అల్పపీడన ప్రభావం మండలంలో కొనసాగుతున్న భారీ వర్షాలు.

ఇబ్బందుల్లో పలిమెల మండలం,  పొలాలు చెన్ లలోకి భారీ నవరద నీరు,

 

వరద నీటి తాకిడికి తెగిన నాగయ్య కుంట కట్ట బుదేడు గ్రామం చివరి వాడలో ఇండ్లలోకి నీరు.

లక్ష్మి సరస్వతి బ్యారేజ్ కు భారీగా వరద నీరు, 81 గేట్లను ఎత్తివేసిన అధికారులు.

రవాణా ఇబ్బందుల నుండి  బయటపడ్డ ఇద్దరు గర్భవతి మహిళలు,విలాస్ రావ్ సేవలు భేష్.

మండలంలో అధికార యంత్రాంగం బాధితుల వెసులుబాటు ముందస్తు అప్రమత్తం చర్యల్లో విఫలం,

మహాదేవపూర్-నేటిధాత్రి:

ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి సరస్వతి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు చేరడం ఇప్పటికే ఉమ్మడి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పలిమెల మండలం లోని పలు గ్రామాలు రెడ్ అలర్ట్ పరిగణంలోకి రావడం జరిగింది విద్యుత్ కమ్యూనికేషన్ లాంటి సదుపాయం ఐదు రోజులుగా లేకపోవడం రవాణా సౌకర్యం స్తంభించుకోవడం తో అధికార యంత్రం గానికి వాస్తవ పరిస్థితులు అందకపోవడం మండల ప్రజలకు మరిన్ని ఇబ్బందుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మహదేవ్పూర్ మండలంలోని కాలేశ్వరం అన్నారం తోపాటు బ్రాహ్మణ పెళ్లి గ్రామాల్లో ఒకవైపు గోదావరి మరోవైపు పెద్ద చెరువుల వరదనీరు ఎక్కువ ప్రభావంతో బ్రాహ్మణపల్లి మహాదేవపూర్ రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. అధికార యంత్రాంగం ఇప్పటివరకు గ్రామాలకు సంబంధించిన ప్రజలతోపాటు ప్రస్తుతం తుఫాను ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతుందా ప్రజలకు బాధితులకు భరోసా కలిగించి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం మండలంలో ఎన్ డి ఆర్ ఎఫ్ టీ సేవలు ప్రత్యేకంగా కాలేశ్వరం పెద్దంపేట వాగు వద్ద కేవలం సమాచారం అనంతరం బృందం రావడం అవసరమైన ప్రదేశంలో బృందం ఉండకపోవడం ఇప్పటికీ అధికారులు పునరావస కేంద్రాలు పలిమెల మండల ముంపుకు గురై బాధితుల కొరకు ఏర్పాటు చేయకపోవడం ఇలాంటి సమయాల్లో అధికార నిర్లక్ష్య ధోరణి వహించడం దుర్భాగ్యం అని చెప్పవచ్చు.

 

 *అల్పపీడన ప్రభావం మండలంలో కొనసాగుతున్న భారీ వర్షాలు.* 

 

ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో మండలంలో ఎడతెడపకుండా కురుస్తున్న వర్షాల వలన ఉమ్మడి మండలంలోని పలిమెల మండలం తో పాటు 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది పలివెల మండలం నుండి రాకపోకలు పెద్దంపేట వాగు తెగిపోవడం వలన రాకపోకలు అంతరాయం కలగడం మండలానికి సంబంధించిన ప్రజలు ఒకవైపు రాకపోకలు స్తంభించడం మరోవైపు గత నాలుగు రోజుల నుండి విద్యుత్ సదుపాయం లేక మండలమంతా చీకట్లో సాగిపోతుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం కావడం ఇప్పటికే గోదావరిలో అధిక వరద ఉండడం పలివెల మండలానికి సంబంధించిన గ్రామాల సమీపంలోని పొలాలు చేనుల లోకి వరద నీరు రావడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ మండలానికి సంబంధించి బ్రాహ్మణ పెళ్లి చుట్టుపక్కల వాగు అలాగే మరోవైపు గోదావరి వరద నీరు కొచ్చేరువు దామరచెరువు వరదతో మత్తడి వేస్తున్న క్రమంలో భారీగా వరద నీరు వలన బ్రాహ్మణ పెల్లి గ్రామానికి అతి సమీపంలో వరద నీరు రావడం జరిగింది అలాగే బ్రాహ్మణపల్లి నుండి మహాదేవపూర్ కు వచ్చే దారిలో వరద నీరు ప్రభావం ఎక్కువ కావడం వల్ల గ్రామస్తులకు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే అన్నారం గ్రామం నుండి కాలేశ్వరానికి వెళ్లే చంద్రుపల్లి వాగు భారీ వరద నీటి ప్రవాహం ఉండడం వలన గులాబ్ తుఫాన్ సమయంలోనే చండ్రుపల్లి మద్దులపల్లి కుంట్లం గ్రామాలకు ఎక్కువ మోతాదులో వరద నీరు వచ్చి విద్యుత్ అంతరాయం కలిగి గ్రామానికి సమీపంలో నీరు రావడం జరిగింది. బంగాళాఖాతం అల్పపీడనం వల్ల కురుస్తున్న వారాలకు ప్రస్తుతం ఆయా గ్రామాలు సైతం వరద నీటి ప్రభావంతో ప్రమాదానికి అతి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మండలంలో ఇప్పటికే 40 నుండి 60 ఇండ్ల వరకు ఉమ్మడి మండలంలో కూలిపోగా ఎవరికి మాత్రం ప్రాణహాని కలగలేదు కేవలం మాదాపూర్ మండల కేంద్రానికి చెందిన ఒక యువకునికి గాయాలు కావడం జరిగింది. మంగళవారం కురిసిన వర్షం ప్రభావం వల్ల ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్ల గోడలు కొన్ని సిసి రోడ్లు కొట్టుకపోవడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

 

 *ఇబ్బందుల్లో పలిమెల మండలం,  పొలాలు చెన్ లలోకి భారీ నవరద నీరు,* 

 

గిరిజన బిడ్డలకు బంగాళా అల్పపీడ ప్రభావం ఇబ్బందులు తప్పడం లేదు గత నాలుగు రోజుల నుండి గిరిజన బిడ్డలకు ఒకవైపు వరద నీరు మరోవైపు విద్యుత్ సదుపాయం ఆపదలో వైద్యం లాంటి సదుపాయాల కొరకు రవాణా సౌకర్యం లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. వారి ఇబ్బందులు చెప్పుకొనుటకు మొబైల్ సౌకర్యం లాంటి లేకపోవడం ప్రభుత్వం అప్నా హస్తం అందించే దాతలు చెర లేకపోవడం జరుగుతుంది. ప్రస్తుతం పలిమెల మండల ప్రజలు ఎనలేని ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ మండలానికి రాకపోకలు సత్ సంబంధాలు తెగిపోవడంతో ఒకవైపు అధికారుల సహాయం అందకపోవడం వర్షాల ప్రభావం మరింత ఎక్కువ కావడం ఇప్పటికీ మండలంలోని పలు గ్రామాల సమీపంలోని చేనుల వరకు వరద నీరు రావడం మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రత్యేకంగా మండలానికి సంబంధించి మోదేడు గ్రామానికి సంబంధించి ఒకవైపు భారీ వరద నీరు ప్రవాహం పెద్దంపేట వాగు దిగడం భయం గుప్పెట్లో ఉన్న మోదేడు ప్రజలకు గ్రామానికి ఆనుకొని ఉన్న నాగయ్య కుంట కట్టతెగడం మరింత భయాన్ని కలిగిస్తుంది. నాగయ్య కుంట కట్టతెగి గ్రామంలోని చివరి ఇండ్లలో కొంత వరద నీరు ప్రభావం చూపుతుందని గ్రామస్తులు భయానికి లోనవుతున్నారు. గిరిజన మండలమైన పలివెల ప్రతి తుఫాను సంభవించే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ముంపుకు ప్రమాదమయ్యే గ్రామాలను ముందస్తు చర్యలు చేపట్టకపోవడం ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ మోదేడు గ్రామ ప్రజలు ప్రభుత్వ సాయం కొరకు ఎదురుచూస్తున్న వారిపై కనికరించకపోవడం నేటికీ వారి పరిస్థితుల దృశ్య అధికారులు ఎవరూ కూడా మోదేడు గ్రామానికి వెళ్లకపోవడం బుధుడు గ్రామస్తులకు పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం అలాగే పలివెల మండలంలోని మరికొన్ని గ్రామాలు ముంపుకు గురి అయ్యే వాటిని పరిశీలించి ముందస్తు చర్యల కొరకు అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికార యంత్రాంగం పలిమిల మండలం లోని ముంపుకు గ్రామాలను గుర్తించి వెంటనే ఆయా ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించి వారికి నిత్యవసర సరుకులు అందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.

 

 *వరద నీటి తాకిడికి తెగిన నాగయ్య కుంట కట్ట బుదేడు గ్రామం చివరి వాడలో ఇండ్లలోకి నీరు.* 

 

పలివెల మండలంలోని బుధుడు గ్రామం ప్రస్తుతం రెడ్జోన్ లో ఉమ్మడి మండలంలోని మొట్టమొదటి గ్రామంగా చెప్పవచ్చు ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మోదేడు గ్రామం ప్రమాదానికి పొంచి ఉంది భారీగా వరద నీరు చేరడంతో పెద్దంపేట వంతెన తెగిపోవడం మోదేడు గ్రామానికి సమీపంలో ఉన్న నాగయ్య కుంట కట్ట సోమవారం రాత్రి దిగడంతో బుధుడు గ్రామంలోని చివరి వీధిలో ఉన్న కొన్ని ఇండ్లలో మీరు చేరడంతో గ్రామ ప్రజలు మరింత భయంతో చెందడం జరుగుతుంది. ఇప్పటికే పెద్దంపేట వంతెన తెగడం వరద నీరు ఎక్కువగా గ్రామ సమీపంలోకి రావడం గ్రామానికి అనుకొని ఉన్న నాగయ్య కుంట లో వరద నీరు ఎక్కువ చేరి కట్ట తెగిపోవడం బుధుడు ప్రజలకు ఇప్పటికే నిన్ను ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వర్ష ప్రభావం కొనసాగుతున్న క్రమంలో మరింత వరద నీరు ఎక్కువై గ్రామాన్ని చుట్టుముట్టేస్తుందని గ్రామ ప్రజలు బంధువులను చెందక తప్పడం లేదు ఇప్పటికైనా అధికారులు తక్షణమే మూదేడు ప్రజలకు వారి ప్రస్తుత పరిస్థితులను గుర్తించి వారికి పలిమెల లేదా అంబటిపల్లి గ్రామాల్లో పునరావస కేంద్రాన్ని ఏర్పాటుచేసి గ్రామస్తులకు పునరావస కేంద్రాలకు తరలించే ప్రక్రియలు ప్రారంభించాల్సిన అవసరం ఎంత ఉంది.

 

 *లక్ష్మి సరస్వతి బ్యారేజ్ కు భారీగా వరద నీరు, 81 గేట్లను ఎత్తివేసిన అధికారులు.* 

 

మండలంలోని లక్ష్మీ సరస్వతి బ్యారేజ్ లకు సంబంధించి గోదావరిలో వరద నీరు ప్రభావం భారీగా చేరడంతో అధికారులు అప్రమత్తమై లక్ష్మి సరస్వతి బ్యారేజ్ లకు కలిపి 81 గేట్లను ఎత్తివేయడం జరిగింది. బ్యారెల్ లో పెద్ద మొత్తంలో వరదనీరు చేయడంతో గేట్లు ఎత్తేసి అధికారులు 6 కోట్ల 60 లక్షల 580 నీరును దిగువకు పంపించడం జరిగింది. పెద్ద మొత్తంలో గేట్లను ఎత్తివేయడంతో భారీ వరద నీరు దిగువకు వదలడం వలన అన్నారం గ్రామానికి సంబంధించి అలాగే సూరారం తో పాటు ఇతర గ్రామాలలో బ్యారేజ్ వరద నీరు ప్రభావం గ్రామాల్లోకి వచ్చి ప్రస్తుత పరిస్థితి ఉండడం ఇప్పటికే వర్షపు వరద నీరు ఎక్కువ గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండిపోయి ఉన్న క్రమంలో దిగువ వరద నీరు వదలడంతో గ్రామాలు మరింత ప్రమాదంలో పడే సూచనలు కనబడుతున్నాయి అధికార యంత్రాంగం ప్రస్తుతం మండలంలోని గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ కు అనుకొని ఉన్న గ్రామాలకు ముందస్తు చర్యల కొరకు సిద్ధంగా ఉండి గ్రామాల్లో నీరు ప్రవహించకుండా ఒకవేళ గ్రామాల్లో నీరు ప్రవహించిన గ్రామస్తులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండకుండా ముందుగానే వారికి సదుపాయాల ఏర్పాటు కొరకు పునరవస కేంద్రాలను ఏర్పాటుచేసి తరలించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

 

 *రవాణా ఇబ్బందుల నుండి  బయటపడ్డ ఇద్దరు గర్భవతి మహిళలు,విలాస్ రావ్ సేవలు భేష్.* 

 

పలివెల మండలంలో రాకపోకలు స్తంభించడం గత ఐదు రోజుల నుండి మండలానికి సంబంధించిన ప్రజలు కేవలం మండలానికి ఆయా గ్రామాల్లో పరిమితమై ఉండడం విద్యుత్ మరియు మొబైల్ సదుపాయం అంతరించి పోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న మండల ప్రజల్లో సోమవారం అలాగే మంగళవారం రోజు మండలానికి చెందిన చెన్నూరి రజిత లింకలగడ్డ కు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే రవాణా సౌకర్యం లేకపోవడంతో పెద్దంపేట వాగు వద్ద గర్భిణీ స్త్రీ తీసుకురావడంతో అంబటిపల్లి సర్పంచ్ విలాస్ రావు మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ సర్పంచ్ గా తన విధి నిర్వహణను ప్రజల కొరకు సొంతంగా గత నాలుగు రోజుల నుండి పెద్దంపేట వాగు వద్ద తన సేవలను అందిస్తున్న విలాస్ రావు ఎన్ డి ఆర్ ఎఫ్ సహాయక బృందాన్ని సమాచారమిచ్చి లింకలగడ్డ కు చెందిన గర్భిణీ స్త్రీకి సహాయక చర్య బృందం ద్వారా వాగులు దాటించి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే సోమవారం కూడా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న క్రమంలో ఎన్టీఆర్ ఎఫ్ టీం సహాయంతో వారి వద్దకు వైద్యులను పంపించి చికిత్స అందించడం జరిగింది. ఎన్ డి ఆర్ ఎఫ్ టీం సహాయం వలన రెండు గర్భిణి స్త్రీల ప్రాణాపాయ స్థితిని ఉన్న వారిని కాపాడడం వాటికి అంబటిపల్లి సర్పంచ్ పూర్తిస్థాయి సహకారం అందించడం నేటి వరకు విలాస్ రావు అధికారులతో ఉండి బ్రిడ్జి ప్రస్తుత మరమ్మతులు విద్యుత్ స్తంభాలు అమరుస్తున్న క్రమంలో వారికి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఒక సర్పంచ్ బాధ్యతలే కాకుండా విలాస్ రావు తన మానవత దృక్పథాన్ని చాటుకోవడం విశేషం.

 

 *మండలంలో అధికార యంత్రాంగం బాధితుల వెసులుబాటు ముందస్తు అప్రమత్తం చర్యల్లో విఫలం,* 

 

ప్రస్తుతం మండలంలో కుండపోత వర్షాల వలన మహదేవ్పూర్ మండలం తో పాటు పలిమెల మండలం ఎనలేని సమస్యల బారిన పడి ప్రభుత్వం అధికారులు సహాయం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో మండలమంతా తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వానలతో  తల్లడింల్లి పోతున్న క్రమంలో గ్రామస్తులు పలు మానవత దుప్పడం కలిగిన వ్యక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్న క్రమంలో అధికారులు మాత్రం కేవలం కార్యాలయానికి పరిమితమై నేటి వరకు ఉమ్మడి మండలంలో బాధితులకు సహాయ చర్యలు అందించడంలో విఫలం కావడం జరిగింది. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలకు కేవలం ఒక సూరారం గ్రామంలోని పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం యావత్ మండలంలో ప్రస్తుతం పలిమెల మండలంలోని అనేక గ్రామాల పరిస్థితి దీనంగా మారి ఎందరో పేదలకు రేషన్ బియ్యం కూడా నేటికీ అందకుండా మరోవైపు అల్పపీడన ప్రభావం గ్రామాల్లో రాకపోకలు స్తంభించడం కనీసం వెలుతురుకు కూడా నోచుకోని అడవి బిడ్డలు ఎనలేని ఇబ్బందులు పడుతున్న వరద నీటి ప్రభావం వల్ల ఇక గ్రామాల్లోని ఇండ్లలో వరద నీరు వస్తుందని ఇప్పటికీ మోదేడు ఇతర గ్రామాల్లో పరిస్థితులు తెలియకుండా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం కండ్లున్న కుబేరుల్లా వ్యవహరిస్తూ కాగితాలు కార్యాలయాలకే పరిమితమయ్యారు ఐదు రోజులుగా ఇండ్లు కూలిన ఏ ఒక్క బాధితులకి అధికారులు సహాయమును అందించలేదు కనీసం సహాయం వస్తుందని ఆయా బాధితులను పరామర్శించి భరోసాను  ఇచ్చిన దాఖలాలు లేదు. పెద్దంపేట వాగు కాలేశ్వరం గోదావరి అన్నారం వాగు లాంటి అత్యవసర నీటి ప్రవాహం ఎక్కువ ప్రవహించే ప్రదేశాల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయకపోవడం కేవలం జిల్లా కలెక్టర్ వచ్చిన రోజు మాత్రమే ఇండియా సేవలు అందించి తిరిగి వెళ్లడం ఒకవేళ రాత్రి అధిక వ్యాసాలు పడి గ్రామాలు ఉక్కిరిగుక్కి రైతే ఎన్డిఆర్ఎఫ్ సహాయక బృందం జిల్లా కేంద్రం నుంచి వచ్చే వరకు ప్రాణాపాయ పరిస్థితి ఇంతవరకు చేరుతుందో ఊహించవచ్చు. తాజాగా ఓ గర్భిణీ స్త్రీ ఈరోజు పురిటి నొప్పులతో ఎంతో సమయం సహాయక చర్యల కొరకు వేచి చూసిన తర్వాత వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన రెండు గంటలకు పెద్దంపేట వాగు వద్ద ఎన్టీఆర్ బృందం రావడం జరిగిందని ప్రమాదం పొంచి ఉండే ప్రదేశంలో ఎన్ డి ఆర్ ఎఫ్ సేవలు అందించుటకు ఉండవలసి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి పరిమితం కావడం మండల ప్రజలపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల వ్యవహారం ఈ విధంగా కొనసాగితే ప్రజలను ఆదుకుని అధికారులు నిర్లక్ష్యం ముండి వైఖరి నీ వ్యవహరిస్తే ప్రజల పరిస్థితులు ఇలా ఉంటాయో ఊహించవచ్చని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని మహదేవ్పూర్ మండల కేంద్రంలో  సదుపాయం తుఫాను ప్రభావం తగ్గే వరకు ఉండేలా ఏర్పాటు చేయాలని తక్షణమే ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి వారికి నిత్యవసర సరుకులు పునరావసకేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కోరుతున్నారు.

వాళ్లు నమ్మదగినవాళ్లే కాదని ముందే చెప్పాం!

టిఆర్‌ఎస్‌ పెద్దలు వినలేరు?

ఈటెల మోసాలు ఎనాడో బైటపెట్టాం?

ప్రభుత్వం పట్టించుకోలేదు?

ఉద్యమ కారుడి ముసుగులో పెంచుకున్న వ్యాపారం గురించి రాశాం!

పౌరసరఫరాల శాఖను మేస్తున్నాడని చెప్పినా వినపడలేదు?

అసైన్డ్‌ భూముల బాగోతం ఏనాడో చెప్పాం! మీరు కదల్లేదు?

ఈటెల పోలీసులను పురిగొల్పి కేసులు పెడితే ఎదుర్కొన్నాం?

బెదరకుండా, అదరకుండా ఈటెల అవినీతి మరింత బైట పెట్టాం!

గటిక విజయ్‌ కుమార్‌ గురించి ముందే హెచ్చరించాం!

సిఎంవోలో సాక్షిగా అక్రమాలకు తెరతీశాడని చెప్పాం!

వినిపించుకోలేదు సరికదా!

నేటిధాత్రి ఎమ్‌ప్యానల్‌ మెంటు ఆపారు?

బొంతు గురించి ఎన్నో సార్లు రాశాం…ఎప్పుడో పుట్ట పగలడం ఖాయం?

నమ్మిన వాళ్లను ముంచి, బిజేపిలో చేరితే సచ్చీలురౌతారు?

పార్టీలో ఇలాంటి వాళ్లు చాలా మందే వున్నారు?

వారిని గుర్తించి ప్రజల ముందు వుంచుతాం…

జనం గుండెల్లో అక్షర నాదం…నేటి ధాత్రి అక్షర వేదం.

వాళ్లు నమ్మదగిన వాళ్లే కాదని ముందే చేప్పాం…! ప్రజల సొమ్ము తింటున్నారు. కోట్లు కూడేసుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారు. పైరవీలతో పైసాపైసా వెనకేసుకుంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో కోట్లకు పడగలెత్తుతున్నారు. నమ్మకం వున్న చోటే మోసానికి తావుంటుందని నిరూపిస్తున్నారని నేటిధాత్రి ఎంతో కాలంగా చెబుతూనే వస్తోంది. కాని నేటిధాత్రి అక్షరాలది అరణ్య రోధనే అయ్యింది. పట్టించుకున్నవారు లేరు…కనీసం వాటిని గురించి ఆరా తీసిన వాళ్లు లేరు. నిజాలు చెప్పిన నేటిధాత్రినే ఇబ్బందులకు గురిచేసే పనులు చేస్తున్నా, పాలక పక్షం పెద్దలు పట్టించుకోలేదు. వారినే నమ్మారు…. అక్రమార్కుల గురించి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నేటిధాత్రి అక్షరాలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాకా ఈ అవినీతి పరులు చేరనివ్వలేదు. నమ్మి దగ్గర పెట్టుకున్న వాళ్లే నిమ్మించి గోతులు తీస్తుంటే కనుక్కోలేకపోయారు. నిజాలు చెప్పిన నేటిధాత్రి మీద క్షక్ష్య పెంచుకున్నారు. ఆఖరుకు చెప్పుకోవడానికి ఎంత సిల్లీగా వుంటుందంటే అక్రిడిటేషన్‌ కార్డు సైతం ఆపించారు…హెల్త్‌ కార్డు జారీ చేయలేదు…ఆసుపత్రిలో వైద్యం అవసరం వచ్చినప్పుడు కూడా సాయం అందుకుండా చేశారు..అలాంటి వారు ప్రభుత్వ సిఎంవో కార్యాలయంలో తిష్ట వేసుకొని కూర్చొని నేటిధాత్రిని అణచివేసే కుట్ర చేశారు. అయినా పార్టీ పెద్దలు, పాలక పెద్దలు వారినే నెత్తిన పెట్టుకున్నారు. నిజాలు చెప్పిన వాళ్లు విరోధులయ్యారు. 

ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న వారు ఆప్తులయ్యారు. అందలమెక్కారు. ఒక్కసారిగా వారి అసలు స్వరూపం తెలిసి అవాక్కయ్యారు. అదేదో నేటిధాత్రి చెప్పినప్పుడే కదిలితే, తేరుకుంటే ఎంతో బాగుండేది. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదాకా కళ్లు తెరవలేకపోయారు. ఈటెల రాజేందర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. సిఎంలో సిపిఆర్వోగా పనిచేసిన గటిక విజయకుమార్‌ విషయంలోనూ అదే జరిగింది. ముందు నుంచి హెచ్చరిస్తున్న నేటిధాత్రి చెప్పిన విషయాలే నిజాలయ్యాయి. ఉద్యమకాలం నుంచి ఎంతో నమ్మి, ఆయనను పక్కన పెట్టుకొని, ఆయన కోసం కొందరిని పక్కన పెట్టి మరీ నమ్మితే ఈటెల రాజేందర్‌ చేసిందేమిటో తెలిసే వరకు కాలం ఎప్పుడో చేయిదాటిపోయింది. ఈటెల రాజేందర్‌ వ్యాపారం సామ్రాజ్యం ఎంతో పెరిగిపోయింది. ప్రభుత్వాలు తేల్చలేనంత దూరం వెళ్లిపోయింది. ఈటెల రాజకీయం కూడా ఏకు మేకైంది…ఈటెల మంత్రిగా తన ప్రస్ధానం మొదలైన నాటి నుంచి చేస్తున్న జిత్తులు రాస్తూనే వున్నాం. అసైన్డ్‌ భూముల ఆక్రమణ గురించి నేటిధాత్రి చెప్పింది. సివిల్‌ సప్లయ్‌ శాఖలో జరిగిన అవినీతిని మొత్తం బైట పెట్టింది. పార్టీకి నిజాలు చెబుతూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వుండాలని ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. నేటిధాత్రి వార్తలు ఆనాడు అబద్దాలుగా కనిపించాయి. కాని అవే నిజమయ్యాయి. 

అవినీతి పరుడైన ఈటెల మూలంగా నేటిధాత్రి ఎదుర్కొన్న కేసులు, ఎదరైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈటెల రాజేందర్‌ పోలీసులను పురిగొల్పి కేసులు నమోదు చేస్తే, ఆనాడు బిజేపి నేతలే అన్యాయమన్నారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఏక కాలంలో ఈటెల అక్రమాలపై ధర్నాలు చేశారు..కాని అదేంటో ఆ ఈటెల రాజేందర్‌నే బిజేపి పెద్దలు అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌పై మాట్లాడేందుకు ఒక అస్త్రంగా ఈటెలను వాడుకుంటున్నారు. ఇవి నైతికతను ఆపాదిస్తాయా? అన్నది బిజేపి పెద్దలే ఆలోచించుకోవాలి. అవినీతి పరుడుని తేలిన మరుక్షణం ఆయన బిజేపిలో చేరి తనంత సచ్చీలుడు లేడని కితాబిచ్చుకుంటున్నాడు. అక్రమ ఆస్ధులను పేదలకు పంచుతున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాకులెత్తుకుపోతున్నట్లు నానా యాగీ చేస్తున్నాడు. అక్రమ సంపాదనదారుడు ఈటెలే గాయి, గాయి చేస్తున్నాడు. తన ఆస్ధులు లాక్కుంటున్నారంటూ అపవాదులేస్తున్నాడు… ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీదనే పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నాడు. పుట్టింది టిఆర్‌ఎస్‌లో, పెరిగింది టిఆర్‌ఎస్‌లో…అక్రమ సంపాదనాపరుడై బైటకు వెళ్లగొడితే తేలు కుట్టిన దొంగలా వుండాల్సిన వాళ్లే, అరుస్తున్నారు..ఆగమాగం చేస్తున్నారు…ప్రభుత్వ పెద్దల మీదనే బురద జల్లుతున్నారు. నమ్మించి మోసం చేసే నైజం ఈటెలదని నేటిధాత్రి ఎంత చెప్పినా వినిపించుకోని వాళ్లు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాలేదా? 

ఎంతో నమ్మి, పక్కన పెట్టుకుంటే సిఎంపిఆర్వో గటిక విజయ్‌కుమార్‌ చేసిందేమిటి? ప్రభుత్వానికి సేవ చేయాల్సిన సమయంలో, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో, అన్నీ వదిలేసి ఆస్ధులు కూడబెట్టుకునే పనిచేస్తున్నాడంటే ఒక్కరైనా విన్నారా? ఒక్కరైనా నేటిధాత్రి నిజాలను ఆలకించారా? కనీసం ఎందుకు ఇలా నేటిధాత్రిలో కథనాలొస్తున్నాయన్నదానిపై ఆరా తీశారా? లేదు! ఓ వైపు గటిక విజయ్‌ కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి తెస్తుండడంతో అతను నేటిధాత్రి మీద కక్ష్య పెంచుకున్నాడు. సమాచార శాఖలో పత్రికను అడ్డుకునే ఎత్తుగడలు వేశాడు. నేటిధాత్రిని అణిచే కుట్రకు తెరతీశాడు. అయినా నేటిధాత్రి వెరవలేదు. బెదరలేదు. ఎట్టకేలకు నేటిధాత్రి కథనాలు నిజమయ్యాయి. గటిక విజయ్‌కుమార్‌ సిఎంవోను నుంచి సాగనంపబడ్డాడు. కాని ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని వదిలేశారు. దాంతో ఆయన కూడేసుకున్న సొమ్ముతో తమ్ముడిని బిజేపిలోకి పంపించే యోచన చేస్తున్నాడు. బిజేపిలో చేరి సచ్చీలుడుగానే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా గటికి విజయ్‌కుమార్‌ పావులు కదుపుతున్నాడు. 

                  ఒకనాడు ఒక సామాన్యమైన జర్నలిస్టు. జీతం మీద ఆధారపడి జీవనం సాగించే జర్నలిస్టు కొంత కాలం పాటు సిఎంవోలో పనిచేస్తే వందల కోట్ల ఆస్ధులు సంపాదించొచ్చా? సహజంగా జీతంతో జీవితం వెల్లదీసే ఉద్యోగులు ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే ఆగమాగమౌతారు. అలాంటిది గటిక విజయ్‌కుమార్‌ను సింఎంవోతోపాటు, విద్యుత్‌ శాఖ ఉద్యోగం కూడా కోల్పోయి ఎంతో కాలమైతుంది. అయినా ఆయన ఎక్కడా ఎలాంటి పని చేయడంలేదు. అంటే ఎంత వెనకేసుకుంటే అంత నిశ్చింతగా బతకుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఎన్నికల మీద దృష్టిపెట్టినట్లు, టిఆర్‌ఎస్‌ మీద పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందకు బిజేపిని ఎంచుకొని, తనపై కేసులు కాకుండా చూసుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధమౌతున్నాడని సమాచారం. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దల ఉదాసీనత మరోసారి ప్రస్పుటంగా కనిపిస్తోంది. జర్నలిస్టుగా పనిచేసినంత కాలం లేని ఆస్ధులు ఐదేళ్లపాటు సిఎంపిఆర్వోగా పనిచేయగానే వచ్చాయంటే ఏ తరహా పైరవీల వ్యాపారం సాగించాడో అర్ధం చేసుకోవచ్చు. ఎంత సక్రమ సంపాదనా పరుడైనా వందల కోట్లు ఐదేళ్ల కాలంలో సంపాదించడం అన్నది కుదిరేపని కాదు. అక్రమార్జన వుంటే తప్ప వందల కోట్లు సంపాదించుకోవచ్చని గటిక విజయ్‌కుమార్‌ నిరూపించినట్లే లెక్క. 

అలాగే గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా వుండి చేసిన అక్రమాలపై కూడా నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన కథ కూడా కంచికి చేరింది. కాని ఆయన ఇప్పుడు తనంత గొప్ప నాయకుడు లేడన్నట్లు రాజకీయ వేదిక కోసం ఆరాపడుతున్నాడు. బిజేపి వైపు చూస్తున్నాడు. ఇలా ప్రభుత్వంలో పనిచేస్తూ మేయర్‌ పాత్ర పోషిస్తూ బొంతు రామ్మోహన్‌ చేసిన అక్రమాలపై నేటి ధాత్రి ఎన్ని వివరాలు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో తన సంపాదన కూడా పాపం పెంచుకున్నట్లు పెంచుకున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నదే…కాని టిఆర్‌ఎస్‌ పెద్దలు మాత్రం కదలడం లేదు. ఏదో ఒకనాడు బొంతు కూడా తాను సచ్చీలుడిననే పాత్రలో దూరిపోయే సమయం కూడా పెద్దగా దూరం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. అవినీతి పరులపై నేటిధాత్రి అక్షరాలు ఇంత వరకు వృధా కాలేదు. గతంలో జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కలెక్టర్‌ అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చి, జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టడానికి కూడా నేటిధాత్రే కారణమన్న సంగతి తెలిసిందే…! అడుగడునా ఆటంకాలు ఎదురైనా, అక్రమార్కులను వదలిపెట్టకుండా, నిప్పులాంటి నిజాలను అక్షరాలుగా మలిచి, ప్రపంచం ముందు వారిని దోషులుగా నిలబెట్టిన చరిత్ర నేటిధాత్రిది…ఉద్యమ కాలంగా ఉద్యమాన్ని భుజాన మోసి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రగతి కోసం సాగుతున్న అక్షర యజ్ఞమే నేటిధాత్రి….! మా అక్షరాల నైజం నిజం…మేం చెప్పదలుకున్నది చెబుతాం…నిజాలు వెలుగులోకి తెస్తాం… ప్రజల ముందు వుంచుతాం…! తెలంగాణ కోసం కొట్లాడిన అక్షరాలు…తెలంగాణకు అన్యాయం చేసే వారిని కూడా వదిలిపెట్టదు…! మా అక్షర ప్రయాణం ఎంతో కఠిన తరం…అయినా అలవోకగా అక్షరాలు పేర్చి, అవినీతిని చీల్చి చెండాడుతాం..వెలుగురేఖలు ప్రసరించేందుకు దివిటీలమౌతాం.. నిరంతరం జనం గుండెల్లో అక్షర నాదం చేస్తూనే వుంటాం!

హుజూరాబాద్ కు ఈటెల టోకరా?

గజ్వేల్ నుంచి ఈటెల పోటీ ఉత్త ప్రచారం?

హుజూరాబాద్ ప్రజలను మరో సారి మభ్యపెట్టేందుకే?

మేడ్చల్ నుంచి ఈటెల పోటీ ఖాయం?

నేటిధాత్రి చెప్పిందే నిజమైంది..

ఈటెల అంతరంగం నేటిధాత్రి ఏనాడో బైటపెట్టింది…

హుజూరాబాద్ లో ఈటెల పోటీ చేయడం అదే ఆఖరని ఆనాడే చెప్పింది.

ఇప్పుడు అదే మాట ఈటెల నోటి నుంచి వస్తోంది…

ఉప ఎన్నికల సమయంలోనే హెచ్చరించిన నేటిధాత్రి…

తియ్యటి మాటలు, ఆ వెనుకే గొయ్యి తీసే చేతలు ఎలా వుంటాయో ఒక్క సారి ఈటెల ముచ్చట వినండి. ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా! ఈటెల తాజా ప్రకటన…నమ్ముదామా? నమ్మదగిన మాటేనా? కాదు అదంతా తనకు తాను సాగిస్తున్న ఒట్టి ప్రచారం… అబద్ధపు ప్రచారం.. ప్రజలను మభ్యపెట్టే ప్రచారం…! హుజూరాబాద్ రాలేను…మీకు సేవ చేయలేను అని చెప్పలేక, వచ్చే ఎన్నికల రాగం అందుకొని మరో సారి మోసం చేయడానికి రక్తి కట్టించే నాటకం మొదలు పెట్టారు. ఈసారి ఈటెల పోటీ చేసేది మేడ్చల్ నుంచే…అది ఎప్పుడో ఖాయం చేసుకున్నాడు…కాకపోతే ఉప ఎన్నికలో ఎన్ని జన్మలెత్తినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు… జీవితాంతం హుజూరాబాద్ ప్రజల కోసం పని చేస్తానన్నాడు. ఈ మాటలు చెప్పి సరిగ్గా ఏడాది కూడా కాలేదు. ఏరు దాటేదాక ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడి మల్లన్న… అన్నట్లే హుజూరాబాద్ కు ఈటెల జెల్లకొడుతున్నాడు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో పోటీ చేయడం ఇదే ఆఖరుసారి అని‌ నేటిధాత్రి ఏనాడో చెప్పింది. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మరో సారి నమ్మించి ఈటెల మోసం చేయనున్నాడని నేటిధాత్రి చెప్పినట్లే జరిగింది. 

తాజాగా ఈటెల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం వెళ్లడం మర్చిపోయాడు. ఉప ఎన్నికల సమయంలో నేటిధాత్రి ఇదే విషయాన్ని చెబుతూ, ప్రభుత్వం తనకు నిధులు ఇవ్వడం లేదంటూ మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేస్తున్నాడు..అదే చెప్పుకుంటున్నాడు. ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు. నాడు సానుభూతి కోసం పాకులాడి, అమాయకులైన ప్రజలకు మాయ మాటలు చెప్పాడు. మీ రుణం తీర్చుకోలేన్నాడు…అన్నట్లే ఆ మాట నిజం చేస్తున్నాడు….మీ రుణం తీర్చుకోలేనని మరో నియోజకవర్గం చూసుకోవడానికి సిద్ధ మయ్యాడు…పైకి చెప్పే కారణాలు ఎన్నైనా, అవన్నీ గెలిపించిన ప్రజలకు అవసరం లేదు. ప్రతి ఎన్నికలలో నమ్మి ఓట్లేసి గెలిపించి, అంత పెద్ద లీడర్ ను చేస్తే, రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయినట్లు ఈటెల కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నాడు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడు. తన రాజకీయాన్ని, మొత్తం వ్యాపారాలకు అనువుగా మార్చుకుంటున్నాడని కూడా నేటిధాత్రి ముందే చెప్పింది. ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఎంత దూరమైనా సరే వెళ్లాలి. వాళ్ల మధ్యనే వుండాలి. కానీ అది ఈటెలకు కుదిరేలా లేదు. అందుకే తన ఆవాసానికి, వ్యాపారానికి అనువైన నియోజకవర్గం కావాలి. ముఖ్యంగా హైదరాబాద్ కు ఎప్పుడూ అందుబాటులో వుండే నియోజకవర్గం ఎంచుకోవాలనుకుంటున్నాడు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటూ ఈటెల ప్రచారం చేసుకోవడం మేకపోతు గాంభీర్యం…! కాకపోతే మేడ్చల్ నుంచి పోటీ చేయాలనే గతం నుంచి చూస్తున్నాడు. ఒకవేళ టిఆర్ఎస్ లో వున్నా ఈటెల ఈసారి మేడ్చల్ నుంచో, మరో చోట నుంచో పోటీ చేసే వారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ నుంచి పోటీ చేసే వారు కాదు. ఈ విషయం ఎన్నికల సమయంలో అనేక సార్లు నేటిధాత్రి చెప్పింది. దాన్ని టిఆర్ఎస్ కూడా సరిగ్గా ప్రచారం చేయలేకపోయింది. దానిని ఒక అస్త్రంగా మార్చుకోలేకపోయింది. ఈటెల రాజేందర్ అసలు స్వరూపం ప్రజల ముందు ఆవిష్కరించలేకపోయింది. మీడియా ఎంత చెప్పినా నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తేనే మార్పుకు సంకేతం… ఏది ఏమైనా ఈటెల రాజేందర్ ఈ పని చేస్తాడని మాత్రం నేటిధాత్రి ముందే చెప్పి, ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసింది. సక్సెస్ పుల్ గా భవిష్యత్తులో ఈటెల అడుగులపై ముందే హెచ్చరించింది.

హస్తంలో విజయ రెడ్డి కారులో గోవర్ధన్ రెడ్డి

దానం అడిగాడు! రేవంత్‌ కాదన్నాడు!?

పట్టుపట్టి పదిమందితో చెప్పించాలని చూసినా లేదన్నాడు?

పాత గ్రూపులు పోగేసుకొని మరీ దానం అడిగినట్లున్నాడు?

రేవంత్‌ వెంటనే విజయా రెడ్డిని రంగంలోకి దింపాడు?

పైలా పచ్చీస్‌ మొదలుపెట్టాడు?

దానంను గాంధీభవన్‌ మెట్లెక్కుండా చేశాడు?

నిన్నటి దాకా అందరినీ చిర్రుబుర్రులాడే దానం కార్యకర్తలను కౌగిలించుకుంటున్నాడు!

ముసి ముసి నవ్వులతో మచ్చటపెడుతున్నాడు?

వచ్చిన నాయకులకు మర్యాదలు చేస్తున్నాడు?

ఆ నోట, ఈ నోట ఈ సంగతి తెలిసి దానంకు కారులో చోటు లేదన్నట్లున్నారు?

అత్యాశ ఇప్పటికే ఓసారి కొంపముంచింది…ఇప్పుడు మరో సారి నిజం కానున్నది?

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…?

హస్తంలో విజయా రెడ్డి, కారులో గోవర్ధన్‌ రెడ్డి! ఇది ఫిక్స్‌!?

ఆగం కానున్న దానం రాజకీయం..!

కారులో కుదురుగా కూర్చోలేదు?

గతంలో చేజేతులా చెడగొట్టుకున్నాడు…?

పదవులు శాశ్వతం అనుకొని, రాజకీయం తాత్కాలికం చేసుకున్నాడు?

రాజకీయాలలో అంతే…అంతే!!     

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవడానికి పేకాట కాదు…పోయినచోట వెతుక్కోవడానికి వస్తువు కాదు….రాజకీయం…విశ్వాసం..నమ్మకం…ప్రజల ఆశీర్వాదం….ఏ ఎండకాగొడుగు పట్టడం, తన రాజకీయం జీవితం పబ్బం గడుపుకోవడం దానం నాగేందర్‌కు కొత్త కాదు…దానం రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయం…ఎప్పుడు ఎక్కడ వుంటాడో తెలియని రాజకీయం….దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌లో ఇమడ లేక, కష్టంగానే సాగుతున్నాడు అనేది చాలా మంది చెబుతున్న మాటే కాకపోతే 2014 ఎన్నికల్లో ఓటిపోయిన తర్వాత అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని టిఆర్‌ఎస్‌లో చేరాడు. పార్టీలు జంప్‌ కావడం అన్నది దానంకు అనాదిగా వస్తున్నదే…టిఆర్‌ఎస్‌లోకి రానైతే వచ్చాడు కాని, ఆయన టిఆర్‌ఎస్‌ శ్రేణులతో మమేకమైపోలేదు. నాయకులను పట్టించుకోలేదు. కార్యకర్తలను దరి చేరనీయలేదు. ఇక కరోనా కాలంలో ప్రజలకు అందుబాటులో వున్న దాఖలాలు పెద్దగా లేవు. దాంతో ఆయన ఇక టిఆర్‌ఎస్‌లో వున్నా, భవిష్యత్తు నీలి నీడలే కళ్లముందు కనిపిస్తున్నాయనుకున్నట్లనుకున్నాడు…దాంతో మళ్లీ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోవాలని చూసినట్లు విశ్వసనీయ సమచారం. కాని డామిట్‌ కథ అడ్డం తిరిగింది. ఒక నాడు పిజేఆర్‌ అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దానం, ఆయన చలవ వల్ల రెండుసార్లు ఆసిఫ్‌నగర్‌ నుంచి గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దానం నాగేందర్‌కు టిక్కెట్‌ నిరాకరించింది.ఆఖరు సమయం వరకు వేచి చూసిన దానం, రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కండువా వదిలేసి, తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. ఆసిఫ్‌ నగర్‌ నుంచి టిడిపి బిఫామ్‌ తెచ్చుకున్నాడు. గెలిచారు. కాని తెలుగుదేశం ఓడిపోయింది. కాంగ్రెస్‌ విజయం సాధించింది.

వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో వెంటనే మళ్లీ తెలుగుదేశం కండువా వదిలేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. అక్కున చేర్చుకొని, రాత్రికి రాత్రి చేరినా టిక్కెట్టు ఇచ్చి నమ్మిన చంద్రబాబును మోసం చేశాడు. తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశాడు. అలాంటి వ్యక్తి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తానంటే రేవంత్‌ రెడ్డి ఆహ్వానిస్తాడా? ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు అనుచరుడే…అలాంటిది దానంను దరి చేరనిస్తాడా? ఎలాగైనా దానం కాంగ్రెస్‌లో చేరేందుకు చేయాల్సినంత ప్రయత్నం చేసినట్లే తెలుస్తోంది. కాంగ్రెస్‌ లోని సీనియర్లతో కూడా రేవంత్‌కు చెప్పి చూసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా దానంను గాంధీభవన్‌ మెట్లెక్కకుండా చేయాలి. అందుకు రేవంత్‌ రెడ్డి వెంటనే పిజేఆర్‌ కుటుంబాన్ని మళ్లీ క్రియాశీలకం చేయాలనుకున్నాడు. కార్పోరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి, ఖైతరాబాద్‌ టిక్కెట్‌ నీకే అన్నాడు. దానం ఆశలను ఆదిలోచే రేవంత్‌ తుంచేశాడు. ఈ విషయం ఆనోట, ఈ నోట కారు టిఆర్‌ఎస్‌ పెద్దల చెవిన పడిరది. టిఆర్‌ఎస్‌లోనూ దానం విషయంలో పార్టీ పునపరిశీలన చేయాలన్నంతా దాకా వచ్చింది. దాంతో అన్ని వైపులా దారులు మూసుకుపోయిన దానం నాగేందర్‌ కు ఎటూ పాలుపోని స్ధితిలోకి నేట్టేసినట్లైంది. నిన్నటిదాకా కార్యకర్తలను చూస్తేనే చిర్రుబుర్రులాడే దానం వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. అక్కున చేర్చుకుంటున్నాడు. ఆలింగనం చేసుకుంటున్నాడు. మర్యాదలు కూడా చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. ముసిముసి నవ్వులతో కార్యకర్తలతో ముచ్చటపెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. 

