`కేటిఆర్ యూత్ ఐకాన్ గా గుర్తింపుతో యువత పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.
`ఐటి రంగ నిపుణులంతా కేటిఆర్ ను స్వాగతిస్తున్నారు.
ఎప్పటికప్పుడు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి కూడా మరీ పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ నిర్వహణ పూర్తి బాధ్యత కేటిఆర్ కు అప్పగించాలన్న డిమాండ్ తో పాటు, సిఎం ను కూడా శ్రేణులనుంచే ఉత్పన్నమౌతోంది. ఇటీవల కాలంలో మళ్ళీ ముందస్తు ఊహాగానాలు ఎన్ని వినిపించినా అవి నిజం కాకపోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా పలు మార్లు స్పష్టతనివ్వడం కూడా జరిగింది. కాకపోతే కేటిఆర్ ను సిఎం ఎప్పుడు చేస్తారన్నది మాత్రం ఎప్పుడూ ఎక్కడో అక్కడ చర్చ మాత్రం సాగుతూనే వుంది. గత కాలంలో వినిపిస్తూనే వుంది. ఆ మధ్య పెద్ద ఎత్తున ఈ విషయం ప్రజల్లో చర్చనీయాంశమే కాదు, నాయకుల అంగీకారం కూడా జరిగిపోయింది. కాకపోతే కేసిఆర్ ఒక సందర్భంలో చప్పున ఈ ప్రచారం ఆపాలని చెప్పారు. కానీ పార్టీలోనే కాదు, తెలంగాణ సమాజంలో ఈ చర్చకు పుల్ స్టాప్ పడలేదు. బహుషా కేటిఆర్ సిఎం అయితే తప్ప ఆగదేమో! ఇదిలా మళ్ళీ ముందస్తు విషయంలో కూడా కొన్ని వార్తలు షికారు చేశాయి. మాకు పూర్తి మెజారిటీ వుంది. పూర్తి స్థాయి సమయం అధికారంలో వుంటామని కేసిఆర్ తేల్చి చెప్పారు. కాకపోతే త్వరలోనే కేటిఆర్ ను సిఎం చేస్తారన్న నమ్మకం పార్టీ శ్రేణులలో బలంగా వుంది. అందుకే ప్రతి సారి ఈ విషయం తెరమీదకు వస్తూనే వుంది. తాజాగా కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాబోయే సిఎం కేటిఆర్ అని ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ మధ్య వరంగల్ లో కూడా ఇలాంటి ఫెక్సీలు వెలిశాయి. అయితే రాష్ట్రంలోని అనేక చోట్ల కేటిఆర్ ఫ్లెక్సీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి తమ అభ్యర్థనను పార్టీ శ్రేణులు సిఎం కేసిఆర్ కు విన్నవిస్తున్నారట. వచ్చే ఎన్నికలలో కేటిఆర్ సిఎం గానే ఎన్నికల ప్రచారం చేసి, కేటిఆర్ కూడా సక్సెస్ పుల్ సిఎం అనే పేరు రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువ నాయకులు ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చి యువ నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేటిఆర్ సిఎం కావాల్సిందే అంటున్నారు. తెలంగాణ లోని ఐటి ఉద్యోగులు,నిపుణులు, ఐటి రంగం కేటిఆర్ ను సిఎం గా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కేటిఆర్ సిఎం కావడం అన్నది ఎప్పుటికైనా నిజం అయ్యేదే. ఒక సమర్థవంతమైన నాయకత్వం కేటిఆర్ లో పరిపూర్ణంగా వుందని మొత్తం పార్టీ విశ్వసిస్తోంది. తెలంగాణ సమాజం కూడా నమ్ముతోందని చెప్పడంలో సందేహం లేదు.
హైదరాబాద్,నేటిధాత్రి: ముఖ్యమంత్రి కేసిఆర్ అంతర్మధనంలో పడ్డాడు. ఆగమౌతున్నాడు. ఆలోచనలో పడ్డాడు. బిజేపితో ఎందుకు కయ్యం పెట్టుకున్నానని మధనపడుతున్నాడు. బెంబేలెత్తిపోతున్నాడు. బిఆర్‌ఎస్ బంద్ చేస్తడు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఇలా రకరకాల వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపించాయి. కాని ఒక్కసారిగా వాటన్నింటినీ పటాపంచెలు చేస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ మహాబూబ్ నగర్‌లో బెబ్బులా గర్జించారు. బిజేపిని ఆటాడుకున్నాడు. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేంద్రాన్ని కడిగిపారేశాడు. ప్రధాని మోడీని ఉతికి ఆరేశాడు. ఒక ప్రధాన మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? అంటూ ప్రభుత్వాలను కూల్చడమే కేంద్రం పనా అంటూ ప్రశ్నించాడు. ప్రజలు తమను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లే ఎన్నుకున్న సంగతి ప్రధానికి తెలియదా? మర్చిపోయారా? ప్రగతిలో పరుగులు పెడుగున్న రాష్ట్రాలను చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ కేంద్రాన్ని దుమ్ముదులిపాడు. అంతే కాదు కేంద్రంతో కొట్లాడడంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లు తేల్చేశాడు. కేంద్రాన్ని నిలదీసుడే అని ఘంటాపథంగా చెప్పేశాడు. మహబూబ్‌నగర్ సభలో జై భారత్ నినాదాలు చేశారు. ప్రజల చేత చెప్పించాడు. బిఆర్‌ఎస్ జిందాబాద్ అనిపించాడు. నేను మీకోసం వున్నాడు. నా కోసం మీరు ఆలోచించండని కూడా చెప్పారు. ఇక కేంద్రం చేసిన తప్పులపై గళమెత్తుడే అన్నది మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి నిలదీసుడే అని కూడా చెప్పారు. ఎనమిదేళ్ల కాలంలో కృష్ణానదీ జలాల వాటాలను తేల్చలేని దద్దమ్మ ప్రభుత్వం అని కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. సమాఖ్య స్పూర్తిని వదిలి సాము చేస్తున్న బిజేపికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ బాగుపడడం కేంద్రం ఓర్వలేకపోతున్నదన్నాడు. దేశంలో తెలంగాణ కూడా ఒక భాగం. మన ప్రాంతం బాగుపడితే అది దేశానికే మంచి పేరు. కాని కేంద్రంలో కూర్చున్న నాయకులు తెలంగాణను రాజకీయంగా తమది కాదనుకుంటున్నారని అందుకే ఇబ్బందులు పెడుతున్నారని కేసిఆర్ ఆరోపించారు.
పద్నాళుగేళ్లపాటు తెలంగాణ కోసం కట్లాడినం.
తెలంగాణ సాధించుకున్నం. తెలంగాణ వచ్చిన రెండేళ్లలో కరంటు కష్టాలు తీర్చుకున్నం. రెండేళ్లలో సాగు రంగానికి కూడా ఇరవైనాలుగు గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాం. అంతే కాదు ఒక రైతు ఎన్ని బోర్లు వేసుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టుకొన్నా సరే… రైతు బాగుపడడమే మనకు కావాల్సింది. ఒకనాడు మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై ఎకరాల భూమి వున్న రైతు కూడా హైదరాబాద్‌లో కూలి చేసుకున్న సంఘటనలున్నాయి. దౌర్భాగ్య పరిస్ధితులు ఎదుర్కొన్న రోజులున్నాయి. అంతే కాదు బొంబాయి లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్లిన సమయం అందరం చూసిందే…మరి నేడు వలసలు వెళ్లిన రైతులంతా తెలంగాణకు వచ్చారు. వారి వారి పల్లెలో సాగు చేసుకుంటున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. ఎవరికీ ఎదురు చూడకుండా పెట్టుబడి సాయం పొందుతున్నారు. మహబూబ్‌నగర్ పక్కనే వున్న కర్ణాకట రాష్ట్ర ప్రజలు తాము తెలంగాణలో కలుస్తామంటున్నారు. వ్యవసాయ పనులు చేసేందుకు అక్కడినుంచి ఇక్కడికి కూలీకి వస్తున్నారు. ఇదీ తెలంగాణ సాధించిన విజయం అని కేసిఆర్ అన్నారు. తెలంగాణలో ప్రతి పల్లెకు మిషన్ భగీరధ ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్నాం. గుజరాత్‌లో కనీసం మంచినీటి సరఫరా కూడా సరిగ్గాలేదు. దేశ రాజధానిలో ఇప్పటికీ మంచినీటి సౌకర్యం పూర్తిగా లేదు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు అనుసరించాలని చెప్పాల్సిన కేంద్రం ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం విడ్డూరమన్నారు. దేశంలో ఎక్కడన్నా తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు అమలౌతున్నాయా? అని ప్రశ్నించారు. ఓర్వలేని తనం వున్నవాళ్లు ప్రజలు మాయ చేయాలని చూస్తారు. వారి మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. తెలంగాణ తెచ్చుకొని కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకొని, ప్రజలకు ప్రభుత్వసేవలు మరింత అందుబాటులోకి తెచ్చుకున్నామన్నారు. అదే ఉమ్మడి రాష్ట్రంలోవుంటే మహబూబ్‌నగర్‌కు ఐదు మెడికల్ కాలేజీలు వచ్చేవా? అని కేసిఆర్ గుర్తు చేశారు. తాను మహబూబ్ నగర్ ఎంపిగా వున్న సమయంలోనే తెలంగాణ సాధించాను. పాలమూరు` రంగారెడ్డి పూర్తి చేయాల్సిన అవసరం వుంది. పనులు జరగుతున్నాయి. అవి పూర్తయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనీసం ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతందని కేసిఆర్ చెప్పారు.
అందుకే ఇక దేశమంతా కదిలించే ప్రయత్నం చేయాల్సిందే…
బిజేపిని అడుగడుడునా ఎండగట్టాల్సిందే. వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్న బిజేపిని ఎండగట్టాల్సిందే అని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుకే కేంద్రాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రైతు గోస వినిపించడదు. రైతుల గోడు పట్టదు. దేశంలో గత డెబ్బైఏళ్లలో ఎన్నడూలేని విధంగా రైతులు ఏడాది కాలం పాటు రోడ్లపై వుండి ధర్నాలు, నిరసలను చేశారు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తుల కోసం పనిచేస్తోందని కేసిఆర్ అన్నారు. దేశంలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ సమస్యను విపరీతంగా పెంచిందని కేసిఆర్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఎంత సేపూ రాజకీయాలు తప్ప, అభివృద్ధి గురించి చర్చించిన సందర్భమే కనిపించడం లేదన్నారు. ఇంత దిగజారుడు తనం ప్రపంచంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీలోనూ కనిపించదన్నారు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చిన ఈ ఎనమిదేళ్లలో కేంద్రం సొంతంగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది లేదు. పూర్తి చేసింది లేదు. మన దేశంలో పుష్కలమైన జల వనరులున్నాయి. దేశమంతా సస్యశ్యామలమయ్యేంత నీటి వనరులున్నాయి. ఏటా మన దేశంలో సుమారు 60వేల టిఎంసిల నీరు సముద్రాల పాలౌతోంది. అందులో కనీసం సగం నీటిని వినియోగించుకున్నా, దేశం ఏనాడు బాగుపడేది. ఆహారభద్రతలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలబడేదని కేసిఆర్ అన్నారు. తెలంగాణ నమూనాగా జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలి. తెలంగాణలో అమలౌతున్న అన్ని సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలి. సంక్షేమరాజ్య నిర్మాణం జరగాలన్నదే తన ప్రధాన ద్యేయమని కేసిఆర్ చెప్పారు. అందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
గతంలో ప్రభుత్వాలు నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్ధలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుందన్నారు.
