పుట్టినరోజు సందర్భంగా యువతకు, అనుచరులకు సందేశం : హమీద్ షేక్
మిర్యాలగూడ, నేటి ధాత్రి:తన పుట్టినరోజు (జూన్ 14) సందర్భంగా యువత, అభిమానులు, అనుచరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అపన్నులను ఆదుకోవడం, నిరాశ్రయులకు సాయం అందించడం, నిరుపేదలకు చేయూతను ఇవ్వాలని, విద్యార్థులకు తమ శక్తి మేర నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ అందజేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారందరికీ తన వంతు సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించారు. యువతలో ప్రేరణ నింపేందుకు ప్రయత్నిస్తున్నన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారు తమ ఫొటోను షేర్ చేయాల్సిండిందిగా హమీద్ షేక్ అభ్యర్ధించారు. తనకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు, బంధుమిత్రులకు, అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
–మాస్టర్ మన్నాన్ శిక్షణలో విద్యార్థులకు కరాటేలో బ్లాక్ బెల్ట్స్
–మాస్టర్ ఎంఏ మన్నాన్ కు పాఠశాలల యాజమాన్యం ప్రశంస
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి
వేములవాడ పట్టణంలోని
ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్ శిక్షణలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ , కిడ్స్ కాన్వెంట్, హిం సిని స్కూల్ ,జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు కరాటేలో బ్లాక్ బెల్ట్స్ సాధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ లో ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్, చీఫ్ ఎగ్జామినేర్ షిహాన్ కె. వసంత్ కుమార్ నిర్వహించిన బ్లాక్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో కృష్ణవేణి, కిడ్స్ కాన్వెంట్ విద్యార్థులుకొప్పు రోహిత్, సహజ, అనుగుల వర్షిత్, మహమ్మద్ అమీర్, హుస్సేన్ మహ్మద్, అఫ్సర్ లు బ్లాక్ బెల్ట్స్ సాధించారు. ఇందులో అనుగుల హరిహరన్ బ్రౌన్ బెల్ట్ అందుకున్నాడు. ఈ గ్రేడింగ్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలకు ఎగ్జామినర్ షిహాన్ కె .వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కాగా గత 6 సంవత్సరాల నుండి కిట్స్ కాన్వెంట్, కృష్ణవేణి టాలెంట్ స్కూళ్లలో కరాటే మాస్టర్ మన్నాన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించిన సహజ ఓంకార్ ,, అమీర్ హుస్సేన్, కొపురోహిత్ లను కరస్పాండెంట్ లు, ప్రిన్సిపల్ లు నరాల దేవేందర్, సన్నిధి వెంకటకృష్ణ, దరక్షన్ వసిఫియా, గీతాదేవి హర్షం వ్యక్తం చేశారు. జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల ,హంసిని స్కూల్, చందుర్తి మండలం లింగంపేట మహోదయ స్కూల్ కరస్పాండెంట్ సంతోష్, అనుగుల కృష్ణ , ఇన్స్పెక్టర్లు తిరుపతి, కనకరపు రాజశేఖర్ లు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చి, బ్లాక్ బెల్ట్స్ వచ్చేలా కృషిచేసిన మాస్టర్ మన్నాన్ ను ప్రశంసించారు.
జనసేన పార్టీ బీమా పత్రాలు క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ
సిద్దిపేట నేటి ధాత్రి*
ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ర్ట యూత్ సెక్రటరీ మరియు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు భీమా పత్రాలు మరియు సభ్యత్వ కిట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా లోని అన్ని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాసరి పవన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ పార్టీ కార్యకర్తల కోసం ప్రవేశపెట్టని ప్రమాద బీమా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారి కోసం కేవలం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో గొప్పగా ఆలోచించి అయిదు లక్షల ప్రమాద బీమా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ రానున్న రోజులలో పార్టీని.పార్టీ ఆశయాలను గ్రామగ్రామాన ప్రతి గడప గడపకు పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేయాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి కల్పించాలని అలాగే లక్ష ఉద్యోగాలు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని.అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని.అర్హులైన నిరు పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించని పక్షంలో జనసేన పార్టీ పక్షాన పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాను వ్యాపార పరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమ కు ఎంతో చేశానని, ఇప్పుడు
ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమ ను కాపాడుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తరలివచ్చిన వందలాది మంది గ్రానైట్ యజమానుల సమక్షంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీపిరిశెట్టి శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో రవిచంద్ర మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడానికి గ్రానైట్ పరిశ్రమ ఎంతో దోహదం చేసిందని, అలాంటి
పరిశ్రమ తనకు కన్నతల్లి వంటిదని అన్నారు. ఈ పరిశ్రమ లో ఉన్న వాళ్లంతా తన కుటుంబ సభ్యులని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా ముందుంటానని రవిచంద్ర హామీ ఇచ్చారు. పెద్ద మనసు చేసుకుని, పెద్దల సభకు పంపిన సీఎం కేసీఆర్ కు గ్రానైట్ పరిశ్రమ ఎప్పుడూ రుణపడి ఉండాలని అన్నారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రానైట్ కుటుంబం నుంచి ఇంత కాలం నేనొక్కడినే ఎంపీగా ఉన్నానని.. ఇప్పుడు రవిచంద్ర కూడా ఎంపీగా ఎన్నికవడం సంతోషకరమన్నారు. పరిశ్రమకు ఇక
మీదట తామిద్దరం అండగా ఉంటామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కు ఒకే సారి రెండు రాజ్యసభ పదవులు ఇచ్చిన కేసీఆర్ ను గ్రానైట్ పరిశ్రమ మరొవద్దని అన్నారు.