దానం ఎక్కడ వుంటే అక్కడ విచిత్రంగా హడావుడి వుండేది. సందర్భమేదైనా, సరే హడావుడికి కొదువుండేది కాదు… వైఎస్‌ మరణంతో ఇక ఆయన జగన్‌ను ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో క్యాంపు కార్యాలయం కేంద్రంగా దానం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు…ఇక జగన్‌ తర్వాత నేనే అన్నంత హంగామా సృష్టించాడు. కాని జగన్‌కు ముఖ్యమంత్రి రావడం లేదని తెలిసిన మరుక్షణం జగన్‌కు జెల్లకొట్టాడు. జగన్‌కు అనుకూలంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే దానం దూరం జరిగాడు. రోశయ్య మంత్రి వర్గంలో చేరాడు…ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో దానం చేసిన హాడావుడి చెప్పనలవి కాదు…నగరం మొత్తం కిరణ్‌కుమార్‌రెడ్డి హోర్డింగులతో నింపేశాడు. రాజ్‌భవన్‌ దారిలో దానం నాగేందర్‌, ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలంగాణ ఉద్యమం తీవ్ర తరమైన సందర్భంలో , శ్రీకృష్ణ కమిటి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన సమయంలోనూ హైదరాబాద్‌ నాదీ అన్నంత హంగామా చేశాడు. హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చాడు. ఒక దశలో ఉద్యమ కారుల మీద సికింద్రాబాద్‌లో స్వయంగా ఆయనే పోలీసు లాఠీ పట్టుకొని వీర విహారం చేశాడు. తెలంగాణ విద్యార్థులను చెల్లాచెదురు చేశాడు. 

తన కోసం ఎంతకైనా దిగజారడతాడని , తనకు సాయం చేసిన వారిని రాజకీయంగా నిండా ముంచడానికి ఏనాడు వెనుకాడడని చెప్పడానికి ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు.2009 డిలిమిటేషన్‌ కారణంగా ఖైరతాబాద్‌ను రెండు ముక్కలు చేయడంతో కీలకపాత్ర పోషించిన దివంగత వైఎస్‌. రాజశేఖరరెడ్డి, 2009 ఎన్నికల్లో పి. విష్ణువర్ధన్‌రెడ్డికి ఖైరతాబాద్‌ కేటాయించకుండా, దానం నాగేందర్‌కు ఇచ్చారు. అలా తనను రాజకీయ గురువైన పిజేఆర్‌ కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేయడానికి పూనుకున్నాడు. తప్పని పరిస్ధితులత్లో విష్ణు జూబ్లిహిల్స్‌ నుంచి పోటీ చేయకతప్పలేదు. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయిన దానం, టిఆర్‌ఎస్‌ దరి చేరారు. కారులో చోటు సంపాదించుకున్నాడు. మళ్లీ ఖైతరాబాద్‌ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. కాని ఆనాటి నుంచి ఆయన జనంలో వున్నట్లు పెద్దగా కనిపించలేదు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నాయకులను అనేక సందర్భాలలో చిన్న చూపు చూడడం, వారిని ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా వివాదాలున్నాయి. పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పార్టీపరమైన రాజకీయాల గోడ దూకడంలో ఆరి తేరిన దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో, మళ్లీ కారే దిక్కని కొత్త రాజకీయాలు నెపరడం అంతా జనం గమనిస్తూనే వున్నారు. దాంతో ఈసారి దానంకు టిక్కెట్టు ఇవ్వడం టిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా ఇష్టం లేకుండాపోతోంది. ఒక వేళ దానం నాగేందర్‌కు ఇవ్వడం అంటూ జరిగితే కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులే కనిపిస్తాయంటున్నారు. దానం నాగేందర్‌కు ప్రత్యేకంగా వున్న బలమేమీ లేదు. కాకపోతే గత ఎన్నికల్లో మొత్తం టిఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసి పనిచేసి గెలిపించాయి. కాని ఆయన దాన్ని తన సొంత బలంగా ఊహించుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం అర్ధమైంది. దాంతో మళ్లీ గెలవాలంటే టిఆర్‌ఎస్‌ శ్రేణుల అవసరం ఎంతో అన్నది బోధపడినట్టుంది. దాంతో ఎన్నడూ లేని విధంగా నాయకులతో, కార్యకర్తలను పిలిపించుకొని భుజ్జగింపు కార్యక్రమాలు మొదలుపెట్టారు. 

దానం వర్సెస్‌ విజయారెడ్డి అనేది జరిగితే మాత్రం టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన పరిస్ధితులే ఎదురుకావొచ్చు.కాకపోతే దానం స్ధానంలో ఉద్యమ కారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఇస్తే మాత్రం ఖైరతాబాద్‌ మళ్లీ కారు సొంతం కావడం తధ్యమంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా రెండుసార్లు కార్పోరేటర్‌గా అవకాశం ఇచ్చిన టిఆర్‌ఎస్‌ను కాదని వెళ్లిన విజయారెడ్డి కూడా దానం వల్లనే పార్టీ మారినట్లు కూడా స్పష్టంగా చెప్పారు. అంటే దానం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని తేలిపోయింది. విజయారెడ్డి ఎలాగూ పార్టీ వదిలేసి వెళ్లిపోయింది. అంతకు ముందు వెళ్లాలని దానం అనుకున్నాడు. అందుకే ఈ సారి ఉద్యమకారుడైన మన్నె గోవర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడానికి మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

‘‘బొంతు’’…బరితెగింపు?

పార్టీ పరువు తీయడమే అంతరంగమా?

గోడ దూకడం కోసమే ఎత్తుగడా?

పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలనని సంకేతమా?

ప్రతిపక్షాలు తనవైపు చూడడం కోసమేనా?

అసమ్మతి నేతలతో బొంతు మంతనాలు నిజమేనా?

ఒక్కసారి మేయరైతేనే ఇంత హంగామానా?

ఎంత సంపాదించకపోతే అంత అతివిశ్వాసముండునా?

ఇంత హంగామా ఎవరూ చేయలేదు?

ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డులో బాణాసంచా…

పొరపాటున మెట్రో స్టేషనుపై నిప్పురవ్వలు పడివుంటే?

నిత్యం సందడిగా వున్న చోట ఏదైనా ప్రమాదం జరిగివుంటే?

రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలు….

గంట పైగా ట్రాఫిక్‌ జామ్‌….

నడి రోడ్డు మీద హంగామా…

తిట్టిపోసిన జాతీయ మీడియా…

పార్టీ పరువు బజారుకీడ్చిన బొంతు

బొంతుపై చర్యలుండేనా? ఇంకా వేచి చూసే ధోరణేనా!?

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

పదవుల యావ తప్ప ప్రజా సేవ తెలియని వాళ్లంతా నాయకులైతే రాజకీయాలు చేస్తారే గాని ప్రజలనేముద్దరిస్తారని పెద్దలు ఎప్పుడో చెప్పారు…ఇప్పుడు కొందరి వ్యవహారం సరిగ్గా అలాగే వుంది. సహజంగా నాయకుడు ప్రజా క్షేత్రం నుంచి ఉద్భవించాలి. ప్రజా సేవ తెలిసి వుండాలి. ప్రజలకు అడుగడుగునా మేలు చేసే గుణంలో నుంచి నాయకుడు పుట్టాలి. అంతే కాని కలిసొచ్చే కాలానికి నాయకుడైతే, కాలం వెంట పరుగెత్తడం తప్ప, ప్రజల వైపు చూసే అవకాశమే వుండదు. ఉద్యమం పుణ్యమా అని నాయకుడై, జనం నమ్మి గెపిస్తే ప్రజా ప్రతినిధైతే ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా చేశానని చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేని వాళ్లు చాలా మంది వుంటారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సమయంలో స్వలాభం కోసం పనిచేసే వాళ్లు సంపాదనా పరులైనప్పుడు ప్రజలు అన్న పదం కాకుండా, పదవులు అన్న పదమే పదేపదే వినిపిస్తారు. సహజంగా ఏ నాయకుడైనా ప్రజలకు సేవ చేసే బాగ్యం కల్గించాలని కోరుకుంటారు…కాని కొందరు ప్రజల పేరు చెప్పుకొని బాగుపడేందుకు రాజకీయాలు ఉపయోగించుకుంటారు…ఎప్పుడూ ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటారు? అందుకు ఎంతకైనా తెగిస్తారు? ఎవరినైనా మోసం చేస్తారు? అలా చాలా మంది వుంటారు..అలాంటి వారిని ప్రజలు దూరం పెట్టాలి. పార్టీలు కూడా వారిని దరి చేరకుండా చూసుకోవాలి. కాని రాజకీయాల్లో వస్తున్న మార్పులు కూడా అలాంటి నాయకులకే అనుకూలమౌతున్నాయి. వారినే అందలమెక్కిస్తున్నాయి. దాంతో వాళ్లు పార్టీ పరువు తీయడానికి కూడా వెనుకాడడం లేదు…? అందుకే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కొందరు నేతలు చేసే పనులు వివాదాస్పదమౌతున్నాయి. పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి ఘటనలో బొంతు రామ్మోహన్‌ పుట్టిన రోజు వేడకులు టిఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా పరిణమించాయి.  

పుట్టిన రోజు వేడుకలు అందరూ చేసుకోవాలి. ఆడంబరంగా చేసుకోవాలి. కాదని ఎవరికీ అనే హక్కు లేదు.కాకపోతే సమస్యను రోడ్డు మీదకు వచ్చినప్పుడే ఎవరైనా ప్రశ్నిస్తారు? నిలదీస్తారు? నిందిస్తారు? తాజాగా మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తన పుట్టిన రోజుల వేడుకల కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జాతీయ మీడియా తిట్టిపోసేంత? అన్నట్లైంది. నిజానికి అంగరంగ వైభవంగా బొంతు రామ్మోహన్‌ పుట్టిన రోజు వేడుకలు అని చెప్పాల్సిన మీడియా ఎందుకు తిట్టిపోసింది? అన్నది కూడా పార్టీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఒక్కసారి మేయరైనంత మాత్రానా ఇంత హంగామా అవసరమా? అధికార పార్టీ పేరు చెప్పుకొని జాతీయ రహదారి మీద ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం అవసరమా? ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన పుట్టిన రోజున దీవించిన వారికంటే తిట్టిపోసిన వారే ఎక్కువైతే ఆ వేడుకలు చేసుకొని ఏం లాభం? శాపనార్ధాలు పెట్టినంక ఆ వేడుకలకు ఏం పరమార్ధం? ఎంత ఖర్చు చేస్తే ఏం లాభం? రోడ్డు మీద వెళ్లిన ప్రతి ఒక్కరూ తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టినవాళ్లే…తన పుట్టిన రోజు వేడుకల కోసం యాదగిరి గుట్టకు బొంతు రామ్మెహన్‌ స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి తీసుకెళ్లిన వాళ్లు తిట్టిపోశాక..ఇక పుట్టిన రోజు వేడుకలకు ఏమైనా అర్ధముందా? ఐదు వందలు ఇస్తామని జనాన్ని తీసుకెళ్లి వంద రూపాయలు చేతిలో పెట్టారని మహిళలు దీవెనలు ఇవ్వాల్సిన రోజున శపించేదాకా తెచ్చుకోవడం మూర్ఖత్వం కాదా? అతి విశ్వాసానికి నిదర్శనం కాదా? నడిమంత్రపు సిరి చూసుకొని మిడిసి పడడం కాదా? అని సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఇక ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు అన్నది ఎప్పుడే వందలాది మందితో బిజీబిజీగా వుంటుంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, సిటీ బస్సులతో ఎప్పుడూ కిక్కిరిసి వుంటుంది. పైగా పక్కనే ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ వుండడంతో ఎప్పుడూ ఎంతో రద్దీగా వుంటుంది. అక్కడ ఎప్పుడూ ట్రాఫిక్‌ జామ్‌ వుంటుంది. అలాంటి చోట వచ్చిపోయే వాహనాలన్నీ ఆపేసి, బాణా సంచా కాల్చడం ఒక రకంగా నేరమే? పైన మెట్రో స్టేషన్‌ వుంటుంది. పక్కనే పదుల సంఖ్యలో జిల్లా డిపోల బస్సులు, సిటీ బస్సులు కూడా ఆగి వుంటాయి. ఆ పక్కనే తహసిల్ధార్‌ కార్యాలయానికి వచ్చేవారి వందలాది వాహనాలుంటాయి. దాని ఎదురుగానే పోలీస్‌ స్టేషన్‌ వుంటుంది. ఆ పక్కనే మున్సిపల్‌ కార్యాలయం వుంటుంది. ఏదైనా జరగరానిది జరిగితే, ఒక్క నిప్పురవ్వ ఏ బస్సు మీద పడినా ఎంత ప్రమాదం జరిగేది? నిప్పురవ్వలు మెట్రో స్టేషన్‌ వరకు చేరితే పరిస్ధితి ఎలా వుండేది? ఈ మాత్రం అవగాహన లేకుండా వేడుకల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం నాయకత్వ లక్షణమా? ఇక రోడ్డుకిరువైపులా వందలాది ప్లెక్సీలు…మరో వైపు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌…? ఇదంతా చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేకాదు, బందోబస్తు కూడా కల్పించడం విడ్డూరం. కొన్నివందల వాహనాల కాన్వాయ్‌ తో వెళ్లడం, మధ్య మధ్యలో షాంపెన్‌లు పొంగించడం ఇవన్నీ జాతీయ మీడియాలో చూపించడంతో తెలంగాణ పరువు గంగలో కలిపినంత పనైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తీరును ప్రపంచానికి తెలిపినట్లైంది. సహజంగా ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణలో నాయకులంతా ఇలాగే వుంటారమో అనుకునే అనుమానం, అవకాశం లేకపోలేదు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై వున్న సందర్భంలో, జాతీయ మీడియాలో టిఆర్‌ఎస్‌ నాయకుల తీరిదని వార్తలు ప్రసారమౌతుంటే ఆయా రాష్ట్రాలలో కాలు మోపడం సాధ్యమౌతుందా? 

ఇదంతా కావాలనే రామ్మోహన్‌ చేస్తున్నాడనేది చాలా మంది టిఆర్‌ఎస్‌ నాయకుల వాదన.తాను పార్టీ మారే యోచనతోపాటు, తన బలం, బలగం పార్టీకి కూడా రుచి చూపించాలన్న ఆలోచనతో చేసిందే అంటున్నారు. బొంతు రామ్మోహన్‌ అతి విశ్వాసం కూడా ఇందుకు నిదర్శనమంటున్నారు. తాను మేయర్‌గా పదవిని నిర్వహిస్తూనే ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. కాని కుదరలేదు. కనీసం మరోసారి మేయర్‌ పదవి కోరుకున్నాడు. అదీ సాధ్యం కాలేదు..ఆపై ఎమ్మెల్సీ కావాలనుకున్నా జరగేలేదు. తాగాజా రాజ్యసభ ఎంపి కూడా కావాలనుకున్నాడట? అంటే బొంతులోని అత్యాశకు అంతు లేకుండాపోతోందన్నది టిఆర్‌ఎస్‌ నాయకులే ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీలో తనకు ఏ పదవి దక్కే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆశ తీరేలా కనిపించడం లేదని అర్ధమైనట్లుంది. అందుకే సమయం అనుకూలిస్తే ఓ జాతీయ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్దం చేసుకున్నట్లు కూడా ఆయన అనుచర గణం చెప్పుకుంటున్నారట. గతంలో టిఆర్‌ఎస్‌ వెలుగు వెలిగి, బైటకు సాగనంపబడిన నాయకుడితో బొంతుకున్న సత్సంబంధాలు కూడా ఇందుకు కలిసివస్తాయన్న నమ్మకంతోనే బొంతు ఇలా బరితేగింపు కార్యకపాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అధికారపార్టీ నాయకులు చేసే ఏ పనులైనా దాని ప్రభావం పార్టీపై పడడం సహజం. మీడియాలో వివాదం జరగడం…చర్చలకు తావివ్వడం జరిగేదే… దాంతో కావాలనే బొంతు రామ్మోహన్‌ ఇదంతా చేశాడని కూడా కొందరు టిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. తాను కోరుకుంటున్న పదవులు ఇవ్వకుండా తనను పక్కన పెడుతున్నందునే పార్టీ పరువు తీస్తే రెబల్‌గానైనా గుర్తించి, పదవులు ఇస్తారనేది బొంతు ఆలోచన కూడా అంటున్నారు. లేకపోతే పార్టీని వదిలేస్తాడేమో అన్న సంకేతాలు కూడా పంపడానికి అవకాశం వుండేలా కూడా వుంటాయన్నది ఆయన అంతరంగమన్నది చెప్పుకుంటున్నారు. అంతే కాదు అవసరమైతే పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలను ? అన్న సంకేతాలు పంపించినట్లే అన్నది కూడా పెద్దలు తెలుసుకునేలా ఆయన వ్యవహారం సాగుతున్నట్లు వినికిడి. పైగా ప్రతిపక్షాలు బొంతు రామ్మెహన్‌ బలం, బలగం తెలుసుకునేందుకు, పుట్టిన రోజు వేడుకలే ఇంత ఘనంగా చేసుకునేంత వెనకేసుకున్నాడని తెలిస్తే, అడిగిన సీటు ఇస్తారన్న నమ్మకం కూడా ఇక్కడ తెలియజేసినట్లౌతుంది. ఇదిలా వుంటే టిఆర్‌ఎస్‌లో పదవుల కోరుకొని, ఎదరుచూస్తూ ఆశలు తీరక రుసరుసలు వ్యక్తం చేసున్న అసమ్మతి నేతలను కూడా ఏకం చేసి, వారితో మంతనాలు కూడా బొంతు రామ్మోహన్‌ జరుపుతున్నట్లు కూడా సమాచారం. తనకు దక్కని ఉప్పల్‌ రాజకీయాలు , కలగాబులగం చేసి, టిఆర్‌ఎస్‌ను ఇబ్బందుల పాలు చేసి, తన ప్రతాపం చూపించాలని బొంతు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

సొంత గూటికి టిఆర్ఎస్ నేతలు

మన్నె గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి టిఆర్ఎస్ లోకి…

సాదరంగా ఆహ్వానించిన గోవర్ధన్ రెడ్డి.

జూబ్లీ హిల్స్, నేటిధాత్రి ప్రతినిధి: 

ఇటీవల ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డితో కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ నాయకులు తిరిగి బుధవారం సొంత గూటికి చేరుకున్నారు. ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నె గొవర్థన్ రెడ్డి

నాయకత్వంలో తిరిగి వాళ్లు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ డివిజన్, ఇందిరా నగర్ కాలనీకి చెందిన వారిని మన్నె గోవర్ధన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.  విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిన సమయంలో వీళ్లంతా కండువా మార్చుకోవడానికి, పార్టీ

మారడానికి ఇష్ట పడలేదు. ససేమిరా అని చెప్పినా విజయారెడ్డి బెదిరింపులకు గురి చేసి, దగ్గరుండి తీసుకెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకునేలా చేశారని వాళ్లు వివరించారు. తన స్వార్థం కోసం లేనిపోనివి చెప్పి, తన రాజకీయ స్వలాభం కోసం తమ రాజకీయ భవిష్యత్తును విజయా రెడ్డి తాకట్టుపెట్టాలని చూశారని సొంత గూటికి చేరిన నాయకులన్నారు. తమను తన రాజకీయ స్వప్రయోజనాల కోసం తప్ప తమకు విజయా రెడ్డి ఏనాడు సరైన ప్రాధాన్యతనివ్వలేదని విమర్శించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న తెలంగాణ పార్టీలో, మన్నె గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి సేవలందిస్తామని టిఆర్ఎస్ నాయకులు చెప్పారు.

బండకేసి కొట్టాల్సిందే!

అధిష్టానం ఆదేశాలను అపహస్యం చేసేలా సీనియర్ల తీరు

` ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మెకాలడ్డే ప్రయత్నం

` హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే హద్దుమీరుతున్న వైనం

` పీసీసీ అంటే లెక్కలేని తనం మనుగడకు మంచిదేనా..?

