ఔషధ ప్రదాత ఫార్మ విజేత

సామాన్య రైతు కుటుంబం…

అత్యున్నత శిఖరాల విజయం…

భోధన వృత్తి కోరుకుంటే, ఔషద తయారీ ప్రస్థానం…

తక్కువ ఖర్చుతో, మేలైన మందులు అందించడమే లక్ష్యం…

రూ.600 జీతంతో మొదలైన జీవితం…

రూ. 45 లక్షలతో సొంత వ్యాపారం…

138 దేశాలకు విస్తరించిన సామ్రాజ్యం…

300 రకాల మందుల తయారీలో కొత్త అధ్యాయం…

బర్డ్‌ ఫ్లూ కు చెక్‌….

స్వైన్‌ ఫ్లూ స్టాప్‌….

ఎయిడ్స్‌ రోగులకు వరం….

తాజాగా కరోనా విరుగుడు ఔషదం…

విజయాలకు లెక్కే లేదు…విజయ పరంపర ఆగేదేలేదు…

బెదిరేది లేదు…అదిరేది లేదు…ఎక్కడా తగ్గేదే లేదు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక మామూలు వ్యక్తి కూడా అద్భుతాతలు సృష్టించొచ్చు. అనుకున్న లక్ష్యాలను శర వేగంగా నెరవేర్చుకోవచ్చు. విజయాల పరంపర ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడొచ్చు. ఎదగాలన్న కసి, కృషి, పట్టుదల, అంకితభావం, అవరోధాలకు వెరవని తనం, లక్ష్యసాధనలో అలుపెరగని ప్రయాణం చేసి విజేతగా నిలువొచ్చు. అని నిరూపించిన వ్యక్తి బండి పార్ధసారధి రెడ్డి. నిరంతర నిర్మాణాత్మక ఆలోచనలు, కార్యదక్షత విజయాలందిస్తాయి. తిరుగులేని శక్తిగా తయారు చేస్తాయి. అలాంటి వాళ్లు ఆదర్శవంతులౌతారు. యువతకు స్పూర్తిదాయకమౌతారు.

కొత్త తరం ఆలోచనలకు వేధికౌతారు. నూతన ఆవిష్కరణలకు వేధికౌతారు. వారు ఎంచుకున్న రంగంలో ఎదరులేని శక్తిగా నిలుస్తారు. విజయాల బావుటా ఎగురవేస్తారు. హెటిరో పార్ధ సారధి రెడ్డిలా నిలబడి విజయకేతనం ఎగురవేస్తారు. తిరుగులేని శక్తినని నిరూపిస్తారు. లక్ష్య సాధనలో ఒక్కొమెట్టును పేర్చుకుంటూ ఎదుగుతారు. ఆదర్శానికి కేఆరాఫ్‌ అడ్రస్‌ అవుతారు. కొన్ని సార్లు అనుకోకుండా అద్భుతాలు జరగొచ్చు. వాటిని ముందే పసిగట్టి ముందుకు సాగొచ్చు. తాను వెళ్లాలనుకునే దారికి ముందే మరో దారి ఎదురైతే అక్కడ కూడా విజయాల బాట వేసుకోవచ్చు. తిరుగులేని విజాయలు సాంతం చేసుకోవచ్చు. అలా లెక్చరర్‌ అవ్వాలనుకొని, సైంటిస్ట్‌ అయ్యారు. అక్కడే స్ధిరపడక ఔషదతయారీ రంగంలో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఆ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా దేశ అత్యున్నత చట్ట సభ అయిన రాజ్యసభకు ఎంపికయ్యారు. మరో కొత్త లోకాన్ని చూస్తున్నారు. 

బండి పార్ధసారధి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు.పిహెచ్‌డి చేశారు. తదనంతరం లెక్చరర్‌ కావాలనుకున్నారు. కాని అనూహ్యంగా ఓ గొప్ప వ్యక్తి నుంచి కబురొచ్చింది.

జీవితంలో ఊహించని మలుపును మోసుకొచ్చింది. అనుకోకుండా ఎదురైన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకునేవారే నిజమైన విజేత అని మరోసారి పార్ధ సారధి రెడ్డి నిరూపించుకున్నారు. రెడ్డీస్‌ ల్యాబ్‌ అధినేత అంజిరెడ్డి నుంచి పిలుపొచ్చింది. తమ సంస్ధలో చేరమని ఆహ్వనం అందింది. జీతం కేవలం. రూ. 600 మాత్రమే…అయినా ఆలోచించలేదు. ఆ అంజిరెడ్డి ఆహ్వానాన్ని వదులుకోలేదు. చదవిన చదువుకు లెక్చరర్‌గా స్ధిరపడితే చాలు అనుకున్న సందర్భం నుంచి, చదవిన చదువుకు సార్ధకత చేకూర్చే ఎదురైన మార్గంలో పయనించారు. అనుకోని అతిధి నుంచి ఆహ్వానం అందింది. అయితే అలాంటి సమయంలో భవిష్య మార్గం ఎంచుకోవడం ఒక రకంగా కత్తిమీద సాము లాంటిదే. అందుకు ఎంతో ఆత్మ విశ్వాసం కావాలి. కొండంత ధైర్యం కావాలి. ప్రతి నిమిషం మేధోమధనం జరగాలి. అన్వేషణలో కాలానికే కొత్త అనుభవం నేర్పాలి. 

తక్కువ ధరకు, నాణ్యమైన మందులు తయారు చేయాలి.పేదలకు అందుబాటు ధరల్లో ఆరోగ్యం బాగు చేసుకోగలగాలి. వైద్యం అంటే సామాన్యులు భయపడిపోకూడదు. తమకు జీవించే హక్కు వున్నట్లే, వారికి వైద్య సేవలు అందుకునే అవకాశాలు రావాలి. రోగం రావడం తమ ఖర్మమని బాధపడిపోకూడదు. వైద్యానికి భయపడిపోకూడదు. పేదరిక సమాజానికి భరోసా కల్పించడం అంటే మాటలు కాదు. వైద్య రంగంలో వ్యాపారం అంటే సామాన్యమైన విషయం కాదు. కాని సాధ్యం కాదనుకున్నది సాధ్యం చేసి చూపించాడు. పేదలు సైతం నయం కావనుకునే రోగాలకు సైతం మందులు తెచ్చి, చౌకగా చాలా రకాల మందులు అందుబాటులోకి తెచ్చారు. మార్కెట్‌ను ముంచెత్తారు. ప్రపంచ మార్కెట్‌ను దాసోహం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఒక విజయం సాధిస్తేనే ఎంతో సంతోషం, ఆనందం, ఖ్యాతి వస్తాయి. అలాంటిది విజయాలకు లెక్కే లేకపోతే, వ్యాపారంలో తిరుగులేకపోతే , ఎదరులేకపోతే అది ఎలా వుంటుందో మాటల్లో చెప్పలేనిది. అక్షరాల్లో వర్ణించలేని అనుభూతది. అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.

బండి పార్ధసారధి రెడ్డిది ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కందుకూరు గ్రామం.కుటుంబ నేపధ్యం మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. ప్రాధమిక విద్యాబోధన అంతా ఆ గ్రామంలోనే సాగింది. ఇంటర్‌, డిగ్రీ ఖమ్మంలో పూర్తయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. యాంటీ కాన్సర్‌ డ్రగ్స్‌పై పిహెచ్‌డి చేశారు. 

నాణ్యమైన ఔషదాలు తయారు చేయాలి.పేదలకు అందుబాటు ధరలో తేవాలి. ఇదే పార్ధసారధి రెడ్డి మరిన్ని బాటలు వేశాయి. అంతవరకు మందుల తయారీ గురించే తప్ప, సామాన్యులకు కూడా మందులు చౌకగా అందించాలన్న ఆలోచన ఎవరూ చేయలేదు. తన వద్ద వున్న రూ.45లక్షల పెట్టుబడితో తొలి అడుగువేశారు. బ్యాంకు నుంచి రూ.45లక్షలు అప్పు తీసుకున్నారు. మొత్తం రూ.90 లక్షలతో 1993లో హెటిరో డ్రగ్స్‌ను ప్రారంభించారు తొలి ఏడాదిలోనే రూ.1.3 కోట్లు లాభాన్ని ఆర్జించారు. అందులో రూ.30 లక్షలు ట్యాక్స్‌ చెల్లించారు. మొదట్లో సైక్రియాట్రిక్‌, కార్డియాట్రిక్‌ డ్రగ్స్‌ తయారీతో ప్రస్ధానం మొదలైంది. ఏ రెడ్డి ల్యాబ్‌ నుంచి పార్ధసారధి రెడ్డి ఉద్యోగ జీవనం ప్రారంభమైందో, అదే రెడ్టీస్‌ ల్యాబ్‌కు హైపటైటిస్‌ `సి డ్రగ్‌ మార్కెటింగ్‌ లైసెన్స్‌ ఇచ్చే స్ధాయికి హెటిరో ఎదిగింది. అంటే దాని వెనక పార్ధసారధి రెడ్డి పడిన కఠోర శ్రమ ఎంతటిదో అర్ధమౌతుంది. 