ఈ సభలో గ్రానైట్ పరిశ్రమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు, ప్రతినిధులు పాటిబండ్ల యుగంధర్, ఉప్పల వెంకటరమణ, గంగుల ప్రదీప్, జిల్లా అశోక్, చక్రధర్ రెడ్డి, శరాబందీ, తుళ్లూరి కోటేశ్వరరావు, పుసులూరి నరేందర్, తమ్మినేని వెంకట్రావు, ఫణి కుమార్, శ్రీధర్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి వికాసమే కేసిఆర్ లక్ష్యం…
దేశ రాజకీయాల్లో ఒక సంచనలం నమోదు కాబోతోంది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న నవశకం ఆవిషృతం కానుంది. కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం జరగనుంది. సరికొత్త రాజనీతిజ్ఞతకు నాంది పలకనుంది. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం అడుగులు పడనుంది. విద్యావంత సమాజం కోసం దేశం ఎదురుచూస్తోంది. వైద్యపరమైన సమస్యలను అధిగమించే కాలం కోసం నిరీక్షిస్తోంది. వికాసవంతమైన రాష్ట్రాల నిర్మాణం కావాలి. దేశంలో సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. దేశం అన్ని రంగాల్లో పరుగులు పెట్టాలి. ఆత్మగౌరవం వెల్లివిరియాలి. ప్రపంచమంతా మనవైపు చూడాలి. మన దేశవికాసం చూసి అబ్బరపడాల. విజయం మన ముంగిట నిలవాలి. గెలుపు మన చిరునామా కావాలి. పరుగు మది మనసును దాటి దిగంతాలు చుట్టిరావాలి. ఆకలి లేని సమాజం, రాజ్యం మన కళ్లారా చూడాలి. సుసంపన్నమైన దేశమని మనం గుర్వపడే రోజులు రావాలి. ఇవన్నీ …నెరవేర్చగలిగే నాయకత్వం సత్వరం మనకు కావాలి. దేశానికి దిశానిర్ధేశం చూపించే నాయకుడై వుండాలి. సంపూర్ణ ప్రగతి సత్వరం మన దేశంలో ఆవిషృమయ్యేందుకు కంకణబద్దుడై వుండాలి. అందుకు పంతం కలిగిన నాయకత్వం కావాలి. పట్టుదలకు మారుపేరైన నాయకుడు రావాలి. పట్టిన పట్టువిడవకుండా దేశపురోభివృద్ధిని కళ్లెదుట నిలిపే నాయకుడు దేశానికి కావాలి. అది తెలంగాణ ఉద్యమ రూపంలో కనిపించాలి. ఎలిగిత్తిన నినాదమై వుండాలి. ఉక్కు సంకల్పంలా వుండాలి. నవతరం, జనతరం మెచ్చిన నవతరం నాయకుడు కేసిఆర్ రావాలి . రేపటి దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం కేసిఆర్ కావాలి.
ఇది సగటు తెలంగాణ వ్యక్తి మాత్రమే కాదు, కేసిఆర్ రాజకీయ చాణక్యం, అభివృద్ధి మంత్రం తెలిసిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నదే. స్వాతంత్య్రం వచ్చి, డెబ్బై ఏళ్లు పూర్తయినా, ఇంకా మన దేశంలో ఆకలి తీరలేదు. ఆరోగ్యాలు బాగుపడలేదు. విద్య పూర్తి స్ధాయిలో అందుబాటులో లేదు. అందరికీ నీడ లేదు. గూడులేదు. సాగు సరిగ్గా లేదు. సౌకర్యాలున్నా వినియోగించుకునే నాయకత్వం లేదు. సాగుకు నీటి సరఫరా పూర్తి స్ధాయిలో లేదు. వరదలను తట్టుకునేలా ప్రణాళికలు లేవు. కరువును తట్టుకొని నిలబడేంత దూరదృష్టి లేదు. తుఫానులకు చిరుగురాటుకులా వణకుతున్నా శాశ్వత ప్రయత్నాలు చేసింది లేదు. వారికి పూర్తి స్ధాయిలో సాయం చేయగలిగేంత సామార్ధ్యం లేదు. ఉపాధి లేదు. ఉద్యోగాల నిర్వహణ పూర్తి కావడంలేదు. యువతకు ప్రోత్సాహకాలులేదు. వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక రంగాల్లో ఆశించినంత పురోగతి లేదు. ప్రగతి కనిపించడం లేదు. అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ది పాలించే వారికి లేదు. ప్రజలను చైతన్యం చేయాలన్న సోయిలేదు. వారు అడిగిందాన్ని సమకూర్చాలన్న ఆలోచన లేదు. దేశానికి ఏం అవసరమన్నదానిపై శ్రద్ద లేదు. సరైన ప్రణాళిక లేదు. రాష్ట్రాల మీద కేంద్రానికి పెత్తనం తప్ప, పెద్దగా ప్రేమ లేదు. కొన్ని రాష్ట్రాల మీద వున్న ప్రేమ అన్ని రాష్ట్రాల మీద లేదు. ఏ రాష్ట్రం దేనికి ప్రసిద్ది అన్నది అధ్యయంచేసే యంత్రాంగం సరిగ్గా లలేదు. అందుకు తగిన అభివృద్ది చేపట్టాలన్న సూచనలు లేవు. ఏ రాష్ట్రంలో ఎలాంటి వనరులున్నాయి? ఎలాంటి పంటలకు ప్రసిద్ధి? అక్కడి వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా అక్కడ తక్షణ ప్రగతి ఎలా చేయాలన్నదానిపై కసరత్తు లేదు.
