టిఆర్‌ఎస్‌ తో తెలంగాణ ప్రగతి… బిఆర్‌ఎస్‌ తో దేశమంతా ఇదే పురోగతి.

 

ఆరోగ్య తెలంగాణ:

తెలంగాణలో వైద్య విప్లవం…పల్లె పల్లెకు ఆరోగ్యం… బస్తీ దవఖాలతో పేదలకు మరింత అందుబాటులో వైద్యం…ప్రతి జిల్లాకు వైద్య కళాశాలల విస్తరణం…

దళితబంధు:   

దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక.

కాళేశ్వరం:

సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు- వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు.

మిషన్‌ భగీరథ:

మిషన్‌ భగీరథ తో సురక్షితమైన మంచినీటి సరఫరా- ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక.

మిషన్‌ కాకతీయ:

చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు-

సాగునీటి యజ్ఞంలో తెలంగాణ తొలి అడుగులు.

మేలి రకం విత్తనాలు:

సాగుబడిలో కొత్త రకం వంగడాలు- తెలంగాణలో మేలిమిరకం విత్తనాలు.

విత్తన భాండాగారం:

తెలంగాణ విత్తన భాండాగారం-

ఆదర్శవంతమైన సాగు నిర్మాణం. 

ఆసరా పథకం:

తెలంగాణ ఆత్మకు ఆవిష్కరణ- ముదిమి వయసు జీవితాలకు నగదు భరోసా.

కళ్యాణ లక్ష్మి:

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ కానుక- కళ్యాణ లక్ష్మి పథకంతో ఆ కుటుంబానికి ఆసరా.

కాళేశ్వరం ప్రాజెక్టు:

ప్రపంచంలోనే ఒక అద్భుతం- ఎగువ ప్రాంతాలకు నీటితో జలాభిషేకం.

యాదాద్రి:

మహిమాన్వితమైన యాదాద్రి పునర్‌ నిర్మాణం-

సుందరశోభిత వైభవం చరిత్రలో చెరగని తెలంగాణ సంతకం.

పారిశ్రామిక ప్రగతి:

తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు- 

ఐటి రంగ ఎగుమతుల్లో సరికొత్త విజయాలు. 

తెలంగాణ నెంబర్‌ వన్‌:

సత్వర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్‌ వన్‌-

 పరిపూర్ణ వికాసంతో అన్ని రంగాలల దేశానికే ఆదర్శం.

దార్శనికుని పాలన:

దార్శనికుని పాలనలో తెలంగాణ ప్రగతిలో సరి కొత్త అధ్యాయం-అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్దికి సంకేతం. 

ఎనమిదేళ్లలో….

ఎనమిదేళ్లలో ఎన్నో రంగాలలో అద్భుత విజయాలు- అన్ని రంగాలలో కళ్ల ముందు కదలాడుతున్న ఆవిష్కరణలు.

ప్రశంసలే..ప్రశంసలు:

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పతకాలు- – అన్ని రాష్ట్రాలనుంచి ప్రశంసలు. 

రూపురేఖలు:

ఎనమిదేళ్లలో తెలంగాణ అంతటా మారిన రూపురేఖలు-

 దార్శనికుడి పాలనలో అభివృద్ధికి కొత్త తరం ఆవిష్కరణలు.

సామాన్యులకు ఒకటే లక్ష్యం వుంటుంది. అసామాన్యులకు నిరంతరం లక్ష్యసాధన అలవడుతుంది. ఒకనాడు తెలంగాణ సాధిస్తే చాలు అనుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌,నేడు దేశమంతా సుభిక్షంగా వుండాలని అనుకుంటున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా జరిగిన విధ్వంసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఎనిమిదేళ్ళలో పూరించగలిగాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు అంటే నో అన్నారు. సాధ్యం కాదన్నారు. చెరువుల బాగు పట్టించుకోలేదు. ఇలా అన్ని రంగాలలో తెలంగాణ వెనుకబాటుకు గురిచేశారు. విద్యారంగంలో చిన్న చూపు చూశారు. వైద్యరంగాన్ని కుదేలు చేశారు. తెలంగాణ ప్రజలకు వైద్యం అవసరమైనంత మేర అందుబాటులోకి తేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా ఆపలేనన్ని గోసలు పడిరది తెలంగాణ. మరి ఇన్ని గోసలు ఎనమిదేళ్లలో ఎలా తీరాయి? అంటే నాయకుడిలో చిత్తశుద్ధి కావాలి. లక్ష్యశుద్ది కావాలి. అంకిత భావం వుండాలి. నా ప్రజలు అన్న ప్రేమ కావాలి. పదవుల కోసం రాజకీయాలు చేస్తే అభివృద్ధి జరగదు. ప్రజా సేవ కోసం, శ్రేయస్సు కోసం, ప్రగతి కోసం, సమసమాజ నిర్మాణం కోసం నాయకుడు పరితపిస్తే ఏ దేశమైనా బాగుపడుతుంది. అది తెలంగాణ విజయవంతం చేసి నిరూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ ది. అందుకే కేసిఆర్‌ దేశం కోసం బయలు దేరింది. తాను తెలంగాణ తెచ్చి, అభివృద్ధి అంటే ఇది…నాయకుడు ఇలా వుండాలి. ప్రభుత్వాలు ఇలా పని చేయాలని చూపించారు. ప్రగతి మన కళ్ల ముందు వుంచారు. ప్రజల కన్నీళ్ళు తుడిచారు. సంతోషం నింపారు. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురించి ఒక వ్యక్తిగా నా అభిప్రాయం వ్యక్తం చేయడం నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయినా ఒక ప్రభుత్వ అధికారిగా జరిగిన అభివృద్ధిని చెప్పడం కూడా నా కర్తవ్యంలో కూడా భాగమే…నేను జరిగిన ప్రగతిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.

నిన్నటి గోసను ఈ తరానికి వివరిస్తున్నాను. మన తరానికి గుర్తు చేస్తున్నాను. అది తప్పుకాదు. చెడును చెడు అని చెప్పడమే హక్కా? మంచిని చెప్పడం తప్పా?? మంచిని మంచి అని కూడా చెప్పలేకపోతే చేతగాని తనమౌతుంది. అందుకే నేను ఏమనుకుంటున్నానో, నా మనసు స్పందనను, అభిప్రాయం ఒక వ్యక్తిగా వెల్లడిరచండం తప్పు కాదు. అదే తెలంగాణ ధైర్యం…నాకు నేర్పిన కర్తవ్యం. అని అంటున్న గడల శ్రీనివాస్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు చిట్‌ చాట్‌… 

ఆరోగ్య తెలంగాణ. ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వ విజయం. దళితబంధు. దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక. కాళేశ్వరం. సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు.మిషన్‌ భగీరథ సురక్షితమైన మంచినీటి సరఫరా. ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక.మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు.

సాగునీటి యజ్ఞంలో తెలంగాణ తొలి అడుగులు. సాగుబడిలో కొత్త రకం వంగడాలు. తెలంగాణలో మేలిమిరకం విత్తనాలు. తెలంగాణ విత్తన భాండాగారం. ఆదర్శవంతమైన సాగు నిర్మాణం. ఆసరా పథకం. తెలంగాణ ఆత్మకు ఆవిష్కరణ. ముదిమి వయసు జీవితాలకు నగదు భరోసా. కళ్యాణ లక్ష్మి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ కానుక. కళ్యాణ లక్ష్మి పథకంతో ఆ కుటుంబానికి ఆసరా.కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే ఒక అద్భుతం- ఎగువ ప్రాంతాలకు నీటితో జలాభిషేకం.కాళేశ్వరం. సాగునీటి రంగంలో ఆధునిక దేవాలయం. ప్రాజెక్టుల నిర్మాణంలో తలమానికం. మహిమాన్వితమైన యాదాద్రి పునర్‌ నిర్మాణం-సుందరశోభిత వైభవం చరిత్రలో చెరగని తెలంగాణ సంతకం. తెలంగాణలో పారిశ్రామిక వెలుగులు. 

ఐటి రంగ ఎగుమతుల్లో సరికొత్త విజయాలు. సత్వర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్‌ వన్‌. 

 పరిపూర్ణ వికాసంతో అన్ని రంగాలల దేశానికే ఆదర్శం. దార్శనికుడు కేసిఆర్‌ పాలనలో తెలంగాణ ప్రగతిలో సరి కొత్త అధ్యాయం. అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్దికి సంకేతం. ఎనమిదేళ్లలో ఎన్నో రంగాలలో అద్భుత విజయాలు. అన్ని రంగాలలో కళ్ల ముందు కదలాడుతున్న ఆవిష్కరణలు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పతకాలు. అన్ని రాష్ట్రాలనుంచి ప్రశంసలు. ఎనమిదేళ్లలో తెలంగాణ అంతటా మారిన రూపురేఖలు. అభివృద్ధికి కొత్త తరం ఆవిష్కరణలు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ పరుగులు . పవర్‌ హాలిడే లేని ప్రగతికి బాటలు. స్వీయ పాలనలో సిరుల వెలుగులు,ఎనమిదేళ్ల కేసిఆర్‌ పాలనలో సాగు, నీటి రంగాలలో పరుగులు. ఆరేళ్లలోనే తెలంగాణ స్వయం సమృద్ధి ఫలాలు, దేశమే ఆశ్చర్యపోయే ఆదర్శాలే సంక్షేమ ఫథకాలు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ. పల్లె వికాసమే దేశ వికాసం. పచ్చదనం నిండి, ప్రకృతి పరవశంతో నా తెలంగాణ సిరులారబోసుకుంటోంది. పసిడి పంటలకు నెలవౌతోంది. పాడి పంటలకు మిలితమైన సాగుతో అలరాలుతోంది. తెలంగాణ రైతన్నలో ధైర్యం నిండిరది. వారి మోములో చిరునవ్వు తొనికిసలాడుతోంది. తొలకరి పులకింతలు సాగు కెంత సంబరమో, పారే నీరు చూస్తే రైతుకంత సంతోషం. ఆ రైతు మేలు కోరే పాలన తెలంగాణ సొంతం. రైతే పాలకుడైతే రైతులకెంతో ఆనందం… ప్రకృతి శోభలో అలరాడుతున్న తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరంటు, పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, కళ్ల ముందు ధాన్యపు రాశులు, కొట్టం నిండా పాడితో దేశమే అబ్బురపడుతోంది. తన కన్నీటి పొరలలో నాలుగు దశాబ్దాల పాటు దాచుకొని, తెలంగాణ సాధించి పచ్చని మాగాణ ఆవిష్కరించిన ఏకైక నేత ముఖ్యమంత్రి కేసిఆర్‌… సంక్షేమాలన్నీ ఏక కాలంలో ప్రజలకు అందిస్తున్న ఏకైక పాలకుడు కేసిఆర్‌. ప్రగతి దారుల్లో పారిశ్రామిక పరుగులు. తెలంగాణ సాగులో విప్లవాత్మక విజయాలు. ఒక్క తెలంగాణలోనే సాక్ష్యాత్కారాలు… పచ్చని ప్రకృతిలో పుడమి పులకించడం జాతి గర్వానికి నిదర్శనం. ఇది ఇప్పుడు మన తెలంగాణ ముఖచిత్రం. తెలంగాణ సౌభాగ్యం దేశమంతా ఆవిష్కరించాలి. దేశానికి కేసిఆర్‌ నాయకత్వం కావాలి. తెలంగాణ ప్రగతి దేశ వ్యాప్తం కావాలి. సుభిక్షం మన సొంతం కావాలి. మన దేశం ప్రపంచంతో పోటీ పడాలి. అభివృద్ధి చెందిన భారత్‌ అని అందరం సగర్వంగా చెప్పుకునే రోజు రావాలి.

