ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.

ఏ ఈ రాజేందర్ రెడ్డి లీలలు

పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి. 

రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ.

ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో, 

మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్.

నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ ఈ, ఈ ఎన్ సి నిర్లక్ష్యమే ఏ ఈ రవీందర్ రెచ్చిపోవడానికి కారణం.!

మహాదేవపూర్-నేటిధాత్రి:-

మండలంలో అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని దానికి ఎన్నో సాక్ష్యాలు ప్రచురిస్తూ నేటి రాత్రి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం కాకుండా ఇప్పటికీ నిధుల దుర్వినియోగం చేసిన అధికారిపై చర్య తీసుకొని నిధులను రికవరీ చేయాలని గత 97 రోజులుగా అక్షర పోరాటాన్ని సాగించడం జరుగుతుంది.

పంచాయతీరాజ్ ఈ ఎన్ సి నిర్లక్ష్యం వలన అధికారిపై చర్యలు తీసుకోకపోవడం అక్రమాలకు ప్రోత్సాహం జరుగుతుందని చెప్పడానికి మరో సాక్ష్యం వెలుగులోకి రావడం జరిగింది కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని నేటి ధాత్రి గత మూడు నెలలుగా చెపుతూనే ఉన్నప్పటికీ ఈ ఎన్ సి స్పందించకపోవడం ప్రజల్లో నీటి ధాత్రి అక్షర పోరాటానికి ఒక అడుగు ముందుకేసి ఏ ఈ కుంభకోణంలో మరో దుర్వినియోగాన్ని బయట పెట్టడం జరిగింది ఒక లక్ష 30 వేల రూపాయల పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల ముందే బిల్లులు చేసి డబ్బులను ఫిట్రా చేసుకోవడం జరిగింది. మండల కేంద్రంలో ఏఈ రాజేందర్ రెడ్డి నిధుల కుంభకోణంలో ప్రారంభించిన రోడ్లు ఆగి ఉన్నప్పటికీ వాటిలో నాణ్యత లోపాలు ఉన్నప్పటికీ ఇన్చార్జి ఏఈ రవీందర్ పనులను తిరిగి ప్రారంభించడం వాటికి సంబంధించిన వివరాల కొరకు సంప్రదిస్తే నేటి ధాత్రిపై అనుచిత వాక్యాలు చేయడం మరిన్ని రహదారులను ప్రారంభిస్తాను దమ్ముంటే ఆపుకో అనే స్థితికి వచ్చి బినామీ కాంట్రాక్టర్ పనులను తిరిగి చేపడుతున్నాడు అంటే ఒకవైపు ఈ ఎన్ సి నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల అండ ఉందని నేటి వరకు కోట్ల కుంభకోణం పై చర్యలు తీసుకోలేదు కాబట్టి తనపై ఎవరు ఏమి చేయాలరు అనె ఆలోచనతో ప్రవర్తిస్తున్నట్లు కనబడుతుంది.

 

 *ఈ ఎన్ సి గారికి బహుమతి వెలుగులోకి మరో సంఘటన.* 

 

ఏఈ రాజేందర్ రెడ్డి కుంభకోణానికి ఎన్ని సాక్ష్యాలు అవసరము నేటి వరకు కుంభకోణం జరిగిందన్న విషయంపై ఉన్నత అధికారులు స్పందించకపోవడం లేదంటే మండలంలో అవినీతి జరగలేదని అనుకుంటున్నారా లేదా అక్రమ ఏఈ కమిషన్ మాయలో ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పదాన్ని మాయం చేశారు అని చెప్పటానికి నిధుల దుర్వినియోగంలో మరో కుంభకోణం బయటపడి నేడు మండలమంతా చర్చలు జరుగుతున్నాయి ఏ ఈ రాజేందర్ రెడ్డి మండలంలోని సూరారం గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నాలుగు పనులు చేపట్టే క్రమంలో కేవలం 3 పనులు చేపట్టి నాలుగవ నాలుగవ పని పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల క్రితం పనిని రికార్డ్ చేసి చెక్ మేజర్ చేయించి బిల్లును తీసుకోవడం జరిగింది. మండలంలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని పనులు చేయకుండానే లక్షల రూపాయల బిల్లులను ఏ ఈ రాజేందర్ రెడ్డి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని తన దుర్వినియోగానికి నామకరణమై తన వ్యవహారం బట్టబయలు అవుతుందని వార్తలు రావడంతో అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై అనారోగ్యం పేరుతో అతనికి సెలవు మంజూరు చేయడం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే క్రమంలోని రాజేందర్ రెడ్డి కి సెలవు మంజూరు చేయడం జరిగింది. కోట్ల రూపాయల కుంభకోణానికి మరో సాక్ష్యంగా పంచాయతీరాజ్ ఈ ఎన్ సి రాజేందర్ రెడ్డి కుంభకోణ వ్యవహారానికి మరో అవినీతి జరిగిందన్న సాక్ష్యం ఈ ఎన్ సి సంజీవరావు కు అవినీతి తివంగలం చేసిన ఘనత ఒక బహుమతిగా మండల ప్రజలు అందించడం జరుగుతుంది.

 

 *పని కాకుండానే బిల్లు చేసిన ఏ ఈ రాజేందర్ రెడ్డి.* 

 

రాజేందర్ రెడ్డి కోట్ల కుంభకోణం మండల పేద ప్రజల సొమ్మును ఏలా దోచుకున్నాడు  అనేది సూరారం సంఘటన ప్రస్తుతం యావత్ రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖకు అలాగే ఈ ఎన్ సి సంజీవరావుకు ఏ ఈ తో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికైనా ఈ యొక్క సాక్ష్యం సరిపోతుందో లేదో మహదేవ్పూర్ మండలంలోని సూరారం గ్రామంలో నాలుగు పైప్లైన్ పనులను చేపట్టుటకు ప్రారంభించడం జరిగింది కానీ కేవలం మూడు పైప్ లైన్ లను మాత్రమే పనులు చేపట్టి ఒక లక్ష 38 వేల పనిని నాలుగవ పైప్ లైన్ వేయకుండానే రెండు నెలల కింద బిల్లులను రికార్డ్ చేసి కాంట్రాక్టర్కు చెక్ మేజర్ తో అందించడం సదరు కాంట్రాక్టర్ డబ్బులను విడ్రా చేసుకోవడం జరిగింది. ఈ విషయం గ్రామస్తులకు తెలవగానే ఇటు నేటిదాత్రి వరుస కథనాలు అక్రమాలపై వస్తున్న క్రమంలో గ్రామంలో అభివృద్ధి పనుల నాణ్యతలపై చర్చించుకునే క్రమంలో పైప్లైన్ వ్యవహారం బయటకు రావడంతో హట ఉట్టిగా కాంట్రాక్టర్ బుధవారం రోజున పైప్లైన్ అమర్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకొని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం తో కలెక్టర్ పైపులను స్వాధీనం చేసుకొని మహదేవ్పూర్ గ్రామపంచాయతీకి తరలించాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కమిషన్ మాయ నుండి బయటికి వచ్చి విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

 

 *రెండు నెలల ముందే బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్, గ్రామస్తుల చొరవతో పైపులను మహదేపూర్ గ్రామపంచాయతీకి తరలింపు, విచారణ చేపట్టిన ఎంపీ ఓ.* 

 

పని చేయకుండానే కాంట్రాక్టర్ కు ఎంబి లను రికార్డ్ చేసి డబ్బులను విడ్రా చేసుకోమని అందించిన ఏ ఈ పని కాకుండానే చెక్ మేజర్ చేసిన డి ఈ మండలంలో ఇప్పటికే జరిగిన కోట్ల కుంభకోణంలో ఇలాంటి ఎన్నో పనులకు శ్రీకారం చుట్టి ఇప్పటికే కోట్ల రూపాయలను పనులు చేయకుండానే బిల్లులను తీసుకోవడం జరిగిందని మూడు నెలలుగా నేటి ధాత్రి యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ పంచాయతీరాజ్ అధికారులకు అమాయక ప్రజల సొమ్ము కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని చెపుతున్నప్పటికీ కూడా ఉన్నత అధికారులు సైతం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ ఈ ఎన్ సి దృష్టి సాధించకపోవడం నేటి ధాత్రి అక్రమాలపై చేస్తున్న పోరాటాన్ని ప్రజలు స్వాగతించి ఏ ఈ రాజేందర్ రెడ్డి చేసిన అరాచకాలను ప్రజలే బయటకు పెట్టి దుస్థితి రావడం నేడు ఏఈ కుంభకోణంలోని మరో అవినీతి బయటకు రావడం జరిగింది. దొంగతనంగా పైప్ లైన్ ను రెండు నెలల తర్వాత తిరిగి అమరుస్తున్న క్రమంలో గ్రామస్తులు పనులను ఆపి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం పైపులైను స్వాధీనం చేసుకొని పైప్లైన్ పనులు చేపడుతున్న ప్రదేశానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డి ఎల్ పి ఓ సుధీర్ విచారణ చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఎం సి కి మండలంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టాడని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షమని కండ్లకు కట్టినట్టుగా అర్థమవుతుంది.