` రేవంత్‌కు అండగా సెకెండ్‌ కేడర్‌

` పనిగట్టుకుని పార్టీని పంగనామాలు పెట్టే ప్రయత్నాలు

` పీసీసీ చీఫ్‌ బండాకు కొడాతనంటూ ప్రకటనతో ఒక్కసారిగా సీనియర్లలో మార్పు

` సంచలన ప్రకటనంటూ సల్లబడ్డ జగ్గారెడ్డి

` మెలికపెట్టబోయి మెత్తబడ్డ వీహెచ్‌

`పార్టీకి కట్టుబడి పనిచేయకపోతే అన్నంత పని చేయాల్సిందేనంటున్న క్యాడర్‌ 

` వివాదాలకు తెరతీయాలనుకున్న ఫలించని విష్ణు విందు రాజకీయం 

` సీనియర్లదంతా ఒంటెద్దు పోకడ ఒదులుకుంటేనే పార్టీ మనుగడ 

`చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే…యమునా తీరే…ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు…ఎవరు ఎటు వైపు నిలుస్తున్నారో తెలుసుకోరు…ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో వారికే తెలియదు…ఎవరితో కలిసి సాగుతారో…ఎప్పుడూ రాం రాం అనుకుంటారో తెలియదు… గ్రూపులకు కొదవలేదు..ఆ కొట్లాటలకు లెక్కలేదు…యువకులు అంతే…సీనియర్లు అంతే..కొత్తగా చేరిన వారంతే…పోయిన వారు వస్తారంటుంటే వద్దంటున్న వారంతే…రమ్మని కోరుతున్నవారు అంతే…ఎవరికి ఎవరూ తగ్గరు..ఎక్కడా తగ్గరు…ఎవరికీ తలవంచరు…అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు…వారికి ఇష్టమైనట్లు వ్యహరిస్తుంటారు..విందు రాజకీయాలు చేస్తారు…గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తుంటారు…గోడమీద నిలబడ్డట్టే వుండారు..వెళ్లలేరు…వుండలేదు…ఎవరికీ ఏమీ కారు…మాకు మేమే…మాకంటే తోపులేరక్కడంతే..అనుకుంటూ వాళ్లను వాళ్లు సముదాయించుకుంటుంటారు…కుంపట్లు రాజేస్తుంటారు…..పక్కవారికి అభద్రతకు గురిచేస్తుంటారు…ఇదంతా కాంగ్రెస్‌ రాజకీయం…అతి ప్రయత్నం…అసలు ప్రభావం…శూన్యవాదం… రిక్తహస్తం…ఆఖరుకు అయ్యో చేజారిపోయేనే…అంటూ ధీర్ఘాలు…ఎత్తిపొడుపులు…వెక్కిరింతలు…ముందు అంతే…తర్వాత అంతే….ఎన్నికల ముందు కలిసి వుండరు…ఎన్నికల తర్వాత కలిసి వుండరు…ఎప్పుడూ కలిసి వుండాలన్న ఆలోచన చేయరు…అందుకే వాళ్లంతా ఒక్కటే అయితే కాంగ్రెస్‌ నేతలెందుకౌతారని సామెత…ఒకరి నొకరు కాళ్లు పట్టుకొని లాగితే గాని రాజకీయాలు చేయలేరు…ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మందు కాంగ్రెస్‌ రాజకీయాలు అచ్చు ఇలాగే వుండేవి…ఆ తర్వాత కొంత తగ్గాయి…కాని మళ్లీ ఇప్పుడు పుట్టలో నుంచి పాము లేచినట్లు మళ్లీ అదే దోరణి…అదే పద్దతి…ఆ పద్దతే కరక్టు అనుకుంటూ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఎనమిదేళ్లుగా పార్టీ అధికారానికి దూరమైనా, ఇంకా నాయకులు ప్రజల్లో వుంటున్నారంటే, జనంలో కాంగ్రెస్‌ పార్టీపై వున్న నమ్మకం అన్నది వారికి బోధపడడం లేదు…

                             ఇటీవలే కాంగ్రెస్‌ రాజకీయాలు కొద్దిగా దారిన పడుతున్నాయంటే , ఎప్పటికప్పుడు ముదిరి పాకాన పడేయడం వారికి కొత్త కాదు…

అందుకే గతాన్ని మార్చలి…గతంలో కాంగ్రెస్‌ చేసిన రాజకీయాలు మార్చాలి…వర్తమానంలో అసలు సిసలైన రాజకీయాలు చేయాలి…అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రూటే కరక్టు…ఎందుకంటే కాంగ్రెస్‌లో దూకుడు మీద వుండే నాయకుడిని దూరం పెడుతుంటారు…వారితో ఎడమొహం పెడమొహంగా వుంటారు….ఎలాగైనా కాళ్లు పట్టుకొని లాగేయాలనుకుంటారు…అదే మెతక వ్యక్తిత్వం వున్న నాయకుడైతే గేలి చేస్తుంటారు… హేళన చేస్తుంటారు…ఇది ఆ పార్టీలో కామన్‌…అందుకే ఆ పార్టీలో అలిగేవారు ఎక్కువే..అరిచే వారు కూడా ఎక్కువే….2014 ఎన్నికల ముందు, తెలంగాణ ప్రకటన కంటే ముందే…భవిష్యత్తును ఊహించుకొని నేనంటే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న నేతలు చాలా మందే వున్నారు. అందులో ముఖ్యమైన నాయకుడు జానారెడ్డి…2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత కేసిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అదేంటో గాని ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి మీద కలలు గన్న నేతల్లో జానారెడ్డి, మాత్రమే గెలిచారు…అదే జిల్లానుంచి కోమటి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలు గెలిచారు. అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలాగూ దక్కని జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడయ్యారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడినట్లైంది. 

                      మొదటి దఫా తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వుంటే, ప్రతిపక్షం డల్లుగా సాగింది.

 ప్రభుత్వాన్ని ధీటుగా ఎదరుర్కొనేందుకు, అడుగడుగునా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా, జానారెడ్డి నెమ్మదనం పార్టీ కొంప ముంచింది. ఆయన మెతక వైఖరి కూడా పిరాయింపుదారులను కట్టడి చేయలేకపోయింది. అటు ప్రభుత్వాన్ని ఎదుర్కొలేకపోయింది. ఇటు ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది. పైగా జానారెడ్డి పదే పదే ప్రభుత్వ పధకాలను మెచ్చుకుంటూ పోవడంతో ఆఖరుకు ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. అయినా పార్టీలో మార్పు రాలేదు. తర్వాత ఎన్నికలు కూడా ఓడిపోయింది…ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెవాలంటే, ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడే కరట్టు అని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. ఎందరు అడ్డుకోవాలనుకున్నా అధిష్టానం వినిపించుకోలేదు. తర్వాత కూడా రేవంత్‌కు అడుగడుగునా కాళ్లలో కట్టేలు పెట్టే ప్రయత్నం సీనియర్‌ నాయకులు ఆపలేదు. ఇప్పటికీ ఆపడం లేదు…

                          ఇక మెతక వైఖరి సరైంది కాదని రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లున్నారు.

 వరంగల్‌ సభ సక్సెస్‌ తర్వాత మంచి దూకుడు మీద వున్నాడు. పార్టీలో కూడా ఊపు తెచ్చాడు. కాకపోతే ఆ మధ్య రెడ్డి రాజకీయం సరిగ్గా సాగితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదన్న సంకేతాలను ఆయన పంపాలనుకున్నాడు. కాని సొంత పార్టీయే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను చిలువలు పలువలు చేయాలని చూసింది. ఒక దశలో చేసింది కూడా…అది అధికార పార్టీకి అస్త్రంగా మారింది. బిజేపికి కూడా రాజకీయంగా ఒక రకంగా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ఉపయోగపడిరది. కాని కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మాత్రం పట్టించుకోలేదు. ఎక్కడా రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు స్పందించలేదు. నాయకుల వరకే విమర్శలు వినిపించినా, సముద్రంలో వచ్చే సహజమైన ఆటు పోటుగాలో చల్లబడిరది. సీనియర్ల ఆశలకు గండికొట్టింది. ఇక అప్పటినుంచి రేవంత్‌రెడ్డి కూడా మరింత గట్టిగా వుంటే తప్ప, సోకాల్డ్‌ సీనియర్లు దారిలోకి రారని నిర్ణయించుకున్నట్లున్నారు. 

 తాజాగా ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌ రావడం, కాంగ్రెస్‌ శ్రేణులను కలవకపోవడం జరిగింది.

 అయితే అంతకు ముందే పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవరూ యశ్వంత్‌సిన్హాను కలవడానికి వీలు లేదని హుకూం జరిచేశారు…కాని సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు ఆ మాటలు పెడచెవిన పెట్టినట్లున్నాడు. యశ్వంత్‌ సిన్హాను కలిశాడు. దాంతో మీడియా ముఖంగా రేవంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యాడు. దాన్ని జీర్ణించుకోలేని జగ్గారెడ్డి మరోసారి రెచ్చిపోయే ప్రయత్నం చేశాడు. కాని రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గకుండా, వదిలేయకుండా తన మాటలు, పార్టీ నిర్ణయాలు ఎవరు బేఖాతరు చేసినా, లెక్కలోకి తీసుకోకపోయినా బండకేసి కొట్టుడే అంటూ సీరియస్‌ అయ్యాడు. ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు….దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌పార్టీలో నిశ్శబద్దం ఆవహంచినట్లైంది. అయితే ఇందులోనూ కొంత అలజడికి శ్రీకారం చుట్టాలని అనుకున్నా వారి పప్పులు ఉడకలేదు…రేవంత్‌ రెడ్డి ఇలా గట్టిగా వుంటే తప్ప పార్టీ గాడిలో పడదంటున్నారు…గో ..హెడ్‌!!అంటున్నారు. రేవంత్‌ గట్టిగానే వుండాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు…

మేడారం తల్లుల సేవలో వద్దిరాజు

సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లింపు

భారీగా తరలి వచ్చిన అభిమానులు

హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు

జూలై, 7:

 

వన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రవిచంద్ర మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్ల కు చీరె, సారె, బెల్లం ముద్దలు నైవేద్యం సమర్పించి, పూజలు చేశారు.

తొలుత ఆలయానికి విచ్చేసిన ఎంపీతో పాటు కుటుంబ సభ్యులను పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దగ్గరుండి సమ్మక్క, సారలమ్మల గద్దెలు, పగిడిద్దె రాజు, గోవింద రాజులను దర్శింపజేసి, తీర్ద ప్రసాదాలు అందజేశారు. మొక్కులు చెల్లింపు వేడుకకు ఖమ్మం,

వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి వద్దిరాజు అభిమానులు పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జల వనరుల అభివృద్ధి మండలి చైర్మన్ వి. ప్రకాష్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, నాయకులు పుట్టం పురుషోత్తం, రౌతు కనకయ్య, విష్ణు జగతి, ఆకుల గాంధీ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆలేరు ముక్కొణపు పోరు!

హస్తం ప్రభావం కూడా తక్కువేం కాదు?

బలమైన గులాబిలో మోత్కుపల్లి గుబులు?

గొంగిడి సునీతకు హాట్రిక్‌ దక్కేనా?

కారులో మొదలైన కుతకుతలు?

నిన్నటి దాక గొంగిడి సునీతకు ఎదురులేదు?

సెకండ్‌ క్యాడర్‌ కనుచూపు మేర కూడా లేదు?

మోత్కుపల్లి కారెక్కడంతో సరికొత్త సమీకరణాలు?

మోత్కుపల్లిని ఒత్తిడి చేస్తున్న అనుచరులు?

గతంలో ఐదుసార్లు ఆలేరు ఎమ్మెల్యే?

ఇప్పటికీ పోటీకి సై…సై?

తెరాసలో చేరడంతో చిగురించిన ఆశలు?

గొంగిడి సునీతకు మొదలైన తలనొప్పులు?

కమల వికాసంలో ఎదురుచూపు?

ఇంతకీ జనమెటువైపు?

కారుకు కలిసొచ్చే దగ్గర సొంత కుంపటిలో పొగలు?

                        ఒకరిది హీట్రిక్‌ కోసం ఆరాటం…మరొకరిది ఎలాగైనా పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలన్న పోరాటం…ఇంకొకరిది పార్టీకి ఇప్పుడిప్పుడే ఊపొస్తోంది. గెలిస్తే నాకు కూడా పేరొస్తుందన్న ఉబలాటం…..సందిట్లో సడేమియా లాగా గతాన్ని ముందేసుకొని, చరిత్రను తవ్వే పనిలో మరో నాయకుడు వున్నాడు. అవకాశం వస్తే నేను కూడా పోటీ చేస్తానంటున్నాడు. కాకపోతే నాలుగో నేత ఆశలకు పెద్దగా ఫలించే సూచనలు లేవు. ముగ్గురు మాత్రం పక్కా…ఈ ముగ్గురు మధ్యే పోటీ అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

                    తెలంగాణ ఉద్యమంలో గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్‌రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరు నియోజకవర్గం నుంచి ఆమెకు అవకాశం కల్పించారు. 2014లో గెలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ టిక్కెట్టు ఇచ్చారు. రెండోసారి కూడా గెలిచారు. అయితే ఆ ఎన్నికల సమయంలో పెద్దఎత్తున వివాదాలు కూడా చెలరేగిన నియోజకవర్గం కూడా ఆలేరే…ఆలేరు చెందిన గుండాల మండలం జనగాంలో చేర్చడాన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆ ఎన్నికల్లో గొంగిడి సునీత గెలుపుపై ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. కాని ఆమె ఎంతో చాకచక్యంగా ఎన్నికల తర్వాత ఎలాగైనా గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తానని గట్టిగా మాటిచ్చారు. గెలిచారు. ఈ ఒక్క వివాదం తప్ప ఆమెపై మరేరకమైన ఆరోపణలు అప్పటికి లేవు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత బాగానే అభివృద్ధి చేస్తుందన్న మాటతో పాటు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆమె విజయానికి బాటలు వేశాయి. ఇంత వరకు బాగానే వుంది. మళ్లీ గెలిచింది. ప్రభుత్వ విప్‌గా ప్రమోషన్‌ పొందింది. కాని ఆ తర్వాత ప్రజలను , అభివృద్ధి పనులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతే కాదు నియోజకవర్గంలో ఆమె ఎవరికీ మేలు చేసినట్లుగాని, అలాగని కీడు చేసినట్లు లేదు. కేవలం రియలెస్టేట్‌ మీద వ్యాపారం తప్ప ఈ దఫా విప్‌ గొంగిడి సునీత పెద్దగా నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్న అసంతృప్తులే వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఆలేరు నియోజకవర్గం నుంచి ఈసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు మొదలైనప్పటినుంచి ఆమెలో కొంత నిస్తేజం కనిపిస్తుందని కూడా అంటున్నారు. ఎగిరెగిరి దంచినా అదే కూలీ, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్లు, నియోజకవర్గం మీద ఎంత దృష్టిపెట్టి అభివృద్ధి చేసినా టిక్కెట్టు ఇస్తారో లేదో లేదో అన్న డైలామాలోనే చాలా కాలంగా వుంటున్నారని అంటున్నారు. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలేరుపై నుంచి పోటీ చేయొచ్చని అనుకుంటున్న తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బిజేపిని వదిలి కారెక్కారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఈ మధ్య ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దళిత బంధు అమలులో కూడా ఆయనను ముందు పెడుతున్నారు. యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి ఎప్పుడొచ్చినా, గుడి ప్రారంభ సమయంలోనూ మోత్కుపల్లికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. ఇది కూడా గొంగిడి సునీతలో కొంత అసంతృప్తికి కారణమైందని కూడా అంటున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి ఆలేరుకు వస్తారన్నది, మరో వైపు మోత్కుపల్లి ఎలాంటి ఎత్తులు వేస్తారో అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగానే వుంది. కాకపోతే గొంగడి సునీత చేసిన నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే, ఒక్క యాదగిరి గుట్ట పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం తప్ప, ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదని కూడా అంటున్నారు. యాదాద్రి పరిసరాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని సంతోషించాలో, లేక సామాన్యలకు అందుబాటులో లేకుండా పోయాయని బాధపడాలో తెలియని పరిస్ధితిలో నియోజకవర్గం వుందంటున్నారు. ఏది ఏమైనా ఆమెపై విమర్శలు, వివాదాలు లేకపోయినా అభివృద్ధి గురించి ఈ దఫా ఆమె పట్టించుకోలేదన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. 

                                   ఇక 2009 ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బూడిద బిక్షమయ్య గౌడ్‌ అప్పట్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి రియలెస్టేట్‌ వ్యవహారంలో కొన్ని చిక్కుల్లో చిక్కుకున్నాడు. దాంతో కాంగ్రెస్‌ను వదిలేసి కారెక్కారు. అక్కడ తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆశించాడు. కాని అక్కడ పలకరించేవారు లేకుండాపోయారు. ఆయనకు ఏదైనా పదవి వస్తుందేమో అన్న ఆశతోనే గత కొంత కాలం క్రితం వరకు ఎదురుచూశారు. ఇక తనకు ఎలాంటి పదవి లభించేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలాగూ టిఆర్‌ఎస్‌ ఇవ్వదు. ఇంకా ఆ పార్టీలో వుండడం ఎందుకు అనుకొని బిజేపిలో చేరారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సీట్లు, రఘునందన్‌, ఈటెల గెలపుతో ఊపులా భావిస్తున్న బిజేపిని నమ్ముకొని బిక్షమయ్య గౌడ్‌ ఆ పార్టీలో చేరాడు. ఆలేరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ఎంతో బలంగా వుంది. ఆ పార్టీ తర్వాత బిజేపినే బలంగా వుందన్న మాటలే వినిపిస్తున్నాయి. దాంతో తన మాతృ సంస్ధ అయిన కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా బిక్షమయ్య గౌడ్‌ బిజేపిలో చేరారు. తన మీద తనకన్నా, బిజేపి మీద పెంచుకున్న నమ్మకం తనను గట్టెక్కిస్తుందేమో అన్న ఆశతో చేరినట్లున్నారు. సహజంగా హైదరాబాద్‌కు సమీపంలో ఆలేరు వుండడం, బిజేపికి కొంత కలిసి వచ్చే అంశం. నగర రాజకీయ ప్రభావం ఇక్కడ కూడా కనిపించే అవకాశాలున్నాయన్నది బిక్షమయ్య అంచనా వేసినట్లున్నారు. నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్‌ రాజకీయాలకాన్న, ఎలాంటి తలనొప్పి లేని బిజేపి బెటర్‌ అని అకున్నట్లున్నారు. కమలంతీర్ధం పుచ్చుకున్నారు. కాకపోతే ఇంకా ఆయన తన ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే కావడం కూడా ఆయనకు కలిసివస్తుందన్న నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది. 

                       ఇక రేవంత్‌ రెడ్డి రాకతో కొంత ఉత్సాహాన్ని కనబర్చుతున్న కాంగ్రెస్‌లో ఆలేరులో పెద్దగా పేరున్న నాయకుడు లేడు. బిక్షమయ్య గౌడ్‌ తర్వాత అంతటి స్ధాయిని కనబర్చిన నాయకులు లేరు. కాకపోతే ఆలేరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న బీర్ల అయిలయ్య నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడనే అంటున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ డిక్లరేషన్‌లోని అంశాలతోను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మాత్రం బాగానే చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసుకుంటూ తన ప్రచారం ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. పైగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా పెద్దఎత్తున చేపడుతున్నారని సమచారం. పార్టీని వాడుకొని వదిలేసిన, అవకాశ వాదులకన్నా, నిత్యం ప్రజల్లో వుంటూ, అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీర్ల అయిలయ్య కొంత మెరుగే అన్న సానుకూల దృక్పథం ప్రజల్లో కనిపిస్తోందంటున్నారు. 

                               ఆలేరులో పేరుకు ముక్కొణపు పోటీ కనిపిస్తున్నా, అంతర్లీనంగా చతుర్ముఖ పోటీ వున్నట్లే వుంది. తానేం తక్కువ. తనకేం తక్కువ. ఐదుసార్లు ఆలేరు నుంచి, ఒకసారి తుంగతుర్తి నుంచి ఎదురు లేకుండా, తిరుగులేని రాజకీయాలు చేసిన నాకన్నా పెద్ద నాయకుడు ఎవరున్నారంటూ మోత్కుపల్లి కూడా తాను బరిలో వుంటే ఎలా వుంటుందనేదాన్ని పరిశీలిస్తున్నాడట. తన సొంత మనుషుల దగ్గర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడట. తాను ఇంకా ఫిట్‌గానే వున్నానని, రాజకీయ పదవుల మీద ఆశ లేకపోయినా, ప్రజలు సేవ చేయాలన్న ఆలోచన తగ్గలేదంటున్నారట. తాను ఎంతో నిజాయితీ కలిగిన నాయకునని, ఇప్పటికీ కనీసం సొంత ఇల్లు కూడా లేని నాయకుడినని, నా లాంటి రాజకీయ నాయకులు ఈ సమాజానికి ఆదర్శమంటున్నారట. నాలాంటి నాయకులే ఈ కలుషిత రాజకీయాలను మార్చాలని అంటున్నాడట. తన లాంటి నాయకులను చూసైనా రాజకీయాల్లో మళ్లీ అవినీతికి తావులేని రోజులు వస్తాయన్న నమ్మకం వుందని, నిజాయితీ అంటే ఎలా వుంటుందో, అభివృద్ధి అంటే ఎలా చేయాలో చేసి చూపిస్తానని కూడా తన అనుయాయులతో చెప్పుకుంటున్నాడట. మరి కారు టిక్కెట్టు ఎవరిని వరించినా, టిఆర్‌ఎస్‌ మాత్రం నియోజకవర్గంలో బలంగా వుంది. ఇద్దరు బలమైన నాయకులు పార్టీ కోసం కాకుండా, వ్యక్తిగత రాజకీయాలు చేస్తే మాత్రం నియోజకవర్గ అధికారం కారు నుంచి జారి పోవడం మాత్రం ఖాయం…? తేరుకోకపోతే రాజకీయ అలజడి మొదలై మునకలేయడం తధ్యం..?

కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు.

పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!

ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?

ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?

మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

అభివృద్ధి నిధులకు సంబంధించి కోట్ల రూపాయల దుర్వినియోగంలో పలు సాక్షాలతో పాటు ప్రజలు కూడా అవినీతి భాగవతాలను నిధుల దుర్వినియోగాన్ని బయట పెట్టడం జరిగింది వంద రోజులు పూర్తి అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు కమిషన్ కక్కుర్తి లో పడి ఇంజనీరింగ్ చీఫ్ వరకు అక్రమాలకు పాల్పడిన అధికారిని కాపాడుకుంటూ కుంభకోణ వ్యవహారాన్ని దారి మరణించే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడం జరుగుతుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిష్ నర్ కోట్ల కుంభకోణ వ్యవహారంపై నేటి వరకు సి ఆర్ డి దృష్టిలో ఉందా ఉన్నప్పటికీ సి ఆర్ డి కిందిస్థాయి అధికారులకు చర్యలు సంబంధిత వ్యవహారంపై నివేదికను అందించాలని  ఆదేశించడం లాంటి కార్యాచరణ జరిగిందా లేకుంటే పంచాయతీరాజ్ జిల్లా స్థాయి అధికారులు కమిష్ నర్ ను అధికారులు కమిషన్ కక్కుర్తిలో పడి సి ఆర్ డి ని పక్కదారి పట్టించి ఎలాంటి అవినీతి జరగలేదని తెలుపడం జరిగిందా అందుకే నేటి వరకు సి ఆర్ డి మహాదేవపూర్ అభివృద్ధి నిధుల కోట్ల కుంభకోణంపై నిశ్శబ్ద వైఖరిని వ్యవహరిస్తున్నారేమో కానీ సి ఆర్ డి కి మండలంలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం సాక్షాలు బాధితులు తోపాటు ప్రజలు సైతం ఏ ఈ రాజేందర్ రెడ్డి అక్రమాలను స్వయానా జిల్లా కలెక్టర్ కు అందించడం జరిగింది అన్న వాస్తవాలు కమిష్ నర్ దృష్టికి పోకుండా పంచాయతీరాజ్ జిల్లా అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చడం వలనే సి ఆర్ డి విచారణ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ క్యూ సి లకు ఆదేశాలు ఇవ్వలేదు ఏమో అని చెప్పుకోవడం జరుగుతుంది.

