దయామయుడు ఎదురులేదు! తిరుగులేదు!

`ఎదురు నిలబడే వాళ్లు లేరు?

`నిలిచి గెలిచిన వాళ్లు లేరు.

`అప్రతిహత విజయాలను అడ్డుకున్న వాళ్లు లేరు.

`కనీసం గట్టి పోటీ ఇచ్చిన వాళ్లు లేరు.

`మెజారిటీని అడ్డుకోలేకపోరు.

`ఇప్పటికే ఏడుసార్లు వరుసగా గెలిచారు.

`ఓసారి ఎంపి కూడా అయ్యారు.

`ఎక్కడి నుంచైనా గెలవడం కొత్త కాదు.

`పాలకుర్తి కొత్త అయినా వరుస విజయాలు ఆగలేదు.

`దయాకర్‌ కు పోటీగా నిలబడే నాయకుడే పాలకుర్తిలో లేడు.

`పాలకుర్తిలో ప్రతిపక్షాలకు దిక్కు లేదు.

`దయాకర్‌ రావుతో పోటీపడితే ఓటమే మిగులు.

`అందుకే అందరూ డైలమాలోనే..

`దయాకర్‌ రావు వేసుకున్నది గెలుపుబాటనే.

` నియోజకవర్గాన్ని సొంత ఊరులా చూసుకుంటారు.

`ప్రజలను సొంత మనుషులుగా ఆదరిస్తారు.

`విద్య, వైద్యం, పథకాలు అందరకీ అందేలా చూస్తాడు.

`ఉపాధి హామీ పనులను ఎంతటి ఎండనైనా లెక్క చేయక కూలీలకు ధైర్యమౌతాడు.

`ప్రజా సేవ అంటే పరమ భక్తితో నిర్వర్తిస్తాడు.

`మినిస్టర్‌ గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాడు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో ప్రశంసింపబడ్డాడు.

`పంచాయతీ రాజ్‌ శాఖకు వన్నెలద్దాడు.

`పల్లెల ప్రగతిని ప్రపంచానికి చాటాడు.

`ఢల్లీి నంచి అవార్డు తెచ్చిపెట్టాడు.

`పల్లె సిరులకు శ్రీకారం చుట్టాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పరిచయం అక్కర్లేని నాయకుడు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్ర్రంలోలోనే కాదు, తెలంగాణలోనూ క్రియాశీలక రాజకీయ, పాలక పాత్ర పోషిస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ ప్రస్తానం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్న నాయకుడు. తాను రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటినుంచి పోటీ చేసిన తొలిసారి తప్ప, రెండోసారి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరగని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాజకీయాల్లో ఓటమి లేని నాయకుడిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తర్వాత వరసలో వున్న మూడో నాయకుడు దయాకర్‌రావు. ఆ తర్వాత ఎవరూ లేరు. అలా తిరుగులేని రాజకీయ జీవితాన్ని నిర్మించుకొని, ఎక్కడున్నా రాణించడం ఆయన ప్రత్యేక శైలి. ప్రతిపక్షంలో వున్నా, అధికార పక్షంలో వున్నా ఆయనది ప్రత్యేక పాత్రే. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టి, ఆపార్టీ అధికారంలో వున్నంత కాలం, ఆ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడైనా ఓటమెరుగని నాయకుడు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. అంతే కాదు మొదట్లో ఆయన పోటీ చేస్తూ గెలిచిన వర్ధన్నపేట నియోజకవర్గం 2009 ఎన్నికల సమయంలో డీలిమిటేషన్‌లో రిజర్వుడు స్ధానమైంది. దాంతో ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాలకుర్తిని ఎంచుకున్నాడు. అక్కడి నుంచి మూడుసార్లు ఇప్పటి వరకు గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు రాజకీయ జీవితంలో మరో విశేషం కూడా వుంది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమ పార్టీ అయిన బిఆర్‌ఎస్‌(అప్పుడు టిఆర్‌ఎస్‌) మీద కూడా గెలిచిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేసినా, ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు బలం లేకుండా చేయడంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును మించిన నాయకుడు లేడని చెప్పడంలో ఆశ్యర్యం లేదు. ఎందుకంటే ఆయనతో పోటీ చేసిన వారు ఎక్కడా పెద్దగా రాజకీయాల్లో రాణించలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో కీలకంగా లేరు. ఒక్కసారి ఆయనకు ఎదురుగా నిలబడ్డారంటే వారి రాజకీయ జీవితానికి సన్యాసమే అని ప్రజలు చెప్పుకుంటారు. ఎందుకంటే దయాకర్‌రావు అంటే ప్రజలకు అంత ప్రేమ. తెలుగుదేశం పార్టీలో ఉద్దండులైన నాయకులు ఓడిపోయిన సమయాల్లో కూడా ఆయన ఎప్పుడూ ఓటమి చవి చూడలేదు. 2014 ఎన్నికల్లో ఎంతో మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు అడ్రస్‌ లేకుండా పోయినా, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తానేంటో, తన ప్రజాబలం ఏమిటో నిరూపించిన నాయకుడు దయాకర్‌రావు. అలాంటి దయాకర్‌రావుపై వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఒక్క మాట చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో చాలా చోట్ల అటు బిజేపికి, ఇటు కాంగ్రెస్‌కు పోటీ చేయడానికి అభ్యర్ధులు లేరు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం పాలకుర్తి. ఈసారి ఆయన గెలిస్తే ఇక మరో రికార్డు ఆయన ఖాతలో పడుతుంది. ప్రత్యర్ధులు ఏనాడు ఓడిరచలేని నాయకుడిగా చరిత్ర లిఖిస్తాడు. అదేంటో గాని పాలకుర్తి నుంచి పోటీ చేయడానికి ప్రతిపక్షాల నుంచి ఏ నాయకుడు ముందుకు రావడం లేదట. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలలో రాజకీయాలను ఓసారి పరిశీలిస్తే, భూపాల పల్లి నియోజకవర్గంలో నువ్వా, నేనా అన్నట్లు అధికార పక్షంతోపాటు, ప్రతిపక్షంలో కూడా పోటీ రసవత్తరంగా వుంది. వరంగల్‌ తూర్పు నుంచి నేనంటేనేనే అని బిఆర్‌ఎస్‌లో కూడా పోటీ వుంది. ప్రతిపక్షాలనుంచి కూడా మేమంటే మేమే అన్నంతగా పోటీ తీవ్రంగా వుంది. వరంగల్‌ పశ్చిమ నుంచి కూడా పోటీ బాగానే వుంది. ప్రతిపక్షాలు కూడ బలంగానే వున్నాయి. జనగామలో కూడా ప్రత్యర్దులు కాచుకొనే కూర్చున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అసలు పోటీ అన్న పదానికి ప్రతిపక్షాలలో స్ధానం లేని ఏకైక నియోకవర్గం పాలకుర్తి.

