ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

.. కరోన సమయంలో 190 కోట్లు వ్యాక్సిన్లు పంపిణీ.

.. దేశవ్యాప్తంగా 200 మెడికల్ కాలేజీలు మంజూరు.

 

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

… రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందికి సన్మానం.

.. బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్.

భారత ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సాధించి ప్రజల మన్ననలు పొందాలని రామాయంపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కి సన్మానం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోణ వంటి విపత్కర పరిస్థితుల్లో దేశంలో నూట తొంభై కోట్ల వ్యాక్సిన్లు అందించి విజయం సాధించిన ఘనత ప్రధాని మోడీ కి దక్కిందన్నారు. అలాగే బియ్యంలో 200 మెడికల్ కాలేజీలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కరుణ వ్యాక్సిన్ టీకాలు ప్రపంచంలో పలు దేశాలకు అందించి భారత్ యొక్క శక్తిని చాటిన గొప్ప వ్యక్తి మోడీ అన్నారు. అలాగే జనరిక్ ఆయుర్వేదిక మెడికల్ షాప్ లను తక్కువ ధరలకే ప్రతి జిల్లా మండల కేంద్రాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ఎన్నో అద్భుతాలు విజయాలు సాధించడం పట్ల ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో పేదలకు 3 కోట్ల 20 లక్షల మందికి వైద్య సేవలు అందించిన ఘనత కూడా మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎన్ని సంవత్సరాల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని మరింత అభివృద్ధి చెందేందుకు భవిష్యత్తులో కూడా బీజేపీకి ప్రజలు పట్టం కట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో

పెంచిన బస్సుపాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి.

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బస్సులపై చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని రామాయంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చాలామంది నిరుపేదలే బస్సులపై ప్రయాణం చేస్తూ చదువుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో బస్ పాస్టర్ పై అమాంతం చార్జీలు పెంచడం వల్ల నిరుపేద విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యా వ్యవస్థకు పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇలా విపరీతంగా చార్జీలు పెంచడం సరికాదన్నారు. దీనివల్ల చాలామంది చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

వివేకానంద లో యోగ ప్రచార తరగతులు యోగ డే పురస్కరించుకొని యోగా అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాను విద్యార్థులకు ప్రచారం నిర్వహించడానికి స్థానిక ,,యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ,,సోమవారం నుంచి ప్రత్యేక యోగ ప్రచార తరగతులు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు .ఈ సందర్భంగా స్థానిక వివేకానంద విద్యాలయం లో విద్యార్థులకు యోగాపై అవగాహన ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పతాంజలి మహర్షి రచించిన యోగ శాస్త్రం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది .అష్టాంగ యోగం లైన యమ. నియమ. ఆసన. ప్రాణాయామ. ప్రత్యాహార . ధారణ .సమాధి .గురించి వివరించడం జరిగిందని కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు .విద్యార్థులు యోగ ధ్యాన ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలో తెలపడం జరిగింది .అని ఆయన తెలిపారు. ఈ వారం రోజులు ప్రత్యేక యోగ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఘనంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ గౌరవ పల్లె జితేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి జన్మదిన కార్యాలయంలో లో పాల్గొన్న వారు మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిత్యవసర సరుకులు పంపిణీ రోజుకు రెండువేల మంది చొప్పున రెండు నెలలు దాతల తోటి బాటచారులు కు భోజనాలు పెట్టించిన ఘనత చైర్మన్ కు దక్కింది అన్నారు. ఎంతోమందికి సేవలందించిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ నిండు నూరేళ్లు ఆరోగ్య ఉండాలని కోరుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, Ae యుగంధర్, నవాజ్ ప్రసాద్ కాలేరు ప్రసాద్, శ్రీధర్ రెడ్డి ,నరేష్ ,బల్ల శ్రీనివాస్, పద్మ,మనోజ్ ,ప్రభాకర్, వెలమల శ్రీనివాస్, చిలుక కృష్ణ, ఆకారం ప్రసాద్ పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి : మండలంలోని పెద్ద బాయి తండా గ్రామం లోని అంగన్వాడి కేంద్రంలో సర్పంచ్ సునీత రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సోమేశ్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ అనిల్, మమత, అంగన్వాడీ టీచర్లు జి. సునీత, రజిత, ఆశ కార్యకర్త,ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కోనేటి లోకి మురుగు నీటి ప్రవాహం