బర్డ్‌ ప్లూ, స్వైన్‌ఫ్లూలకు మందులు తయారిలో దిగ్గజం.ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్‌ లీడర్‌ అని చెప్పుకోవచ్చు. ఇక 1997లోనే ఎయిడ్స్‌కు మందు తయారు చేసి సంచనలం సృష్టించారు. హెచ్‌ఐవి వైరస్‌ను ఎదుర్కొవడానికి అవసరమైన మందులు తయారు చేయడం అప్పట్లో పెద్ద విజయం. అయితే పూర్తిగా ఎయిడ్స్‌ను రూపు మాపే ఔషదాల సృష్టి జరలేదు. కాకపోతే ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం వాడే మందులు అప్పట్లో అత్యంత ఖరీదైనవి. అవి పేదలకు సైతం అందుబాటులో వచ్చే విధంగా మందులు తయారుచేయడమే కాకుండా, ప్రపంచ దేశాలలో కొన్ని కోట్ల మందికి ఆ మందుల ద్వార ప్రాణాలు నిలపడం అన్నది పెద్ద విజయం. హెటిరో స్ధాపించిన 15 సంవత్సరాలలో వంద రకాల డ్రగ్స్‌ను తయారు చేసి, మార్కెట్‌ను ఆశ్చర్యపర్చారు. హెటిరో స్ధాపించి వచ్చేఏడాది ముప్పై సంవత్సరాలు కానుంది. ప్రస్తుతం 300 రకాల మందులు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 138 దేశాల్లో హెటిరో డ్రగ్స్‌ వినియోగంలో వున్నాయి. 

సుమారు 13 సంవత్సరాల పాటు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధినేత అంజిరెడ్డికి చేదోడు వాదోడుగా వుంటూ,తనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకునేందుకు 1993లో హెటిరో ఏర్పాటు చేశారు. కేవలం తన వద్ద వున్న రూ. 45లక్షలు, బ్యాంకు నుంచి రూ.45 లక్షలు అప్పు తీసుకొని మొత్తం రూ.90 లక్షలతో హెటిరో ప్రారంభించారు. తొలి ఏడాదే రూ.1.90 కోట్లు లాభం చూశారు. అందులో రూ.30 లక్షల ట్యాక్స్‌లు చెల్లించారు. ఇలా మొదలైన హెటిరో అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఎత్తు పల్లాలు కూడా చవి చూసింది. అయినా ఎక్కడా పార్ధ సారధి రెడ్డి తగ్గలేదు. ఎదుర్కొన్నాడు. నిలబడ్డాడు. తన ధైర్యాన్నంత కూడ దీసుకొని ముందుకు సాగాడు. తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తం చేశాడు. సుమారు 138 దేశాలలో తన మందులకు మార్కెట్‌ చేశాడు. 

బర్డ్‌ ఫ్లూ అన్నది ఒక ఒకప్పుడు పక్షిజాతి అంతం చేస్తుందా? అన్నంత దాక వెళ్లింది. ఫౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసింది. కాని అతి వేగంగా ఎవరికీ సాధ్యం కాని బర్డ్‌ ప్లూ డ్రగ్‌ను ఆవిష్కరించారు. అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. తర్వాత స్వైన్‌ ప్లూ అన్నది ఎంతగా విస్తరించి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. దానికి కూడా ఎంతో వేగంగా డ్రగ్‌ను సృష్టించారు. స్వైన్‌ఫ్లూన్‌ పారద్రోలారు. ఇక కొన్ని దశాబ్ధాలుగా మానవాళిని కబలిస్తున్న ఎయిడ్స్‌ కూడా అతి చౌకగా మందులను తయారు చేసి, ప్రపంచ దేశాలకు సరఫరా చేశారు. వాటి వినియోగంతో సగటు ఆయు ప్రమాణం పెరిగేలా చేశారు. తక్కువ ఖరీదులో అతి భయంకరమైన ఎయిడ్స్‌ నుంచి ఉపశమనం చూపించారు. ఇక తాజాగా కరోనా వైద్యంలో అతి కీలకమైన రెమిడిస్‌ వీర్‌ అన్నది దానిని అందుబాటులోకి తెచ్చి, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఇదే కాకుండా తాను ఏ రెడ్డీస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చారో, అదే రెడ్డీస్‌ ల్యాబ్‌కు హైపటైటిస్‌` సి. అనే డ్రగ్‌కు మార్కెటింగ్‌ లైసెన్స్‌ ఇచ్చి సంచలనం సృష్టించారు. 

అమెరికానే మనకు ఉద్యోగాలు ఇస్తుందా? మనమెందుకు అమెరికన్లకు ఉపాధి కల్పించొచ్చు. అని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. అక్కడ ప్రభుత్వం నుంచి భూమిని సేకరించి ఇవ్వమని అడగలేదు. మొత్తం అక్కడ తన ఇండస్ట్రీకి అవసరమైన భూమిని సొంతంగా కొనుగోలు చేశాడు. కంపనీ స్టార్ట్‌ చేశాడు. సగం మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాడు. మిగతా సగం ఉద్యోగాలు మన తెలుగు వారికి అవకాశం కల్పించారు. ఇలా ఆయన ప్రపంచ దేశాలెన్నింటిలోనూ ఫార్మా రంగంలో విజయ కేతనం ఎగురవేశారు…ఫార్మా దిగ్గజం అంటే పార్ధసారధి అని నిరూపించుకున్నారు. తెలుగు నాట రెడ్డీస్‌ తర్వాత స్ధానం లో సాగుతున్నారు. ఆ స్ధానం పదిలం చేసుకున్నారు. అలాంటి పార్ధ సారధి రెడ్డి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ…ఆల్‌ ది బెస్ట్‌…!

ప్రభుత్వ లాంఛనాలతో రాకేష్ అంత్యక్రియలు.

అంతిమయాత్ర బాధ్యతలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు

హైదరాబాద్ నేటిధాత్రి

శుక్రవారం రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన , వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలో రాకేష్ మరణించడం దురదృష్టకరమని  ముఖ్యమంత్రి కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు.

కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్డకరమన్నారు. *రాకేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసిఆర్ ఒక ప్రకటించారు. రాకేష్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతో పాటు, ఆ

కుటుంబంలో అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం అందించనున్నారు.* రాకేష్ అంత్యక్రియల బాధ్యతలను *వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు అప్పగించారు.* ఎప్పటికప్పుడు అన్ని విషయాలు దగ్గరుండి పర్యవేక్షించాలని *ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ నరేందర్ కు సూచించారు.* శనివారం రాకేష్ అంతిమయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు.*ఈ అంతిమ యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి* ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కెసిఆర్ సీరియస్

రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా

అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.

నవ తరం నిర్మాత- తెలంగాణ విధాత కేసిఆర్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

కేసిఆర్ ను మించిన నాయకుడు లేడు.

అంతటి రాజనీతిజ్ఞుడు దేశంలో మరొకరు లేరు…

దేశ సౌభాగ్యం కోసం ఆలోంచిచే ఏకైక నాయకుడు…

జాతీయ పార్టీ నిర్మాణం ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం.

తెలంగాణ ప్రగతి దేశానికి అందించాలనుకుంటున్నాడు.

రాజకీయాలు తప్ప, ప్రగతి దారులు చూపిన పార్టీలకు కాలం చెల్లింది…

కేసిఆర్ నాయకత్వంలో కొత్త తరం ఆవిషృతమౌతుంది…

అది సమీప భవిష్యత్తులోనే సుసాధ్యమౌతుంది…

కేసిఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుంది…

లక్ష్య సిద్ది ఎవరినైనా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మానవతా వాదిగా మార్చుతుంది. తన జీవిత లక్ష్యంతో పాటు సామాజిక సృహను కూడా నింపుతుంది. ప్రజలకు చేరువచేస్తుంది. ప్రజల చేత మన్ననలు పొందేలా చేస్తుంది. ప్రజల గుండెల్లో గూడుకట్టుకునేలా చేస్తుంది. తన సామాజిక సేవా గుణం, నిండైన వ్యక్తిత్వం గొప్పగా కీర్తిని అందిస్తుంది. అలా ఎదిగిన, పేదలకు అండగా నిలిచిన వారిలో వద్దిరాజు రవిచంద్ర ఒకరు. వ్యాపార వేత్తగా ఉన్నతమైన విజయాలు అందుకున్నారు. సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు.