దేశంలో బిజేపి రాజకీయంగా బరితెగింపును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అసవరం వుందన్నారు. లేకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని కేసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని అనడం ఎంత వరకు కరక్టు అని నిలదీశారు. వారికి చేత కాదు…అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాలను చూసి ఓర్వలేని బిజేపిని ఓడిరచడమొక్కటే ప్రజల కర్తవ్యం కావాలన్నారు. ప్రగతి శీల శక్తులు ఏకం కావాలన్నారు. యువత దేశంలో ఏం జరుగుతుందన్నదానిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
వేములవాడ :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల్ కోడి ముంజ గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో అవినీతికి
పాల్పడుతున్న కార్యదర్శి అండగా ఎంపీడీవో సహకరిస్తూ, వీరిద్దరూ కల్సి అవినీతికి పాల్పడుతున్న బాగోతం, విషయానికి వస్తే…!రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండల్, కొడుముంజ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చేస్తున్న ఆవినీతి, అక్రమాల గురించి మరియు వారికి సహకరించిన ఎంపీడీఓ శ్రీధర్ పై శాఖపరమైన
చర్యల తిసుకోవాలని భూమల్ల లక్ష్మణ్, ప్రజవాణి ద్వారా కలెక్టర్ కు పిర్యాదు చేసినారు
కొడుముండు గ్రామంలో గు0జర్సయ్య S/O రాజయ్య కి ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్యాకేజీ, పట్టా 222 గల దానిని జారి చేసినారు. అతను ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు.దీనికి గాను గ్రామపంచాయతీ 1-97 గల ఇంటి నెంబర్ జారి చేసినది ,అనంతరం 603 రూపాయల ఇంటి పన్ను కూడ చెల్లించారు. మరియు సెస్ విద్యుత్ శాఖ ద్వారా 116నెంబర్ గల కరెంట్ మీటర్ తీసుకున్నాడు. గుంజ నర్సయ్య తన ఆర్థిక ఇబ్బందుల వలన అ యొక్క ఇంటిని గ్రామ సర్పంచికి తన ఇంటిని, పట్టా(భూమి) అమ్ముకున్నాడు.దానిని సర్పంచ్ కొనుగోలు చేసుకుని 1-97 గల ఇంటిని కూల్చివేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసుకుని (222 (గెటిట్ నెంబర్ ), ఇంటి నెంబర్ 1-97 ను సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్లే రహదారికి అనుకుని ఉన్నా) విలువ 72 ప్లాట్ గల ప్రభుత్వ భూమిలోకి మార్చుకొన్నాడు దీనికై గ్రామ కార్యదర్శి మరియు ఎంపీడీఓ శ్రీధర్ సహకరిచినారు. అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినాడు.నేను గతంలోనే తేది 10.10. 2022 రోజున ఇట్టి విషయం పై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాను. నా ఫిర్యాదును వేములవాడ ఎంపీడీఓ శ్రీధర్ కి విచారణ నిమిత్తం డీపీఓ పంపినారు కానీ ఎంపీడీఓ మొఖాపై ఎలాంటి విచారణ చేయకుం డా నాకు నోటీసు జారి చేశారు. మా కార్యలయానికి విచారణకు రావాలని కానీ నేను గతంలోనే పూర్తి ఆధారాలతో ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా, అతనే స్వంత నిర్ణయాలతో నన్ను ఇబ్బందుకు గురి చేస్తున్నాడు. గ్రామ కార్యదర్శికి సహకరిస్తూ వారు చేసిన తప్పులను కప్పి – పుచ్చడానికి ఎంపీడీఓ ప్రయత్నం చేస్తున్నాడు. కావున మా యందు దను తలచి. ఆక్రమంగా గు0జనర్సయ్య పేరున ఉన్నా ఇంటి నెంబరు 1-97 ను ఇంటి పన్ను రిసిప్ట్ నెంబర్ 1680 గల దానిని ఎలాంటి ఆధారం లేకుండా గుంజ కనకలక్ష్మి పేరున మార్చిన విషయాన్ని మరియు సెస్ అధికారులు ఇచ్చిన మీటర్ నెంబర్ 116 పై కరెంట్ బిల్ చెల్లించిన ప్రతిని మరియు 2020 లో గుంజ నర్సయ్య కి ఆసీస్ మెంట్ లో గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ శ్రీధర్ 1-97 గల ఇంటి నెంబర్ కేటాయించి ఇంటి పన్ను వసూలు చేసిన విషయాన్ని, ఇంటిపన్ను 603 చెల్లించిన ఇంటిని కూల్చి వేసిన విషయాన్ని విచారించకుండా, నున్న విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న, మరియు అక్రమాలకు పాల్పడిన , కార్యదర్శిని అతనికి సహకరించిన ఎంపీడీఓ శ్రీధర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకొని ప్రత్యేకాధికారి చే విచారణ జరిపించి నన్ను వేదిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై, మరియు ఎంపీడీఓ పై శాఖపరమైన చర్యలు తీసుకొని గెజిట్ నెంబర్ 222 నుండి విలువగల ప్లాట్ నెంబర్ 72 లోకి మారిన పట్టాను రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడి కాపాడాలని, 3302 222 CAS 25065
గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులపై ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని
రాష్ట్ర ఐ.టి.శాఖామాత్యులు,తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ని హైద్రాబాద్
ప్రగతి భవనంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు నడికూడా మండల రైతుబంధు కన్వీనర్ సుదాటి వెంకటేశ్వర రావు మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ప్రపంచ మృత్తిక నేల దినోత్సవ
శుభాకంక్షాలు తెలిపారు.అనంతరం పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడా మండలానికి మండల కార్యాలయం,పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని కోరారు.అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది.
ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా మంత్రులు దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎంపీలు రవిచంద్ర,కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్,జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ లకు
అపూర్వ స్వాగతం పలికిన జనం
కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వివిధ గ్రామాల ప్రజలు
తారాసింగ్ బావి తండా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే
అతిథులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలతో ఇనుగుర్తిని నింపేసిన అభిమానులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం పండుగ వాతావరణం సంతరించుకున్నది.ప్రజలు తమ 37 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా
ఆదివారం ఆనందోత్సవాల మధ్య పండుగ చేసుకున్నారు. ఇనుగుర్తి మండలం, తహశీల్దారు కార్యాలయం ఘనంగా ప్రారంభమయ్యింది.ఈ సందర్భంగా ఇనుగుర్తికి విచ్చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్,జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాష్ లకు స్థానికులు నీరాజనాలు పలికారు.జిల్లాలోని నెల్లికుదురు మండలం తారాసింగ్ బావి తండా వద్దకు వేలాదిమంది తరలివచ్చి అతిథులకు అపూర్వ స్వాగతం పలికారు, అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అటుతర్వాత అతిథులను టాప్ లేని వాహనంపై ఎక్కించి డీజే,డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాలు,మహిళలు కోలాటం ఆడుతూ,ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన యువత బాణాసంచా కాలుస్తూ నాయకులను ఊరేగింపుగా ఇనుగుర్తి వరకు తోడ్కొని వచ్చారు.అతిథులకు గజమాల వేసి హార్థిక స్వాగతం పలికారు,వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య రిబ్బన్ కత్తిరించి తహశీల్దారు కార్యాలయాన్ని ప్రారంభించి,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అతిథులు తహశీల్డార్ అబిదలీని లాంఛనంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ,జై కేసీఆర్ జైజై కేసీఆర్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”అనే నినాదాలు హోరెత్తాయి.ఆ తర్వాత ఏర్పాటైన సభ ప్రజల చప్పట్లు, హర్షధ్వానాల మధ్య విజయవంతమైంది.కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి,ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి,ఎంపీటీసీలు రజిత,రజని,మంజుల,మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు,ఎంపీ రవిచంద్ర సోదరులు వద్దిరాజు కిషన్, దేవేందర్,వెంకన్న,మోహన్,పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కల్వల గ్రామం లో, ఆదివారం రోజున, ఆ గ్రామ సర్పంచ్, దాసారపు భద్రయ్య, మరియు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో,రాజ్యాంగ నిర్మాత,డాక్టర్, బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మానకొండూర్, నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరైనారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఈరోజు మన కల్వల గ్రామంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరిగి,ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరం, ఇంత త్వరగా పూర్తిచేసిన సర్పంచ్ భద్రయ్య మరియు నిర్వహణ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ అభినందించారు. అదే విదంగా రసమయి మాట్లాడుతూ, అంబేద్కర్ అనే మహానుభావుని ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా మన జాతులు దళిత వర్గాల యువకుల అందరు ఇదే స్ఫూర్తి తోని ముందుకు పోయి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన దళిత యువకులకు పిలుపునిచ్చాడు. మరియు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేద్కర్ ఒక్కరి నాయకుడు కాదు ఆయనను ఒకే జాతికి అంకితం చేయడం సరైనది కాదు,ఆయన రాజ్యాంగాన్ని ఏ ఒక్క జాతి కోసమో ఏ ఒక్క వర్గం కోసమో రాయలేదు,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి పట్టుదల తో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దీనితోనే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య యుతంగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమే అని అందరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా అయన తెలిపినాడు. “అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరివాడు “అని అన్నారు.ఆయన ఏ వర్గం కూడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోకూడదని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి కావలసిన రాజ్యాంగ ఫలాలను వాళ్లకు అందించనాడని ఈ సందర్భంగా అయన ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో,అందరూ అభివృద్ధి పథంలో నడుచుకొని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో పయనించాలని,ఈ సందర్భంగా దళిత సోదరులకు వర్గాలకు పిలుపునిచ్చాడు. అంతే కాకుండా నేను జీవితంలో ఏ ఒక్క దేవుడిని చూడలేదు నేను చూసిన నేను నమ్మిన ఏకైక దేవుడు అంబేద్కర్ అని అన్నాడు,ఆయన చూపిన మార్గంలోనే పయనించడం వలనే, ఆయన ఆశయాలతో ముందుకు పోవడం తోనే,ఆయన నిర్దేశించిన దిక్సూచితో, ఆయన పుణ్యంతోనే ఈరోజు నేను ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసి,ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానంటే, కేవలం ఆ మహానుభావుని దయ అని ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ అంబేద్కర్ గురించి తెలిపినాడు.ఈరోజు కల్వల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి,మరియు నూతన గ్రామపంచాయతీ అయితేనేమి, అది రేషన్ షాప్ అయితేనేమి,అది కేవలం రాజ్యాంగ హక్కుల ప్రకారం అంబేద్కర్ రాసిన నిబంధన ప్రకారమే వచ్చినాయని ఈ సందర్భంగా ఆయన తెలిపినాడు. అంబేద్కర్ గారి దయ మరియు ఆయన ముందు చూపుతోనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.ఎస్సీ ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల నాయకులు ఈరోజు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు అంటే అది ఆ మహానుభావుని దయే అన్నారు.తాను జీవితంలో పడిన కష్టాలు,నష్టాలు,తాను ఎదుర్కొన్న వివక్షలు భవిష్యత్తులో అణగారిన వర్గాలు ఎదుర్కోకూడదని రాజ్యాంగంలో మన హక్కులను భద్రంగా భద్రపరిచిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నాడు.ఇటువంటి మహనీయుని జయంతిని ఒక వర్గమే జరుపుకోవడం చాలా బాధాకరం,అందరి జయంతులు ఏ విదంగా అయితే అందరం కలిసి జరుపుకుంటారో, అంబేద్కర్ జయంతిని కూడా అందరం కలిసి జరుపుకోని ఐక్యతతో ముందుకు పోవాలన్నాడు. అంబేద్కర్ గారు ఏమి లేని రోజులలో ఆయనను ఆరు బయట నిలిచిపెడితే కేవలం బయట నుండి పాటలు విని ఒక దేశానికి రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగినాడంటే,ఈరోజు మనకు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి అటువంటి మనము ఇంకెన్ని ఉన్నత శిఖరాలను సునాయాసంగా అధిరోహించవచ్చునో ఆలోచించాలని,ఈ సందర్భంగా దళిత యువకు ఆయన వివరించారు . అంతేకాకుండా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి ఉన్నతమైన బ్రతుకు బ్రతకాలి అని యువకులను ఉద్దేశించి రసమయి బాలకిషన్ మాట్లాడారు. మరియు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కోసం, తాను సానుకూలంగా ఉన్నట్లు,మరియు అంబేద్కర్ భవన నిర్మాణానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిపినాడు. చుట్టు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నట్టే ఈరోజు కల్వల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగడం కలలో కూడా ఎవరు ఊహించలేదని కానీ కలను నిజం చేసిన ఘనత మాత్రం ఆ యొక్క మహనీయుడు అంబేద్కర్ గారిదే అన్నారు. ఈ రోజు మనకు అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని, ఈ సందర్భంగా రసమయి అన్నారు.కల్వల గ్రామం ఒకప్పుడు చిన్న గ్రామం గ్రామపంచాయతీ లేదు, రేషన్ షాపు లేదు,రోడ్డు సౌకర్యం లేదు, ఆ రోజులలో వాళ్ళు కిలోమీటర్ల కొద్ది నడిచి పక్క ఊరికి వెళ్లే పరిస్థితి కానీ ఈరోజు వారికి నూతన గ్రామపంచాయతీని మరియు రేషన్ షాపును ఏర్పాటు చేశాము వారి వద్దకే వీటిని తీసుకువచ్చామని ఈ సందర్భంగా రసమయి తెలిపినాడు. అదేవిధంగా అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కుల ద్వారానే వీటిని సాధించుకున్నామని అని కూడ అన్నారు. ఆయన ఆలోచనలతో, ఆయన చూపించిన మార్గంలో మనం అంతా పయనించాలని,ఈ సందర్భంగా ఆయన అన్నారు.గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగడంతో కల్వలకు ఒక గౌరవ ప్రధానమైన స్థానం దక్కిందని ఈ సందర్భంగా కల్వల గ్రామానికి గీతాలు ఇచ్చాడు. అదేవిధంగా గ్రామంలో బీసీలకు కూడా అభివృద్ధి కూడా ఎల్లవేళలా నేను సహకరిస్తానని తెలిపినాడు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు వారి సొంత సలాలలో వారికి పక్కా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి హామీ ఇచ్చాడు.దళితులకు విడుదలవారీగా దళిత బంధు కూడా వచ్చేటట్లు చూస్తామని వారికి భరోసా ఇచ్చాడు.అంబేద్కర్ సంఘాల నాయకులు దళిత వర్గాలకు చెందిన పిల్లలను గురుకులాలలో ప్రభుత్వ హాస్టల్లో చేర్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సహాయాన్ని ప్రతి ఒక్కరం వినియోగించుకోవాలని అంబేద్కర్ సంఘాల నాయకులకు పిలుపునిచ్చాడు. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనల తో స్ఫూర్తితో కలవల గ్రామంలోని యువకులు చాలా ఉత్సాహంగా కనబడుతున్నారని వారు భవిష్యత్తులో అంబేద్కర్ చూపిన దారిలో వెళుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని,ఆ యొక్క ప్రయాణంలో మీకు నేను ఎల్లవేళలా సహాయ పడతానని ఈ సందర్భంగా దళితుల దళిత యువకులకు భరోసా కల్పించినాడు.ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించుకోనడంతోనే మన పని పూర్తి అయినదని అనుకోకూడదని, ఆయన చూపిన బాటలో వెళుతూ ఆయన ఆశయాలతో ముందుకు ప్రయాణిస్తూ సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన తెలిపినాడు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఉమ్మెత్తల సరోజన, వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట మైపాల్,సతీష్ రెడ్డి, శ్యామ్ రావు, అంబేద్కర్ సంఘ నాయకులు దేవునూరి కిష్టయ్య, మెరుగు శ్రీనివాస్,కనకం నాగయ్య,కనకం శంకర్, క్యాదాసి భాస్కర్,బొజ్జ రవి, సంగి గట్టయ్య, మరియు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,కల్వల ఉప సర్పంచ్ గంగారాం మహేందర్, హరీష్, అశోక్, రాజేష్ మహేందర్, శ్రీకాంత్ మరియు వార్డ్ సభ్యులు,గ్రామ యువకులు, దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
` తెలంగాణ రావడంలో వీసమెత్తు భాగస్వామ్యం లేని వాళ్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా?
