శంకరపట్నం నేటిధాత్రి
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కల్వల గ్రామం లో, ఆదివారం రోజున, ఆ గ్రామ సర్పంచ్, దాసారపు భద్రయ్య, మరియు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవ కమిటీ, ఆధ్వర్యంలో,రాజ్యాంగ నిర్మాత,డాక్టర్, బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మానకొండూర్, నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరైనారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఈరోజు మన కల్వల గ్రామంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరిగి,ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరం, ఇంత త్వరగా పూర్తిచేసిన సర్పంచ్ భద్రయ్య మరియు నిర్వహణ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ అభినందించారు. అదే విదంగా రసమయి మాట్లాడుతూ, అంబేద్కర్ అనే మహానుభావుని ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా మన జాతులు దళిత వర్గాల యువకుల అందరు ఇదే స్ఫూర్తి తోని ముందుకు పోయి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన దళిత యువకులకు పిలుపునిచ్చాడు. మరియు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేద్కర్ ఒక్కరి నాయకుడు కాదు ఆయనను ఒకే జాతికి అంకితం చేయడం సరైనది కాదు,ఆయన రాజ్యాంగాన్ని ఏ ఒక్క జాతి కోసమో ఏ ఒక్క వర్గం కోసమో రాయలేదు,అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి పట్టుదల తో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దీనితోనే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య యుతంగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమే అని అందరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా అయన తెలిపినాడు. “అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరివాడు “అని అన్నారు.ఆయన ఏ వర్గం కూడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోకూడదని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి కావలసిన రాజ్యాంగ ఫలాలను వాళ్లకు అందించనాడని ఈ సందర్భంగా అయన ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి తో,అందరూ అభివృద్ధి పథంలో నడుచుకొని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో పయనించాలని,ఈ సందర్భంగా దళిత సోదరులకు వర్గాలకు పిలుపునిచ్చాడు. అంతే కాకుండా నేను జీవితంలో ఏ ఒక్క దేవుడిని చూడలేదు నేను చూసిన నేను నమ్మిన ఏకైక దేవుడు అంబేద్కర్ అని అన్నాడు,ఆయన చూపిన మార్గంలోనే పయనించడం వలనే, ఆయన ఆశయాలతో ముందుకు పోవడం తోనే,ఆయన నిర్దేశించిన దిక్సూచితో, ఆయన పుణ్యంతోనే ఈరోజు నేను ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసి,ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానంటే, కేవలం ఆ మహానుభావుని దయ అని ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ అంబేద్కర్ గురించి తెలిపినాడు.ఈరోజు కల్వల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి,మరియు నూతన గ్రామపంచాయతీ అయితేనేమి, అది రేషన్ షాప్ అయితేనేమి,అది కేవలం రాజ్యాంగ హక్కుల ప్రకారం అంబేద్కర్ రాసిన నిబంధన ప్రకారమే వచ్చినాయని ఈ సందర్భంగా ఆయన తెలిపినాడు. అంబేద్కర్ గారి దయ మరియు ఆయన ముందు చూపుతోనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.ఎస్సీ ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల నాయకులు ఈరోజు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు అంటే అది ఆ మహానుభావుని దయే అన్నారు.తాను జీవితంలో పడిన కష్టాలు,నష్టాలు,తాను ఎదుర్కొన్న వివక్షలు భవిష్యత్తులో అణగారిన వర్గాలు ఎదుర్కోకూడదని రాజ్యాంగంలో మన హక్కులను భద్రంగా భద్రపరిచిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నాడు.