిస్తున్నాడు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా వుంటూ వస్తున్నారు. అసమ్మతి నేతైనంత మాత్రాన ఆయనేం బలమైన నేత అన్నది ఎవరూ అనుకోడం లేదు…పార్టీ కూడా గుర్తించలేదు. కాకపోతే ఎన్నికల్లో అడిన చోట్లల్లా టిక్కెట్లు ఇస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చాడు. రాజశేఖరెడ్డి ఆశీస్సులతో తన తమ్ముడికి ఎంపి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. గెలిచారు. కాని 2014 ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చింది. తర్వాత 2018లో మునుగోడు టిక్కెట్టు తమ్ముడికి, నల్లగొండ టిక్కెట్టు అన్న తీసుకున్నారు. ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలిచాడు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వెంకటరెడ్డికి పార్టీ భువనగిరి ఎంపి టిక్కెట్‌ ఇచ్చింది. ఇంతగా పార్టీ అన్నాదమ్ములకు ప్రోత్సాహం ఇచ్చినా పార్టీని వెన్నుపోటు పొడిచారు. తమ్ముడు పార్టీ మారాడు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడు. వున్న పదవి పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే రాజగోపాల్‌ మునుగోడు బరిలో నిలిచాడో అప్పటినుంచి అన్నకు అసహనం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది.

 రాజగోపాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖతమైందంటూ బిజేపి వైపు చూశాడు. 

తమ్ముడు రాజీనామా చేసిన తర్వాత అన్న అదే రాగం అందుకున్నాడు. భవిష్యత్తు బిజేపిదే అంటూ, కాంగ్రెస్‌లో వుంటూ తమ్ముడి వైపు సైలెంటు ప్రచారం నిర్వహించాడు. అబాసు పాలయ్యాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా సొంతపార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతూ వస్తున్నాడు. చివరికి తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌ను చంసేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వంద మంది ఆయన కోసం వెతుకుతున్నారంటూ సుదాకర్‌గౌడ్‌ కొడుకుతో ఫోన్లో బెదిరించాడు. సుధాకర్‌ గౌడ్‌కొడుకు హాస్పిటల్‌ను నాశనం చేస్తానన్నాడు. చెరుకు సుదాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం అన్నది ఆది నుంచి వెంకటరెడ్డికి నచ్చలేదు. ఆయన రాకను వెంకటరెడ్డి వ్యతిరేకించాడు. 

 కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆది నుంచి చెరుకు సుధాకర్‌ కొరకరాని కొయ్యగా మారుతూ వస్తున్నాడు.

 దాంతో సుధాకర్‌పై ఇలాంటి వాఖ్యలు చేశాడు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా వున్న సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ సమయంలో చెరుకు సుధాకర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారుడిగా పదేపదే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుండేవారు. అది వెంకటరెడ్డికి అనేక సార్లు ఇబ్బందులకు గురి చేసింది. ఇదే సమయంలో చెరుకు సుధాకర్‌పై పడి. యాక్ట్‌ పెట్టారు. ఆయనను వరంగల్‌ జైలుకు పంపారు. ఇందులోనూ కోమటిరెడ్డి ఒత్తిళ్లే కారణమన్నది అప్పట్లో చెప్పుకుంటుండేవారు. కాకపోతే తాను తెలంగాణ వాదినే అని చెప్పుకొని మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వెంకటరెడ్డి వరంగల్‌ జైలులో సుదాకర్‌ను కలవడం జరిగింది. తాను సుధాకర్‌కు వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. అయినా వారి మధ్య వార్‌ నడుస్తూనేవుంది. ఇది ఇటీవల కాలంలో మరింత పెరిగింది. అప్పుడుంటే చెరుకు సుధాకర్‌ టిఆర్‌ఎస్‌ వుండేవారు. తర్వాత ఆయన సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీ పెట్టుకున్నాడు. కాని ఇప్పుడు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో వున్నాడు. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడిరచడంలో కీలక పాత్ర పోషించాడు. రాజగోపాల్‌రెడ్డికి పట్టున్న చౌటుప్పలోనే ఓట్లు పడకుండా రాజకీయం నడిపాడు. అప్పటినుంచి చెరుకు సుధాకర్‌ మీద వెంకటరెడ్డి మరింత కోపం పెంచకున్నాడన్నది వినిపిస్తున్న మాట. అయితే తాజాగా జరిగిన వివాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యుత్సాహానికి పోయి, గతంలో అద్దంకి దయాకర్‌ విషయంలో చేసిన దూకుడే ఇప్పుడూ ప్రదర్శించాడు. కాకపోతే బొక్కా బోర్లా పడ్డాడు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను పూర్తిగా చూడకపోతే ఏమౌతోందో అన్నది వెంకటరెడ్డి ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పాలి. పైపైన వుండే నాలుగు అక్షరాలు చేసి, ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని తెలిసి కూడా కొన్ని సార్లు తొందరపాటు ఎంత పనిచేస్తుందో వెంకటరెడ్డికి బాగా తెలిసి వచ్చింది. నిజానికి సుధాకర్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు తననే అనుకొని, తనకు ఆపాదించుకొని వెంకటరెడ్డి రెచ్చిపోయాడన్నది అసలు సారాంశం. 

  చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో వెంకటరెడ్డికి నూకలు చెల్లినట్లే అంటున్నారు. 

ఆది నుంచి కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి నిత్య అసమ్మతివాదిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తాను పార్టీకి సేవ చేశానని అంటున్నారే గాని, తనకు పార్టీ అవకాశం కల్పించిందన్న సంగతిని మర్చిపోతున్నారు. అంటే తన వల్లే కాంగ్రెస్‌ బతికి బట్టకట్టిందన్నంత అతివిశ్వాసానికి వెంకటరెడ్డి వచ్చారని విమర్శలున్నాయి. పైగా వెంకటరెడ్డి ఎప్పుడూ ఒక్క మాట మీద నిలవడడు అన్న అపవాదు కూడా వుంది. ఇంకా కాంగ్రెస్‌పార్టీ వెంకటరెడ్డిని భరించే పరిస్థితుల్లో లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి వైపు కన్ను గీటుతూ, మరో వైపు కాంగ్రెస్‌లో కొనసాగుతూ, అవకాశం వస్తే మరెటైనా దూకేందుకు సిద్దంగా వెంకటరెడ్డి వుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలంగాణలో వైసిపి వుంటే వెంకటరెడ్డి ఖచ్చితంగా ఈపాటికి చేరిపోయేవారని, ఒక వేళ షర్మిల పార్టీ బలంగా వుంటే ఆపార్టీలోకైనా వెళ్లిపోయేవారే అంటున్నారు. వైసిపి లేదు…షర్మిల పార్టీ అనుకున్నంత గొప్పగా లేదు. ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే వుంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అప్పుడు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకే వెంకటరెడ్డి ఆగుతున్నాడు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ఆయన ఎలాగూ ఎంపిగా వున్నారు. ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే మిగతా అసమ్మతి వాదులకు అవకాశం కల్పించినట్లైంది. అంతదాకా ఎందుకు మొన్నటిదాకా ఆయన వెంట నడిచిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా వెంకటరెడ్డి వ్యవహార శైలిని నచ్చడం లేదట. అందుకే ఈ మధ్య మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బిసి నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడైన చెరకు సుధాకర్‌ గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన రాజకీయ భవిష్యత్తు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం నేటిధాత్రి కూడా ఎప్పుడో చెప్పింది. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటి రెడ్డి సోదరులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది బిసి నేతలను ఎదకుండా చేశారన్నదానిపై కూడా సమగ్ర కధనం కూడా ప్రచురించింది. అయినా వెంకటరెడ్డి తన సహజశైలిని మార్చుకోలేదు. అందుకే అహం బైటపడిరది….రాజకీయ భవిష్యతుకు ఎసరు రానున్నది.

అర్హులను నెట్టి…అనర్హులకు పెట్టి!?

`అధికారుల సహకారం…ట్రేడర్ల మాయాజాలం

`లబ్ధి దారులకు సెంట్రింగ్‌ ఇచ్చే వారు వద్దా? 

` రెండు లక్షలు తీసుకునే వారే ముద్దా!

`దళితుల సొమ్ము కాజేసేవారికే కొమ్ము కాస్తారా?

` సెంట్రింగ్‌ సరఫరా చేస్తామనే వారికి బెదిరింపులా?

`మా ఊరికొస్తే అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టిస్తారా?

` నిజాయితీగా లబ్ధి దారులకు మేలు చేస్తామంటే వద్దంటారా?

` కేకే…స్టీల్‌ ట్రేడర్‌ ను ఎందుకు కాదన్నారు?

` తాను సరఫరా చేసిన సెంట్రింగ్‌ కు కూడా పని కల్పిస్తామని చెప్పే వారు వద్దా?

` నిష్పక్షపాతంగా సెంట్రింగ్‌ సరఫరా చేసే వారికి ప్రోత్సాహం లేదా?

` కనీసం అప్పటికప్పుడు లైసెన్స్‌ సృష్టించుకున్న వారికి అందలమా?

`దళితుల బలహీనతతో ఆడుకుంటారా?

`రెండు లక్షలు నొక్కి, తోచింది చేతిలో పెట్టి, దళిత బంధు లక్ష్యం నీరుగార్చుతారా?

`యూనిట్‌ ఇవ్వకుండా, డబ్బులిస్తామని చెప్పడం నేరం కాదా?