పేదల పక్షపాతి అని కొనియాడబడుతున్నారు. టిఆర్ఎస్ కు బలమైన బిసి. సామాజిక వర్గ నేతగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా తన వంతు పాత్ర పోషించారు. అలాంటి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఖమ్మంలో అడుగుపెడుతున్నారు. వద్దిరాజు రవిచంద్ర తో నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు మాటామంతిలో ఆసక్తి కరమైన వ్యాఖ్యలు…. వద్దిరాజు మాటల్లో….కట్టా అక్షరాలలో…

మా కాలం చీకటి దొంతర. నేటి కాలం వెలుగుల పండగ…వేకువకే వెండివెన్నెల…కాదని అనే వాళ్లు లేరు…మా బాల్యంలో కరంటు జాడలు అప్పుడప్పుడే కనిపించిన కాలం… అయినా తెలంగాణ వచ్చే దాకా తెలంగాణ పల్లెలు చీకటి మయం…ఒక్క హైదరాబాద్ మినహా, తెలంగాణ లోని ఏ నగరం నిరంతరం కరంటు చూసింది లేదు….కోతలు లేకుండా హైదరాబాదులో నిరంతర సరఫరా ఏ కాలంలోనూ లేదు…అంతెందుకు 2013లో కూడా రోజులో గంట నిరంతర కరంటు చూసిన పల్లె లేదు…అసలు పగలంతా పల్లెల్లో కరంటే వుండేది కాదు. ఒక దశలో బ్యాంకుల్లో లోన్ తీసుకొని సోలార్ ప్యానల్స్ అమర్చుకున్నవాళ్లున్నారు. ఇన్ వర్టర్లు కొనుగోలు చేసుకున్నారు. చిన్న చిన్న షాపులు సైతం జనరేటర్లు వాడుకున్నారు. ఎండాకాలం నరకం చెప్పనలవి కానిది…ఇవన్నీ ఈ తరానికి తెలియాలి. ఇదంతా ఎప్పుడో అనుకుంటారు. ఎనమిదేళ్ల క్రితం వరకు సంగతి అని తెలియాలి. తెలంగాణ రాక ముందు కూడా కరంటు సరఫరా ఇలాగే వుండేదనుకునే అవకాశం వుంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కరంటు గోసలు పెట్టి, పంటలు ఎండబెట్టి, తెలంగాణ పల్లెల బతుకులు చిద్రం చేశారు…! అయితే చాలా మంది తెలంగాణ వస్తే అద్భుతాలు జరుగుతాయా? అనుకున్న వాళ్లే… అందరిలోనూ ఈ అనుమానం అందరిలోనూ వున్నదే…కానీ ఒక్కరిలో మాత్రం ఏ అనుమానం లేదు… దానిపై మరో ఆలోచన లేదు…తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే బంగారు తునుక అవుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసిఆర్… తను నమ్మిన కలను, నిజం చేసి చూపించిన కార్యదీక్షాపరుడు. నిజానికి తెలంగాణ వస్తే పల్లె రూపురేఖలు ఎలా మారుతాయి? పల్లె బతుకుల్లో ఎలా వెలుగులు నిండుతాయి? పట్టణాల అభివృద్ధి ఎలా జరుగుతుంది? తెలంగాణ ప్రజల జీవన ప్రమాణం ఎలా పెరుగుతుంది? అన్న దానిపై నిత్యం ఏదో ఒక చోట ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతూనే వుండే వారు. అలా చెప్పీ చెప్పి నమ్మించడానికి ఎంతో కాలం పట్టింది. కానీ ఆయన ప్రజలను నమ్మించడానికి పట్టిన సమయంలో కనీసం ఐదో వంతు సమయం కూడా తీసుకోకుండానే తెలంగాణలో వెలుగులు నింపాడు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రెప్ప పాటు కోత లేని కరంటు సరఫరా చేస్తున్నాడు…ఇలాంటి విజయం చూసిన రాష్ట్రం ఒక్క తెలంగాణే. దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు…ఆ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్. ఇలాంటి విజయాలు అందించిన కేసిఆర్ తప్ప మరొక నాయకుడు , పాలకుడు లేరు. మరి ఇంతటి నిరంతర వెలుగులు దేశానికి అందాలని కోరుకుంటున్న రాజనీతిజ్ఞుడు… నిరంతరం వెలుగులు నిండిన దేశం కావాలని కోరుకుంటున్న నాయకుడు కూడా ఒక్కరే… ఆయనే కేసిఆర్ . అందుకే దేశానికి రాజకీయ నాయకత్వం ఒక్కటే సరిపోదు. ప్రగతి శీల భావనలున్న ఉద్యమ కారుడు, పోరాట యోధుడు కేసిఆర్ కావాలి. ఈ తరంలో భూతద్దం‌ పెట్టి మొత్తం మన దేశం వెతికినా అలాంటి నాయకుడు కనిపించేది ఒక్క కేసిఆరే…ఆయనది జాతి దృక్పథం… జాతీయ దృక్పథం… అందుకే తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన కొంత కాలానికే ఆంద్రప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే సాయం అందించిన చేయి కేసిఆర్ ది. అదీ ఆయన వ్యక్తిత్వం… నాయకత్వం… పాలనలో ఔన్నత్యం…ప్రజలెక్కడి వాళ్లైనా ప్రజలే….రైతులు ఎక్కడి వాళ్లైనా అన్న దాతలే…అందరికీ నీళ్లందాలి. అన్ని రాష్ట్రాలు సుభిక్షం కావాలని కోరుకునే ఓ తరం నాయకుడు కేసిఆర్….మరి అలాంటి నాయకులు లేకనే దేశం ఇలా వెనుబడిపోతోంది. తెలంగాణ లో ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నా, కనీసం వాటిని తమ రాష్ట్రంలో అమలు చేయాలన్న సోయి ఆయా రాష్ట్రాలకు లేదు. అన్ని రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి లేదు. అందుకే తెలంగాణ విజయాలు దేశానికి దిక్సూచి కావాలి. కేసిఆర్ దేశానికి నాయకత్వం వహించాలి. అప్పుడే దేశ ప్రగతి, పురోగతి సాధ్యం. 

 

 

ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు…ఎనమిదేళ్లు గడిచినా ఒక్కటీ ఇచ్చింది లేదు. ఆఖరుకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ , ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ప్రశ్నించిన మరుసటి రోజు ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోడి ప్రకటించారు. అసలు ఇస్తామన్నవి ఏటా రెండు కోట్లు. ఆఖరుకు ప్రకటించింది పది లక్షలు. అవి కూడా ఆచరణలోకి వస్తాయన్న గ్యారెంటీ లేదు…నోటిఫికేషన్లు ఇస్తారన్న నమ్మకం అసలే లేదు.

 

 మంత్రి కేటిఆర్ ప్రశ్నించే వరకు కేంద్రం ఉద్యోగాల ఊసే లేదు. ఎంత చిత్తశుద్ధితో కేంద్రం పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశ జనాభా 145 కోట్లు. ఎనమిదేళ్లలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు 16 కోట్లు. చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రకటించింది 10 లక్షలు. కానీ అదే బిజెపి తెలంగాణలో నానా యాగీ చేస్తోంది. తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదనంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన వేలాది ఉద్యోగాల కల్పన కూడా జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి కేసిఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటించారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడింది. పోలీసు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ పరీక్ష కూడా పూర్తయ్యింది. త్వరలో మిగిలిన నోటిఫికేషన్లు రానున్నాయి. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా, కేంద్రం ఒక్క ఉద్యోగం ఇయ్యకున్నా రాష్ట్ర బిజెపి పగటి కలలుగంటోంది. ఇదిలా వుంటే దేశం కోసం, ధర్మం కోసమంటూ నిత్యం వల్లించే మాటలు అబద్దాల మూటలని తరలిపోయింది. అగ్నిపథ్ పేరుతో సైనిక నియామకాలు సైతం నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకాలను ప్రకటించి బిజెపి, కేంద్ర ప్రభుత్వం తన కపట బుద్దిని బైటపెట్టుకున్నది. ఇంత కన్నా అసలు సిసలు దేశ ద్రోహం వుంటుందా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒక ప్రణాళికా బద్ధంగా ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గత ప్రభుత్వాలు వస్తుంటే, బిజెపి అమ్ముకుంటూ పోవడం దేనికి సంకేతం. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దశ దాటి, మొత్తం అమ్మకాల దుకాణం పెట్టడం సమర్థనీయమా? ఇప్పుడు దేశమంతా జరగాల్సిన చర్చ…వచ్చే ఎన్నికలలో బిజెపికి చరమగీతం పాడే దాకా జరగాలి. 

 

తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు…ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. అంత గొప్ప పరిపాలన మన ముఖ్యమంత్రి కేసిఆర్ ది. ఎన్నెన్ని విజయాలు…అసలు ఇప్పటికీ ఇది కలా..నిజమా అనిపించకమానదు….ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది. ఇప్పుడెలా వుంది. నీరు, ఏరు, గోదారి పరుగు, పల్లె చిగురు, పైరుసాగు, పచ్చని ప్రకృతి, ప్రగతి ఇలా అన్ని రంగాలలో పురోగతి. ఇదంతా దేశమంతా కనిపిస్తే, మన దేశం ఎంత సుందరం…ఎంత సౌభాగ్యం… ఇదంతా దేశమంతా సాధ్యం కావాలంటే కేసిఆర్ నాయకత్వంలోనే జరగాలి. ముందు ముందు ఇంకా ఎంతో మాట్లాడుకోవాల్సి వుంది… దేశానికి చెప్పాల్సింది ఎంతో వుంది…జాతీయ పార్టీ నిర్మాణంతో మన ప్రగతి మరింత ముడిపడి వుంది.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్మన్ 

నర్సంపేట, నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ హెచ్చరించారు.నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13 వ రోజుకు చేరుకోగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ పనులను పరిశీలన చేశారు.

