నేను చెప్పింది సందేశమే…సర్వమానవాళి సంతోషం కోసమే!: గడల శ్రీనివాస్‌

 

`ఏ మతానికి కొమ్ము కాయలేదు!

`వీడియోలో కొన్ని మాటలు తీసుకొని ఆరోపించడం తగదు.

`క్రిస్మస్‌ వేడుకలకు వెళ్ళి చెప్పాల్సింది చెప్పాను.

`బిజేపి నేతలకు నచ్చింది చెప్పాలనడం ప్రజాస్వామ్య విరుద్దం.

`నేను హిందువునే…మీకన్నా గొప్ప భక్తుడినే.

`నేను ఎన్నో దేవాలయాల నిర్మాణానికి సహకరించాను.

`నా స్వేచ్చను హరించే హక్కు ఎవరికీ లేదు.

`నాపై అసత్య ఆరోపణలు అసందర్భ ప్రేలాపనలే.

`నా వృత్తి నిబద్దత కరోనా సమయంలో ప్రజలే చూశారు.

`కొత్తగా నేను ఎవరి కోసం ఇప్పుడు నా సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.

`నాపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదు!

`నా రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదు.

నేను చెప్పింది సందేశమే…సర్వమానవాళి సంతోషం కోసమే!: గడల శ్రీనివాస్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేను ఏం మాట్లాడాలన్నది నా వ్యక్తిగత విషయం. నేను హిందువునే. సెక్యులర్‌ వాదినే. నాకు క్రిస్టియన్‌ మతాన్ని విస్వసిస్తున్న ఎంతో మంది స్నేహితులు, సన్నిహితులు వున్నారు. తమ పండగ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ సందర్భంలో నేను మాట్లాడిన మాటలు వేరు. కొందరు రాజకీయం కోసం వక్రీకరించింది వేరు. అని రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌. గడల శ్రీనివాస్‌ రావు అన్నారు. నేటిధాత్రి తో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణిచ్చారు. ఒక్కసారి నేను మాట్లాడిన విషయాలు పూర్తిగా వింటేనే అసలు విషయం భోదపడుతుంది. అంతే తప్ప తమ రాజకీయ అవసరానికి, నన్ను అబాసుపాలు చేయడానికి అవసరమైన ముక్కను తీసుకొని విమర్శకులు చేయడం అసందర్భ ప్రేలాలపనే అవుతుంది. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి మాట్లాడిన వాళ్లు దయానంద సరస్వతి రెండు వందల సంవత్సరాల క్రితం చెప్పిన వేదాలకు మరలండి. అనే మాట చెప్పే ధైర్యం వుందా? లౌకిక ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను గౌరవించడం మన విధి. అయినా క్రిస్మస్‌ వేడుకలకు వెళ్ళి, ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే లౌకిక స్పూర్తికి అర్థముంటుందా? ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరైంది కాదు. నేను క్రిస్మస్‌ వేడుకలకు మాత్రమే హజరయ్యాను. మత ప్రచార సమావేశం కాదు. నేను ఏ మతానికి కొమ్ము కాయలేదు. క్రిస్మస్‌ వేడుకలకు వెళ్ళి చెప్పాల్సింది చెప్పాను.

బిజేపి నేతలకు నచ్చిందే చెప్పాలనడం నా స్వేచ్చను హరించడమే అవుతుంది. అది ప్రజాస్వామ్య విరుద్దం.నేను హిందువునే…మీకన్నా గొప్ప భక్తుడినే. నా భక్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. నన్ను విమర్శించిన వాళ్లు, ఎన్ని హిందూ దేవాలయాల పరిరక్షణకు పాటుపడ్డారో తెలియదు. నేను మాత్రం ఎన్నో దేవాలయాల నిర్మాణానికి సహకరించాను. హిందువుగా నా ధర్మం అనుకున్నాను. నిర్వర్తించాను. 

నా స్వేచ్చను హరించే హక్కు ఎవరికీ లేదు. నాపై అసత్య ఆరోపణలు చేసి, నన్ను టార్గెట్‌ చేయడానికి నేను రాజకీయాలలో లేను. ఇంకా రాజకీయాలు మొదలుపెట్టలేదు. ఒక వేళ రాజకీయాలు మొదలుపెట్టినా అన్ని కులాల, మతాల ప్రజల ఆశీస్సులు నాకు అవసరం. నాకే కాదు అందరికీ అవసరం. నన్ను విమర్శించిన వాళ్లు ఎన్నికలలో ఇతర మతాల ఓట్లు వద్దనే శక్తి వుందా? ఏ ఒక్కరినీ విబేధించినా అది నీతిమాలిన చర్యే అవుతుంది. ఇక నా వృత్తి విషయంలో కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పని చేశాను. నన్ను విమర్శించిన వాళ్లు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. నా వృత్తి నిబద్దత కరోనా సమయంలో ప్రజలే చూశారు.కొత్తగా నేను ఎవరి కోసం ఇప్పుడు నా సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాపై వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికీ లేదు! నా రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరికీ ఆందోళన అవసరం లేదు. నేను రిటైర్‌ అయ్యాక ఆలోచించాల్సిన రాజకీయాల గురించి, నా కంటే ఇతరులకే ఎక్కువ ఆసక్తి వున్నట్లు కనిపిస్తోంది. ఇది మాత్రం నాకు బాగానే నాకు నచ్చింది. నేను రాజకీయాలలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నట్లు అర్థమౌతోంది. ప్రజలకు వైద్య పరంగా విసృతమైన సేవలు అందిస్తున్న నాకు, మరింతగా ప్రజా సేవ చేసే అవకాశం రావాలనే కోరుకుంటున్నాను. ఒక ఉద్యోగిగా ఇంత సేవ చేయగలిగినప్పుడు నాయకుడిగా మరింత చేసే అవకాశం వుంటుంది. ఆ అవకాశం రావాలని నేను కోరుకుంటున్నట్లే, చాలా మంది కోరుకుంటున్నట్లు అర్థమైంది. లేకుంటే నన్ను ఇంతగా ట్రోల్‌ చేయకపోయేవారు. అందుకు ధన్యవాదాలు కూడా. నేనేమిటో, నా నిబద్ధత ఏమిటో పూర్తిగా నన్ను విమర్శించిన వాళ్లకు అర్థమైనట్లుంది. అది నాకు కూడా సంతోషాన్నిచ్చేదే అనిపిస్తోంది.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ గా మార్చాలని ఎంపీల వినతి

న్యూఢిల్లీ, డిసెంబర్, 23:

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీగా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు ఆయా సభాపతులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పలువురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లను వారి చాంబర్లో వేర్వేరుగా కలిసారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తీరును వారికి వివరించారు. ఈ సందర్భంగా పార్లమెంటులో పార్టీ పేరు మార్చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతకంతో కూడిన లేఖలను వారికి అందజేశారు. సభాపతులను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, కే ఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు ఉన్నారు.

బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ఘన విజయాలు సాధించాలని, యావత్ దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు

వారితో కలిసి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, వాస్తుశిల్పి ముద్దు వినోద్, వ్యాపారవేత్త సుధీర్

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని గురువారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.తమ కుటుంబ గోత్ర నామాలతో అర్చన చేసి,ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొల్పిన బీఆర్ఎస్ గొప్పగా బలపడాలని,ఘన విజయాలు సాధించాలని,రాష్ట్రంతో పాటు యావత్ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తల్లిని వేడుకున్నారు.ఈ సందర్భంగా వేద పండితులు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులకు శాలువలు,పట్టు వస్త్రాలు బహుకరించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్, వ్యాపారవేత్త సుధీర్,శ్రేయోభిలాషి ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ విష్ణు జగతి తదితరులు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులతో కలిసి ఈ పూజల్లో పాల్గొన్నారు.అంతకుముందు వారికి ఆలయ అధికారులు,వేద పండితులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

పాపం…కనికరించండి! ప్లీజ్‌!!

`నలిగిపోతున్నారు…ఇంకా నాన్చకండి.

`ఆరేళ్లు గడుస్తున్నా ఆశ తీరడం లేదు.

`అందరూ సానుకూలంగానే వున్నారు..సహకరించారు.

`లోపం ఎక్కడుదుందో ఎవరికీ అర్థం కావడం లేదు.

`కుటుంబాలు ఆగమౌతున్నాయి

`జీవితాలు చిధ్రమౌతున్నాయి

`కొలువు కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి.

`చిన్న ఉద్యోగులు

`అర్థాకలితో ఆరేళ్లుగా అవస్థలు పడుతున్నారు.

`రేపే జోవో అన్నారు

`వారంలో ఆర్డర్ల అన్నారు…

`ఏడాది గడిచింది.

`ఆరేళ్లుగా ఎదురుచూపే మిగులుతోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వారిది కష్టమనాలో..శాపమనాలో అర్థం కాని పరిస్థితి. అంతా సవ్యంగానే వుందనిపిస్తుంది. ఎక్కడో వెలితి వెక్కిరిస్తోంది. వేదిస్తోంది. వేధనకు గురిచేస్తోంది. ఎప్పటికప్పుడు ఆశ చిగురిస్తోంది. అంతలోనే మాయమౌతోంది. రేపు మంచి జరగొచ్చన్న ఆశ ముందుకు నడుపుతోంది. ఆరేళ్ల నిరీక్షణకు రోజూ ఎదురుచూపే మిగులుతోంది. కష్టం తీరడం లేదు. ఆశ నెరవేరడం లేదు. కొలువు రావడం లేదు. జాలి మిగులుతోంది. కాలం కరిగిపోతోంది…విన్నవారి గుండె కూడా తరుక్కుపోతోంది. అందరూ చెబుతున్నది ఒకే మాట. అందరూ వేడుకుంటున్నదీ ఒక మాట…కనికరించండి… ప్లీజ్‌!…వారి కొలువుల కల నెరవేర్చండి. వారి జీవితాలు నిలబెట్టండి. వారి బతుకులకు ఒక దారి చూపండి!!

వాళ్లు గృహనిర్మాణ శాఖలో పని చేసిన ఒప్పంద ఉద్యోగులు.

 2007లో ఉమ్మడి రాష్ట్రంలో విధుల్లో చేరారు. అప్పుడు తక్కువ జీతమైనా ప్రభుత్వ పర్యవేక్షణ కొలువు కావడంతో అర్థాకలి జీవితమైనా సర్థుకున్నారు. రాను రాను మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో బతుకుపోరాటం సాగించారు. ఎండనక, వాననక, ఏ వేళ పనైనా చేశారు. ఎంత దూరమైనా వెళ్లారు. వారి కష్టం ఫలించింది. కొంత కొంత జీతం పెరుగుతూ వచ్చింది. ఒక దశలో రూ. 15 వేల వరకు చేరింది. కొంత ఊపిరి తీసుకునే సమయం వచ్చిందని సంతోషిస్తున్న వేళ పిడుగులాంటి వార్త వారి చెవిన పడిరది. కొలువులు ఊడాయి. సుమారు పదేళ్ల పాటు చేసిన పని కాకుండా పోయింది. చేతిలో పని లేకుండా అయ్యింది. ఇంత కాలం చేసిన పనికి దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని నమ్ముకున్న జీవితాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. జీవితాలు ఆగమయ్యాయి. చీకట్లు ఆవహించాయి. తెలంగాణ వస్తే తమ జీవితాలకు మరింత వెలుగులొస్తాయని అనుకున్నారు. ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడంతో అంధకారంలో పడిపోయారు. దిక్కులేని పక్షులయ్యారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 2016 లో గృగ నిర్మాణ శాఖలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది.

 ఇంత వరకు బాగానే వుంది. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఒప్పంద ఉద్యోగులు తమ అవస్థలను, దురవస్థను మొరపెట్టుకుంటే అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. కనికరించారు. తన వంతు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ శాఖలో జరిగిన అవినీతిపై గుర్రుగా వుంది. ఈ తరుణంలోనే ఒప్పంద ఉద్యోగుల కొలువులు కూడా పోయాయి. అయితే ఆ శాఖలో జరిగిన అవినీతికి, ఒప్పంద ఉద్యోగులకు సంబంధం లేదు. వీళ్లు కేవలం నిమిత్రమాత్రులు. ఆ సమయంలో ఆ శాఖలో పని చేసిన ఉద్యోగుల కొలువులు భద్రంగానే వున్నాయి. ఇతర శాఖలకు మళ్లింపు బాగానే జరిగింది. వీళ్లు మాత్రం చకోరపక్షులయ్యారు. ఉద్యోగులకు న్యాయం విషయంలో అందరూ సహకరించారు. అందరూ అయ్యో! అన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. అక్కడికెళ్లు…ఇక్కడికెళ్లు.. అదిగో వచ్చే….ఇదిగో వచ్చే…ఈ మాటలు తప్ప ఆర్డర్లు ఇంత వరకు చేతికి రాలే. మళ్ళీ కొలువుల్లో చేరలేదు. ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు, హనుమకొండ హైదరాబాదు తిరిగి, తిరిగి జీవితాలు అలసిపోతున్నాయి.    