 

 *కమిష్ నర్ కోట్ల కుంభకోణం పై నిశ్శబ్దంఎందుకు.!?* 

 

మహాదేవపూర్ మండలంలో అభివృద్ధి పనులకు సంబంధించి కోట్ల రూపాయల నిధుల కుంభకోణం గత 100 రోజులు గా అక్రమాలు సాక్షదారాలతో బాధితులు సైతం ఇటు మీడియా ముందు అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండడం నేడు తెలంగాణ రాష్ట్రంలో నిధుల కుంభకోణ విషయంలో ఒక సాధారణ ఏఈ స్థాయి అధికారి కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడి పై అధికారుల వరకు తన చెప్పుచేతల్లో పెట్టుకొని నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు జిల్లా అధికారులతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ను సైతం కమిషన్ మాయలో పడేయడం జరిగిందని నేడు చర్చించుకోవడం జరుగుతుంది. మండలానికి సంబంధించిన కుంభకోణ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ నేటి వరకు మహాదేవపూర్ కుంభకోణానికి సంబంధించి విచారణకు ఆదేశించకపోవడం ప్రజలకు అర్థం కావడం లేదు. మండలంలో నాలుగున్నర సంవత్సరాల నుండి అభివృద్ధి పనుల పేరుతో ఒకవైపు నాసిరకం పనులు బినామీ కాంట్రాక్టర్లకు కమిషన్ కొరకు ఎక్కువ మోతాదులో పనులు కేటాయించడం ఎక్కువ కమిషన్ అందించిన కాంట్రాక్ట్ పనులను పర్యవేక్షించకపోవడం కమిషన్ ఎక్కువ అర్చించే కొత్త పథకాలను ప్రజలు ఇబ్బందులకు గురైతున్నప్పటికీ వాటిని అమలు చేయడం ఏ ఈ రాజేందర్ రెడ్డి తను ఒక అధికారి అన్న విషయాన్ని మరిచిపోయి కాంట్రాక్టర్ రూపాన్ని బినామీలతో దాల్చడం ఇప్పటికీ మండలంలో పనులు చేయకపోయినప్పటికీ లక్షల రూపాయలు పనులు చేసినట్లు రికార్డు చేసి కోట్ల రూపాయలను దండుకోవడం జరిగింది. ఇలా నాలుగున్నర సంవత్సరాల్లో ఏఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తోపాటు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై భారీగా ఉన్న మండల నిధులను అభివృద్ధి పనుల పేరిట పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలను తమ జీవుల్లోకి మళ్లించుకోవడం జరిగింది. మండలంలో భారీ కుంభకోణానికి దారి తీసిన రాజేందర్ రెడ్డి మాత్రం సెలవు పెట్టి సెలవులలో సెలబ్రేట్ చేసుకుంటూ అధికారులను తలపై వస్తున్న వార్తలు బినామీల తో కమిషన్ల వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతున్నప్పటికీ సి ఆర్ డి మాత్రం స్పందించకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 *పని జరగలేదు కానీ లక్ష 30 వేలు ఫట్, మండలమంతా ఇది పరిస్థితి.!* 

 

అతని మేధస్సు వందనాలు అక్రమాలు సృష్టించడంలో యావత్ రాష్ట్రంలోని ఏ శాఖలో లేని అంత తెలివితేటలు ఏ ఈ రాజేందర్రెడ్డి లో చూడవచ్చు. ఎందుకంటే రాజేందర్ రెడ్డి కి కేవలం కమిషన్ ప్రభుత్వ ఖజానాలోని నిధులు తన జీబుల్లోకి రావాలని ఒక్కటే లక్ష్యం గా ముందుకు సాగే అధికారి ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖ లో నీ మహదేవ్పూర్ మండల పంచాయతీ రాజ్ ఇంజినీర్ రాజేందర్ రెడ్డి అని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అందుకు ప్రజలందరూ అక్రమాల సృష్టికర్తగా అతనికి వందనాలని చెప్పుకోక తప్పడం లేదు. ఏఈ హోదాలో ఉండి పలు అనామకులకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే క్రమంలో పెట్టుబడులు పెట్టి వారి పేరున వందల పనులను పూర్తిగా నాసిరకం పనులు నిర్వహించి బిల్లులను చేపట్టడం జరిగింది. అలాగే అంచనాలకు మించి అతని అక్రమాలకు సృష్టించడంలో తెలివి ఎవరికి సాటి కాదు అన్నది వాస్తవమే అన్నట్టుగా ప్రభుత్వ నిధుల పేరుతో ఎలాంటి పనులు చేపట్టకుండానే అక్కడ పెద్ద మొత్తంలో పని నిర్వహించినట్లు లక్షల రూపాయల బిల్లులను రికార్డ్ చేసి అటు బినామీలకు అందించి వారి దగ్గర నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి తీసుకోవడం ఇలా మండలంలో లెక్కలేని పనులను కోట్ల రూపాయల నిధులను పనులు చేసినట్లుగా నమోదు చేసి పెద్ద మొత్తంలో నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. తాజాగా మండలంలోని సూరారం గ్రామంలో కాగితంలో మాత్రం పేరు పనిచేయడం జరిగిందని అక్కడ మాత్రం ఇలాంటి పని చేయలేదని అయినప్పటికీ ఒక లక్ష 30 వేల రూపాయల బిల్లును రికార్డ్ చేసి నిధులు బినామీల ద్వారా ఏ ఈ జేబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.

 

 

 *ప్రజా దర్బార్ లో అవినీతి గుట్టురట్టు,నేటిధాత్రి మూడు నెలలు గా చెప్పుతున్న కమిషన్ మత్తులో పంచాయతీరాజ్.!?* 

 

మండలంలో కోట్ల కుంభకోణం జరిగిందని నిధుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి మండల పరిషత్ అధికారి తో పాటు ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై నాలుగున్నర సంవత్సరాల నుండి మండలానికి ప్రభుత్వం వెచ్చించిన కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని పలు సాక్షాలను సైతం నేటి ధాత్రి బయటపెట్టింది. కానీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో మండల స్థాయి నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అంతా ఏఈ రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడి ఉండడం నేటి వరకు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సి ఆర్ డి తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా దృష్టిలో మహదేవ్పూర్ కుంభకోణ వ్యవహారం ఉన్నప్పటికీ మండలంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని తప్పుడు సమాచారం ఇస్తూ చర్యల కు ఆదేశించకుండా ఉండుటకు నేటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తాజాగా నేటి ధాత్రి వరుస కథనాలను పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా స్పందించకుని క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ రాజేందర్ రెడ్డి ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు సాక్షాలు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు సి ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీలు చర్యలకు ఆదేశిస్తే లేరని ప్రజలు వారి విధి నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక ప్రజా దర్బార్ లోనే ఏఈ అక్రమాలను తామే వెలిగితీస్తామని ఏకమై తమ గ్రామంలో ఏ ఈ చేసిన అరాచకాలను వెలికి తీసే క్రమంలో నీరుగా ప్రజలే రంగంలోకి దిగి పైపులు వేయకుండానే వేసినట్లు రికార్డు చేసి ఒక లక్ష 38 వేల రూపాయల బిల్లులు నమోదు చేయించి బినామీలతో డబ్బులను తీసుకోవడం జరిగింది అన్న విషయాన్ని ప్రజలు బహిర్గతం చేయడం జరిగింది. తన అక్రమాలు తెలుసుకున్న రాజేందర్రెడ్డి హటావోటిగా పైపులను అమర్చించే కార్యక్రమం చేపట్టడంతో ప్రజలు వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం పైపులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో మహాదేవపూర్ గ్రామ పంచాయతీకి పైపులను పంపించడం జరిగింది. నేటి ధాత్రి గత 100 రోజుల నుండి ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డాడని పలు ప్రదేశాల్లో అవసరం లేనప్పటికీ నాసిరకం పనులు అలాగే పనులు చేయకుండానే బిల్లులను రికార్డు చేయడం జరుగుతుందని వరుస కథనాలు వ్రాస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ జిల్లా అధికారులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరించడం జరిగింది. చివరికి నేటి ధాత్రి కథనాలు సాక్ష్యాలుగా ప్రజల దర్బార్ లోనే అక్రమాలకు ప్రజలే అధికారులుగా మారి వెలికి తీయడం జరుగుతుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత కమిషన్ మత్తులో ఉందో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది.

 

 

 *ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణం డబ్బుతో అధికారులను కొనేశాడు, అందుకే చర్యలకు ధైర్యం రాక అధికారుల శబ్దం.!?* 

 

పి ఆర్ రాజేందర్ రెడ్డి అంటేనే ఒక అక్రమ బ్రాండ్ గా కమిషన్ కలెక్షన్ కింగ్ గా యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా తో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఒక మారు మోగుతున్న పేరు. మండలంలో కుంభకోణ వ్యవహారం పుట్టను బహిర్గతం చేసి వంద రోజులు పూర్తి అయినప్పటికీ తాజాగా కమిషన్లలో లక్షలకు పైనే అమాయక కాంట్రాక్టర్ల దగ్గర నుంచి దోచుకున్న రాజేందర్ రెడ్డి చివరికి ఎలాంటి పని నిర్వహించకుండానే తనకు ఇష్టమొచ్చినంత బిల్లును రికార్డ్ చేసి నిధులను తన జీబుల్లోకి మళ్లించే సత్తా ఉన్న ఏ ఈ ప్రజలు తిరుగుబాటై అక్రమాల చిట్టాలు బయటపడుతున్న క్రమంలో అతనిపై వేలెత్తి చూపే అధికారి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పంచాయతీరాజ్ శాఖలో లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి అంటే పిఆర్ శాఖలోనే అక్రమాలకు కమిషన్లకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారడం ఏ అధికారి అయిన రాజేందర్ రెడ్డి కమిషన్ మాయలో పడాల్సిందే ఎందుకంటే అధికారిని బట్టి కమిషన్ రేటు కమిషన్ రేటును ఫిక్స్ చేసి వారికి అందించే సత్తా కేవలం రాజేందర్రెడ్డి లోనే ఉండడం ఇక జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులకు ప్రభుత్వం మహాదేవపూర్ మండలానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసి ఉండడం తమకు ఊహించినంత కమిషన్ వస్తుందని తమకు రాజేందర్రెడ్డి ఉన్నాడని జిల్లా అధికారులతో పాటు ఉన్నత అధికారులు సైతం ఒక భరోసాతో ఉండడం రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారం సాక్షాలు న్యాయస్థానాలను సైతం పనికిరాకుండా చేసింది కమిషన్ వ్యవహారం నేటికి రాజేందర్ రెడ్డి పై ఈ ఒక్క పంచాయతీరాజ్ అధికారి తన విధి నిర్వహణలో బాధ్యతగా అక్రమాలపై కన్నేసిన అధికారి కరువైపోవడం ఎందుకంటే రాజేందర్ రెడ్డి మండలంలో అక్రమాలకు పాల్పడిన డబ్బులు అధికారులకు పంచిపెట్టడం జరగడంతో నేటికీ ఏ ఒక్క అధికారి ముందుకు రావడం లేదు. గత వారం రోజుల క్రింద డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి తనకేమీ కాదని అధికారులంతా నా వైపే ఉన్నారని వారి చిత్త నా దగ్గర ఉందని నాపై చర్యలకు ఆదేశిస్తే వారు ఎవరు తోడిన గోతిలో వారు కూడా పడతారని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ బినామీలకు చెప్పుకున్నట్లు మండలమంతా ఒక చర్చనీయంగా మారింది. అలాగే డి ఈ సాయిలు కూడా పలు ప్రదేశాల్లో పలువురు వ్యక్తులతో రాజేందర్ రెడ్డి కి ఏమి కాదు పంచాయతీరాజ్ శాఖలో నాసిరకం కమిషన్ అనేది సరే మామూలే ఎవరు అధికారులు పట్టించుకోరు అని చెప్పుకోవడం కూడా చర్చనీయంగా మారింది దీన్నిబట్టి చూస్తే పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులకు రాజేందర్ రెడ్డి కమిషన్ వ్యవహారం ఇక్కడ వరకు దారితీసిందో అర్థమౌతుంది.

 

 *మహాదేవపూర్ కుంభకోణంపై కమిష్ నర్ దారి ఎది, కమీషన్ ఆ లేక చర్యలా.!?* 

 

మహదేవ్పూర్ మండలంలో నిధుల దుర్వినియోగం కుంభకోణ వ్యవహారం సత్వర చర్చల్లో ఉన్నప్పటికీ జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు అలాగే ఇంజనీరింగ్ చీఫ్ సైతం కమిషన్ మాయలు పడి ఉన్నారని అందుకు నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శాఖ ఉన్నత అధికారి లో ఒకరైనప్పటికీ నేటి వరకు ఏ ఈ రాజేందర్ రెడ్డి భాగవతం సి ఆర్ డి దృష్టి కి పోలేదా కావాలని కమిషనర్ ను కమిషన్ కక్కుర్తి లో ఉన్న అధికారులు పక్కదారి పట్టించారా ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల్లో వ్యక్తం కాక తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఇప్పటికైనా మహదేవ్పూర్ కుంభకోణంపై తక్షణమే విజిలెన్స్ ఇన్ఫోసిమెంట్స్ క్యూసీలకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడుతూ కోట్ల రూపాయల నిధులను వెచ్చించిన క్రమంలో ఒకవైపు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చే విధంగా మరోవైపు శాఖను అప్రతిష్ట పాలు చేసేలా వ్యవహరిస్తున్న ఏఈ రాజేందర్ రెడ్డి తో పాటు జిల్లా స్థాయి అధికారులు అలాగే మండల పరిషత్ అధికారులతో పాటు పలు ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి ఇప్పటికీ అక్రమాలకు పాల్పడిన నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టి వారిపై శాఖ పరమైన చర్యలు చేపట్టి పంచాయతీరాజ్ శాఖ నుండి వారికి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని మండలం తో పాటు యావత్ జిల్లా ప్రజలు కమిష్ నర్ ను కోరుతున్నారు. ఇక కమిషనర్ దారి ఎటు ఇటు అన్నది ఏఈ రాజేందర్ రెడ్డి పై చర్యలు తీసుకుంటే తెలుస్తుంది.

ABVP బంద్ విజయవంతం 

తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం

జరిగింది అందులో భాగంగా హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వ పాఠశాలలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేస్తోందని అన్నారు.

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని జనవరి మాసంలో అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కనీసం పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేయకపోవడం, నిధులు కొరతతో మౌలిక వసతుల కల్పనలో, మధ్యాహ్న భోజనం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడీ నియంత్రించి “ఫీజు నియంత్రణ చట్టం” అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం, ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, యూనిఫామ్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థును విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన ప్రభుత్వ నియంత్రణ మాత్రం శూన్యమన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పున్నం వేణు ,

నాయకులు అఖిల్ ,బలరాం , సాయి చందు, నిఖిల్ 

జిల్లా కన్వీనర్ ఎర్రగొల్ల ఛత్రపతి శివాజీ , జిల్లా సంఘటనా మంత్రి హర్ష , నాయకులు సుజిత్ ,కుమార్ ,చింటు ,తదితరులు పాల్గొన్నారు

 

డిమాండ్స్:

 

1. సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు, డ్రెస్ లు అందించాలి.

 

2. ప్రభుత్వం ప్రకటించిన “మన ఊరు-మన బడి” కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.

 

3. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, DEO, MEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

 

4. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.

 

5. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి. 6. ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.

 

7. బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్

 

8. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి..

 

9. విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

పండుగ వెళ్ల కూడ…. జీతాలు అలస్యమా…..!

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గమనించి ప్రతి నెల జీతాలు లేట్….

 

అయిన ఎప్పుడు జీతాలు పడితే అప్పుడు ఓర్చుకున్నాము….

 

ప్రతి నెల ప్రభుత్వ ఉద్యుగులకు, పెన్షనదారులకు,జీతాలు లేటె….

 

జీతాలు అందడం….ఆలస్యం శరా మాములే….

 

బక్రీద్ పండుగ వెళ్ల కూడా లేట్ అంటే ఎట్లా…..

 

టీపీసీసీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్…..

 

ప్రభుత్వ ఉద్యుగులు,పెన్షనర్లు,జీతాలు టక్కున ఒకటో తారిఖ్ నాడు అందుతాయని నానుడి…..అది ఒకప్పటి మాట…. రాష్ట్రంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా గత కొన్ని నెలల నుంచి జీతాలు అందడం ఆలస్యం తో బాటు ఎప్పుడు పడుతాయనో భావం కల్గి ఎప్పుడైనా పడని అనే భావనలో వున్నారు ఉద్యుగులు,పెన్షనర్లు,కానీ ముస్లిం సోదరులు అతి పెద్ద పండుగ బక్రీద్,ఈ నెల 10 వ తరీఖునా బక్రీద్ పండుగ ఉంది,ఈ నెలలో అయిదు రోజులు గడిచాయి, పట్టుమని అయిదు రోజులు మిగిలాయి, నేటికి జీతాలు అందలేదు,పండుగను దృష్టి లో ఉంచొకొని జీతాలు అందించాలని,ముస్లిం ఉద్యుగులకు,పెన్షనర్లకు,ఇతరులకు కూడ సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మైనారిటీ.విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాదిక్ ముఖ్యమంత్రి కు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రకటనలో కోరారు. ముస్లిం లకు రంజాన్ పండుగతో బాటు బక్రీద్ పండుగ కూడ అతి పవిత్ర మైనదని,ముస్లిం లకు ఖర్చులు కూడా ఎక్కువ వుంటాయని, బక్రీద్ పండుగకు ఖుర్బానీ లాంటి విధానంతో ఖర్చులు అధికంగా వుంటాయని, జీతాలు సకాలంలో వస్తే పండుగను ఆనందంగా జరుపుకోవటానికి దోహద పడుతుందని సాదిక్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రతి నెల జీతాలు ఆలస్యంగా అందుతున్న యని పేర్కొంటు, పండుగ వెళ్ల అయిన సకాలంలో అందితే బాగుగా ఉంటుందని సాదిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పండుగలను దృష్టిలో ఉంచుకుని ,నెల ఆఖరి దగ్గరగా ఉంటే జీతాలు ముందే అందించేవారని,ఇలాంటి పరిస్థితులు ఎన్నో మార్లు దాపురించాయని,ప్రభుత్వం సానుభూతిగా అందుంచిందని సాదిక్ ఈ సంధర్బంగా గుర్తు చేశారు.. ప్రభుత్వాలు ఉద్యుగుల కష్ట సుఖాలు చూడాలని,సమస్యలను గుర్తు చేసే వరకు అవకాశం కల్పించారద ని ,సకాలంలో జీతాలను అందించాలని కోరారు.ఇప్పటికైనా బక్రీద్ పండుగ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో జీతాలు అందించాలని సాదిక్ కోరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని ప్రభుత్వ ఉద్యుగులు,పెన్షనర్లు,సహకరిస్తూ,వస్తున్నారని జీతాలు ఎప్పుడు ఇచ్చిన అప్పుడు అందుకుంటున్నారని,గుర్తు చేస్తూ,పండుగ వేళ సకాలంలో అందించాలని కోరారు. గత కొన్ని నెలల నుంచి జీతాలు అందించడంలో అలస్యంతో బాటు,ప్రతి నెల మొదటి తారీఖు నుంచి రోజుకు కొన్ని జిల్లాల వారిగా జీతాలు అందించడం జరుగుతుందని సాదిక్ అన్నారు.

సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా మామిడి అశోక్

శాయంపేట, నేటిధాత్రి: టిఆర్ఎస్ పార్టీ శాయంపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా కొప్పుల గ్రామానికి చెందిన మామిడి అశోక్ ఇటీవలే నియమితులు కాగా సోమవారం గండ్ర దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,

వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతిరమణరెడ్డి దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ మామిడి అశోక్ ను శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో సోషల్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు గండ్ర దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఎంపికైన మామిడి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, 

వైస్ ఎంపీపీ లతాలక్ష్మారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు ఉప సర్పంచులు,

టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు

పాల్గొన్నారు.

మోడీ ముచ్చట చప్పగా! కేసిఆర్‌ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా?

రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా?

లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా?

ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా?

ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా?

పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు?

ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు?

జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు?

ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు?

చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట యోధులు…ప్రపంచ చరిత్రలోనే యాభై ఏళ్లలో రెండు సార్లు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమ పోరాటం ఘనత తెలంగాణ సమాజానికిది…అందుకే నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్న సుమతీ శతక పద్యం ప్రధానమంత్రి మోడీకి తెలిసినట్లుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇబ్బందే అనుకున్నారో ఎమో? ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదనుకున్నారో ఏమోగాని, తనదైన శైలిలో ఘాటు టేకుండా మాట్లాకుండానే వెళ్లిపోయారు..? ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడినా తెలంగాణకు ఏమిచ్చామన్నదానిని సైతం క్లారిటీగా చెప్పలేకపోయారు. ఏం చెప్పినా ఇబ్బందే అనుకున్నట్లున్నారు. తెలంగాణ ప్రజలు ముందు అబద్దాలాడితే నమ్మరనుకున్నట్లున్నారు. ఎక్కడ బావ అయినా వంగతోట కాదనట్లు ఎక్కడికెళ్లి ఏది చెప్పినా విన్న జనం వేరు. తెలంగాణ ప్రజలు వేరు అన్నది మోడీకి బాగా తెలిసినట్లుంది. అందుకే చెప్పడానికి నిజాలేమీ లేక, అబద్దాలు చెప్పడానికి నోరు రాక, చెప్పాలన్నా, ఏమీ లేక ఉత్త చేతులు ఊపితే చాలనుకున్నారు. 

                       వంగీ వంగీ దండాలు పెట్టి, నోటితో చెప్పలేని క్షమాపణలు చేతులు ఊపడం ద్వారా అర్ధం చేసుకొమ్మని చెప్పినట్లు చేశారు. ఇంతకీ ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోడీ చెప్పిన మాటలు వింటే విచిత్రమనిపిస్తాయి. తెలంగాణలో 2015లో పునర్‌ప్రారంభపనులు మొదలైన రామగుండం ఎరువుల ప్యాక్టరీ ఏడేళ్లు గడిచినా, ఇంకా పునరుద్దరణ పనులే జరుగుతున్నాయిని స్వయంగా ప్రధాని మోడీ ఒప్పుకున్నట్లైంది. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి వుంటే ఒక ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి ఏడేళ్లు పడుతుందా? అయినా ఇంకా అది పూర్తయినట్లుగాని, త్వరలో ప్రారంభిస్తామని కాని చెప్పలేదు. పనులు జరుగుతున్నాయన్న మాటలు మాత్రమే చెప్పారు. అంటే తమ అశక్తిని, చిత్తశుద్ది లేమిని బైటపెట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఏడేళ్ల కాలంలో 115 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పూర్తి చేశామన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రోజుకు కనీసం 10 నుంచి పదిహేను కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కాని తెలంగాణలో ఏడేళ్లుగా పూర్తి చేసింది కేవలం 115 కిలో మీటర్లు మాత్రమే అని స్వయంగా ప్రధాని చెప్పారు. ఏడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే ఎంత పూర్తయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణకు ఇస్తామన్న కాజిపేట రైల్లే కోచ్‌ ఫ్యాక్టరీనే గురజాత్‌కు తరలించుకుపోయిన వారు, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించడం కూడా అవివేకమే అవుతుంది. 1853 ఎప్రిల్‌ 13 ఇండియాలో తొలి రైలు బొంబాయి నుంచి ధానేకు నడిచింది. ఆ తర్వాత యుద్ద ప్రాతిపదికన రైల్వే వ్యవస్ధను నిర్మాణం చేశారు. దేశమంతా రైల్వే లైన్‌ పూర్తి కావడానికి ఈ లెక్కన పూర్తి కావాలంటే ఎంత సమయం అయివుండాలి? కాని 1873లో తెలంగాణలో కూడా పూర్తి స్ధాయి రైల్వే లైన్‌ పూర్తయింది. 