ఎంత సేపు రాజకీయాలు…పదవులు…కుర్చీలు…ఇదే ఒకనాడు మన దేశ రాజకీయం బ్యాంకుల్లో వున్న బంగారం కూడా కుదువబెట్టుకునేదాకా వెళ్లింది. అలాంటి ఒకనాడు ఒక తెలంగాణ తేజం దేశానికి ఆశాకిరణమైంది. పి.వి. నర్సింహారావు రూపంలో దేశాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి దేశానికి అదే పరిస్ధితి ఎదురౌతోంది. ఇప్పుడు కూడా మరో తెలంగాణ చాణక్యుడి నాయకత్వం దేశానికి అవసరమొచ్చింది. అందుకే కేసిఆర్ నాయకత్వం దేశం కోరుకుంటోంది. దేశమంతా ఆయన తిరుగుతూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తూ వస్తున్నారు. అంతే కాకుండా ఉత్తరాధిన కీలకమైన నేతలను కూడా కలిశారు. వారి అభిప్రాయలు తీసుకున్నారు. తన విధానాలు వారికి వివరించారు. సహజంగా కేసిఆర్‌కు వున్న అపారమైన పరిజ్ఞానం వారిని అబ్బురపర్చిందనే చెప్పాలి. అంతే కాకుండా ఆయనకు కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు వున్న దేశ రాజీకయ ముఖ చిత్రం మీద అవగాహన మరెవరికీ లేదు. ఇలాంటి సందర్భంలో మాటకు, మాట కాదు చెపాల్సింది…బిజేపి చేస్తున్న అన్యాయాలను వివరించే ప్రతిపక్షం కావాలి. బిజేపి ఎత్తులకు పై ఎత్తులు వేసే ప్రతిపక్షం రావాలి. జనంలో మతం మత్తును నింపితూ, ఓట్ల కోసమే బిజేపి రాజకీయం చేస్తుందని చెప్పడంలో విధాన పరమైన నిరూపణలు కావాలి.
అవన్నీ ఒక్క కేసిఆర్ వల్లనే సాధ్యమన్నది దేశంలోని రాజకీయ పార్టీలు చాల వరకు గుర్తించాయి. బిజేపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలంటే ఒక్క కేసిఆర్ వల్లనే సాధ్యమని దేశం కూడా గుర్తించింది. ఇది ఉత్తరాధికి చెందిన పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించిన సందర్భం కూడా వుంది. కేంద్రంలో వున్న బిజేపిని నిక్కచ్చిగా నిగ్గదీసి అడుగుతున్నది కేసిఆరే… కడిగేస్తున్నది ఒక్క కేసిఆర్ మాత్రమే అంటూ ఇండియా టుడే కూడా ప్రకటించింది. అంటే కేసిఆర్ నాయకత్వ పటిమ ఎలాంటిది…ఆయన వ్యాఖ్యల్లో ఎంత పదునుంది? ప్రజలల్లోకి బాణాల్లో దూసుకెళ్లే మాట వాడి, వేడి మరోసారి దేశం గుర్తిస్తోంది. చెప్పే విషయాల్లో సూటితనం కేసిఆర్‌కే సొంతం. స్పష్టతతో కూడుకున్న విషయ పరిజ్ఞానం మరెవరిలోనూ కలినిపించన వైనం. బిజేపిని ఎండగట్టడంతో వున్న నేర్పరితనం ఒక్క కేసిఆర్‌లోనే కనిపిస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వానికి వెరవకుండా, బెదరకుండా నిర్భయంగా ఉతికి ఆరేస్తున్నది ఒక్క కేసిఆరే.. సవాళ్లు విసురుతున్నది కూడా ఒక్క కేసిఆర్ మాత్రమే అన్నది అందరూ గుర్తించారు.
దేశంలో అదీ కరోనా కాలంలో ఉత్తరాధిన రైతులు చేసిన ఉద్యమానికి తోడుగా నిలిచిన నాయకుల్లో కూడా కేసిఆర్ ముందు వరుసలో వున్నారు. రైతులపై బిజేపి నేతలు విరుచుపడుతుంటే కూడా కేసిఆర్ సహించలేదు. వారిని దూషిస్తుంటే కేసిఆర్ ఊరుకోలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దూషించడం సరైంది కాదన్నారు. ఎదిరించారు…కేంద్రాన్ని కొంత నిలువరింపజేయడానికి దోహదమయ్యాడు. కేంద్రం చేస్తున్నది తప్పని దుయ్యబట్టాడు. నిలదీశాడు. రైతుల పక్షాన నిలిచాడు. ఆఖరుకు ఏడాదిన్న పాటు పోరాటం చేసిన రైతుల్లో ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నంఉచి సాయం అందించారు. తాను రైతునే అని సగర్వంగా చెప్పుకునే పాలకుడు కేసిఆర్. దేశాన్ని బతికిస్తున్న రైతులను గుండెల్లో పెట్టుకోవాలని బిజేపికి హితవు పలికిన ఏకైక నేత కేసిఆర్…
తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ దేశమంతా తిరిగారు. దేశంలో వున్న పరిస్ధితులను పూర్తి స్ధాయిలో అధ్యయం చేశారు. తెలంగాణలోని పరిస్ధితులే చాలా రాష్ట్రాల్లో చూశారు. నీటి పరవళ్లు పక్కనే కనిపిస్తున్నా, పడావు పడ్డ బీడులు చూశాడు. వాటిని నీటితో తడిపి నేలమ్మకు పచ్చని పైటను తొడిగితే ధనరాశులు కురిపించొచ్చు. కాని పాలకుల నిర్లక్ష్యం,చేత కానితనం, లక్ష్యం లేని తనం, రైతులను బాగు చేయాలన్న తపన లేని నాయకులు ప్రతినిధులు కావడం వల్లనే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే వున్నాయి. వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఉపాధి లేక పక్క రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు ఇదే పిరస్ధితి. కాని ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. తెలంగాణలో నీటి పరవళ్లు నాట్యమాడుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. పొలలను తడుపుతూ, నేలమ్మను ముద్దాడుతూ పరుగుపరుగున తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఇదంతా కేవలం ఎనమిదేళ్లలో తెలంగాణలో వచ్చిన మార్పు. ప్రగతిని దేశమంతా ప్రశంసించాల్సిందే. అందుకు అనేక రకాలమైన సంక్షేమ పధకాల మిలితంతో ప్రగతిని పరుగులు తీయించడం అన్నది అందరి వల్ల కాదు. అరవైఏళ్లయినా తెలంగాణలో సాధ్యం కాని అనేక సమస్యలను ఆరేళ్లలో పూర్తి చేసి, శభాష్ అనిపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. ఒకనాడు తెలంగాణకు దిశ`దశ లేని సమయంనుంచి మహర్ధశకు కారణమైన కేసిఆర్ నాయకత్వం దేశానికి కావాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. కేసిఆర్ నేతృత్వంలో దేశంలో చైతన్యం వెల్లివిరియాలి. ప్రగతి పరుగులు పెట్టాలి. ప్రపంచంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశం కావాలి. అది తెలంగాణ ప్రజలు కల్లారా చూడాలి…దేశ ప్రజలు మురవాలి. దేశ రూపురేఖలు మారాలి. పసిడి సిరులు కురవాలి. జయహో కేసిఆర్ అని దేశం కొనియాడాలి.