విద్యుత్‌ వెలుగుల విప్లవం- ఉత్పాదిత తెలంగాణలో నవశకం.

 చీకటి కాలం నుంచి వెలుగుల లోకంలోకి……అవును తెలంగాణ చీకటిలో మగ్గిన కాలం పోయింది. తెలంగాణ లో నిరంతర వెలుగుల కాలమొచ్చింది…తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే అది సుసాధ్యమైంది…ఇరవై నాలుగు గంటలపాటు కోతలు, వాతలు లేని వెలుగులు తెలంగాణ చూస్తోంది… వెండి వెలుగులలో వెలిగిపోతోంది. పారే నీరు, నిండే చెరువు, పచ్చని పొలాలు, పసిడి పంటలు, పల్లెల్లో ఆకుపచ్చవర్ణ శోభితాలు, గెలిచి నిలిచిన తెలంగాణ ముఖ చిత్రాలు ప్రగతి సాకారాలు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలకు ప్రతిరూపాలు. ఒకనాడు ఎండిన పొలాలు…నేడు నిండైన పంట సిరులు… నిన్న తుమ్మలు మొలిచిన చెరువులు..నేడు నిండైన గంగాళాలు…పెరిగిన భూగర్భ జలాలు… దారి వెంట నీటి పరవళ్ళు… కాలువల నిండా జల సవ్వళ్లు…పల్లెల్లో గోదారి గలగలలు. తెలంగాణ అంతటా సంబురాలు. సంక్షేమ పథకాలు కూడా వెల్లువలా అమలు…అన్నపూర్ణ తో మొదలైన పథకాలు బంగారు తెలంగాణలో నిరంతర వెలుగులు. తెలంగాణ సాధనతో అద్దిన వన్నెలు…ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలల రూపాలకు నిదర్శనాలు. ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎనలేని కీర్తి కిరీటాలు. అద్భుతమైన విజయాలకు తార్కాణాలు. ఆసరా పథకం ఫించన్లు- ముదిమి వయసులో ఆత్మగౌరవ ప్రతీకలు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి పచ్చని తోరణాలు- కళ్యాణ లక్ష్మి పథకంతో విరబూస్తున్న సప్త వర్ణాల హరివిళ్లు. సమగ్ర సర్వతోముఖావృద్ధిలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రం-

అన్ని రంగాలలో పరిపూర్ణ వికాసం దేశానికే ఆదర్శం. అరవైఏళ్ల గోసను అధిగమించి వెండి వెలుగులు – అన్ని రంగాలలో తెలంగాణ ఆవిష్కరణలు

నీటి గోసలు తీరి, తెలంగాణలో పసిడి పంటల సిరి-సాగు నీటి రంగంలో విప్లవాత్మక విజయాల జలరaరి.పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ పరుగులు – చీకట్లను తరిమిన విద్యుత్‌ వెలుగులు. దార్శనికత కలిగిన కేసిఆర్‌ నాయకత్వం- తెలంగాణ ప్రగతికి సోపానం. గోసపడ్డ చోట నీటి సవ్వడులు- ఎనమిదేళ్ల స్వపరిపాలనలో అన్ని రంగాలలో పరుగులు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఫలాలు- దేశమంతటా కొనియాడుతున్న సంక్షేమ పథకాలు. ఎనమిదేళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు-

 యోధుడి పాలనలో ప్రగతి పథం పరుగులు. మన నీళ్లు,మన నిధులు, మన కొలువులు మనకే-ఎనమిదేళ్ల స్వీయ పాలనలో అరవై ఏళ్ల ప్రగతి కళ్లెదుటే!! స్వయం సమృద్ధిలో అన్నింటా తెలంగాణ ముందంజ- దేశమంతా ఆశ్చర్యంతో చూస్తుండే మన వంక. కాళేశ్వరం సాగునీటి రంగంలో ఒక మహాద్భుతం, ఆధునిక ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ తలమానికం.మహిమాన్విత శోభిత యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణం,తరతరాల తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయం.పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ పరుగులు,ఐటి రంగంలో విప్లవాత్మక వెలుగులు. ఎనమిదేళ్ల స్వీయ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు,భవిష్యత్తు తరం కనే పసిడి కలలకు ప్రతిరూపాలు.ఎనమిదేళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు-యోధుడి పాలనలో పల్లె, పట్నం ప్రగతి పరుగులు. పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. పల్లె వికాసమే దేశ వికాసమని నాయకులు నమ్మితే చాలు పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువలేకుండా పోతుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలో ధైర్యం కనిపిస్తుంది. వారి మోములో చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనే పేరు వినగానే పులకించేది పల్లెనే…రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి. రైతే పాలకుడైతే తెలంగాణ కళ్లముందు ప్రకృతి శోభ, పంటల రాశులు, పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, కొట్టం నిండా పాడితో ప్రపంచమే అబ్బురపడుతుంది. ఇదంతా తన కన్నీటి పొరలలో నాలుగు దశాబ్దాల పాటు దాచుకొని ఆవిష్కరించిన ఏకైక నేత ముఖ్యమంత్రి కేసిఆర్‌… భీడువారిన భూములను పచ్చని మాగాణం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధర పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, మరోవైపు పారిశ్రమలు, సంక్షేమాలన్నీ ఏక కాలంలో ప్రజలకు అందిస్తున్న ఏకైక పాలకుడు కేసిఆర్‌. దేశంలో ఎక్కడా లేని ప్రగతి, పారిశ్రామిక పరుగులు, సాగు విప్లవాలు ఒక్క తెలంగాణలోనే సాక్ష్యాత్కారాలు… పచ్చని ప్రకృతిలో పుడమి పులకించడమంటే జాతి తలెత్తుకొని గర్వంగా బతుకుతున్నదని అర్థం. ఇది ఇప్పుడు మన తెలంగాణ ముఖచిత్రం. దేశ సౌభాగ్యంలో కూడా తెలంగాణ ఆవిష్కరణలు కావాలి. రావాలి. అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం దేశాన్ని ఏలే నాయకుడవ్వాలి. దేశంలో అరవై వేల టిఎంసిల నీరున్నా సాగు సాగలేకపోతోంది. సక్షేమం గతి తప్పుతోంది. అదుపులేని ధరలు, అంతులేని పేదరికంతో కోట్లాది మంది ఆకలికి అలమటిస్తున్నారు. వారి బతుకులు బాగు పడాలన్నా, వారి జీవితాలలో వెలుగులు నిండాలన్నా దేశానికి కేసిఆర్‌ నాయకత్వం కావాలి. తెలంగాణ ప్రగతి దేశ వ్యాప్తం కావాలి. దేశమంతా సుభిక్షం కావాలి. దేశం ప్రపంచంతో పోటీ పడాలి. అభివృద్ధి లో కళకళలాడాలి. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ… ఊర్లన్ని వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతి వృత్తులు మాయమైపోయి దిక్కులేని బతుకుల కాలమది. ఆ సమయంలో ఏ పొలం చూసినా బీడువారి నోరు తెరిచించే…ఏ చెలక చూసి ఎడారే…చెరువుల ఆనవాలు పోయి, తుమ్మలు మొలిచి నీటి కటకటలే. వానాకాలమొస్తే చెరువన్నా నిండితే, ఊటలు పెరిగి బావులు నిండేది. సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ కకావికలమైంది. చెరువులు ఆగమైనవి. కొన్ని ఆనవాలు లేకుండా పోయాయి. భూములు బీడువారాయి. పల్లెలు రూపు చెదిరిపోయాయి. సొంత రాష్ట్రంలో పరాయి బతుకులయ్యాయి. ద్వితీయ శ్రేణి పౌరుల కింద లెక్కలయ్యాయి. విద్య లేదు. ఉపాధి లేదు. కొలువు రాదు. చుక్క నీరు లేదు. పంటలకు దిక్కులేదు…కొట్లాడినా లాభం లేదు…పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాలలో కానరాని ప్రగతి…! కానీ అదే సీమాంధ్ర నిండా నీటి సవ్వడి…ప్రాజెక్టుల వడివడి…రోడ్లు రువ్వడి…సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపాన్ని దిగమింగుకొని బతికిన రోజులవి…ఆ రోజులనుంచి తెలంగాణ విముక్తి కాబడిరది. తెలంగాణ సాధనతో విముక్తి కాబడిరది. పారే వాగులో చుక్క నీరు లేక నా కంట కన్నీరు జలజలా రాలుతుంటే ఎత్తుకున్న తెలంగాణ జెండా దించలేదు,…బిగిసిన పిడికిలి విప్పలేదు…పుబ్బ, మగ అని ఎగతాళి చేసిన తెలంగాణ నినాదం విడువలేదు…పట్డిన పట్డు విడువకుండా ఒక్కడుగా మొదలై, కోట్ల మంది తెలంగాణ గొంతుకలై కొట్లాడిన… తెలంగాణ సాధించారు…పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం, నిర్విరామ ఉద్యమ ప్రస్థానం సాగించి తెలంగాణ సాధించారు. రక్తపు చుక్క నేల రాలకుండా తెలంగాణ సాధించి అరవై ఏళ్ల కల నిజం చేశారు…తెలంగాణ వచ్చిన మూడు నెలలో రెప్పపాటు కోత లేని కరంటు ఇచ్చారు..సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కరెంటు సక్కగ చూసింది లేదు..పగటి పూట దిక్కులేదు…తెల్లందాక సక్కగ వచ్చింది లేదు. ఇక రైతు గోస చెప్పుకుంటే రామాయణం, రాస్తే భారతం.. రైతాంగానికి ఇచ్చే కరంటు అర్థరాత్రి, అపరాత్రి ఎప్పుడు అర్థ గంట ఇచ్చింది లేదు…రైతులంతా రాత్రిళ్లు పొలాల కాడ జాగారం… ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన రోజులు. పాము కాటేస్తదో, తేలు కుడుతదో భయం, భయం బతుకులు…మరి ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని కరంటు వెలుగులతో కళకళలాడుతున్నది తెలంగాణ. సాగుకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా….మిషన్‌ కాకతీయ తో తెలంగాణ లోని నలభైఆరు వేల చెరువుల పునరుద్ధరణ… మళ్ళీ కాకతీయ కాలం కళ్ల ముందు ఆవిష్కరించారు. చెరువులన్నీ నిండుగ…ఎండా కాలంలో మత్తళ్లు దుంకంగ…వాగులూ, ఒర్రెలు గోదారి జలాలతో పారంగా, తెలంగాణలో నీటి సుడుల సవ్వడి…జలజలగలగలు. కలలో కూడా కల గనని తెలంగాణ కళ్లముందు నిజ ప్రపంచమైంది…సంక్షేమం లో మేటి…ప్రగతిలో లేదు తెలంగాణకు ఏదీ పోటీ…అన్నట్లు పచ్చని పందరిలా పరుచుకున్న తెలంగాణ ఆవిష్కరించారు…కాళేశ్వరంతో తెలంగాణ చరిత్ర పదిలం చేశారు.. మిషన్‌ భగీరథ తో తెలంగాణ పల్లెలకు గోదావరి నీటి తో గొంతు తడిపిన…ఆడపడుచుల కాళ్లు కడిగారు…సస్యశ్యామల తెలంగాణ లో బంగారు సిరులు పండిరచారు…ఆసరా ఫించన్లతో వయసు మళ్లిన వారి జీవితాలలో వెలుగులు, ఆ కుటుంబం చింతలు తీర్చిన…స్వపరిపాలనలో ఆత్మ గౌరవం వెల్లివిరిసేలా చేశారు…నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వాళ్లు అబ్బురపడేలా తలెత్తుకున్న తెలంగాణ కళ్లముందు ఆవిష్కరించారు….భవిష్యత్తు తరాలకు నీటి గోసలు లేకుండా చేశారు..ఎనమిదేళ్లలో అద్భుతాలు చేసి తెలంగాణకు వన్నెలద్దిన నాయకుడు కేసిఆర్‌. ఇప్పుడు దేశంలో ప్రగతి విప్లవం కోసం అడుగులు వేస్తున్నాడు…అందరూ ఆయన అడుజాడల్లో నడవాలనుకుంటున్నారు.