`దళితులను మోసం చేయడమే అధికారుల లక్ష్యమా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చారిత్రక నిర్ణయంలో, సమాజ నిర్మాణంలో అందరికీ అవకాశం రాదు. భాగస్వామ్యం కాలేరు. దళితబంధు లాంటి విప్లవాత్మకమైన పథకం అమలులో అన్ని వర్గాల ఉద్యోగుల అవసరం లేదు. కాని తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెచ్చిన దళిత బంధు పధకం అమలుకు కొన్ని శాఖలు, కొంత మంది అధికారులకే అవకాశం వచ్చింది. ఆ పధకం అమలులో భాగస్వామ్యమైన దళితులకు అందాల్సిన రూపాయి పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారులు చేసిన నిర్వాకం మూలంగా వారే విమర్శల పాలౌతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వారు చేసిన, దారి చూపిన అవినీతిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. ఏ క్షణమైనా దీనిపై విచారణ జరిగే అవకాశం కూడా వుంది. అధికారులు, అధికారులకు కొమ్ము కాసిన ట్రేడర్ల మూలంగా హుజూరాబాద్‌ లో అమలు చేయస్తున్న దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అర్హులనై ట్రేడర్లను పక్కనకు నెట్టేశారు. అనర్హులైన ట్రేడర్లకు అవకాశాకాలు కల్పించారు. దాంతో దళితులకు అందాల్సిన న్యాయమైన సొమ్ము ఉత్తుత్తి ట్రేడర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

 దళిత బంధు అమలులో ప్రభుత్వం అవకాశం కల్పించిన ట్రేడర్లలో సెంట్రింగ్‌ యూనిట్‌ అందించే ప్రత్యేక పరిశ్రమ వున్న సంస్ధ కేకే. స్టీల్‌. పూర్తి స్దాయిలో అన్ని రకాల అనుమతులు వున్న సంస్ధ. 

దళిత బంధు అమలులో భాగంగా అందించే సెంట్రింగ్‌ యూనిట్‌ను అందిస్తున్న విశ్వసనీయ సంస్ధల్లో ఇదొకటి. సహజంగా సెంట్రింగ్‌ యూనిట్లు అందిస్తున్న ఇతర సంస్ధలు కేవలం 1500 ఎస్‌ఎఫ్‌టిమాత్రమే అందిస్తున్నాయి. కాని కేకే అనే సంస్ధ 2000 ఎస్‌ఎఫ్‌టి అందిందించేందుకు ముందుకొచ్చింది. దళితులకు మేలు చేసే ఇలాంటి గొప్ప పధకంలో భాగాస్వామ్యం కావాలన్నదే ఈ సంస్ధ లక్ష్యం. అంతే కాదు మిగతా సంస్దలకన్నా తక్కువ ధరకే కోడ్‌ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమల గిరిలో ఈ సంస్ధ అందించిన యూనిట్లు ఇప్పుడు దళితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ కేకే అనే సంస్ధ సెంట్రింగ్‌ యూనిట్‌ను అందించడమే కాకుండా, ఆ యూనిట్‌ తీసుకున్న దళితులకు ఆ యూనిట్‌ ద్వారా ఆదాయం సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కాని ఇది అధికారుల చెవికెక్కలేదు. నిజానికి ఆ పని అధికారులు చేయాలి. సెంట్రింగ్‌ యూనిట్‌ అప్లికేషన్‌ పెట్టుకున్న దళితులకు ఖచ్చితంగా ఆ యూనిట్‌ అందజేయాల్సిన బాధ్యత అధికారులది. అంతే కాకుండా ఆ యూనిట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.

ఇది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో ఖచ్చితంగా పాటించాల్సిన అంశం. ఇక్కడ అధికారులు పాటించాల్సిన అంశాన్ని సెంట్రిగ్‌ యూనిట్‌ అందిస్తామని చెప్పిన కేకే స్టీల్‌ ట్రేడర్‌ , లబ్ధిదారులందరికీ తామే ఉపాధి కల్పిస్తామని అందుకు అవసరమైన బాండ్‌ కూడా రాసిస్తామని చెబుతున్నారు. కాని అదికారులు వినలేదు. ససేమిరా అన్నారు. కారణం ఈ కేకే స్టీల్‌ ట్రేడర్స్‌ లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పకపోవడమే కారణం….! అసలు ట్రేడర్లు చేయాల్సిన పనేమిటి? అధికారుల పర్యవేక్షణ ఏమిటి? అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం వుంది. ఖచ్చితంగా ట్రేడర్లు లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్లే అందించాలి. కాని దళితుల అకౌంట్లో వున్న డబ్బును సుమరు 2 లక్షలు తీసుకొని మిగతా సొమ్ము ఇవ్వడానికి కాదు…ఇలా ప్రజా ధనం పక్క దారి పట్టేందుకు కాదు…కాని అధికారులు, కొంత మంది ట్రేడర్లు కలిసి ఆడుతున్న నాటకంలో అసలైన ట్రేడర్లు పక్కకు వెళ్తున్నారు. లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. వారి సొమ్మును నొక్కేస్తున్నారు. 

 లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తామే తప్ప డబ్బుల మాయాజాలంలో మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్న కేకే స్టీట్‌ ట్రేడర్‌ సంస్ధ వ్యక్తులను కొందరు వ్యక్తులు బెదిరిచినట్లు సమాచారం.

 యూనిట్లు ఇస్తామంటూ నియోజకవర్గంలోకి వస్తే, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని కూడా కొందరు నాయకులు బెదిరించారట. అసలు ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్న ట్రేడర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించడం ఏమిటి? అంతే కాదు లబ్ధిదారుల డబ్బులు పట్టుకొని ట్రేడర్‌ మాయమైతే అప్పుడు ఎవరి బాధ్యత అంటూ అమాయకులైన లబ్ధిదారులకు లేని పోని భయాలు కూడా కొందరు సృష్టించారని తెలిసింది. యూనిట్లు అందిజేసిన తర్వాతే లబ్ధిదారులనుంచి అందుకు అవసరమైన సొమ్మును డ్రా చేయించుకోవాలి…అదే కేకే.స్టీల్‌ చేస్తామని చెప్పింది. అయినా అధికారులు వినలేదు…నాయకులు వినలేదు…… పైగా ప్రజలను కొందరు నియోజకరవర్గ నాయకులు, బోగస్‌ ట్రేడర్ల్‌ దళితులను తప్పుదోవ పట్టించి, కేకే ట్రేడర్స్‌ను రాకుండా చేశారు. హుజూరాబాద్‌ నియోజవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు అందించాల్సినంత సెంట్రింగ్‌ దరఖాస్తు చేసుకున్న చాలా మంది ట్రేడర్లకు ఎలాంటి అర్హత లేదు. వారికి కంపనీలే లేవు. అవన్నీ కేవలం సూట్‌ కేస్‌ కంపనీలు. రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన లైసెన్సులు మాత్రమే . అవసరమైన గోడౌన్లు లేవు. ఆ సదుపాయాలు కూడా లేవు. మెటీరియల్‌ అంతకాన్న లేదు. కేవలం కాగితాల మీద లైసెన్సు తప్ప మరేం లేవు…కాని కేకే.స్టీల్‌ ట్రేడర్స్‌ అవసరమైన గోడౌన్లు వున్నాయి. దళితులకు అందజేయాల్సిన సెంట్రింగ్‌కూడా రెడీగా వుంది. అధికారులు కూడా ఆ గోడౌన్లు పరిశీలించారు. నామ్‌కే వాస్తే చూశామన్నట్లు చెప్పి, ఉత్తుత్తి ట్రేడర్లకు లాభాల పంట పండిరచేందుకు, వాటలు పొందేందుకే అధికారులు మొగ్గు చూపారు. కేకే స్టీల్‌ ట్రేడర్స్‌కు అవకాశం కల్పించలేదు. అధికారుల తప్పుడు నిర్ణయం వల్ల లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు యూనిట్లు అందజేసేంత మెటీరియల్‌వున్న కేకే సంస్ధను కాదన్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టేశారు. ఉత్తుత్తి ట్రేటర్లకు అవకాశం కల్పించారు. నేటిధాత్రి ఈ విషయంలో దరఖాస్తు చేసుకున్న ట్రేడర్లు, వారి వివరాలు సేకరించింది. వారికి సంబంధించిన లైసెన్స్‌ల ప్రక్రియను కూడా పరిశీలించింది. ఉత్తుత్తి ట్రేడర్ల నిర్వాకంపై నేటిధాత్రి పూర్తి స్దాయి దృష్టిపెట్టింది. వాటి బండారం బైటపెట్టనుంది. త్వరలో వారి బోగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో రానున్నాయి.

మహా కార్యాన్ని మలినం చేయం.

దళిత బంధు పనుల బాధ్యతల నుండి మమ్మల్ని తప్పించండి….. https://netidhatri.com/దళిత-బంధు-మేసిన-రాబందులె/

గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామ కార్యదర్శులు…….. కెసిఆర్ https://netidhatri.com/దళిత-బంధు-ట్రాక్టర్లు-ఆం/

ప్రభుత్వం మానస పుత్రికగా అభివర్ణించిన దళిత బంధు పథకం,దళిత జాతి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, https://netidhatri.com/దళిత-బంధు-లో-దగా-దగా/

ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంద్ పథకానికి ఉన్నతాధికారుల https://netidhatri.com/దగా-చేసేది-మీరేనా-ఆత్మాభ/

నిర్లక్ష్యం,లంచగొండితనం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారి,లబ్ధిదారులు లాభంhttps://netidhatri.com/అత్యవసరంగా-మీటింగ్-అన్న/