`కౌంటర్ చేయలేనంత అసహాయతలో వున్నారా?
`ఎమ్మెల్యేలకు కూడా నోరు పెగలడం లేదా?
`మంత్రులేం చేస్తున్నారో కనీసం వారికైనా తెలుసా?
` అన్నీ సిఎం కేసిఆర్ చెబితేనే చేస్తున్నారా?
`పార్టీని రక్షించుకునే బాధ్యత మీకు లేదా?
`త్యాగాల నుంచి ఎదిగిన నేతలను టార్గెట్ చేస్తుంటే కూడా కదలలేరా?
`కనీసం షర్మిల వ్యాఖ్యలను కూడా ఖండిరచలేరా?
` నిస్తేజం ఆవహించిందా…నిస్సత్తువ నిండిపోయిందా?
` టికెట్లు మాత్రం కావాలి…పార్టీని సిఎం ఒక్కడే కాపాడాలి.
`మీరంతా నోటికి తాళం వేసుకొని ప్రతిపక్షాల విమర్శలు విని వదిలేయాలి?
`ఇదేనా ఇంత కాలం నేర్చుకున్నది!
`ఇదేనా పార్టీ మీద మీకున్న ప్రేమ…!
హైదరాబాద్,నేటిధాత్రి:
మంత్రులు అట్లా వున్నారు…ఎమ్మెల్యేలు చూస్తే ఇట్లా వున్నారు. పదవుల మీద వున్న పట్టింపు పార్టీ మీద లేదు. ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొట్టరు. అందరూ గప్ గుప్…ఎందుకు అంటే ఎవరి దగ్గరా సమాధానం లేదు. వారి గురించి వారికే సరైన సమాచారమే వుండదు. ఎవరైనా అడిగితే మా దృష్టికి రాలేదంటారు. అడిగిన వాళ్లనే అసలేం జరిగిందని తెలుసుకొని ఔనా అని ఓ నిట్టూర్పు వదిలి చూద్దాం… అంటారు. మర్చిపోతుంటారు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక మాట అంటుంటారు. అనేటోడిది కత్తా, నెత్తా! అని… టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా వర్తింపజేసుకోవచ్చు. అసలు ప్రతిపక్షాలకు తెలంగాణలో మాట్లాడే నైతిక హక్కు లేదు. బిజేపిలో తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులు లేరు. ఇప్పుడు కొత్తగా అద్దెకొచ్చిన పిడికెడు మంది తప్ప భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరూ కనిపించరు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే అప్పటి ఎమ్మెల్యే యెండల లక్మి నారాయణ మాత్రమే చేశారు. అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం చూసి అమెరికా వెళ్లిపోయాడు. రాజీనామా చేయలేదు. అలాంటి పార్టీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఉద్యమ కాలం నాటి పోరాట యోధులు ఏం చేస్తున్నారు. అనేక మంది తెరాస ఎమ్మెల్యేలున్నారు. వారెందుకు నోరు విప్పడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి నాయకులను చూసి కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు వివాదాలు ఎదుర్కొన్నప్పుడు మాత్రం పార్టీ అండగా వుండాలి. పార్టీని ఇరుకున పెట్టే విధంగా, అసత్యాలు, అర్థ సత్యాలు, అభూతకల్పనలు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే పట్టించుకోరు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కాకముందే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పనులు మొదయ్యాయి. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తి చేయలేదు. సగం పనులు కూడా పూర్తి కాలేదు. అది పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పట్టొచ్చు. పదేళ్లు పట్టొచ్చు. అక్కడ వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి అయ్యే అవకాశమే లేదు. జగన్ ప్రభుత్వం ఏనాడో వదిలేసింది. ఆ రాష్ట్ర రైతాంగాన్ని గాలికొదిలేసింది. కొన్ని దశాబ్దాల ఆంద్రుల కల అక్కడే మూలుగుతోంది. ఓ వైపు ఆంద్రప్రదేశ్ బిజేపి నేతలు తెలంగాణలో పూర్తయి, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. టిఆర్‌ఎస్ నేతలకు అవి కూడా కనిపించడం లేదా! వినిపించడం లేదా!! ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకులకు వున్న నీతి తెలంగాణ బిజేపి నేతలకు లేదా? ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనేందుకు కూడా నోరు రావడం లేదా? లేక బిజేపి అంటే భయపడుతున్నారా? ఎక్కడ ఈడీ వస్తుందో అని దాక్కుంటున్నారా? మొత్తం కాళేశ్వరం పాజెక్టే లక్షానలభై వేల కోట్ల ప్రాజెక్టు. అందులో లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా? సాధ్యమౌతుందా? బిజేపి, వైఎస్‌ఆర్టీపి పార్టీలు ఇలాంటి దిక్కుమాలిన ఆరోణలు చేస్తుంటే సమాధానం చెప్పలేనంత అమాయకులా తెరాస ఎమ్మెల్యేలు. వందమంది ఎమ్మెల్యేలున్నారు. నిజాలు చెప్పి బిజేపి నేతల నోర్లు మూయించలేరా! వారికి సమాధానం చెప్పే సమయం కూడా లేదా? మాకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకుంటున్నారా! ఉద్యమ కాలంలో వున్న స్పూర్తి ఏమైంది? తెలంగాణ కోసం కొట్లాడిరది మీరు కాదా? తెలంగాణ తెచ్చిన పార్టీలో వుండి మౌనమేలా! తెలంగాణ రావడంలో వీసమెత్తు భాగస్వామ్యం లేని వాళ్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? కౌంటర్ చేయలేనంత అసహాయతలో వున్నారా? ఎమ్మెల్యేలకు కూడా నోరు పెగలడం లేదా?మంత్రులేం చేస్తున్నారో కనీసం వారికైనా తెలుసా? అన్నీ సిఎం కేసిఆర్ చెబితేనే చేస్తున్నారా? పార్టీని రక్షించుకునే బాధ్యత మీకు లేదా?
త్యాగాల నుంచి ఎదిగిన నేతలను తెలంగాణ కు సంబంధం లేని షర్మిల టార్గెట్ చేస్తుంటే కూడా కదలలేరా?
తెలంగాణ ను ఎండబెట్టి, ప్రాజెక్టు పండబెట్టి, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసి, తెలంగాణ కు నీళ్లు లేకుండా చేసింది వైఎస్ కాదా? ఈ విషయం ప్రజలకు చెప్పలేరా? నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రసమయి బాలకిషన్ ఇలా ఉద్యమ కారులైన ఎమ్మెల్యేలను షర్మిల నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. వాళ్లుకు సపోర్ట్ గా ఎవరూ మాట్లాడలేరా? కనీసం షర్మిల వ్యాఖ్యలను కూడా ఖండిరచలేరా? నోరుంది కదా! అని ఎంతొస్తే అంత షర్మిల మాట్లాడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ను కూడా దూషిస్తోంది. మంత్రి కేటిఆర్ ను విమర్శిస్తోంది. ఎమ్మెల్యేల మగతనం గురించి ప్రస్తావిస్తోంది. అవినీతి చేస్తున్నారంటోంది.
టిఆర్‌ఎస్ నేతలో నిస్తేజం ఆవహించిందా…నిస్సత్తువ నిండిపోయిందా? ప్రతిపక్ష బిజేపి, షర్మిల టిఆర్‌ఎస్ పై మాట్లాడుతుంటే వినపడడం లేదా? గత ఎన్నికలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న గెలుపు కోసం ప్రచారం చేసిన షర్మిలకు ఇక్కడేం పని అని అడగడం చేతకావడం లేదా! ముందు అక్కడ గెలిచిన జగన్ పోలవరం మర్చిపోయాడు. అది గుర్తు చేసి, దానిని పూర్తి చేసేందుకు షర్మిల దీక్షలు చేయాల్సింది అక్కడ. పూర్తయ్యి తెలంగాణ ను సస్యశ్యామలం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ కూడా హజరయ్యాడు. మన పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావని అక్కడ అన్నను నిలదీయమని షర్మిలకు చెప్పడం కూడా టిఆర్‌ఎస్ నేతలకు రావడం లేదా?
టికెట్లు మాత్రం కావాలి…పార్టీని సిఎం ఒక్కడే కాపాడాలి.
ఇది టిఆర్‌ఎస్ ఇప్పుడు వినిపిస్తున్న మాట. కార్యకర్తలు నాయకులను తిట్టిపోస్తున్న మాట. మీరంతా నోటికి తాళం వేసుకొని ప్రతిపక్షాల విమర్శలు విని వదిలేయాలి? అనుకుంటున్నారా! లేదా మాకెందుకు ఈ గోలంతా అని సైలెంట్ అయిపోతున్నారా? అధికారంలో వున్నంత కాలం పదవులు కావాలి. కానీ పార్టీకి కష్ట కాలం వస్తే పక్క చూపులు చూడాలి. ఇవేనా మీరు నేర్చుకుంటున్నది. బిజేపి కి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో నలభై మంది ఎమ్మెల్యేలు మావైపు వచ్చేందుకు రెడీగా వున్నారని ఏ ధైర్యంతో చెబుతున్నారు. నమ్మి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపిస్తే పొరుగు పార్టీల వైపు చూడడం సరైందేనా? ఒక్క సారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి.
ఇదేనా ఇంత కాలం పార్టీలో వుండి నేర్చుకున్నదేమిటి?