ఆశ్రమ నిర్మాణానికి ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం వారి నగదు సహాయం.

చందుర్తి, నేటిధాత్రి:
యువచైతన్య దీపం ఫౌండేషన్ వారు చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగంగా
వారు నిర్మాణం చేపడుతున్న ఆశ్రమానికి
ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం స్పందించి
వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ కొరకు
భోగ వేణుగోపాల్, గడ్డం శ్రీనివాస్, అలువాల విష్ణు దాతల సహాయంతో 3000 రూపాయలు
అందించడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో వనపర్తి సతీష్, బోరుగాయ తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వనపర్తి లో 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి:-(నేటి ధాత్రి) వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఈ నెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘనాథం ,ఈ.వో.ఏస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 31 న శనివారం కదంబ నివేదన నుండి 12 వ తేది వరకు గోదా అమ్మవారి నిరాటోత్సవములు,‌ 8 న ఆదివారం పోత్తి పాశురం, శ్రీ స్వామి వారికి మంగళహారతులతో 11న కూడారై ఉత్సవము,108 గంగాళములతో స్వామి వారికి పాయసం నివేదన 2న శ్రీ వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) ఉదయం 4:00గం నుండి గరుడ వాహన సేవా తదుపరి ఉత్తర ద్వారా పూజ ఉత్తర ద్వార దర్శన 14న ఉదయం 10 గంటల నుండి శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణోత్సవము 5 నా శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ స్వామి వారి నామార్చన ఉంటుందని వారు తెలిపారు . ఈ ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్వామి కృపకు పాత్రులు కాగలరని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అవార్డు గ్రహీతలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన

వనపర్తి:-(నేటి ధాత్రి) రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉత్తమ సేవలకు గాను బంగారు పథకాలు సేవ పథకాలు సాధించిన జిల్లా కలెక్టర్,జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ.సీ.ఈ.వోలకు, ఐ.డి.ఓ.సీ సమావేశం మందిరంలో అవార్డ్ గ్రహితలకు ఆహ్వాన పత్రికలు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఖాజాకుత్పుద్దీన్ అందజేసారు.

సుసంపన్నం…సుభిక్షం…కేసిఆర్‌ తోనే సాధ్యం.

`సమస్యలు తెలిసినప్పుడే పరిష్కారం.

`సామాన్యులకు అండగా వుండడమే నాయకత్వం.

`పేదల జీవితాలలో వెలుగులు నింపడమే పరమార్ధం.

`ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే సేవాభావం.

`దేశమే వసుదైక కుటుంబం. 

`ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి.

`ఆర్థిక అసమానతలు తగ్గాలి.

`సమసమాజ స్థాపన జరగాలి.

`సంతులిత ప్రగతి కావాలి

.`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి.

`ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలని.

`ముఖ్యంగా స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి.

`కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సుసంపన్నమైన భారతావణి నిర్మాణం జరగాలి. సుభిక్షమైన భవిష్యావని నిర్మింపబడాలి. పేదరికం పారద్రోలాలి. ఆకలి లేని వ్యవస్థ సృష్టించాలి. పౌష్టికాహార లోపం లేని సమాజం కావాలి. అన్ని వర్గాల అభ్యున్నతి కాంక్షలు నెరవేరాలి. సమసమాజ నిర్మాణం జరగాలి. ఇదీ సగటు భారతీయుడు కలలు గనేది. సగటు వ్యక్తి ఆలోచనలు వ్యక్తం చేసేది. తరతమ బేధాలు రూపుమాసిపోవాలి. అందరం ఒక్కటే అనే భావన చిగురించాలి. అందుకు అర్థిక అసమానతలు తగ్గాలి. పాలకులు అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలి. ఇది కేసిఆర్‌ లక్ష్యం. 

   తెలంగాణ ప్రగతి ఆదర్శంగా దేశమంతా వెలుగులు నిండాలి.

 నాయకత్వంలో చిత్తశుద్ధి వుంటే, దేశ గతి మారుతుందనడంలో సందేహం లేదు. నాయకుడు సమస్యలు చూసి చలించినప్పుడే పరిష్కారం అవుతాయి. నాయకుడికి ప్రజాక్షేత్రం తెలియాలి. ప్రజల నుంచి నాయకుడు ఉద్భవించాలి. అవకాశాలు కలిసివచ్చి నాయకుడైన వారికి ప్రజా సమస్యలు తెలియవు. ప్రజల బాధలు తెలియవు. ప్రజల కష్టాలు తెలియవు. వారు పడుతున్న వేధన చూడరు. ఎంత సేపు వందిమాగధులు చెప్పే విషయాలే అనుసరిస్తుంటారు. అనుచరులు చేసే భజనలు ఆలకిస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలో అదే జరుగుతోందనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చి నోట్ల రద్దు సమయంలో ప్రజలను ప్రధాని మోడీ చెప్పిన మాట ఏమిటి? ప్రజలు అనుభవించిన బాధలేమిటి? 1975 లో వచ్చిన జనతా ప్రభుత్వం కూడా అప్పటి పెద్ద నోట్లు రద్దు చేసింది. నాటి ప్రధాని మురార్జీ దేశాయి కూడా ఏదో జరుగుతుందనుకున్నాడు. కానీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. పర్యవసానంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీని ఓడిరచిన ప్రజలే మళ్ళీ ఆమె నాయకత్వాన్ని కోరుకున్నారు. అప్పుడు పెద్ద నోట్లు ఎక్కువగా సంపన్నుల చేతిలోనే వుండేవి. కానీ ఈసారి సామాన్యుల చేతిలోనూ నిత్యం కనిపించే నోట్ల రద్దు మూలంగా దేశం మొత్తం ఒక్కసారిగా అతలాకుతలమైంది. అయినా ప్రజలు భరించారు. దేశంలో నల్లదనం లేకుండా పోతుందనుకున్నారు. విదేశాలలో వున్న నల్లదనం తేవొచ్చన్నారు. కానీ నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడిన సంపన్నుడు ఒక్కడు కూడా లేడు. సామాన్యులే కష్టాలు పడ్డారు. నోట్ల రద్దు కష్టాలనుంచి ఇప్పటికీ సామాన్యులు బైటపడలేదంటే అతిశయోక్తి కాదు. ఇక దేశం మొత్తం ఒకటే పన్ను విధానం అంటే సామాన్యులు ఎంతో సంతోషించారు. అర్థరాత్రి వేళ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ ముస్తాబు చేసి, జిఎస్టీ అమలు ప్రకటిస్తే దేశంలో చీకట్లు తొలగిపోతాయనుకున్నారు. అర్థరాత్రి మరో స్వతంత్రం అని భావించారు. దానిని గొప్పగా బిజేపి నేతలు ఊదరగొట్టారు. ప్రధాని మోడీ సైతం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అన్నాడు. ఏమైంది.. ప్రజల జీవితాలను నేలనాకించాడు. సామాన్యడు చతికిల పడ్డాడు. విలవిలలాడుతున్నాడు. ధరలు విపరీతంగా పెరిగాయి. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. నోట్ల రద్దుతో విదేశాలలో నల్లదనం తిరిగివస్తుందని నమ్మించినట్లే, జిఎస్టీ పేదలకు మేలు జరుగుతుందన్నారు. పేదవారి కలలు చెరిపేశారు. అశలు కూల్చేశారు. ఉపాధి లేకుండా చేశారు. బతుకు మీద భరోసా లేకుండా చేశారు. భవితవ్యం శూన్యం చేశారు. పన్ను ఎగవేత దారులకు చుక్కలు కనిపిస్తాయని ప్రచారం చేశారు. ప్రజలకు ఇక మంచి రోజులొచ్చినట్లే అన్నారు. పేదల జీవితాలు తలకిందులు చేశారు. ఇదీ ప్రజల మధ్య లేని నాయకులు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం.

అదే ప్రజల నాయకుడు, ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడి పాలన తెలంగాణ లా వుంటుంది. 

ఆ నాయకత్వం కేసిఆర్‌ లా సేవనందిస్తుంది. పేదల రాజ్యం నిర్మాణమౌతుంది. సామాన్యులకు అండగా వుండడమే అసలైన నాయకత్వం. అది ఈ తరంలో కేసిఆర్‌ సొంతం. అసలు సాధ్యం కాదనుకున్న తెలంగాణ సాధించాడు. మహా నాయకుడుగా కీర్తికెక్కాడు. గతంలో ఎంతో మంది చేతులెత్తేసిన తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపిరులూదాడు. ఒక్కడుగా మొదలై లక్షలాది మంది కేసిఆర్‌ లను తయారు చేశారు. కోట్లాది గొంతుకలతో తెలంగాణ అనిపించారు. నినదించారు. ఎత్తిన పిడికిలి దించకుండా పద్నాలుగేళ్లు ఉద్యమ ప్రస్థానం సాగించాడు. పంతం పట్టి తెలంగాణ సాధించాడు. ఇదీ ప్రజల్లో నుంచి ఉద్భవించిన నాయకుడు చేసే పని. అదీ కేసిఆర్‌. 

తెలంగాణ వస్తే పేదల జీవితాలలో వెలుగు నిండుతాయని కేసిఆర్‌ కు తెలుసు. 

తెలంగాణ సాధించి తెలంగాణ నిధులను వినియోగించి అధ్భతాలను సృష్టించొచ్చని కేసిఆర్‌ కు తెలుసు. అందుకే పేదల జీవితాలలో వెలుగులు నింపాడు. అన్ని వర్గాల ప్రజల జీవితాలతో మార్పులు తీసుకొచ్చాడు. రేషన్‌ సీలింగ్‌ తొలగించి కుటుంబంలో ఎంత మంది వుంటే అంత మందికి బియ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఇలా మొదలైన వెలుగుల విప్లవం కరంటు తెచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చూద్దామన్నా కనిపించని కరంటు, తెలంగాణ లో పోతే చూద్దామన్నా అవకాశం లేదు. అసలు తెలంగాణ వచ్చినా ఇలాంటి రోజులు చూస్తామని ఎవరూ అనుకోలేదు. రాదన్న తెలంగాణను కేసిఆర్‌ ఎలా సాధించాడో, తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు. ఇదీ ఒక నాయకుడు చేసే పని. ఇదీ చరిత్రలో నిలిచిపోయే పని. ఇలాంటి పనులు చేస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆదర్శమూర్తులౌతారు. 