ఈ సందర్భంగా పి.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు చదువుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారని ,పెరిగిన చార్జీల భారం విద్యార్థుల బస్ పాసుల పై పడిందని దీనితో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.గతంలో ఉన్న బస్ పాసుల ధరలకే చాలామంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారని గుర్తుచేశారు.
165 రూపాయల ఉన్న బస్ పశ్ ధర ఇప్పుడు 450 కి పెరిగిందని అలాగే 200 పాస్600 కి,245 పాస్900 కి,280 ఉన్న పాస్ ధర 1150 కి అమాంతం పెరిగిపోయిందని తెలిపారు.
ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకుడు అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలకు లాభ నష్టాలతో సంభందం ఏం ఉన్నదని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన బస్ చార్జీల ధరలను తాగించి,విద్యార్థులకు ఉచిత బస్ పాసులను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డీ.ఎస్.యు,పివైఎల్ నేతలు విద్యానాథ్,ఆగస్తీన్,తిరుపతి,సందీప్,జనార్దన్,స్వామి,కుమార్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బిసి నాయకులు ఆర్. కృష్ణయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్ లను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సన్మానించింది. బిసి వర్గాల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ
సభ్యులుగా కృషి చేయాలని సగర సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులను సన్నానించిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, జాతీయ నాయకులు చాతిరి వెంకట్రావ్ సగర, మందడి ఉదయ్ సగర, నాయకులు ఎగ్గని నర్సింహ్మ సగర, కార్పొరేటర్ మోడల బాలకృష్ణ సగర, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర, గౌరవాధ్యక్షులు అస్కని వెంకటస్వామి సగర, కోశాధికారి దిండి రామస్వామి సగర, రాష్ట్ర మహిళా సంఘం ఉపాద్యక్షురాలు చంద్రకళ సగర, పి. అలవేలు సగర, సంయుక్త కార్యదర్శి సిహెచ్ జ్యోతి సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రంశెట్టి సీతారాం సగర, గ్రేటర్ సగర సంఘం నాయకులు మణ్యంకొండ సగర, సురేష్ సగర, లక్ష్మయ్య సగర, శ్రీరాములు సగర, రామకృష్ణ సగర, ముఖేష్ సగర, ఆంజనేయులు సగర, అనిల్ సగర, అమరెందర్ సగర, భాస్కర్ సగర, వేముల తిరుపతయ్య సగర, వెంకట్ సగర, నారాయణ సగర తదితరులు ఉన్నారు.
ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్.
నేటిధాత్రి చేర్యాల..
చేర్యాల : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల బస్ డిపో ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుండి నేటి వరకు 3 సార్లు బస్ ఛార్జీలు పెంచడం సరైనది కాదన్నారు.. మొత్తం బస్ చార్జీలు, బస్ పాస్ ఛార్జీలు 150 శాతం పెంచారన్నారు. డీజిల్ సెస్ పేరుతో 5 రూపాయలు, జనరల్ బస్ పాస్ ఛార్జీలు 165 నుండి 400, 5 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు 115 నుండి 150 వరకు, 35 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు 335 నుండి 550 రూపాయల వరకు పెంచారన్నారు. ఈ పెంచిన ఛార్జీలతో దాదాపు బస్ పాస్ ఛార్జీలు గతంకన్నా రెట్టింయినట్లు ఉందన్నారు. ఈ స్థాయిలో బస్ పాస్ ఛార్జీల పెంపు చదువుకునే గ్రామీణ ప్రాంత బలహీన వర్గాల విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ పెంపు చర్యలను ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడూరి భరత్ , నాయకులు విక్రం,శివ ,తదితరులు పాల్గొన్నారు….
తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ ఆర్డీసీ) చైర్మన్ మెట్టు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ మొక్కనాటారు. చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌కు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ వి.ప్రకాశ్, తెలంగాణ భవన్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లళిత తదితర ప్రముఖులు స్వయంగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు సైతం మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వారందరి సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ… జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి సదా సర్వదా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ, ప్రజా కేంద్రక పథకాలు దేశమంతా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశయంలో తాను భాగస్వామ్యం అవుతానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలో తీసుకువచ్చేందుకు, దేశంలో ప్రబల శక్తిగా మలిచేందుకు తాను శక్తివంచన లేకుండా ఒక సైనికుడిలా కృషి చేస్తానని వివరించారు. తన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, మున్నురుకాపు సంఘం నాయకులు బండి స్వరూప, ఆర్ అండ్ బీ ఈఎన్సీ(రాష్ట్ర రహదారులు), ఆర్డీసీ ఎండీ పి. రవిందర్‌రావు, డీసీఈ(స్టేట్ రోడ్లు) జె.దివాకర్, తెలంగాణ
గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాలియా నాయక్,
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు కొండ దేవయ్య, అపెక్స్ కమిటీ కన్వీనర్ పుట్టం పురుషోత్తం, మున్నురు కాపు మహిళా కన్వీనర్ బండి పద్మ, బోనాల శ్వేత, చందు, జనార్థన్, మున్నురుకాపు సంఘం వరంగల్ జిల్లా నాయకులు కూసం శ్రీనివాసులు, యువసాహితీవేత్త కడియాల సురేష్, ఆర్డీసీ కార్యాలయ సిబ్బంది సాన మల్లేషం, దామరాజు వంశీ, మాలోత్ సుధాకర్, మున్నురుకాపు జర్నలిస్టు ఫోరం లక్ష్మణ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన బస్ చార్జీలతో పాటు, బస్ పాస్ చార్జీలను కూడా పెంచడం వలన విద్యార్థులపై పెను భారం మోపడమేనని అన్నారు. బస్ పాస్ చార్జీలు మూడు నుంచి నాలుగు రెట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.కోవిడ్ 19 తో విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా కళాశాలలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేక ఇంటి దగ్గరే ఆన్లైన్ క్లాస్ లు వింటూ చదువుకున్నారు. ఈ సంవత్సరం కళాశాలలు, పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విచ్చలవిడిగా బస్ పాస్ చార్జీలు పెంచడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల నుంచి ఉన్నత చదువులు కోసం చదువుకునేందుకు పట్టణాలకు వస్తున్న విద్యార్థులపై ఆర్థిక భారం మోపి,పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు చేసే కుట్రలో భాగంగానే బస్ పాస్ చార్జీలు పెంచుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులందరిని ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆర్. బాలక్రిష్ణ, జిల్లా నాయకులు అప్పాల కృష్ణ, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన బాబు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రక్త కణాలు తగ్గిపోయాయని తెలిసిన వెంటనే O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీసులు మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ వెంటనే స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు వెళ్లి రక్త దానం చేశారు
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాబు యొక్క తల్లిదండ్రులు అత్యవసర ఆపద సమయంలో రక్త దానం చేసిన ఎస్ఐ శ్రీధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాల కొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికెషన్లు జారీ చేస్తున్నదని ఆయా పోటీ పరీక్షలకు
(competitive exams) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ సామాజిక ఆర్ధిక అంశాలపై పట్టుకలిగి ఉండాలని అటువంటి స్టడీ మెటీరియల్(study meterial) కొరకు ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా వుండే విధంగా 300 పేజీలతో తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం -2022 పేరుతో ఒక పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళికశాఖ ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రచురించిన ఈ పుస్తకాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ ఇప్పటికే విడుదల చేశారు. ఉద్యోగార్థుల సౌలభ్యం కొరకు ప్రభుత్వం ఈ పుస్తకం ముద్రణకు సబ్సిడీ ఇవ్వడం వల్ల రూ.150/-లకే విక్రయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.సమగ్ర వివరాలతో మల్టీ కలర్ లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పుస్తకం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం భవనంలో గల జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ) కార్యాలయాలలో లభిస్తుందని తెలిపారు. ఉద్యోగార్థులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు , పరిశోదకులకు, వివిధ రంగాల్లోని నిపుణులకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణ సామాజిక ఆర్ధిక ముఖచిత్రం -2022 పుస్తకంనకు సంబందించిన వివరాలకై సీపిఓ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఇందూరు కళాశాలలో టుడేస్ జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022 శనివారం రోజున
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ పి రాజు,ఆధ్వర్యంలో
నిర్వహించారు.ఈ సందర్బంగా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, జె ఎన్ టి యు లోని జె హబ్ లీగ్ ఈవెంట్‌ల రూపంలో వాటాదారులకు పరిశ్రమ మరియు స్టార్టప్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఆధారంగా హ్యాకథాన్ ఈవెంట్‌లను రెగ్యులర్ ప్రాతిపదికన నిర్వహిస్తుందని ఒక విద్యా సంవత్సరంలో రెండు లీగ్ ఈవెంట్‌లు ప్లాన్ చేయబడ్డాయని తెలంగాణ మొత్తంలో 11 సెంటర్లు ఎన్నుకోబడినవి అందులో భాగంగా,ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఇందూర్ కాలేజ్ ఒక సెంటర్ గా ఎన్నుకున్నారని ఈ జే హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఉన్న సృజనాత్మకమైన ఇన్నోవేషన్ ఐడియాస్ ప్రాజెక్ట్ ఎన్నుకొని, తెలంగాణ మొత్తములో 11 సెంటర్ నుంచి ద బెస్ట్ ఇన్నోవేషన్ ఐడియాను సెలెక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ కోసం గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందని కావున ప్రతి విద్యార్థి ఈ జె హబ్ ఉపయోగించుకొని తమ యొక్క ఇన్నోవేషన్ ఐడియాలు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్ వి పి రాజు, ప్రిన్సిపాల్
డాక్టర్ జావిద్, జె హబ్ కోఆర్డినేటర్,మల్లేశం, హెచ్ ఓ డి, సివిల్ ఎల్ ఎన్ రావు, హెచ్ ఓ డి, ఎలక్ట్రికల్,పోచయ్య,
స.హ చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు పంపింది.ఈనెల 13న తమ ఎదుట హాజరు కావాలంటూ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట కి చెందిన సమాచార కార్యకర్త ఎన్.బాలరాజు అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 27, సెప్టెంబర్ 13 న మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి వచ్చిన నిధులు వాటిని ఖర్చు పెట్టిన అభివృద్ధి పనుల వివరాలు,కార్యాలయంనకు బకాయి పడ్డ పన్ను ఎగవేతదారుల వివరాలు,
ఉద్యోగులు వారి జీతభత్యాలు,
కార్యాలయానికి అవుతున్న ఖర్చుల వివరాలు,సొంత ,అద్దె వాహనాల కొనుగోలు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం లోని సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకున్నాడు.కోరిన సమాచారానికి ప్రజా సమాచార అధికారి అసంపూర్తి సమాధానం పంపడంతో గతేడాది నవంబర్ 15 న సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పిలేట్ అధికారి కి దరఖాస్తు చేశాడు దానికి కూడ మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంతో
ప్రథమ అప్పీలు చేసుకున్నారు.