పొందక పోగా,మధ్యలో బ్రోకర్లు,కొద్ది మంది ఉన్నతాధికారులు, వ్యాపారులు,కోట్ల రూపాయలు మూట గట్టుకున్నారని,గత కొద్దిరోజులుగా నేటి ధాత్రి దినపత్రిక లో వస్తున్న వరుస కథనాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రామ కార్యదర్శులకు దళిత బంధు ఆస్తుల ఫోటో రికార్డింగ్ చేసి నివేదికలను తయారు చేయాలంటూ బాధ్యతలను అప్పగించారు. ఉన్నతాధికారుల కనుసనల్లో ఈ భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో,గ్రామ కార్యదర్శుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.రికార్డులలో చూపినట్టుగా దళిత బంధు ద్వారా ఏర్పాటు చేసిన వ్యాపార సంస్థలు, వాహనాలు, ఇతర ఆస్తులు కనబడటం లేదని,కొన్ని వాహనాలు అమ్ముకున్నారని, మరికొన్ని వాహనాలు వేరే ప్రాంతాల్లో లబ్ధిదారులు లీజుకి ఇచ్చుకున్నట్లుగా తెలుస్తుందని, అంతేకాకుండా ఒకే వ్యాపార సంస్థను ఇద్దరు ముగ్గురు పేర్లతో నమోదు చేసుకున్నారని,ఇలాంటి సమయంలో తాము దళిత బంధుఆస్తుల ఫోటో సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించలేమని,ఈ బాధ్యత నుండి తమను తప్పించాలంటూ, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఆయా గ్రామాల కార్యదర్శులు జిల్లాకలెక్టర్ కు స్థానిక ఎంపీడీవో ద్వారా వినతి పత్రాన్ని పంపించారు.

అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

 

`ఇంతకీ ఏం జరిగింది?

`పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి?

`మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం…

`దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు!

`పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు!

`దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు!

`పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే!

`అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా?

`అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను రుజువు చేసిన ఉదంతాలు వున్నాయి. ఇప్పుడు కూడా దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే చిన్న జీవులను బలిచేసే ప్రయత్నం పెద్ద జీవులు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులు అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ బాధ్యతను పై స్ధాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా చేపట్టాలి. కింది స్ధాయిలో ఎక్కడా అవకతవకలు జరక్కుండా చూసుకోవాలి. కింది స్ధాయి ఉద్యోగులకు పూర్తి స్ధాయి శిక్షణలివ్వాలి. వారికి కొన్ని బాద్యతలు అప్పంచాలి. కాని దళిత బంధు విషయంలో పై స్దాయి అదికారులే అన్నీ చూసుకున్నారు. పథకం తప్పుతోవ పట్టిందన్న విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలిచేసే ఎత్తుగడలు మొదలైనట్లు తెలుస్తోంది. క్షేత్ర స్ధాయిలో ఈ పధకం అమలుకు సంబంధించి కేవలం అప్లికేషన్లు నింపే ప్రక్రియలాంటి చిన్న పని తప్ప, మరే సంబంధం లేదు. పైలెట్‌ ప్రాజెక్టు కావడంతో ఎంపిక విధానానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేకండాపోయింది. దళితులందరినీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేయడంతో పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు పేర్లు పంపించడం తప్ప మరేం చేయలేదు. కాని ఇప్పుడు వారికి పెద్ద చిక్కొచ్చి పడిరది. రెండో విడత నిధులు విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలతో పై స్ధాయి అధికారులక పని పడిరది. అసలు ఎంత పై స్దాయి అధికారులైనా ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులపై క్షేత్ర స్ధాయి అవగాహన వుండాలి. కాని అటు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులెవరూ వాటిని పట్టించుకోలేదు. కేవలం ఇందులో ఎంత సంపాదించొచ్చన్న విషయాలను మాత్రం బాగా పట్టించుకున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 ఇటీవల దళిత బంధు పథకం పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై నేటిధాత్రిలో వస్తున్న కథనాలతో భూకంపం పుట్టింది.