 పాటు పట్టణంలోని 24 వ వార్డులలో ఇండ్ల వద్ద ఉన్న మొక్కల పంపిణీ పరిశీలన, గతంలో ప్రతి

ఇంటికి పంపిణీ చేసిన 6 మొక్కల యొక్క స్థితిగతులను పరిశీలించారు. ఆయా వార్డులలో జరిగే అభివృద్ధి పనులను, డ్రైనేజీలలో వేరకపోయిన మట్టిని జెసిబిలతో తొలగించడం వంటి పనులను, డివైడర్లలో పెంచుతున్న మొక్కల పెరుగుదల, కలుపు తీయుట వంటి

పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీకిషన్

 మాట్లాడుతూ, పాడుబడిన, నిరుపయోగంగా ప్రమాదకరంగా ఉన్న పాత బావులు మరియు

బోరుబావులను గుర్తించి వాటిని పూడ్చాలని ప్రమాదకరంగా ఉన్న పాడుబడ్డ ఇండ్లను

తొలగిస్తూ, నీటి సమస్యలను, విద్యుత్ సమస్యలను తీర్చాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.మున్సిపల్ పరిధిలో ప్రజల మౌలిక వసతులు కల్పించేలా ఈ నెల 18 వరకు వివిధ

కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,కమిషనర్ నాయిని. వెంకటస్వామి,కౌన్సిలర్స్ దేవోజు తిరుమల సదానందం, జుర్రు రాజు , లూనావత్ కవిత, శీలం రాంబాబు , 

రామసహయం శ్రీదేవి , మినుముల రాజు, గందే రజిత చంద్రమౌళి,రాయిడి కీర్తి దృశ్యంత్ రెడ్డి, 

నాగిశెట్టి పద్మ ప్రసాద్, గంప సునీత, రుద్ర మల్లీశ్వరి , మహ్మద్ మహబూబ్ పాషా ,వేల్పుగొండ వద్మ ,బోడ గోల్య , బాణాల ఇందిర, దార్ల రమాదేవి, మున్సిపల్ సిబ్బంది మేనేజర్ రామక్రిష్ణ,ఏ.ఇ శాంతిస్వరూప్, టిపిబీఓ నునిల్ కుమార్,ఆర్.ఐ సంపత్ కుమార్, ఎన్విరాల్మెంటల్ ఇంజనీర్ సంతోష్,

 పట్టణ ప్రగతి 24 వార్డుల ఇంచార్జ్ లు,ఆర్.పిలు తదితరులు పాల్గోన్నారు.

మినరల్ వాటర్ ప్లాంట్ తెరిపించాలని ఆందోళన

చెన్నారావుపేట-నేటిధాత్రి:

మండల కేంద్రంలో స్థానిక జిపి తరుపున ఉన్న ఒకే ఒక వాటర్ ప్లాంట్ కొసవాడలో ఉంది.గ్రామ ప్రజలే కాకుండా ఈర్యా తండా,రాజీవ్ నగర్ కాలనీ గ్రామ ప్రజలు ఈ ప్లాంట్ నుండే మినరల్ వాటర్ తీసుకెళ్తు ఉంటారు.5 రూపాయలకే గ్రామ ప్రజలకు 20 లీటర్ల సామర్థ్యం గల వాటర్ క్యాన్ కి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది.కానీ గత నెలరోజుల నుండి ఈ ప్లాంట్ పని చేయకపోవడంతో ప్రజలు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు.నీళ్లు మినిరల్ కాకపోవడంతో కేవలం నీళ్లు మాత్రమే ప్లాంట్ నుండి వస్తుండడంతో ప్రైవేటు వాటర్ ప్లాంట్ నుండి 15 రూపాయలకు ఒక క్యాన్ చొప్పున నీళ్లు కొనుకుంటున్నారు.స్థానిక సర్పంచ్,అధికారులకు ఈ సమస్య గురించి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోవడంతో గ్రామస్తులు,మహిళలు బుధవారం ఉదయం వాటర్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు.వానాకాలం ప్రారంభం అయినందున మినిరల్ కానీ నీళ్లు తాగితే దగ్గు,జలుబు వంటి వ్యాధులు వస్తున్నాయని కావున వెంటనే సర్పంచ్,అధికారులు స్పందించి మినిరల్ వాటర్ ప్లాంట్ ని బాగు చేయించి మమ్మల్ని రోగాల భారీనుండి కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళ కాంగ్రేస్ మండల అధ్యక్షురాలు బండి పద్మ,వార్డు సభ్యులు బండి ఉపేందర్, టి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకుడు కంది కృష్ణ చైతన్య రెడ్డి,మాజీ ఎంపిటిసి మాదాసి కుమారస్వామి, అడుప అశోక్,మహిళలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ ముందు ధర్నా

నేటిధాత్రి చేర్యాల…

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల మండలం లో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఆర్ ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చేర్యాల మండల రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా గా రైతుబంధు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమకాలేదు అదేవిధంగా నకిలీ విత్తనాలు మార్కెట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని నకిలీ విత్తనాలు అరికట్టాలని రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని రైతు బీమా 70 సంవత్సరాలు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో గండేపల్లి చంద్రం అముదాల నర్సిరెడ్డ పోలోజు నరసింహ సారి చందు మల్లారెడ్డి కనకయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా?

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా?

నేటిధాత్రి చేర్యాల…

135 కోట్ల జనాభా గల భారతదేశంలో విద్య వైద్యం ప్రాథమిక హక్కు?

 రోజులు మారుతూ ఆటవిక రాజ్యం నుంచి ఆధునిక రాజ్యం లోనికి అడుగు పెడుతున్నా, ఆధునిక యంత్రాలు కొత్త కొత్త టెక్నాలజీ మన జీవితంలో నిత్యవసర వస్తువులు అయినప్పటికీ విద్య వైద్యం న్యాయం అనేవి 130 కోట్ల జనాభా లో 80 శాతం మంది ఆర్థిక దరిద్రపు రేఖకు దిగువగా ఉన్న సామాన్య మానవుడికి విద్య వైద్యం న్యాయం ఇంకా ఖరీదైన 

అమూల్యమైన వస్తువులు గా మారడం ఈ దేశాన్ని ఎటు తీసుకు పోతుందో ఈ దేశం ఎటు పోతుందో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి చేరువలో ఉంది.

 

 చట్టాలు సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని చేసేదిగా ఉండాలి , అయితే సామాన్యుని కోసం నాలుగు వేల 400 మంది ఎమ్మెల్యేలుగా 545 మంది ఎంపీలు గా వేలాది కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి మహానుభావులను మహాత్ములను అసెంబ్లీ పార్లమెంటు లాంటి చట్టసభలకు పంపేది సామాన్య మానవుని జీవితంలో అతి సులువైన పారదర్శకమైనటువంటి చట్టాలు చేయడానికి కదా మూడు లక్షల రూపాయలు ఖర్చుతో ఎల్కేజీ చదువు మొదలుపెడితే 16 సంవత్సరాలు ,

18 సంవత్సరాలు 

22 సంవత్సరాలు నడిచే సదువులు సామాన్య మానవుడు మోసేది ఎట్లా?

ఇదే ఇవ్వాళ సగటు తండ్రి ఆలోచన! 

               రవిందర్ రెడ్డి….

పదే పదే చెప్పినా వినకపోతిరి…పక్కన పెట్టేదాకా తెచ్చుకుంటిరి?

నలభై మందికి పైగా టిక్కెట్టు కట్‌?

గత ఏడాది నుంచే హెచ్చరిస్తున్న నేటిధాత్రి…!

 

పార్టీమీద సానుభూతి వున్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత?

పధకాల మీద నమ్మకం…ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావం?

ప్రతి ఇంటికీ ఏదో ఒక పధకం… ఎమ్మెల్యేల తీరుపై నిర్వేదం…?

చెప్పంగ విననోడిని చెడంగ చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. అసలు తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంటే ప్రజల్లో ఒకరకంగా చెప్పాలంటే ఆరాధన భావం వుండేది. కాని క్రమేణా నాయకుల తీరుతో ప్రజల్లో వున్న ఆ అభిప్రాయం చెరుగిపోతూ వస్తోంది. తెలంగాణ కోసం పనిచేసినంత కాలం కనిపించిన అంకిత భావం ఇప్పుడు కొంత మందిలో కనిపించకపోవడమే అందుకు కారణం. తెలంగాణ రావడం, రాష్ట్రరాజకీయాల్లో సమూలమైన మార్పులు రావడం, కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. ఉద్యమ కారులు పాలనలో పాలు పంచుకున్నారు. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి దాకా ఉద్యమకారులు పాలకపక్షంగా సమాజంలో గౌరవాన్ని సంతరించుకున్నారు.