ఒకనాడు వున్న దూకుడు టిఆర్‌ఎస్ లో ఇప్పుడు ఎందుకు లేదు. కనీసం పార్టీ తెలంగాణలో బలంగా వుందన్న సంగతైనా నాయకులకు తెలుసా? ప్రతి పక్షాలు చెప్పే మాటలు నిజమని నమ్ముతున్నారా? ప్రతిపక్షాలు మేం టిఆర్‌ఎస్ కన్నా బలంగా వున్నామని ఎక్కడా! ఎప్పుడూ చెప్పడం లేదు. ప్రత్యామ్నాయం మాత్రమే అని చెప్పుకుంటున్నాయి. అంతే తప్ప టిఆర్‌ఎస్ కన్నా మాకే జనాదరణ వుందని చెప్పడం లేదు. ముందు ఇదైనా తెలుసుకోండి. ఇప్పటైనా మేలుకోండి. ఉద్యమకాలం నాటి దూకుడు గుర్తుచేసుకోండి. టిఆర్‌ఎస్ లో అసంతృప్తి అన్నది ఒట్టి మాట. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా పదవులు అనుభవిస్తున్నారు. ఉద్యమకారులంతా ఏదో ఒక ప్రధాన్యతలోనే వున్నవారే…అంతే కానీ అందరూ ఎమ్మెల్యేలు కావాలంటే కుదరదు. పార్టీ అధికారంలో వుంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఏదొ ఒక పదవి అందకపోదు. అదే నాయకులే చేతులెత్తేస్తే గుడిసె కూడా లేకుండా పోతుంది. వున్న నీడ కరువౌతుంది. ఇప్పటికైనా మేలుకోండి. మీకు అవగాహన లేకపోతే కనీసం టిఆర్‌ఎస్ చేసిన తప్పేంటి అని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వినండి. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే టిఆర్‌ఎస్ కు మద్దతుగా అంత మాట్లాడగల్గుతుంటే, మీరెంత మాట్లాడే అవకాశం వుందో తెలుసుకోండి. ఇప్పటికైనా నోరు విప్పండి…కానీ నోరు జారకండి…ఇరుకున మాత్రం పడకండి. బండకింద ఇరికిన చేయి జాగ్రత్తగా తీసుకోవాలి. అంతే!
` ప్రభుత్వం మళ్ళీ వస్తుంది…అందుకు సహకరించాల్సిందే!
` ప్రజలతో సక్కగ లేకనే సీట్లు గల్లంతు?
` వివాద ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే?
` పార్టీ శ్రేణులను నుంచి తీవ్ర ఒత్తిడి.
` ప్రజల నుంచి కూడా వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందే?
` లేకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లే!
` లేని బలం వారికి కట్టబెట్టినట్లే…
`నియోజకవర్గాలను అప్పనంగా వాళ్ల చేతికిచ్చినట్లే…
` కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహం కూడా కొంప ముంచనుంది.
` రెండు ధఫాలు ఏలారు…ఈసారి కొత్త వాళ్లకు అవకాశం కల్పించండి!
` ఈ ఎన్నికలలో త్యాగాలకు సిద్ధం కండి!
`మళ్ళీ ప్రభుత్వం వచ్చాక త్యాగాలు చేసిన వారికి పదవులు గ్యారెంటీ!
` కొందరు ఎచ్చులకు పోతే మొదటికే మోసం!
`పక్క చూపులు చూస్తే అసలుకే మోసం!
` వివాదాల సుడి గుండాలలో వున్న వాళ్లెవరో అందరికీ తెలుసు…
`వాళ్లంతా పార్టీ క్షేమం కోసం మనసలుకుంటే అందరికీ మేలు
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున పోటీ చేసే అభ్యర్థులలో ప్రస్తుత ఎమ్మెల్యేలలో కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలకు మూడినట్లే అనే సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి హెచ్చరిస్తూనే వున్నారు. మన మీద అచంచలమైన నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి రెండోసారి బంపర్ మెజారిటీ ఇచ్చారు. మనం ఎంతో ఒదిగివుండాల్సిన సమయం. ప్రజలకు మరింత చేరువకావాలి. ఎప్పుడూ ప్రజల్లో వుండాలి. నియోజకవర్గానికే పరిమితం కావాలి. అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప ఎప్పుడూ జనానికి అందుబాటులో వుండాలని చెప్పారు. ఈ విషయం అనేక సార్లు గుర్తు చేశారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు మారలేదు. వారిలో మార్పు రాలేదు. ప్రజలకు అందుబాటులో లేరు. పైగా ఎప్పుడూ ఏదో ఒక వివాదం మూటగట్టుకుంటూ వచ్చారు. తాజాగా కూడా సిఎం. కేసిఆర్ హెచ్చరించారు. అయినా కొందరికి చెవికెక్కలేదు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ రహస్యంగా చేయించిన సర్వేలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టడమే మేలని భావిస్తున్నారట.
జనం మెచ్చని వాళ్లను మార్చుడే?
అన్న మాట కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ కొందరితో అన్నట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే వివాదాలున్నాయో అక్కడ సీట్లు మార్చి హాట్రిక్ కొట్టుడే! అన్న కసితొ కేసిఆర్ వున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పటికీ టిఆర్‌ఎస్ మీద నమ్మకం చెక్కు చెదరలేదు. ప్రతి పక్షాలు చెప్పే మాటలన్నీ నమ్మాల్సిన పని లేదు. మీడియా ప్రచారంలోనూ నిజం లేదు. గత ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రచారం జరిగింది. కానీ ఏమైంది. ప్రతి పక్షాలే చెల్లా చెదురయ్యాయి. ప్రజలు మళ్ళీ టిఆర్‌ఎస్ కే పట్టం కట్టారు. ప్రతిపక్షాలన్నింటినీ ప్రజలే కట్టగట్టి బంగాళాఖాతంలో విసిరేశారు. గత ఎన్నికలలో కూడా మూకుమ్మడి దాడి చేశారు. ప్రతిపక్షాలన్ని జెండాలు, ఎజెండాలు ఏకం చేసుకొని వచ్చాయి. కేసిఆర్ ను ఓడిరచడమే ఏకైక లక్ష్యంగా ఎన్నికలలో టిఆర్‌ఎస్ ను ఎదుర్కొన్నారు. మళ్ళీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జట్డుగా వస్తున్నారు. మళ్ళీ కేసిఆర్ ను ఓడిరచడమే ఎజెండా అంటున్నారు. అంతే కాని ఆ పార్టీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఏం చేయాలన్నదాని మీద క్లారిటీ లేదు. ఆయా పార్టీల నాయకుల మధ్య సయోధ్య లేదు. ఏకాభిప్రాయం అసలే లేదు. ఐక్యత చూపలేరు. ఆధిపత్య పోరు ఆపలేరు. ఎవరికి వారే నాయకులు. ఎవరి పెత్తనం వారిదే. అలాంటి వారి చేతిలో అధికారం పెడితే ఎలా వుంటుందో ప్రజలకు తెలుసు. ఆ ప్రజలకున్న క్లారిటీ టిఆర్‌ఎస్ నేతలకు కూడా ఇప్పుడు కావాలి.
కొందరు ఎమ్మెల్యే హాట్రిక్ హాంఫట్టే! మేం ఇప్పటికే రెండు సార్లు గెలిచాం.
మూడో సారి కూడా మాకే కావాలి. మేం తప్ప పార్టీకి దిక్కులేదనే దిక్కుమాలిన లాజిక్ లు కొందరు మానుకోవాలి. నాకే టికెట్ కావాలన్న పట్టుదల మానుకోవాలి. పార్టీ అధికారంలో వుంటే ఎవరి నాయకత్వానికి ఢోకా వుండదు. లేకుంటే అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం చేసినవాళ్లవుతారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసినట్లే ఇప్పుడు మరొకసారి త్యాగాలకు ముందుకు రావాలి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఇది ప్రజలు ఇస్తున్న భరోసా. తాడు బొంగరం లేని పార్టీలు చెప్పే మాటలు అధికారంలో వున్న టిఆర్‌ఎస్ నేతలు వినడం విడ్డూరం…బిజేపిని ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. దేశంలో బిజేపి సుమారు పదిహేడు రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఆయా రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణలో అమలౌతున్న ఫథకాలున్నాయా? ప్రజలకు బిజేపి గురించి పూర్తిగా తెలుసు. కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వుంటూ చేస్తున్న నిర్వాకాలు ప్రజలు చూస్తున్నదే…అనుభవిస్తున్నదే…నోట్ల రద్దుతో మొదలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఎంతకీ తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు, మూడు రెట్లు పెరిగిన సిలిండర్ భారం ప్రజలు అనుభవిస్తూనే వున్నారు. బిజేపి నేతలు కూడా ఈ ధరల భారం మోస్తున్న వాళ్లే…కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణలో ప్రాజెక్టులకు సహకరించలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. జిఎస్టీ బాదుడు ఆపడం లేదు. ఆఖరుకు పెరుగు కూడా జిఎస్టీ లేకుండా కొనలేం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బిజేపికి ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. ఈ సమయంలో టిఆర్‌ఎస్ నేతలు మాకే టికెట్లు అంటూ మొండి పట్టుదలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చొద్దు. ఎవరికిచ్చినా వారి గెలుపుకు, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ సహకరించాల్సిందే!
మా సీట్లే ఎందుకు కోత పెడుతున్నారు…మాకేం తక్కువ.
ఇక్కడ కాకపోతే మరో దగ్గర అని దిక్కుమాలిన లాజిక్కులు చెప్పకండి. ప్రజలకు కొందరు ఎమ్మెల్యేలంటే అసలే పడడం లేదు. వారి పని తీరు నచ్చడం లేదు. గత ఎన్నికలలో కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ ను చూసే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ ప్రజలు గెలిపించుకున్నారు. ఈసారి కొంచెం కష్టం. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు కూడా నిజమని నమ్ముతున్న వాళ్లు కూడా కొంత పెరుగుతున్నారు. అలాంటి వాళ్లు పూర్తిగా టిఆర్‌ఎస్ కు దూరం కావొద్దు అనుకుంటే కొందరికి టికెట్ కట్ చేయాల్సిందే. ప్రజలతో సక్కగ లేకనే సీట్లు గల్లంతు? అనే ఎవరూ మర్చిపోవద్దు. వివాద ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే? అని పార్టీ శ్రేణులను నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా ఇదే జరిగింది. ముందు మునుగోడులో అభ్యర్థి విషయంలో పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అభ్యర్థిని మార్చితే తప్ప గెలవలేమనే అందరూ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కే ఇచ్చారు. ఇందులో ఎంతో రాజకీయ చాణక్యం దాగి వుంది. ఒకవేళ ప్రజల నమ్మకం కేసిఆర్ మీద సన్నగిల్లితే కూసుకుంట్ల ప్రభాకర్ ఓడిపోతాడు. అభ్యర్థితో మాకు లెక్క లేదు. మా నాయకుడు కేసిఆర్ అనుకొని ఓట్లేస్తారా? లేదా! అన్నది తేలిపోతుంది. అదే నాయకుల మాటలకు తలొగ్గి అభ్యర్థిని మార్చితే కేసిఆర్ భయపడ్డాడనే సంకేతాలు వెళ్తాయి. ఏది ఏమైనా ప్రజల్లో టిఆర్‌ఎస్ పై నమ్మకం చెక్కు చెదరలేదని నిరూపించాలనుకున్నాడు. ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ముందే ఖరారు చేశారు. నిష్టూరం అనిపించినా సరే గాని ఏ టిఆర్‌ఎస్ నాయకుడు కూడా మునుగోడులో గెలుస్తున్నామని ఘంటా ఫథంగా చెప్పలేకపోయారు. కేవలం నేటిధాత్రి మాత్రమే ఖచ్చితంగా టిఆర్‌ఎస్ విన్ అనేది మొదటి రోజు నుంచీ చెబుతున్నది. టిఆర్‌ఎస్ గెలుస్తుందన్న నమ్మకం ఉప ఎన్నికలోనే లేని నాయకులు తమపై తాము అతి విశ్వాసం తగ్గించుకోవడం మంచిది.
కొందరు ఎమ్మెల్యే మార్పును అందరూ స్వాగతించాల్సిందే… ప్రజల నుంచి కూడా వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందే? లేకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లే!
లేని బలం వారికి కట్టబెట్టినట్లే…నియోజకవర్గాలను అప్పనంగా వాళ్ల చేతికిచ్చినట్లే… కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహం కూడా కొంప ముంచనుంది.రెండు ధఫాలు ఏలారు…ఈసారి కొత్త వాళ్లకు అవకాశం కల్పించండి!ఈ ఎన్నికలలో త్యాగాలకు సిద్ధం కండి! మళ్ళీ ప్రభుత్వం వచ్చాక త్యాగాలు చేసిన వారికి పదవులు గ్యారెంటీ! కొందరు ఎచ్చులకు పోతే మొదటికే మోసం!పక్క చూపులు చూస్తే అసలుకే మోసం! వివాదాల సుడి గుండాలలో వున్న వాళ్లెవరో అందరికీ తెలుసు…
వాళ్లంతా పార్టీ క్షేమం కోసం మనసలుకుంటే అందరికీ మేలు.
నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్నట్లు తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్దితి. ఇంతకీ కాంగ్రెస్‌పార్టీని సీనియర్ నాయకులు ఎందుకు వీడుతున్నట్లు అన్నదానికి రేవంత్‌ను బూచిగా చూపిస్తున్నారేమో! అన్న అనుమానం కల్గుతోంది. ఇంత కాలం పార్టీ మారాలంటే కారణం కనిపించని నేతలకు రేవంత్ రెడ్డి పిపిసి కావడం నచ్చలేదన్న సాకును ముందుపెట్టి తప్పుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లోనే కాదు, భవిష్యత్తులో కూడా తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ లేచే పరిస్దితి లేదన్నది అర్ధమైనట్లుంది. పైగా పార్టీని నిలబెట్టేంత శక్తి లేదన్నది కూడా అర్ధమైంది. కాకపోతే మాకు పార్టీలో అవమానం జరుగుతోందన్న కుంటి సాకులు తప్ప మరేం కనిపించడం లేదు. అసలు రేవంత్‌రెడ్డిమీ సీనియర్లకు వున్న అభ్యంతరం ఏమిటన్నది ఎవరూ భహింరంగంగా చెప్పరు. కాకపోతే రేవంత్ మీద ఎప్పటిక్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే వుంటారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డు చెప్పిన మాటలు మీడియా హైలెట్ చేసింది. దాంతో ఆయన అంతర్మధనంలో పడ్డారు.
ఓవైపు రేవంత్‌రెడ్డి మీద అగ్గిమీద గుగ్గిలమౌతూనే, మరో వైపు జగ్గారెడ్డి ఒకడుగు వెనక్కి వేస్తున్నాడు.
ఎందుకంటే జగ్గారెడ్డికి పిసిసి అధ్యక్షుడు కావాలన్న కోరిక బలంగా వుంది. కాకపోతే రేవంత్ మీద అలిగి మళ్లీ బిజేపిలో చేరే అవకాశం లేదు. 2014 ఎన్నికల తర్వాత జగ్గారెడ్డి బిజేపిలో చేరి, మెదక్‌నుంచి ఎంపిగా పోటీ చేశాడు. ఓడిపోయాడు. మళ్లీ తిరిగి బిజేపి గూటికి చేరుకున్నాడు. మళ్లీ బిజేపికి వెళ్లడానికి మొహమాటం అడ్డొస్తోంది. అందుకే పిట్ట బెదిరింపులు చేస్తున్నాడు. ఆఖరుకు ఓ దశలో నేనే ప్రత్యేకంగా ఓపార్టీ పెడతానన్న మాట కూడా మాట్లాడాడు. కాకపోతే సీనియర్లంతా రేవంత్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నదానికి మాత్రం పూర్తి స్ధాయిలో క్లారిటీ లేదు. పైగా కాంగ్రెస్‌లో ఎక్కువ మంది సీనియర్లు రెడ్డీ సామాజిక వర్గ నేతలే. అయినా రేవంత్‌రెడ్డికి సహకరించేందుకు ఇష్టపడడంలేదు. రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు మాత్రం సీనియర్లకు అసలే నచ్చడం లేదు.
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిపిసి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
రేవంత్‌రూపంలో ఆ కోరిక తీరకుండా పోయింది. వచ్చే ఎన్నికలు రేవంత్ నేతృత్వంలోనే జరిగేలా కనిపిస్తున్నాయి. అందువల్ల కోమటిరెడ్డి ఆ ఆశ కూడా వదలుకున్నట్లే కనిపిస్తోంది. పైగా ఆయన ఊగిసలాటలో వున్నాడనే సంకేతాలున్నాయి. గతంలోనే వెంకటరెడ్డి కూడా కమలం గూటికి చేరుతున్నాడనే అనుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే మాత్రం ఇప్పటికే వెంకటరెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకునేవారు. కాకపోతే కాస్త ఓపికపడుతున్నాడు. ఎన్నికల నాటికి ఎటు వెళ్లాలో అన్నది నిర్ణయించుకునేలా వున్నాడు. రేవంత్‌రెడ్డిని పిపిసి అధ్యక్షుడిని చేయొద్దని సీనియర్లు ఎంతో పట్టుపట్టారు. కాని అధిష్టానం వినిపించుకోలేదు. సీనియర్ల మాట లెక్కలోకి తీసుకోలేదు. ఇదే వారికి వున్న ప్రధానమైన అభ్యంతరం. ఇంత కాలం పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం నచ్చలేదు. ఇలా అటు సీనియర్లు, ఇటు రేవంత్ కలిసి పార్టీని మింగేస్తున్నారన్న అపవాదు కూడా వుంది.
పార్టీలో వున్న కోవర్టులు వెళ్లిపోవచ్చు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డే అసలైన కోవర్టు, కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో వున్నాడన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్‌లో సీనియర్ల మాటకు మాత్రమే ఎక్కువ విలువ. అదే రేవంత్‌రెడ్డి కొంప ముంచుతోంది. మీడియా కూడా సీనియర్ల వ్యాఖ్యలను హైలైట్ చేస్తుంటాయి. అదే రేవంత్ అనుచర వర్గం చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోడంలేదు. దాంతో అసలు కాంగ్రెస్‌లో ఎవరున్నారు? ఎవరు వీడుతున్నారు? అన్నదానిపై స్పష్టత ఎక్కడా కనిపించదు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి రావడం రావడంతోనే సీనియర్లను దూరం చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారన్న అపవాదు కూడా మోస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి వెనక వున్నదెవరు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అక్కడి అప్పటి సీనియర్లును తట్టుకొని నిలబడలేకే కాంగ్రెస్ గూటికి చేరుకున్నాడన్నది కొందరి వాదన. చంద్రబాబు ఆదేశాల మేరకే, కాంగ్రెస్‌ను ఖాళీ చేసేందుకే ఆ పార్టీ గూటికి చేరి ఖతం చేసే పని మొదలు పెట్టారనేది మరి కొందరి వాదన. ఇలా ఎవరి వాదనలు ఎలా వున్నా, పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. అసలు ఉనికిలో వున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల దాకా కనీసం కాంగ్రెస్ పార్టీని గురించి చర్చించుకునే అవకాశం కనిపించింది. కాని ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ఎంతో బలంగా వున్నా, దాన్ని బలహీన పర్చి ఒట్టిపోయిన గేదేను చేస్తున్నారు. పనికి రానిదాన్ని చేస్తున్నారు. పార్టీకి మూకుమ్మడిగా నేతలంతా కలిసి పాతర పెడుతున్నారు.
ఇలాగే కొనసాగితే పార్టీలో సీనియర్లంతా ఎవరి దారి వారు చూసుకుంటే పార్టీకి కొత్త రక్తం వస్తుందా? అన్న ఆశ కూడా ఎక్కడా కనిపించడం లేదు.
అసలు జిల్లాలో కీలకమైన నేతలెవరు? అన్నదానిపై స్పష్టత లేదు. వారికి సరైన పిలుపులు లేవు. వారు చేస్తున్న పోరాటాలు లేవు. ఉద్యమాలు కూడా లేదు. ఇక రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అది మొదలౌతుందా? లేదా? అన్నది కూడా సందిగ్ధంగానే వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ముందస్తుకు వెళ్తాడన్న ఊహాగానాల నడుమ పాదయాత్ర చేపట్టినా అర్ధాంతారంగా ముగించుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రభుత్వం అడుకున్నట్లు కాకుండా రేవంత్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా చేసినట్లౌవుంది. అందుకే రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తావన కూడా సరిగ్గా ముందుకు పడడంలేదు. ఆయన కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వడంలేదు. అందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు ప్రచారమే తప్ప, అడుగులు పడతాయన్న గ్యారెంటీ లేదు.
ఇక తాజగా ఏఐసిసి అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గే దృష్టికి కూడా రేవంత్‌రెడ్డి వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది.
ఒక వ్యక్తి మీద ఇంత మంది ఇన్ని రకాలుగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్నదానిని కూడా ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఖర్గే సీనియర్ల మాట విని, రేవంత్‌ను పక్కన పెట్టే అవకాశం కూడా వుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వారి మాటలు వినకుండా రేవంత్ రెడ్డిని గో హెడ్ అంటే సీనియర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లే అవుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికీ తెలంగాణలో టిఆర్‌ఎస్ తర్వాత బలంగా వున్న పార్టీ కాంగ్రెస్సే… కాకపోతే చేజేతులా కాంగ్రెస్ నాయకులు చేతి గుర్తు పార్టీని రాష్ట్రంలో కనుమరుగు చేసుకుంటున్నారు. వారికి ఉనికి లేకుండా చేసుకుంటున్నారు. రాజకీయాలకు దూరమౌతున్నారు.
ఎవరూ మెచ్చనమ్మ ఎచ్చులకు పోతే, ఎగబడి, ఎగబడి తరిమిన్రట. అచ్చు తెలంగాణలో వైఎస్‌ఆర్టీటిపీ నాయకురాలు షర్మిలకు జరిగింది. రాజకీయాలు చేస్తున్నాం కదా! అని ఏది పడితే అది మాట్లాడొచ్చు అనుకుంటుందేమో? మంచి, మర్యాద అన్నవి నేర్చుకుంటే అలాంటి మాటలు రావు. మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది కదా? అని రాజకీయాల్లో ఎలాగైనా మాట్లాడొచ్చన్న అవగాహన రాహిత్యం బాగా వున్నట్లు వుంది. మహిళగా ఆమె చేసే రాజకీయాలు ఆదర్శవంతంగా వుండాలే గాని, మహిళా సమాజం కూడా చీదరించుకునేలా వుండకూడదు. తెలంగాణలో ఇప్పటి వరకు కుహానా రాజకీయాలు లేవు. కుత్సిత రాజకీయాలు లేవు. ఎత్తిపొడుపులు లేవు. హేవంగింపులు లేవు. హద్దులు మీరి మాట్లాడే మాటలు అసలే లేవు. కాని వాటిని తెలంగాణ రాజకీయాల్లో చొప్పించి, ఇక్కడి రాజకీయాలను కలుషితం చేయాలనుకుంటున్నట్లున్నది. తెలంగాణ ఒక గంభీరమైన గడ్డ. ఇక్కడ త్యాగాలకు తప్ప, తాబేదార్లకు తావులేదు. ప్రేమే తప్ప పెత్తనాలుండవు. మంచి తనం తప్ప, మాయ చేయడం వుండదు. అలాంటి స్వచ్ఛమైన గడ్డమీద కడప రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు చీదరించుకుంటారు. చీ కొడతారు. అసందర్భ ప్రేళాపనలు చేస్తే అసలే సహించరు. తాను తెచ్చుకున్న కిరాషి మనుషులు చప్పట్టు కొడుతున్నారు కదా! అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి కేటిఆర్‌ను, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎటు పడితే అటు మాట్లాడితే ఊరుకుంటారా? మీరేంటో మీ తత్వం ఏమిటో చెప్పడానికి ఒక్క కొండాసురేఖ చాలు. తెలంగాణ వారి త్యాగాలను కూడా అవకాశవాదం కోసం వాడుకొని, నమ్మిన నాయకులను నిండా ముంచిన ఘనత షర్మిల కుటుంబానిది. నిజంగా తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే సమస్యలు మాట్లాడు! చెప్పడానికి ఏమీ లేనప్పుడు చెంపలేసుకొని వెళ్లు. అంతే గాని రెచ్చగొట్టి ఏదో సాధిస్తామనుకుంటే చెల్లదు. నోరుంది కదా! అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? అసలే ఇది తెలంగాణ. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ. ఒకనాడు తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అంటూ మాట్లాడి తెలంగాణ మనోభావాలు దెబ్బతీసిన వైఎస్ కుటుంబానికి ఇక్కడ మాట్లాడే నైతిక హక్కేలేదు. అంతే కాదు తెలంగాణలో ఎన్నికలు అయ్యేదాకా ఒక మాట, అయిపోగానే కర్నూలులో మరో మాట చెప్పి సీమాంధ్ర ఓట్లకోసం పచ్చి అబద్దాలాడిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. పచ్చి అవకాశవాది వైఎస్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక రాజనీతీజ్ఞడు. అపర చాణక్యుడు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల దృష్టిలో యుగపురుషుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన దీరోధాత్తుడు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ చేసినట్లు దుష్ట రాజకీయాలు చేసి కేసిఆర్ పదవులు పొందలేదు. రాజకీయంగా అందిన పదవులను కూడా తెలంగాణ కోసం తృణ ప్రాయంగా వదిలేసిన నాయకుడు కేసిఆర్. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమ త్యాగాల రాజకీయాలు చేసిన నాయకుడు కేసిఆర్. ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం జీవితం త్యాగం చేసిన నాయకుడు కేసిఆర్. ప్రాణ త్యాగానికి సైతం సిద్ద పడ్డ నాయకుడు కేసిఆర్. అలాంటి కేసిఆర్‌ను తూలనాడితే తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఉతికి ఆరేస్తుంది! చీరి చింతకు కట్టేస్తుంది!! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రాజకీయాలు చేసుకుంటే ఎవరూ వద్దనడం లేదు. కాని హద్దులు దాటి, పరిమితులు మర్చిపోతే పర్యవసనాలు కూడా పరిపాటే అన్నది తెలుసుకోవాల్సివస్తుంది. ఇప్పటికే కొంత షర్మిలకు అర్ధమయ్యే వుంటుంది. అయినా మారకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు.