 దేశమే వసుదైక కుటుంబం. 

 ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఆర్థిక అసమానతలు తగ్గాలి. సమసమాజ స్థాపన జరగాలి. సంతులిత ప్రగతి కావాలి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి. ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నదే కేసిఆర్‌ ఆశయం. ముఖ్యంగా దేశంలో పెరిగిన స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి. కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి. తెలంగాణ రాకముందు తొండలు గుడ్ల పెట్టే నేలలని సీమాంధ్రులు ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ భూములు కోట్లు పెట్టినా దొరకడం లేదు. కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన విజన్‌. ఆయన సాధించిన తెలంగాణ. నీళ్లు తెచ్చాడు. పొలాలు తడిపాడు. బంగారు పంటలు పండేలా చేశాడు. తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణ చేశాడు. అదే పని ఇప్పుడు దేశమంతా చేయాలని సంకల్పిస్తున్నాడు. దేశమంతా సస్యశ్యామలం కావాలంటున్నాడు. బిఆర్‌ఎస్‌ కు ఒక్క అవకాశం ఇస్తే దేశంలో సాగు విప్లవం తెస్తానంటున్నాడు. రైతు కలలుగనే దేశ నిర్మాణం సాగించాలనుకుంటున్నాడు. రాజకీయాలలో సరికొత్త పంథాను అనుసరించి, అభివృద్ధి మేళవించి, అద్భుత ప్రగతిని అన్వయించి రైతు రాజ్యమే అసలైన రామ రాజ్యమని నిరూపించనున్నాడు.

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2022

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం జరిగింది 2022 సంవత్సరంకు చేసిన సేవలు గాను సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అభినందించారు

రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్‌ నినాదం

` రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్‌ విధానం.

` రైతు ప్రగతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం.

`రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్‌ సంకేతం.

` రైతు కోసమే బిఆర్‌ఎస్‌… రైతు నాయకుడే కేసిఆర్‌.

`దేశమంతా సస్యశ్యామలం కావాలి.

` రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి.

`సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి.

`దేశమంతా బంగారు పంటలు పండాలి.

`ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి.

`ఆకలి రాజ్యం తీరాలి.

`ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి.

`దేశమంతా రైతుకు ఉచిత విద్యుత్‌ అందాలి.

` రైతు బంధు దేశమంతా అమలు కావాలి. 

`జై కిసాన్‌ అనే నినాదం దేశమంతా వినిపించాలి.

` కేసిఆర్‌ నాయకత్వానికి జేజేలు పలకాలి.

`ప్రధానిగా కేసిఆర్‌ డిల్లీ పీఠం మీద కూర్చోవాలి.

`బిఆర్‌ఎస్‌ దేశంలోనే సంచలన రాజకీయ శక్తిగా వెలుగొందాలి.

`దేశమే గులాబీ మయమై గుభాలించాలి.

`బిజేపిని ఎదుర్కోవడంలో బిఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అని నిరూపింపబడాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 దేశ రాజకీయాలలో నవ శకం చిగురించబోతోంది. ఈ విషయం నేటిధాత్రి ఎప్పటినుంచో చెబుతూనే వస్తోంది. బిఆర్‌ఎస్‌ రూపంలో దేశ రాజకీయాలను సమూలంగా మార్చబోతోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించబోతోంది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో సరికొత్త వేధిక ఆవిష్కరింబడిరది. కొత్త తరం రాజకీయాలకు పురుడుపోయనుంది. సంపన్న వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న కుహనా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పనుంది. పేదల కేంద్రంగా, రైతుకు భరోసానిచ్చే బిఆర్‌ఎస్‌ పాలన రాబోతోంది. దేశాన్ని ఆలోచింపజేయనుంది. యువతను కదిలించబోతోంది. నమ్మి బిజేపిని గెలిపిస్తే పేదల జీవితాలను ఆగమ్యగోచరం చేయడాన్ని ప్రశ్నించనుంది. దేశ ప్రజలు ఆలోచించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేయబోతోంది. 

ప్రపంచంలోని అన్ని దేశాలలో రైతు నిశ్చింతగా బతుకుతున్నాడు.

 చింత లేకుండా కాలం వెల్లదీస్తున్నాడు. ఆయా దేశాలకు అన్నం పెడుతున్నాడు. గౌరవంగా బతుకుతున్నాడు. ప్రభుత్వాలనుంచి సబ్సిడీలు అందుకుంటున్నాడు. కొత్త కొత్త యంత్రపరికరాలతో నూతన సాగు విధానాలు అవలంబిస్తున్నాడు. సాగు దిగుబడిలో విప్లవాలు సృష్టిస్తున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధరతో రాజులాగా బతుకుతున్నాడు. మరి మన దేశంలో రైతు చింత చెందుతున్నాడు. సాగు చేయాలంటే కలత చెందుతున్నాడు. సాగు వదిలేయలేక కుమిలిపోతున్నాడు. ప్రకృతి వ్యవసాయంతో దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యుగా బతుకుతున్నాడు. మన రైతు జీవితం మారాలి. రైతు ముఖంలో సంతోషం వెల్లివిరియాలి. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం. రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్‌ నినాదం.

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు దు:ఖించిన రాజ్యం ముందటపడదని అంటారు.

 అందుకే రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్‌ విధానంగా ఎంచుకున్నారు. స్వతాహగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ది రైతు కుటుంబం. రైతు పడే వేదన, అనుభవించే ఆవేదన ఆయన తెలుసు. దేశం సుభిక్షంగా వుండాలంటే రైతు సంతోషంగా వుండాలి. కోట్లు సంపాదించిన వాళ్కైనా ఆహారమే తినాలి. అది రైతే పండిరచాలి. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టినా, సాగు పరిశ్రమ కూడా అంతే విధంగా ఎదగాలి. ఏదైనా పరిశ్రమ నుంచి ఒక వస్తువు తయారై బయటకు వస్తే లాభపడేది కొందరే…కానీ రైతు ఒక గింజ పండిస్తే దాని ద్వారా లబ్ధి పొందేవాళ్లు ఎంతో మంది. ఈ విషయం పాలకులు గుర్తించకపోవడం వల్లనే నేడు రైతు డొక్క ఎండకపోతోంది. ఒక్క తెలంగాణలోనే రైతు సంతోషంగా వున్నాడు. అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయి. నేడు రైతును రాజును చేస్తున్నాయి. ఒకప్పుడు పాతిక ఎకరాలున్న రైతు కూడా బికారే…ఇప్పుడు ఐదెకరాల భూమి వుంటే కరోడ్‌ పతే. అందుకే తెలంగాణ రైతు సంక్షేమం దేశంలోని ప్రతి రైతు అందుకోవాలి. 

జై కిసాన్‌ అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. 

కానీ నిజంగా దేశంలోని రైతు గర్వంగా బతుకుతున్నాడా! సంతోషంగా వున్నాడా? లేడు. అందుకే రైతు ప్రగతే బిఆర్‌ఎస్‌ లక్ష్యంగా ఎంచుకొని ముందడుగు వేస్తోంది. దేశంలో ఇప్పటికీ 65 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సుమారు తొంభై శాతం ప్రజలు సాగు మీద బతికేవారు. సాగు స్థిరీకరణ పడిపోతోంది. రైతు బలవంతంగా ఇతర మార్గాలు ఎంచుకొని కూలీ జీవితాలు గడపుతున్నాడు. అందుకే మళ్ళీ సాగువైపు రైతు అడుగులు పడాలి. రైతు స్వతంత్ర జీవనం సాగించాలి. అది ఒక్క కేసిఆర్‌ ద్వారానే సాధ్యమౌతుంది. రైతుకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఎవరికీ లేదు. బిజేపి పార్టీకి అసలే లేదనేదే బిఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ. అందుకే రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. రైతు శ్రేయస్సే దేశ సౌభాగ్యం అనే నినాదం కేసిఆర్‌ ఎత్తుకున్నారు. రైతు కన్నీరు తుడిచేందుకు బయలు దేరుతున్నాడు. రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్‌ సంకేతం అని కేసిఆర్‌ ప్రకటించాడు. 

రైతు కోసమే బిఆర్‌ఎస్‌…

 రైతు నాయకుడే కేసిఆర్‌. దేశమంతా సస్యశ్యామలం కావాలి.రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి. సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి. దేశమంతా బంగారు పంటలు పండాలి. ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి. ఆకలి రాజ్యం తీరాలి.ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. దేశమంతా రైతుకు ఉచిత విద్యుత్‌ అందాలి. రైతు బంధు దేశమంతా అమలు కావాలి. జై కిసాన్‌ అనే నినాదం దేశమంతా వినిపించాలి. కేసిఆర్‌ నాయకత్వానికి జేజేలు పలకాలి. ప్రధానిగా కేసిఆర్‌ డిల్లీ పీఠం మీద కూర్చోవాలి.

 రాజకీయాలలో కొత్త పార్టీలు రావడం సహజం.

 టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ గా మార్చడంతో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ గా పేరు మార్పుతో జాతీయ పార్టీ అవుతుందా? అని కొందరు పెదవి విరుస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసినప్పుడు సరిగ్గా ఇలాంటి మాటలే వినిపించాయి. అదో ఉప ప్రాంతీయ పార్టీ అన్నారు. ప్రాంతీయ పార్టీ హోదా కూడా కష్టమే అన్నారు. ఏమైంది అన్న వారి నోళ్లు మూతబడ్డాయి. పుబ్బలో పుట్టి మగలో మాయమయ్యేదన్నారు. ఆ టిఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ సాధించింది. అలాగే బిఆర్‌ఎస్‌ కూడా. ఒక నాడు ఎలాంటి మాటలు వినిపించాయో అవే మాటలు ఇప్పుడూ వినిపిస్తున్నా, వాటికి, నేటికీ చాలా తేడా వుంది. అప్పుడు కేసిఆర్‌ ఒక్కరే…ఇప్పుడు ఆ ఒక్క కేసిఆరే…కాలం మారింది. ఇప్పుడు కేసిఆర్‌ దేశంలోనే బలమైన నాయకుడు. సంక్షేమ పాలన అందిస్తున్న పాలకుడు. ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు. అందుకే రానున్న రోజులు బిఆర్‌ఎస్‌ వే కానున్నాయి. బిఆర్‌ఎస్‌ దేశంలోనే సంచలన రాజకీయ శక్తిగా వెలుగొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

దేశమే గులాబీ మయమై గుభాలించాలి.

 దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు రావాలంటే బిఆర్‌ఎస్‌ కావాలి. పేదల రాజ్యం రావాలి అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు బిఆర్‌ఎస్‌ కు ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలు కూడా చూస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుని లాంటి నాయకుడు కేసిఆర్‌. ఆయన పట్టుపట్టారంటే ఎలా వుంటుందో దేశానికి కూడా తెలుసు. తెలంగాణ ఎలా సాధించాడో అందరం చూశాం. తాజాగా బిఆర్‌ఎస్‌ ఆవిర్భవ ప్రకటన సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కేసిఆర్‌ మా నాయకుడు అని ప్రకటించాడు. ఆయన నాయకత్వం మాకు కావాలన్నాడు. రైతు కష్టం తీరాలంటే కేసిఆర్‌ దేశ నాయకుడు కావాలన్నారు. ఈ ఒక్క మాట చాలు. దేశం కేసిఆర్‌ వైపు చూస్తోందని చెప్పడానికి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బిజేపిని ఎదుర్కొనే నాయకుడు దేశానికి అవసరం. ఆ పార్టీని ఎదుర్కొని నిలబడే ధైర్యం వున్న నాయకుడు కూడా కావాలి. ఆ రెండు లక్షణాలు పుష్కలంగా వున్న నాయకుడు కేసిఆర్‌. అందుకే దేశమంతా కేసిఆర్‌ వైపు చూస్తోంది. బిజేపిని ఎదుర్కోవడంలో బిఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తి అని నిరూపింపబడాలని జనం కోరుకుంటోంది.

సోషల్ మీడియా ద్వారా గ్రామ ఉపసర్పంచ్ ఆవేదన

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు చేశాడు. గ్రామ సర్పంచ్ భర్త ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరియు వార్డ్ నెంబర్ భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని తెలియపరిచాడు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీలో పలు ఆరోపణలు ఉన్నవని వార్డు మెంబర్లకు బదులు వారి భర్తలు సంతకాలు చేశారని, సర్పంచ్ సంతకం ఫోర్జరీ జరిగినదని,బిల్లులో బారి అవినీతి జరిగినది కాబట్టి రికార్డులపై సంతకాలు పెట్టను అన్నందుకు తనను ఉపసర్పంచ్ పదవి నుంచి తీసేస్తామని లేకుంటే నిన్ను చంపైన ఉప సర్పంచ్ పదవి లాకుంటామని వారు బెదిరించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

నా భూమి నాకు ఇప్పించండి

దేశరాజుపల్లి గ్రామ రైతు ఆవేదన

రామడుగు నేటిథాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్ముల బీరయ్య అలియాస్ గడియారాల బీరయ్య మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబరు: 462లో మొత్తం పదిహేను ఎకరాల పది గంటల భూమి ఉండాలి. కానీ నేడు అట్టి సర్వే నెంబరులో పదిహేడు ఎకరాల పైచిలుకుగా నమోదయింది. గ్రామ సర్పంచిపై అభియోగం చేసిన ఒగ్గరి లింగయ్యకు, మాకు, గ్రామ సర్పంచ్ లకు అట్టి సర్వే నంబరులో భూమి ఉంది. వాస్తవానికి ఈసర్వే నంబరులో ఒగ్గరి లింగయ్యకు నాలుగు ఎకరాల పదిహేను గుంటలు కొనుగోలు చేశాడు. అందులో నుండి ఎకరం ముపై గుంటలు ఇతరులకు విక్రయించి ఉన్నాడు. పహానిలో మార్పులు చేసుకుంటూ ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని తను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తనకు ఐదు ఎకరాల పైబడి భూమి ఉన్నదని తెలుపడం తప్ప మిగిలిన ఎటువంటి భూమికి ఆధారం లేదు. వాస్తవానికి అతనికి రెండు ఎకరాల ఇరవై ఐదు గుంటలు మాత్రమే ఉండాలి. ఇదే విషయమై మేము గ్రామ ప్రజలు సమక్షంలో గత పది సంవత్సరాలుగా సమావేశం ఏర్పాటు చేస్తే రాక పోగా అట్టి పెద్ద మనుషులని నేను చనిపోతారని బెదిరింపుల గురిచేసి చేస్తున్నాడు. కావున ఈ విషయంలో మండల రెవెన్యూ అధికారులు రికార్డులను సరిగా పరిశీలన చేసి న్యాయం చేయాలని కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లో టిప్పర్ లోని ఇసుక మాయం

అధిక లోడు తో వెళ్తున్న ఇసుక టిప్పర్ ను పట్టుకున్న మైనింగ్ అధికారులు.

పట్టుకున్న ఇసుక టిప్పర్ కు పొలీస్ స్టేషన్ కు తరలింపు. 

మైనింగ్ అధికారులు పట్టుకున్న టిప్పర్ లో ఇసుక మాయం చేసిన ఘనులు. 

పొలీస్ స్టేషన్లో పెట్టిన టిప్పర్ లో నుండి ఇసుక ఎలా మాయం అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..? 

తంగళ్ళపల్లి నేటిధాత్రి.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మానేరు వాగు నుండి అక్రమంగా అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పరు ను గురువారం వేకువ జామున మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ అధికారులు పట్టుకున్న ఇసుక టిప్పర్ ను స్థానిక మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించిన ఇసుక టిప్పరు అధిక లోడుతో ఇసుకను కలిగి ఉంది. మరసటి రోజు మధ్యాహ్నం ఇసుక టిప్పర్ నుండి సగం ఇసుక మాయం అవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాత్రంతా తిరుగుతూ కష్టపడి మైనింగ్ అధికారులు పట్టుకున్న పనికి పలితం లేకుండా పోయింది. మైనింగ్ అధికారులు పట్టుకోవడం ఇలా ఇసుక మాయం అవడం సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందు ఉంచిన ఇసుక టిప్పర్ నుండి ఇసుక మాయావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వాహనాలకే భద్రత కరువైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పనికి ఎవరైనా సహకరించారు అనే అనుమానాలు వస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైసలు ఇస్తేనే ఇంటి పర్మిషన్.. !?

తంగళ్ళపల్లి: నేటిధాత్రి 

 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పెచ్చు మీరుతున్న కొందరు అధికారుల ఆగడాలు. 

తనకు తెలియకుండా ఇంటి పర్మిషన్ లు ఇవ్వకూడదని కింది స్థాయి సిబ్బందికి అనాధికార ఆదేశాలు..? 

రాజకీయ నాయకుల అండదండలతో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్న వైనం. 

 

ప్రజాప్రతినిధులతో కలిసి జోరుగా మందు విందు పార్టీలు.

 

ఇంటి పర్మిషన్ కొరకు ఏడాది నుండి తిరిగిన దొరకని పర్మిషన్. 

 

చేతులు తడిపితే గాని… పని కానీ పరిస్థితి. 

 

మండలానికి బాస్ గా మారిన ఆ అధికారి..? 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కొందరు అధికారులకు పైసలు తడిపితే గాని పనులు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

 

 లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళా సంవత్సరం క్రితం ఇంటి నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోని కాళ్ళు అరిగేలా తిరిగిన పర్మిషన్ ఇవ్వడం లేదని మండల ఎంపీడీఓ కు పిర్యాదు చేసింది. 

 

ఇంటి నిర్మాణం పర్మిషన్ కావాలంటే 50 వేల రూపాయలు ఇస్తే ఇంటి పర్మిషన్ వస్తుందని బాధిత మహిళా ఎంపీడీఓ కు తెలిపింది. 

 

పిర్యాదు ను పరిశీలించిన ఎంపిడిఓ లచ్చాలు బాధిత మహిళాకు ఇంటి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో, సంవత్సరం నుండి మహిళాను ఎందుకు ఇబ్బంది పెట్టారో సంజాయిషీ అడుగుతూ అప్పటి గ్రామ సెక్రటరీ మౌనిక కు మెమో జారీ చేశారు. 

 

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన ఇంటి పర్మిషన్ ఫైల్ ఎంపీఓ ఛాంబర్ లో దొరకడం చర్చనీయాంశంగా మారింది.

నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష… నేడు స్వదేశ స్వావలంబన

మంత్రి హరీశ్ రావు ట్వీట్

నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో

సిఎం గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం..కేంద్ర మంత్రులు..నీతి ఆయోగ్ లు దేశానికి రోల్ మోడల్ , ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు.. 

 

రాష్ట్రం సాదించి అనేక రంగాల్లో అద్భుతమైన విజయం సాదించినట్లు గానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి..దేశంలో మార్పు తేవాలి అని సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన మహా యజ్ఞము ఇది. దేశ రాజకీయాల్లో మనం పోవాలని బి ఆర్ ఎస్ పార్టీ గా పేరు మారుస్తూ గత అక్టోబర్ నెలలో విజయ దశమి పర్వదిననా బి ఆర్ ఎస్ పార్టీ గా మారుస్తునట్లు ప్రకటించారు… నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పు ను దృవీకరించడం సంతోషకరం..

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు..

 

సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో రాష్ట్ర అభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకుందాం.. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దాం

రెడ్డి పేట గ్రామంలో పాఠశాల భవనానికి భూమి పూజ.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా…

అత్యాధునికమైన హంగులతో నిర్మాణం.

భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.

పాఠశాల నిర్మాణ దాత, అక్షర ప్రధాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి.

కామారెడ్డి జిల్లాలో మరో అద్భుతమైన మరో పాఠశాల నిర్మాణం కానున్నది. అక్షర ప్రధాతగా కీర్తి గడించిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం జరుగుతోంది. గురువారం కామారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతల మీదగా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాల నిర్మాణం జరగనుంది. అయితే ప్రభుత్వం కేటాయించే నిధులకు తోడు తన సొంత నిధులతో అత్యాధునిక హంగులతో, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో, కార్పొరేట్ స్కూల్ ను తలదన్నేలా నిర్మాణం జరగనుంది. పాఠశాలకు సంబంధించిన మోడల్ కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఇప్పటికే బీబిపేటలో ఓ పాఠశాల నిర్మాణం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి, వచ్చే తరానికి సరస్వతి నిలయాన్ని కానుకగా ఇచ్చారు. అది రాష్ట్రంలోనే పెద్ద చర్చనీయాంశమైంది. తాను చదువు కున్న స్కూల్ మరిన్ని తరాలకు విద్యా భోధనలు జరగాలని, రేపటి విద్యావంతమైన సమాజానికి బీబిపేట ఆదర్శంగా నిలవాలని సుభాష్ రెడ్డి కానుకగా ఇచ్చారు. ఇప్పుడు రెడ్డి పేటలోనూ మరో పాఠశాల నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆయన విద్యాలయాల నిర్మాణంలో చూపిస్తున్న చొరవను అందరూ అభినందిస్తున్నారు.‌

తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

` ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు.

` అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం.

`కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా!

` తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా!

`భవిష్యత్తులో చెరువుల్లో అన్ని కాలాల్లో నీళ్లుంటాయనుకున్నామా!

` రైతుబంధు అమలు ఊహలకే అందనిది…

`24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా!

` తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు…

` తెలంగాణ తలరాత మార్చేందుకు…

`అద్భుత ప్రగతి ఆవిష్కరించుకునేందుకు…

`అది కేసిఆర్‌ తోనే సాధ్యం… కళ్లముందు కనిపిస్తయన్నదే సాక్ష్యం

తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

    హైదారాబాద్‌,నేటిధాత్రి:  

ఒక వ్యక్తి బలమైన సంకల్పం వుంటే ఎంతటి అసాధ్యమైన పనైనా పూర్తి చేయొచ్చు. గమ్యం ముద్దాడొచ్చు. లక్ష్యం సాధించవచ్చు. అందులోనూ వ్యక్తి గత లక్ష్యం వేరు. వ్యవస్థ లక్ష్యం వేరు. ఒక వ్యవస్థకు పట్టిన పీడను వదిలించడం అంటే మాటలు కాదు. ఆ వ్యవస్థకు స్వేచ్ఛను ప్రసాదింపజేయడం అంటే అదొక యజ్ఞం. ఆత్మగౌరవం, స్వయం పాలన అందించే పోరాటానికి మించిన లక్ష్యం మరొకటి వుండకపోవచ్చు. అలాంటి లక్ష్యాసాధకులు చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. పురాణాలు, రాజరిక వ్యవస్థలో సామ్రాజ్యాలను యుద్ధాలు చేసి గెల్చుకున్న రాజులున్నారు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన వారిలో మొదటి వరుసలో మహాత్మాగాంధీ గురించి చెప్పకుంటే, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు చెప్పకతప్పనిది. నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ లేనిది తెలంగాణ లేదు. కేసిఆర్‌ ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. పట్టుదలకు కూడా ఊపిరిపోయగల మనోబలిష్టుడు కేసిఆర్‌. ఆ పట్టుదలకే బలమొచ్చేంత పట్టుబట్టి మరీ తెలంగాణ కోసం కొట్లాడాడు. అసలు ఆయన జై తెలంగాణ అనకపోతే ఇప్పుడు తెలంగాణ ఎలా వుండేదో ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. తెలంగాణ సమాజం అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కాదు. అవి ఒక రోజో, ఒక నెలో, ఒక ఏడాదో కాదు…కొన్ని దశాబ్దాలు. విద్యా వసతులు లేవు. వైద్య సదుపాయాలు లేవు. సాగుకు కరంటు రాదు. వచ్చింది సరిపోదు. అయినా కరంటు బిల్లు మోపెడు. హార్స్‌ పవర్‌ కు ఇంత అని వసూలు చేశారు. చెరువుల్లో నీళ్లుండవు. ప్రాజెక్టులు లేవు. రిజర్వాయర్లు కట్టలేదు. వర్షాధార పంటలు తప్ప దిక్కులేదు. ఒక వేళ రైతు ధైర్యం చేసి వరి వేసినా అక్టోబర్‌, నవంబరు నెలల్లో వచ్చే అకాల వర్షాలతో పంట మునిగి పోవడం. మురిగిపోవడం. , ఏప్రిల్‌, మే నెలల్లో పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ళు కురవడం. అలా వరి రాలిపోయి గడ్డి మిగిలడంతో ఆ రైతు పడిన వేదన, రోధన చెప్పనలవి కాదు. ఇక కరువు కాటకాలు ఎదురైతే భూ గర్భ జలాలు ఇంకితే పంట నష్టాలు. పంట చేతికొచ్చే సమయంలో కరంటు కోతలు. దాంతో ఎండిన పంటలు. దు:ఖంతో పొలం తగలబెట్టుకున్న రైతులున్నారు. వర్షాధార పంటలు పత్తి, నువ్వులు వేసి, చేలకు పురుగు పట్టి పంట చేతికి రాక అదే పురుగుమందులు తాగిన రైతులు ఎంతో మంది వున్నారు. ఈ కష్టాలు, నష్టాలు, రైతుల బలన్మరణాలు ఆనాడు ఆంధ్ర లో లేవు. తెలంగాణ కు ఎండబెట్టి ఆంద్రకు కరంటు ఇచ్చే వాళ్లు. కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కాలువలు స్థిరీకరించుకునే వాళ్లు. తుఫానులకు పంటలు నష్టపోతే పరిహారాలు అందించేవారు. మరి తెలంగాణ ను మొండి చేయి చూపేవారు. అప్పుడప్పుడు తెలంగాణ మీద మొసలి కన్నీళ్లు కార్చేవారు. మరి ఇప్పుడు తెలంగాణ ఒక విజయం. తెలంగాణ ఒక గర్వకారణం. తెలంగాణ ప్రగతి శీల రాష్ట్రం. తెలంగాణ ఒక ఆదర్శపాలనకు సాక్ష్యం. సంక్షేమానికి నిదర్శనం. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి సంకల్ప బలం. ఆయన సాధించి, తెలంగాణ ప్రజలకు అందించిన అద్భుతమైన విజయం. తరతరాల తెలంగాణ భవిష్యత్తుకు శ్రీకారం. ఇదీ కేసిఆర్‌ యుగం…యుగ కర్తగా ఆయన కీర్తి అజరామరం.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనమిది సంవత్సరాలు.

 ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు. అసలు కలలో కూడా ఊహించలేని అద్భుత విజయాలు. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం. రెండూ కలిపి తన పరిపాలనలో తెలంగాణ రూపు రేఖలు మార్చిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాకముందు వున్న కష్టాలలో కరంటు కొతర ఎంతో దుర్భరం. సకలం కరంటుతో ముడిపడిన వ్యవస్థలే…ఏ చిన్న జిరాక్స్‌ మిషన్‌ పని చేయాలన్నా కరంటు కావాలి. ఇక వ్యవసాయానికి ఎంతో మూలం. మరి ఆ కరంటు కళ్ల చూద్దామంటే కూడా కనిపించని రోజులు తెలంగాణ అనుభవించింది. ఒక దశలో తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారన్న కక్ష్యతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కరంటు కష్టాలు చూపించారు. తెలంగాణ వస్తే ఇది కూడా రాదని భయపెట్టించారు. కానీ తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీరినవి. మండు వేసవిలో కూడా ఇరవై నాలుగు గంటల కరంటు చూసి తెలంగాణ మురిసింది. సంబురపడిరది. అబ్బురపడిరది. తెలంగాణ తెచ్చుకున్నందుకు చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. అది కూడా తీర్చిన కేసిఆర్‌ ను తెలంగాణ గుండెల్లో పెట్టుకుంది. మారాజువని పొగిడిరది. కేసిఆర్‌ నాయకత్వానికి ఎదురులేకుండా, తిరుగు లేకుంటా, సంక్షేమ పాలనకు ఎవరూ అడ్డు పడకుండా, కిరికిరి పెట్టకుండా ప్రతిపక్షాలను తెలంగాణ సమాజం దూరం పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీలను తెలంగాణ సమాజం వెలివేసింది. అదీ కేసిఆర్‌ నాయకత్వం. పాలనలో స్వర్ణ యుగం. 

కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా!

 తెలంగాణ రాకపోతే కళ్యాణ లక్ష్మి అనే పథకం ఒకటి అమలు చేయొచ్చని అనుకున్నారు. అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలోనే కాదు, కేంద్రం గాని, ఏ ఇతర రాష్ట్రాలలో అమలు కాలేదు. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ పల్లె నిద్ర అనే కార్యక్రమంలో వుండగా ఓ తండాలో తెల్లవారితే పెళ్ళి అనగా వదువు ఇళ్లు కాలిపోయింది. ఆమె పెళ్ళి కోసం తెచ్చిన వస్తువులతో పాటు, డబ్బులు కూడా బూడిదయ్యాయి. ఏం చేయాలో తెలియని అయోమయంలో వున్న ఆ కుటుంబాన్ని కేసిఆర్‌ అప్పటికప్పుడు డబ్బులు అందజేశాడు. దగ్గరుండి పెళ్ళి జరిపించాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు. తెలంగాణ వస్తే పేదింటి ఆడపిల్ల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా వుండాలి. ప్రభుత్వం వారి పెళ్ళికి ఆర్థిక సహాయం అందించాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలి. పైగా ఆడపిల్లు బతకాలి. పురిట్లోనే చిదిమేయొద్దు. అందుకు ప్రభుత్వ భరోసా అవసరం అని గుర్తించి, కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం ప్రకటించారు. ఇప్పటి వరకు పదిలక్షలకు పైగా కళ్యాణ లక్ష్మి పథకం అందుకున్న కుటుంబాలు తెలంగాణలో వున్నాయి. 

 తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా! 

తెలంగాణలో చెరువులు పూడిక తీస్తే చాలు. వర్షాకాలంలో చెరువులు నిండితే చాలు. కనీసం ఒక్క పంటవరకైనా చెరువులో నీళ్లుంటే చాలు అనుకున్నాం. కానీ తెలంగాణ లో వున్న 46 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరుగుతుందనుకున్నామా? ఓ వైపు పూడిక తీసి, కట్టలు మరమ్మత్తులు చేసుకొని, వాటిపై ఈత చెట్లు పెంచి, చెరువుల్లో మళ్ళీ మత్స్య వైభవం చూస్తామనుకున్నామా? అటు సాగుకు నీరు. ఇటు గౌడ వృత్తికి తోడ్పాటు. ముదిరాజ్‌ లకు చేపల సంపద. ఇలా పల్లె మళ్ళీ మొగ్గలేస్తుందని, సంతోషాలతో చిందులేస్తుందని, పరవళ్లతో పరవశించిపోతుందని ఎవరైనా అనుకున్నారు. ఇదొక అద్భుత ప్రగతైతే, తెలంగాణ ప్రాజెక్టులు అనే పదానికే చోటు లేదన్న కాడ, కాళేశ్వరం నిర్మాణం చేసి తెలంగాణ సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసిఆర్‌. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దిశగా ఇంత తక్కువ సమయంలో పయనిస్తుందని అనుకున్నామా! ఎటు చూసినా పల్లె పచ్చదనం పురివిప్పి నాట్యం చేస్తున్నంత అందంగా సుందరశోభాయమానమై కళకళలాడుతోంది. నేను తెలంగాణ అని ఎలుగెత్తి చాటుతోంది. కేసిఆర్‌ ను గుర్తు చేస్తోంది… కేసిఆర్‌ లేకుంటే నాకు ఈ శోభ ఎక్కడిది అంటోంది. 

రైతుబంధు అమలు ఊహలకే అందనిది…

 24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా! దేశంలో ఎక్కడైనా ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి కనిపించిందా? ఉమ్మడి రాష్ట్రంలో వుంటే సాధ్యమౌనా? ఇతర పార్టీలు అధికారంలో వుంటే ముందట పడునా? రాజకీయాల కోసం తప్ప, ప్రతిపక్షాలు ప్రగతి కోసం కాదు. ప్రజలు నమ్మితే ఏం చేస్తామనేదాని మీద వారికి క్లారిటీ లేదు. ఇప్పటికీ సీమాంధ్ర నేతల కళ్లు తెలంగాణ మీదే వున్నాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి….ఆదమరిచి ప్రతిపక్షాలను కనికరిస్తే ఇక అంతే సంగతి. మన పరిస్థితి మళ్ళీ మొదటికి… తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు…తెలంగాణ తలరాత మార్చేందుకు…అద్భుత ప్రగతి ఆవిష్కరించుకున్నదంటే కేసిఆర్‌ దక్షతకు నిదర్శనం. కళ్లముందు కనిపిస్తున్నవే సాక్ష్యం.

అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర

ఇరుముడి కార్యక్రమానికి హాజరు

ఖమ్మం, డిసెంబర్, 8:

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం శ్రీనివాస నగర్ లోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఎంపీ హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన రవిచంద్రకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనను

శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దివ్య మణికంఠ అయ్యప్ప భక్త బృందం సభ్యుల ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యారు. అయ్యప్ప సన్నిధానం శబరిమలై బయలుదేరడానికి ఇరుముడి ధరించిన స్వాములు, కుటుంబ సభ్యులకు ఎంపీ 

శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర సుఖప్రదం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు రాయపూడి వెంకటరమణ, కాకరపర్తి రమేష్, తూములూరి అప్పారావు, మేళ్లచెర్వు మనోజ్, దివ్య మణికంఠ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

పాలకుర్తి,దేవరుప్పుల,కొడకండ్ల మండలాల ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక- పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్

 పాలకుర్తి నేటిధాత్రి  

వరంగల్ పోలీస్ కమీషనర్ ఎ.వి రంగనాథ్ ఐ.పి.ఎస్’ గారి ఉత్తర్వులు మేరకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలు పండగలకు, వివాహలకు మరియు జన్మదిన వేడుకల సందర్భంగా ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా ఇటువంటి అనుమతులు లేకుండా వివిధ సందర్భాలలో మరియు వివాహ వేడుకల్లో డి జే వాహనాలు వాడటం, టపాసులు పేల్చడం చట్టరీత్యా నేరం పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్ ఈసందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే మ్యూజిక్ వాహనాలను ఎవరైనా ఏర్పాటు చేస్తే అటువంటి వాహనాలను మరియు స్పీకర్ బాక్స్ లను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని ఇట్టి విషయాన్ని డీజే మ్యూజిక్ మరియు సంబంధిత వ్యక్తులు గమనించగలరని అలాగే గ్రామ కూడల్లో మద్యం సేవించి రోడ్లపై మీటింగులు పెట్టినా,ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలిగే విధంగా చేసినా ,ఎటువంటి అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడినా,అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడునని పైన పేర్కొనబడిన అంశాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని

సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్ తెలియజేశారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 66 వర్ధంతికి ఘనమైన నివాళులు

నేటిధాత్రి, తిరుపతి

06-12-2022 తేదీన ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల *డాక్టర్ భీమ్రావు అంబేద్కర్* నిలువెత్తు విగ్రహానికి వారి వర్ధంతి సందర్భంగా టిటిడి

ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో పూలదండలు వేసి పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా టీటీడీ ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి

జె. భాస్కర్ మాట్లాడుతూ అంటరానితనం, వివక్షతలపై, అలుపెరగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత….

కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించినా మహోన్నత వ్యక్తి

సమసమాజ స్వప్నికుడు, స్థాపకుడు, అణగారిన వర్గాల ఆరాధ్య దైవం, ప్రగతి ప్రదాత, విశ్వజ్ఞాని

దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు…..

👉స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభాతృత్వాన్ని ఆర్థికంగా, సామాజికంగానూ, రాజకీయ పరంగాను సమానత్వ అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తికి…. నివాళులు అర్పిస్తున్నాము.

ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ప్రజా ఉద్యమాలతో విన్నవించడం ఏమనగా నూతన పార్లమెంటు నిర్మాణం జరుగుతున్న సందర్భంగా *పార్లమెంటుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణ చేయాలి* సరైన నిర్ణయంగా యావత్ భారత దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా అంబేద్కర్ జయంతి జరుపుకున్నట్లుగానే అంబేద్కర్ వర్ధంతిని ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం తరఫున వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు *ఎం.ప్రసాదరావు*, ప్రధాన కార్యదర్శి *జె. భాస్కర్*, కోశాధికారి *ఎం.శ్యామ్ మరియు బి.శ్రీనివాసులు, సి . మహేష్, ఆర్. రవికుమార్, ఆర్ . మనీ, కే.కృష్ణమూర్తి, సురేష్, ద్వారక, బుట్టో, త్యాగరాజులు, లచ్చిరాం నాయక్, గిరిజ, ఆదిలక్ష్మి, పద్మ, దీక్షితులు, రవికుమార్, జంగయ్య* తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

ఇట్లు

 మీ శ్రేయోభిలాషి… 

*జె. భాస్కర్*,

*ప్రధాన కార్యదర్శి*

టిటిడి ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం

 మరియు

 *వ్యవస్థాపక అధ్యక్షులు*

 టిటిడి దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం

రెండో సారి రైతుబంధు సమితి అధ్యక్షునిగా “ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి

నేటిధాత్రి హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఎమ్మెల్సీ డాక్టర్. పల్లా రాజేశ్వరరెడ్డికి రెండో సారి అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న పల్లా రాజేశ్వర రెడ్డిని గతంలో మొదటి సారి ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు బంధు సమితి అధ్యక్షుడిని చేశారు. ఆ పదవీ పూర్తి కావడంతో మరోసారి పల్లాకు ముఖ్యమంత్రి కేసిఆర్ అవకాశం కల్పించడంతో, ఆయన సమర్థతను గుర్తించినట్లైంది. పార్టీ కోసం ఆయన పడుతున్న శ్రమతో పాటు, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు సమితి నిర్వహణ అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు. పార్టీలో నాయకులంతా పల్లా లాగ తమ కర్తవ్య నిర్వహణలో సాగాలి. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా తన భుజస్కంధాల మీద వేసుకొని పని చేయడం పల్లా కు అలవాటు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట భద్రుల స్థానం నుంచి రెండు సార్లు పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. సక్సెస్ కు చిరునామాగా మారారు. గత ఎన్నికలలో పల్లాను ఎలాగైనా ఓడించాలని ఎమ్మెల్సీ ఎన్నికలలో అతిపెద్ద బ్యాలెట్ వచ్చేలా, ప్రతిపక్షాలు చేసిన కుట్రలను పటా పంచెలు చేస్తూ విజయం సాధించారు. ఎవరు ఎన్ని విన్యాసాలు చేసినా యువత టిఆర్ఎస్ వైపే వున్నారని, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంపై ఎంతో నమ్మకంతో వున్నారని పల్లా గెలిచి రుజువు చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఇలాగే మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, భవిష్యత్తులో టిఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనంతరం ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ముఖ్యమంత్రి కేసిఆర్ వున్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పారు.

నిన్న ఎండిన మాగాణ…నేడు సిరుల తెలంగాణ.

`తెలంగాణ ప్రగతిపై సినీ నటుడు మురళీ మోహన్‌ లాంటి వాళ్లకు వున్న అవగాహన తెలంగాణ ప్రతిపక్షాలకు లేదాయే!

`ఒక్కసారి గతంలో తెలంగాణ గురించి పాలకులు ఏం మాట్లాడేవారో వాళ్లనడిగి తెలుసుకోండి.

` అసాధ్యం అనుకున్నవి అనేకం సుసాధ్యం చేసిన నాయకుడు కేసిఆర్‌.

` తెలంగాణ రాదన్నారు…వచ్చింది.

` తెలంగాణ ఇక ఎడారే అన్నారు…

` ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారు.

` రిజర్వాయర్లు దండగన్నారు…

`అసలు రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యం కాదన్నారు.

` ప్రాజెక్టుల మాట కల అన్నారు.

`నాయకులు ఆ ఊసే ఎత్తొద్దన్నారు…

` కానీ తెలంగాణ రాష్ట్ర సిద్దించడంతో అవన్నీ సాధ్యమయ్యాయి.

` ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసు పెట్టి చేయడం వల్లనే నెరవేరాయి.

` ఒకనాడు తెలంగాణలో భూములున్నా పేదలే…

`నేడు ఐదెకరాలుంటే చాలు కోటీశ్వరుడే.

` తెలంగాణ ఒక నాటి గోస అందరికీ తెలుసు.

` ఇప్పుడు మాట్లాడున్న వారిలో ఒక్కరూ ఆ నాడు కొట్లాడిన వాళ్లు కాదు.

` జై తెలంగాణ అనడానికే భయపడిన వాళ్లు..

`పదవులు రావేమో అని నోరు కుట్టేసుకున్నారు.

` తెలంగాణకు నిధులు కూడా తేవాలన్న సోయి లేని వాళ్లు.

` పరాయి పాలనలో నోరు లేవని వాళ్లు.

`గొంతు పెద్దది చేసుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

చరిత్రలో కొన్ని సంఘటనలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. తరతరాలు ఆ జ్ఞాపకాలు పదిలంగా వుంటాయి. ఎన్ని వేల సంవత్సరాలైనా జనం నోట్లలో నానుతూనే వుంటాయి. వారి చరిత్ర నిత్యం గుర్తు చేస్తూనే వుంటాయి. భవిష్యత్తు తరాలకు పాఠాలుగాను, ఆదర్శాలుగా వుంటాయి. అలాంటి చరిత్రే తెలంగాణది. తెలంగాణ అంటేనే ఒక పోరాటం. తెలంగాణ అంటేనే ఒక ఉద్యమం. కొన్నేళ్లపాటు అస్తిత్వం కోసం ఆరాటపడి, పోరాడి ఆత్మాభిమానం నింపుకున్నది. స్వరాష్టమై ఒక సారి మోసపోయింది. రెండోసారి తన ఉనికిని నిలబెట్టుకున్నది. కేసిఆర్‌ రూపంలో సంకెళ్లు తెంచుకున్నది. తన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. స్వరాష్టమై విలసిల్లింది. అదీ తెలంగాణ అంటే…ఆ తెలంగాణ తలరాత మార్చిన నాయకుడు కేసిఆర్‌. ఇది చరిత్రకు సజీవ సాక్ష్యం. రేపటి తెలంగాణ తరానికి బంగారు భవితవ్యం. తెలంగాణ సాధన అసాధ్యమని అందరూ అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా అనుకున్నారు. అందుకు తెలంగాణకే వెన్నుపోటు పొడిచిన వాళ్లు అంతకు ముందు తరం నాయకులు. గతంలో తెలంగాణ పేరు చెప్పుకొని పదవులు పొంది, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న నాయకులు ఎందరో వున్నారు. కేసిఆర్‌ జై తెలంగాణ అన్న నాడు ఇలాగే చాలా మంది అనుకున్నారు. ఓ వైపు నమ్మకం లేని తెలంగాణ సమాజం. అధిపత్యంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉఫ్‌ మని ఊదేస్తామనే సీమాంధ్ర పాలకుల తెలంగాణ. టిఆర్‌ఎస్‌ ను తొక్కేస్తామని శఫథాలు పూనారు. కేసిఆర్‌ మీద రకరకాల ఆరోపణలు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. కల్పిత ఉద్యమన్నారు. కృత్రిమ ఉద్యమమన్నారు. పుగ్గలో పుట్టి మగలో మాడిపోయేదన్నారు. నిత్యం ఎగతాళి చేశారు. కేసిఆర్‌ ను చక్రబంధనం చేశారు. తెరాస పార్టీ తరఫున పోటీచేసిన ఎమ్మెల్యేలను లాక్కున్నారు…తెలంగాణ ఉద్యమాన్ని పోలీసుల ఇనుప బూట్లతో అణచివేయాలని చూశారు. ఎంత తొక్కితే తెలంగాణ ఉద్యమం అంతగా ఎగసిపడిరది. కేసిఆర్‌ రూపంలో రకరకాల రూపాలు సంతరించుకొని, ఉద్యమ స్వరూపాలకే ఒక కొత్త అధ్యాయాన్ని రచించింది. తెలంగాణ ఉద్యమం చారిత్రక ఘట్టంగా కీర్తకెక్కింది. అది కేసిఆర్‌ మస్తిష్క నుంచి పురుడుపోసుకొని, క్షేత్ర స్థాయికి చేరి, అసలు అంతు చిక్కని సమస్యగా నాటి పాలకులకు ఉక్కిరిబిక్కిరి చేసింది. అదీ తెలంగాణ ఉద్యమ తీవ్రత. అదీ కేసిఆర్‌ ఉద్యమ రచన. పోరాట ఆచరణ. అలా అసాధ్యం అనుకున్నవి అనేకం సుసాధ్యం చేసిన నాయకుడు కేసిఆర్‌.