చివరికి పారిశుధ్య కార్మికులుగానైనా పనిచేస్తాం…మాకు పని చూపించండి.

 దారి చూపండి. మా కొలువులు మాకియ్యండని కూడా వేడుకున్నారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. వరంగల్‌ మహానగర పాలక సంస్థ కొత్తగా నియమించిన కార్మికులు ఎలాంటి భరోసా లేని ఉద్యోగులు. గృహనిర్మాణ శాఖ నుంచి వచ్చిన వాళ్లు భరోసా కావాలనే ఉద్యోగులు. దాంతో ఆ ఆశ కూడా ఆవిరైంది. ఇలా ఏ అవకాశం వచ్చినా సరే కొలువు చేస్తామంటున్నా వారికి దారి దొరకడం లేదు. కొలువులలో నుంచి తొలగించిన నాటి నుంచి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను కలుస్తున్నారు. వారిని వేడుకుంటూనే వున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కలిసివచ్చారు. అయినా పని కావడం లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఛీప్‌ విప్‌. దాస్యం వినయ్‌ భాస్కర్‌. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజు సారయ్య కూడా వీళ్ల కోసం ప్రయత్నాలు చేశారు. 

ఆఖరుకు మున్సిపల్‌ శాఖ మంత్రిని కలిశారు. 

 ఈ ఉద్యోగులకు మంత్రి కేటిఆర్‌ స్పష్టంగా చెప్పారు. మాట ఇచ్చారు. 51 మందిని వరంగల్‌ మహానగర పాలక మండలి తీసుకుంటుందని ప్రకటన కూడా చేశారు. అంతే కాదు వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కూడా తీర్మానం జరిగింది. మినట్స్‌ లో ఎంటర్‌ చేశారు. వాళ్ల ఫైలు ఇప్పటికీ హైదరాబాదు, వరంగల్‌ కు ఆర్టీసి బస్సు తిరినట్లు తిరుగుతుందే తప్ప, అభాగ్యులకు కొలువులు రావడం లేదు. ఆరేళ్లుగా జరిగిన ఒక్కో విషయం ప్రతి సందర్భాన్ని ఉటంకిస్తే ఒక గ్రంథమే రాయొచ్చు. అయినా బాధ తీరలేదే! మాటిచ్చారు…!! వాళ్లలో ఆశలు నింపారు. వాళ్లు వేడుకుంటున్నారు. గొడగొడ ఏడుస్తున్నారు. పెడతా అంటే దగ్గరకొస్తారు. కొడతా అంటే దూరం పోతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సహకరించారు. ఎక్కడ లోపం జరుగుందనేదాన్ని పసిగట్టి వారికి న్యాయం చేయలేకపోతున్నారు. ముందు మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఇక ఉద్యోగాలు వచ్చినట్లే అనుకున్నారు. మేయర్‌ తో లెటర్‌ తెచ్చుకున్న విషయంలో తిరకాసు జరిగింది. అది కూడా పాపం వాళ్లకు శాపంగా పరిణమించింది. వాళ్ల ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. పర్మనెంట్‌ కాకపోయినా జీవితాంతం విధులు నిర్వర్తించొచ్చు అనుకున్న కొలువులు మధ్యలో పోయాయి. పదేళ్లు పనిచేశాక కొత్త పనులు చేయడం ఎవరికైనా కష్టమే. తర్వాత తమ కొలువులు నాయకులు ఇప్పిస్తారన్న నమ్మకం వచ్చినా, అందరూ సహకరిస్తున్నా ఉద్యోగ స్వామ్యం నుంచి సరైన సహకారం అందడం లేదు. మేం చెప్పేశాం..మీ పని అయిపోయినట్లే అని నాయకులు అంటున్నారు. అధికారులు ఫైలును అటూ, ఇటూ తిప్పుతున్నారు. విషయం తెలిసి నాయకులు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అదేదో సామెతలా రెడ్డెచ్చె మొదలాయే…అన్నట్లే వుంది. ఎప్పుడూ మొదటి పేజీయే సాగుతోంది. పేజీ తిరిగింది లేదు. పాపం వీళ్ల దశ మారింది లేదు. ఎలాగూ మాట ఇచ్చారు. వాళ్లు ఆశలతో బతుకుతున్నారు. సగం జీవితాలు గడిచిపోతున్నాయి. మిగిలిన కాలమన్నా బతకాలంటే వారి మీద జాలి చూపండి. వారికి కొలువులు ఇచ్చే మార్గం చూడండి.

ప్రగతి వనం, రుద్రంపూర్ నందు సింగరేణి దినోత్సవ వేడుకలు.

పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ 

 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

 

 

 

డిసెంబర్ 23 న నిర్వహించ బడుతున్న సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి వనం రుద్రంపూర్ నందు నిర్వహించు వేడుకల కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించి, అధికారులకు మరియు సిబ్బందికి సలహాలను, సూచనలను ఇచ్చి, పనులన్నీ త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించినారు. అదే విధంగా రేపు సాయంత్రము జరుగబోవు సంస్కృతిక కార్యక్రమాలకు అధిక సంఖ్యలో ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని రోజు వారి ఒత్తిడి నుండి ఆట విడుపు పొందాలని కోరారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ హాజరు అయినారు. 

 

 ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ , కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ, డి.జి.ఎం. ఆర్.సి.హెచ్.పి. వెంకటేశ్వర్లు, ఎం. వి. టి.సి. మేనేజర్ శర్మ, సీనియర్ పి.ఓ. లు మజ్జి మురలి, జి. సుధాకర్, ఎం. శ్రావణ్ కుమార్, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ రమణ రెడ్డి, రుద్రంపూర్ దిస్పెంసరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరశురాములు, ఐ. టి. మేనేజర్ నాగ దీపా, గోపు కుమార్, సకినాల సమ్మయ్య, నిమ్మల రాజు , కుమార్, సివిల్ డిపార్ట్మెంట్, ఎలెట్రికల్ అధికారులు మరియు సిబ్బంధి పాల్గొన్నారు.

సి ఈ ఆర్ క్లబ్. గౌతమ్ పూర్ కమిటీ హాల్. పర్యవేకించిన జిఎం జక్కం రమేష్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సి.ఈ.ఆర్. క్లబ్ మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్. 

రుద్రంపూర్ సి. ఈ.ఆర్. క్లబ్ మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్. ఈ రోజు పర్యవేక్షించినారు. ఈ సందర్భముగా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్ ఉద్యోగుల నుండి అందుతున్న అభ్యర్ధనల మేరకు సి. ఈ.ఆర్. క్లబ్, మరియు గౌతంపూర్ కమ్మునిటీ హాల్ ను పునరుద్దరించాలని కోరినారు. ఈ సందర్భముగా జి.ఎం. జక్కం రమేశ్. సి. ఈ.ఆర్. క్లబ్, కు చేపట్టవలసిన మరమ్మతులను అదే విధంగా కిచెన్ హాల్, డైనింగ్ హాల్, స్టడీ హాల్ మరియు ఇతర పనులను అలాగే గౌతంపూర్ కమ్మునిటీ హాల్ కు ఏ.సి. సౌకర్యము అదనపు డైనింగ్ హాల్ ను నిర్మించాలని అందుకు సంభందించిన పనులను వెంటనే చేపట్టాలని ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ గారికి ఆదేశించారు.

ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్, కొత్తగూడెం ఏరియా టి‌బి‌జి‌కే‌ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం‌డి.రజాక్. ఎస్. ఓ. టు జి. ఎం. ఆర్. నారాయణ రావు, ఏ.జి.ఎం. (సివిల్) సూర్యనారాయణ, ఎం. శ్రావణ్ కుమార్, సి. ఈ.ఆర్. క్లబ్ జాయింట్ సెక్రెటరీ లిక్కి చంద్రశేఖర్, గోపు కుమార్, చిలక రాజయ్య, సకినాల సమ్మయ్య, శేషం రాజు, నిమ్మల రాజు , కుమార్, రాజశేఖర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

డి‌జి‌ఎం పర్సనల్, కొత్తగూడెం ఏరియా

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 

పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని మాట్లాడారు. 

బండి సంజయ్ కామెంట్స్…

ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగించుకొని మొదటి సారిగా సిరిసిల్ల కు వచ్చాను.

ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కేసీఆర్ కుటుంబంలో భయం మొదలైంది. 

ముఖ్యమంత్రి కుటుంబం సంస్కారం లేని కుటుంబం. 

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో చూపెట్టాలి. 

రైతు ద్రోహి కేసీఆర్. 

రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎత్తిసినవ్. 

6 వేల కోట్ల రూపాయలతో రామగుండంలో తిరిగి ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన ఘనత కేంద్రానిది. 

కేసీఆర్ కుటుంబం మీద వస్తున్నా అవినీతి ఆరోపణలు ప్రజల ద్రుష్టిని మళ్లించడానికి కొత్త నాటకాలు ఆడుతున్నాడు. 

కేంద్రం ఇచ్చిన బియ్యం అమ్ముకుంటివి. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించినవ్. 

గ్రామ పంచాయతీలకు, కార్పొరేషన్ లకు, మున్సిపల్ కు ఒక్క రూపాయి ఇవ్వకపోతివి. 

కేసీఆర్ కుటుంబం మోడీని తిట్టడానికి, విమర్శలు చేయడానికి రాజకీయం చేస్తున్నది. 

ఎన్నకల సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని డల్లాస్, అమెరికా చేస్తన్నావ్. 

బిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ పేరును తీసేశారు. 

ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినవ్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 

తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యవస్థను చూసిన నష్టాల్లోకి తీసుకు పోయారు. 

దేశాన్ని ఏం అభివృద్ధి చేస్తావో చెప్పాలి. 

పంజాబ్ రాష్ట్రంలో రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదు.

అద్భుతం చేస్తా అన్నావు ఏం చేసినవ్. 

మోదీ వస్తే ఎందుకు పారిపోతున్నావ్. 

రాష్ట్రానికి ఏం కావాలో ఎందుకు అడగడం లేదు. 

అభివృద్ధి మీద చర్చ జరగాలి. 

లిక్కర్ కేసులో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. 

రాష్ట్రంలో అర్హులైనా వారికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదు. 

నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదు.  

దళితులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు.

అధికార పార్టీ మెంబెర్స్ ఉన్నప్పుడు లాభాల్లో ఉన్నా సెస్ ను నష్టాల్లో ఎందుకు పోయింది. 

సెస్ నష్టపోవడానికి కారకులుమీరు కదా..? సెస్ లో 33 కోట్ల అవినీతి జరిగింది నిజం కదా..? విచారణ ఎందుకు చేయలేదు. 

పవర్ లూమ్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. 

రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదు. 

సెస్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గల్లంతు కాబోతుంది. 

రేపు తెలంగాణలో వచ్చేది బీజేపీ పార్టీ ప్రభుత్వమే.  

సెస్ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. సెస్ ను లాభాల్లో తీసుకెళ్లండి. 

గతంలో బిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు చేసినోని ఆస్తులు బయటకు తీస్తాం. 

సెస్ ను నష్టాల్లో లాగిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదా. 

ఎట్టి పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వెయ్యకండి. 

మళ్ళీ వాళ్ళు గెలిస్తే సెస్ ను అమ్ముకుంటారు. 

సెస్ ను నాశనం చేసిన నాయకున్ని సంకలో పెట్టుకున్నాడు కేటీర్. మళ్ళీ అదే దొంగకు ఓట్లు వేయమని కోరుతున్నాడు.  

విలేకరులను, పొలీస్లను తిట్టే కుటుంబం కేసీఆర్ ది. 

కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతి మయంలో కూరుకుపోయింది. 

ప్రజల సంక్షేమ పథకాలకు కేసీఆర్ పేరు ఎలా పెడుతారు. 

బిఆర్ఎస్ నాయకులు దొంగ దందాలు, లంగ దందాలు చేస్తున్నారు. 

సెస్ ను కాపాడుకునే విదంగా మనం పోవాలి. 

ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల అధికారులు లొంగితే రేపు మీ జాబులు పోతాయి. 

రాష్ట్రం లో రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 

రాష్ట్రంలో తలకాయ లేని హెల్త్ డైరెక్టర్ ఉన్నాడు. 

రాష్ట్రం లో అవినీతి పరుల అధికారుల చిట్టాను మొత్తం బయటకు తీస్తాం. 

సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సెస్ ఎన్నికలు జరగాలి. అడ్డదారిలో అధికారులు ప్రయత్నిస్తే జిల్లా అధికారులు బాధ్యత వహించాలి.

పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుండి బహిష్కరణ

ఇల్లంతకుంట:నేటిధాత్రి న్యూస్:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజా ప్రతినిధులకు,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా సెస్ ఎన్నికలలో బాగంగ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇల్లంతకుంట మండల సెస్ అభ్యర్థి మల్లుగారి రవిందర్ రెడ్డి కాదని ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థిని మరియు అతనికి మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు

1) భూంపెల్లి రాఘవరెడ్డి { పొత్తూర్ }

2) ఆకుల సత్యం { పొత్తూర్}

3) ముక్కుస కేశవరెడ్డి{ ఓగులాపుర్ }

4) చల్ల నవీన్ రెడ్డి { వెంకట్రావుపల్లె}

5) కొమటిరెడ్డి బాస్కర్ రెడ్డి{ముస్కానిపేట}బిఆర్ఎస్

పార్టీ క్రమశిక్షణ ఉల్లంగించి పార్టీకి ద్రోహం చేసినందున పార్టీ అదిష్టానం ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీ క్రమ శిక్షణ,దిక్కరణ చర్య క్రింద వారిని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ చేయనైనది.పార్టీ మండలం అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు హనుమకొండ జిల్లా లోని కరీంనగర్ ఎన్ హెచ్ 163 హైవే పైన మహాధర్నా

పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే

పరిష్కరించాలని ఎబివిపి హనుమకొండ లో విద్యార్థులతో శవయాత్ర మరియు మహా ధర్నా నిర్వహించడం జరిగింది కేవలం విద్యార్థుల పట్ల చూపిస్తూ నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థులు ఫీజు

రియంబర్స్మెంట్ రకా చదువుకి దూరం అవ్తునారు పేద విద్యార్థులు ఉన్నంత చదువు చదవాలని గవర్నమెంట్ హాస్టల్స్ లో సౌకర్యాలు సరిగ్గా లేక ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు వెంటనే గవర్నమెంట్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది ఇలాగే విద్యార్థుల పట్ల నీ నిర్లక్షల పాలన కొనసాగిస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులు నిన్ను ఏ గద్దె ఎక్కించారో ఆ గద్దె దించడానికి తెలంగాణ లో ఉన్న విద్యార్థులకు ఎక్కువ సమయం పట్టదు కేసీఆర్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ పాలనలో ఇంతవరకు విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు బహుశా కేసీఆర్ ఉద్దేశంలో బంగారు తెలంగాణ అంటే ఊరుకో బారు గల్లికో వైన్స్ ఏర్పాటు చేయడమే కెసిఆర్ లక్ష్యంగా బంగారు తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పనిచేస్తుండు నీ నిర్లక్ష్య పాలనని విద్యార్థుల పట్ల కొనసాగిస్తే ఎబివిపి నిన్ను విడిచిపెట్టదు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు, రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ , , వరంగల్ మహానగర కార్యదర్శి ఆరేపల్లి సుజిత్, హనుమకొండ జిల్లా కన్వీనర్ అయితే నిఖిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నమిత, భాను వరప్రసాద్, అరుణ్, జోనల్ ఇన్చార్జులు గణేష్, మనోజ్, సిద్దు, కార్యకర్తలు రోహిత్, భరత్, ఆశిష్, స్వామి, శ్రీనివాస్, కౌశిక్, శివ, రాకేష్, జశ్వంత్, సాయి, పవన్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

 

*డిమాండ్స్.*

*1. పెండింగ్ లో ఉన్న 2200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని*

*2. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న పాయిజన్ గురించి హైకోర్టు సీటింగ్ జడ్జి గారితో విచారణ జరిపించాలి*

*3.300 గురుకులాలకు నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి*

*4. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించి ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి*

*5. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి*

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి రామన్న

రామన్నకే మద్దతు అంటున్న ఓటర్లు*

మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య

తంగళ్ళపల్లి నేటిధాత్రి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిక్కాల రామారావు కి కేటాయించిన బీరువా గుర్తుకు ఓటు వేయాలని బ్యాలెట్ ను చూపిస్తూ ప్రచారం జరిగింది. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ కార్యకర్తలు గడప గడప తిరుగుతూ ఓట్లను అభ్యర్తిస్తూ ప్రచారం సగిందన్నారు. సెస్ వినియోగదారులలో రామన్న అంటే ఒక నమ్మకం ఏర్పడిందని, ప్రతి ఒక్కరు రామన్నకే తమ ఓటు వేస్తామంటు నినాదాలు చేశారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, వార్డు సభ్యుడు కోడం రమేష్, రెడ్డి యువజన నాయకులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, నేరెళ్ల బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడూరి శ్రీనివాస్ ఉన్నారు.

కేటీఆర్ ను విద్యార్థి ద్రోహి అని ఫ్లేక్సి లు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ తండ్రి నర్సయ్య 35 సంవత్సరాలు కులం మాల నివాసం ఎల్లారెడ్డిపేట అనే అతను మారవెల్లి రంజిత్ తేది 20 డిసెంబర్ 2022 రోజున ప్రోద్దున 6 గంటల 30 నిమిషాల సమయంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్ పోటో ఉన్న ఫ్లేక్సి లను కట్టి విద్యార్థుల ద్రోహి మంత్రి కేటీఆర్ అతను బలపరచిన వ్యక్తి ని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని రాసి సెస్ ఎలక్షన్ లో భాగంగా రాజకీయ పార్టీల మధ్య గోడవలు జరిగే విధంగా టిఆర్ఎస్ పార్టీ మనోభావాలు దెబ్బ తినే విధంగా చేయడం జరిగింది అని పిర్యాదు చేయగా ఇట్టి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ శేఖర్ తెలిపారు

కేసిఆర్‌ నాయకత్వమే నవశకం.

`తెలంగాణ పోరాటం టిఆర్‌ఎస్‌!

` రైతు ఉద్యమం బిఆర్‌ఎస్‌!!

`వస్తున్నాయి బిఆర్‌ఎస్‌ రథచక్రాలు.

`కదులుతున్న బిజేపి కూసాలు.

`మళ్ళీ ప్రాంతీయ పార్టీలలో చిగురిస్తున్న ఆశలు.

`బిఆర్‌ఎస్‌తో కలిసి సాగేందుకు సన్నాహాలు.

`హైదరాబాదు రానున్న పంజాబ్‌ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు

`వివిధ రాష్ట్రాలను నుంచి కేసిఆర్‌ వద్దకు నేతలు

`డిల్లీలో మళ్ళీ కదం తొక్కిన రైతులు.

`గతంలో రైతులకు కేసిఆర్‌ మద్దతు.

`ఇప్పుడు కేసిఆర్‌ భరోసా రైతులు ముందుకు.

`దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ తో రైతు సంఘటితం.

`కేసిఆర్‌ సభలతో పెరగనున్న చైతన్యం..

`రైతుల్లో కనిపిస్తున్న ఉత్తేజం.

`రైతు రాజ్య స్థాపనకు శ్రీకారం.

` కేసిఆర్‌ నాయకత్వం కోసం రైతుల ఆహ్వానం.

`దేశవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ సంచలనం.

`కేసిఆర్‌ అంటేనే ఒక ప్రభంజనం.

`బిఆర్‌ఎస్‌ నేతృత్వంలోనే రైతుకు చంద్రోదయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజల్లోనుంచి ఉద్భవించిన నాయకుడికి ప్రజలకు ఎలా సేవ చేయాలన్నదానిపై నిరంతర మధనం వుంటుంది. ప్రజలకు ప్రతి నిమిషం ఏదో మంచి చేయాలన్న సంకల్పం ఉద్భవిస్తూనే వుంటుంది. అలాంటి వాటినుంచే సంక్షేమ పథకాలు నాయకుల మదిలో నుంచి పురుడు పోసుకుంటాయి. ప్రజలకు ఫలాలు అందజేస్తుంటాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంటాయి. వారి బతుకులకు భరోసా కల్పిస్తుంటాయి. ప్రతి దశలో ఒక నాయకుడు విజన్‌ అవుతాడు. దారి చూపుతాడు. దిక్సూచిగా మారుతాడు. రేపటి సమాజ నిర్మాణం కోసం బలమైన పునాదులు నిర్మిస్తాడు. భవిష్య వ్యవస్ధను పటిష్టం చేస్తాడు. అలాంటి నాయకుల్లో కేసిఆర్‌ అగ్రగణ్యుడు. అవును. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా చూడని విధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇన్ని రకాల పధకాలు అమలు చేస్తూ, తెలంగాణను ఎనమిదేళ్లలో బంగారు మయం చేసిన నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకుడు ఇక దేశానికి దిక్సూచీ అయ్యే తరుణం ఆసన్నమైతే. అది నిజంగా కేసిఆర్‌ నాయకత్వం మన దేశానికే నవశకం కానున్నది.తెలంగాణ అంటే ఒకప్పుడు ఉమ్మడి పాలకులకు చీదరింపు. చిన్న చూపు. ఆ పదం వాడాలంటే కూడా ఇష్టం లేని కాలం. వెనుకబడిన ప్రాంతంమన్నారే గాని, దాన్ని ముందట పడేయాలన్న ఆలోచన ఏనాడు చేయలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఏ నాయకుడు తీసుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురిచేసే కుట్రలే చేశారే తప్ప, ఏ రంగంలోనూ కనీస ప్రగతికి నోచుకోలేదు. అందుకే కేసిఆర్‌ నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. టిఆర్‌ఎస్‌ రూపంలో పోరాటం చేసింది. తెలంగాణ అంతా ఏకం చేసింది. తెలంగాణ సాధించింది. కేసిఆర్‌ నాయకత్వం మూలంగా తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది. అంతటితో ఆగలేదు. అసలు కథ అక్కడే మొదలైంది. తెలంగాణ వస్తే మహా అంటే కొన్ని కొలువులు వస్తాయి అనుకున్నారు. ఇక నీళ్ల సంగతి విషయంలో ఒక్క కేసిఆర్‌కు తప్ప మరెవరికీ స్పష్టత లేదు. అందుకే ఎవరూ ఊహించని సాగునీటి ప్రాజెక్టులను తలపెట్టారు. తెలంగాణను మూడేళ్లలో సస్యశ్యామం చేశాడు. మొదటి మూడు సంవత్సరాలలో తెలంగాణలోని 46వేల చెరువులకు పూర్వ కళ తెచ్చాడు. వాటిని నిండైన గంగాళాలు చేశాడు. ఏడాది పొడవునా చెరువులు నీళ్లతో కళకళలాడేలా చేశాడు. ఇదీ ఒక పాలకుడి విజయం. తెలంగాణ ప్రజలకు నవోదయం. అయితే తెలంగాణలో ప్రాజెక్టు అన్న పదం కూడా విననపడకుండా ఉమ్మడి పాలకులు చేశారు. తెలంగాణ రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, నాలుగేళ్లలో పూర్తి చేసి, నీటి ఫలాలు అందించాడు. తెలంగాణను కేసిఆర్‌ కోటి ఎకరాల మాగాణ చేశాడు. ఇప్పుడు తెలంగాణలో పండుతున్న సిరులు, దేశ మంతా పండేందుకు, దేశమంతా సుసంపన్నమయ్యేందుకు బిఆర్‌ఎస్‌ రధ చక్రాలు వస్తున్నాయి.దాంతో బిజేపి కూసాలు కదులుతున్నాయి. అసలు తెలంగానలోనే టిఆర్‌ఎస్‌ను లేకుండా చేద్దామని కుట్రలు పన్నుతున్న బిజేపికి దిమ్మ తిరిగేలా కేసిఆర్‌ పథకం రచించారు. మొదటిసారి దక్షిణాది నుంచి కేసిఆర్‌ జాతీయ పార్టీ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉత్తరాధి పెత్తనంలో సాధించలేనిది, ఇప్పుడు దక్షిణాది నేత శకంలో దేశమంతా సుభిక్షమయ్యేందుకు దారులు పడనున్నాయి. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమౌతూ, బిఆర్‌ఎస్‌కు తోడుగా నిలవనున్నాయి. బిఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి అడుగులేయనున్నాయి. అందుకు కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధనే కాదు, ప్రగతి ప్రస్ధానం కూడా అందుకు కారణమౌతోంది. ఉత్తరాధిలోని పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కూడా బిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారంటే కేసిఆర్‌ నాయకత్వంలో వున్న బలమెంతో అర్ధం చేసుకోవచ్చు. బిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేష్‌ యాదవ్‌ లాంటి నాయకులు హాజరయ్యారంటేనే అక్కడ కూడా బిఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు వుందనేది అర్ధమౌతూనే వుంది. ఇదిలా వుంటే ఈ రోజు పంజాబ్‌ సిఎం కూడా కేసిఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ వస్తున్నారంటే ఆయన నాయకత్వంలో రాజకీయాలను అనుసరించాలని ఆప్‌ కూడా చూస్తున్నట్లే లెక్క. ఇదిలా వుంటే ఇప్పటికే నిత్యం దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి కూడా రైతు నాయకులు వస్తున్నారు. కేసిఆర్‌ను కలుస్తున్నారు. అక్కడ బిఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నారు.