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దేవాలయమైన కోనేటి లోకి నిరంతరంగా మురుగు నీటి ప్రవాహం జరుగుతున్నది పరిసర గృహాల నుండి వాడకం నీరు పరిసర ప్రాంతాల నుండి మురుగునీరు దేవాలయ పుష్కరిణిలోకి ప్రవహిస్తున్నది ఆ మార్గం గుండా వెళ్లే భక్తులకు మురుగునీరు దర్శనమిస్తుంది దీని నివారణ గురించి దేవాలయ అధికారులను గాని గ్రామపంచాయతీ సిబ్బంది వారు ఇరువురు బాగు చేయాలని ఒకరిపై ఒకరు నెట్టివేస్తూ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తమ దృష్టికి వచ్చినా వారికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ సిస్టం ను బాగు చేయాలి దేవాలయ కోనేరు మురికి నీరు రాకుండా రక్షణ చేపట్టాలి.

రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుదాం.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

 

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ సింగ్ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని నాలుగు వీధుల రోడ్లు సిద్దిపేట రోడ్డు,మెదక్ రోడ్డు, కామారెడ్డి రోడ్డు. రోడ్డుకిరువైపులా రెండు వరసల మొక్కలు నాటుదాం అని రామాయంపేట మున్సిపల్ అధికారులు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో పాటు మేనేజర్ శ్రీనివాస్, యుగంధర్, ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రైతుబంధు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి సిపిఎం

నేటిదాత్రి కొమురవెల్లి

 

  కొమురవెల్లి మండలం లో ఎమ్మార్వో కార్యాలయంలో రైతుల పక్షాన కొమురవెల్లి మండల సిపిఎం కార్యదర్శి సత్తిరెడ్డి గారు ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది రైతుబంధు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు మందు బస్తాలు సబ్సిడీపై అందించాలని కొమురవెల్లి ఎమ్మార్వో గారి కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రైతులు పాల్గొన్నారు

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి :

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. మండలంలోని రామవరం, రామేశ్వరం గ్రామాలలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఇంటికి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని ,తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. అనంతరం సురేష్ నాయక్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు న్యాయం చేకూర్చే పథకాలు తీసుకు వస్తుందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాహుల్ గాంధీ సాక్షిగా వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనర్శయ్య , మండల బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిక్షపతి,ఎస్టి సెల్ అధ్యక్షుడు రాహుల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి అంజయ్య, నియోజకవర్గ నాయకుడు భూక్య శ్రీను, భార్గవ్, మండల యువజన నాయకుడు బొమ్మరబోయిన మహేందర్, పాలకుర్తి యూత్ అధ్యక్షుడు హరీష్, రాము నాయక్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి మార్గం వంశీకృష్ణ, ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడు దేశ గాని హరగోపాల్ గౌడ్, సీనియర్ నాయకుడు పెంతల సూరి,ఉప్పలయ్య, సుధాకర్ , స్వామి ,మల్లేష్, యాకిరెడ్డి, ఎల్లయ్య ,సోమనరసయ్య, వెంకన్న , ప్రశాంత్, అజయ్, మందుల బుచ్చమ్మ ,వెంకన్న, నరేష్ రెడ్డి ,బాలు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సిద్దిపేట నియోజకవర్గానికి గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివి

మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య

సిద్దిపేట నేటి ధాత్రి

సిద్దిపేట నియోజకవర్గానికి ఎడ్ల గురువారెడ్డి చేసిన సేవలు మరువలేనివని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజూల-రాజనర్సు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు కొమరవెల్లి అంజయ్య అన్నారు. ఎడ్ల గురువారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం విక్టరీ టాకీస్ చౌరస్తా వద్ద వారి కౌంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజం రజాకార్ల ఆగడాలు, అకృత్యాలకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశారని, సంఘసేవకునిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యులుగా నీతి నిజాయితీ, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా నిరాడంబర జీవితం గడిపి సిద్దిపేట ప్రాంతానికి అనేక వనరులు తీసుకొచ్చి తుది శ్వాస వరకు ఈ ప్రాంత అభివృద్ధికి అశేషమైన కృషి చేశారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి వారు చేసిన సేవలు మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు డా”పాపయ్య, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి,

మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి బన్సీలాల్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కనుకుంట్ల శంకర్, జిల్లా సమితి సభ్యులు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి…

నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోని ఈటెల…

పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమం ప్రారంభంలో కౌశిక్ రెడ్డీ…

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమము ద్వారా రాష్ట్ర

వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డీ అన్నారు. ఐదవ విడత పల్లెప్రగతి కార్యక్రమములో భాగంగా సోమవారం హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రం తో పాటు ఉప్పల్,మర్రిపల్లీ గూడెం తదితర గ్రామాల్లో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్ తో పాటు పాల్గొని ప్రసంగించారు.ఆయా గ్రామాల్లో క్రీడా మైదానాలు ప్రారంభించి,మొక్కలు నాటారు. సమావేశంలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టింది అని, అందులో ముఖ్యమైనది పల్లె ప్రగతి కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమములో భాగంగా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ గ్రామాల్లో ప్రకృతి వనాలు,స్మశాన వాటిక లు,మురుగు కాలువలు నిర్మాణం,పారిశుద్ధ్యం నిర్వహణకు గాను గ్రామ పంచాయతీ లకు ట్రాక్టర్లు, అటో లాంటి వాహనాలు సమకూర్చు తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల సంపూర్ణ అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్ నాయకత్వములో తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా ఎక్కడ లేని విధంగా మహిళలు,యువకులు,రైతులకు అందరి అభివృద్ది ధ్యేయంగా కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్,రైతు బంద్,రైతు బీమా,పెన్షన్లు,లాంటి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.స్వాతంత్య్రం వచ్చిన నుండి తెలంగాణ ఏర్పాటు కాక ముందు వరకు అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి,సమస్యల సుడగుండంలో పడే సారని,రాష్ట్రం ఏర్పాటు జరిగినంక కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సహకరించక పోయిన కెసిఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా నిలిపా డని ఇదంత కెసిఆర్ కు మాత్రమే సాధ్యం అన్నారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డీ హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ ను ఘాటుగా విమర్శించారు.ఎనిమిది సంవత్సారాలు మంత్రిగా పనిచేసి కమలాపూర్ అభివృద్ది మరిచి,తన స్వార్థం కోసం పనిచేశాడు అని మాయ మాటలతో ప్రజలను నమ్మించి మళ్ళీ శాసనసభ్యుడు గా ఎన్నికై ఎనిమిది నెలలు గడుస్తున్నా నియోజక వర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా తిరుగుతున్నాడని విమర్శించారు.తన నియోజకవర్గం అభివృద్ది చేయని వాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాను అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని అనడం సిగ్గు చేటని మరో సారి ఈటెల పై నిప్పులు చేరిగాడు.మండలములో ను వివిధ గ్రామాల్లో గల సమస్యలు పరిష్కారానికి గాను ముఖ్యమంత్రి తనను పంపించారని,ప్రజలు సహకరించి అన్ని సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఉప్పల్ గ్రామ మహిళా గ్రూప్ సభ్యులకు రూ.ఐదు లక్షల చెక్కు అందించారు.కార్యక్రమ ప్రారంభం ముందుగా పార్టీ కార్యకర్తలు,నాయకులు,అభిమానులు బైక్ లు కార్లతో బారి ర్యాలీ తీశారు.

ఫౌల్ట్రీ రైతులను కాపాడాలి

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:

మండలంలోని కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా పౌల్ట్రీ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూదుల రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరియు రాష్ట్రంలో సుమారు 50వేల పైచిలుకు కోళ్ళ ఫారంలు ఉండగా వాటిల్లో సుమారు 3 నుండి 4 కోట్ల కోళ్ళు పెంచుచున్నారన్నారు. కొన్ని కంపెనీలు ఇంటిగ్రేటెడ్ పేరిట రైతులకు కోడి పిల్లలను

ఇచ్చి వాళ్ళ ఫారాలలో పెంచాలని ఒప్పంద చేసుకొని వాటికి తినడానికి దానా, మందులు మాత్రం ఇస్తే,