ఇటువంటి మహనీయుని జయంతిని ఒక వర్గమే జరుపుకోవడం చాలా బాధాకరం,అందరి జయంతులు ఏ విదంగా అయితే అందరం కలిసి జరుపుకుంటారో, అంబేద్కర్ జయంతిని కూడా అందరం కలిసి జరుపుకోని ఐక్యతతో ముందుకు పోవాలన్నాడు. అంబేద్కర్ గారు ఏమి లేని రోజులలో ఆయనను ఆరు బయట నిలిచిపెడితే కేవలం బయట నుండి పాటలు విని ఒక దేశానికి రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగినాడంటే,ఈరోజు మనకు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి అటువంటి మనము ఇంకెన్ని ఉన్నత శిఖరాలను సునాయాసంగా అధిరోహించవచ్చునో ఆలోచించాలని,ఈ సందర్భంగా దళిత యువకు ఆయన వివరించారు . అంతేకాకుండా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి ఉన్నతమైన బ్రతుకు బ్రతకాలి అని యువకులను ఉద్దేశించి రసమయి బాలకిషన్ మాట్లాడారు. మరియు గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కోసం, తాను సానుకూలంగా ఉన్నట్లు,మరియు అంబేద్కర్ భవన నిర్మాణానికి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిపినాడు. చుట్టు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నట్టే ఈరోజు కల్వల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగడం కలలో కూడా ఎవరు ఊహించలేదని కానీ కలను నిజం చేసిన ఘనత మాత్రం ఆ యొక్క మహనీయుడు అంబేద్కర్ గారిదే అన్నారు. ఈ రోజు మనకు అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని, ఈ సందర్భంగా రసమయి అన్నారు.కల్వల గ్రామం ఒకప్పుడు చిన్న గ్రామం గ్రామపంచాయతీ లేదు, రేషన్ షాపు లేదు,రోడ్డు సౌకర్యం లేదు, ఆ రోజులలో వాళ్ళు కిలోమీటర్ల కొద్ది నడిచి పక్క ఊరికి వెళ్లే పరిస్థితి కానీ ఈరోజు వారికి నూతన గ్రామపంచాయతీని మరియు రేషన్ షాపును ఏర్పాటు చేశాము వారి వద్దకే వీటిని తీసుకువచ్చామని ఈ సందర్భంగా రసమయి తెలిపినాడు. అదేవిధంగా అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కుల ద్వారానే వీటిని సాధించుకున్నామని అని కూడ అన్నారు. ఆయన ఆలోచనలతో, ఆయన చూపించిన మార్గంలో మనం అంతా పయనించాలని,ఈ సందర్భంగా ఆయన అన్నారు.గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగడంతో కల్వలకు ఒక గౌరవ ప్రధానమైన స్థానం దక్కిందని ఈ సందర్భంగా కల్వల గ్రామానికి గీతాలు ఇచ్చాడు. అదేవిధంగా గ్రామంలో బీసీలకు కూడా అభివృద్ధి కూడా ఎల్లవేళలా నేను సహకరిస్తానని తెలిపినాడు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు వారి సొంత సలాలలో వారికి పక్కా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి హామీ ఇచ్చాడు.దళితులకు విడుదలవారీగా దళిత బంధు కూడా వచ్చేటట్లు చూస్తామని వారికి భరోసా ఇచ్చాడు.అంబేద్కర్ సంఘాల నాయకులు దళిత వర్గాలకు చెందిన పిల్లలను గురుకులాలలో ప్రభుత్వ హాస్టల్లో చేర్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సహాయాన్ని ప్రతి ఒక్కరం వినియోగించుకోవాలని అంబేద్కర్ సంఘాల నాయకులకు పిలుపునిచ్చాడు. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచనల తో స్ఫూర్తితో కలవల గ్రామంలోని యువకులు చాలా ఉత్సాహంగా కనబడుతున్నారని వారు భవిష్యత్తులో అంబేద్కర్ చూపిన దారిలో వెళుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని,ఆ యొక్క ప్రయాణంలో మీకు నేను ఎల్లవేళలా సహాయ పడతానని ఈ సందర్భంగా దళితుల దళిత యువకులకు భరోసా కల్పించినాడు.ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించుకోనడంతోనే మన పని పూర్తి అయినదని అనుకోకూడదని, ఆయన చూపిన బాటలో వెళుతూ ఆయన ఆశయాలతో ముందుకు ప్రయాణిస్తూ సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆయన తెలిపినాడు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఉమ్మెత్తల సరోజన, వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట మైపాల్,సతీష్ రెడ్డి, శ్యామ్ రావు, అంబేద్కర్ సంఘ నాయకులు దేవునూరి కిష్టయ్య, మెరుగు శ్రీనివాస్,కనకం నాగయ్య,కనకం శంకర్, క్యాదాసి భాస్కర్,బొజ్జ రవి, సంగి గట్టయ్య, మరియు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,కల్వల ఉప సర్పంచ్ గంగారాం మహేందర్, హరీష్, అశోక్, రాజేష్ మహేందర్, శ్రీకాంత్ మరియు వార్డ్ సభ్యులు,గ్రామ యువకులు, దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.