ప్రజల్లో నమ్మకాన్ని కల్గించారు. వారి విశ్వాసం చూరగొన్నారు. నాయకులయ్యారు. ప్రజలకు చేరువయ్యారు. ఇంత వరకు బాగానే వుంది. కాని రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక, కొందరు ఎమ్మెల్యేల మూలంగా పార్టీకి ఇబ్బందులు తలెత్తేదాకా వచ్చాయి. అందుకే ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వుందో అక్కడ ఖచ్చితంగా అభ్యర్దులను మార్చకపోతే ఇబ్బందే అన్నది తేలిపోయింది. ఆ స్ధానాలలో కొత్తవారికి అవకాశం కల్పిస్తే టిఆర్‌ఎస్‌కు మరోసారి తిరుగులేదు. ప్రతిపక్షాలకు మరో దశాబ్థంపాటు ఆశలు కూడా పెట్టుకోలేరు. 

                               అసలు తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేశామన్నది కూడా కొందరు నాయకులు మర్చిపోయినట్లున్నారు. అప్పటి పరిస్ధితులు కూడ అప్పుడే మర్చిపోయినట్లున్నారు. ఒకనాడు నీటి కోసం, సాగు కోసం, కరంటు కోసం పడిన వేదన, యాతన వారికి గుర్తులేవా? హైదరాబాద్‌లో కూడా కరంటు కోతలు తప్పని రోజులు. పల్లెల్లో పది నిమిషాలు కూడా కరంటు లేని కాలం మర్చిపోయారు. పంటలు ఎండి, తిండి గింజలకు కరువైన రోజులు గుర్తుకులేవు. తెలంగాణలో నీళ్లు లేక, వానలు రాక, పంటలు పండక కరువు కాలంలో పనికి ఆహారపథకం అమలతో నాలుగు మెతుకులు తిన్న రోజులు గుర్తున్నాయా? అవి ప్రజలకు ఎన్నడైనా గుర్తుచేస్తున్నారా? 

                              నిన్నటి తెలంగాణ. నేటి తెలంగాణ. రేపటి తెలంగాణ. ఇది సమాజంలో తరంతరం, నిరంతరం జరగాల్సిన చర్చ. అప్పుడే భవిష్యత్తుకు కొత్త భరోసా. అరవైఏండ్ల కొట్లాటే నీళ్లకోసం. నిధుల కోసం…అభివృద్ధి కోసం….గత రెండు దశాబ్ధాల క్రితం బిజేపి హయాంలో ఏర్పడిన రాష్ట్రాలు ఎలా వున్నాయి? తెలంగాణ రాకముందు ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? కొత్తగా ఏర్పాటైన చత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌లు ఎలా వున్నాయి? తెలంగాణ పురోగతి ఎలా వుంది? ప్రగతి ఎలావుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా వున్నాయి? వ్యవస్ధలు ఎలా వున్నాయి? కొత్తగా అందుబాటులోకి వచ్చిన వసతులు ఎలా వున్నాయి? అన్నది ఆయా రాష్ట్రాలను చూస్తే తెలుస్తుంది. అక్కడి పరిస్ధితులు అధ్యయనం చేస్తే అర్ధమౌతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని, అధ్భుతమైన సంక్షేమ పథకాలు అమలౌతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నిరంతరం కరంటు సరఫరా అవుతోంది. సాగుకు నీరందుతోంది. చెరువులు కూడా పూడికకు నోచుకోని తావుల్లో చెరువులు కళకళలాడుతున్నాయి. కొత్త కొత్తరిజర్వాయర్లనిర్మాణంతో భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎండిన బావులన్నీ ఎల్లబోస్తున్నాయి. కరంటుతో చిరు వ్యాపారులక భరోసా, వ్యాపార వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహంగా మారింది. 

                              దేశంలో ఎక్కడా లేని పేదింటి అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం లక్షరూపాయలు నగదు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 13లక్షల మందికి కళ్యాణ లక్ష్మి అందింది. అంటే ఆ కుటుంబాలన్నీ తెరాసకు అనుకూలంగా వుంటాయి. 58లక్షల పెన్షన్లు, 48 లక్షల మందికి రైతు బంధు…అందుతున్నాయి. తాజాగా దళిత బంధు కూడా ప్రతి నియోజకవర్గంలో 1300మందికి తొలి విడత అబ్ధి చేకూరింది. మరి ఇన్ని రకాలైన సంక్షేమపథకాలు అమలౌతున్నా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరుగుతోంది. అందుకు వారి వ్యక్తిగత వ్యవహరశైలి కారణంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు, ఉద్యమ కాలం నుంచి కూడా గెలుపొందుతూ వస్తున్న కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో సానుకూలత లేదని తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే ఎన్‌ఆర్‌ఐ భూములను చెరపట్టడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తూ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ పరువును తీస్తున్నారు. ఎంతో నమ్మకంతో అటు పార్టీ, ఇటు ప్రజల గుండెల్లో పెట్టుకుంటే, ఆస్ధుల పెంపకం యావతప్ప, జనం గోసలు చూడలేకపోతున్నాడట. దాంతో పార్టీమీద ఎంత ప్రేమ వున్నా, ఆ నాయకుడి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరిగే అవకాశం వుందంటున్నారు. ఒక మరో ఎమ్మెల్యే ఓ రియలెస్టేట్‌ దిగ్గజం తన వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో వుండగా, సగం వాటా ఇస్తే తప్ప అడుగపెట్టనివ్వనన్నాడట? దాంతో ఆ వ్యాపారి కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూముల వదిలేసి, అనువైప్పుడే వ్యాపారం చేసుకుంటానని అనుకుంటున్నాడట. ఇలా ఎమ్మెల్యేలు ఆస్ధులు కూడబెట్టుకోవడానికే రాజకీయాలు చేస్తున్నట్లు తయారైయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నవే. అందుకే ఈసారి సుమారు 40పైగా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కట్‌ అన్న హెచ్చరికలు అందుతున్నాయి.  

                            నేటిధాత్రి దిన పత్రిక మొదటి నుంచి ఈ విషయం చెబుతూనే వస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ హెచ్చరిస్తూనే వస్తున్నాడు. అయినా కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతూనే వచ్చారు. అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపికి బలం లేకపోయినా, బలగం లేకపోయినా, సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న విష ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే పరిస్ధితుల్లో లేకుండాపోతున్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిని బెదిరించడం అలవాటు చేసుకున్నారు. అది కాదు చేయాల్సింది వారికి ధీటైన సమాధానమివ్వాలి. అప్పుడు వారిలో సహజమైన మార్పు తీసుకురావొచ్చు. ఇబ్బందులకు గురిచేస్తే, వ్యతిరేక ప్రచారం ఆపుతారని అనుకోవడం కూడా సరైంది కాదు…ఎంత సేపు ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు తప్ప, జనం కోసం పనిచేసే తీరిక చూపించడంలేదు. ప్రశ్నించిన ప్రజలపై కన్నెర్ర చేయడం కాదు, వారిని దగ్గరకు తీసుకొని, సామరస్యపూర్వక సమాధానం చెబితే సావదానంగా వినని వారు ఎవరూ వుండరు. వారికి కళ్లముందు పారుతున్న నీళ్లు, అందుతున్న రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి చెప్పి, వాళ్ల ఇంటికి అందుతున్న పథకాలు గుర్తు చేస్తే చాలు…? ప్రశ్నించేవారు కనిపించరు? కాని ఎమ్మెల్యే స్ధాయి నాయకులు కూడా దిగజారి, సామాన్యులను బెదిరించడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆ ఎమ్మెల్యేలకు మైనస్‌గా మారుతోంది. ఇక అధికాయ యంత్రాంగంలో పెద్దఎత్తున పెరిగిపోతున్న అవినీతి కూడా ప్రభుత్వం మీద తీవ్ర ఫ్రభావం చూపుతోందనడం లో సందేహం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎమ్మెల్యేలు పట్టించుకోకవడంలో కూడా అనుమానాలు కల్గుతున్నాయి. అధికారుల నుంచి ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు పెద్దఎత్తున లంచాలకు తెగబడుతున్నా, ఎమ్మెల్యేలు కనీసం వివరాలు కూడా తెలుసుకునే పరిస్దితుల్లో లేరు. అధికారులను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలు ఆడమన్నట్లు ఆడతున్న అధికారులే పెద్దఎత్తున అవినీతికి పాల్పడతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దాంతో తమ పనులు చేయించుకుంటూ, అధికారుల తప్పులను చూసీ చూడనట్లు ఎమ్మెల్యేలు వ్యవహరించడం కూడా ఆరోపణలకు తావిస్తోంది. అంతిమంగా అది ప్రభుత్వం మీద ప్రభావం పడుతోంది. ఆఖరుకు అధికారులు కూడా ప్రశ్నించిన ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, వారిపై కేసులు నమోదు చేయడం వంటివి కూడా ప్రజల్లో ఆగ్రహానికి గురికావాల్సివస్తోంది. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలవాల్సిన నాయకులు, అధికారులకు వంత పాడడం అన్నది పార్టీకి తీరని నష్టం తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. నిత్యం మీడియాలో కూడా అనేక వార్తలు వస్తున్నాయి. నాయకులు పట్టించుకోక, పై స్ధాయి అధికారులకు భయం లేకపోవడం వల్ల, కింది స్ధాయి యంత్రాంగంలో విచ్చలవడి తనం పెరిగిపోయింది. ఇది పరోక్షంగా ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. ఇక ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి, గెలుస్తామనుకునే రోజులు కాదు…ప్రజల నమ్మకాలు కూడా ఎంతో అవసరం. వారి విశ్వాసం చూరగొనడం అత్యవసరం. ఇప్పటికైనా మారండి. ప్రభుత్వ ప్రథకాలు ప్రచారం చేయండి. ప్రతిపక్షాలను అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.