వారి వారి రాష్ట్రాలలో సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సమాచారం అందిస్తున్నారు. డేట్లు ఫిక్స్‌ చేసుకుంటున్నారు. ఇలా దేశమంతా బిఆర్‌ఎస్‌ ఒక్కసారిగా ప్రభంజనంగా మారిపోనున్నదని చెప్పడంలో సందేహం లేదు. ఒకనాడు డిల్లీలో కదం తొక్కిన రైతలకు ఆనాటి నుంచి బిఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మద్దతిచ్చారు.దేశంలో కేంద్ర ప్రభుత్వవైఖరిని ఎండగట్టిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని రైతులను చైతన్యం చేసింది కేసిఆర్‌. ప్రధాని మోడీని నిలదీసింది కేసిఆర్‌. ఆఖరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంలో రైతులు చేసిన ఉద్యమంతోపాటు, కేసిఆర్‌ ఇచ్చిన మద్దతు కూడా ఒక కారణం. అందుకే దేశంలోని రైతులందరికీ కేసిఆర్‌ అంటే ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఆయనపై భరోసా. అందుకే మళ్లీ ఉద్యమం మొదలు పెట్టారు. డిల్లీ వీధులు దద్దరిల్లేలా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ భరోసాతో రైతులంతా ముందుకు సాగుతున్నారు. వారికి కేసిఆర్‌ అండ వుందన్న బలమైన నమ్మకంతో వారు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సాధిస్తేగాని ఆ ప్రాంతం బాగుపడదని పోరాటంచేశాడు. తెలంగాణ సాధించాడు. ఇప్పుడు కూడా దేశమంతా సస్యశ్యామలం కావాలంటే, రైతు రాజు కావాలంటే, సగటు సామాన్య భారతీయుని జీవితం చిరుగురించాలంటే బిఆర్‌ఎస్‌ రావాలి. రైతుకోసం ఉద్యమించాలి. రైతులకు అండగా నిలవాలన్న సంకల్పంతో కేసిఆర్‌ భయలుదేరారు. ఆనాటి ఉద్యమ ఆకాంక్షే ఇప్పుడూ వుంది. మరింత నిండుగా వుంది. ఆనాడు కేసిఆర్‌తో ఎవరూలేరు. కాని ఇప్పుడు కేసిఆర్‌తో దేశమే వుంది. దేశమంతా కేసిఆర్‌ నాయకత్వం కోసం ఎదరుచూస్తోంది. రైతు సంక్షేమ కోరుకుంటున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌ వస్తే తమ జీవితాలు బాగుపడతాయనకుంటున్నారు. దేశమంతా సస్యశ్యామలమౌతుందనుకుంటున్నారు. అందుకే కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు అనేక రాష్ట్రాలలో రైతు నాయకులు కదం తొక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చే శక్తి వున్న కేసిఆర్‌ అడుగులో అడుగులు వేసేందుకు రైతు నాయకులంతా ఒక్క తాటిపైకి వస్తున్నారు. ప్రజలను కదిలిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ వైపు చూసేలా చేస్తున్నారు. ఇప్పుడు కేసిఆర్‌ ఒక బలమైన శక్తి. రైతు జీవితాలకు వెలుగౌతున్న నాయకుడు. బిఆర్‌ఎస్‌ రూపంలో ఒక ప్రభంజన శక్తిగా మారుతున్నాడు. దేశాన్ని మార్చేందుకు కేసిఆర్‌ సిద్దపడుతున్నాడు. దేశంలో రైతును రాజు చేయాలన్న గొప్ప ఆశయంతో హస్తిన వైపు సాగుతున్నాడు. తెలంగాణ సాక్షిగా, కర్నాటక తోడు, మహారాష్ట్ర నీడగా, ఉత్తర ప్రదేశ్‌ అండగా, పంజాబ్‌ బాసటగా, దేశమంతా కేసిఆర్‌ను ఆహ్వానిస్తోంది. కేసిఆర్‌ దేశాన్ని సుబిక్షం చేస్తాడని ఎదరుచూస్తోంది.

ఆ డీలరే.. ఈ డాన్‌!

`డీలర్‌ ముదిరి.. డాన్‌ అవతారం!

`షరభ…షరభ ఇసుకాసుర..!

`ఇసుక మేటల పేరుతో మొదలైన యవ్వారం…

` రైతులకు తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్న వైనం..

`అధికారుల పూర్తి సహకారం.

` ఇసుక మేటల తొలగింపు పేరుతో గోదావరి నదినే కొల్లగొట్టాడు.

` వేల కోట్లకు పడగలెత్తాడు…

`ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు.

`విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది.

`అధికారులకు పట్టింపు లేదు…

`డాన్‌ తన వ్యాపారం ఆప లేదు.

` ప్రభుత్వం సీజ్‌ చేసిన ఇసుక కూడా అమ్ముకున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు.

`మంచిర్యాల జిల్లాలో ఆ డానే సూపర్‌ పవర్‌…

`జైపూర్‌ మండలంలో అతను ఎంత చెబితే అంత! జిల్లాలోనూ అంతే!

`కలెక్టర్‌ నుంచి మొదలు కింది స్థాయి ఉద్యోగులంతా అతను ఏది చెబుతే అది!

`ఈ విషయంలో గత ఆర్డీవో సంచలన వ్యాఖ్యలు.

`డాన్‌ వెనక అధికార గణం…ప్రజాధనం మంగళం. 

      హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఆ ఒక్కటీ అడక్కు.. అనే సినిమాలో ఒక డైలాగ్‌ వుంటుంది. గాలం పట్టుకొచ్చాడు సముద్రాన్ని నమ్ముకున్నాడు అని ఓ డైలాగ్‌ వుంటుంది. అచ్చు ఇక్కడ డీలర్‌ కూడా అంతే…! కాకపోతే అక్కడ కష్టాన్ని నమ్ముకున్న పాత్ర కనిపిస్తుంది. ఇక్కడ సామాన్యులను దోచుకున్నది తెలుస్తుంది. అధికారుల అండదండలతో ఎలా ఎదిగాడన్నది కనిపిస్తుంది. ఎంత మందిని మోసం చేశాడన్న విషయం తెలుస్తుంది. ఎంత కాలం ఈ కాంట పెట్టి బియ్యం జోకి, వచ్చే కమీషన్‌ తో ఏం బతుకుతామనుకున్నాడో ఏమో! డీలర్‌ శ్రీను. గోదావరి గట్టు దాకా వెళ్లాడు…పొలాలలో ఇసుక మేటలు చూశాడు. ఇటు తిరిగి గోదావరి నదిలో వున్న ఇసుకను చూశాడు. పొలాలలో మేట వేసిన ఇసుకకు, గోదావరి నది ఇసుకలో కలిపితే పాయే… రెండూ కలిపి తోడితే అయిపాయే…అది తడిదే…ఇదీ తడిదే…రెండూ కలిపితే లారీలకు లారీలు నిండే…ఎస్కవేటర్లు తెచ్చి పనికానిస్తే ఇసుక మనదేనాయే…అమ్ముకొని సొమ్ము చేసుకుంటే అయిపాయే! పేరు పెరుమాళ్లది…ఆరగింపు అయ్యవారిది. తన భూమిలో ఇసుక తోడేస్తే మహా అయితే ఎంతొస్తుంది. నది పొడవునా వున్న జాగలనీ వశం చేసుకుంటే పోలే…అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కార్యచరణ మొదలుపెట్టాడు. ఇంకే ముంది లారీలకు లారీలు తోడుతున్నాడు…అమ్ముతున్నాడు. సొమ్ము చేసుకుంటున్నాడు. ఎదురొచ్చిన వాళ్లందరి నోళ్లు నోట్ల కట్టలతో మూయిస్తున్నాడు. అందరికీ నోట్లిచ్చి కనికట్టు చేస్తున్నాడు. అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాళ్లను మరమనుషులను చేసి ఆడిస్తున్నాడు. తన పనులు కానిచ్చేసుకుంటున్నాడు. ఎంత దాకా అంటే మంచిర్యాల జిల్లా మొత్తం విభాగం డీలర్‌(డాన్‌) చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది జనం చెబుతున్న మాట. జిల్లా అంతటా చెప్పుకుంటున్న మాట. 

సహజంగా తొండ ముదిరు ఊసరవెళ్లి అయ్యిందనేది మనం ఎప్పుడూ వినే సామెత.

 కాని ఇది నిజం. డీలర్‌ శ్రీను ముదిరి.. డాన్‌ అవతారం ఎత్తాడు. అక్రమాలకు అడ్డాగా మారాడు. కోట్ల సంపాదనకు ఎగబడ్డాడు. ఎలా సంపాదించామన్నది కాదు. ఎంత సంపాదించామన్నది ముఖ్యమనుకున్నాడు. నాలుగు తరాలు తిన్నా తరగనంత సంపాదించాలనుకున్నాడు. అవకాశాలను అడ్డదారిలో అందుకున్నాడు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్లాడు. కలిసొచ్చే వాళ్లను నోట్లతో నోరు మూయిస్తూ వస్తున్నాడు. మొత్తానికి అక్రమ సంపాదనకు ఎగబడ్డాడు. అక్రమంగా ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు. వ్యవస్థను వంచన చేస్తూ, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఆడిరది ఆటగా, పాడిరది పాటగా సొమ్ముల వేట సాగిస్తున్నాడు. 

షరభ…షరభ ఇసుకాసుర..! 

డాన్‌ ( డీలర్‌) శ్రీను ఎంత చెబితే అంత. ఏంచెబితే అది. అంతే అధికారులు మరో మాట మాట్లాడితే ఒట్టు. శీను హవా వర్షాకాలంలో ఇసుక మేటల పేరుతో వ్యాపార యవ్వారం మొదలైంది. గోదావరికి వరదలు రావడం సహజం. వర్షాకాలంలో ప్రతి యేటా గోదావరికి వరదలు వచ్చి పక్కనున్న పొలాలు మునిగిపోవడం కామన్‌. దాంతో పెద్ద ఎత్తున పొలాలలో ఇసుక చేరుతుంది. పంటలు దెబ్బతింటాయి. పొలాలలో పూర్తిగా ఇసుకతో నిండి మేటలు వేస్తాయి. అలా మునిగిపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఆ ఇసుకను తొలగించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుంది. ఇసుక తొలగించే కార్యక్రమం చేపడుతుంది. ఇది మంచి ఆదాయమార్గం. ఆ ఆదాయంపై శీను కన్నుపడిరది. అంతే అధికారులను మచ్చిగ చేసుకున్నాడు. అడిగినంత ముట్టజెప్పి వారిని బుట్టలో వేసుకున్నాడు. తనది కాని పొలాల మీద కన్నేశాడు. రాత్రికి రాత్రి ఇతర రైతుల పొలాలను వారికి తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్నాడు. అధికారుల పూర్తి స్థాయిలో సహకారిస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అక్కడ మొదలైన ఇసుక తోడుడు వ్యవహారం. గోదావరి నదినే కొల్లగొట్టాడు. గడచిన పుష్కరకాలం నుంచి శీను గోదావరిని వశం చేసుకున్నాడు. ఇసుకను సొంత ఇంటికి తరలించినంత సులువుగా, నిత్యం పదుల సంఖ్యలో ఎక్సవేట్లు మోహరించి, వందలాది ఇసుక లారీలు తరలిస్తున్నారు. ఇసుకాసుర అవతారం ఎత్తాడు. అసలు 

 వేల కోట్లకు పడగలెత్తాడు…

 ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు.