                        ఇక తమిళనాడు, నాటి ఆంధ్రప్రదేశ్‌ లో అప్పటికే రైల్లే పనులు పూర్తయ్యాయి. ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు. మిషనరీ సరఫరా లేదు. కేవలం మ్యాన్‌ పవర్‌ మాత్రమే. పైగా రైలు పట్టాలకింద వాడేది కలప. దేవదారు వృక్షాలు తెచ్చి, నూనెలో నానబెట్టి, కొనేళ్ల తర్వాత వాటిని ఎండబెట్టి, ఇలా ఎంతో కాలం పట్టేది. అలాంటిది దేశంలో 1957లో ప్రారంభమైన తిరుబాటు కాలానికే దేశంలో అనేక ప్రాంతాలకు రైల్వే లైన్‌ ఏర్పాటు చేయబడిరది. ఒక వేళ బ్రిటీష్‌ కాలంలో ఇలా ఏళ్ల తరబడి వంద కిలోమీటర్లు పూర్తి చేసి వుంటే ఇప్పటికీ మన దేశంలో సగం కాదు కదా…పావు వంతు రైల్లే లైన్‌ కూడా పూర్తి కాకపోయేది. కేవలం 115 కిలోమీటర్ల రైలు మార్గం గురించి ఒక ప్రదాని మోడీ చెప్పడం విడ్డూరం. దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ ఇచ్చామని, రేషన్‌ ఇచ్చామని దేశమంతా ఇదే చెప్పుకుంటూ పోయి, పబ్బం గడపడం తప్ప మరేమైనా వుందా? ఉప్పల్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ ఒక్కటిచ్చి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. దేశంలో హైవేల నిర్మాణం జరుగుతున్న దశలో భాగాంగానే తెలంగాణకు కూడ రోడ్లు వచ్చాయి. అయినా వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటూనే, టోల్‌ వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోతుందో కూడా ప్రధానిచెప్పి వుంటే బాగుండేది…కాని ఆ పని చేయలేదు…ప్రసంగం అంత గొప్పగాసాగలేదు. కాని అంతకు ముందు మాట్లాడిన బిజేపి నాయకులు ఆకాశంలో సంచరించినంత పనిచేశారు. ఆ నాయకులే అంత మాట్లాడితే ఇక మోడీ ఎంత మాట్లాడతారో అని అందరూ అనుకున్నారు. అందరి ఊహలు తలకిందులు చేసినట్లు మోడీ ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహ పరిచే రీతిలో సాగించారే గాని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు తీయడానికి కూడా ప్రధాని మోడీ సాహసించలేదనే చెప్పాలి. 

                              ఇక ముఖ్యమంత్రి కేసిఆర్‌ విషయానికి వస్తే ఈసారి ఆయన తనదైన శైలిలో ప్రధాని మోడీ హైదరాబాద్‌లో వుండగానే ప్రశ్నల జడివాన కురిపించారు. ఇంత కాలం మోడీ వస్తున్నాడనగానే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాడంటూ బిజేపి చేసిన పసలేని విమర్శలకు ధీటైన సమాధానం చెప్పారు. ఫెడరల్‌ స్పూర్తిలో ఎవరి స్ధానం ఎలా వు ండాలో బిజేపికి గుణపాఠం చెప్పినంత పనిచేశారు. సరిగ్గా బిజేపి కార్యవర్గ సమావేశాల కాలంలోనే రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత సిన్హా కార్యక్రమం టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్‌ కాషాయ మయం ఏనాడు కాలేదని నిరూపించడానికి మొత్తం గులాబి మయం చేశారు. బిజేపికి స్ధానం లేదని తెలపడానికి ఎక్కడా హోర్డింగ్‌ కూడా పెట్టుకోలేనంత స్పేస్‌ కూడా మిగల్చలేదు. ఇదిలా వుంటే మోడీ ఎక్కడో వుంటే, ఎక్కడో కాదు…మోదీ హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలిసే బైబై అంటూ ప్రచారం సాగించారు. ఇంతకన్నా మోడీని కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడని చెప్పడానికి మరొక సంకేతం లేదు. అంతే కాదు మోడీ అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఏ ఒక్క క్షణం కూడా భయం లేదని చెప్పడానికి కూడా ఇదే నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ఇక ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ జలవిహార్‌లో చేసిన ప్రసంగం దేశమంతా చూసింది. ప్రధాని మోడీని దేశంలోని ఏ నాయకుడు పట్టనంత తూర్పార పట్టిండు. ప్రపంచంతో మనం ఎందుకు పోటీ పడ లేకపోతున్నామో…బిజేపి చేస్తున్న మోసమేమిటో అన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ లోపాలను ఒక్కొక్కటి ఉల్లిగడ్డ మీద పొట్టు ఒలిచినట్లు ఒలిచి వివరించారు. సంపద సృష్టి లేకుండాపోగా, ఉన్న సందనను కేంద్ర ఎలా అమ్ముతున్నారో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయదంటూనే, వ్యాపారులకు సేల్స్‌ మెన్‌గా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నాడని సూటిగా విమర్శించారు. మేకిన్‌ ఇండియా అంటూ గొప్పలు తప్ప చేసిందేమీ లేదన్నారు. పైగా దేశంలో వున్న పరిశ్రమలు కూడా పారిపోయేలా చేస్తున్నాడని గతంలో మన దేశంలో వున్న కార్ల కంపనీల పేర్లు చదవుతూ అవి తరలిపోయిన విషయం గుర్తు చేశారు. ఒక మార్గదర్శకుడిగా, శాంతి కామకుడిగా ప్రపంచమంతా మన జాతి పిత మహాత్మాగాంధీని కొనియాడుతుంటే, కేంద్ర పెద్దలు మాత్రం ఎలా అవమానిస్తున్నారో వివరించాడు. ఏ ఒక్క విషయాన్ని వదలకుండా, నరేంద్ర మోడీపై ప్రశ్నల రూపంలో నిప్పులు కురిపించారు. ఆయన పరువు మొత్తం గంగలో కలిపారు. ఒక్కొక్క మాట ఒక రాకెట్‌లాగా వదిలారు. మతం పేరుతో బిజేపి చేస్తున్న దారుణాలను ఏకరువు పెట్టారు. మత రాజకీయాలతో దేశంలో ఎలా ప్రజల జీవితాలను బిజేపి నాయకులు అస్తవ్యస్థం చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే గంటకు పైగా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. నిలబెట్టి కడిగేశారు…తనేంటో చూపించారు. తాను వ్యతిరేకించడం మొదలు పెడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని నిరూపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పతనం చేయాలని చూస్తున్న బిజేపిని కేంద్రంలో కూల్చడం ఖాయమని సవాలు చేశారు. తనదైన శైలిలో బెబ్బులిని మరిపించినంత పనిచేశారు… కేసిఆర్‌ రాజకీయ గర్జన ఎలా వుంటుందో రుచి చూపించారు.

పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి 100 రోజులు.

ఏ ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు.

కమిషన్ మత్తు లో డి ఈ, నుండి ఈ ఎన్ సి, అందుకే చర్యలకు నిరాకరణ.!?

87 కోట్ల నిధుల్లో 16 కోట్లు అవినీతి అందుకే కుంభకోణం పై నిశ్శబ్దం.!?

ప్రజలు అవినీతిని బయటపెట్టిన పంచాయితీ రాజ్ ఉన్నత అధికారుల నిశ్శబ్దం,.? అవినీతి లో కూరుకుపోయిన పనులను ఇంచార్జ్ ఏ ఈ ఆధ్వర్యంలో ప్రారంభం.

విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోర్స్మెంట్ కోట్ల నిధులపై మౌనం ఎందుకు, కమిషనర్ ,ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎక్కడ!?

మహాదేవపూర్-నేటిధాత్రి:-

తెలంగాణ రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖ అవినీతి అధికారికి బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిదిద్ది వరుస కథనాలు వచ్చిన ఏ ఈ పై చర్యలు తీసుకోకుండా పబ్లిసిటీ ఇస్తూ సెలవులను సెలబ్రేట్ చేసేలా సహకరించడం జరుగుతుంది. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల పంచాయతీరాజ్ ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయల కుంభకోణాన్ని శ్రీకారం చుట్టి జిల్లా స్థాయి అధికారి తో పాటు చీఫ్ ఇంజినీర్ నువ్వు కూడా తన గుప్పిట్లో పెట్టుకొని అవినీతి పుట్ట గుట్టురట్టై నేటికి 100 రోజులు పూర్తి కావడం జరిగింది. అధికారులు మాత్రం ఏ ఈ కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టాడని వరుస కథనాలు వచ్చిన స్పందించకపోవడం చివరికి ప్రజలు ఏ ఈ కుంభకోణాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ కు ప్రత్యక్షంగా చూపెట్టడం

జరిగినప్పటికీ మండలంలో ఇప్పటికీ 87 కోట్లు సుమారు నిధులలో 16 కోట్ల రూపాయలను నాసిరకం బినామీ కాంట్రాక్టర్ కమిషన్ ఊబిలో నిధుల దుర్వినియోగం చేసి ఉన్నత అధికారులకు సైతం తల గుప్పిట్లో పెట్టుకొని నేటి వరకు చర్యలకు తావు ఇవ్వకుండా తను మాత్రం సెలవులను సెలబ్రేట్ చేసుకుంటూ కుంభకోణంలో కూరుకుపోయి ఉన్న పనులను ఇన్చార్జి ఏ ఈ ద్వారా సాక్షాలను తుడిచిపెట్టి కుట్రలు పన్నుతూ పనులను చేపట్టడం

జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోనే సంచలనంగా మారి ఉన్న ఏఈ లీలల విషయంలో విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోసిమెంట్ శాఖ ఓట్ల నిధులపై నిశ్శబ్దాన్ని పాటించడం కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ లు నిధుల కుంభకోణ విషయంలో జోక్యం చేసుకోకపోవడం ప్రజల సొమ్ము కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిన అధికారిని పంచాయతీరాజ్ శాఖ కావాలని కాపాడుతుందని చెప్పడానికి 100 రోజుల కథనాలు నేటికీ చర్యలు తీసుకోకపోవడమే ఒక సాక్ష్యంగా చెప్పవచ్చు.

అవినీతి పుట్ట గుట్టు రట్టుఅయి 100 రోజులు.

మండలంలో గ్రామాల అభివృద్ధి ప్రజలకు నాణ్యత మైన పనులను అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మండలానికి అందించిన కోట్ల రూపాల నిధుల్లో మండల పంచాయతీరాజ్ అధికారి ఏ ఈ రాజేందర్ రెడ్డి నాసిరకం పనులు బినామీ కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండానే వాటిపై లక్షల రూపాయల బిల్లులను రికార్డ్ చేసి కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని ఏ ఈ రాజేందర్ రెడ్డి అక్రమాల పుట్టను మార్చ్ 24వ తేదీ నుండి మండలంలో భారీ కోట్ల కుంభకోణం ప్రజల సొమ్ము ఏఈ రాజేందర్ రెడ్డి అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధుల జోలెలు నింపడం జరిగిందని వరుస కథనాలు నేటికి 100 రోజులు అవినీతి పుట్టలు బయట పెట్టడం జరిగింది. మొదట్లో పంచాయతీరాజ్ లో కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగిందని కథనాలు ప్రారంభించిన క్రమంలో రోజుకు ఒక బాధితుడు తిరపతి కి రావడం ఇప్పటికే వేళల్లో కమిషన్లు ఏవి అందజేశామని మొదట 30 వేల బాధితుడు మరో 20 వేల బాధితుడు అలాగే రెండున్నర లక్షల కమిషన్ అందించిన బాధితుడు తెర పైకి రావడం జరిగింది. అలాగే బినామీ కాంట్రాక్టర్ల పేరుతో టెండర్ కి పోవాల్సిన వర్కులను బిట్లు దాచేపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లకు మండలంలో పనులు అప్పగించడం పెద్ద మొత్తంలో వారి దగ్గర నుండి కమిషన్ తీసుకోవడం మండలంలోని గ్రామాల్లో అవసరం లేని చోట్ల పనులు చేపట్టి కమిషన్ కొరకు నిధుల దుర్వినియోగం చేయడం అలాగే పనులు చేయకుండానే పనులు చేసినట్లు రికార్డ్ చేసి లక్షల రూపాయలను ఏ ఈ రాజేందర్ రెడ్డి దోచుకోవడం జరిగింది. ఇలా మండలంలో కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించి మండల పరిషత్ అధికారి తో పాటు పంచాయతీరాజ్ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది. విధుల దుర్వినియోగానికి పాల్పడడం జరిగిందని అమో యొక్క ప్రజల సొమ్ము ఏ ఈ తో పాటు ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులకు పంచిపెట్టాడని వంద రోజులుగా వరుస కథనాలు బాధితులతో పాటు పలు సాక్షాలను సైతం ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నేటి వరకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఏ ఈ పై కన్నెత్తి చూడకుండా కుంభకోణానికి సంబంధించిన గుట్టు రట్టు అవుతున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సెలవులు నిరాకరించినప్పటికీ పంచాయతీ అధికారులు మండల పరిషత్ అధికారి కుమ్మక్కై ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతో సెలవులు మంజూరు చేసి సాగ పంపడం జరిగింది. కుంభకోణ కథనాలు బాధితులు తెరపైకి వచ్చిన వారం రోజుల్లోనే ఏ ఈ కు పది రోజుల సెలవులు మంజూరు చేయడం ఆ సెలవులు పొడిస్తూ 90 రోజులుగా మెడికల్ లీవ్ ఇవ్వడం ఏ ఈ తో పాటు అధికారులు కూడా మండలంలో కుంభకోణం వ్యవహారంలో పాత్రధారులే అని అర్థమవుతుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మహదేవ్పూర్ పంచాయతీ రాజ్ కుంభకోణంపై ప్రభుత్వం పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు నేటికీ స్పందించడం లేదు.

 

 *కమిషన్ మత్తులో డి ఈ, నుండి ఈ ఎన్ సి, అందుకే చర్యలకు నిరాకరణ.!?* 

 

ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలో నాలుగున్నర సంవత్సరాల నుండి కోట్ల రూపాయల నిధులను ఇటు కమిషన్ పేరుతో అటు బినామీ కాంట్రాక్టర్ల నాసిరకం పనుల నుండి కోట్ల రూపాయలను దండుకోవడంతోపాటు ఏ ఈ రాజేందర్ రెడ్డి పలు బినామీలకు పెట్టి సొంత డబ్బుతో వందల సంఖ్యలో అభివృద్ధి పనులను చేపట్టి కోట్ల రూపాయల డబ్బులను తన జెబుల్లోకి మళ్ళించుకోవడం జరిగింది. ఏ ఈ చేసిన కుంభకోణం కోట్ల రూపాయలు ఉండడం యావత్ రాష్ట్రమంతా మహాదేవపూర్ మండలం ఇసుక క్వారీల ద్వారా మండలానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందని బహిరంగంగా తెలిసి ఉన్నప్పటికీ ఇక ఏ ఈ వ్యవహారంలో నిధులు ఎక్కువగా ఉండడం అభివృద్ధి పనుల పేరిట పెద్ద మొత్తంలో కుంభకోణం చేయడానికి వీలుంటుందని ఇటు ఏ ఈ రాజేందర్ రెడ్డి జిల్లాస్థాయి అధికారుల నుండి ఈ ఎన్ సి వరకు మండలంలో నిధుల దుర్వినియోగంలో ముందస్తుగా తనపై ఏలాంటి విచారణలు చర్యలకు తానివ్వకుండా డి ఈ నుండి ఎస్సీ తో పాటు ఈ ఎన్ సి లకు తన కమిషన్ ఊబిలో దించి వారికి కూడా కుంభకోణ వ్యవహారంలో పాత్రధారులుగా చేర్చడం జరిగింది. ఎస్సీ మహదేవ్పూర్ మండల పర్యటన విషయంలో ఉన్నత అధికారులకు తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేయుటకు వెనుకడుగు వేయలేదు చివరికి సూపర్ చెక్ పేరుతో మండలాన్ని సందర్శించి నేటి ధాత్రి వివరణ కోరగా ఏ ఈ వ్యవహారం ఇంజనీరింగ్ చీఫ్ దృష్టిలో ఉందని విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పి నేటికీ 30 రోజులు పూర్తి అవుతుంది కానీ విచారణ మాత్రం జరగలేదు. అంటే కేవలం కుంభకోణ వ్యవహారాన్ని పక్కదారి పర్చించే క్రమంలోనే ఎస్ ఈ విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. ఏ ఈ రాజేందర్ రెడ్డి చేసిన కోట్ల కుంభకోణం లో డి ఈ తో పాటు ఈఎన్ సి వరకు కమిషన్ దండుకున్న వారు కనుక నేటికీ చర్యలకు నిరాకరించడం జరుగుతుందని అర్థమవుతుంది.

 

 

 *87 కోట్ల నిధుల్లో 16 కోట్లు అవినీతి అందుకే కుంభకోణం పై నిశ్శబ్దం.!?* 

 

మహదేవ్పూర్ మండల పంచాయతీరాజ్ ఏ ఈ రాజేందర్ రెడ్డి చేసిన కుంభకోణం వందలు వేల రూపాయల్లో కాదు కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం అని మండల పరిషత్ శాఖ నుండి పంచాయతీరాజ్ శాఖ వరకు నిధుల దుర్వినియోగానికి సంబంధించి అందరూ కమిషన్ ఊబిలో పడి కుంభకోణంలో పాత్రధారులేలని అందుకే నీటి వరకు అధికారులు రాజేందర్ రెడ్డి మహదేవ్పూర్ పంచాయతీరాజ్ అభివృద్ధి నిధుల కుంభకోణంపై నిశ్శబ్దాన్ని అందుకే వహిస్తున్నారని అర్థం అవుతుంది. ప్రభుత్వం మండలంలో గోదావరి పరివాహక ప్రాంతం నుండి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కొరకు ఇసుక తరలింపు కొరకు 2016 నుండి ఇసుక క్వారీలను ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఈ రాజేందర్ రెడ్డి 2018 జూన్ నెలలో మండలానికి పంచాయతీరాజ్ ఏఈ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నాటి నుండి నేటి వరకు మండలానికి సుమారు 87 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. భారీగా మండలంలో నిధులు ఉండడం రాజేందర్ రెడ్డి తో పాటు మండల పరిషత్ అధికారి ప్రజా ప్రతినిధులు నిధులు పోతే మళ్ళీ రావని ఉన్న నిధులగును ఎలాగైతేనేమి తమ జీబుల్లోకి మళ్లించుకోవాలని ఒక దుర ఆలోచనలు శ్రీకారం చుట్టి ప్రధాన పాత్రధారునిగా దుర్వినియోగ సంఘం అధ్యక్షునిగా రాజేందర్ రెడ్డిని ఎన్నుకొని నిధుల దుర్వినియోగాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 16 నుండి 21 కోట్ల రూపాయల నిధులను నాసిరకం బినామీ కాంట్రాక్టర్లు పనులు చేపట్టకుండానే బిల్లులను రికార్డు చేయడం లాంటి పనుల పేరుతో దుర్వినియోగానికి పాల్పడం జరిగింది. దుర్వినియోగానికి పాల్పడ్డ పెద్ద మొత్తంలో నిధులు ఉండడంతో ఇప్పటికే పలు జిల్లా స్థాయి అధికారులకు అలాగే ప్రజా ప్రతినిధులకు భారీగా దుర్వినియోగ సొమ్ము మళ్లించి ఉండడం నేడు కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడం జరిగిందని సాక్షాలు బాధితులు న్యాయస్థానాల నోటీసులను సైతం లెక్కచేయకుండా చర్యలకు మాత్రం నిశ్శబ్దాన్ని వహించడం జరుగుతుంది.

 

 

 *ప్రజలు అవినీతిని బయటపెట్టిన పంచాయితీ రాజ్ ఉన్నత అధికారుల నిశ్శబ్దం,.? అవినీతి లో కూరుకుపోయిన పనులను ఇంచార్జ్ ఏ ఈ ఆధ్వర్యంలో ప్రారంభం.* 

 

మండలంలో కోట్ల రూపాయల కుంభకోణం జిల్లా అధికారులు కమిషన్ ఊబిలో కూర్కపోయి ఉన్నత అధికారులకు తప్పుదారి పట్టించే క్రమంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోకుండా నేటి వరకు నిశ్శబ్దాన్ని వహిస్తూ సాగించడం జరుగుతుంది.మండలంలోని సూరారం గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి మురికి మరియు వర్షపు నీరును గ్రామంలోని చెరువులోకి పంపించుటకు ఆరు పైప్ లైన్ లను అమర్చి పనిని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.నాలుగు పైప్ లైన్లను అమర్చించాల్సి ఉండగా కేవలం 3 లైన్లను మాత్రమే అమర్చి నాలుగవ లైన్ అమర్చకుండానే పని పూర్తి చేసినట్లు రికార్డులు నమోదు చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలను దండుకోవడం జరిగింది. పనిచేయకుండానే ఏ ఈ రాజేందర్ రెడ్డి బిల్లును రికార్డు చేయడం వాటికి సంబంధించిన డబ్బులను తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు ఏఈ అక్రమాలపై మూడు నెలలుగా వరుస కథనాలకు వారిలో మార్పులు తీసుకువచ్చిందని పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహించడంతోనే తమ సొమ్మును తామే కాపాడుకుంటాం అన్నట్టుగా పంచాయతీరాజ్ అవినీతి తిమింగళం చేసిన అక్రమాలను ఇక తామే బట్టబయలు చేస్తామని మండల ప్రజల్లో సంకల్పంగా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు.