రైతు మాత్రం ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని కోళ్ళు పెంచడానికి కూలీలా పని చేయాల్సి వస్తుందనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఒక కోడి పెరగడానికి సుమారు 45 నుండి 50 రోజులు రైతులు రాత్రింబవళ్ళు కష్టపడటమే కాకుండా నీరు,కరెంటు, వరిపొట్టు,అడుగున న్యూస్ పేపర్లు మరియు అనునిత్యము ఫారం ను శుద్ధి చేయడం

వంటివి,ఎన్నో చేసినా చివరకు రైతుకు వచ్చేది కిలో వెంబడి రూ.4.50 పైసలు మాత్రమేనన్నారు.దీనివల్ల లక్షల్లో ఖర్చుపెట్టి ఫారంలో పనిచేసిన రైతుకు చివరకు కనీసం కూలీ కూడా మిగలడం లేదన్నారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను

చేశారు.కిలో కోడి బరువుకు 12 రూపాయలు ఇవ్వాలన్నారు. సకాలంలో కోడిని ఫారం నుండి మార్కెట్కు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు.కోడి పిల్లలు చనిపోయే శాతం కంపెనీయే భరించాలనీ కోరారు.

కంపెనీ ఇచ్చిన కోడి పిల్లలను రైతు సుమారు 50 రోజుల పాటు కష్టపడి పెంచి పెద్ద చేస్తాడనీ,ఆ రైతు

పెంచే విధానాన్ని కంపెనీ పర్యవేక్షించుకోవాలినీ అన్నారు.కాని పర్యవేక్షణ ఉద్యోగి(సూపర్వైజర్ కి కోడికి

రూ.6 లు రైతు ఎందుకు భరించాలన్నారు.అది కంపెనీ ఉద్యోగి కాబట్టి కంపెనీయే భరించాలనీ సూచించారు.

కోడి పెద్దగ అయిన తరువాత సకాలంలో కోడిని కంపెనీ అమ్మాలన్నారు.అమ్మక పోవడం వల్ల పెరిగే

ఎఫ్ సి ఆర్ రైతులపై వేయకూడదన్నారు.

కోళ్ళ ఫారాలకు వాడుకునే కరెంట్ను కమర్షియల్ గా కాకుండా వ్యవసాయ కరెంట్ గా మార్చాలన్నారు.అలాగే

కోడి పిల్ల ధరను రూ. 22 కు తగ్గించాలన్నారు.

కంపెనీ కోళ్లను పెంచుచున్నందు వలన రైతుకు కంపెనీయే ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.

బ్యాచ్ కు బ్యాచ్ కు మధ్యన విరామం ఎక్కువ ఇవ్వకుండా వెంటనే కోళ్ళను ఇవ్వాలన్నారు.

 ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు సోంపల్లి రత్నాకర్, బొల్లెడ్ల జలేంధర్ రెడ్డి,రడం వెంకన్న,సంకినేని రాజేశ్వరరావు,కత్తుల సోములు, కొంకటి యాకారెడ్డి. కమ్మగాని సోమయ్య, ఉప్పునూతల రమేష్,కోళ్ల రమేష్,కుందూరు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి :* మండలంలోని రామన్నగూడెం గ్రామంలో సోమవారం బొడ్రాయి, దుర్గామాత , బయ్యన్న పండగ మహోత్సవాలు నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దుర్గామాత, బొడ్రాయి, బయ్యన్న విశిష్టతను తెలియజేస్తూ, వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, టీ ఎస్ ఈ జి సి డైరెక్టర్ అందే యాకయ్య, ఎంపీపీ ధరావత్ జ్యోతి, జెడ్పిటిసి కేలోతు సత్తమ్మ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, గ్రామ సర్పంచ్, ఎంపిటిసి యాదమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ నాయకులు అనిల్ రావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ సిపి కలిసిన నరేష్ కుమార్.భాస్కర్ రెడ్డి

బచ్చన్నపేట(జనగామ)నేటిధాత్రి .