త్యాగాల గడ్డమీద తమాషా రాజకీయాలు చెల్లవు.
ఇక్కడి ప్రజలను పాలించిన నైజాం రాజుకే ఘోరి కట్టిన చరిత్ర తెలంగాణది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే భరతం పట్టేదాక వదిలిపెట్టరు. తప్పు చేసిన వారిని తమ, తర అనే భేధం చూపని గడ్డ. మనవాడు తప్పు చేస్తే ఇక్కడే పాతిపెట్టు, పొరుగోడు తప్పు చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టు అని చెప్పిన కాళోజీ వారసులు తెలంగాణ ప్రజలు. తెలంగాణకు వచ్చి తెలంగాణనే అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? తెలంగాణ అంటే ముందు గుర్తుకు వచ్చేది కేసిఆర్. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా తెలంగాణ సమాజమే సహించదు. షర్మిల ఆ విషయం ముందు తెలుసుకుంటే ఎంతో మంచిది. అరవై ఏళ్ల పాటు సీమాంధ్ర నాయకులతో పోరాడిన చరిత్ర తెలంగాణది. అందులో షర్మిల తండ్రి వైఎస్ కూడా వున్నారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ గెలవకుంటే ఇక జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేకుండాపోతుందని ఆలోచించి, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకొని రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు. సహకరించిన తెలంగాణ వాదాన్నే మట్టు పెట్టాలని చూశాడు. ఆఖరుకు ఒక దశలో ఉద్యమ నాయకుడు కేసిఆర్‌ను కూడా లేకుండా చేద్దామని చూశారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ ఏనాడు అవి మనసులో పెట్టుకోలేదు.
కేసిఆర్ అంటే ఒక వ్యక్తికాదు. ఒక యుక్తి. ఒక మహోన్నతమైన శక్తి. తెలంగాణకు స్వేచ్ఛను తెచ్చిన నాయకుడు.
అరవై ఏళ్ల పోరాటానికి అంతిమ విజయం అందించిన నాయకుడు. త్యాగధనుడు. అలాంటి నాయకుడిని నోటికొచ్చినట్లు మాట్లాడేంత అహంభావం షర్మిలకు పనికిరాదు. తెలంగాణలో రాజశేఖరరెడ్డి పాలనే ఓ పీడ కల. తన స్వార్ధం కోసం తెలంగాణతో పొత్తుపెట్టుకొని, అడుగడుగునా తెలంగాణకు అడ్డుపడి, నేను నిలువూ కాదు, అడ్డం కాదు అంటూ కారడ్డమాడిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలంగాణకు అడుగుడునా అడ్డుపని వ్యక్తి రాజశేఖరరెడ్డి. కేసిఆర్ నాయకత్వాన్ని అణిచివేయాలని చూసిన నాయకుడు వైఎస్. రాజశేఖరరెడ్డి. అలాంటి రాజశేఖరెడ్డి పాలనను ఆయన కుటుంబ సభ్యులుగా రాజన్న రాజ్యం అంటూ కీర్తించుకునేది వుంటే ఆంధ్రప్రదేశ్‌లో చిడతల భజన చేసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు. కాని తెలంగాణ పచ్చి వ్యతిరేకి వైఎస్ పాలన మళ్లీ తెలంగాణలో కావాలని ఏ మూర్ఖుడు కోరుకోడం లేదు. అయినా రాజన్న రాజ్యం అని చెప్పుకుంటున్న షర్మిల తెలంగాణకు వైఎస్ చేసిన ఒక్క మంచి పని ఏమిటో చెబితే బాగుంటుంది. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టైనా నిర్మాణం చేశాడా? కనీసం పెండిరగ్ ప్రాజెక్టులైనా పూర్తి చేశాడా? తన హయాంలో పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని 40 వేల క్యూసెక్కులను 80 వేల క్యూసెక్కులకు పెంచుకొని, నీటిని దోచుకెళ్లాడు. పులిచింతల నిర్మాణం మొదలు పెట్టి, తెలంగాణను ముంచాడు. అంతే కాని తెలంగాణకు ఏం చేశాడని చెబుతారు? ఇక రైతులకు ఉచిత విద్యుత్ అన్నది అప్పటి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇచ్చారు. తెలంగాణకు ఉపయోగపడిరది ఎంత? రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని చీకట్ల మయం చేశారు. కరంటు మీద ఆధారపడి చిన్న చిన్న పనులు చేసుకునేవారికి కరంటు లేకుండా చేశాడు. వారి జీవితాల్లో చీకట్లు నింపారు. తెలంగాణ పల్లెలు రోజులో గంట కూడా కరంటు చూడని దుస్తితి తెచ్చారు. పట్టణాలను ఆగం చేశారు. ఇదా రాజన్న గురించి షర్మిల చెప్పుకునే రాజ్యం….అదే ఇప్పుడు పల్లె, పట్నం అన్న తేడాలేకుండా ఇరవై నాలుగు గంటల నిరంతర, నాణ్యమైన కరంటు అందుతోంది. రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు వస్తోంది. కరంటు మీద ఆధారపడి చేసుకునే పనులు లక్షణంగా సాగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చీకట్లు పోయి, వెలుగులు నిండాయి. కాని ఒకనాడు తెలంగాణకు ఎండబెట్టి సీమాంధ్రకు కరంటు ఎత్తుకుపోయిన వాళ్లు ఇప్పుడు చీకట్లలో మగ్గుతున్నారు. కరంటు కోతలు అనుభవిస్తున్నారు. ముందు మీ అన్న జగన్‌ను కోతలు లేని కరంటు సరఫరా చేయమని చెప్పు. అక్కడ ఎలగబెట్టిందేమీ లేకున్నా, పచ్చగున్న కాడ పందిరేసుకుంట, ఎచ్చగున్న కాడ కునుకు తీస్తా…అనే పరాన్న భుక్కులుగా బతికే బతుకును షర్మిల మార్చుకుంటే బాగుంటుంది. పచ్చని తెలంగాణలో రాజకీయ చిచ్చులతో కల్లోలం రేపే రాజకీయాలు కాకుండా, అన్న చేసే తప్పులు సరిదిద్దే రాజకీయాలు ఆంధ్రలో చేసుకుంటే మంచిది. అంతే కాని అయ్యేదో పంచించినట్లు అన్న ఆంధ్రలో , చెల్లె తెలంగాణలో పెత్తనం చేస్తానంటే ఎక్కడైనా నడుస్తుందేమో కాని తెలంగాణలో నడవదు..! అంతే…ఈ నేలకున్న ఆత్మగౌరం అదంతే!!
నూతనంగా నియమితులైన జిల్లా అడహాక్ కమిటీలకు బాద్యతలు అప్పగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
సమావేశంలో హాజరైన సగర బందువులు
ఇచ్చోడ, నవంబర్ 30: తెలంగాణలో సగరులను బీసీ ‘ఎ’ లో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సగర సంఘం సర్వసభ్య
సమావేశం బుధవారం ఇచ్చోడలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శేఖర్ సగర మాట్లాడుతూ అనాదిగా సగర జాతి అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సగరుల బ్రతుకులు మారాయని, పేరుకు సగర క్షత్రియులము అయినప్పటికీ బిసి ‘డి’ లో కొనసాగుతున్న సగరులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాది అవకాశాలు లేక బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక చేయూత లేకపోవడంతో ఈ సమాజంలో సగరులు అన్ని రంగాలలో వెనుకబాటుకు లోనయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగరులను బీసీ ‘డి’ నుంచి బిసి ‘ఎ’ లోకి మార్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర సగర సంఘం ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇతర బీసీ కులాలతో సమానంగా ప్రభుత్వం సగరులను నిర్మాణరంగ కార్మికులు గా గుర్తిస్తూ కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న సగరులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇఎండిలు లేకుండా ప్రభుత్వ నిర్మాణ పనులను సగరులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల వయస్సు పైబడిన నిర్మాణరంగ కార్మికులైన సగరులను గుర్తించి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా సగరులనంత ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, స్థానిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అడహాక్ కమిటీ
ఆదిలాబాద్ జిల్లా సగర సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షులు గా శంకర్ రాకెలె సగర, కో-కన్వీనర్ లుగా రఘునాథ్ హైతలే సగర, గోపీనాథ్ ఎగాడె సగర, శంకర్ మాధంశెట్టి సగర
*జిల్లా యువజన సంఘం*
జిల్లా యువజన సంఘం కన్వీనర్ గా శివాజీ రాకెలే సగర, కో-కన్వీనర్ లుగా కల్బుర్గి నాందేవ్ రాకలే, గణేష్ ఐనలే సగర, చందారావు బర్లేవాడ లు నియమితులయ్యారు.
*మహిళా సంఘం*
జిల్లా మహిళా అడహాక్ కమిటీ
జిల్లా సగర మహిళా సంఘం కన్వీనర్ గా చింతల్ వాడి జయశ్రీ సగర, కో- కన్వీనర్లు గా రుక్మిణి బర్వేవాణి, లక్ష్మి అయినెలే లు నియమితులయ్యారు.
`నేటిధాత్రికి కొందరు సంధించిన ప్రశ్నలకు సమాధానాలివే…
`కామారెడ్డి నియోజకవర్గంలో సుభాష్ రెడ్డి ఒక్కరే వందల ఇండ్ల నిర్మాణానికి చేయూతనిచ్చాడు.
`గుజరాత్ భూకంపం అప్పుడు దాతలే వేల మందికి ఇండ్లు నిర్మించారు.
`లాతూర్‌లో అలాగే నిర్మించారు… ఆ ప్రోత్సాహంతోనే అనేక మంది కదిలారు.
`ఈ మధ్య ఓ అమ్మాయు తన పెళ్ళి ఖర్చుతో పేదవారికి ఇండ్లు నిర్మించిన సంఘటన
వెలుగులోకి వచ్చింది.
`ప్రభుత్వం ఎప్పుడు పిలుపునిచ్చినా రెడీ అనే శ్రీమంతులున్నారు.
` కాదనుంకుంటే ఏదీ కాదు….
`అసాధ్యమని కూర్చుంటే ఏదీ చేయలేము…
`సంకల్పం వుంటే సాధ్యమే….తెలంగాణ మలి తరం వైభోగమే.
`అందరూ కలిస్తేనే అది సమాజం…
`తలా ఓ చేయి వేస్తేనే ప్రగతి రథం పరుగులు.
`అందుకు ఆసక్తి కనబర్చుతున్న వాళ్లు మన కళ్ల ముందే వున్నారు…
`గీరమ్మని పిలవండి…వారి చేయూతను రాష్ట్రానికి అందివ్వమనండి.
`బంగారు తెలంగాణలో మరో నవశకానికి శ్రీకారం జరుగుతుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
సంకల్ప సిద్ధి ఎంతటి కార్యమైనా నెరవేర్చుతుంది. పట్టుదల వుంటే ఎంతటి పనైనా పూర్తి చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలోనూ పేదలకు ఇండ్ల నిర్మాణం అన్నది కూడా పూర్తి చేయొచ్చు. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిచ్చామన్నది ముఖ్యమనే సూక్తిని గుర్తించుకున్న వాళ్ల్లు చాలా మంది వున్నారు. కన్న ఊరు, తమ జిల్లా, తన రాష్ట్రం అన్న మమకారం చాలా మందిలో వుంటుంది. అలాంటి వారికి ప్రజలకు సేవ చేయాలన్న తలంపు కూడా వుంటుంది. కాకపోతే వారికి సరైన వేధిక అవసరం. కొందరు ముందుకొచ్చి స్వతాహాగా పేదలకు చేయూతనిస్తుంటారు. కొందరు సమాజానికి దూరంగా వుంటారు. కాని వారికి కూడా సమాజానికి ఏదో చేయాలన్న ఆలోచన కూడా వుంటుంది. అలాంటి వారందరినీ ఏకం చేస్తే, ఒకచోటకు చేర్చి వారు చేయాల్సిన సేవ గురించి వివరిస్తే తప్పకుండా ముందుకొస్తారు. ఎంతో కొంత సామాజిక సృహ వున్న చాలా మంది తాము ముందుకొస్తామని కూడా చెబుతున్నారు. అలాంటివారంతా కలిస్తే ఎలాంటి విజయం సిద్ధిస్తుందో చూద్దాం.
కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మానవతావాది అయిన సుబాష్‌రెడ్డి గురించి ముందు చర్చిద్దాం.