తాజాగా మండలంలో కుంభకోణానికి శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులకు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సాక్షాలు ఉండకుండా చేసే ప్రయత్నం ఏ ఈ రాజేందర్ రెడ్డి డి ఈ సాయిలు మూడు నెలలుగా ఆగి ఉండి శిథిలావస్థకు చేరి ఉన్న పనులను తిరిగి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ తో పరులను గొట్టుశప్పుడు కాకుండా ప్రారంభించడం జరుగుతుంది. తాజాగా మండల కేంద్రంలోని 24 లక్షల రూపాయలతో టెండర్ ఫార్మింగ్ కు పోవాల్సిన రహదారి బిట్లుగా ఏర్పాటు చేసి బినామీ కాంట్రాక్టర్కు అందించడం జరిగింది. నాసిరకం పనులతో బిట్ల చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని ప్రచురించడంతో కుంభకోణం లో చేపట్టిన పనులు ఆగిపోవడం జరిగింది. తిరిగి ఆ పనులను ఉన్నత అధికారులు ఎవరూ కూడా ఏఈని ఏమి చేయలేరని ముందు గాని డి ఈ ప్రచారం చేసుకోవడం తాజాగా ఏఈ తనకు ఏమీ కాదు ఉన్నతాధికారులు కూడా నా గుప్పిట్లో ఉన్నారని బినామీలకు చెప్పుకోవడం ఇన్చార్జి ఏఈగా ఉన్న రవీందర్ ను తన విధి నిర్వహణలో భాగంగా అని చెప్పుకుంటూ ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల అండలతో రహదారి నిర్మాణాలను గుట్టు చప్పుడు కాకుండా నాసిరకం అయినప్పటికీ పనులు వేగం పెంచి పనులు కొనసాగించడం జరుగుతుంది. తక్షణమే ఉన్నత అధికారులు మండలంలో అవినీతికి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పనులను విజిలెన్స్ విచారణ జరిగేంతవరకు నిలిపివేయాలని ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని రవీందర్ స్థానంలో మరి ఇతర ఏఈ ని నియమించాలని అప్పుడే మండలంలో అభివృద్ధి పనులు నాణ్యతతో సజావుగా సాగుతాయని మండల ప్రజలు కోరడం జరుగుతుంది.

 

 

 *విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోర్స్మెంట్ కోట్ల నిధులపై మౌనం ఎందుకు, కమిషనర్ ,ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎక్కడ!?* 

 

 

మండలంలో భారీ నిధుల కుంభకోణం ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ తో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో నేడు ఒక సంచలనాన్ని సృష్టించిన మహదేవ్పూర్ మండలం పంచాయతీ రాజ్ ఏ ఈ రాజేందర్ రెడ్డి కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగ విషయం మారుమోగుతున్నప్పటికీ మండలం నుండి జిల్లా స్థాయి అధికారులతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ వరకు అధికారుల చిట్టా అంతా నా దగ్గర ఉందని నాకు ఏమీ కాదని నాతో పాటు అందరూ వస్తారని పరోక్షంగా ఏ ఈ రాజేందర్ రెడ్డి బినామీలకు చెప్పుకోవడం సంచలనాన్ని సృష్టించి ఉన్నప్పటికీ కోట్ల రూపాయల కుంభకోణ విషయంలో 100 రోజుల నుండి సాక్షాలు స్వయానా ప్రజలే అవినీతి భాగవతాన్ని జిల్లా కలెక్టర్ కు అవినీతి కప్పిపుచ్చే ప్రయత్నాన్ని చేడాన్ని చూపించడం జరిగింది. రాష్ట్రంలో ఒక సంచలనాత్మక చిన్న మండలమైనప్పటికీ కోట్ల రూపాయల అవినీతి కి పాల్పడడం ఒక మండల స్థాయి ఏఈ పంచాయతీరాజ్ శాఖ ను ఏలుతున్నాడు అంటే అవినీతి సొమ్ము ఎంతవరకు చల్లాడు అనేది అర్థమవుతుంది. ఇంత జరుగుతున్న ఒకప్పటికి విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోర్స్మెంట్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా నేటి వరకు మౌనాన్ని వీడకుండా ఉంది అంటే సాధారణ ప్రజలు ఏమనుకోవాలో చివరికి అన్యాయాలను వెలికి తీసే శాఖ నోటి నుండి మాటలు చేతులు ముడుసుకొని అమాయక ప్రజల సొమ్ము కాజేసీ జల్సాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు ఎందుకు అనే ప్రశ్న మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. మరి విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫెర్స్మెంట్ ఎందుకు నిశ్శబ్దాన్ని బహికస్తరిస్తున్నారు భారీ కోట్ల కుంభకోణం పై విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదు క్వాలిటీ కంట్రోల్ ఇన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ శాఖలను సైతం రాజేందర్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నాడా అని అనుమానాలు కూడా వ్యక్తం కాక తప్పడం లేదు. మరో విచిత్రవేమిటంటే వంద రోజులు కోట్ల కుంభకోణం గుట్టును రట్టు చేస్తూ పేద ప్రజల సొమ్మును తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మండల పరిషత్ నుండి ఈఎన్సి వరకు విచారణ చేపట్టి వారిపై చర్యల కొరకు తన అక్షర పోరాటాన్ని సాధిస్తున్న క్రమంలో సామాజిక మద్యం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ లకు మూడు నెలలుగా కుంభకోణ వ్యవహారానికి సంబంధించిన కథనాలను అందిస్తున్న క్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ కమిషనర్లు స్పందించకపోవడం అసలు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలో ఉన్నత అధికారులు ఉన్నారా ఉంటే ఎక్కడ మరి చర్యలు ఏవి అని ప్రజలు ప్రశ్నించే దుస్థితికి దారితీసింది.

మోడి ముచ్చట చప్పగా! కేసిఆర్ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా?

రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా?

లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా?

ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా?

ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా?

పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు?

ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు?

జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు?

ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు?

చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట యోధులు…ప్రపంచ చరిత్రలోనే యాభై ఏళ్లలో రెండు సార్లు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమ పోరాటం ఘనత తెలంగాణ సమాజానికిది…అందుకే నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్న సుమతీ శతక పద్యం ప్రధానమంత్రి మోడీకి తెలిసినట్లుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇబ్బందే అనుకున్నారో ఎమో? ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదనుకున్నారో ఏమోగాని, తనదైన శైలిలో ఘాటు టేకుండా మాట్లాకుండానే వెళ్లిపోయారు..? ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడినా తెలంగాణకు ఏమిచ్చామన్నదానిని సైతం క్లారిటీగా చెప్పలేకపోయారు. ఏం చెప్పినా ఇబ్బందే అనుకున్నట్లున్నారు. తెలంగాణ ప్రజలు ముందు అబద్దాలాడితే నమ్మరనుకున్నట్లున్నారు. ఎక్కడ బావ అయినా వంగతోట కాదనట్లు ఎక్కడికెళ్లి ఏది చెప్పినా విన్న జనం వేరు. తెలంగాణ ప్రజలు వేరు అన్నది మోడీకి బాగా తెలిసినట్లుంది. అందుకే చెప్పడానికి నిజాలేమీ లేక, అబద్దాలు చెప్పడానికి నోరు రాక, చెప్పాలన్నా, ఏమీ లేక ఉత్త చేతులు ఊపితే చాలనుకున్నారు. 

వంగీ వంగీ దండాలు పెట్టి, నోటితో చెప్పలేని క్షమాపణలు చేతులు ఊపడం ద్వారా అర్ధం చేసుకొమ్మని చెప్పినట్లు చేశారు. ఇంతకీ ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోడీ చెప్పిన మాటలు వింటే విచిత్రమనిపిస్తాయి. తెలంగాణలో 2015లో పునర్‌ప్రారంభపనులు మొదలైన రామగుండం ఎరువుల ప్యాక్టరీ ఏడేళ్లు గడిచినా, ఇంకా పునరుద్దరణ పనులే జరుగుతున్నాయిని స్వయంగా ప్రధాని మోడీ ఒప్పుకున్నట్లైంది. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి వుంటే ఒక ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి ఏడేళ్లు పడుతుందా? అయినా ఇంకా అది పూర్తయినట్లుగాని, త్వరలో ప్రారంభిస్తామని కాని చెప్పలేదు. పనులు జరుగుతున్నాయన్న మాటలు మాత్రమే చెప్పారు. అంటే తమ అశక్తిని, చిత్తశుద్ది లేమిని బైటపెట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఏడేళ్ల కాలంలో 115 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పూర్తి చేశామన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రోజుకు కనీసం 10 నుంచి పదిహేను కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కాని తెలంగాణలో ఏడేళ్లుగా పూర్తి చేసింది కేవలం 115 కిలో మీటర్లు మాత్రమే అని స్వయంగా ప్రధాని చెప్పారు. ఏడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే ఎంత పూర్తయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణకు ఇస్తామన్న కాజిపేట రైల్లే కోచ్‌ ఫ్యాక్టరీనే గురజాత్‌కు తరలించుకుపోయిన వారు, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించడం కూడా అవివేకమే అవుతుంది. 1853 ఎప్రిల్‌ 13 ఇండియాలో తొలి రైలు బొంబాయి నుంచి ధానేకు నడిచింది. ఆ తర్వాత యుద్ద ప్రాతిపదికన రైల్వే వ్యవస్ధను నిర్మాణం చేశారు. దేశమంతా రైల్వే లైన్‌ పూర్తి కావడానికి ఈ లెక్కన పూర్తి కావాలంటే ఎంత సమయం అయివుండాలి? కాని 1873లో తెలంగాణలో కూడా పూర్తి స్ధాయి రైల్వే లైన్‌ పూర్తయింది. 

ఇక తమిళనాడు, నాటి ఆంధ్రప్రదేశ్‌ లో అప్పటికే రైల్లే పనులు పూర్తయ్యాయి. ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు. మిషనరీ సరఫరా లేదు. కేవలం మ్యాన్‌ పవర్‌ మాత్రమే. పైగా రైలు పట్టాలకింద వాడేది కలప. దేవదారు వృక్షాలు తెచ్చి, నూనెలో నానబెట్టి, కొనేళ్ల తర్వాత వాటిని ఎండబెట్టి, ఇలా ఎంతో కాలం పట్టేది. అలాంటిది దేశంలో 1957లో ప్రారంభమైన తిరుబాటు కాలానికే దేశంలో అనేక ప్రాంతాలకు రైల్వే లైన్‌ ఏర్పాటు చేయబడిరది. ఒక వేళ బ్రిటీష్‌ కాలంలో ఇలా ఏళ్ల తరబడి వంద కిలోమీటర్లు పూర్తి చేసి వుంటే ఇప్పటికీ మన దేశంలో సగం కాదు కదా…పావు వంతు రైల్లే లైన్‌ కూడా పూర్తి కాకపోయేది. కేవలం 115 కిలోమీటర్ల రైలు మార్గం గురించి ఒక ప్రదాని మోడీ చెప్పడం విడ్డూరం. దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ ఇచ్చామని, రేషన్‌ ఇచ్చామని దేశమంతా ఇదే చెప్పుకుంటూ పోయి, పబ్బం గడపడం తప్ప మరేమైనా వుందా? ఉప్పల్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ ఒక్కటిచ్చి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. దేశంలో హైవేల నిర్మాణం జరుగుతున్న దశలో భాగాంగానే తెలంగాణకు కూడ రోడ్లు వచ్చాయి. అయినా వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటూనే, టోల్‌ వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోతుందో కూడా ప్రధానిచెప్పి వుంటే బాగుండేది…కాని ఆ పని చేయలేదు…ప్రసంగం అంత గొప్పగాసాగలేదు. కాని అంతకు ముందు మాట్లాడిన బిజేపి నాయకులు ఆకాశంలో సంచరించినంత పనిచేశారు. ఆ నాయకులే అంత మాట్లాడితే ఇక మోడీ ఎంత మాట్లాడతారో అని అందరూ అనుకున్నారు. అందరి ఊహలు తలకిందులు చేసినట్లు మోడీ ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహ పరిచే రీతిలో సాగించారే గాని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు తీయడానికి కూడా ప్రధాని మోడీ సాహసించలేదనే చెప్పాలి. 

ఇక ముఖ్యమంత్రి కేసిఆర్‌ విషయానికి వస్తే ఈసారి ఆయన తనదైన శైలిలో ప్రధాని మోడీ హైదరాబాద్‌లో వుండగానే ప్రశ్నల జడివాన కురిపించారు. ఇంత కాలం మోడీ వస్తున్నాడనగానే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాడంటూ బిజేపి చేసిన పసలేని విమర్శలకు ధీటైన సమాధానం చెప్పారు. ఫెడరల్‌ స్పూర్తిలో ఎవరి స్ధానం ఎలా వు ండాలో బిజేపికి గుణపాఠం చెప్పినంత పనిచేశారు. సరిగ్గా బిజేపి కార్యవర్గ సమావేశాల కాలంలోనే రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత సిన్హా కార్యక్రమం టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్‌ కాషాయ మయం ఏనాడు కాలేదని నిరూపించడానికి మొత్తం గులాబి మయం చేశారు. బిజేపికి స్ధానం లేదని తెలపడానికి ఎక్కడా హోర్డింగ్‌ కూడా పెట్టుకోలేనంత స్పేస్‌ కూడా మిగల్చలేదు. ఇదిలా వుంటే మోడీ ఎక్కడో వుంటే, ఎక్కడో కాదు…మోదీ హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలిసే బైబై అంటూ ప్రచారం సాగించారు. ఇంతకన్నా మోడీని కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడని చెప్పడానికి మరొక సంకేతం లేదు. అంతే కాదు మోడీ అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఏ ఒక్క క్షణం కూడా భయం లేదని చెప్పడానికి కూడా ఇదే నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ఇక ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ జలవిహార్‌లో చేసిన ప్రసంగం దేశమంతా చూసింది. ప్రధాని మోడీని దేశంలోని ఏ నాయకుడు పట్టనంత తూర్పార పట్టిండు. ప్రపంచంతో మనం ఎందుకు పోటీ పడ లేకపోతున్నామో…బిజేపి చేస్తున్న మోసమేమిటో అన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ లోపాలను ఒక్కొక్కటి ఉల్లిగడ్డ మీద పొట్టు ఒలిచినట్లు ఒలిచి వివరించారు. సంపద సృష్టి లేకుండాపోగా, ఉన్న సందనను కేంద్ర ఎలా అమ్ముతున్నారో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయదంటూనే, వ్యాపారులకు సేల్స్‌ మెన్‌గా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నాడని సూటిగా విమర్శించారు. మేకిన్‌ ఇండియా అంటూ గొప్పలు తప్ప చేసిందేమీ లేదన్నారు. పైగా దేశంలో వున్న పరిశ్రమలు కూడా పారిపోయేలా చేస్తున్నాడని గతంలో మన దేశంలో వున్న కార్ల కంపనీల పేర్లు చదవుతూ అవి తరలిపోయిన విషయం గుర్తు చేశారు. ఒక మార్గదర్శకుడిగా, శాంతి కామకుడిగా ప్రపంచమంతా మన జాతి పిత మహాత్మాగాంధీని కొనియాడుతుంటే, కేంద్ర పెద్దలు మాత్రం ఎలా అవమానిస్తున్నారో వివరించాడు. ఏ ఒక్క విషయాన్ని వదలకుండా, నరేంద్ర మోడీపై ప్రశ్నల రూపంలో నిప్పులు కురిపించారు. ఆయన పరువు మొత్తం గంగలో కలిపారు. ఒక్కొక్క మాట ఒక రాకెట్‌లాగా వదిలారు. మతం పేరుతో బిజేపి చేస్తున్న దారుణాలను ఏకరువు పెట్టారు. మత రాజకీయాలతో దేశంలో ఎలా ప్రజల జీవితాలను బిజేపి నాయకులు అస్తవ్యస్థం చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే గంటకు పైగా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. నిలబెట్టి కడిగేశారు…తనేంటో చూపించారు. తాను వ్యతిరేకించడం మొదలు పెడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని నిరూపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పతనం చేయాలని చూస్తున్న బిజేపిని కేంద్రంలో కూల్చడం ఖాయమని సవాలు చేశారు. తనదైన శైలిలో బెబ్బులిని మరిపించినంత పనిచేశారు… కేసిఆర్‌ రాజకీయ గర్జన ఎలా వుంటుందో రుచి చూపించారు.

ఉప్పల్ లో గు’లాబీ’ కింద ముల్లు?

 

బేతి వెనకాల బొంతు తీస్తున్న గోతులు?

సొంత పార్టీకే వెన్నుపోట్లు?

పార్టీ బలంగా వున్న చోట లుకలుకలు?

 

కారు జోరుకు వేస్తున్న బ్రేకులు?

సజావుగా సాగాల్సిన చోట సృష్టించుకుంటున్న సమస్యలు?

బేతిని బద్నాం చేస్తూ, టిక్కెట్టుపై బొంతు ఆశలు?

ఎదరులేని చోట తిరుగులేని కారుకు తూట్లు?

ప్రతి పక్షాలకు అనుకూలం కానున్న నాయకుల తీరు?

ఏం జరుగుతుందో అని కలవరపడుతున్న కార్యకర్తలు?

ఎటు వైపు నిలబడాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు?

బలం లేని చోట బలం పెంచుకునేందుకు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పార్టీ బలంగా వుంటే చాలు మనం బలంగా వున్నట్లే అనుకోవాలి. అంతే కాని బలంగా వున్న చోట పార్టీని బలహీనపర్చే పనులు కూడ చేయొచ్చని అక్కడక్కడ టిఆర్‌ఎస్‌ నాయకులే నిరూపిస్తున్నారనడంలో సందేహం లేదు. అలాంటి నియోజకవర్గాలలో ఉప్పల్‌ ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోట. ఎన్నికలు ఏవైనా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిఆర్‌ఎస్‌ తప్ప మరొక పార్టీకి విజయావకాశాలు లేని నియోజకవర్గం. అలా పార్టీ వేళ్లూనుకోవడానికి నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చేసిన కృషి సామాన్యమైంది కాదు. జై తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలు పెట్టి జెండా ఎత్తుకున్న నాడు ఉప్పల్‌లో గులాబి జెండాకు జై కొట్టింది బేతి సుభాష్‌రెడ్డి. గులాబీ జెండాను మోసిన నాయకుడు బేతి సుభాష్‌రెడ్డి. అప్పటి రాజకీయ పరిస్ధితులను సైతం ఎదిరించుకంటూ, జై తెలంగాణ నినాదం చేశాడు. జెండా పట్టుకొని వీది వీధి తిరిగారు. ప్రజలను చైతన్యం చేశారు. 2004 ఎన్నికల వరకు ఉప్పల్‌లో తెలుగుదేశం పార్టీదే హవా…ఆ తర్వాత కాంగ్రెస్‌…వామపక్షాలు బలంగా వుండేవి. 2001లో టిఆర్‌ఎస్‌ పురుడుపోసుకున్నప్పటి నుంచి బేతిసుభాష్‌రెడ్డి ఎత్తిన జెండాను, ఎత్తిన పిడికిలి దించలేదు. పార్టీని పెంచారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాడు. 

2014 ఎన్నికల్లో కూడా బిజేపి తెలుగుదేశం కూటమి మూలంగా కారు గెలుపు చేజారిందే గాని, ఆ ఎన్నికల్లో కూడా బేతి సుభాష్‌ రెడ్డి గెలిచేవారు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తిరిగి 2018 టిక్కెట్‌ తెచ్చుకొని, ఎన్నికల్లో గెలిచి నిలిచారు. తన సుధీర్ఘ ప్రస్ధానాన్ని ప్రజలు గుర్తించేలా చేసుకున్నారు. 2001 నుంచి, 2009 డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రకటన వచ్చేవరకు కూడా హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ బలంగా లేదు. కాని నగర శివారు ప్రాంతాలుగా వున్న ఉప్పల్‌ లాంటి ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ బలంగానే వుంది. అందుకు ఆది నుంచి జెండాలు మోసిన వారి కృషి కూడా కారణం. అలాంటి ఉప్పల్‌ టిఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. 2014 ఎన్నికల సమయంలో తన రాజకీయ జీవితం ఏమిటో…తన ప్రస్ధానమేమిటో కూడా తెలియని బొంతు రామ్మోహన్‌ , జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కార్పోరేటర్‌గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మంత్రి కేటిఆర్‌ చొరవ మూలంగా మేయర్‌ పదవి బొంతు రామ్మోహన్‌కు కట్టబెట్టారు. ఐదేళ్లపాటు జిహెచ్‌ఎంసి మేయర్‌గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో బొంతు రామ్మోహన్‌ ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని ఉబలాటపడ్డాడు. 2001 నుంచి పార్టీ పట్టుకొని, నాయకులను వేలు పట్టుకొని నడిపించుకుంటూ, ఉద్యమాలు చేసుకుంటూ, పోరాటాలలో ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ సాగిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని టిక్కెట్టు ఇవ్వాలని బొంతు రామ్మోహన్‌ పట్టుపట్డాడు. 

ఒక దశలో సెల్‌ ఫోన్‌ ఆఫ్‌ చేసుకొని అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. తర్వాత మంత్రి కేటిఆర్‌ భుజ్జగింపులతో తన ఆలోచన ఉపసంహరించుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో బేతి సుభాష్‌రెడ్డికి మనస్పూర్తిగా పనిచేయలన్నది జగమెరిగిన సత్యమే అని పార్టీ నాయకులే అంటున్నారు. ఎప్పుడైతే తనకు టిక్కెట్‌ దక్కలేదో అప్పటినుంచి బొంతు రామ్మోహన్‌ కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొంటూ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో రికార్డు స్ధాయిలో వర్షాలు కురిశాయి. జన జీవనం అస్ధవ్యస్ధమైన సందర్భం చూసిందే…అలాంటి సమయంలో కాలన్నీల్లో నీరు చేరడం, అవి ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది. కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భందనంలో చిక్కుకున్నవి. ఆ సమయంలో ఎమ్మెల్యే బేతి సుబాష్‌రెడ్డి ఎంతో చొరవతో, ప్రజలకు అండగా వుండే ప్రయత్నం చేశారు. ఆదుకునే ప్రయత్నం చేశారు. కాలనీలలో బోట్లు వేసుకొని మరీ తిరిగారు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశారు. ఆ నీళల్లో ఎలాంటి విష పురుగులైనా వుండొచ్చు. అయినా ఆయన వెరవలేదు. ప్రజలు ముఖ్యమనుకున్నాడు. బోట్లు వేసుకొని, అధికారులను వెంట బెట్టుకొని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు క్షేత్ర స్ధాయి పర్యటనలు చేశారు. 