 ఇసుక అక్రమ రవాణే నేరం. అందులోనూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము ఎగ్గొట్టడం ఇంకా పెద నేరం. అది కూడా వందల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టడమంటే మాటలు కాదు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా గద్దలుగా మారితే తప్ప ఇంత విచ్చలవిడి తనానికి తావుండదు. అసలు జిల్లా యంత్రాంగాన్నంతా ఒక్క వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోవడమంటేనే ఆశ్చర్యమనిపిస్తోంది. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటేనే గగనం. ఒక ఎమ్మార్వో సమయం ఇవ్వడం పెద్ద తతంగం. అలాంటిది జిల్లా స్థాయిలో అధికారులు ఒక వ్యక్తి చెప్పుచేతుల్లోకి వెళ్లిపోయినంత విదేయత ప్రదర్శిస్తున్నట్లు ప్రజలే చెబుతున్నారు. తహసీల్దారు కార్యాలయం అడ్డాగా చేసుకొని, పక్కన కూర్చొని పని చేయించుకుంటూ సామాన్యుల భూములు గుండుగుత్తగా రాయించుకున్నట్లు కూడా అనేక ఆరోపణలున్నాయి. అటు ఇసుక కొల్లగొడుతున్నాడు. ఇటు భూములు ఆక్రమించుకుంటున్నాడు. వందల కోట్లు పన్నులు ఎగ్గొడుతున్నాడు. తన ఇసుక వ్యాపారం పేరుతో రోడ్లు ధ్వంసం చేస్తున్నాడు. ప్రజల జీవితాలలో దుమ్ముకొడుతున్నాడు. వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. వారి బతుకులు ఆగం చేస్తున్నాడు. అటు ప్రకృతి విధ్వంసం… ఇటు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. వారించాల్సిన అధికారులే దగ్గరుండి పనులు కట్టబెడుతున్నారు. శ్రీను కోట్లు కొల్లగొట్టుకునేందుకు దారి చూపిస్తున్నారు. 

విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది. 

ప్రభుత్వాదాయానికి పంగనామాలు పెట్టి, వందల కోట్లు ఎగనామం పెట్టి దర్జా వెలగబెతున్న డీలర్‌ శ్రీను అక్రమ సంపాదనపై విజిలెన్స్‌ ఎంక్వైరీ కూడా జరిగింది. అది పూర్తయ్యి 5 సంవత్సరాలు నడుస్తోంది. అయినా అధికారులకు పట్టింపే లేదు. డీలర్‌ శ్రీను తన వ్యాపారం ఆగింది లేదు. పన్నులు కట్టింది లేదు. ఇసుక రవాణా ఆగడం లేదు. భూముల ఆక్రమణ ఆగిందెక్కడా లేదు. నివేదికలలో విస్తుపోయే నిజాలున్నాయి. వందల కోట్ల ఎగవేత ఎలా జరిగిందనేది స్పష్టంగా వుంది. కానీ చర్యలేవి?…ఆ ఒక్కటీ అడక్కు..!

కాంగ్రెస్ లో.. అసలు కోవర్టులెవరు…?

కాంగ్రెస్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం..

# ఎమ్మెల్యే సీతక్కతో సహా 12 మంది కీలక నేతలు రాజీనామా

# కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ముందే చెప్పిన

 నేటిధాత్రి దినపత్రిక 

హైదరాబాద్,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల నేటిధాత్రి దినపత్రిక చెప్పింది నిజమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నేటిధాత్రి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూనే ఉన్నది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గం మరోవైపు పోరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ల వివాదం నడుస్తుండగానే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు సంచలన కీలక నిర్ణయం

తీసుకున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది ముఖ్య నేతలు ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క,సీహెచ్ విజయరమణారావు,

కల్వంపల్లి సత్యనారాయణ, సుభాష్ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి,చిలుమ మధుసూదన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి,దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్,చారగొండ వెంకటేష్, సత్తు మల్లేష్, శశికళ యాదవరెడ్డి వంటి కీలక నేతలంతా టీపీసీసీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ కు రాజీనామా లేఖను పంపించారు. తమకు పదవులు ఇవ్వడం వల్ల సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని,తమ పదవులు వారికి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం సిద్ధమైంది. ప్రధానంగా అసంతృప్తి నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఆయా నాయకుల వ్యాఖ్యలు పార్టీని ఏ విధంగా దెబ్బతీసేటట్టు ఉన్నాయో స్పష్టం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్రకు అసంతృప్తి నేతలు తెరతీస్తున్నారనే దిశలో గట్టిగా స్పందించాలని రేవంత్‌ వర్గం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి నష్ట నివారణ చర్యలు అధిష్ఠానం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకుని అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఏఐసీసీ కార్యదర్శులు అసంతృప్తి నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వెలసిందా! పెట్టింది రా! అంబేద్కర్ విగ్రహం పై ఇరు వర్గాల పోరు.

*దళిత ద్రోహులను వెంటనే అరెస్టు చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.* 

*దళిత ముసుగుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఖబర్దార్. టిఆర్ఎస్ పార్టీ దళిత సంఘం ఇన్చార్జ్.* 

*ఒకవైపు అపశక్నం ఒకవైపు పాలాభిషేకం. ఈరోజు కొరకే నా అంబేద్కర్ పోరాటం.* 

*మహాదేవపూర్- నేటి ధాత్రి:*

రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నక్సలైట్లు హతమార్చిన వారికి సంబంధించి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపంపై శనివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం వెలవడంతో ఇటు దళిత సంఘాలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న దళిత నాయకులు ఒకరు పాలాభిషేకం చేస్తే మరొకరు అపశఖనం అంటూ రాస్తారోకులు ధర్నాలు చేస్తూ ఒక వర్గం అంబేద్కర్ ని గొప్పగా చూపిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని కించపరిచారని చెప్పడం మరొకరు విగ్రహం వెలవడం ప్రతి చోటా అంబేద్కర్ విగ్రహం ఉండాలని మరో వర్గం విగ్రహం పెట్టడాన్ని హర్షిస్తూ ఇరు వర్గాల దళితులు మండలం తో పాటు జిల్లా వ్యాప్తంగా శ్రీపతిరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపం పై వెలసిన అంబేద్కర్ విగ్రహ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కానీ సామాన్యులు అంబేద్కర్ ప్రేమికులు మాత్రం ఇది కుట్ర రాజకీయ పలుకుబడి కోసమే అని చెప్పక తప్పడం లేదు.

 

 *వెలసిందా పెట్టింది రా అంబేద్కర్ విగ్రహం పై ఇరు వర్గాల పోరు.* 

 

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అన్నారం క్రాస్ రోడ్ వద్ద గత 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు ను నక్సలైట్లు హతమార్చడం తో వారి జ్ఞాపకార్థం స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో శనివారం తెల్లవారుజామున స్తూపం పై భాగంలో అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం తో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు టిఆర్ఎస్ పార్టీ కు చెందిన దళితులు తెరపైకి రావడం జరిగింది. కానీ ఎవరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి మేము పెట్టామని రాజ్యాంగ నిర్మాత కావడంతో ఈ విగ్రహాన్ని మేము స్తూపం పై పెట్టడం జరిగిందని ఎవరు కూడా చెప్పడం లేదు కానీ అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఒకవైపు అంబేద్కర్ గొప్పవాడు మరోవైపు విగ్రహం ఇక్కడ పెట్టడం అపశక్నమని రాస్తారోకోరు పాలాభిషేకాలు చేయడం విగ్రహాన్ని తీసివేయాలని అర్ధరాత్రి విగ్రహం పెట్టడం దీనికి కారణం ఏమిటని స్థానిక పోలీసులకు కూడా ఆశ్రయించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం వెలిసిందని ఒక వర్గానికి చెందిన దళితులు చెప్పడం భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం వెలవడం అంటే ఎవరైనా పెట్టిండు అన్నట్టు లేక విగ్రహమే తనకు తానే స్థూపంపై ప్రతిష్టాపన అయిందా లేక మరో ఇతర పార్టీలకు చెందిన మరి ఎవరైనా కావాలని స్తూపం పై భాగంలో అర్ధరాత్రి ఎవరికి తెలవకుండా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారా ఈ వర్గం ఏ ఆలోచనతో విగ్రహాన్ని స్తూపం పై పెట్టాల్సి వచ్చింది అసలు అంబేద్కర్ విగ్రహం స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపంపై పెట్టవచ్చా ఇలా అనేక అనుమానాలు మండల ప్రజలతోపాటు మంథని నియోజక వర్గం అలాగే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు. కొందరు అంబేద్కర్ ప్రేమికులు ఇతర వ్యక్తులైతే ఇది కేవలం రాజకీయాల లబ్ధి కోసమే ఒకవైపు దళితులను తమ వైపు లాగుకొనుటకు చేస్తున్న కుట్ర అని కూడా అనుకుంటున్నారు.

 

 

 *దళిత ద్రోహులను వెంటనే అరెస్టు చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉప అధ్యక్షుడు.* 

 

అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహం పై పెట్టి అంబేద్కర్ అవమానపరచడం జరిగిందని వారిని వెంటనే శిక్షించాలని అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి వారిని అవమానించడం జరిగిందని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపిటిసి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మంచినీళ్లు దుర్గయ్య మాలభైరి రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది. ఇక అన్నారంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులు అర్పించడం కూడా జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపదస్వర కస్తూపంపై గుర్తు తెలియని వ్యక్తులు మహనీయుని విగ్రహాన్ని పెట్టి ఆయనను అవమానించడం జరిగిందని తక్షణమే వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ స్థూపం సంవత్సరాల తరబడి శ్రీపతిరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిందని మండలమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి వరకు శ్రీపతిరావు లాంటి మహనీయుని బాబు ఇష్టులు హతమార్చడం నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజలను తన బిడ్డల్లా చూసుకున్న నాయకునికి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా మండల ప్రజలు తన నాయకున్ని ఈ స్థూపం లో చూసుకునే విధంగా ప్రజలకు ఈ స్థూపం చూసినప్పుడల్లా తమ నాయకుడు తమకు చేసిన సేవలు వారిపై నాయకుడు చూపించే ప్రేమ గుర్తుకు వచ్చేలా కట్టడం జరిగిందని అలా ఏర్పాటుచేసిన ఈ స్థూపంపై ఒక మహనీయుని విగ్రహం ప్రతిష్టాపన చేయడం యావత్ దళితులకు సిగ్గుచేటని అది కేవలం స్మారకార్థం ఒక నాయకుని గుర్తింపుగా పెట్టినటువంటి స్థూపంపై ఒక మహనీయుని విగ్రహాన్ని పెట్టించడంలో ఇంత పెద్ద రాజకీయ నాయకుడైన వారిని గుర్తించి వెంటనే శిక్షించాలని దుర్గయ్య డిమాండ్ చేయడం జరిగింది.

 

 *దళిత ముసుగుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఖబర్దార్. టిఆర్ఎస్ పార్టీ దళిత సంఘం ఇన్చార్జి.* 

 

మంథని నియోజకవర్గంలో గతకుండేళ్ల నుండి అగ్రవర్ణాల ఆధిపత్యంతో బడుగు బలహీన వర్గాల అవమానాలకు గురవుతు కావున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం అన్నారం మూలమలుపు వద్ద ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని దళిత సంఘం నాయకులు మంథని నియోజకవర్గం భూ పెళ్లి రాజు అన్నారు అన్నారా మూల బలుపు వద్ద ఉన్నటువంటి స్తూపం సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాజు మాట్లాడుతూ స్మారక స్తూపం వద్ద ప్రపంచ మేధావి అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల హక్కులను ప్రసాదించిన మహనీయుని విగ్రహాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు సంఘం ముసుగులో కొనసాగుతున్న నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని తెలిపారు మంథని నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ వాదులు కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడాలని హితవు పలికారు అన్నారం ఎంపీటీసీ దుర్గయ్య అంబేద్కర్ పెట్టిన భిక్షావల్లి ఎంపిటిసిగా గెలిచి అన్నారంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి శిలాఫలకాలు ఏర్పాటు చేయకుండా అంబేద్కర్ గారికి అంబేద్కర్ ని అవమాన పరిచినట్లు కాదా పెతందారుల మోచేతి నీళ్లు తాగే మంచినీళ్లు దుర్గయ్య కు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భూపెల్లి రాజు తన ప్రకటనలో తెలపడం జరిగింది.