ఆయన రియలెస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించే ప్రతి రూపాయిలో కొంత పేదల కోసం ఎప్పుడూ ఖర్చు చేస్తుంటారు. ఇప్పటి వరకు కోట్లలో వితరణలు చేశాడు. కొంత కాలం పాటు గుప్తదానాలు చేసేవారు. తర్వాత కాలంలో ఆయన చేసే సేవ గురించి ఆనోట, ఈనోట విని చుట్టపక్కల గ్రామాల వాళ్లు వారి వారి గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలు చేపట్టినప్పుడు విరాళాల కోసం రావడం మొదలుపెట్టారు. అలా వచ్చిన వారిని ఎవరినీ కాదనకుండా తన వంతు చేయూతనిందిస్తుండేవారు. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు గదలు పథకం( డబుల్ బెడ్ రూం) అమలుకు శ్రీకారం చుట్టింది. దాంతో ఆయన పుట్టిపెరిగిన గ్రామమైన బీబీపేటలో ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్ బెడ్‌లలో ప్రతి ఇంటికి తన సొంత సొమ్ము అదనంగా లక్ష రూపాయలకు పైగా చేర్చారు. ఒక సర్వాంగ సుందరమైన కాలనీగా మార్చేశారు. ఆ గ్రామంలో వాటిని ప్రభుత్వం నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్‌రూంల్లా కాకుండా విల్లాలను తలపించేలా నిర్మాణం చేసి ఇచ్చాడు. అలా కోట్ల రూపాయల వితరణతో కొత్త కాలనీ ఏర్పాటు చేశారు. ఇలా ముందుకు వచ్చేందుకు చాలా మంది మన రాష్ట్రంలో వున్నారు. మన రాష్ట్రం నుంచి వెళ్లి విదేశాల్లో స్ధిరపడిన వాళ్లు కూడా తమ ప్రాంతం మీద మమకారంతో చేయూతనిందిచేందుకు సిద్ధంగా వున్నారు.
తాజాగా ప్రభుత్వం స్ధలం వున్న ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇచ్చేందుకు సమ్మతించింది.
ఓ వైపు డబుల్ బెడ్‌రూం పథకం సాగుతుండగానే మరో బృహత్తరమైన ఈ పధకం ద్వారా స్ధలం వున్న వారెందరికో మేలు జరగనున్నది. పాత ఇంటి స్ధానంలో కొత్తది నిర్మాణం జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించబడుతుంది. అయితే ఈ పథకంలో చేయూతనిందించేందుకు కొంత మంది ముందుకొస్తున్నారు. ఇలాంటి ఇండ్ల నిర్మాణం సహజంగా గ్రామాలలో ఒక పది నుంచి ఇరవై మంది నిర్మించుకునే అవకాశం వుంది. వాటి నిర్మాణానికి అవసరమైన అదనపు సొమ్మును కలిపి, పేదలకు ఇండ్లు నిర్మించడం పెద్ద సమస్య కాదు. అందువల్ల శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఊరు మొత్తం దత్తత తీసుకున్నట్లు ఎంతో మంది సేవ చేయాలన్న ఆలోచన వున్నవారు వున్నారు. వారికి ఒక అవకాశం ఇచ్చినట్లుంటుంది. ప్రజలకు సేవ చేశామన్న తృప్తిని వారికి మిగిల్చినట్లుంది. తరతరాలు వారి గురించి ఆయా గ్రామాల్లో గుర్తుంచుకునేందుకు అవకాశం వుంటుంది. వారి కీర్తి తరతరాల చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఇక్కడ కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుంటే విపత్తుల సమయంలో చేయూత నివ్వడం మనం ఎప్పుడూ చూస్తున్నదే.
2008 జనవరి 26ప గుజరాత్‌లో భూకంపం వచ్చింది. దేశం మొత్తం చేయూతనందించింది. అందులో భాగంగా రామోజీరావు పెద్దఎత్తున విరాళాలు సేకరించి, ఓ గ్రామ నిర్మాణం పూర్తి చేశారు. కొన్ని వందల ఇండ్లు నిర్మించి ఇచ్చారు. అలా రామోజీరావు ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని వేల మంది తెలుగు దాతలు ముందుకొచ్చారు. కొన్ని వేల మంది సాయంతో ఏడాది కాలంలో భూకంపం వచ్చిన ప్రాంత రూపురేఖలే మర్చారు. కొత్త ప్రాంతాలను సృష్టించారు. మళ్లీ ఆ గ్రామాలకు జీవం పోశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రభుత్వం ఒక్క పిలుపునిస్తే ఎంతో మంది ముందుకొచ్చే అవకాశం వుంది. ఏఏ నియోజకవర్గంలో ఆయా సంపన్నులను ముందుకు రమ్మంటే వారికి చేతనైనంత సాయం అందరూ చేస్తే, ఆ నియోజక వర్గంలో ఇండ్ల నిర్మాణం అన్నది పెద్ద సమస్యే కాదు. ఇలా మొత్తం తెలంగాణను ఏడాదిలోగా తీర్చిదిద్దొచ్చు. తెలంగాణలో ఇళ్లు లేదని అనేవారు లేకుండా చేయొచ్చు.
1992 లో మహారాష్ట్రంలోని లాతూర్ భూకంపంలో కూడా ఇదే విధంగా సర్వం కోల్పోయిన వారు కొన్ని లక్షల్లో వున్నారు.
వారందరికీ దేశమంతా చేయూతనిచ్చింది. ఒకప్పుడు భూకంపంతో స్మశానాన్ని తలపించిన లాతూర్ ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది. పునరుజ్జీం పోసుకొని మళ్లీ సరికొత్త ప్రాంతంగా విరాజిల్లుతుంది. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా కూడా వుంది. ఓ తండ్రి తన కూతురు పెళ్లి కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి, అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో ఆ కూతురు తన పెళ్లికి చేయాలనుకున్న ఖర్చుతో పేదలకు ఇండ్లు నిర్మించి ఇద్దామని సూచించిందట. ఈ విషయంపై ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. ఇక గుళ్లకు గోపురాలకు అంటే విరాళాలు ఇచ్చేవారు ఎంతో మంది వున్నారు. తెలంగాణలో ఈ మధ్య చినజీర్ స్వామి ఏర్పాటు చేసిన ఓ ఆశ్రమానికి కొన్ని వేల కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పిలుపునిస్తే ఎంత మంది సేవ భావం వున్నవాళ్లు ముందుకొస్తారో అర్ధం చేసుకోవచ్చు.
సామాన్యులే కాదు పారిశ్రామిక వేత్తలు, ఐటి రంగ వ్యవస్ధాపకులు కొద్దిగా చేయూతనిస్తేనే కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం వుంది.
అలా అందరి సహాకారంతో రాష్ట్రంలో పేదలకు ఇండ్లు నిర్మాణం చేయడం పెద్ద సమస్యే కాదన్నది నిపుణులు కూడా చెబుతున్న మాట. అందువల్ల ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ విషయంపై ఒక్కసారి దృష్టిపెడితే బాగుంటుందని ముందుకు రావడానికి సిద్దంగా వున్నవారే చెబుతున్నారు. ఒక్కసారితో చర్చిస్తే పూర్తి స్ధాయిలో సాధ్యాసాధ్యాలు కూడా చర్చించొచ్చు. నూతన కలల నిర్మాణమే కాదు, భావి తెలంగాణ పల్లెల రూపురేఖలు మార్చొచ్చు.
అన్ని రకాలఅదనపు సౌకర్యాల కోసం జి.ఓ నిధులు విడుదల చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
ఇప్పటికే నర్సంపేట జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 58 కోట్లు విడుదల
మరో ఆరు నెలల్లో పూర్తి కానున్న ఆసుపత్రి నిర్మాణ పనులు
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గం పేదోళ్లకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే రూ. 58 కోట్లు విడుదల కాగా ప్రస్తుతం మరో 10 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక జీ ఓ ద్వారా నిధులు విడుదల చేసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పగించారు.దీంతో 200 పడకల పెద్దాసుపత్రి మరో 6 నెలలలో నిర్మాణ పనులు పూర్తికానున్నాయి.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఉన్న నిరుపేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ ఉచిత వైద్యాన్ని అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో మంత్రి హరీశ్ రావు సహకారంతో నర్సంపేట ప్రాంతానికి జిల్లా ఆసుపత్రి మంజూరు కావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న నర్సంపేట ఏరియా ఆసుపత్రిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అనుమతులు కూడా జారీ అయ్యాయని ,అందులో భాగంగా ఇటీవల కాలంలో నర్సంపేట జిల్లా ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 58 కోట్ల నిధులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంజూరు చేయగా ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదనంగా కాంపౌండ్ వాల్, గ్రీనరీ, స్టాఫ్ క్వార్టర్, రోగుల అటెండెంట్ షేడ్, ఇంటర్నల్ సీసీ రోడ్ మరియు ఇతర సదుపాయాల కోసం మరో రూ. 10 కోట్ల నిధులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిందని వివరించారు.గతంలో నర్సంపేట ప్రాంత పర్యటనలో భాగంగా వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రజల తరపున అడిగిన నా కోరిక మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సీఎం కేసీఆర్ అనుమతితో నర్సంపేట జిల్లా ఆసుపత్రికి అదనంగా మరో రూ.10 కోట్ల నిధులను విడుదల అయినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిర్మాణ పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులను మొదలుపెట్టి మరో 6 నెలల్లో అన్ని సౌకర్యాలతో నర్సంపేట జిల్లా ఆసుపత్రిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది తెలియజేశారు.
సిరిసిల్ల పట్టణంలో పెద్దూరు గ్రామంలో ఎద్దుగుట్ట దగ్గర నుండి అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ RI పట్టుకొని తాసిల్దార్ కార్యాలయానికి తరలించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో ఇసుక మాఫియా ను అధికారులు
పట్టించుకోక రాత్రి కాగానే ఎలాంటి అనుమతులు లేకుండానే నాకేం భయం అన్న చందంగా ఇసుక ను జరవేస్తున్నారు. కొందరు ఇసుక సురులు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.
అధికార యంత్రాంగం కన్నుగప్పి రాత్రికి రాత్రే ఇసుకను తరలిస్తున్నారని చెపుతున్నారు ..ఈ దందా పై అధికార యంత్రాంగానికి సమాచారం ఉన్న వారు కొంత ఉదాసీనంగా ఉంటున్నారని..రాత్రి వేలలో ఇష్టారీతిలో వేగంగా మైనర్లే వాహనాలు నడుపుతున్నరని. యథేచ్ఛగా దందా కొనసాగుతుందాని దిపై పలు ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా మండలం పై నుండి వేరే జిల్లాకు కూడా మినీ వ్యాన్లు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతునయి ఏది ఏమైనా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇసుక దందా కోసాగుతూనే ఉంది.
`ఇది అమలు చేస్తే వచ్చే ఎన్నికలలో టిఆర్‌ఎస్ మళ్ళీ బంపర్ మెజారిటీ.
`రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చే అవకాశం వుంది.
`ఎన్నారైలు కూడా సహకారం అందుతుంది.
`అనేక మంది దాతలు, శ్రీమంతులు, ఎన్నారైలు నేటిధాత్రి తో చర్చించారు.
`ప్రభుత్వం ముందుకొస్తే మేం సహకరిస్తామంటున్నారు.
`ఇలాంటి విజయం చరిత్రలో నిలిచిపోతుంది.
`ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ దేశమంతా ఆదర్శమౌతుంది.
`మన చుట్టూ వున్న శ్రీమంతులంతా కలిసొచ్చే అవకాశం వుంది.
` ఒకసారి మాలాంటి వాళ్లను పిలిచి సిఎం మాట్లాడితే అన్ని విషయాలు చర్చిస్తాం.
`సరికొత్త భాగస్వామ్య చరిత్రకు శ్రీకారం జరుగుతుంది.
`సొంత ఇళ్లు లేని వారంటూ ఎవరూ తెలంగాణలో వుండరు.
`అందరికీ ఇళ్లు ఇచ్చిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఆ మాటలతో పేదలకు సేవ చేసేందుకు ఎంతో మంది మనసున్న వాళ్లు కూడా సిద్ధంగా వున్నారు. శ్రీకృష్ణుడు లాంటి స్నేహితుడున్నా, నోరు తెరిచి అడగలేని కటిక దరిద్రం అనుభవించాడు కుచేలుడు. అలాంటి కుచేలుల్లు ఎంతో మంది మన సమాజంలో వున్నారు. ఎంతో మంది శ్రీమంతులైన కృష్ణుడి లాంటి వారు కూడా మన చుట్టే వున్నారు. కుచేలుడు నాకు ఇది కావాలని అని ఏనాడు కృష్ణుడిని అడక్కపోయినా, ఆదుకున్నాడు. కుచేలుడిని శ్రీమంతుడిని చేశాడు. అలాగే సమాజంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది పేదలకు చేయూతనిచ్చేందుకు మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది సామాజిక సృహ వున్న శ్రీమంతులున్నారు. వాళ్లు పేదలకు సాయం చేడయానికి కూడా సిద్ధంగా వున్నారు. కాకపోతే ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడితే ముందుకొస్తామన్న భావనను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు వుండకూడదన్న ఆలోచనతో స్ధలం వున్న వారు ఇల్లుకట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షలు అందజేస్తుందని ప్రకటించారు.