 అంతకు ముందు ఈ విషయాలు అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని నేటిధాత్రిలో వచ్చే సరికి ప్రభుత్వం కూడా సీరియస్‌ గా వుంది. అసలేం జరిగిందన్నదానిపై ఆరా తీస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే ఇన్ని లోపాలు ఎదురైతే అసలు పధకం అమలులో అధికారులు ఎన్ని అవాంతరాలు సృష్టిస్తారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఓ మంచి పధకాన్ని తీసుకొచ్చి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంటే అధికారుల చేసిందేమిటి? అన్న ప్రశ్నలే మిగులుతున్నాయి. ఈ పధకంలో రాజకీయ జోక్యం వుండొద్దని పూర్తి పారదర్శతతో సాగాలని, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంతో బాగుంటుందని నమ్మిన ప్రభుత్వాన్ని పనిగట్టుకొని అబాసు పాలు చేసే పరిస్దితి తెచ్చారు. ఈ పధకం అమలు విషయంలో అధికార బిఆర్‌ఎస్‌ నాయకులను దూరంగా వుంచారు. లేకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే ఎంతో ఆగం చేసేవి. అయినా పధకం సక్సెస్‌ కావొద్దనే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. అందుకే పైలెట్‌ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ పధకం మీద బురజ జల్లుతూనే వస్తున్నాయి. ఈ పధకం అమలైతే తమ పార్టీలకు ఇక తెలంగాణలో చోటుండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే ఈ పధకం విఫల ప్రయత్నం అన్న ప్రచారంతోపాటు, ప్రభుత్వాన్ని నిందిద్దామని చూస్తూనే వున్నాయి. 

ఇలాంటి సమయంలో ఎంతో గొప్ప పధకంగా ప్రజల చేత కీర్తింబడుతున్న ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పరిస్ధితి అధికారులు తీసుకొచ్చారు. 

ఇక పై నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో లబ్దిదారులకు సంబంధించినపూర్తి వివరాలు క్రోడీకరించాలని ఓ ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. కింది స్ధాయి ఉద్యోగులైన పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలి చేసే ఎత్తుగడలు వేశారు. దీన్ని ఆ ఉద్యోగులు పసిగట్టారు. పంచాయితీ సెక్రెటరీలు నివేధిక మీదే పథకం భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. కాని ఇక్కడే అసలు చిక్కుముడి వుంది. కనీసం ముప్పై శాతం లబ్ధిదారుల వద్ద ఎలాంటి యూనిట్లు లేవు. కిరణాషాపులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన బర్రెలులేవు. కార్లు లేవు. ట్రాక్టర్లు లేవు. సెంట్రింగ్‌ సామాను లేదు. టెంటు హౌజ్‌ కు సంబంధించినవి లేవు. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు ఏ నివేధిక తయారు చేస్తారు. ఏ ఫోటోలు తీస్తారు.? పై స్ధాయి నుంచి ఒత్తిళ్లతో తిమ్మిని బమ్మిని చేసినట్లు నివేధికలు తయారు చేసినా, ప్రభుత్వం ఏదైనా విచారణకు ఆదేశిస్తే మొదట ఉద్యోగాలు కోల్పోయేది వీళ్లే…అందుకే మేం ఆ పని చేయలేమని పంచాయితీ సెక్రెటరీలు చేతులెత్తేశారు. ఈ మధ్య జిల్లా స్ధాయి అధికారులు జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌లో ఖచ్చితంగా పంచాయితీ సెక్రెటరీలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని తెలిసి, ఆ మీటింగ్‌ రద్దు చేశారు. అంతే కాదు తమ జీవితాలను ఆగం చేసేందుకు దళిత బంధు రూపంలో ఉత్పాతాన్ని సృష్టించి, వాళ్ల ఉద్యోగాలు కాపాడుకునేందుకు పై స్ధాయి అధికారులు కుట్ర పనుతున్నారని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లేందుకు కూడా సెక్రెటరీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

   నిజానికి పై స్ధాయిలో వున్న ఉద్యోగులకు అన్నీ తెలుసు. 

కాని ఏమీ తెలియనట్లు, తామేమీ తప్పు చేయనట్లు, క్షేత్ర స్ధాయిలో ఏం జరిగిందో తెలియనట్లు, నివేధికలు కోరడం వెనుకు ఆంతర్యం తెలియందా? కనీసం 30 నుంచి 40శాతం కూడా లబ్ధిదారులు దళిత బంధు యూనిట్ల కలిగి లేదు. అంతే కాదు కనీసం ఆ యూనిట్లు ఎలా వుంటాయన్నది కూడా వారికి ట్రేడర్లు చూపించలేదు. ఈ పధకం కింద ఇచ్చిన కార్లు వారు నడిపింది లేదు. ఇంటి ముందు పెట్టుకున్నది లేదు. ఆ కార్లతో తిరిగింది లేదు. వారి అవసరాలు, బలహీనతలను సొమ్ముచేసుకునేందుకు వచ్చిన దళారులు ఇచ్చిన అత్తెసరుతో సర్ధుకున్నారు. ఇచ్చింది తీసుకొని కార్లు, ట్రాక్టర్లు వారికి అప్పగించారు. అసలు అధికారులు చేయాల్సిన పని ఏమిటన్నది మర్చిపోయారు. కార్లు, ట్రాక్టర్లు,ఇతర యూనిట్లు అందిజేసినప్పుడే లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాలు సూచించాల్సి వుండాల్సింది. కాని అది అధికారుల చేయలేదు. అమాయకులైన దళితులు వాటిని అమ్ముకొని వచ్చిన నాలుగు రూపాయలతో పూట గడుపుకున్నారు. అవి కాస్త అయిపోయినవి. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి వచ్చింది. మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? దళితులు ధనవంతులయ్యారా? అధికారులు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తమ వాటాలు తాము తీసుకొని, చేతులు దులుపుకోవడం కోసమేనా? దళిత బంధు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి?