 

వాస్విక్ ఫౌండేషన్ ఛైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ మరియు వైస్ ఛైర్మెన్ నూకల భాస్కర్ రెడ్డి కలిసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమీషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ మర్యాద పూర్వకంగా కలిసి మోమెంటో అందించి శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం వాస్విక్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలని అడిగి తెలుసుకున్నారు. అతి త్వరలో ఫౌండేషన్ ద్వారా చేపట్టబోతున్న యూత్ డ్రగ్ ఏడిక్షన్ కార్యక్రమం గురుంచి చర్చించడం జరిగింది.

అనంతరం సిపి మాట్లాడుతూ సమాజానికి మంచి జరిగే ఏ కార్యక్రమానికి అయిన నా సంపూర్ణ మద్దతు సహకారం ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని త్వరగతిన సిద్ధం చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలి:జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను సోమవారం నాడు

ఇంజనిర్లతో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ ..

జిల్లా ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సత్వర పోలీస్ సేవలుఅందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల సముదాయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని జిల్లా ఎస్పీ హోసింగ్ ఏ. ఈ కి సూచించారు.నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయాన్ని సందర్శించి నూతన భవనా నిర్మాణం జరిగిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్మాణ దశలో పెండింగ్ లో ఉన్న పనుల వేగవంతంకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై మరియు త్వరగతిన పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై ఇంజనీర్లతో సమీక్షించారు..

 

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రశేఖర్,నాగేంద్రచారి, రవికుమార్, ఏ.ఈ రాజశేఖర్ ,సి.ఐ లు ,ఆర్.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు…

ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీపీ మానస

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సీజనల్ గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి తంగళ్ళపల్లి ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లలకు ఓఅర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంకారపు అనిత, తెరాస పట్టణ అధ్యక్షుడు బండి జగన్, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, వైద్యాధికారి సంతోష్, మరియు ప్రజలు పాల్గొన్నారు.

రాజన్న సేవలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్

రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి వేములవాడ, 

దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహబూబాబాద్ శాసన సభ్యులు శంకర్ నాయక్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు శేషవస్త్రం కప్పి,స్వామి వారి లడ్డు ప్రసాదాలు అందజేశారు.

నట్టల నివారణ మందుల పంపిణీ

 

కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:

జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నట్టల నివారణ కార్యక్రమం లో తాళ్ల పూసపల్లి లో గొర్రెలు మరియు మేకలకు మందులను సరఫరా చేయడం జరిగింది. సీజనల్ వ్యాధులు రాకుండా జీవాలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా మందులను సరఫరా చేశారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ,గంగాభవాని, సర్పంచ్ రావుల విజిత రవి చందర్ రెడ్డి,వెటర్నరీ డాక్టర్ హేమలత,పంచాయతీ సెక్రటరీ దివాకర్, గ్రామ పెద్దలు రావుల రవి చందర్ రెడ్డి,రామ్మూర్తి, కటయ్య తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల రూపురేఖల్లో పెను మార్పులు

అద్భుత ఫలితాలను ఇస్తున్న పట్టణ ప్రగతి  అందరి భాగస్వామ్యంతోనే పురాభివృద్ధి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

8,9, 24, 25 వార్డుల్లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుత ఫలితాలతో పాటు పట్టణాల రూపురేఖల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 8, 9, 24, 25 వార్డుల్లో పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అన్నారు. పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేసీఆర్ సర్కార్ 2015, ఆగస్టు23న మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించిందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని అన్నారు. త్వరలో సమీకృత మార్కెట్ ను ప్రారంభించనున్నామని అన్నారు. అంతేగాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఈనెల18 వరకు కొనసాగనున్న 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని భాస్కర్ రావు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ లో జాబితాలో నిలిపేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ కమలి భీమ్లా నాయక్, కుందూరు నాగలక్ష్మి శ్యామ్ సుందర్, వంగాల నిరంజన్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి లో పాల్గొన్న నాయకులు ప్రజా ప్రతినిధులు

 

తంగళ్ళపల్లి నేటిధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో పల్లె ప్రగతి లో భాగంగా వైకుంఠ ధామానికి కరెంటు సరఫరా చేయడానికి నూతనంగా విద్యుత్ స్తంభాల పనిని అంచనా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస రాజు, ఎంపీఓ, సెస్ డైరెక్టర్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version