ఓ వైపు డబుల్ బెడ్ రూంల ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. మరో వైపు పాత ఇండ్ల స్ధానంలో కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నవారికి, స్ధలం వుండి ఇల్లు కట్టుకునే స్ధోమత లేని వారికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు సిద్దమైంది. అందుకు అవసరమైన ధరఖాస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరిస్తోంది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్ధిక సాయానికి మరింత తోడైతే, పేదవారు కూడా గొప్పగా కలగనేటు వంటి ఇంటి నిర్మాణం చేయొచ్చు. అందుకు అసరమైన ఆర్ధిక తోడ్పాడు కల్పించేందుకు చాలా మంది సేవాతత్పరులైన శ్రీమంతులు ముందుకొచ్చేందుకు సిద్దంగా వున్నారు. నేటిధాత్రిలో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు, రాష్ట్రంలో వున్న రియలెస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ విషయంపై చర్చించారు. వాళ్లు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు వెల్లడిరచారు. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం అంటూ వుండదు. ప్రతి వ్యక్తికి ఇల్లుంటుంది. ఇది ఒక చరిత్రను సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమౌతుంది. తద్వారా దేశం మొత్తం ఇలాంటి అనేకం జరిగే అవకాశం వుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు లక్షల రూపాయలతో 50 గజాలలో( 450 ఎస్‌ఫ్‌టి) ఇంటి నిర్మాణం సాధ్యం కాదు.
ఖర్చు సుమారు రూ.6లక్షలకు పైగా అవుతుంది. గృహ నిర్మాణం చేపట్టే కార్మికుల ఖర్చే దాదాపు లక్షన్నరకు పైగా అవుతుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షల్లో సగం కార్మికులకే వెచ్చించాల్సివస్తుంది. అది మరింత పెరిగే అవకాశం కూడా వుంది. మిగతా సొమ్ముతో ఇల్లు నిర్మాణం జరగదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఆ ప్రాజెక్టుకు ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. అందవల్ల ప్రభుత్వం కనీసం రూ.5లక్షల వరకు చెల్లిస్తే, అదనంగా అయ్యే ఖర్చును ఆ గ్రామంలో నిర్మాణం చేసే ఇళ్లను దత్తత తీసుకునే శ్రీమంతులు భరిస్తారు. దాంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. పేదలకు ఎంతో సౌకర్యవంతమైన అందమైన ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఒక తరమంతా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటుంది. భవిష్యత్తు తరం కూడా గొప్పగా చెప్పుకుంటుంది. టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్)ను జీవితంలో మర్చిపోరు. మరో పార్టీకి ఓటు వేయరు. నిజానికి పేదలు ఇంటి స్ధలం అన్నది గ్రామాల్లో ఖచ్చితంగా వుంటుంది. వాళ్లందరికీ ఇంటి నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది సామాజిక సేవ చేయాలన్న ఆలోచన వున్నవారు కూడా కలిసొచ్చే అవకాశం వుంది. మన చుట్టూ వున్న నాయకులే కాదు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, రియలెస్టేట్ వ్యాపారులు, వీరికి తోడు ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా ఊళ్లకు దత్తతు తీసుకోవడం కోసం ముందుకొచ్చేందు ఉత్సాహంగా వున్నారు.
ఒక్కసారి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆ దిశగా ఆలోచన చేసి, ఎవరైతే ఉత్సాహంగా వున్నారో అలాంటి వారికి ఒక్క పిలుపిస్తే చాలు.
ఎంతో మంది కదిలేందుకు సిద్దంగా వున్నారు. కొత్తగా పునర్మిర్మాణం పూర్తి చేసుకున్న యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్క పిలుపునిస్తే వందలాది కిలలో బంగారం పోగైంది. అలాగే ప్రతి పేదకు ఇంటి నిర్మాణం పేరుతో భాగస్వాములయ్యేవారు ముందుకు రండి..అని కేసిఆర్ చెబితే చాలంటున్నారు. అందుకు మేం సిద్దంగా వున్నట్లు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి ముఖ్యమంత్రితో చర్చించేందుకు ప్రతి క్షణం సిద్దంగా వుంటామంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మనసున్న వ్యక్తి సుబాష్‌రెడ్డి.
ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణంలో తన సొంత నిధులు జత చేసి అందమైన ఇండ్లను నిర్మాణం చేసి ఇచ్చాడు. అదనంగా కొన్ని కోట్ల రూపాయలు ఖచ్చు చేశాడు. అంతే కాదు ఆ గ్రామంలో కోట్ల రూపాయల సొంత నిధులతో అత్యాధునికమైన హంగులు, సౌకర్యాలతో కూడిన స్కూలు నిర్మాణం చేశాడు. లైబ్రరీ ఏర్పాటు చేశాడు. ఆ చుట్టు పక్కల గ్రామాలలో అనేక గుళ్ల నిర్మాణానికి సాయపడ్డాడు. ఇలా రాష్ట్రంలో పేదల కోసం ఆలోచించేవారు ఎంతో మంది వున్నారు. వారందరికీ కూడా ఇలాంటి సేవలో భాగస్వాములు కావాలన్న ఆలోచన కూడా వుంది. వారందరినీ ఏకం చేసి, పేదలకు సాయం చేసేలా చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తే , ఇండ్ల నిర్మాణంలోగొప్ప విప్లవమే వస్తుందంటున్నారు.
అయితే ఇలాంటి ఇండ్ల నిర్మాణం ప్రభుత్వ సంస్ధలు , కాంట్రాక్టర్లు కాకుండా ముందుకొచ్చే దాతల పర్యవేక్షణలో జరగాలి.
అప్పుడే ఎలాంటి అవినీతి ఆస్కారం వుండదు. జ్యాపం అసలే జరగదు. అనుకున్న సమయానికి ఇండ్లు పూర్తవుతాయి. ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎందుకంటే అదనంగా వాళ్లు పెట్టే ప్రతి పైసా ఆ ప్రజలకు చెందాలన్న ఆలోచన దాతలకే వుంటుంది. కాని ప్రైవేటు కాంట్రాక్టర్‌కో, లేక ప్రభుత్వ ఉద్యోగులకో వుండకపోవచ్చు. అందువల్ల ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో వున్న శ్రీమంతులకు ప్రభుత్వం ఆహ్వానం పలికితే తెలంగాణకు గర్వకారణమే కాదు, దేశానికి ఆదర్శమౌతుంది. పేదల జీవితాల్లో వెలుగు నిండుతుంది. సొంత ఇల్లు కల ఎంతో మందికి నెరవేరుతుంది. సొంతది ఎంత చిన్న ఇళ్లయినా సరే వుంటే చాలనుకునే వారికి, మరింత గొప్ప ఇంటిని అందించే అవకాశం వుంటుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక్కసారి దీనిపై మనసుపెడితే, ఒక్క ఆలోచన చేస్తే రాష్ట్రమంతా ఏక కాలంలో కొన్ని లక్షల కొత్త ఇండ్లకు శ్రీకారం జరుతుంది. కొత్త రాష్ట్రం కొత్త ఇండ్లతో కళకళలాడుతుంది. కేసిఆర్ కీర్తి అజరామరమౌతుంది.
టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్వర్యంలో వైఎస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్దం
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అసత్యకర వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని నర్సంపేట కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దార్ల రమాదేవి డిమాండ్ చేశారు.ఆదివారం వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నర్సంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద వైయస్ షర్మిల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.షర్మిల గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.అనంతరం అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ జై తెలంగాణ అనడం నేర్చుకున్న షర్మిల అమరవీరుల స్థూపం దాటి వెల్లిపోయిన నీవు అమరవీరులకు నివాళులు అర్పించావా అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది పట్ల మాట్లాడిన నీకు చరిత్ర చదివి మాట్లాడు నీ తండ్రి,నీ అన్న చరిత్ర తెలువని ప్రజలు లేరు అని, నీ అయ్య,అన్న లెక్క వేల కోట్లు దోసుకొని జైలుకు పోయిన విషయం అప్పుడే మరిచావా అని షర్మిలకు గుర్తుకు చేశారు.ఒక్కటి గుర్తుకు పెట్టుకో షర్మిల
నర్సంపేట డివిజన్ లో నువ్వు తిరుగుతున్న రోడ్లు పెద్ది వేసిన రోడ్లే.ప్రసంగం కోసం
నీకు స్కిప్తు రాసిచ్చిన వ్యక్తికి తెలుసు ఎవడో మాకు తెలుసు ఆ కుక్క రాసిచ్చిన స్కిప్ట్ పట్టుకొని మాట్లాడినవ్,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూ కబ్జాలు చేశాడని మాట్లాడావు నీ వద్ద ఏమైనా ఆదాలరు ఉన్నాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం చేసావా అని షర్మిలపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశావు నీ అన్న జగన్ ను అడుగు మహబూబాబాద్ లో జరిగిన ఘటన జురించి అని ఎమ్మెల్యే పెద్ది పోరాటం పట్ల ఈ సందర్బంగా షర్మిలకు గుర్తుకు చేశారు.ఎమ్మెల్యే పెద్ది తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాన్ని దూరంగా పెట్టి కేసీఆర్ తో కలిసి తెలంగాణ సిద్ధించే వరకు పోరాటం చేసిన వ్యక్తి అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తెనే నేడు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని తిరుగుతున్నావు అది మరిచిపోయావా అని టీఆర్ఎస్ పార్టీది 22 ఏండ్ల చరిత్ర అని ఇక్కడ తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకొని భేషరతుగా ఎంఎల్ఏ క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిలను డిమాండ్ చేశారు.తక్షణమే పాదయాత్రను ముగించుకొని వెల్లిపో లేదంటే చెప్పుల దెబ్బలు తప్పవని షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీ కిషన్,కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ మహిళా పట్టణం అధ్యక్షురాలు బాణాల ఇందిర,కౌన్సిలర్స్
రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, దేవోజు తిరుమల సదానందం, రామసహయం శ్రీదేవి, గందే రజిత చంద్రమౌళి, నాగిశెట్టి పద్మ ప్రసాద్,గంప సునీత, రుద్ర మల్లీశ్వరి,వేల్పుగొండ వద్మ రాజు,లూనావత్ కవిత, మినుముల రాజు,శీలం రాంబాబు,,జుర్రు రాజు,,మహ్మద్ మహబూబ్ పాషా,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ,డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మాజీ సర్పంచ్ నల్లా మనోహర్ రెడ్డి,గ్రంధాలయ సంస్థ డైరెక్టర్స్
గంప రాజేశ్వర్ గౌడ్,పుట్టపాక కుమారస్వామి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్,రావుల సతీశ్, బీరం నాగిరెడ్డి,గోనె యువరాజు,మచ్చిక నర్సయ్య గౌడ్,యాదగిరి,రామారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 132 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది.
ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆనాటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విద్య యొక్క అవసరాలను , మహిళలకి చదువు మరియు వారి హక్కుల కోసం పోరాట పునాదులు వేసి భారత దేశ తొలి మహాత్ముడి సేవలను గుర్తు చేసారు .. ఈ దేశ ప్రభుత్వాలకి ఫూలే దంపతులకి భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమలో తాడిశెట్టి రాజేశ్వర్ రావు , సాయిని నరేందర్( BC స్టడీ సర్కిల్ ఫౌండర్ ), తాడిశెట్టి కార్తీక్ ( అభయహస్త ఫౌండేషన్ ప్రెసిడెంట్ ) , రవీందర్ , రవళి , సమీరుద్దీన్ ( TNRI దుబాయ్ ఫోరమ్ ప్రెసిడెంట్ ) , జవాద్ , మహేష్ , బుర్ర శ్యామ్ గౌడ్ ( తెలంగాణ గౌడ రాష్ట్ర నాయకులు) , నారాయణగిరి , పోచాలు, తదితరులు పాలుగోన్నారు.
న్యూ లయోలా హై స్కూల్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే 132 వ వర్ధంతి నిర్వహించారు , కరెస్పాండంట్ తాడిశెట్టి
క్రాంతి కుమార్ గారు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు కలసి ఫూలే గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళు అర్పించడం జరిగింది. ఈ కార్యకరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాలిగొన్నారు .
నేటిధాత్రి హైదరాబాద్ : నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న నయా సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ లోగా భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.