నవతరం రాజకీయ యుగం…ఇది కేసిఆర్‌ శకం…

కొత్త జాతీయ పార్టీ కేసిఆర్‌తోనే సాధ్యం…

ఏ పార్టీ వేలు పట్టకొని ఎదగలేదు….

ఎవరి కోసమో రాజకీయం చేయలేదు…

జనం కోసం రాజకీయం చేసిన నాయకుడు కేసిఆర్‌….

తెలంగాణ ఎజెండా రాజకీయ దిశ మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌…

జనం ఆకాంక్ష కోసమే రాజకీయమైన ఉద్యమ కారుడు….

తెలంగాణ సాధనలో త్యాగధనుడు….

అరవై ఏళ్ల తెలంగాణ కార్యసాధకుడు…

తెలంగాణ విముక్తి ప్రధాతయ్యాడు….

ఇప్పుడు దేశానికి అవసరమౌతున్నాడు…

దేశ ప్రగతి కోసం ముందుకు సాగుతున్నాడు…

జాతీయ పార్టీ ఏర్పాటు వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు….

దేశం మీసం మెలేసే నాయకుడుగా కదులుతున్నాడు…

పరుగెత్తే కాలాన్ని పట్టుకొనే నాయకుడు ఇప్పుడు దేశానికి కావాలి. దేశ ప్రగతిని పరుగెత్తించగలిగే నాయకుడై వుండాలి. అది కేసిఆర్‌ లా వుండాలి. అందుకే కేసిఆర్‌ రావాలి. ప్రగతి దారిలో గతి తప్పిన దేశం సిరుల బాట పట్టేందుకు, సంక్షేమం చిగురించేందుకు కేసిఆర్‌ కావాలి. తెలంగాణ గతిని మార్చి, ప్రగతిని ఆవిష్కరించిన నేత కేసిఆర్‌ సేవలు ఇకపై దేశానికి కావాలి. దేశమంతా తెలంగాణ మోడల్‌గా అభివృద్ధి జరగాలి. తెలంగాణలో ఆరేళ్ల కాలంలో వెల్లివిరిసిన పచ్చదనం, ప్రగతి పథం దేశమంతా కనిపించాలి. ప్రపంచమంతా వినిపించాలి. అందుకు కేసిఆర్‌ దేశానికి దిశా నిర్ధేశం చేసేందుకు కదలాలి. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అని గురజాడ చెప్పినట్లు, మనిషిని మనిషిగా మళ్లీ గౌరవించుకునే రోజులు రావాలి. మతాల మధ్య విషాలు లేని సమయం రావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం కావాలి. పార్టీ కావాలి. రాజ్యాంగరిత్యా మత ప్రయేయం లేని రాజ్యం మళ్లీ చిరుగు తొడగాలి. ఎన్నికల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం మాత్రమే రాజకీయం చేస్తున్న పార్టీలకు చరమగీతం పడాలంటే కేసిఆర్‌ రావాలి. అభివృద్ధి అన్ని వర్గాలకు సమానమైన హక్కుగా అందాలి. అందరూ సుఖ సంతోషంగా వుండాలి. నాయకులకు, రాజకీయ పార్టీలకు ప్రజలు, వారి జీవితాలు, సంక్షేమాలు, వారి బాగోగులు ఎజెండా కావాలి. మతాలు, కుత్సితాలు, కులాలు, కల్పనలకు దూరంగా వుండాలి…అందరూ ఒక్కటే…మనమంతా సమానమే…మన దేశ ప్రగతే మన ఆశయం కావాలి. మన దేశంలో ప్రజలంతా ఎలాంటి తారతమ్యాలు తేకుండా ఒత్తిళ్లు లేకుండా జీవించగలగాలి. ఓట్లకోసం సమాజాన్ని చీల్చొదు. అని బలంగా నమ్మే నాయకుడు కేసిఆర్‌….జనం బాగోగులు మాత్రమే తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌….

యుగానొక్కడు పుడతాడు. శకాన్ని నిర్మిస్తాడు. తరానికొకడు ఉద్భవిస్తాడు. చరిత్రకు జీవం పోస్తాడు. తనే చరిత్రౌతాడు. ఒకతరానికి దిక్సూచీగా నిలుస్తాడు. ప్రతి అడుగులో అతనే కనిపిస్తాడు. ప్రతి కాలంలోనూ అతనే వినిపిస్తాడు. ప్రతి వ్యక్తి ఆశయంలో అతన్నే చూసుకుంటారు. ఇలా చరిత్రలో పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు అనేక మంది వున్నారు. వారిని కాలం మర్చిపోదు. చరిత్ర విస్మరించదు. ప్రపంచ గమనంలో వారు లేకుండా ఏ ఒక్క అడుగూ పడదు. అలాంటి వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అని అంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే ఒక వ్యవస్ధ ఆశయాన్ని తన లక్ష్యంగా చేసుకొని సాగిన, నవతరం నాయకుల్లో అతి కొది మంది మాత్రమే కనిపిస్తారు. జనం ఆకాంక్షల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత దూరమైన వెళ్తారు. ఎంతటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొంటారు. అందరిలో కలిసి బతుకుతారు. అందరికోసమే బతుకుతారు. అలాంటివారిలో మన దేశంలో దేశ స్వాతంత్య్రోమ కాలంలో మహాత్మాగాందీ, తెలంగాణ సాధకుడు కేసిఆర్‌లను మాత్రమే గుర్తిస్తారు. అందుకు అనేక రూపాలు, స్వరూపాలు కనిపిస్తాయి. ఎక్కడో దక్షిణాఫ్రికాలో వున్న మహాత్మాగాంధీ మన దేశానికి వచ్చి, అప్పటికే సాగుతున్న స్వాతంత్రోద్యమానికి దిక్సూచీ అయ్యారు. ప్రతి అడుగుకు దిశానిర్థేశం చేశారు. ఉద్యమ కారులందరినీ తనదారిలోకి తెచ్చుకున్నారు. అంతిమంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు. వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు పాలకులుగా మారినా, ఐక్యతలేని ఆనాటి భారతీయ సమాజాన్ని విభజించి పాలించారు. వంద సంవత్సరాల పాటు సాగిన సుధీర్ఘ పోరాటంలో ఆటుపోట్లు తప్ప విజయాలు చూడలేదు. కాని మహాత్మాగాంధీ రాకతో ఉద్యమానికి విజయాలు అండడం మొదలుపెట్టాయి. పోరాటాలు విజయాలు సాగిస్తూ వచ్చాయి. సరిగ్గా తెలంగాణ ఉద్యమం మొత్తం పరిశీలిస్తే అదే కనిపిస్తుంది. అసలు ఉమ్మడి రాష్ట్రం పురుడు పోసుకోకముందే ముల్కీ నినాదం మొదలైంది. అయినా రెండు తెలుగు ప్రాంతాలు ఏకం కావడంతో తెలంగాణ మరింత దోపిడికీ గురైంది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నుంచే మొదలైన వ్యతిరేకతను ఎంత మంది వ్యక్తపర్చినా, కేసిఆర్‌ లా గర్జించిన వారు లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టిన వారు లేదు. తన రాజకీయ జీవితం ఒక వైపు, తెలంగాణ ఆకాంక్ష ఒక వైపు అన్నది తేల్చుకోవాల్సిన సమయంలో తెలంగాణ సాధన వైపు నిలిచిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ తీసుకున్న ఆ నిర్ణయంతోనే తెలంగాణ సరికొత్త చరిత్రకు శ్రీకారం జరిగింది. అవరోధాలను అధిగమిస్తూ, నిందలు భరిస్తూ, ఒత్తిని త్వజిస్తూ, నిరంతర, నిర్విరామ పోరాటం చేశాడు. పాలకుల శ్వాసకు అడ్డం పడ్డాడు. తెలంగాణ ఇస్తేగాని ఊపిరి తీసుకోలేని పరిస్ధితి కాంగ్రెస్‌కు తెచ్చాడు. తెలంగాణ సాధించాడు. 