 ఒక దశలో ఎంత పోరాటం జరుగుతున్నా కొందరు తెలంగాణ రాదన్నారు…

అటు వెన్నుపోటు దారులు, ఇటు సీమాంధ్ర పాలకులు…డిల్లీ పాలకులకు నిరంతరం అబద్దాలు చేరవేసేవారు. మిలియన్‌ మార్చలో కనీసం ముప్పై వేల మంది కూడా పాల్గొనలేదని తప్పుడు ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే సీమాంధ్రుల జీవితాలు ఆగమౌతాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఒక కనికట్టు అంటూ అప్పటి సీమాంధ్ర పాలకులు కేంద్రానికి తప్పుడు అనేక నివేదికలు ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి సైతం అసత్యాలు నింపిన లెక్కల చూపించారు. అయినా కేసిఆర్‌ అంటే తెలంగాణ ప్రజలకు ఒక బలమైన నమ్మకం. ఎలాగైనా తెలంగాణ సాధిస్తాడని విశ్వాసం. తెలంగాణ ప్రజల బలమైన కోరిక. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. 2010 నుంచి తెలంగాణ వచ్చే దాకా పార్లమెంటు సమావేశాలు ఏ రోజు కూడా నడిచిన సందర్భం ఒకటి కూడా లేదు. అంతలా కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమం పని చేసింది. కేసిఆర్‌ వ్యూహాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. చివరకు ఎవరు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రావడం ఆగలేదు. ఆఖరు నిమిషం వరకు పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రేలతో కూడా తెలంగాణ బిల్లు ఆపాలని చూశారు. ధర్మం కేసిఆర్‌ ను గెలిపించింది. తెలంగాణ వచ్చింది. 

 తెలంగాణ ఇక ఎడారే అన్నారు…

ఒకనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌ లు కల అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారు. రిజర్వాయర్లు దండగన్నారు… అసలు రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఎత్తిపోతల కూడా కుదరదన్నారు. విద్యుత్‌ బిల్లులు భరించలేమన్నారు. తెలంగాణ రైతుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించిన పాపాన పోలేదు. ఉమ్మడి పాలకులు అసలు తెలంగాణ లో ప్రాజెక్ట్‌ ల ఊసే ఎత్తొద్దని ఈ ప్రాంత నేతల నోరు మూయించారు. పదవులతో వారిని తెలంగాణ ప్రశ్నకు శక్తి లేకుండా చేశారు. తెలంగాణ లో నాయకులకు, నాయకులకు మధ్య తగాదాలు పెడుతూ వచ్చారు. ఇద్దరు తెలంగాణ నేతలు ఒక్కటి కాకుండా చూసుకున్నారు. 

 ఒక మురళీ మోహన్‌ కు వున్న సోయి తెలంగాణ నేతలకు లేకుండా పోయింది. 

ఆయన ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో మురళీ మోహన్‌ మాట్లాడుతూ తాను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఓ ప్రశ్న అడగడం జరిగింది. మొత్తం ప్రాజెక్టులన్నీ ఆంద్రలో చేపడితే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది కదా! అన్నాడట. అప్పుడు చంద్రబాబు తెలంగాణ లో ప్రాజెక్టు లు నిర్మాణం సాధ్యమయ్యే పని కాదు. ఎత్తిపోతల పథకాలు ప్రభుత్వానికి మోయలేని భారమౌతుంది. వచ్చే పంటకంటే అందుకు అవసమయ్యే కరంటు బిల్లు ఎక్కువౌతుంది. తెలంగాణలో చెరువులు బాగు చేయలేం. ప్రాజెక్టులు సాధ్యం కావని చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు గుర్తు చేశారు. అయితే తెలంగాణ లో ప్రాజెక్టులు సాధ్యం కాదని అన్న వాళ్లు ఆశ్చర్యపోయేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసి చూపించారు. రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ కు దీటుగా వరి పండిస్తున్నారు. దేశంలో వరి అత్యదికంగా పండిరచే రాష్ట్రాలలో తెలంగాణ చేరింది. ఇది అతి కొద్ది కాలంలోనే పూర్తయ్యింది. ఇదంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పట్టుదలకు నిదర్శనం. అంతే కాదు ఎత్తిపోతల ఖర్చు ఎంతైనా రైతు సంక్షేమం కేసిఆర్‌ నిలబడ్డాడు. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. రైతు బంధు ఇస్తున్నాడు. అసలు ఇదంతా ఎవరూ ఊహించలేదు. తెలంగాణ ఇంత అభివృద్ధి కేసిఆర్‌ వల్లనే సాధ్యమైందని మురళీమోహన్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ఇలాంటి వారి మాటలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షాలు తమ ధోరణి మార్చుకోవాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం విషయంలో అనవసరమైన వివాదాలు సృష్టించడం మానుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సిద్దించడంతో అవన్నీ సాధ్యమయ్యాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మనసు పెట్టి చేయడం వల్లనే నెరవేరాయి. ఒకనాడు తెలంగాణలో భూములున్నా పేదలే…నేడు ఐదెకరాలుంటే చాలు కోటీశ్వరుడే. ఒక్కసారి గతంలో తెలంగాణ గురించి పాలకులు ఏం మాట్లాడేవారో వాళ్లనడిగి తెలుసుకోండి.తెలంగాణ ఒక నాటి గోస అందరికీ తెలుసు.ఇప్పుడు మాట్లాడున్న వారిలో ఒక్కరూ ఆ నాడు కొట్లాడిన వాళ్లు కాదు. జై తెలంగాణ అనడానికే భయపడిన వాళ్లు..పదవులు రావేమో అని నోరు కుట్టేసుకున్నారు. తెలంగాణకు నిధులు కూడా తేవాలన్న సోయి లేని వాళ్లు. పరాయి పాలనలో నోరు లేవని వాళ్లు. గొంతు పెద్దది చేసుకొని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు.

డా..బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి

డా..బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి

ప్రపంచమేధావిగా డా.బి.ఆర్ అంబేద్కర్ ను ఐక్యరాజ్య సమితి గుర్తించిన నేపథ్యంలో, తన జీవితమే తన సందేశంగా అంబెడ్కర్ చూపడం, తను జీవితంలో పడ్డ కష్టాలు, తన జాతి ప్రజలు పడకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 

భీమ్ రావ్ రాం జి అంబేద్కర్ పుట్టినప్పటినుండి అగ్ర కులాల చేతిలో ఎన్నో అవమానాలు పడ్డా, జీవితంలో ఎదురైన సవాళ్ళను అధిగమించాడు. బరోడా మహారాజు సహాయంతో, కొలంబియా, లండన్ యూనివర్సిటీలలో ఎన్నో ఉన్నత చదువులు చదివి యావత్ ప్రపంచంలోనే అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్ర లోని మహాద్ చెరువులో అంటరాని కులాలు నీళ్లు తాగరాదనే అగ్రవర్ణ ఆంక్షలకు వ్యతిరేకంగా 1927 లో మహాద్ చెరువు పోరాటానికి నాయకత్వం వహించి, ఆ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. దేశంలో సామాజిక సమానత్వం లేని కారణంగా, భౌతికంగా పూడ్చలేని కులాల మధ్య అంతరాలను, భావపరంగా విప్లవం రావాలని, మనిషిని ప్రేమించే స్వభావం కలిగి, ప్రతిభను ఆహ్వానించే విశాల హృదయం కావాలని ఆకాంక్షించారు. భారతీయులందరు జ్ఞానవంతులుగా, నూతన ప్రపంచాన్ని అవిష్కరించగలిగే ప్రతిభావంతులుగా ఉండాలని,

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాశారు. ఇది కౌటిల్యుని అర్దశస్త్రానికి, మనుస్మృతి, పరాశర స్మృతికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఎవరి నుండి ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చిందో ఆయననే నిరాకరిస్తున్న దేశం మనది. అలాంటి గొప్ప రాజ్యాంగం ఇప్పటివరకు సుమారు 104 సార్లు రాజ్యాంగం సవరించబడి, 444 ఆర్టికల్లు, 12 షెడ్యూళ్లు, 26 భాగలతో, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించి, దేశంలో సమసమాజ నిర్మాణం ఏర్పడాలని కలలు గన్న డా.బి.ఆర్ అంబేద్కర్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, రాజ్యాంగంలో గల అవకాశాలను అలుసుగా చేసుకొని, వాటిని వివిధ రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారు తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 76సంవత్సరాలు వచ్చినా, దేశంలో ఇంకా అసమానతలు, అవిద్య, అంటరానితనం, అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రతి భారతీయునికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని, సామాజిక వెనుకబాటుకు గురి అయిన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్యలో, ఉద్యోగంలో, రాజకీయాలలో, ఆర్థిక, వ్యాపార రంగాలలో ఎదగాలని రిజర్వేషన్లు కల్పించి ఆ జాతులు ఉన్నతంగా ఎదగాలని కాంక్షించారు. కానీ, నేటి బహుజనులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.

ఆర్టికల్ 15లో మత, జాతి, కుల లింగ భేదం లేకుండా, జన్మ స్దాన కారణాలను బట్టి వివక్ష చూపడం నేరం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత, అంటరానితనం రద్దు చేయబడింది. అయిన ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన జాతులపై అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

 ఇప్పటికి గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత 60 శాతానికి మించలేదు. సగటు భారతీయుని తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయింది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బడా పెట్టుబడిదారులకు ఆదాయ మార్గాలుగా మారిపోయాయి. 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది బి.జె.పి నాయకులు, రిజర్వేషన్ల పై సమీక్ష చేయాలనుకోవడం దురదృష్టకరం. దీన్ని బహుజన నాయకులు వ్యతిరేకించడంతో కాస్త వెనక్కి తగ్గారు. 

డా.బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో సామాజిక పరివర్తన ద్వారా ఆచరణాత్మక ప్రజాస్వామ్యం నిర్మించడం సాధ్యమని గట్టిగా విశ్వసించారు. విద్యా వ్యాప్తి, విప్లవాత్మక భూ సంస్కరణలు, ఆర్థిక సమానత్వం, సార్వత్రిక వయోజన ఓటు ద్వారా రాజకీయాధికారం తద్వారా సామాజిక మార్పు సాధ్యం అని భావించారు.

మానవ హక్కుల పరిరక్షకునిగా, మానవతా మూర్తిగా, బహుజనులు విముక్తి ప్రదాతగా, సర్వ జన హితునిగా, సమస్త సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే ముఖ్యమని తేల్చి చెప్పారు.

కానీ, కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య రాజకీయ నాయకుల చిచ్చు, వెరసి బహుజనుల మధ్య అనైక్యతనే వారిని రాజకీయాధికారానికి దూరం చేస్తున్నాయి.

ఇప్పటికి అంబేద్కర్ ను అర్థం చెలుకోవాలంటే తను రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇంకా భారతీయుల మనసులలోకి, మెదళ్లలోకి చేరలేదు. అది కొంతమంది చేతుల్లో ఆభరణంగానే ఉంది.దీని ప్రతిఫలాల కోసం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం జరగాలి, అందుకు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, రచయితలు భాగస్వామ్యం కావడమే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.

(డిసెంబర్ 6 న రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా)

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version