 

 *ఒకవైపు అపశక్నం ఒకవైపు పాలాభిషేకం. ఈరోజు కొరకే నా అంబేద్కర్ పోరాటం.* 

 

స్మారక స్తూపం పై అంబేద్కర్ విగ్రహం అపశక్నమా లేక పాలాభిషేకం చేయడమా ఏది నిజం అని మండల ప్రజలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు మరోవైపు ఇది అంబేద్కర్ ప్రేమ నా లేక దళితులను తమ వైపు తిప్పుకొనుటకు కుట్రగా ముందస్తు అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్ల సర్దుబాటు కొరకు చేసే కుట్ర నా అని ప్రజలు చెప్పుకునే పరిస్థితికి తీసుకువచ్చింది శ్రీ పద స్మారక స్తూపం పై వెలిసిన అంబేద్కర్ విగ్రహ వ్యవహారం. అంబేద్కర్ విగ్రహం ఒక స్మారక స్థూపం పై అర్ధరాత్రి గెలవడానికి ఒక వర్గం సంతోషిస్తూ అంబేద్కర్ ఆశయాలను పొగుడుతూ వారి చిత్రపటాల కు పూలమాలలు వేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న వేళ మరోవైపు మరో వర్గం స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపంపై మహనీయుని విగ్రహాన్ని అర్ధరాత్రి ఎవరికి తెలవకుండా పెట్టడం వెనుక కారణమేమిటి కేవలం ఇది కుట్రపూరిత వ్యవహారమే సంవత్సరాల తరబడి బాబుల చేతిలో హతమైన నాయకుని పేరుపై వారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన స్తూపంపై విగ్రహం పెట్టడం ఒకవైపు అంబేద్కర్ను అవమానించడం అలాగే దళితులను సైతం కించపరచడం అంబేద్కర్ దళితుడు కావడంతో వారి విగ్రహాన్ని ఒక స్మారక స్తూపం పైపెట్టడం ఊరి బయట దట్టమైన అడవిలో ఏర్పాటు చేయడమే అంబేద్కర్ తో పాటు యావత్ దళితులను అవమానించడం అని ఒక వర్గం చెప్పుతూ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తుంది. ఏది నిజం స్మారకార్థం పై స్తూపం అపశక్నమా లేక రాజకీయ లబ్ధి కోసమే స్మారక స్తూపం పై అంబేద్కర్ విగ్రహానికి పెట్టడమా స్థూపం పై విగ్రహం పెట్టడం శుభమేనా వాస్తవాలు ఎలా బయటికి వస్తాయి ఎవరికోసమైతే తిండి లేక ఆకలికి తట్టుకొని తన మీదస్సులు తన ప్రజలకు పణంగా పెట్టి నేడు వారి అభివృద్ధి వారి హక్కులను అందించుటకు అతని జీవితాన్ని ధారపోసి చివరికి తను అనుకున్నది సాధించి తన దేశ ప్రజలు సమానత్వంలో గౌరవత్వాన్ని పొందాలని ఉద్దేశంతో తను అందించిన రాజ్యాంగం ఈరోజు అనుకున్నది సాధించుకునే వెసులుబాటును కలిగించి దేశ ప్రజల కు స్వేచ్ఛను అందించిన ఆ మహనీయునికి ఇచ్చే గౌరవం ఇదేనా ఈనాటి కొరకే నా అంబేద్కర్ తన జీవితాన్ని తన ప్రజలకు దార పోసింది ఈరోజు అంబేద్కర్ పేరు వారి విగ్రహాలు ఎటువైపు వెళుతున్నాయి ఎవరి లాభాల కోసం ఏ వ్యక్తుల కొరకు అంబేద్కర్ భావాలను అంబేద్కర్ విగ్రహాలను అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారా అంబేద్కర్ అంటే దేశానికి ఆదర్శ పౌరుడుగా నిలిచిన ఆ పేరును ఈరోజు ఎక్కడికి తీసుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుంది రాబోయే తరానికి అంబేద్కర్ నినాదం విగ్రహాల ప్రతిష్టాపన అపశక్నం పాలాభిషేకం వరకు మాత్రమే సరిపోయే పరిస్థితి తీసుకువచ్చేలా అన్నారం మూల బలుపు వద్ద అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించిన వ్యవహారం రాబోయే తరాలకు ఇదే అంబేద్కర్ వాదంలా కనబడే పరిస్థితి ఉండగా తప్పదని అంబేద్కర్ ప్రేమికులు మేధావుల అంచనా.

`అసలు కోవర్టు లెవరు?

`పనిచేద్దామన్న సోయి ఒక్కరిలో లేదు!

`ఎంత సేపు ఆధిపత్యమేనా!

`లేని అవమానాల గురించేనా!

`సర్దుకుపోలేరా?

`పార్టీ పటిష్ఠం కోసం ఆలోచించరా!

`రాజకీయం తప్ప, పార్టీ పట్టదా!

`కోవర్టు రాజకీయమంతా రేవంత్‌ కోసమేనా?

`అందరూ కోవర్టులైనప్పుడు రాజకీయమెందుకు?

`పార్టీలో కొనసాగుడెందుకు?

`ఎవరి దారి వారు చూసుకోగా వద్దన్న వారు ఎవరు?

`సీనియర్లు పని చేయరు?

`చేసే వారిని ముందటపడనీయరు?

`మొత్తానికి సీనియర్లు అనిపించుకుంటున్నారు?

`పార్టీ గెలిచినా తమ పరిస్థితి మారదని వారికి తెలుసు?

`ఇలా వుంటేనే సీనియర్ల పెత్తనానికి అడ్డుండదు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఇంతకీ కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులున్నారా? వుంటే ఎవరు? అన్నదానిపై ఎడతెగని వాదనలు ఎప్పుడూ వినిపిస్తూనే వున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి వింటున్న మాటే. అయినా వారిలో మార్పు రాదు. లేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, తప్ప ఇంత వరకు సాధించిందేమీ లేదు. ప్రజల్లోకి వెళ్లింది లేదు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పిపిసి పదవిలో వున్నంత కాలం ఆయనను మార్చితే తప్ప పార్టీ బాగుపడదు అన్నారు. ఆ చర్చే పార్టీలో విసృతంగా సాగింది. అయినా అధిష్టానం ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని చాలా కాలం పాటు ఆ పదవిలోనే వుంచింది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ అంటే ఎంతో కొంత ఇష్టమున్నవారి దగ్గరనుంచి మొదలుపెడితే, అందరూ ఉత్తమ్‌ ను నిందించించిన వారే. ఇప్పుడు ఉత్తమ్‌కాలమే నమన్నట్లు కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది.  

అసలు కోవర్టులు అన్న పదం వదిలేసి అందరం కలిసి పనిచేద్దామన్న ఆలోచనే ఎవరికీ లేదు.

 రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడయ్యాక పార్టీ పరుగులు పెడుతుందని అందరూ ఆశించారు. కాని అప్పటికే సీనియర్లు ఒక బలమైన నిర్ణయంతో ముందుకు సాగారు. అందరూ కలిసి కట్టుగానే వున్నారు. రేవంత్‌ను వ్యతిరేకించడంలో అందరూ ఏకతాటిపైనే వున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తప్పించి, రేవంత్‌ రెడ్డిని అధ్యక్షుడిని చేస్తున్నారన్న వార్తలు వచ్చిన ప్రతిసందర్భంలోనూ ఏదో ఒక వివాదం ముసురుకుంటూనే వుండేది. అది కొంత కాలం పార్టీ శ్రేణులకు కూడా అలవాటైంది. ఇక కాలం గడుస్తున్న కొద్ది కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం మరింత పెరిగే క్రమంలో ఏఐసిసి రేవంత్‌ను ప్రకటించింది. అంతే అప్పటినుంచి పార్టీలో అల్లకల్లోలం మొదలైంది. రేవంత్‌రెడ్డిని ఇప్పటి వరకు ఒక్కనాడు కూడా స్ధిమితంగా లేకుండా పోయింది. రేవంత్‌ పిసిసి అధ్యక్షుడయ్యాక రూ.50 కోట్లు పెట్టి కొనుక్కుంటే వచ్చిన పదవి అంటూ ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక అక్కడితో మొదలైన విమర్శల జడివాన ఇక ఎక్కడా ఆగలేదు. ఆగుతుందన్న నమ్మకం కూడా పార్టీ శ్రేణులకు లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు. అయితే జగ్గారెడ్డి, లేకుంటే కోమటిరెడ్డి, ఇక వాతావరణం చల్లబడుతుందనుకుంటున్న సందర్భంలో హనుమంతరావు..ఇలా ఎవరికి వారు పార్టీని భ్రష్టుపట్టించడంలో పోటీ పడ్డారనే చెప్పాలి. ఇక పార్టీని నాయకులు వీడడం అన్నది కూడా ఒక ప్రహసనంగా మారింది. దాసోజు శ్రవణ్‌ వెళ్లిపోయారు. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోయారు. తమ్ముడు మునుగోడులో మళ్లీ గెలిస్తే వెంకటరెడ్డికూడా ఇప్పటికే పార్టీ వీడేవారు. కాని ఆగిపోయారు. అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు బిజేపిలోనూ కర్చీఫ్‌ వేసుకునే ప్రయత్నంలోనే వున్నాడు. తాజాగా ఆయనకు వున్న స్టార్‌కాంపెయినింగ్‌ పదవికాస్త ఊడిరది. ఆ పదవిని చాలా సార్లు వెంకటరెడ్డి చులకనగా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ మధ్య మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ వీడారు. ఎలాంటి షరతులు లేకుండా బిజేపిలో చేరారు. అంటే అక్కడ ఎలాంటి హమీ లేకుండా చేరినప్పుడు, అక్కడ ఎలాంటి పదువులు ఆశించనప్పుడు, పార్టీ మారడంలో ఆంతర్యమేమిటో అన్నది ఎవరికీ అంతుపట్టనిది. ఇక తాజాగా తనకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని కొండా సురేఖ రాజీనామా చేశారు. అంటే అందరికీ ఆధిపత్యమే కావాలి. పదవులు కావాలి. కాని పని చేయడానికి మాత్రం ఎవరికీ తీరిక లేదు. తెలంగాణ వచ్చి ఎనమిది సంవత్సరాలౌతున్నా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజలను ప్రసన్నం చేసుకున్నది లేదు. ఎంత సేపు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నాడన్న మాట మాత్రం పదే పదే మాట్లాడుతున్నారు. ఆయన తమకు సహకరించడం లేదంటున్నారు. పిసిసి అధ్యక్షుడు అన్న తర్వాత పార్టీని ఎలా ముందుకు నడపాలన్నదానిపై ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం వుంటుంది. దాన్ని కాదనే హక్కు ఇతరులకు లేదు. అయినా కాళ్లలో కట్టెలు పెట్టే పనులు మాత్రం సీనియర్లు మానుకోవడం లేదు. అసలు సర్ధుకుపోవడం అన్నది లేనే లేదు. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆ మధ్య ఏఐసిసి అధ్యక్షుడి ఎన్నిక సమయంలోనూ దామోదర రాజనర్సింహ గాంధీ భవన్‌ముందు ధర్నా నిర్వహించారు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన అసంతృప్తిని వెల్లగక్కుతూనేవున్నాడు. ఇంత మంది సీనియర్లు రేవంత్‌ను ఒక ఆట ఆడుకుంటున్నా, ఏసిసిసి మాత్రం రేవంత్‌ను పక్కన పెట్టే పరిస్ధితి కనిపించడం లేదు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్‌నేతల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. 

నిజంగా సీనియర్లకు చిత్త శుద్ది వుందా? 

అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మొత్తానికి మొత్తం సీనియర్లు రేవంత్‌ నాయకత్వాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న వాళ్లే..? గతంలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదు. రేవంత్‌రెడ్డి పార్టీని దారిలో పెడతాడని, పార్టీని బలోపేతం చేస్తాడని పార్టీ శ్రేణులు బలంగానే నమ్మాయి. కాని అనుకన్నంతగా పార్టీకి పేరు వచ్చింది లేదు. క్యాడర్‌ పెరిగింది లేదు. ఎప్పటికప్పుడు రేవంత్‌రెడ్డి ఎంత హడావుడి చేసినా, ఆయన ఎన్ని సభలు పెట్టినా లాభం లేకపోతోంది. మునుగోడు ఎన్నికల ముందు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయగానే సభ ఏర్పాటు చేశారు. నిజానికి అంతపెద్ద సభ ఏర్పాటులో కాంగ్రెస్‌లో జోష్‌ నిండాలి. కాని ఎవరినడిగి సభ ఏర్పాటు చేశారు. తనకు సరైన సమాచారం లేదని ఒకరు. తనను ఆ సభలో ఇష్టానును సారం మాట్లాడారని వెంకటరెడ్డి, నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదని మధుయాష్కి గౌడ్‌లు మాట్లాడడం విన్నదే. అంటే రేవంత్‌ వేసే ప్రతి అడుగును సీనియర్లు అడ్డుకుంటున్నారనేది సుస్పష్టం. 

ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఏడాది మాత్రమే వుంది. 

 అయినా కాంగ్రెస్‌ కలవరం ఆగడంలేదు. కల్లోలం ఆగడం లేదు. పిపిసి అధ్యక్షుడి మీద అలకలు ఆగడం లేదు. ఆయన మీద వ్యతిరేకత తగ్గడం లేదు. ఇప్పటికైనా రేవంత్‌ను మార్చండన్న మాటలు ఆగడం లేదు. మొత్తానికి సీనియర్లు రేవంత్‌ను ముందట పడకుండా చేయడంలో సక్సెస్‌ అవుతున్నారన్నది మాత్రం నూరు నూరుపాళ్లు నిజం. ఏఐసిసి ఎంత చెప్పినా సీనియర్లు వినడం లేన్నది కూడా నిజం. ఈ వయసులో వారికి పదవులకన్నా, ఆత్మగౌరవం ముఖ్యమనుకునే వాళ్లు కొందరైతే, పిసిసి ఒక్కసారైనా కావాలనుకుంటున్న వాళ్లు కొందరున్నారు. దాంతో ఈ కల్లోలం రేవంత్‌ ను పక్కన పెట్టేదాకా ఆగదు. ఒకరినొకరుకోవర్టులున్న మాటలు మాట్లాడుకోకుండా మానరు. ఇది టి కప్పులో తుఫాను అనుకోవడానికి వీలులేదు. కలిసున్నట్లే నటిస్తారు…పక్కకు జరగ్గానే ఎవరి రాజకీయం వారు ఆడుతారు. అదంతే! కాంగ్రెస్‌కథంతే!!

ఎల్లలు దాటిన ప్రేమ

అబ్బాయిదేమో ఇండియా, చైనాకు చెందిన అమ్మాయి కలుసుకున్నది కెనడా

కలిపినది సాఫ్ట్ వేర్ రంగం

భారతీయ సంప్రదాయబద్ధంగా వారిద్దరూ ఒకటయ్యారు

వరంగల్ తూర్పు డిసెంబర్17

ప్రేమకు ఎల్లలు అనేవి ఉండవని మరోసారి నిరూపితమైంది.ఇండియాకు చెందిన అబ్బాయి, చైనా నుంచి వెళ్లిన అమ్మాయి ఇద్దరు కెనడాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా ఒకేచోట పని చేస్తున్న పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటవ్వాలన్న నిర్ణయానికొచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇండియా బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఆదిరాజు జనార్దన్ రావు,శైలజల చిన్న కొడుకు వెంకట శివగణేష్ సాకేత్, చైనాకు చెందిన హానూ టంగ్,హే టంగ్ ల కూతురు ట్రెసీలు కెనడాలో ఉద్యోగం చేస్తూ ప్రేమించుకుని తెలంగాణలోని హనుమకొండలో పెళ్లి పీటలెక్కారు.హనుమకొండలోని కే యూ శుభం కళ్యాణ వేదికలో శనివారం వారి తల్లిదండ్రులు,పెద్దల సమక్షంలో భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయబద్ధంగా వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఒకటయ్యారు.మంగళ వాయిద్యాల మధ్య పెద్దలందరూ అక్షింతలు వేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కుమారుని చిన్ననాటి స్నేహితుడు వద్దిరాజు నిఖిల్ చంద్ర వివాహ తంతు మొదలై ముగింపు వరకు ఉండి శుభాకాంక్షలు తెలిపారు

బిఆర్ఎస్ రాష్ట్ర నేత మేడారపు సుధాకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్ 

పాలకుర్తి నేటిధాత్రి 

న్యూఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఢిల్లీలో నూతన కార్యాలయం

ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ సీఎం కేసీఆర్ గారిని కలిసి కెసిఆర్ కిట్ పై తాను చేసిన ‘ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు కెసిఆర్ కిట్ ఎ స్టడీ ‘ పి.హెచ్.డి పరిశోధన గ్రంథాన్ని సీఎం కేసీఆర్ గారికి సమర్పించారు, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు, తెలంగాణలోని తల్లి బిడ్డల సంక్షేమం గురించి రూపొందించినటువంటి కేసీఆర్ కిట్ పథకం విజయవంతమైన తరుణంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కేసీఆర్ కిట్ ఫై పరిశోధన చేసినటువంటి డాక్టర్ మేడారపు సుధాకర్ ను సి.యం కేసీఆర్ గారు అభినందించారు,

ఢీ అంటే ఢీ

 

దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్.

జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ.

దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా.

రైతు నేతలే ఊతం…

రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం.

వేగంగా అడుగులు

ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన

రైతు నాయకులదే కీలక బాధ్యత.

తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలు.

కేసిఆర్ కు ఛాలెంజ్ లు ఎప్పుడూ కొత్తే!

తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే!

మలి దశలో తెలంగాణ వాదం ఎత్తుకోవడం సాహసోపేత నిర్ణయమే.

ఎక్కడా తల వంచింది లేదు..

ఎప్పుడూ ఓడింది లేదు…

నమ్మిన సిద్ధాంతం కోసం వెనుకడు వేసింది లేదు.

విజయాలే తప్ప అపజయాలకు చోటు లేదు.

ఇప్పుడు కూడా కేసిఆర్ కు తిరుగులేదు.

ఢీ అంటే ఢీ. ఇది కేసిఆర్ కు మొదటి నుంచీ అలవాటు. వ్యక్తిగా ఆయన ఏది ఎంచుకున్న సక్సెస్ అవుతూనే వచ్చారు. నాయకుడిగా ప్రజలకు ఏం కావాలో అవి నెరవేరస్తూ వచ్చారు. ఇలా తాను తలపెట్టిన ప్రతి పనిని విజయవంతం చేయకుండా వదిలేయలేదు. ఆయన చేపట్టిన ప్రతి పని ఒక గెలుపే. ఒక ఆదర్శమే. ఆచరణీయమే. అనుసరణీయమే. దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకురావాలని చూస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ మొదటి నుంచి ఏం చేశారన్నది కూడా తెలియాలి. ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నేత మదన్ మోహన్ శిష్యరికంలో రాజకీయాలలో ఓనమాలు దిద్ది, ఇప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు.‌ తెలంగాణ సాధించాక తెలంగాణ మొత్తం అమలు చేసిన కార్యక్రమాలలో కొన్ని సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎప్పుడో చేసి చూపించారు. ఆ విషయాలు, వివరాలు ఈ తరానికి, యావత్ దేశానికి తెలియాల్సివుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో బిజేపి యేతర పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలతో పాటు బిజేపి పాలిత రాష్ట్రాల ప్రజలకు కేసిఆర్ నాయకత్వ లక్షణాలు తెలియాల్సిన అవసరం వుంది. కేసిఆర్ తొలుత ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోనే ఆయన స్వగ్రామం వుంది.‌ దాదాపు మొత్తం నియోజకవర్గం నీటి కరువుతో అల్లాడుతూ వుండేది.‌ సిద్దిపేట పట్టణం లో కూడా మంచినీటి కోసం ప్రజలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి పాలకుల చిన్న చూపుతో సిద్దిపేట మరింత వెనుకబాటుకు గురైంది. సిద్దిపేట కు సమీపంలో వుండే తడ్కపల్లి అనే గ్రామానికి ఆడపిల్లనియ్యకపోయేవారు. అంటే నీటి కష్టం ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎండాకాలం వచ్చిందంటే పశువులకు కూడా మంచినీళ్లు దొరికేవి కాదు. పైగా ఎక్కడ చూసినా ఎడారిని తలపించేలా చెట్టు నీడ కనిపించనంత దుర్భరమైన పరిస్థితులు. ‌అటు నీళ్లు లేక‌ పంటలులేవు.‌ ఇటు తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు.‌ ప్రకృతి అసమతుల్యత. ఏక కాలంలో ఆనాడే ఈ సమస్యలు తీర్చిన ఏకైక నాయకుడు కేసిఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ మొత్తం ఆ పనులు పూర్తి చేసి, బీడులను పొలం మడులుగా మార్చి బంగారు సిరులు పండించాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నాడు. సిద్దిపేట నియోజకవర్గం మొత్తానికి అవసరమైన మంచి నీళ్ల కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన పైపు లైన్ ద్వారా నీటిని తరలించాడు. ఊరూరుకు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాడు. ఇంటింటికి ఆనాడే మంచినీళ్లు అందించాడు. పాతాళ గంగను పైకి తెచ్చి సిద్దిపేటకు నీళ్లిచ్చాడు. ఒకనాడు నీటి గోస అనుభవించిన సిద్దిపేటకు నిత్యం మంచినీటి సరఫరా చేయించాడు. అది తర్వాత కాలంలో తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ అయ్యింది. తాగు నీటి సమస్య తీరింది.‌ ఇక సాగు నీటి సమస్య తీరాలి. అప్పటి పాలకులు తెలంగాణలో సాగునీటి కోసం రూపాయి ఖర్చు చేసే పరిస్థితి లేదు.‌ కనీసం చెరువులైనా బాగు చేయమని అడిగినా నిధులు లేవని చెప్పి, చేతులు దులుపుకున్న సందర్భం. దాంతో శ్రమదానం పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులను పునరుద్ధరించిన ఘనత కేసిఆర్ ది.‌ అలా వరుసగా ప్రతి ఏడాది వేసవి కాలంలో శ్రమదానం నిర్వహించి చెరువులు బాగుచేసుకున్నారు. కొంత నీటి నిల్వలు పెంచుకున్నారు. ‌ఇదే తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 46 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా ఎండా కాలంలో కూడా మత్తళ్లు దుంకే చెరువులు ఒక్క తెలంగాణ లోనే వున్నాయి.‌ ఇక పచ్చదనం- పరిశుభ్రం‌ పేరుతో సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి చెట్ల పెంపకం చేపట్టారు. అనతి కాలంలోనే సిద్దిపేట నియోజకవర్గ‌ పరిధిలో ఎక్కడిక్కడ పచ్చదనం వెల్లివిరిసింది. ఎండాకాలంలో పశువులకు నీడ కల్పించేంత పచ్చదనం నిండిపోయింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఏటా ఒక పండుగగా సాగుతోంది.‌ ప్రతి సంవత్సరం జూలై నెలలో కొన్ని కోట్ల మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ మొత్తం పచ్చదనం పురివిప్పి నాట్యమాడుతోంది.‌ ఈ విషయాలు దేశమంతా తెలియాలి. 

 

దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్. ఇప్పుడు దేశంలో ఎక్కడ వింటున్నా ఇదే మాట. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. బిజేపితో కొట్లాడాలన్న కసి ఆ పార్టీలో కనిపించడం లేదు. దేశంలో అనేక పార్టీలు వున్నా కేంద్రాన్ని నిలదీసే స్థితిలో లేవు. గట్టిగా మాట్లాడలేకపోతున్నాయి. కానీ ఒక్క కేసిఆర్ మాత్రమే బిజేపి మీద నిప్పులు చెరుగుతున్నాడు. ప్రధాని మోడీని తూర్పారపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నాడు.‌ కేంద్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నాడు. ధరలపై గళమెత్తుతున్నాడు. సంపన్నులకు సంపద దోచి పెట్టడాన్ని నిలదీస్తున్నాడు. రైతుల తరుపున మాట్లాడుతున్నారు. రైతు రాజ్యం తెచ్చేందుకు ఏకంగా బిఆర్ఎస్ ఏర్పాటు చేశాడు. ప్రజలు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నాడు. ఒకనాడు తెలంగాణ కోట్లాడేందుకు ఒక్కడుగా ఎలా భయలుదేరాడో, ఇప్పుడు కూడా అలాగే ఒంటరి ప్రయాణం, పోరు మొదలుపెట్టాడు. దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ రూపుదిద్దుతున్నాడు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి, దేశాన్నేలే సీట్లు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నాడు. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా కనిపిస్తోంది. కేసిఆర్ నాయకత్వమే కావాలంటోంది. 