 

 

 *ఫోన్ చేసి నాకు విసిగించకు ఏమి రాసుకుంటావు రాసుకో,* 

 *మరో గోదావరి రోడ్డు ప్రారంభిస్తున్న దమ్ముంటే ఆపుకో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్.* 

 

మండలంలో రాజేందర్ రెడ్డి సెలవులో వెళ్లిన అనంతరం డివిజన్ కార్యాలయంలో స్పెషల్ ఇంజనీర్ గా ఉన్న రవీందర్ రెడ్డిని మహదేవ్పూర్ మండల ఇన్చార్జి ఏఈగా బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఏ ఈ రవీందర్ రెడ్డి కి నాసిరకంగా పడి ఉన్న పనుల ప్రారంభ విషయానికై నేటి రాత్రి ఫోన్ ద్వారా సంప్రదిస్తే నాకు ఫోన్ చేసి విసిగించకు నీకు దమ్మున్నట్లు రాసుకో నీవు ఎంత రాసుకుంటావో నీ ఇష్టం ఒరేయ్ బాబు నేను పనులు ప్రారంభిస్తా మరో గోదావరి రోడ్డును కూడా ప్రారంభించడం జరిగిందని నేటి ధాత్రి కి ఫోన్ ద్వారా ఇంచార్జ్ ఏ ఈ రాజేందర్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముందుగా నేటి రాత్రి మహదేవ్పూర్ మండల కేంద్రంలో 300 ఫీట్లు 24 లక్షల రూపాయల నిధులతో టెండర్కు వేయాల్సిన పని బిట్లుగా విభజించి గత మూడు నెలల ముందే సైడ్ లు ఆరు ఇంచుల లోతు తోడి కంకిరను వేసి పలుమార్లు మిషన్ నుండి ప్రెస్సింగ్ చేస్తూ క్యూరింగ్ లాంటి పనులను చేపట్టకుండా ప్రారంభించడంతోనే పూర్తిగా నాసిరకం పనులు చేపడుతున్నారని మూడు నెలల ముందే ఆపివేయడం జరిగింది అలాంటి పనులను హటాహుటిగా నేటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా సీసీ రోడ్డుకు సైట్లో వేసిన కంకర పూర్తిగా బయటికి వెళ్లడం మట్టి గుంతలు లాగా కనపడడం జరిగింది. అలాంటి వాటిపై ఒకేసారి రోడ్డును నిర్మించడం జరుగుతుండడంతో నేటి ధాత్రి కుంభకోణ వ్యవహారంలో టెండర్ కు వెళ్లాల్సిన పని అలాగే పూర్తిగా నాసిరకంతో చేపట్టిన పనులను ఇలా ప్రారంభిస్తారు అని ప్రశ్నించడంతో ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ రెడ్డి ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది.

 

 *నిధుల కుంభకోణం వలన ఆగిన  పనులను ప్రారంభిస్తూ రెచ్చిపోతున్న ఇంచార్జి ఏ ఈ, ఈ ఎన్ సి నిర్లక్ష్యమే ఏ ఈ రవీందర్ రెచ్చిపోవడానికి కారణం.!* 

 

 

ఏ ఈ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బినామీ కాంట్రాక్టర్ల పేరుతో కోట్ల రూపాయల పనులు పెద్ద మొత్తంలో కమిషన్లు అర్చించి టెండర్ కు వెళ్లాల్సిన పనులను బిట్లుగా విభజించి చేపట్టిన పనులు కుంభకోణంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడడం జరిగిందన్న విషయం బహిర్గతం కావడంతో ఏ ఈ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన రాసి రకం పనులు గత మూడు నెలలుగా ఆగి ఉండడం జరిగింది. మొదలుపెట్టేటప్పుడే పనులన్నీ నాసిరకంగా ప్రారంభించడం మూడు నెలలుగా ఆగడంతో పనులు శిథిల అవస్థకు చేరడం జరిగినప్పటికీ అలాంటి పనులకు ఇన్చార్జి ఏఈ రవీందర్ ప్రారంభిస్తూ వివరాలకు సంప్రదిస్తే రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కోట్ల రూపాయలకు కుంభకోణానికి దారి తీసిన నాసిరకం పనులకు విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్న పనులన్నీ ఇంచార్జ్ ఏ ఈ రవీందర్ పనులను ఎలా ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ఈ అక్రమాలకు పాల్పడ్డాడడానికి రోజుకొక కుంభకోణం బయటపడుతున్న క్రమంలో మండలంలో కోట్ల నిధుల పనులను ఏ ఈ రాజేందర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై మండలంలో కోట్ల నిధులను దుర్వినియోగానికి పాల్పడి ఉన్న ఇటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ముందస్తుగా విజిలెన్స్ విచారణ చేపట్టి ఇంత మొత్తంలో అవినీతి జరిగిందన్న విషయం పంచాయతీరాజ్ ఈ ఎన్ సి విచారణ చేపట్టి వరకు పనులను జరగనివ్వకుండా ఉంటే విచారణ సులువుగా చేపట్టుటకు వీలవుతుంది. కానీ విచారణ పక్కదారి పట్టించే క్రమంలో ఏ ఈ రాజేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధుల జిల్లా అధికారుల కుట్ర పూరిత భాగంలోనే ఇంచార్జ్ ఏఈ రవీందర్ కోట్ల కుంభకోణానికి దారి తీసిన పనులను ప్రారంభించి త్వరలో పూర్తిచేస్తే విచారణలో ఎలాంటి ఆధారాలు ఉండవని ఉద్దేశంతో పనులను ప్రారంభించడం జరుగుతుంది. అక్రమాలకు దారితీస్తున్న అధికారులపై అలాగే ఇప్పటికీ కోట్ల రూపాయల కుంభకోణానికి శ్రీకారం చుట్టిన ఏ ఈ రాజేందర్ రెడ్డి తో పాటు జిల్లా అధికారులపై విజిలెన్స్ విచారణ చేపట్టకుంటే మరిన్ని కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగానికి పాల్పడక తప్పదని పంచాయతీరాజ్ శాఖ ఈ ఎన్ సి నిధుల దుర్వినియోగానికి ప్రోత్సహించినట్లు అవుతుందని మండలంలో ఇన్చార్జిగా ఏ ఈ ఉన్న రవీందర్ రెడ్డిని తక్షణమే నిధుల కుంభకోణానికి దారి తీసిన అభివృద్ధి పనులకు ఏ అధికారి ఆదేశాలతో పనులను చేపడుతున్నాడు లేదా ఉన్నత అధికారులకు తప్పుదోవ పట్టించేందుకు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నట్లుగా వ్యవహరించడం జరుగుతుంది. తక్షణమే ఏఈ రవీందర్ ను మండల ఇన్చార్జి బాధ్యతల నుండి తొలగించి ఇతర మండలాలకు సంబంధించిన ఏఈలకు మహదేవ్పూర్ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలని రాజేందర్ రెడ్డి అవినీతిపై తక్షణమే ఈ ఎన్ సి విచారణ జరిపించాలని మండల ప్రజలు అలాగే జిల్లా ప్రజలు కోరుతున్నారు.

మీరివ్వరు..మాది మిగలనివ్వరు?

అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు?

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు?

ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు?

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు?

అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు?

వున్నవి ఊడ్చుకుపోవడం తప్ప, రుణం తీర్చుకున్నది లేదు?

ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?

ఓట్ల కోసం ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు?

కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు?

బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన?

తెలంగాణ గడ్డ మీద అడ్డావెట్డిండ్రు…బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ దండు కదిలిండ్రు…దేశంలోని బిజెపి పెద్దలంతా హైదరాబాద్ చేరుతున్నరు…ఇచ్చేదేమీ లేకపోయినా, చెప్పేదేమీ లేకపోయినా, అంతంత ఎత్తు చెప్పుకునుడు బిజెపికి అలవాటే…ఆడేం లేకపోయినా అన్నీ వున్నాయంటారు? ఏమీ ఇయ్యకపోయినా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు…అభివృద్ధి గురించి అడిగితే హైందవ ధర్మం అంటారు…ఎనమిదేండ్ల సంది ఏం చేసిన్రంటే అంతా దేశం కోసమే అంటారు…? మీరు చెప్పేదాంట్లో దేశం కోసం ఏముందని అడిగితే, ఈ పాపమంతా కాంగ్రెస్ దే అంటారు..?అందుకే కొత్త రాజకీయం నేర్చుకున్నారు… చెప్పడం చేత కానప్పుడు అరవాలి. వినడం ఇష్టం లేనప్పుడు అల్లరి చేయాలి. పని చేయలేనప్పుడు పగటి కలలుగనాలి…చెప్పిందిడా అబద్దాలాడడం నేర్చుకోవాలి. ఇంతకు మించి ఏమీ చేయలేనప్పుడు…ఇతరుల మీద పడి ఏడవాలి….సరిగ్గా బిజెపి చేస్తున్నది ఇదే…తన మాట తనదే గాని ఇతరుల మాట వినిపించుకోదు.దానికి తోడు మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్న సూత్రాన్ని పాటిస్తున్నట్లు చేస్తున్నారు. రాష్ట్రాల నుంచి చేయాల్సినంత వసూలు చేస్తున్నారు. జిఎస్టీ అని తెచ్చి, ఇతర పన్నులు అలాగే వుంచారు. ఆఖరుకు అప్పడాలు, మజ్జిగ ప్యాకెట్ల మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తామంటున్నారు. ఆఖరుకు గడ్డం గీసుకునే బ్లేడును కూడా వదలడం…అయినా మమ్మల్ని మాత్రం ఏమీ అడగొద్దు…మాకిది కావాలి, అది కావాలని అడగొద్దు…ఇవ్వడానికేమీ లేదిక్కడ…ఇవ్వాలంటే మనసొప్పక…అయినా ఓట్లు మాకే ఎయ్యాలే…మమ్మల్నే గద్దెనెక్కించాలే! ఏమివ్వనూ…ఇంకేమివ్వనూ…నా మనసే నీదైతే ఏమివ్వను…నిన్నేమడగనూ, ఇంకేమడగనూ, నువ్వే నాదైతే ఏమడగను… పాట పాడుకుంటూ బిజెపి భజన చేయాలన్నట్లుంది. బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణకు ఇది కావాలి. ఈ ప్రాజెక్టు ఇవ్వాలని అడగరు…కేంద్ర పెద్దలు పెట్టరు…అడిగే వాళ్లను అడగనీయరు…ఎక్కవ తక్కువ అడిగితే ఉన్నయ్ గుంజుకపోతరు…ఇది రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్న చర్చలో భాగమైన మాట. అంటే బిజెపి గురించి చెప్పాలంటే ఇంకా చాలా వుందన్న మాట.  

మీరివ్వరు..మాది మాకు మిగలనివ్వరు. కేంద్ర ప్రభుత్వం అన్నాక దేశమంతా ఒకే రకమైన ప్రేమను కనబర్చాలి. ఒకే రకమైన అభివృద్ధిని అందించాలి. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలకు చోటు లేకుండా చూసుకోవాలి. అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకోవాలి. అంతే కాని ఉత్తరాదికో రూలు, దక్షిణాదికో రూలు అన్నట్లు వుండకూడదు. వివక్ష మాత్రం ఎక్కడా చూపించకూడదు. కానీ తెలంగాణ ధనిక రాష్ట్రం, కేంద్రాన్నే సాదుతున్న రాష్ట్రానికి ఏం అవసరమని రాష్ట్ర బిజెపి నాయకులే నైతికత మరిచి మాట్లాడుతున్నారు. ఒక రకంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులే అవసరం లేదన్నట్లు వాదిస్తున్నారు. ఇలాంటి నాయకులు రేపటి రోజున తెలంగాణకు మేలు చేస్తారా? తెలంగాణకు కొత్తగా ఏమీ ఇవ్వకపోవడం అటుంచితే, గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం తరలించుకుపోయారు…వాటి పైనా బిజెపి రాష్ట్ర నాయకులు స్పందించరు. కనీసం తరలించుకుపోకుండా ఆపిన సందర్భం లేదు. కేంద్రం కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం అడిగితే ఇవ్వలేదని బుకాయిస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో వుండి వరంగల్ లో ఈ మాట చెప్పారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నది చిరకాల కల. దానిని కూడా తరలించుకుపోయారు…? మరి అప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ఆపలేదు? పోతే పోనీ అనుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో వున్నంత కాలం ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని విజయవాడకు తరలించుకు పోవడానికి శత విధాలా? ఆనాడు ప్రయత్నించారు. కానీ కుదలేదు…ఆఖరుకు గుజరాత్ కు తరలిస్తే బిజెపి నేతలు చూస్తూ ఊరుకున్నారు? ఇంకేమిస్తారు? అవ్వ పెట్టాపెట్టదు…అడుక్కోనివ్వదని కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వదు…అప్పుకు అవకాశం లేదు. వ్యవసాయానికి మీటర్లు పెడితే తప్ప అప్పు లేమంటూ తిరకాసు తెలిసిందే…? ఇలా తెలంగాణను అడుగడుగునా వంచిస్తూ వస్తూ, తెలంగాణ మాదే… తెలంగాణలో పెత్తనం మాదే…అని పగటి కలలు నిజాలౌతాయన్న భ్రమల్లో బిజెపి శ్రేణులున్నారు.

తెలంగాణకు అపకారమే తప్ప, ఉపకారం చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి ప్రత్యేకంగా ఇచ్చింది లేదు…విభజన హమీలలో పొందుపర్చిన వాటికే దిక్కు లేదు. సాగునీటి రంగంలో అద్భుతమైన ప్రగతిని కనబర్చినా కేంద్రం నుంచి సానుకూలత లేదు. ప్రశంస అంతకన్నా లేదు. కాళేశ్వరానికి పైసా సాయం చేసింది లేదు. మిషన్ కాకతీయకు నిధులిచ్చింది లేదు. ఇంటింటికీ మంచినీళ్లిచ్చే మిషన్ భగీరథ కు నిధులివ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, కనికరించింది లేదు. ఇదంతా అపకారం కాక మరేమిటి? తెలంగాణకు కేంద్రం ఉపకారమని చెప్పుకోవడానికి ఏముందని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు.

ఎనమిదేళ్లలో కేంద్రమిచ్చిందేమీ లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బిజెపి తెలంగాణకు ఈ ఎనమిదేళ్లలో మాటలు తప్ప చేసిందేమీ లేదు. పైగా తెలంగాణ ఇవ్వడాన్ని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకించాడు…వ్యంగ్యాస్రాలు విసిరాడు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నాడు. పార్లమెంటు తలుపులు మూసి, అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అన్నాడు. మరి మహారాష్ట్ర ను విడదీసి, గుజరాత్ ను కూడా అలాగే ఇచ్చారా? అన్న దానిని మోడీ ఎందుకు చెప్పరు. ఒక నాడు గుజరాత్ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎలా కొట్లాడిందో అలాగే తెలంగాణ కూడా కొట్లాడి సాధించుకున్నది. గుజరాత్ కోసం మోడీ కొట్లాడింది లేదు…కానీ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ కారుడు కేసిఆరే తెలంగాణ పాలిస్తున్నాడు.ఊరించుడు తప్ప ఉపయోగమే లేదు. అదిగో పసుపు బోర్డు ఇదిగో పసుపు బోర్డు అన్నారు. వచ్చిందా? ఇచ్చారా? మోసం చేశారా? అన్నది తెలంగాణ ప్రజలకు తెలియదా? గెలిచిన వారం రోజుల్లో పసుబు బోర్డు తెప్పిస్తా? లేకుంటే రాజీనామా చేస్తానని చెప్పిన ఎంపి అరవింద్ అంతకన్నా ఎక్కువ చేసిన? అంటాడే గాని చేసిందేమిటో చెప్పింది లేదు. కేంద్రాన్ని అడిగి తెచ్చింది లేదు. పార్లమెంటులో ప్రశ్నించింది లేదు. ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు తేవాలన్న చిత్తశుద్ధి లేదు. అడిగిన వాళ్లను ఎదురు ప్రశ్నించడం తప్ప తెచ్చి చూపిస్తా అన్న మాట రాదు.

