`సందర్భం లేకున్న తెలంగాణ మీద విషం కక్కే దుర్ణీతి?
`తెలంగాణలో వున్నది కుటుంబ పాలన కాదు..ఉద్యమ పాలన?
`అభివృద్ధి పాలన…బంగారు తెలంగాణ.
`అవినీతి గురించి మాట్లాడే నైతికత మోడీకి లేదు.
`ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేసే మోడీకి ప్రగతి నచ్చదు?
`ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే మోడీ అభివృద్ధి గురించి ఆలోచించరు?
`‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో. మోడీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి’’ ఫైర్
`తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ తెలంగాణకు సాయపడతారా?
`తేనె పూసిన మాటలు కట్టిపెట్టండి!
`తెలంగాణకు ఎక్కువ చేసిందేమిటో చెప్పండి?
`విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి.
`తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులేవి?
`ఉత్తరాధికి మూటలు – దక్షిణాధికి మాటలు.
`చెప్పేవి గొప్పలు..చూపించేవి రిక్త హస్తాలు.
`ఎన్ని సార్లు వచ్చినా మోడీ తెలంగాణకు ఇచ్చేదేమీ వుండదు?
`తెలంగాణ ప్రజలను మోడీ మాయచేయలేరు?
`తెలంగాణ ప్రజలు బిజేపిని నమ్మరు?
`గొప్పలు చెప్పుకోవడం అంటే అబద్దాలు చెప్పడమే?
`ఆంద్రప్రదేశ్ కు ఉపయోగపడేదే వందే భారత్ రైలు?
`తెలంగాణ ప్రజలకు అందుబాటులో వుండదు?
`తెలంగాణ వనరులను దోచుకోవడానికే మోడీ వస్తున్నాడు?
`సింగరేణి అమ్మకానికే మోడీకి తెలంగాణ మీద కుట్ర ప్రేమ?
`మోడీకి తెలంగాణ అంటే ఆది నుంచి చిన్నచూపే?
`తెలంగాణ ఎదగడం ఆయన కు కంటగింపే?
`బిఆర్‌ఎస్ పార్టీతో నష్టమని అర్థమయ్యే పదేపదే వస్తున్నాడు?
`ప్రజలను మభ్యపెట్టి మాయచేయాలని చూస్తున్నాడు?
`ప్రజలను విభజించి రాజకీయం చేయడమే మోడీ కుతంత్రం?
`తెలంగాణలో బిజేపి ఆటలు సాగనివ్వం!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ఏర్పాటు కావడమే బిజేపికి ఇష్టం లేని పని. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీకి అసలే నచ్చని పని. మనసులో ఒకటి పెట్టుకొని,తెలంగాణకు వచ్చి కపట ప్రేమ నటించడంలో కూడా ఇష్టంలేకుండా చెప్పే మాటలు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్ధమౌతున్నవే. నిజాలు ఎలాగూ బిజేపి నేతలు మాట్లాడలేరు. కనీసం చెప్పే అబద్దాలు కూడా నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మోడీకి తెలంగాణ అంటే ఏ కోశానా ఇష్టం లేదు. అందుకే తెలంగాణకు ఆయన వచ్చినా, మనస్పూర్తిగా మాట్లాడలేరు. ఇష్టం లేని మాటలు ఎప్పుడూ వినసొంపుగా వుండవన్నట్లే మోడీ మాట్లాడతారు. కొత్త రాష్ట్ర్రం తెలంగాణ సాధించుకొని, అరవైఏళ్లపోరాటం ఫలించి, కొత్త అడుగులు వేసేందుకు సిద్దమౌతున్న తెలంగాణకు శుభాకాంక్షలు చెప్పాల్సిన మోడీ, తల్లిని చంపి బిడ్డను బతికించారని తన మనసులో వున్న అక్కసు కక్కేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తారా? తెలంగాణ సాధించుకొని, కొత్తగ ఏర్పాటైన రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేయాల్సిన సమయంలో మాట్లాడే మాటలేనా? శుభం పలకమంటే ఏదో పలికినట్లు? చేసిన మోడీకి తెలంగాణ అంటే ప్రేమ వుంటుందనేది భ్రమ. తెలంగాణ ఏర్పాటై నాడే, కాదు ప్రతి అవకాశాన్ని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించేందుకు ఉపయోగించుకొనే మోడీకి తెలంగాణ పట్ల ఎన్నడూ ప్రేమ రాదు. అందుకే ఆయన చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన వుండదు. అరచేతిలో వైకుంఠం చూపించడం అలవాటు చేసుకున్నాడు. బిజేపి శ్రేణులకు ఇది ఎప్పటికీ అర్ధం కాదు. మోడీ మాయలో పడి బిజేపి శ్రేణులు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాని విరుచుకుపడిన ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ తెలంగాణకు మోడీ చేస్తున్న అన్యాయాలను ఎండగట్టారు. ఆ వివారాలు పల్లా రాజేశ్వరరెడ్డి మాటల్లోనే…
చెప్పుకోవడానికి ఏమీ లేక, గాయి గాయి చేయడం, చెసిన పనినే పదే పదే చేయడం, వార్తల్లో నిలవడం తప్ప మోడీ చేసిందేమీ లేదు.