ఈ నియోజవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, ఎర్రబెల్లిని ఓడిస్తానని గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ముందుకొచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది.. అంతే కాదు దయాకర్‌ రావు రాజకీయ జీవితాన్ని చెడుగా చిత్రీకరించేందుకు ఏకంగా కొండా అనే సినిమా తీసి కూడా విడుదల చేశారు. కనీసం ఆ సినిమాను ప్రజలు ఒక్కరోజు కూడా ఆదరించినట్లు లేరు. దాంతో కొండాసురేఖ తన ఆలోచన మార్చుకొని, తూర్పు రాజకీయాల్లో క్రియాశీలకమౌతున్నారు. పాలకుర్తి నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకోవడం, ఓటమి మరోసారి ఖాతాలో వేసుకోవడం వేస్టని యూటర్న్‌ తీసుకున్నారని సమాచారం. ఇక గతంలో ఎర్రబెల్లి మీద పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఈసారి పాలకుర్తినుంచి పోటీ చేయమని పార్టీ బలవంతం చేసినా ససేమిరా ఆనే పరిస్దితిలోనే వున్నట్లు సమాచారం.గతంలో పాలకుర్తిలో పోటీ చేసేందుకు సుముఖంగానే వున్న జంగా, ఈ మధ్య కాలంలో పాలకుర్తిని వదిలేసినట్లే అని ప్రచారం జోరుగానే సాగుతోంది. ఎందుకంటే ఆయన వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువగా సుముకంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. అంతే కాదు వీలైతే అవకాశం వస్తే జనగామ నుంచైనా పోటీకి సై అనేలా వున్నారే గాని, పాలకుర్తి అంటే పారిపోయేందుకు రెడీగా వున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ శాఖ ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఒక దశలో తాను పాలకుర్తినుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సందర్భం వుంది. కాని ఆయన పాలకుర్తి పరిస్ధితులు తెలుసుకున్నాక ఆ మాట మరోసారి మాట్లాడడమే  మనేశారు. మర్చిపోయారు. అంతే కాకుండా ఈ మధ్య రేవంత్‌రెడ్డి పాదయాత్రలో ఆయనను పాలకుర్తిలో కొందరు మహిళలు గుర్తించడం లేదని మొహం మీదే చెప్పడంతో అవాక్కయ్యారు. తనను పరిచయం చేసుకున్నారు. అంటే దయాకర్‌రావు తన నియోజకవర్గంలో ప్రజలతో ఎంత మమేకమౌతారో ఈ ఒక్క విషయంతో అర్దం చేసుకోవచ్చు. తను తప్ప మరో నాయకుడు ప్రజలు తెలియకుండా సేవ అందించడంలో దయాకర్‌రావు ఆది నుంచి ముందు వరసులోనే వుంటూ వస్తున్నాడు. ఇలా ఒక నాయకుడు తన స్ధానాన్ని ప్రజల నమ్మకాన్ని పొంది, తనకు ఎదురులేని రాజకీయాలు నిర్మించుకోవడం అందరి వల్ల కాదు. ఒక దశలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో రాజకీయంగా నన్ను తీవ్రంగా విమర్శించే, ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసే ప్రజా సేవ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అందుకే ఎవరికీ ఇవ్వనన్ని సిఎం. రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు ఆయనకే ఇవ్వడం జరిగిందని కూడా ప్రకటించారు. ఇదీ దయాకర్‌రావు ప్రజాసేవకున్న నిబద్దతకు నిదర్శనం. అన్నం ఉడికిందా? అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. దయాకర్‌రావు ప్రజా సేవలో ఎందుకు పెరెన్నిక గన్నారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సందర్భంచాలు. ఇప్పుడు ఆయన చిరకాల కోరికైన మంత్రి పదవి నిర్వహిస్తున్నారు. ఆయన ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో చెప్పాలంటే చాల వుంది. దటీజ్‌ దయకర్‌రావు. ఆయన గురించి రాయడం మొదలు పెడితే రామాయణం అవుతుంది. భవిష్యత్తులో దయాకర్‌ రావు మరిన్ని రాజకీయ విశేషాలు కూడా నేటిధాత్రి పాఠకులకు అందిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!