అయినను సరైన సమాధానం రాకపోవడంతో సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్ కు ఈ ఏడాది జనవరి 7న రెండో అప్పీలు చేసుకున్నాడు.దీనిపై స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ ఈనెల 13న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ దుబ్బాక మునిసిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాదులో లో మైనర్ల బాలికపై అత్యాచారం చేసినవారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అందే బీరన్న డిమాండ్ చేశారు స్థానిక పార్టీ కార్యాలయంలో బద్దీపడిగే రవీందర్ రెడ్డి ఇ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లో ఎమ్మెల్యేల కొడుకులు రాష్ట్ర హోంమంత్రి మనుమడు అరాచకాలకు పాల్పడుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం జ్యోతిష్యం చూస్తుంది పోలీసు యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి ఇ కనుసన్నల్లో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీసు యంత్రాంగం పేదవాని కో న్యాయమా డబ్బున్న వాడికి ఒక న్యాయమా చట్టం అందరికీ ఒకటేనని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు అన్నారు దిశ రేప్ కేసులో నిందితులను రెండు రోజుల్లో ఎన్ కౌంటర్ చేశారు ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎన్కౌంటర్ చేయాలని ఎందుకు అనటం లేదు బడాబాబులకు తోత్తుగా మారుతుంది రాజకీయ పార్టీలకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి తిరుపతి రమేష్ టి యు టి సి నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు
పార్టీ ఓడిపోయిన నాటి నుంచి జనంలోకి పెద్దగా వచ్చింది లేదు?
ఇంకా తండ్రి చాటు బిడ్డే….చంద్రబాబు వేలు పట్టుకొని నడిచే నాయకుడే…
ఇప్పటికీ తండ్రి వేలు పట్టుకుంటే తప్ప నడవలేని నాయకుడు. చెట్టు పేరు చెప్పుకున్నా కాయలమ్ముకోలేని నాయకుడు. అసలు పాలించే యోగమే లేని నాయకుడు. పాలించడానికి పార్టీలో పనికి రాని నాయకుడు…?రాష్ట్రం మీద అవగాహన లేని నాయకుడు. ప్రజలకు ఏం కావాలో తెలియని నాయకుడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియని నాయకుడు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలౌతున్న పథకాల మీద అవగాహన లేని నాయకుడు. అసలు రాజకీయాలకే పనికిరాని నాయకుడు. ప్రజల నుంచి రాని నాయకుడు. ప్రజలు తిరస్కరించిన నాయకుడు. దొడ్దిదారిని పెత్తనం చేస్తున్న నాయకుడు. పేదల కష్టాలు తెలియని నాయకుడు. పేదలతో మమేకంకాలేని నాయకుడు. పేదల కన్నీళ్లు తెలియని నాయకుడు. ఐదేళ్లు మంత్రి పదవి వెలగబెట్టినా పేదల కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నం చేయని నాయకుడు. వారసత్వంతో ముందు వరుసలో నిలుచిన నాయకుడు. పార్టీని భ్రష్టుపట్టించేదుకు మరెవరూ అవసరం లేని నాయకుడు. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరు అంటున్నారని అనుకుంటున్నారా? ప్రజలనుకుంటున్న మాటలు..ఆఖరుకు వాళ్ల పార్టీలోనే చెప్పుకుంటున్న నాయకుడు. .తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ గురించి చెబుతున్న మాటలు. జనమంటే తెలియదు? అసలు పదవి అంటే తెలియదు? ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియదు? రాజకీయం ఏమిటో అసలే తెలియదు? రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు? ప్రజల వద్దకు ఎలా వెళ్లాతో తెలియదు? వారికి ఎలా అండగా నిలవాలో తెలియదు? అధికారంలో వున్ననాడే తెలియని నాయకుడు…జనానికి ఎప్పుడూ దూరంగా వుండే నాయకుడు. అసలు తెలుగుభాషే సరిగ్గా రాదు? తెలుగులోని యాసలు అసలేమిటో కూడా తెలియదు? ప్రాంతాల మీద అవగాహన లేదు. అసలు ఆయన పోటీ చేసే మంగళగిరి మీద పూర్తి స్దాయి పట్టులేదు. నాయకుల పేర్లే సరిగ్గా తెలియవు. ఇవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాటుగా లోకేష్ గురించి చెప్పుకునే మాటలు? అందుకే స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో పెద్దఎత్తున వైరల్ అయిన అచ్చెం నాయుడువ్యాఖ్యలు ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే వుంటాయి. లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా అచ్చెన్నాయుడు తిట్టిన తిట్లు జనం వింటూనే వుంటారు. ఇదీ లోకేష్ తీరు..పనికి రాని తీరు..అవగాహన లేని తీరు…