అబద్ధాలు ప్రచారం అభివృద్ధి చేయలేదు? అన్నీ మావేనని ఏమార్చుడే తప్ప ఏమీ లేదు. ఇంటి పెరట్లో కట్టుకున్న మరుగుదొడ్డి మాదే, వీధిలో వెలుగుతున్న లైటు మాదే, ఊరూరికి కట్డిమ రైతు వేధిక పైసల్ మాయే…ఆఖరుకు వడ్లు కొనేది మేమే…ఆ పైసల్ మాయే….ఇవన్నీ నిజాలా కాదా? అని తెలంగాణ ప్రజలకు తెలియదా? దేశంలో ఏ రాష్ట్రంలో రైతు వేధికలు నిర్మాణం చేశారో చెప్పమంటే నోరెళ్లబెడతారు? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఫించన్ల పైసల్ మాయే…అంటారు…గుజరాత్ లో ఐదువందలే కదా ఇచ్చేది అంటే సమాధానం దాట వేస్తారు. ఇరవై నాలుగు గంటల కరంటు పుణ్యం మాదే అంటరు…కర్ణాటక రైతులు కరంటు వస్తలేదని బండి సంజయ్ ముఖం మీద చెప్పంగనే జారుకున్నాడు. మహిళలతో కలిసి సమావేశం పెట్టి, అన్నీ కేంద్రమే ఇస్తుందంటే, గ్యాస్ ధరలేంది, నూనెల ధరలేంది? మేం తినేదెట్లా? బతికేదెట్లా? అనంగనే జారుకున్న బండి సంజయ్ అబద్దాలు చెప్పడం మానడు.ఇచ్చే ఉద్దేశం మీకు లేదు…ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు?. తెలంగాణకు ప్రత్యేకంగా పైది పైసల సొమ్ము ఇచ్చే ఉద్దేశ్యం బిజెపి పెద్దలకు లేదని తెలుసు. కేంద్రం ఏం ఖర్చు చేయాలన్నా ముందు ఉత్తరాధి వైపే తప్ప, దక్షిణాదివైపు చూడడం మర్చిపోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతూనేవుంది. ఓట్ల కోసం బిజెపి ఎన్ని వేషాలేసినా, చూసే ఓపిక జనానికి లేదు? ఆకలౌతున్నప్పుడు బువ్వ పెట్టని వాళ్లు, బిర్యానీ వండుతున్నామంటే నమ్ముతారా? బిజెపి కళ్లబొల్లి మాటలు, వినిపించుకునే వాళ్లెవరూ లేరు? అందుకే తెలంగాణ గడ్డ మీద బిజెపి సభలు వృధా ప్రయాస, ఉడుకుయాతన? అంటున్నారు ఇతర రాజకీయ పార్టీలు.

బడుగులపై కాంగ్రెస్‌ కపట ప్రేమ!

ఎంత కాలం మోసం చేస్తారు? 

`శాసించే స్థాయిలో రెడ్డీలు?

`ఎదురుచూసే స్థితిలోనే ఎల్ల కాలం బడుగులు?

`రెడ్డిలలో వాళ్లలో వాళ్లకు పడకపోయినా వాళ్లే హీరోలు?

`పైకంతా కయ్యం…లోలోన నెయ్యం!

`బడుగులను మోసం చేసేందుకే ఈ పగటి వేషాలు?

`అమెరికాలో చెట్టాపట్టాలు…రాష్ట్రంలో ఎడమొహం, పెడమొహాలు!

`ఆ రెడ్డి, ఈ రెడ్డి పగలు తిట్టుకుంటారు…? రాత్రి అలాయ్‌ బలాయ్‌ ఇచ్చుకుంటారు?

`జగ్గారెడ్డికి టిక్కెట్టు కట్‌ చేయగలరా?

`ఉత్తమ్‌ ను పక్కన పెట్టగలరా?

`పని చేసే పొన్నాల పనికి రాడా? కయ్యాల మారి రెడ్లంతా గెలుపు గుర్రాలా?

`అద్దంకికి అడుగడునా అడ్డంకులే!

`దాసోజు కూరలో కరివేపాకే?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అయితే ఆ రెడ్డి, లేకుంటే ఈ రెడ్డి, ఏ రెడ్డైనా సరే…పెత్తనానికి అందరు రెడ్డీలు ఎవ రెడీ…ఇదేనా రాజకీయం…ఇదేనా సిద్ధాంతపరమైన చాణక్యం…ఇదేనా అధికారంలోకి రావాలని చూసే వారి పనితనం…స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బడుగులను రాజ్యమేలనిచ్చిందో చెప్పాలి. ఇచ్చారా అంటే ఇచ్చాం…మ మ అనిపించామా? అంటే అనిపించాం…ఆ వెంటనే దించేశాం..ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏముంది? ఇకనైనా బడుగులకు పెద్ద పీట వేస్తామని చెప్పడానికి ఏముంది? ఆది నుంచి చూసినా అదే లెక్క…భవష్యత్తులో కనిపించేందంతా అదే లెక్క…రెడ్డి లేని లెక్క…కాంగ్రెస్‌లో ఉత్త లెక్క…ఆఖరుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వున్నా సరే….కాంగ్రెస్‌కు పెద్ద లెక్కే కాని, ఏ బడుగుకు అవకాశం ఇవ్వాలన్న మనసురాని లెక్క..? పేరుకు కాంగ్రెస్‌ పార్టీ బడుగులంతా కాంగ్రెస్‌ వైపే అంటూ మహా గొప్పగా చెప్పుకుంటారు…పచ్చి అబద్దాన్ని నిజమని ప్రచారం చేసుకుంటారు?…ఎస్సీ, ఎస్టీ, బిసిలకు పదవులు పంచడంలో కాదు…వారిని నమ్మించడంలో, ఓట్లేయించుకోవడంలో , గెలిపించడంలో, కుర్చీలలో కూర్చోబెట్టడంలో మాత్రమే పేదలంతా కాంగ్రెస్‌ వైపు…కాని అధికారంలోకి వచ్చాక పెత్తనం చేయడంలోనూ, అధికారం కొనసాగించడంలోనూ బడుగులంతా కాంగ్రెస్‌కు ఆమడ దూరమే…? బడుగులకు అది చేశాం…ఇది చేశాం…ఎంతో చేశామని చెప్పడం తప్ప, ఈసారి పదవులు బడుగులకే ఇస్తాం…ముఖ్యమంత్రిని వారినే చేస్తాం..ఇంత కాలం బడుగులు మోసిన పల్లకీలు మేం మోస్తామని ఏనాడైనా రెడ్లు చెప్పారా? ఏ ఒక్కరైనా చెప్పినట్లు చూపిస్తారా? చూపించలేరు…ఎందకంటే కాంగ్రెస్‌లో బడుగులకు న్యాయం అన్నది నేతి బీరకాయల్లో నెయ్యింత అబద్దం. 