దగా చేసేది మీరేనా…! ఆత్మాభిమానం మీకేనా!!

 

`దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…?

`దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా?

`దళితులను మోసం చేయడం తప్పని తెలియదా?

`దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా?

`దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి?

`కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి?

`దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా?

`సంతకాలకు లంచాలు తీసుకోలేదా?

`ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా?

`షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా?

`లబ్ధి దారులను నిండా ముంచింది మీరు కాదా?

`అవినీతి చేసేప్పుడు నిఘా సంస్థలుంటాయని తెలియదా?

`మీడియా వెలుగులోకి తెస్తుందన్న సోయి లేదా?

`లబ్ధి దారులు దుమ్మెత్తి పోస్తున్నారు?

`ఆధారాలతో అన్ని వివరాలు అందిస్తున్నారు?

`తప్పించుకోవడానికి దారి తెలియక మీడియా మీద పడతారా?

`దళితులకు అన్యాయం చేయొద్దని చెప్పడం ఇబ్బందిగా మారిందా?

`ఆత్మాభిమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? 

`లంచాలు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా?

`దళిత బంధులో జరిగిన అవకతవకల పై హై కోర్ట్‌ సుమోటోగా కేస్‌ స్వీకరించాలి…

`ఇప్పటికైనా మారండి…దళితులకు అన్యాయం చేయకండి! 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా ప్రభుత్వాలు ఒక గొప్ప పధకాన్ని తీసుకొచ్చే ముందు, దాని అమలు తీరు…సవాళ్లు…ఎదురయ్యే ఇబ్బందులు, సాధకబాధకాలు, నిధుల కూర్పు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పైలెట్‌ ప్రాజెక్టులు ప్రకటిస్తారు. ఏదో ఒక చోట ముందుగా అమలు చేస్తారు. దాంతో ఆ పధకం మీద ప్రజలకు అవగాహన, పాలకులకు మరింత బాద్యత పెరిగే అవకాశం వుంటుంది. అధికారులు ఎలా పనిచేస్తున్నారు..ఎంత వరకు పనిచేస్తున్నారు..వాళ్ల ఆ పథకం మీద ఎంత దృష్టిపెడుతున్నారు..ప్రజలకు ఏ మేరకు సహకరిస్తున్నారు… వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక పథకమే దళిత బంధు. ఇది ఎంతటి గొప్ప పధకమో సామాన్య ప్రజలకు అర్ధమైనంతగా అధికారులకు అర్ధం కానట్లుంది. అందుకే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పైలెట్‌ ప్రాజెక్టు అంటే ఉద్యోగులు ఎంతో చిత్తశుద్దితో పనిచేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. కాని దళిత బంధు విషయంలో ఏం జరుగుతోందో అందరకీ అర్ధమౌతోంది. తెలంగాణలోని దళితుల ఆర్ధిక స్ధితి గతుల్లో మార్పులు తెచ్చి, సమాజంలో వారికి సమున్నతమైన గౌరవం కల్పించి, వ్యాపార రంగాలలో వారిని ప్రోత్సహించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని ధైర్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఎన్నికల వేళ ప్రకటన అంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నా, తను అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కోసం పూర్తి స్ధాయి నిధులు అందజేశారు. ప్రతి దళితుడి బ్యాంక్‌ అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేశారు. ఇంత అంకితభావం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఇప్పటి వరకు అలాంటి ప్రభుత్వం మరొకటి లేదు. మరి ఇంతే చిత్తశుద్ద అదికారులకు వుందా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తెలంగాణలో అమలుకు నోచుకోవాల్సిన దళిత బంధులో వాటాలు వేసుకొని కమీషన్ల రూపంలో లంచాలు దండుకున్నది అధికారులు. అందులో కింది స్ధాయి అధికారులేమో! 