                        ఒక తరానికి, మరొక తరానికి మధ్య ఏర్పడే సామాజిక, ఆర్ధిక, ప్రగతి అగాధాలను పూడ్చడం కోసం ఎవరో ఒకరు రావాలి. ప్రస్తుత తరుణానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కావాలి. ప్రపంచంలో ఎక్కడో పుట్టే, నదులు కూడా కాలగతిలో దిశను మార్చుకుంటాయి. మరో ప్రాంత సస్యశ్యామలం కోసం పరుగులు పెడుతుంటాయి. అలాగే తెలంగాణ ఆకాంక్ష కోసం, అభివృద్ధి కోసం కేసిఆర్‌ చేసిన యజ్ఞం పూర్తయింది. చేసిన యాగం ఫలితమిచ్చింది. తెలంగాణ ఏర్పడిరది. తెలంగాణ సాధించి, చేయాల్సిన అభివృద్ది పూర్తయ్యింది. తెలంగాణ సస్యశ్యామలమైంది. తెలంగాణలో కరంటు వెలుగులతో నిండిరది. సంక్షేమం, ప్రగతి రెండు కళ్లుగా సర్వతోముఖాభివృద్ది సాధించింది. తెలంగాణ ఉద్యమాల అడ్డ . పోరాటాల గడ్డ. . తొలి తరం తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం జరిగింది సిద్ధిపేట గడ్డ సాక్షిగానే…మలి తరం ఉద్యమానికి ఊపిరి పోసింది సిద్దిపేట అడ్డలోనే….దేశ భవిష్యత్తు కొత్త తరం రాజకీయాలు పురుడుపోసుకునేది కూడా సిద్ధిపేట నుంచే…అది కేసిఆర్‌ బలమైన పట్టుదలనుంచే…

ఉద్యమాల గడ్డ తెలంగాణ నుంచే దేశ దిశ`దశను మార్చే నూతన ఆవిష్కరణకు శ్రీకారం జరగనుంది. కొత్త జాతీయ రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాలానికి అనుగుణమైన ప్రేరణ జరగాల్సిన అవసరం వుంది. దేశమంతా వికాసం వెల్లివిరియాల్సిన తరుణం ఆసన్నమైంది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఏక రీతి పాలనతోపాటు, ఏక రీతి ప్రగతి చోటు చేసుకోవాలి. ఇప్పుడు దేశంలో వున్న నాయకులంతరూ ఒక వైపు, కేసిఆర్‌ మాత్రమే ఒక వైపు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దేశంలో బిజేపినుంచి మొదలు, కాంగ్రెస్‌తోపాటు, అన్ని ప్రాంతీయ పార్టీలో పార్టీలలో పార్టీ పేరు చెప్పుకొని ఎదిగిన నేతలే అందరూ. కాని పార్టీ అంటే కేసిఆర్‌…కేసిఆర్‌ అంటేనే టిఆర్‌ఎస్‌ అనే సార్ధకత వున్నది ఒక్క కేసిఆర్‌కే. అంతే కాదు కేసిఆర్‌కు ఏనాడు సొంత ఎజెండా లేదు. తన రాజకీయ జీవితం కోసం ఎవరి జెండా మోయలేదు. జనం కోసం జెండా ఎత్తాడు…జనమే ఆకాంక్షనే ఎజెండా చేసుకున్నాడు. జన నాయకుడయ్యాడు. జనం కోసం రాజకీయం చేసిన ఈ తరం ఏకైక నాయకుడుగా కేసిఆర్‌ చరిత్రలో నిలిచారు. జనం ఆకాంక్ష కోసం తన రాజకీయ జీవితాన్ని మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. జనం నుంచి పుట్టిన నాయకుడు కేసిఆర్‌. జనం కోసమే పార్టీ పెట్టి, జనం ఆకాంక్షను బలమైన గొంతుగా చేసుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్ల గోసను తీర్చేందుకు కంకణం కట్టుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పట్టిన పట్టు విడవకుండా, సడలకుండా, ఎన్ని అవరోధాలెదురైనా నమ్మిన సిద్దాంతం కోసం నిలబడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజల ఆకాంక్షం కోసం, వారి కలల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇలాంటి త్యాగాల చిరిత్ర దేశంలో ఏ నాయకుడికి లేదు. పార్టీల చరిత్రలో వాటి వేలు పట్టుకొని ఎదిగిన నేతలే అందరూ…నాయకత్వం కోసమే రాజకీయం చేసిన వారే అందరూ… పదువుల పందేరంలోనే నడిచిన నాయకులే అందరూ..కాని జనం కోసం నిలిచిన ఏకైక నాయకుడు కేసిఆర్‌…జనం కోసమే నాయకుడైన గొప్ప త్యాగధనుడు కేసిఆర్‌. అందుకే ఆయన అవసరం దేశానికి కూడా వచ్చింది. దేశంలో జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అర్హత వున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌…ఆయనతో పోల్చుకునేందుకు ఏ నాయకుడికి అర్హత లేదు….

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన

అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్

ముత్తారం :-నేటి ధాత్రి

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని దరియపూర్ గ్రామం లో పల్లెపగతి ఐదో విడత కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ కొత్తగా నిర్మిస్తున్న క్రీడ ప్రాంగణం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ ని తనిఖీ చేశారు విధుల్లో తిరుగుతూ పారిశుధ్యం పనులను మరియు డ్రింకింగ్ వాటర్ బాగా చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ వేణుమాధవ్ సర్పంచ్ గాధం స్రవంతి శ్రీనివాస్ ఎంపీటీసీ రామగల్ల పోచమ్మ మధు పంచాయతీ కార్యదర్శి సరిత స్పెషల్ ఆఫీసర్ తిరుపతి వార్డు సభ్యుల గ్రామస్తులు పాల్గొన్నారు

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరగలేదు

పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత

భీమదేవరపల్లి నేటిదాత్రి

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెంటనే స్పందించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం వల్ల పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట మాత్రమే జరిగింది, ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. భూ నిర్వాసితులు సమన్వయం పాటించాలని సూచించారు. పై అధికారులతో మాట్లాడి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి 13, జూన్ 

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు.

ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు.

భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.

సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 19 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణిలో వచ్చిన అర్జీలు శాఖల వారీగా

రెవిన్యూ – 12

ఇరిగేషన్ – 1

ఎం సి సర్కిల్ – 6

టోటల్ – 19

డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

పెంచిన విద్యార్థి బస్ పాస్ లను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యార్థి బస్ పాస్ లను,బస్సు ఛార్జీలను తగ్గించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్ డిపో ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల.ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ.జోసఫ్ లు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థి బస్సు చార్జీలను 135 శాతం పెంచడం , 195 రూపాలు బస్ పాస్ ను 450 రూపాయలు చేయడం సిగ్గుచేటని,భూపాలపల్లి నుండి హనుమకొండ వరకు 75 రూపాయలు బస్ ఛార్జి ఇప్పుడు 100 రూపాయలు పెంచడం సరికాదని అన్నారు.వెంటనే బస్సు చార్జీలను తగ్గించి, విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లను మంజూరు చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు చదువు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయడం మానుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్,ఎంజాల.రాజేందర్, చందువర్మ,సూరం.రాజు. రాజేందర్, తదితర నాయకులు పాల్గొన్నారు

పెండింగ్ కేసులు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

 

పెండింగ్ కేసులను త్వరగతిన పరిష్కరించి పెండింగ్ కేసులను తగ్గించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే సంబంధింత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కరానికి మరింత చొరవ తీసుకోవాలని అన్నారు..దీర్ఘకాలంగా పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి మరింత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..పెండింగ్ కేసుల విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కొత్త కేసులతో పాటు పెండింగ్ లో ఉన్న కేసులను ఎప్పటికపుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలని అన్నారు.ఎస్సీ ఎస్టీ, ఫోక్సో, మరియు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసులలో కోర్టులో ట్రాయల్ సమయంలో సాక్షులను మోటివేట్ చేయాలని, మరియు కోర్టులో ట్రాయల్ ఏ విధంగా నడుస్తుందో ప్రతిరోజు మానిటర్ చేయాలని అధికారులకు సూచించారు.హెచ్ఆర్ఎంఎస్ (HRMS) గ్రీవెన్స్ మాడ్యూల్ నందు అధికారులు సిబ్బంది సర్వీస్ కు సంబంధించిన సమస్యలు పంపించాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, గుట్కా రవాణా మరియు విక్రయించే వారిపై మరియు తరచు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ,డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని, మరియు ఓపెన్ డ్రింకింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు..

పోలీస్ స్టేషన్లలో ఏకీకృత సేవలను విస్తరింప చేయడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును ఈ సందర్భంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్స్ గురించి అధికారులు నిత్యం పర్యవేక్షించి పక్కాగా అమలు చేయాలని చెప్పారు..ఫంక్షనల్ వర్టికల్స్ వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది అన్నారు..

 

 

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య ,డిఎస్పీ లు చంద్రశేఖర్, నాగేంద్రచారి, రవికుమార్,సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, మోగిలి,వెంకటేష్,శ్రీలత, బన్సీలాల్, డీసీఆర్బీ సి.ఐ నవీన్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సర్వర్ ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు..