 

బిఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక రైతుదే. రైతు నేతలే. సరికొత్త రాజకీయమే. దేశానికి కొత్త నేతలే. సరికొత్త పంధాతో ముందుకు సాగుడే. రైతు నేతలే ఊతం…దేశ వ్యాప్తంగా ఏ రాజకీయ అండా లేని అనేక అసంఘటిత రైతు సంఘాలకు, నేతలకు బిఆర్ఎస్ వేధిక కానున్నది. దేశంలోని రైతాంగాన్నంతా కదిలించనున్నది. ఎక్కడిక్కడ రైతు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం. అందుకే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే

ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన జరిగింది. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ నియామక‌‌ పత్రాలపై సంతకాలు చేశారు. బాధ్యతలు అప్పగించారు. రైతు నాయకులదే కీలక బాధ్యత. తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలౌతున్నాయి.‌ కేసిఆర్ కు ఛాలెంజ్ లు కొత్త కాదు…అయినా ప్రతి సందర్భం ఎప్పుడూ కొత్తే! తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే! మలి దశలో తెలంగాణ వాదం ఎత్తుకోవడం సాహసోపేత నిర్ణయమే.ఎక్కడా తల వంచింది లేదు..ఎప్పుడూ ఓడింది లేదు…

నమ్మిన సిద్ధాంతం కోసం వెనుకడు వేసింది లేదు.విజయాలే తప్ప అపజయాలకు చోటు లేదు.

ఇప్పుడు కూడా కేసిఆర్ కు తిరుగులేదు…

దక్షిణాది నేత…మార్చనున్న భారత తలరాత!

 

`కేసిఅర్‌ దేశాన్నేలే భవిత విధాత.  

`రాజశ్యామల యాగంతో డిల్లీలో పాగా.

`తొలుత రైతు నేత ఎంపిక.

`దేశానికి సరికొత్త బాట.

`పట్టదలలో విక్రమార్కుని మించిన శక్తి కేసిఆర్‌.

`పట్టిన పట్టును సాకారం చేసేదాకా వదలని పవర్‌ కేసిఆర్‌.

`తెలంగాణ తెచ్చేదాకా పోరు ఆపలేదు.

`తెలంగాణ సస్యశ్యామలం చేసే దాకా అలుపులేదు.

`తెలంగాణ మోడల్‌ సరికొత్త ఆదర్శం.

`దేశమంతా అమలు చేయడమే కేసిఆర్‌ లక్ష్యం.

`ఇక మొదలైంది రాజకీయ రణం.

`దేశ దశ-దిశ మార్చే దాకా ఆగని ప్రయాణం.

`దక్షణాది నుంచి డిల్లీలో పార్టీ ప్రకటించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌.

` రైతు సేవతో దేశం తరించాలన్న నినాదంతో ముందుకు.

`రైతు సెంటిమెంట్‌ సక్సెస్‌ ఫార్ములాకు అసలైన పేటెంట్‌…

`జయహో…బిఆర్‌ఎస్‌ అనక తప్పదు…

`కేంద్ర రాజకీయాలన్నీ ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.

దక్షిణాది నేత…మార్చనున్న భారత తలరాత!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశ రాజకీయాలలో సరికొత్త ఆవిష్కరణ జరిగింది. దేశమంటే మక్కువ, మమకారం, కన్న భూమి మీద అత్యంత గౌరవం వున్న నాయకుడు కేసిఆర్‌. అందుకే మలితరం తెలంగాణ ఉద్యమానికి ఊపిరూలూదాడు. జై తెలంగాణ అని నినదించాడు. పద్నాలుగేళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పోరాటానికి అంకితం చేశారు. ఉద్యమమే ఊపిరిగా చేసుకున్నాడు. అరవై ఏళ్ల తెలంగాణ గోస తీరాలని బలంగా కోరుకున్నాడు. కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. ఒక్కడుగా అడుగులు మొదలుపెట్టాడు. ఒక్కడే బయలుదేరాడు. అంతా శూన్యమే…కలిసొచ్చే వారెవరూ…అనేది ఓ బ్రహ్మపదార్థమైన వేళ…ఒక్కడే అయినా సరే జెండా ఎత్తుకున్నాడు…ఊరూరు తిరిగాతాడు…ప్రజలను కదిలించాడు….మేధావులను ఆహ్వానించాడు. వారితో కొన్ని కలిసి రోజులపాటు తెలంగాణ గురించి అధ్యయనం చేశాడు. ఉద్యమానికి ఒక రూపు తీసుకొచ్చాడు… తెలంగాణ వస్తే, ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై కూడా అప్పుడే బ్లూ ప్రింట్‌ తయారు చేశాడు. అటు ఉద్యమం, ఇటు అభివృద్ధి మంత్రం రెండూ జోడిరచాడు. అందుకే తెలంగాణ నా జన్మ హక్కు. అభివృద్ధి నా ప్రాంత హక్కు అని ప్రకటించి ఉమ్మడి పాలకులకు చుక్కలు చూపించాడు. ప్రపంచంలో ఏ ఉద్యమ కారుడు చేయని అలుపెరగని ఉద్యమం సాగించాడు. రాజకీయాన్ని ఉద్యమ పోరాటానికి ముడిపెట్డి తెలంగాణ సాధించాడు. పట్టుదలకు మరో రూపం కేసిఆర్‌ అని నిరూపించాడు. పట్టు బడితే కేసిఆర్‌ ఏదైనా సాధిస్తాడని ప్రపంచానికి చాటాడు. తెలంగాణ కోసం కేసిఆర్‌ తొలి అడుగు వేసిన నాడే ఎంతో మంది అపశకునాలు వల్లించారు. అయినా కేసిఆర్‌ వెరవలేదు. కేసిఆర్‌ మాటలు చాలా మంది నమ్మలేదు. అయినా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అదిగో వచ్చే…ఇదిగో వచ్చే అని ప్రజల్లో స్పూర్తి నింపుతుంటే చాలా మంది తట్టుకోలేకపోయారు. కేసిఆర్‌ ను ఎలాగైనా నిలువరించాలని చూశారు. టిఆర్‌ఎస్‌ ను అణచివేయాలని చూశారు. కేసిఆర్‌ మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. అయినా కేసిఆర్‌ తెలంగాణ సాధన లక్ష్యాన్ని కలలో కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా అంతే. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు తెలంగాణ వస్తే చాలు అనుకున్నాడు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాడు. అభివృద్ధి చేయాలనే చిత్తం, చిత్తశుద్ధి వుంటే ఎంత అభివృద్ధి చేయాలో అంత చేయొచ్చని నిరూపించాడు. సాధ్యం కావన్న పనులన్నీ తెలంగాణలో చేసి చూపించిన నాయకుడు కేసిఆర్‌. 

తెలంగాణ అభివృద్ధి మోడల్‌ గా దేశమంతా అభివృద్ధి జరగాలి.

 అది సాధ్యం కావాలి అంటే కేసిఆర్‌ ప్రధాని కావాలి. కేసిఅర్‌ దేశాన్నేలే భవిత విధాత కావాలి. ఇది తెలంగాణ లో ఆయనంటే అభిమానించే వాళ్లు కోట్లలో వున్నారు. దేశంలో కూడా ఎంతో మంది అనుకుంటున్నారు. ఎన్నో పార్టీలు బిఆర్‌ఎస్‌ తో కలిసి నడవడాలని అనుకుంటున్నాయి. ఏ పార్టీకి లేని విశిష్టత బిఆర్‌ఎస్‌ కు వుంది. ఏ నాయకుడికి లేని ప్రత్యేకత కేసిఆర్‌ కు వుంది. సహజంగా ఏదైనా కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే ఆహ్వానించడం సహజం. పొత్తులు పెట్టుకోవడం కూడా చూస్తున్నదే. కానీ జాతీయ పార్టీగా బిఆర్‌ఎస్‌ అవతరిస్తుంటే కొన్ని రాష్ట్రాల పార్టీలు, నాయకులు సీట్లు త్యాగం చేయడానికి ముందుకు రావడం అన్నది గతంలో ఎన్నడూ చూడలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అఖిలేష్‌ యాదవ్‌, కుమార స్వామి లాంటి నాయకులు హజరయ్యారు. అంటే ఆయా రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌ కు కొన్ని సీట్లు ఇవ్వడమే అని తేలిపోయింది. ఇలా దేశంలోని బిజేపియేతర రాష్ట్రాలలో బిఆర్‌ఎస్‌ పాగా వేసేందుకు, అక్కడి పార్టీలు సహకరిస్తే కేసిఆర్‌ నాయకత్వానికి ఎదురురుండదు. తిరుగుండదు. 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు సెంటిమెంట్లు ఎక్కువ. 

దైవం పట్ల అపారమైన నమ్మకం. అందుకే డిల్లీ రాజకీయాలను శాసించాలని, రాజశ్యామల యాగంతో డిల్లీలో పాగా వేసేందుకు అన్ని అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నాడు. కేసిఆర్‌ జాతీయ స్థాయిలో కూటమి కట్టే ఆలోచనలు చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ నేటిధాత్రి కేసిఆర్‌ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టబోతున్నాడని అందరిన్నా ముందు వెల్లడిరచింది. అంతే కాదు కేసిఆర్‌ జాతీయ స్థాయి పార్టీ పెడితే తీసుకునే ఎజెండా ఏమిటన్నది కూడా ఒక్క నేటిధాత్రి మాత్రమే చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కొత్త పార్టీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేస్తున్న ప్రతి అడుగును అందరికంటే ముందుగా నేటిధాత్రి చెబుతూనే వస్తోంది. గత ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందస్తుకు వెళ్తున్నట్లు నేటిధాత్రి చెప్పడం జరిగింది. 2014 కంటే ఎక్కువ సీట్లు 2018లో టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని అందరికంటే ముందుగా నేటిధాత్రి మాత్రమే చెప్పింది. ఇప్పుడు కూడా డిల్లీ బిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేటిధాత్రి దినపత్రిక మాత్రమే దర్శనమిచ్చింది. ఇదీ నేటిధాత్రి క్రెడిబిలిటీ అని మరో సారి నిరూపించింది. 

అటు బిఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం.

 ఇటు రాజశ్యామల యాగం. మరో వైపు పదవుల పంపకం. తొలుత రైతు నేత ఎంపిక వంటి ఆసక్తికరమైన అంశాలు హస్తినలో చోటు చేసుకున్నాయి. దేశానికి సరికొత్త బాట వేయడానికి తొలి అడుగులు పడ్డాయి. పట్టదలలో విక్రమార్కుని మించిన శక్తి కేసిఆర్‌. పట్టిన పట్టును సాకారం చేసేదాకా వదలని పవర్‌ కేసిఆర్‌. తెలంగాణ తెచ్చేదాకా పోరు ఆపలేదు. తెలంగాణ సస్యశ్యామలం చేసే దాకా అలుపులేదు. తెలంగాణ మోడల్‌ సరికొత్త ఆదర్శం. దేశమంతా అమలు చేయడమే కేసిఆర్‌ లక్ష్యం. ఇక మొదలైంది రాజకీయ రణం. దేశ దశ-దిశ మార్చే దాకా ఆగని ప్రయాణం.

స్వాతంత్య్రం వచ్చిన నుంచి డిల్లీ రాజకీయాలలో కీలక భూమిక పోషించిన వాళ్లు కొందరున్నారు. 

దక్షిణాది నుంచి తొలుత ప్రధాని అయిన తెలుగు తేజం పి.వి. నరసింహారావు వున్నారు. దక్షణాది నుంచి పైగా తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వున్నారు. కానీ దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో పార్టీ ప్రకటించిన వాళ్లు లేరు. నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఎన్టీఆర్‌, ఎన్‌ డి ఏ పేరుతో చంద్రబాబు కొంత కాలం చక్రం తిప్పారు. కానీ జాతీయ పార్టీ ప్రకటన జరగలేదు. దక్షణాది నుంచి డిల్లీలో పార్టీ ప్రకటించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. రైతు సేవతో దేశం తరించాలన్న నినాదంతో ముందుకు. రైతు సెంటిమెంట్‌ సక్సెస్‌ ఫార్ములాకు అసలైన పేటెంట్‌…జయహో…బిఆర్‌ఎస్‌ అనక తప్పదు…కేంద్ర రాజకీయాలన్నీ ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version