ఇలాంటి సందర్భాలను ఎవరైనా సహజంగా ప్రశంసించాలి. కాని సహాయం చేసేందుకు ముందుకొచ్చిన బేతిని అభాసుపాలు చేయడానికి ఇది కూడా అదునే అనుకొని రాజకీయం చేశారు. సహజంగా అలాంటి సమయంలో ప్రజలనుంచి కొంత వ్యతిరేకత ఎదురౌతుంది. అయినా బేతి సుభాష్‌రెడ్డి ప్రజల్లోనే వున్నాడు. వారికి సహాయ సహకారాలు అందించాడు. మరి ఆ సమయంలో బొంతు రామ్మోహన్‌ ఎక్కడున్నాడన్నదానిపై కూడా పెద్ద చర్చే జరిగింది. అప్పార్టుమెంట్లులోని మహిళలు మాట్లాడిన మాటలను పెద్దఎత్తున వైరల్‌ చేసిందెవరో తెలిసిందే..? అలా ఎమ్మెల్యేను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చిన సంగతి చూసిందే. ఇదిలా వుంటే బొంతు రామ్మోహన్‌ సతీమణి కార్పోరేటర్‌ శ్రీదేవి సైతం అడుగడుగునా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే వస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. 

ఇక తాజాగా ఈసారి ఉప్పల్‌ టిక్కెట్టు నాదే అంటూ, తనకు పార్టీనుంచి ఆదేశాలు అందాయంటూ ప్రచారం చేసుకుంటూ ఉప్పల్‌ నాయకులను, కార్యకర్తలను బొంతు రామ్మోషన్‌ గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ. గత కార్పోరేటర్లను ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి ఎంత ప్రోత్సహించినా, వారిలో కొందరికి ఎమ్మెల్యే మీద కొంత అసంతృప్తి వుంది. దాన్ని ఆసరాగా చేసుకొని వారితో ఉప్పల్‌ రాజకీయంలో బొంతు వేలు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఏ ఎన్నిక కనిపించినా వాటిని గురించి ఆశించడం బొంతు రామ్మోహన్‌కు బాగా అలవాటైందని కూడా పార్టీలో చెప్పుకుంటున్నారు. మొదట ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించాడు. కాని నెరవేరలేదు. దాంతో ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్నాడు. అదీ కుదరలేదు. ఇక జిల్లాల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుల పదవులు పంపకాలు జరిగాయి. అప్పుడు కూడా మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష పదవి ఆశించాడు. అక్కడా ఆశ నెరవేరలేదు. మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడై అక్కడినుంచే పోటీ చేస్తే ఎలా వుంటుందన్న దానిపై కొంత కాలం కసరత్తు చేశాడు. కాని కుదలేదు. ఇక మళ్లీ ఉప్పల్‌ మీద పడ్డాడు. ప్రతిపక్షాలను ఏగేస్తూ కూడా రాజకీయం చేస్తున్నాడని పార్టీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారట. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేసే స్ధాయిలో వుండి, బొంతు రామ్మోహన్‌ పార్టీని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదంటున్నారు. దక్కితే టిక్కెట్టు తనకే దక్కాలి…లేకుంటే బేతికి దక్కకూదడదు…దక్కినా గెలవకూడదన్నంత ధోరణిలో బొంతు రామ్మోహన్‌ రాజకీయాలు చేస్తున్నాడని సమాచారం. ఉప్పల్‌లో ఇలా బొంతు రామ్మోహన్‌ చర్యల మూలంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ప్రతిపక్షాలకు బలం చేకూరే పరిస్ధితి లేకుండా పోదు…? ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వెంటనే స్పందించకపోతే, పార్టీకి తీవ్రనష్టం తప్పదంటున్నారు.

యశ్వంత్ సిన్హా కు ఎంపీ రవిచంద్ర స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలువురు మంత్రులు, ఎంపీలు సిన్హా కు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయనను నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. అనంతరం అక్కడ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా భోజన విరామ సమయంలో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయాల గురించి చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ రవిచంద్ర కూడా పాల్గొన్నారు.

మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?

ఏ,ఈ, రాజేందర్ రెడ్డి లీలలు.

ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!

రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.

ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?

మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?

అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి. 

మహాదేవపూర్-నేటిధాత్రి:-

పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ మండలంలోని పంచాయతీరాజ్ శాఖ నిధుల దుర్వినియోగానికి ఒక అడ్డగా మారి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జీబుల్లోకి మళ్లించుకోవడం జరిగింది.

నిధుల దుర్వినియోగ వ్యవహారంలో ఇప్పటికే 97 రోజుల నుండి 20వేల నుండి రెండున్నర లక్షల రూపాయల వరకు కమిషన్ పేరుతో బాధితులకు పీడించడం జరిగిందని బాధితులు మీడియా ముందుకు రావడం జరిగింది మరోపక్క తాజాగా పని చేపట్టకుండానే 1,38,000 బిల్లును రికార్డ్ చేయడం వాటికి సంబంధించిన చెక్కును విత్ డ్రా చేసుకొని నిధులను తీసుకోవడం జరిగింది. ఇక నాసిరక పనులకు సంబంధించి మండలంలో ఇప్పటికే వందల నాసిరకం పనులు చేపట్టి ఉన్నాయని సాక్షాలు సైతం ప్రజల ముందుకు పెట్టడం జరిగింది ఇక సాక్షాలు తారుమారు చేసే క్రమంలో మూడు నెలలుగా ఆగి ఉండి శిథిల అవస్థకు వచ్చిన పనులు పలు రహదారులు కాంకేర లేకుండానే ఉన్నప్పటికీ వాటిపై పాల్ తీన్మార్చి నిధుల దుర్వినియోగానికి సాక్షాలు ఉండకూడదని గుట్టు చప్పుడు కాకుండా పనులను సాగించడం జరుగుతుంది. గా ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణంలో  పాత్రధారుని తను ఒక్కడే కాదని ఉన్నత అధికారుల కు సైతం వీళ్ళ తరబడి పోషిస్తున్నానని తనకు ఏమీ కాదని బినామీలతో చెప్పుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

 *మహాదేవపూర్ పంచాయతీరాజ్ శాఖ అవినీతికి అడ్డా.!?* 

 

ప్రభుత్వ నిధులు దుర్వినియోగంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మండలాల్లో అవినీతికి అడ్డా అంటే మహదేవ్పూర్ పంచాయతీరాజ్ శాఖ అని కోట్ల కుంభకోణం వ్యవహారాన్ని శ్రీకారం చుట్టిన అధికారి రాజేందర్ రెడ్డి పై నేటి వరకు చర్యలు తీసుకోలేదంటే అవినీతి సొమ్ములు ఇప్పటికీ ఏరులై పారేలా చేయడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ శాఖ అవినీతి విషయానికొస్తే మండలంలో ఇప్పటివరకు ఏ ఈ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు సెంట్రల్ లైట్ డ్రైనేజ్ నూతన భవనాలు భవనాల మరమ్మతు ఇలాంటి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే పెద్ద మొత్తంలో పనులు అందించడం జరిగింది. విధాబీల ద్వారా లక్షల రూపాయల కమిషన్ కొరకు పలు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో మండలానికి వచ్చిన బినామీ కాంట్రాక్టర్లు పదుల సంఖ్యలో పనులు చేపట్టుకోవడం కేవలం ఇతర చిన్న కాంట్రాక్టర్లు అందించని కమిషన్ను పది పర్సెంట్ మోతాదులో అందించడం అందుకే బినామీ కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడం జరిగింది. అలాగే మరో పక్క బినామీల పేరుతో అమాయక కాంట్రాక్టర్లకు ఇబ్బందులకు గురి చేస్తూ ఏ ఈ రాజేందర్ రెడ్డి పెట్టుబడి పెట్టి బినామీల పేరుతో వందల పనులను ఇప్పటికే పూర్తి చేయడం వాటికి సంబంధించిన బిల్లులను కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా ఎక్కువ కమిషన్ వస్తుందని యావత్ మండలంలో అవసరం లేనప్పటికీ 500 సెంట్రల్ లైట్లు 65 వేల రూపాయల కమిషన్ తీసుకొని విచ్చలవిడిగా బిల్లులను రికార్డు చేయడం జరిగింది. ఇలా పంచాయతీరాజ్ పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి ఏ ఈ రాజేందర్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల కోట్ల నిధులను అభివృద్ధి పనులు పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది.

 

 *ఏ ఈ రాజేందర్ రెడ్డి వద్దే అందరి  చిట్టా, సంవత్సరాలుగా మేపుతున్న నాకు ఏమీ కాదు,!* 

 

మండలంలో భారీ కోట్ల కుంభకోణ వ్యవహారంలో నేడు సెలవులు ఉన్నప్పటికీ తన అధికారం తన అరాచకాన్ని మాత్రం వీడే ప్రసక్తి లేదంటూ మరింత రెచ్చిపోయి వాస్తవాలను బినామీ లకు చెప్పడం సన్ మండలమంతా సంచలనాన్ని సృష్టిస్తుంది. నేడు మండలంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారంపై సత్వర చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఏఈ రాజేందర్ రెడ్డి విధాబీలకు చెప్పుకుంటున్న వాస్తవాలను విని ప్రజల్లో పంచాయతీరాజ్ శాఖ తో పాటు జిల్లా మరియు ఉన్నత అధికారులపై విరక్తిని కలిగించే విధంగా ఏ ఈ చెప్పుకున్న మాటలు ఉన్నాయి. పలు వినమీలకు రాజేందర్ రెడ్డి తను మండలంలో నాలుగున్నర సంవత్సరాలుగా కమిషన్ వ్యవహారం కాంట్రాక్టర్ లతో చేపట్టిన పనులకు సంబంధించి వచ్చిన లక్షల రూపాయలను తను ఒక్కడే తీసుకోలేదని మండలంలోని అధికారులతో పాటు ఉన్నత అధికారుల వరకు పంపించడం జరిగిందని చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంతే కాకుండా ఇప్పటికీ తను నిధుల దుర్వినియోగం లో చేసిన పనులకు సంబంధించిన డబ్బులను నాలుగున్నర సంవత్సరాల నుండి ఉన్నత అధికారుల వరకు పోషించుతున్నానని తనపై చర్యలకు అధికారులు ఆదేశిస్తే నాతో పాటు వారు కూడా దోషులు గాని నిలుస్తారని బినామీలకు చెప్పడం జరిగిందని మండలమంతా చర్చించుకుంటున్నారు. అలాగే రాజేందర్ రెడ్డి బినామీలకు మరింత భరోసాను కల్పిస్తూ మీరెవరు తొందర పడాల్సిన అవసరం లేదని నాపై ఏ అధికారి కూడా షరియకు ఆదేశించాడని మీరు చూస్తున్నారు కదా మూడు నెలలుగా నాపై వరుస కథనాలు వచ్చినప్పటికీ నాకు ఏ అధికారి కూడా విచారణకు ఆదేశించలేదని దీన్నిబట్టి చూస్తే మీకు అర్థమవుతుందని భరోసా కలిగించడం జరుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ ఈ మాటలను బట్టి చూస్తే అతను బినామీలకు చెప్పింది వాస్తవాలేనని డి ఈ నుండి ఈ ఎన్ సి వరకు కుంభకోణానికి సంబంధించిన లక్షల రూపాయలను ఏఈ దుర్వినియోగానికి పాల్పడుతూ వారికి అందజేయడం జరిగిందని అందుకే ఏ అధికారి కూడా రాజేందర్ రెడ్డి పై నీటి వరకు చర్యలు తీసుకునే విధంగా అడుగు వేయలేదని చెప్పుటకు సందేహ పడాల్సిన అవసరం లేదు.

 

 *రోజు కు ఒకటి తెరపైకి అవినీతి భాగవతం.* 

 

ఎన్ని సాక్షాలు పంచాయతీరాజ్కు అవసరం ఎప్పుడు రాజేందర్ రెడ్డి తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటారు గత మూడు నెలలుగా బాధితులు సాక్షాలతో తెరపైకి రావడం వందల సంఖ్యలో నాసిరకం పనులు బయట పెట్టడం గత నెలలో తాజాగా ఒక బాధితుడు రెండు లక్షల 50 వేల రూపాయల కమిషన్ను తన బిల్లులను రికార్డు చేయుటకు అందించాలని చెప్పడం జరిగినప్పటికీ పంచాయతీరాజ్ ఉన్నత అధికారి ఈ ఎన్ సి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరిగింది. రోజులు గడవక ముందే పేదల సొమ్ము ప్రభుత్వం మండల అభివృద్ధి కొరకు తన వంతు పాత్రను అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అభివృద్ధి పనుల పేరుతో ఏ ఈ రాజేందర్ రెడ్డి పంచాయతీరాజ్ ఉన్నత అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తూ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడడం జరిగినప్పటికీ చర్యలు తీసుకోకుండా అధికారులు రాజేందర్ రెడ్డి కి కొమ్ముకాస్తూ ఉండడం జరుగుతుంది. పంచాయతీరాజ్ అధికారులకు ఎన్ని సాక్షాలు కావాలో రాజేందర్ రెడ్డి కుంభకోణ విషయంలో వారానికి ఒక సంఘటన తెరపైకి రావడం పంచాయతీరాజ్ కనీస విచారణకు కూడా ఆదేశించకపోవడం గమనార్థం. మండలంలోని సూరారం గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి మురికి మరియు వర్షపు నీరును గ్రామంలోని చెరువులోకి పంపించుటకు ఆరు పైప్ లైన్ లను అమర్చి పనిని గత సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నాలుగు పైప్ లైన్లను అమర్చించాల్సి ఉండగా కేవలం 3 లైన్లను మాత్రమే అమర్చి నాలుగవ లైన్ అమర్చకుండానే పని పూర్తి చేసినట్లు రికార్డులు నమోదు చేసి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలను దండుకోవడం జరిగింది. పనిచేయకుండానే ఏ ఈ రాజేందర్ రెడ్డి బిల్లును రికార్డు చేయడం వాటికి సంబంధించిన డబ్బులను తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు ఏఈ అక్రమాలపై మూడు నెలలుగా వరుస కథనాలకు వారిలో మార్పులు తీసుకువచ్చిందని పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహించడంతోనే తమ సొమ్మును తామే కాపాడుకుంటాం అన్నట్టుగా పంచాయతీరాజ్ అవినీతి తిమింగళం చేసిన అక్రమాలను ఇక తామే బట్టబయలు చేస్తామని మండల ప్రజల్లో సంకల్పంగా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ అవినీతికి బట్టబయలు చేసుటకు ఇక మండల ప్రజలే కంకణం కట్టినట్లు కనబడక తప్పడం లేదు. పనిచేయకుండానే లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ప్రజలే బయటపెట్టినప్పటికీ పంచాయతీరాజ్ నిద్రమత్తును వీడుతుందా  అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.

 

 *ఈ ఈ, ఎస్ ఈ లు పాత్రధారులు కాగా,ఈ ఎన్ సి కమిషన్కు కక్కుర్తి పడి నో యాక్షన్,!?* 

 

మండలంలో కోట్ల కుంభకోణం వ్యవహారంపై నేటి వరకు పంచాయతీరాజ్ ఈ ఎన్ సి సంజీవరావు స్పందించకపోవడం వెనుక కారణమేమిటో అని యావత్ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో గత వారం రోజుల క్రింద డివిజనల్ అధికారి సాయిలు పలు బినామీలు ప్రజల ప్రదేశాల్లో పలు గ్రామస్తులతో పంచాయతీరాజ్ శాఖ లో కమిషన్ మామూలే అని నాసిరకం పనులు అనేది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని ఏఈ రాజేందర్ రెడ్డి పై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పుకోవడం జరుగుతుందని ప్రచురించడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఏఈ వినామీలతో చెప్పుకున్న మాటలను బట్టి చూస్తే వాస్తవానికి కుంభకోణంలో డి ఈ నుండి ఎస్సీ వరకు పాత్రధారులు అన్న విషయం ముందు నుండి అనుమానాలు వ్యక్తమౌతూ పలు సందర్భాల్లో నిజాలుగా తేలడం జరిగింది. కానీ ఉన్నత అధికారి ఈఎంసి డి ఈ ఎస్ ఈ లపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్న తరుణంలో డి ఈ సాయిలు ఏ ఈ రాజేందర్ రెడ్డి దినములకు చెప్పుకున్న మాటలు ఈ ఎన్ సి  కూడా కుంభకోణానికి సంబంధించి కమిషన్ మాయలో పడి ఉన్నారని అర్థమవుతుంది. నేటి వరకు పదుల సంఖ్యలో సాక్షాలు స్థిరపైకి వచ్చినప్పటికీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారి అయి ఉన్న ఈ ఎన్ సి నేటి వరకు రాజేందర్ రెడ్డి తో పాటు ఎస్సీ లపై చర్యలకు ఆదేశిస్తూ మండలంలో విజిలెన్స్ విచారణ జరిపించకుండా తనకు సంబంధం లేని అధికారులుగా భావిస్తూ కోట్ల కుంభకోణ వ్యవహారంలో ఈ ఎన్ సి సంజీవరావు నిశ్శబ్దం

కమిషన్ కక్కుర్తి లో పడి నో యాక్షన్ అన్నట్లుగా ఉందని మండలంతో పాటు జిల్లా ప్రజలంతా చెప్పుకోక తప్పడం లేదు.

 

 *మహాదేవపూర్ కుంభకోణంపై బాధ్యత వహించేది ఎవరు,!?* 

 

మండలంలో భారీ కోట్ల నిధుల కుంభకోణానికి శ్రీకారం చుట్టి నేడు సెలవు పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ కుంభకోణ వ్యవహార విషయంలో వరుస కథనాలు వస్తు యావత్ రాష్ట్రమంతా ఏ ఈ రాజేందర్ రెడ్డి సెలబ్రిటీగా మారిపోవడం జరిగిందని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుంది అందుకే మా అవినీతి తిమింగళం సెలబ్రిటీ తో పాటు మాకు కమిషన్ అందించే కింగ్ అని పంచాయతీరాజ్ శాఖ అనుకుంటుందేమో అందుకే నిధుల కుంభకోన వ్యవహారానికి బాధ్యత ఏ అధికారి తీసుకొని శాఖ పరుగును నిలబెట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఈ ఎన్ సి వరకు నిశ్శబ్ద వైఖరిని యావత్ ప్రజలంతా అసహ్యించుకుంటున్న క్రమంలో కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తన బాధ్యతగా మండలంలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తారా లేక పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య రాజేందర్ రెడ్డి తోపాటు ఇతర ఉన్నత అధికారులపై కొరడా కురిపించి శాఖ పరుగులు నిలబెడతారా అనేది వేచి చూడాల్సిందే.

 

 *అవినీతి లో కూడుకపోయి ఉన్న పనులను సాక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ఇన్చార్జి ఏ ఈ పై చర్యలు తీసుకొని ఇతర ఏ ఈయనకి బాధ్యతలు అప్పగించాలి.* 

 

 

తాజాగా మండలంలో కుంభకోణానికి శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులకు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే సాక్షాలు ఉండకుండా చేసే ప్రయత్నం ఏ ఈ రాజేందర్ రెడ్డి డి ఈ సాయిలు మూడు నెలలుగా ఆగి ఉండి శిథిలావస్థకు చేరి ఉన్న పనులను తిరిగి ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ తో పరులను గొట్టుశప్పుడు కాకుండా ప్రారంభించడం జరుగుతుంది. తాజాగా మండల కేంద్రంలోని 24 లక్షల రూపాయలతో టెండర్ ఫార్మింగ్ కు పోవాల్సిన రహదారి బిట్లుగా ఏర్పాటు చేసి బినామీ కాంట్రాక్టర్కు అందించడం జరిగింది. నాసిరకం పనులతో బిట్ల చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని ప్రచురించడంతో కుంభకోణం లో చేపట్టిన పనులు ఆగిపోవడం జరిగింది. తిరిగి ఆ పనులను ఉన్నత అధికారులు ఎవరూ కూడా ఏఈని ఏమి చేయలేరని ముందు గాని డి ఈ ప్రచారం చేసుకోవడం తాజాగా ఏఈ తనకు ఏమీ కాదు ఉన్నతాధికారులు కూడా నా గుప్పిట్లో ఉన్నారని బినామీలకు చెప్పుకోవడం ఇన్చార్జి ఏఈగా ఉన్న రవీందర్ ను తన విధి నిర్వహణలో భాగంగా అని చెప్పుకుంటూ ఇటు స్థానిక ప్రజాప్రతినిధుల అండలతో రహదారి నిర్మాణాలను గుట్టు చప్పుడు కాకుండా నాసిరకం అయినప్పటికీ పనులు వేగం పెంచి పనులు కొనసాగించడం జరుగుతుంది. తక్షణమే ఉన్నత అధికారులు మండలంలో అవినీతికి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన పనులను విజిలెన్స్ విచారణ జరిగేంతవరకు నిలిపివేయాలని ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని రవీందర్ స్థానంలో మరి ఇతర ఏఈ ని నియమించాలని అప్పుడే మండలంలో అభివృద్ధి పనులు నాణ్యతతో సజావుగా సాగుతాయని మండలంతో పాటు జిల్లా ప్రజలు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ తోపాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్యకు వీడుకోవడం జరుగుతుంది.

సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న* *తెలంగాణ

పాఠశాలల బంద్ :ABVP తెలంగాణ 

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జులై 5న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహించనున్నట్లు ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ *మన ఊరు-మన బడి* కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభమైనా కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేయకపోవడం,నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పనలో,మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు దోపిడీ నియంత్రించి *ఫీజు నియంత్రణ చట్టం* అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడం,ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థును విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన విద్యా శాఖ అధికారుల నియంత్రణ మాత్రం శూన్యం. సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరి నిరసిస్తూ ABVP తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో *july5* న *తెలంగాణ పాఠశాలల బంద్* నిర్వహిస్తుందని ఈ బంద్ కు విద్యార్థులు తల్లిదండ్రులు అందరు మద్దతిచ్చి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

*డిమాండ్స్*

 

*1* సర్కారు బడుల్లో సత్వరమే పుస్తకాలు,డ్రెస్ లు అందించాలి.

*2* ప్రభుత్వం ప్రకటించిన *మన ఊరు-మన బడి* కార్యక్రమానికి నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలి.

*3* పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న టీచింగ్, DEO, MEO పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

*4* ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి.

*5* ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించి, ఏక రూప ఫీజు నిర్ణయించాలి.

*6* ఒకే పేరుతో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ స్కూళ్లను నిషేధించాలి.

*7* బుక్స్, డ్రెస్, డొనేషన్ పేరుతో ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై కఠినంగా వ్యవహారించాలి.

*8* ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.

*9* విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version