పేద దేశమైన మన దేశంలో పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి. కాని సంపన్నులకు దోచి పెట్టే నాయకుడు పేదలకు సేవ చేస్తాడని నమ్మడం ప్రజల అమాయకత్వమౌతోంది. దేశంలో గత ప్రభుత్వాలు అనేక స్పీడ్‌రైళ్లను ప్రవేశపెట్టారు. దేశంలో పేదలకు కూడా సంపన్నులలాగా సౌకర్యాలు అందాలని గతంలో గరీభ్‌రధ్ రైలు ప్రవేశపెట్టారు. దేశమంతా ఆ రైళ్లు పేద ప్రజలకు సేవలందిస్తున్నాయి. అయినా వాటిని ఒకేసారి ప్రవేశపెట్టారు. కాని వందేభారత్ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్లను ఇప్పటికి ప్రధాన మంత్రి మోడీ 14సార్లు జెండా ఊపి ప్రారంభించారు. ఇంతపెద్ద దేశానికి ప్రధానమంత్రి కొత్త రైళుకు జెండా ఊపి ప్రారంభించడం తప్ప మరో పనిలేదా? ఇదేనా పరిపాలన తీరు. పైగా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి తిరుపతి వెంకన్నసన్నిధికి వందేభారత్‌తో అనుసంధానం చేస్తున్నామని చెప్పడమన్నంత మాటలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతారో వారికే తెలియాలి. గతంలో తిరుపతికి హైదరాబాద్ నుంచి రైల్వే ట్రాక్ లేకపోతే, ఇప్పుడు కొత్తగా లైన్ వేసి, కొత్తగా ట్రైన్ సౌకర్యం కల్పించి, రైలుకు జండా ఊపి ప్రారంభించినంత పచ్చి అబద్దాన్ని గొప్పగా చెప్పుకోవడం మోడీకే చెల్లింది. ఇంత కన్నా అన్యాయమైన మాట మరొకటి వుంటుందా? అయినా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ రైలు తెలంగాణ ప్రజలకు కోసం వేసింది అసలే కాదు. పేరు పెరుమాళ్లది, ఆరగింపు అయ్యవారిది అన్నట్లు, ఆంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడం కోసం మాత్రమే వేసిన రైలు వందేభారత్. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందేభారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణలో ఒక్క నల్గగొండ మీదుగానే ప్రయాణం చేస్తుంది. అది దాటితే మొత్తం ఆంధ్రాలోనే ప్రయాణిస్తుంది. ఆదిలాబాద్ ప్రజలు వందేభారత్ రైలులో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్‌కు వచ్చి వెళ్లాల్సిందే? కనీసం కాజీపేట, వరంగల్ మీదుగా వెళ్లినా ఎంతో కొంత తెలంగాణుకు ఉపయోగపడిరదన్న సంతోషం వుండేది. కాని తెలంగాణ ప్రజలకు ఆ అవకాశమే లేదు. కాని తెలంగాణకు ఏదో వరం ఇచ్చినంత గొప్పగా చెప్పి, ఆంద్రాకు మేలు చేసిన మోడీకి తెలంగాణ మీద ప్రేమ వుందంటే నమ్ముతామా?
సికింద్రాబాద్ హైక్లాస్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన బిజేపి ప్రభుత్వానిది కాదు.
గతకేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే..తెలంగాణ మీద మోడీ ప్రేమతో చేసిందేమీ కాదు. దక్షిణమధ్య రైల్వే ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.5వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతోంది. మరి అంత ఆదాయం అందిస్తున్న సికింద్రాబాద్‌కు ఎన్ని నిధులు సమకూర్చినా తక్కువే. అయినా నవ్విపోదురుగాక..నాకేమీ అన్నట్లు కేంద్రం కేవలం సికింద్రాబాద్ మీద ప్రేమతో ఏ స్టేషన్‌ను చేయనంత అభివృద్ది చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఇక బిబినగర్ ఎయిమ్స్‌కు శంకుస్ధాపన ఒక పెద్ద డ్రామా. శంకుస్ధాపనలు నిర్మాణాలకు ఎప్పుడు చేస్తారో కూడా తెలియనంత అమాయకులా తెలంగాణ ప్రజలు. అక్కడ భవనం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యింది. ఓపి కూడా పనిచేస్తోంది. నిమ్స్‌గా ఇప్పటికే వైద్య సేవలు అందిస్తోంది. కాకపోతే కేంద్రానికి, బిజేపి పార్టీకి హటాత్తుగా బిబినగర్ ఎయిమ్స్ మీద ప్రేమ తెలంగాణ ప్రజల కోసం రాలేదు. చంద్రబాబు బంధువు భూమల ధరలకు రెక్కలు తెచ్చేందుకు చేశారు. తెలంగాణ ప్రజలకు బిజేపి రాజకీయాలు తెలియనివి కాదు. ఉన్న ఫలంగా బిబినగర్ ఎయిమ్స్ మీద ప్రేమ అన్నది బిజేపి నటన అన్నది తేలిపోయింది. పైగా ఎయిమ్స్ స్దాయి ఆసుపత్రికి వెయ్యికోట్లు వెచ్చిస్తామని మాటలు చెప్పడం కాదు, ఎప్పటిలోగా అన్ని సౌకర్యాలు పూర్తి చేస్తారో మాత్రం చెప్పరు. ఇదీ బిజేపి నీతి లేని రాజకీయం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడానికి కనీసం సంకోచం లేకుండా నిస్సిగ్గుగా చెప్పడం విడ్డూరం. రైతులు వాడే కరంటుకు మీటర్లు పెట్టమంటారు? దీనికి సహకరించాలా? రైతుల కోసం ఎంత దూరమైన వెళ్లే ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టనని తేల్చడం మోడీకి నచ్చలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు రూ.30వేల కోట్లు విడుదల చేయకుండా ఆపేశారు. ఇక ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసినా స్పందిచనిది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన కాజీపేట రైల్లే కోచ్ ప్యాక్టరీ ఇస్తానన్నారా? అది ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వ సహకరించడం లేదా? భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా వుందని ఎన్ని సార్లు ప్రకటించినా స్పందన లేనిది కేంద్రం. కాని ప్రధాని స్ధాయిలో వున్న నాయకుడు బహిరంగంగా అబద్దాలు ఆడడం మనం చేసుకున్న దౌర్బాగ్యం. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. గిరిజన యూనివర్సిటీ లేదు. మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.
సింగరేణి గనులు ప్రైవేటీకరించొద్దు అంటే వినడంలేదు.
కనీసం ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. కాని రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞులు. గతంలో మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణకు రూపాయి ప్రకటన కూడా చేయకుండా వెళ్లిపోయారు. అలాంటి మోదీ మేం సహకరిస్తున్నామని చెప్పడం ప్రపంచంలో ఎనమిదో వింతౌతుంది. ఇక పదే పదే దేశంలో 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చి ఆదుకుంటున్నామని ఓవైపు పదే పదే చెబుతూ, దేశాన్ని ధనిక దేశంగా మార్చుతున్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. 130 కోట్ల జనాభాలో 80 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తున్నామంటే దేశంలో పేదరికం తగ్గనట్లే అన్న సోయి కూడా లేకుండా మాట్లాడడం మోడీకే చెల్లింది. ఇక బిజేపి నేతలు ప్రధాని మోడీ సభకు ముఖ్యమంత్రి రాలేదని చెప్పడమంత పచ్చి అవకాశవాద రాజకీయాలు మరెక్కడా వుండవేమో! ప్రధాన మంత్రి మోడీ రాష్ట్ర పర్యటనలో అధికారిక సభ ఏర్పాటు చేస్తే, ఎక్కడైనా బిజేపి నాయకులు వివిఐపి పాసులు జారీ చేస్తారా? ఇంత దుర్మార్గమైన వ్యవస్ధ ఎక్కడైనా వుంటుందా? ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. తరలించినా పార్టీ పరమైన అంశాలు అక్కడ కనిపించొద్దు. పైగా అధికారిక కార్యక్రమంలో మోడీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఎవరిని మోసం చేయానులనుకుంటున్నారు. బిజేపి నేతలు ఎన్ని విన్యాసాలు చేసినా తెలంగాణ ప్రజలు వారిని నమ్మరు. ఆ పార్టీకి తెలంగాణలో స్ధానమే లేదు.