జాతీ ఒక్కటే అయినా జాతకం బాగుండాలని పెద్దలందుకే అన్నారు. రాజకీయాల మీద బలవంతంగా రుద్దిన నాయకుడు లోకేష్. తెలుదేశం పార్టీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లకుండా చంద్రబాబు చేసిన విన్యాసంలో ఇష్టంలేని రాజకీయాలు నెరుపుతున్న నాయకుడు లోకేష్. ఇది కూడా నందమూరి అభిమానులు చెప్పుకునే మాట. ఇంతకీ సొంత పార్టీలోనే నచ్చని నాయకుడు, పని తనం లేని నాయకుడు. ప్రజా సేవ అంటే ఏమిటో తెలియని నాయకుడు ఎవరైనా వున్నారా? అంటే లోకేష్ అని కామిడీగా చెప్పుకుంటారు. ఆయన చదువు తెలుగు ప్రజల మధ్య జరగలేదు. ఆయన పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవకు పనికి వచ్చేలా లేదు. నాయకుడంటే ఎలా వుండాలి? నిత్యం ప్రజల్లో వుండాలి. ప్రజల కోసమే పని చేయాలి. ప్రజలను చైతన్యం చేస్తూ వుండాలి. కాని అవకాశాలు ముందు తన్నుకొచ్చినట్లు కలిసొచ్చినా లోకేష్ జనాల్లోకి వెళ్లింది లేదు. జనంతో లోకేష్ బేష్ అనిపించుకున్నది లేదు. ఎంత సేపు తండ్రి చాటు బిడ్డే. అవకాశం కలిసొస్తే, చంద్రబాబును చూసి జనం ఓట్లేస్తే కుర్చీలో కూర్చువడమే…ఇంతకన్నా లోకేష్‌కు తెలిసిందేమీ లేదు…జనమంటే ఆయనకు నమ్మకం లేదు. జనానికి ఆయన మీద కూడా విశ్వాసం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం..తెలంగాణలో నివాసం ఇలా ఏ నాయకుడైనా వుంటారా? జనం నుంచి తిరుగుబాటు వస్తే, తప్ప ఇంత వరకు కుప్పంలో కూడా చంద్రబాబుకే ఇల్లు దిక్కులేదు. జనం తిడితే తప్ప చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం కాలేదు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఇక కష్టమే అన్నది తేలిపోయాక గాని చంద్రబాబు కుప్పం బాట పట్టలేదు. ఇక లోకేష్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌లో నివాసం లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్ జగన్‌ను ఇదే లోకేష్ పలు మార్లు ప్రశ్నించారు. దాంతో జగన్ ఇల్లు కట్టుకున్నారు. అక్కడే వుంటూ వచ్చారు. మరి ఆ సోయి లోకేష్‌కు లేదు. ఇల్లు లేదు…ఈసారైనా గెలుస్తానన్న నమ్మకం లోకేష్‌కు అసలే లేదు. అందుకే మంగళగిరిలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా లోకేష్‌లో లేదు.
ప్రతీ సారి తన గాలి తను తీసుకునే లోకేష్..అని జనం నవ్వుకుంటున్నారు. మొన్నటి పదవ తరగతి పరీక్ష ఫలితాల మీద ఆయన అవగాహన లేమి ఏమిటో బైటపటింది. ఎవరైన కష్టపడి చదువుకోవాలి అని చెప్పాలి. ఇష్టపడి ఎంత కష్టపడి చదువుంటే అంత వృద్ధిలోకి వస్తారని చెప్పాలి. కాని లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నాడు…చదవకపోయినా పిల్లలను పాస్ చేయాలని చెబుతున్నాడు? ఒక ఆదర్శవంతమైన, విద్యావంతమైన సమాజ నిర్మాణం జరగాలని కోరుకునేవాళ్లు చెప్పాల్సిన మాటేనా? పాస్‌మార్కులు కూడా తెచ్చుకోలేని వారిని కూడా పాస్ చేస్తూ పోవాలన్న లాజిక్ ఎలా చెల్లుతుందో లోకేషే చెప్పాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మామ లోకేష్ చదువు మీద చేసిన కామెంట్లే అందుకు నిదర్శం. మన చదువుకు పునాది గట్టిగా వుండాలి. అందుకు కష్టపడి చదవాలి. సబ్జెక్టుల్లో ఆరితేలా వుండాలి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అంతర్జాతీయ సమాజంతో పోటీ పడేలా మన విద్యావ్యవస్ధ తీర్చిదిద్దబడాలి. ఇది నవతరం నాయకుడు అనుకునే వాడు చెప్పాల్సిన మాట. ఈ మధ్యే ఓ ఇద్దరు టీచర్ల సంబాషణ కూడా ఇదే చెప్పింది. గతంలో చంద్రబాబు కూడా పాస్ పర్సెంటేజీ పెరగాలని, అందర్నీ పాస్ చేయాలని ఆదేశాలిచ్చేవారట. అదే విద్యావ్యవస్ధ భ్రష్టుపట్టడానికి కారణమైంది. ఇలాంటి పప్పుసుద్ద సుబ్బన్న కూడా అదే చెబుతున్నాడు. ఉన్నత చదువులు విదేశాలలో చదువుకున్నానని చెప్పుకేనే లోకేష్ చెప్పాల్సిన మాటలేనా? ఇలాంటి నాయకుల మాటలతో ప్రభావితమై నాలుగు మార్కులు కలిపితే ఏమౌతుంది? అని పిల్లలు కూడా ప్రశ్నించేదాకా వచ్చింది. మేం మంచిగా చదువుతాం…పాస్ అవుతామని చెప్పాల్సిన పిల్లలు…నాలుగు మార్కులు కలిపితే మీ సొమ్మేం పోతుందా? అనేదాకా వచ్చారు. ఇది విద్యా సమాజానికి గొడ్డలి పెట్టు? మంచిది కాదు. విద్యార్ధుల్లో వున్న ప్రగతి మీద తీవ్ర ప్రభావంచూపుతుది. గతంలో ఒక్క మార్కుతో కూడా అనేక సార్లు ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఎంతో మంది వున్నారు. అంతే కాని ఒక్క మార్కు కలిపితే పాస్ అవుతామని డిమాండ్లు లేవు. విద్యాశాఖ చేసిన తప్పుల మూలంగా విద్యార్ధులు మార్కులు నష్టపోతే సమాజమే ప్రశ్నించేది. విద్యార్ధి లోకం నిలదీసేది. కాని మాకు మార్కులు కలిపి, రాయకున్నా పాస్ చేయమని ఎవరూ గతంతో అడిగిన సందర్భం లేదు. ఇప్పుడు మన కళ్లముందు కనిపిస్తున్న లోకేష్ తప్ప…