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం

మంగపేట – నేటి ధాత్రి

మంగపేట మండలంలోని వాడగూడెం గ్రామానికి చెందిన తుమ్మల.వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా రాజుపేట లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల రోజువారి కూలీ పనికి వెల్లగా కాలికి దెబ్బ తగిలింది. గాయం తీవ్రం కావడంతో కాలు మొత్తం

ఇన్ఫెక్షన్ వచ్చింది ఆస్పత్రిలో చూపించే అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయడంతో సోమవారం వెంకటేశ్వర రావు ను కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయిల ఆర్థిక సహాయాన్ని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ అందజేశారు. అనంతరం తిమ్మంపేట గ్రామానికి చెందిన సున్నారీ నందిని, తన తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి పై చదువులు చదువుకోలేక నిస్సహాయ స్థితిలో ఉంది. తనను గూర్చి తెలుసుకొని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు కలిసి ఆమెకు స్టడీమెటీరియల్ నిమిత్తం రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నవీన్,ముయబోయిన శివ, జై భీమ్ రామ్ మోహన్, కొమరం నితిన్, గోమాసు సావిత్రి,ములుగు జిల్లా జీవ వైవిద్య డైరెక్టర్ శ్యాం బాబు, గ్రామస్తులు బొప్పెన జ్యోతి, నిమ్మగడ్డ ప్రవీణ్, బోడ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వాదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ,PACS చైర్మన్ తోట రమేష్

ఈరోజు మంగపేట మండలం కొత్తమల్లూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ యూత్ అధ్యక్షులు గుండారపు రమేష్-యమున దంపతుల కుమార్తెలైన రూపశ్రీ,గాగణ చిన్నారులకు చెవులు కుట్టు కార్యక్రమం ముక్కుడుపోచమ్మ దేవాలయం లో నిర్వహించిగా చెవులు కుట్టు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వాదించిన *టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, PACS చైర్మన్ తోట రమేష్* ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరస్వామి,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,మండల నాయకులు బచ్చలకూర ప్రసాద్,యూత్ నాయకులు,గుమ్మల శ్రీను జక్కం రవి, తదితరులు పలుగోన్నరు

ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చేది మట్టి కుండ….

గతంలో మట్టి కుండలోనే పెరుగు , సల్ల చేసేవాళ్ళు….

ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన మట్టికుండలు….

స్టీల్ వైపే ప్రజల మొగ్గు…. 

కొల్చారం , ( మెదక్ ) నేటి ధాత్రి :

మట్టితో మానవుడిది విడదీయలేని అనుబంధం. అందుకే మట్టి పాత్రల పై మళ్ళీ ఆసక్తి చూపుతున్నాడు. మన పూర్వీకులు మట్టితోనే ఎన్నో రకాల పాత్రల్ని తయారు చేసి వాటి వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అల్యూమినియం, స్టీల్ ఇతరత్రా కెమికల్స్తో కూడిన రకరకాల వస్తువులు మార్కెట్లను ముంచెత్తాయి. దీంతో ఆరోగ్యం కూడా తరిగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ మట్టి పాత్రలకు ఆదరణ పెరిగింది. వీటి వినియోగం తో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. మట్టి పాత్రలు రాగి పాత్రలు ఆరోగ్యానికి మంచివని మన పూర్వీకులు వినియోగించేవారు. ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యి పైన మట్టిపాత్రలో వంట చేయడం కనిపిస్తున్నది. కొన్నేళ్ల కిందట వీటి ఉపయోగం చాలా ఉండేది. కానీ కాలక్రమేణా వినియోగం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వినియోగిస్తున్న పాత్రల తయారీలో రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటిని వాడుతున్న ప్రజలకు నేడు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుoడంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న ప్రజలు మళ్లీ పాతధనమే కోరుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం వంటగదిని తన పాత్రలు చిన్న మట్టి పాత్రలు రాగి చెంబులు వాడుతుండటం పెరుగుతోంది. ఆరోగ్య రీత్యా ప్రస్తుతం సమాజంలో వీటి వినియోగం పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి పాత్రలు, రాగి పాత్రలు అమ్మకాలు నానాటికీ పెరుగుతున్నాయి.

ఇప్పటివరకు అల్యూమినియం, స్టీల్, ఇతడితో పాటు వివిధ రకాల ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, రోటి మేకర్స్ వంటి పాత్రలు వాడుతున్న ప్రజలు మట్టి పాత్ర పై మనసు పారేసుకున్నారు. ఆరోగ్యరీత్యా మట్టి పాత్రలు మంచిదని భావించి వీటితోనే వంటలు చేస్తున్నారు. మట్టితో చేసిన వివిధ రకాల పాత్రలు గిన్నెలు రకరకాల వస్తువులు విక్రయాలు జరుగుతున్నాయి. వంట చేసుకునేందుకు వివిధ ఆకారాల్లో మట్టి గిన్నెలు అందుబాటులోకి వచ్చాయి. కుక్కర్లు, ఫ్యాన్లు, నీటిని తాగడానికి గ్లాసులు, బాటిల్ లు సైతం మట్టి తో తయారు చేసినవి మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మట్టి పాత్రలోనే వంటకాలు చేస్తున్నారు. దేశి చికెన్, చికెన్ లోని వివిధ రకాల వంటల కోసం మట్టి పాత్రలోనే వినియోగిస్తున్నట్లు హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. స్వీట్ షాపుల్లో మట్టి పాత్రలోనే గతంలో పాలు, పెరుగు, నెయ్యి , చల్ల , చేసి ఎండాకాలంలో మట్టికుండలో చేసినటువంటి చల్లాను తాగితే అప్పటి పెద్ద మనుషులు పొద్దు పొద్దున్నే లేచి గంజి , సల్ల తాగి భుజాన నాగలి ఎత్తుకొని ఎద్దులను కొట్టుకొని పొలం పనులకు పోయేవారు. ప్రస్తుతం ఇప్పుడు చల్లా అనే పదాన్ని మరిచిపోయారు.

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే ఇకపై….. నేరమే

చెత్తలో లభించిన ఆధారాలతో గుర్తింపు జరిమానా విధింపు

 

*సిద్దిపేట నేటి ధాత్రి*

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అదేశాలమేరకు పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో,ఖాళీ ప్రదేశాలలో అపరిచితులు చెత్త పడవేసి అపరిశుభ్రతకు పాల్పడి, పట్టణ ప్రజల అనారోగ్యానికి కారకులు అయిన వారిని చెత్తలో దొరికిన ఆధారాలతో గుర్తించి జరిమానా విధించి తగిన అవగాహన కల్పించి అప్పటికి కూడా అదేవిధంగా మరల చెత్త బహిరంగ ప్రదేశాలలో పడవేసినట్లైతే మున్సిపల్ చట్టప్రకారం శిక్షార్హులను చేయవలసిందిగా ఆదేశించారు.ఇట్టి క్రమంలో సోమవారం శుభోదయ పాఠశాల వద్ద చెత్తలో లభించిన ఆధారాలతో వారిని గుర్తించి తగిన జరిమాన విధించడంతో పాటు మరొకసారి చెత్త వేయకుండా అవగాహన కల్పించి, మరొకసారి ఇలా జరిగినట్లైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ సానిటరీ సిబ్బందితో కలిసి శేఖర్,మాధవి, సుశాంత్,

బి.మహేష్ లు బహిరంగ ప్రదేశాలలో వేసిన చెత్తలో లభించిన తదితర ఆధారములతో వారియొక్క నివాస ప్రాంతాలను గుర్తించి వారికి జరిమానా విధించి చెత్తవేయకుండా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో జవాన్ లు భాను శివ,బాబు,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట నేటి ధాత్రి

 ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నూతనంగా జిల్లా కలెక్టర్ గా నిర్మించబడిన ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస రెడ్డిలు పుష్ప గుచ్చం అందించి వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ భాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లా అభివృద్ధిని పరిశీలించేందుకు ఈ జిల్లాకు ఇతర జిల్లా కలెక్టర్ గా రావడం జరిగింది అని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచే సిద్దిపేట జిల్లాకు జిల్లా కలెక్టర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లు జిల్లా అభివృద్ధి చేస్తున్న కృషిలో భాగస్వామినై వారి సహకారంతో అన్ని ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు ప్రజలకు అందించడంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందు ఉంచుతానని అన్నారు. గత కలెక్టర్లు జిల్లా అభివృద్ధికి చేపట్టిన పనులను కొనసాగిస్తానని, గత మూడు సంవత్సరాలుగా జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా విధులు నిర్వహిస్తున్న ముజామిల్ ఖాన్ సేవలను సద్వినియోగం చేసుకుంటామని, త్వరలోనే అధికారులతో సమావేశాలు నిర్వహించి వివిధ పనులు, పథకాల పురోగతిని సమీక్షిస్తానన్నారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనుల ప్రగతి పై రెండు, మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో పచ్చదనం, పరిశుభ్రతలో జరిగిన అభివృద్ధిని, సిద్దిపేట గజ్వేల్ పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఆదర్శంగా నిలిచాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version