                      ఆది నుంచి అంతే…శాసించే స్ధితిలోనే రెడ్డీలు…

ఎదురు చూసే స్ధితిలో ఎల్ల కాలం బడుగులు. సామాన్య ప్రజలంతా కలిసి పోరాటం చేసి, నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేస్తే అధికారంలోకి వచ్చింది బూర్గుల రామకృష్ణారావు బడుగుల నాయకుడు కాదు…? ఆ పై ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైనా తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరు కిరణ్‌కుమార్‌ రెడ్డి దాక కాంగ్రెస్‌లో అంతా వాళ్లే…? తెలంగాణ వచ్చాక వాళ్లే….! కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రకటిస్తుందని తెలిసి సమయం నుంచి నేనేంటే నేనే…నాకంటే సీనియర్‌ ఎవరున్నారంటూ పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టి పెట్టుకున్నట్లు జానారెడ్డి నేనే సిఎం అని ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ వస్తే బడుగుల్లో ఎవరినో ఒకరే సిఎం చేస్తామని ఏ ఒక్క రెడ్డి చెప్పలేదు. పదువులు ఎవరికి చేదు అంటూ రెడ్డీ నాయకులు వెకటకారం చేసినట్లు తెలంగాణ ప్రజలకు గుర్తు… అంతే కాదు నేనే సిఎం. అని ఏ బిసి, ఎస్సీ, ఎస్టీ నాయకుడు చెప్పుకోలేపోయారు? కాని నేనే సిఎం అని జానారెడ్డి ప్రకటించుకున్నారు. ఇదే అసలు చమ్మక్కు…?ఇక తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో మళ్లీ రెడ్డిల పెత్తనమే సాగుతోంది. ఏ ఒక్క ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయినా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని వద్దన్నా కొనసాగించారు. తెలంగాణ సమాజమంతా ఉత్తమ్‌ వల్లనే ఇంత నష్టం అన్నా ఆయన్నే కొసాగించారు. ఆయనే ఇక చాలు…ఈ పదవి నేను చేయలేను, మోయలేను అంటే కూడా పక్కన పెట్టలేదు… మరో బలహీన వర్గాల నేతలకు పిసిసి ఇవ్వలేదు. పైగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తర్వాత పిపిసి పదవికి నేనంటే నేనే అర్హడిని అంటూ అటు జాగ్గారెడ్డి, ఇటు కోమటి రెడ్డి…? మధ్యలో రేవంత్‌రెడ్డి….ముగ్గురూ రెడ్డీలే గాని, అందరం కలిసి బడుల నేతను పిపిసి అధ్యక్షుడిని చేద్దామని ఏ ఒక్క రెడ్డి నాయకుడైనా ముందుకొచ్చారా? రెడ్డి రాజ్యం రావాలనే అంటున్నారు గాని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బడుగులను ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారా? అనరు…? అనలేరు??

                             అదేంటో గాని వాళ్లలో వాళ్లకు పడకపోయినా వాళ్లే హీరోలు…మిగతా వాళ్లంతా జీరోలు…

రాష్ట్రంలో ఎనభై శాతమున్న బడుగులంతా ఓట్లు వేయడానికి, పట్టుమని ఐదు శాతం కూడా లేని రెడ్డిలు రాజ్యమేలడానికా? ఇదేనా సిద్ధాంతపరమైన న్యాయం…కాంగ్రెస్‌లో బడుగులకు చేస్తున్న న్యాయం…రెడ్డీ రాజకీయమంతా పైకి మాత్రమే కయ్యం …లోపంతా వియ్యం, నెయ్యమే వుంటుంది. అంటే వాళ్లు వాళ్లు కొట్లాడుకుంటుంటే మేమున్నామని బడుగులు ముందుకు రారు..పదవులు కోసం ఆలోచించరు…పైగా .బడుగులు ఇరు వర్గాలకు అండగా నిలిచేలా చీలిపోతారు….ఇది అసలు రెడ్డి రాజకీయం….బడుగులు ఒకరికొకరు కులాలుగా విడిపోవాలి. రెడ్డి నాయకులకు తోడుగా నిలవాలి…అందుకే బడుగుల్లో ఏకతా కనిపించొద్దు. అంటే ఎప్పుడూ రెడ్డీలంతా ఏదో ఒక విదాదం రేపుతూ వుండాలి. ఆ వివాదం ఎప్పుడూ సమాజంలో నలుగుతూ వుండాలి…వాళ్లు దాన్ని ప్రచారం చేసుకుంటూ వుండాలి…ఎన్నికలదాకా సాగదీస్తూ వుండాలి. బడుగులు మేం నాయకులమనే అన్నది మర్చిపోయేలా వుండాలి…పెత్తనం అందడం మొదలయ్యాక రెడ్డీలంతా ఒకటే అని ప్రచారం చేసుకోవాలి…బడుగులకు చిన్న చిన్న పదవులు ఎరగా వేసి, ఎదగకుండా చేయాలి…ఇవన్నీ బడుగులను మోసం చేసేందుకు రెడ్డీ నాయకత్వం వేసే పగటి వేశాలే తప్ప, నిజాలు కాదు..వాళ్ల మధ్య దూరం ఎప్పుడూ వుండదు…నటిస్తారంతే….మాది పాలి పగ అని బీరాలు పలుకుతారంతే…వాళ్లు వాళ్లు కొల్లాడుకుంటే పాలివాళ్లు…పక్కొడు ఇంటి మీదికొస్తే వాళ్లంతా ఒక్కంటి వాళ్లు…ఇదే రాజకీయంలో రెడ్డీలు అనాధిగా అనుసరిస్తున్నారు. బడుగులను ఎదకుండా చేస్తున్నారు…

    రాష్ట్రంలో కలిసి, కలివిడిగా తిరిగే తీరిక లేని రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిలు కలిసి విదేశాల్లో సంచరిస్తుంటారు..

.ఇద్దరూ కలిసి సభలు పంచుకుంటారు…మేమిద్దరం ఒక్కటే అని సంకేతాలు పంపుతారు…రాష్ట్రంలో మాత్రం నాకు నేనే…నీకు నువ్వే..అంటూ కలరింగులిస్తారు…ఇద్దరు రెడ్లు కయ్యం పెట్టుకుంటున్నారంటే అక్కడ ఏ బడుగు నేతకో మూడిరదనే అంటే ఏమిటో అనుకునేవారు….దూరం పోతే చెట్టాపట్టాలేసుకొని తిరిగి, రాష్ట్రంలో మాత్రం ఎడమెహం పెడ మొహమేసుకొని రాజకీయం చేస్తారు…రేవంత్‌ రెడ్డి నల్లగొండకు వెళ్లే ఎలా వస్తావని కోమటి రెడ్డి గుడ్లురుముతాడు…? అప్పుడే అనుకున్నారు…ఈ ఇద్దరి మధ్య లేని కయ్యం తెరమీదకు వచ్చిందంటే ఏదో బడుగునేతకు ఎసరొస్తుందని? అనుకున్నంత పనైంది? నల్లగొండలో తెలంగాణ ఉద్యమకారుడైన బడుగుల నేత అద్దంకి దయాకర్‌కు అడ్డంకులు సృష్టించడంలో ఇద్దరూ సఫలీకృతయ్యారు…అద్దంకి దయాకర్‌కు రేవంత్‌ రెడ్డి పుల్‌ సపోర్టులా కనిపిస్తుంది? కాకపోతే అది పైకి మాత్రమే అన్నది అద్దంకికి ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రేవంత్‌రెడ్డిని కాదని, ఆయనకు తెలియకుండా కోమటి రెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎలా సప్పెండ్‌ అయిన నాయకుడికి కండువా కప్పి, పార్టీలోకి తెస్తాడు? ఈ మాత్రం రాజకీయం అర్ధంకానంత అమాయకులా తెలంగాణ ప్రజలు…గత ఎన్నికల్లో అద్దంకి విజయానికి అడ్డుపడిరది ఎవరో తెలియంది కాదు? అద్దంకి దయాకర్‌ ఓటమిని పక్కాగా టిఆర్‌ఎస్‌ ఎత్తుగడగా చిత్రీకరించింది ఎవరో తెలియందా? ఇప్పటికైనా రెడ్డీలు ఆడే రాజకీయం అద్దంకి దయాకర్‌కు అర్ధమైతే తప్ప, ఆయన సీటు ఆయనకు ఖరారు కాదు…లేకుంటే ఆఖరుకు అద్దంకిని కూడా కాదనుకోవడానికి రెడ్డీలు వెనకాడరు…అద్దంకిని ఆటలో ఆరటిపండును చేయుకుండా వుండరు…?

                    చేజేతులా చేతి గుర్తును నమ్మి, జాతీయ స్ధాయి నాయకులకు తెలంగాణకు వస్తే గుర్తొచ్చే దాసోజు శ్రవణ్‌కు ఈసారి కాంగ్రెస్‌ మొండి చేయి చూపుతందనడంతో సందేహం లేదు.

 ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పిపిసి అధ్యక్షుడు చేపడుతున్న రెడ్డీల సమీకరణాలే ఇందుకు నిదర్శనం. ఉద్యమ కారుడైన దాసోసు శ్రవణ్‌కు టిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం ఎంతో విలువ వుండేది. ఉద్యమ సమయంలో కేసిఆర్‌ వెన్నంటే వుండేవారు. కేసిఆర్‌ డిల్లీ వెళ్లే బృందంలో ప్రతిసారి దాసోసు శ్రవణ్‌ వుండేవారు. అలిగి అత్తవారింటికి, చెడి చెల్లింటికి వెళ్లొద్దంటారు. అలాంటిది ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద కోపంతో కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల ముందు ఆ పార్టీకి అభ్యర్థులకు దిక్కులేక దాసోసుకు టిక్కెట్టు ఇచ్చారు. కాని ఈసారి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పిజేఆర్‌ కూతరు, విజయారెడ్డిని రంగంలోకి దింపనున్నారు. దాంతో దాసోసుకు హాండ్‌ ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్లున్నారు. ఆ సయమంలో దాసేజుకు పార్టీ చెప్పేదొక్కటే వుంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేస్తాం…? ఇంతకన్నా దాసోజు వినడానికి ఏమీ వుండదు? ప్రశ్నించడానికి అక్కడేమీ వుండదు? ఇదే మాట గతంలో టిఆర్‌ఎస్‌లో విని వుంటే ఈ పాటికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవారు. లేదా ఏదో ఒక పదవి అయినా లభించేది. ఇప్పుడు అటూ, ,ఇటూ కాకుండా స్వయంకృతాపరాధంలో చేతిలో చిక్కి విలవిలలాడుతున్నాడు. రెడ్డి రాజకీయం ముందు లేవలేక, నిలవలేక బడుగులకు అన్యాయం కాంగ్రెస్‌లో అని కూడా అరవలేని స్ధితిని తెచ్చుకున్నాడు. మాట కారి శ్రవణ్‌ పార్టీలో బాధ్యతలిస్తామని ఓ లెక్క చెప్పి, అసలు లెక్క నుంచి తప్పిస్తారు? చౌరస్తానే కళ్లముందు చూపిస్తారు?

పదవ తరగతి ఫలితాల్లో శ్రీనివాస్ గురుకుల్ విజయ దుందుభి.

గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూరు శాతం ఫలితాలతో విజయపథంలో సాగిపోతుంది బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ ఉన్నత పాఠశాల- నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో 

చిదురాల అనూహ్య(10/10)

గూగులోతు శివ శంకర్ (10/10) లు 10 కి 10 జిపిఎ సాధించగా

 చిదురాల అనన్య , శ్రీజ ,

ధీరజ్ రెడ్డి ,కిరణ్ ,విశేష్ 9.8 సాధించారు.

హనీష్, లుబ్న, రసజ్ఞ , షైనీష్మ , శ్రీ ధన్య, రామ్ చరణ్ లు 9.7 సాధించారు.

మొత్తం 37 మంది విద్యార్థులు హాజరవగా అందరూ (100%) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో గణితంలో 27 మంది కి10,, సైన్స్ లో 21 మందికి ,సాంఘిక శాస్త్రంలో20 మందికి 10 జిపిఎ 

వచ్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ చిదురాల సోమరత్నం తెలిపారు.

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం వినయ్ ,విజయ్ ,పద్మశ్రీ ,

హాఫీజ, శ్రీనివాసరావు, రాజేష్ యుగంధర్ ఘనంగా సత్కరించారు.

సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి

సిద్దిపేట పోలీసుల తోపులాటలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి కి తీవ్ర గాయాలు

 

NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ని సిద్దిపేట పోలిసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో వెంకట్ కి తీవ్ర గాయలవ్వడం జరిగింది.

మొదట చిన్న కోడూరు పోలీసు స్టేషన్ నుండి బల్మూరి వెంకట్ ని తోగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి, అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కి తరలించగా వెంకట్ సృహ కోల్పోవడంతో గజ్వేల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

సిద్దిపేట పోలీసుల తోపులాటలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి కి తీవ్ర గాయాలు

NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ని సిద్దిపేట పోలిసులు అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన తోపులాటలో వెంకట్ కి తీవ్ర గాయలవ్వడం జరిగింది.

మొదట చిన్న కోడూరు పోలీసు స్టేషన్ నుండి బల్మూరి వెంకట్ ని తోగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి, అనంతరం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కి తరలించగా వెంకట్ సృహ కోల్పోవడంతో గజ్వేల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయగా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు

సిద్దిపేట బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అశ్వస్థకు లోనై సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 120 మంది విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని అక్రమంగా అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు

గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో అధికారులు నిర్లక్ష్యంతో వండిన కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్యస్థకు లోనైన 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే

ఉద్దేశంతో వారి పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం సాయంత్రం వారిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

సదరు బాలికలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నుండి సిద్దిపేటకు బయలుదేరిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరిని సిద్దిపేట జిల్లా చిన్నకోడురు పోలీసు సిబ్బంది రామునిపట్ల స్టేజ్ వద్ద వెంకట్ బల్మూరి వాహనాన్ని బలవంతంగా అడ్డుకున్న క్రమంలో స్థానిక NSUI మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులను నిలువరించే ప్రయత్నం చెయ్యడంతో ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది.తాను కేవలం వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకునే ఉద్దేశంతో పోతున్నామని వెంకట్ బల్మూరి పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినని పోలీసులు అత్యుత్సాహంతో వారిని అదుపులోకి తీసుకొని చిన్నకోడురు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

బిసి కమిషన్ కు జీవన స్థితిగతులను వివరించిన సగర సంఘం

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలో సగరుల జీవన స్థితిగతులు అగమ్య గోచరంగా మారాయని, సమాజంలో సగరులు సమానత్వ జీవనం కొనసాగించేందుకు బిసి ‘డి’ నుంచి ‘ఎ’ కు

మార్చాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర బిసి కమిషన్ ముందు గోడును వెళ్లబోసుకుంది. బుధవారం తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణమోహన్, సభ్యులు కిషోర్ గౌడ్, శుబప్రద్ పటేల్, ఉపేంద్ర లతో

సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది సగరులు నిర్మాణ రంగమే కులవృత్తి గా కొనసాగుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడ్డారని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సగర సంఘం నాయకులు స్థానికంగా సగరుల జీవన స్థితిగులను కమిషన్ ముందు తెలియజేశారు. ఆదిమాన‌వుడు నాగ‌రిక‌త వైపు అడుగులు వేస్తున్న క్ర‌మంలో మొట్ట మొద‌ట‌గా భూమండ‌లంపై ఉప్పు పంట‌ను పండించిన తమ పూర్వీకులు ఉప్పు మ‌డులు క‌ట్ట‌డానికి ప‌నిముట్లు త‌యారు చేసుకొని అప్పటి రాజుల వద్ద చెరువులు,కుంటలు, రహదారులు నిర్మించడం ద్వారా తమకు ఉప్పరి పని (నిర్మాణ) రంగం కులవృతిగా వచ్చిందని తెలిపారు. కాల‌క్ర‌మేణా స‌మాజంలో తమ జాతి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డం వల్ల తమ కుల‌వృత్తిలో ఇత‌ర కుల‌స్థులు కూడా వ‌చ్చి చేర‌డం జరిగిందని తెలిపారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు చారిత్ర‌క క‌ట్ట‌డాల‌లో, భారీ ప్రాజెక్టుల‌లో, రోడ్ల నిర్మాణాల‌లో, నివాసాలైన బంగ్లాల‌ను, చివ‌రికి స‌మాధుల‌ను సైతం క‌ట్టి స‌మాజ నిర్మాత‌లుగా ఉన్న తమకు నేడు ఉండ‌డానికి నిలువ నీడ లేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం మ‌మ్మ‌ల్ని కుల ప్రాతిప‌దిక‌గా బిసి డి లో చేర్చారని, పలితంగా ఎలాంటి రిజర్వేషన్లు తమ కులానికి రాకపోవడం కారణంగా ఆన్ని రంగాలలో వెనుకబాటుకు లోనయ్యమని బాధ వ్యక్తం చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 1970వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వం కులాల జీవ‌న స్థితిగ‌తుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన అనంత రామ‌న్ క‌మిష‌న్ స‌గ‌రుల జీవిత స్థితిగ‌తుల‌పై పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేసి స‌గ‌రులు బిసి ‘డి’ లో ఉండ‌డం స‌ముచితం కాద‌ని అప్ప‌టి ప్ర‌భుత్వానికి నివేదించిందని తెలిపారు. అనంత‌రం 1986వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్‌.టి.రామారావు కులాల స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం కోసం ముర‌ళీధ‌ర్ రావు క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారని, ముర‌ళీధ‌ర్ రావు క‌మిష‌న్ కూడా స‌గ‌రులు దేశ దిమ్మరుల‌ని, మ‌ట్టి ప‌నులు చేసుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎక్క‌డ ప‌నులు ఉంటే అక్క‌డికి వెళ్లి ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తార‌ని, బిసి ‘డి’ నుంచి బిసి ‘ఎ’ జాబితాలోకి మార్చాల‌ని ప్ర‌భుత్వానికి సిఫారసులు చేసిందని తెలిపారు. అప్ప‌టి ఎన్‌.టి.రామావు ప్ర‌భుత్వంలో స‌గ‌రుల‌ను బిసి ‘ఎ’ జాబితాలోకి మార్చారని, కొంద‌రు వ్య‌క్తులు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు సగరులను బిసి ‘డి’ లోనే కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్థికంగా, రాజ‌కీయంగా ముందడుగు వేయ‌లేని అణ‌గారిన వ‌ర్గంగా తమ కులం మ్ర‌గ్గుతోందని, ఒక వైపు నిర్మాణ కూలీలుగా బ్ర‌తుకును వెళ్లదీస్తూ పిల్ల‌ల‌ను చ‌దివించుకోలేని స్థితి, క‌ష్ట‌ప‌డి కొంత‌మంది పిల్లల‌ను చ‌దివించినా వారికి బిసి ‘డి’ జాబితాలో ఉండ‌టం కార‌ణంగా ఉన్న‌త చ‌దువుల‌కు సీట్లు రావ‌డం లేదనిఅన్నారు. స‌గ‌రుల జీవ‌న స్థితిగ‌తుల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌స్తుతం ఉన్న బిసి డి నుంచి బిసి ఎ లోకి మార్చాలని కోరారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బిసి కమిషన్ ను కలిసిన వారిలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ముఖ్య సలహాదారులు అర్ బి ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు సీతా భద్రయ్య సగర, జై తెలంగాణ టీవి సీఈఓ అస్కని మారుతి సగర, నేటిధాత్రి గ్రూప్స్ ఛైర్మన్ కట్టా రాఘవేంద్రరావు సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పేదబుదుల మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి స్రవంతి సగర, కోశాధికారి పల్లవి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్దబుదుల సతీష్ సగర, కోశాధికారి రాము సగర, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రవి సగర, నగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ బాబు సగర, వనపర్తి జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య సగర, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు ప్రనీల్ చందర్ సగర, గద్వాల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ సగర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణ సగర, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రవి సగర, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కృష్ణ సగర, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ సగర, మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ సగర, యాదద్రి జిల్లా అధ్యక్షులు నర్సింహ సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ సగర, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య సగర, నారాయణ పేట జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సగర, రాష్ట్ర నాయకులు వెంకట్రావు సగర, సత్యనారాయణ సగర, దేవన్న సగర, శ్రీనివాస్ సగర, విష్ణు సగర, పద్మయ్య సగర, రవికుమార్ సగర, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు సత్య సగర, విజయలక్ష్మి సగర, సరిత సగర, అలవెలు సగర, చంద్రకళ సగర, వరంగల్ కార్పొరేటర్ కిషన్ సగర, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.

కారుకెదురే లేదు

ప్రతిపక్షాలకు అంత సీన్‌ లేదు?

`బిజెపి కొంగజపాలను తెలంగాణలో నమ్మే దిక్కు లేదు?

`బిజెపి ప్రచారానికి ప్రజల మద్దతు లేదు?

`కాంగ్రెస్‌ లో సఖ్యతకు చోటే లేదు?

`పోటికి ప్రతిపక్షాలకు నాయకులే లేరు?

`జల్లడ పట్టినా పోటీకి ముందుకొచ్చే వారు లేదు?

`జనంలో టిఆర్‌ఎస్‌ కు బలం తగ్గలేదు?

`మరో పార్టీపై ప్రజలకు ఆలోచన కూడా లేదు?

`కకావికలమైన ప్రతిపక్షాలు కూడదీసుకునేందుకు శక్తి లేదు?

`మరో దశాబ్దం కారు జోరుకు ఎదురేలేదు?

`పరాయి మీడియా నోరుకు తెలంగాణలో విలువలేదు?

 రేకుల డబ్బాలో రాళ్లు వేసి చప్పుడు చేస్తే వచ్చేది అనునాదం కాదు, సింహనాదం అంతకన్నా కాదు. శంఖారావం అసలే కాదు. డబ్బా మూత తీస్తే కనిపించేవి రాళ్లే కాని బంగారం కాదు..! అలాగే బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినంత మాత్రాన ఓట్లు రాలవు. బిజేపి నాయకులందరూ ఎక్కడెక్కడినుంచో వస్తున్నారని, వచ్చి వరాలు ప్రకటిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. నిన్నటి దాకా పార్టీ కార్యాలయానికే దిక్కులేని దగ్గర, ఇంత పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఊపొస్తుందని ఊహల్లో తేలిపోతే సరిపోదు. గతంలో జరిగిన సమావేశాలకు, ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు తేడా గమనించారా? కాకినాడలో ఎంత సింపుల్‌గా సమావేశాలు జరిగాయో, ఇప్పుడు ఎందుకంత ఆర్భాటం ప్రదర్శిస్తున్నారో అర్ధమౌతుందా? బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగితే దేశమంతా తెలంగాణ వైపు చూస్తే సరిపోదు. ఆ సమావేశాలతో అభివృద్ధి జరగదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాల్సిన నిధులిస్తే అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌కు వచ్చి ఏం చెబుతారు?పార్టీ అధికారంలోకి రావాలని అంటారు? కాని అధికారంలోకి రావడానికి ఏం చేస్తారని, ఆ లోపు ఏమిస్తారన్నదేమైనా చెబుతారా? లేక నాలుగు మాటలు చెప్పి, జారుకుంటారా? అన్నది జనంలో నలుగుతున్న మాట. గతంలో అభివృద్ధి పనులకు హజరైనప్పుడే ఏం ఇచ్చింది లేదు. కనీసం ఇస్తామని చెప్పింది లేదు. మిషన్‌భగీరధ లాంటి కార్యక్రమానికి నీతి అయోగ్‌ తెలంగాణక నిధులివ్వాలని సూచించిన వాటికే దిక్కులేదు. రాజకీయ సమావేశాలు పెట్టి రాజకీయం చేయడం తప్ప, ప్రగతి కోసం ప్రయత్నాలు చేస్తారనో, ఇక్కడినుంచే నాలుగు ప్రాజెక్టులు ప్రకటిస్తారని మాత్రం ఎవరూ ఊహించడం లేదు. ప్రధానితో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రకటనలు చేయిస్తామని రాష్ట్ర నాయకులు చెబుతున్నది లేదు. ప్రధాని మోడీని నిలదీసేంత శక్తి ఎవరికీ లేదు.

                         రాజకీయమంటే నాయకులు చేసే ప్రచారం కాదు.