భయంతో పనిచేస్తే, పై స్దాయి అధికారులేమో! తమనెవరు? ఏం చేస్తారు? అన్న ధైర్యంతో దగా చేశారు…దళితుల సొమ్మును దోచుకున్నారు. ఈ విషయం ఏ లబ్ధిదారుడిని అడిగినా చెబుతాడు. దళిత బంధు పథకం డబ్బులు చేతికి రావడానికి ఎక్కడెక్కడ ఎంత తీసకున్నారన్న విషయం లబ్ధిదారులు పూసగుచ్చినట్లు చెబుతున్నారు. అయినా ఇంకా ఎందుకు భుకాయిస్తున్నారు? దళితుల సొమ్ము దగా మేసి, మేం దళిత అధికారులుగా మా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటారా? ఈ మాటలు దళితులే వింటే ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేదా? దళితుల సొమ్ము రూపాయి కూడా తినకుండా చూడాల్సిన బాధ్యత దళిత అధికారులు తీసుకోవాలి. ఆ సొమ్ముకు భద్రంగా దళితులకు అందేందుకు సహకరించాలి. ఎవరైనా గద్దల్లా దళిత బంధు సొమ్ము కాజేయాలని చూస్తే వారి భరతం పట్టాలి. ఇదీ దళిత అదికారులుగా చేయాల్సిన పనిని విస్మరించి, దళిత బంధు లబ్ధిదారులకు సంతకాలు చేసేందుకే వేలాది రూపాయలు వసూలు చేసి, వాళ్లేవరో ఊళ్లు పంచుకున్నట్లు దళితబంధు పథకంలో అందరూ కలిసి కోట్లాది రూపాయలు లూటీ చేశారన్నదైనా గుర్తుందా? 

 నేటిధాత్రి మీద కేసు వేస్తారా? వేయండి? ఏమని వేస్తారో వేస్తే అప్పుడు తెలుస్తుంది?

 నేటిధాత్రి అదే దళితుల సొమ్ము దగా కోరుల పాలైపోతోందని, వారిని చైతన్యం చేసే యజ్ఞం చేస్తోంది. వారి సొమ్ము దారి మల్లకుండా చూస్తోంది. ఎవరెవరు ఎంతెంత వాటాలేసుకొని పంచుకుతిన్నది చెబుతోంది. ట్రేడర్లనుంచి, షోరూం నుంచి జిఎస్టీల పేరుతో దోచుకుంటున్న సంగతి ప్రతి దళితుడికి తెలుసు. దళితుల్లో ఇంకా అమాయకులున్నారనే…వారి ఎదుగుదలకు ఈ సమాజం ఎలాగూ సహకరించదని, ప్రోత్సాహం అసలే వుండదని, ప్రభుత్వమే దళితులు సంక్షేమం కోసం ఆలోచించి దళిత బంధు తీసుకొచ్చింది. కనీసం ఆ పథకం ఉద్దేశ్యం కూడా అర్ధం చేసుకోలేక, ఉన్నతోద్యోగులై వుండి దళితుల సొమ్ముకు ఆశపడ్డవారు కూడా ఆత్మాభిమానం గురించి మాట్లాడితే ఏలా వుంటుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి దళితులమని చెప్పుకుంటున్న ఉన్నతోద్యోగులు తాము చేసింది తప్పే అనుకొని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామని చెప్పాలిందిపోయి, నేటిధాత్రి మీద కేసులు వేస్తామని బెదిరిస్తే సరిపోతుందా? నిజం నిప్పులాంటిది…అది దాగదు…తప్పు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టదు. 

 ఉద్యోగులుగా ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు సరిపోవడం లేదా?

 ఒక పైలెట్‌ ప్రాజెక్టు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దానిపై ఎంత మంది నిఘా వుంటుందో తెలియకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, తాము దళితుల దగ్గర తీసుకుంటున్న సొమ్ము గురించి ఎవరికీ తెలియదనుకున్నారా? చేయాల్సిందంతా చేసి, దళితులను దగా చేసి, మేం మా మనోభావాలు దెబ్బతిన్నాయనంటే జనం నివ్విపోతారు…ఇప్పటికైనా హుందాగా వ్యవహరించండి. ప్రభుత్వం ఎంతో గొప్ప పథకాన్ని అమలు చేసే బాధ్యత మీకు అప్పగించినందుకు ఎంతో పుణ్యంగా భావించాలి. తమ చేతుల మీదుగా కొన్ని వేల దళిత కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా వున్నాయని చెప్పుకునే స్ధితి కల్పించబడాలి. ఆ హుజూరాబాద్‌లోని దళితులంతా ఉద్యోగులకు చేతులెత్తి మొక్కేలా వుండాలి. ఎక్కడైనా కనిపిస్తే ప్రభుత్వం మా జీవితాలకు భరోసా కల్పిస్తే మీరు మాకు దారి చూపారని చెప్పుకోగలగాలి. అంతే కాని నిత్యం తిట్టుకునేలా వ్యవహరించారు. ఇప్పటికే ఎంతో మంది దళితులు తమ సొమ్ము తిన్న అధికారులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. శాపనార్దాలు పెడుతున్నారు. ముందు అవి వినండి…! అప్పుడు నేటిధాత్రి గురించి ఆలోచించండి…ఆత్మాభిమానం గురించి మాట్లాడండి!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version