రానున్న వర్షా కాలంలో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు విద్యుత్
శాఖాధికారులను , మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి లో భాగంగా పవర్ డే పురస్కరించుకొని శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన ఎన్ పి డి సి ఎల్ , నగర పాలక సంస్థ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎం ఎల్ ఎ గారు మాట్లాడుతూ వర్షాకాలంలో శిధిలమై విరిగిన స్తంభాలు , వేలాడుతున్న తీగలతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం వున్నందున వెంటనే సరి చేయాలని ఆదేశించారు.గత పట్టణ ప్రగతి కార్యక్రమంలో దృష్టికి వచ్చి ఇంకా పరిష్కారం కానీ సమస్యలు వుంటే వెంటనే తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల మధ్యలో
ప్రమాదకరంగా వున్న విద్యుత్ స్తంభాలను ప్రక్కకు తరలించాలని ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్య ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వేసిన కొత్త స్తంభాలకు థర్డ్ వైర్ లాగి లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులు తక్షణమే ప్రారంభయ్యేలా చర్య తీసుకోవాలని , సదరు కాంట్రాక్టర్ సహకరించని ఎడల ఇతర కాంట్రాక్టర్ తో పనులు పూర్తి చేయాలని లక్ష్మీ చోట్ల కర్రలతో తీగలు పైకి లేపి వుంచారని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు ప్రస్తావించడంతో డివిజన్ వారీగా విద్యుత్ సమస్యల జాబితా తయారు చేయాలని మున్సిపల్ , ఎన్ పి డి సి ఎల్ అధికారులను ఎం ఎల్ ఎ గారు ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డెప్యూటీ మేయర్ నడి పల్లి అభిషేక్ రావు, కమిషనర్ బి . సుమన్ రావు, ఎస్ ఇ చిన్నా రావు , ఇ ఇ యాదగిరి , ఎ ఇ రాంజీ తో పాటు ఎన్ పి సి ఎల్ అధికారులు వెంకటేశ్వర్లు , దేవ స్వామి , కిషన్ , మహీపాల్ రెడ్డి , సంపత్ , అన్వేష్ కార్పొరేటర్లు అడ్డాల గట్టయ్య, పాముకుంట్ల భాస్కర్ , శంకర్ నాయక్ , నాయకులు గోపాల్ రావు , జె వి రాజు , పాత పెల్లి ఎల్లయ్య , బొడ్డు రవీందర్ , తదితరులు పాల్గొన్నారు.
మేయర్ ను సన్మానించిన ఎం ఎల్ ఎ కోరుకంటి చందర్ గారయ
రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గ్రీన్ అవార్డ్ అందుకోపోవడం పట్ల హర్షం వ్యక్తo చేస్తూ ఎం ఎల్ ఎ కోరుకంటి చందర్ గారయ ఆయనను సత్కరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎం ఎల్ ఎ ఈ సందర్భంగా మేయర్ కు శాలువా కప్పి , పుష్ప గుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ గారు మాట్లాడుతూ ఎనర్జీ సేవింగ్ లో వరుస అవార్డులు సాదిస్తున్న రామగుండం నగర పాలక సంస్థ ఇప్పుడు గ్రీన్ అవార్డ్ కూడా సాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం , నర్సరీ లు ఏర్పాటు చేయడం , వాటి సంరక్షణకు స్వశక్తి మహిళల సేవలు వూపయోగించుకోవడం తద్వారా వారికి ఆర్థికంగా తోడ్పడడం వంటి చర్యలతో ఈ అవార్డు లభించిందని అన్నారు.
హనుమకొండ జిల్లా (జూన్ 10) విజయ టాకీస్ కాకాజీ కాలనీ రామకృష్ణ హాస్పిటల్ లో నిరుపేదలకు ప్రతిరోజు ఉచితంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రమోహన్ కార్డియో, డాక్టర్ రాజ్మోహన్ న్యూరో, డాక్టర్ రామ్ మోహన్ ఆర్తో ,డాక్టర్ వెంకటేష్ జనరల్ ఫిజీషియన్ ,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఫిజియోథెరపిస్ట్ మరియు ఇతర వైద్య నిపుణులచే ముఖ్యంగా పక్షవాతము, తల నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్లు చేతులు లాగడం, చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, ఎముకలు విరగటం, ఛాతిలో నొప్పి, జ్వరము, దగ్గు, దమ్ము తదితర రోగాలకు నిరుపేదలకు ఉచితంగా, మధ్యతరగతి వారికి అతి తక్కువ లో వైద్యం అందించబడును అని డాక్టర్ రామకృష్ణ అన్నారు. రోగ తీవ్రత ఎక్కువగా పక్షవాతము ఫిజియోథెరపీ కోసం తదితర రోగాలతో అడ్మిషన్ సౌకర్యం కలదు మరియు వారికి భోజన సదుపాయము కూడా కలదు అని డాక్టర్ రామకృష్ణ అన్నారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు అందరికీ ధన్యవాదాలు రామకృష్ణ తెలిపారు. ముఖ్యంగా రామకృష్ణ హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పేదలకు, నిరుపేదలకు చేస్తున్న సేవలు మరువలేనివని డాక్టర్ రామకృష్ణ అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.