 ఒక నమ్మకం. ఒక విశ్వాసం. నాయకుడి వ్యక్తిత్వం. కాకపోతే రాను రాను అర్ధం మారిపోతోంది. అధికారం అన్నదే ప్రతి నాయకుడికి కళ్లకు కనిపిప్తోంది. రాజకీయం అంటే ఒక యజ్ఞం. ఒక వేదం. ప్రజాసేవకు అంకితం. ప్రజలు ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. దేశానికి పాలించే అవకాశం బిజేపికి ఇచ్చారు. కాని బిజేపి ఏంచేస్తోంది? పన్నులతో నడ్డి విరుస్తోంది? ధరలు ఆకాశానికి అంటేలా చేస్తోంది? నూనెలు కొనుక్కొలేం? పప్పులు ఉడికించుకొని తినలేం? పెట్రోలు కొనుక్కొలేం? ప్రయాణాలు చేయలేం? ఎక్కడ విన్నా ఇదే మాట? మేం అధికారంలోకి వచ్చి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పగలిగే శక్తి ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా వుందా? కనీసం ఎన్నికల మందు హమీ ఇచ్చినట్లు విదేశాల్లో నల్లదనం తేలేకపోయామని చెప్పుకునే దుమ్ము వుందా? ఉపాధి కల్పనకు తూట్లు పొడిచారు. జిఎస్టీ పేరుతో జరిగిన అంధకారం కళ్లముందు కనిపిస్తున్నా, జరిగింది పొరపాటు అన్నది చెప్పగలరా? తెలంగాణ ప్రజలకు ఏం చెబుతారు? తెలంగాణకు విభజన సమయంలో ఇస్తామని చెప్పిన వాటిని ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పగలరా? లేక ఇంకా ఏడాది గడువుంది. ఈ లోపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పగలరా? గతంలో ఎన్నికల ముందు ఇలాగే బిహార్‌ వెళ్లిన ప్రధాని మోడీ రూ.80 వేల కోట్లు ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రానికి ఇతోదిక సాయం చేస్తున్నారు. వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. ఇక గుజరాత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి తెలంగాణకు? అన్న ప్రశ్న బిజేపిలోని ఏ ఒక్క నాయకుడైనా ఆలోచించారా? పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారా? నలుగురు ఎంపిలున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తెచ్చారా? ఇలాంటి సమయంలోనైనా ప్రకటింపజేయగలరా? ఇది పార్టీ పరమైన కార్యక్రమాలంటూ దాట వేస్తారా? తప్పించుకోవడానికి ఇదొక సాకుగా ఉపయోగించుకుంటారా? కనీసం ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు బోర్డుకైనా మోక్షం వస్తుందని చెప్పగలరా? దామాషా ప్రకారం వచ్చే నిధులు కేంద్ర ఆర్ధిక సంఘం పంచే వాటాల గురించి చెప్పుకొని పబ్బం గడుపుకుందామనుకుంటే ప్రజలు క్షమించరు. 

                          అసలు ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటన్నది పార్టీలకు పూర్తిగా తెలుసు. 

ప్రజల్లో వారికి వున్న విలువేమిటో తెలుసు. కాని రాజకీయమన్నాక తమకు శక్తి లేదని చెప్పుకుంటే నాయకులు కాలేరు. గెలవలేరు. పార్టీలను గెలిపించుకోలేదు. కనీసం నమ్మకంతో ఓట్లేసే ప్రజలు కూడ ఆ మాత్రం ఆదరించలేరు. అందుకే మేమున్నాం…మాకు ప్రజల్లో బలముందని చెప్పుకోకపోతే వారికి మనుగడ వుండదు. ప్రజా జీవితంలో వుండేందుకు అవకాశమే వుండదు. రాజకీయాలకు పనికిరాదు. బడతున్నోదిదే బర్రే…నోరున్నోడిదే ఊరు అనేవారు…ఇప్పుడు సరిగ్గా రాజకీయాల్లో అదే నడుస్తోంది. నేరేసుకొని ఊరేగని నాయకుడికి మనుగడ లేదు. వారికి విలువ లేదు. అందుకే అందరూ రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్నారు. అలా ప్రతిపక్షంలో నోరున్న నాయకుడిగా ఎలాగో అలాగా గుర్తింపు పొందిన రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటడం తప్ప, చేతులు తంగెళ్లు దాటని పరిస్ధితి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే మంత్రాల బలం లేకపోయినా, తుప్పిళ్ల బలమైనా చూపించుకోవాలన్న తాపత్రయం రేవంత్‌లో బాగానే వుంది. కాకపోతే పార్టీలోనే ఆయన వ్యవహారశైలి ఎవరికీ నచ్చడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌రెడ్డి పార్టీలో ఎవరికీ నచ్చడంలేదు. తన ఇష్టా రాజ్యం చేస్తున్నారు. తనకు ఇష్టమైన వారికి ప్రాధాన్యతనిస్తున్నారు. కారణం ఆయనకే కాదు, అదంరికీ తెలుసు. పార్టీ గెలిచేది లేదు…అధికారంలోకి వచ్చేది లేదు. కాకపోతే పిపిసి పదవిలో వున్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం నెరపాలి. తను అనుకున్న రాజకీయమే చేయాలి. ఎప్పటిలాగా అందరూ చెప్పిన రాజకీయం చేసినా, తన సొంత రాజకీయం నెరిపినా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఎలాగూ లేదు. ఇంకెందుకు సీనియర్లను పట్టించుకోవాలి. ఎందుకు వారి వెంట తిరిగాలి. తనకు పిపిసి పదవి ఇచ్చింది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కాదు. అడుగడుగునా తనకు పదవి రావడాన్ని అడ్డుకున్నారే గాని, ఏనాడు తన గురించి పాజిటివ్‌గా మాట్లాడిన వారు లేరు. మరి అలాంటి వారి కోసం రాజకీయం నెరపడం, వారికి చెప్పి కార్యక్రమాలు చేయడం రేవంత్‌కు ఇష్టం లేదు. సీనియర్లను పక్కన పెట్టుకొని వారికి లేని గౌరవం ఆపాదించడం కూడా రేవంత్‌కు సుతారం నచ్చడం లేదు. పైగా కనిసినున్నంత సేపు ఇష్టం లేని నవ్వులు నవ్వుకొని, అతి కష్టంగా పొగుడుకొని, పక్కకు జరగ్గానే ఎవరికి వారి రాజకీయం చేయడం కాంగ్రెస్‌లో కాకతాలియం కాదు. ఎప్పుడూ జరిగేదే. కావాలని జరిగేదే…ఎల్లకాలం జరిగేదే…అలాంటప్పుడు సీనియర్లకు తాను విలువ ఇవ్వాల్సిన పని లేదు. సీనియర్లకు రేవంత్‌కు గౌరవం ఇవ్వడం అవసరం లేదు. ఎవరికి వారే యమునా తీరే…అంతే మొత్తం మీద పార్టీది గోదారే..?

                  బిజేపి రాజకీయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

అదిగో పులి అంటే, ఇదిగో తోక అనుకునేవారు ఎక్కువయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోకుండా చతికిలబడ్డా, పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్ధానాలు రావడంతో మొదలైంది. మిడిసిపాటు రాజకీయం మొదలు పెట్టారు. కాలం అనుకూలించినట్లుగా తామరాకు మీద పడ్డ నీటి తెంపర అటూ అటూ పరుగులు పెట్టినట్లు ఆగడం లేదు. నాలుగు సీట్లకే ఇంత హడావుడి చేస్తే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌కు ఎంత దూకుడుండాలి. ఎంత రాజకీయం చేయాలి. ఉప ఎన్నికలు కలిసి వచ్చినంత మాత్రాన ఇక అంతా మేమే…వచ్చేది మేమే… ఇక రాజ్యాధికారం మాదే అనుకుంటూ పగటి కలలు కనడం మొదలుపెట్టారు. హడావుడి చేస్తున్నారు. కాకపోతే అధికారంలోకి వస్తున్నట్లు గ్రూపులు కూడా తయారు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం మాదే అనుకుంటున్నారు. రాష్ట్రానికి ఏం తెచ్చేందుకు ప్రయత్నం చేద్దామని ఏ ఒక్క రోజైనా బిజేపి పార్టీ రాష్ట్ర నాయకత్వం కూర్చుని మాట్లాడినట్లు ఏ ఒక్క రోజైనా కనిపించిందా? అందుకు సంబంధించిన ఒక్క వార్తయినా వచ్చిందా? కాని నాదో గ్రూపు, నీదో గ్రూపు. అధ్యక్షుడు బండి సంజయ్‌ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేల అలక. గ్రూపులున్న మాట వాస్తవమే అని ఒప్పుకోలు మాట. ఎవరికి వారే, యమునా తీరే….అప్పుడు ఎన్నికలు జరిగినట్లు, గెలిచినట్లు,తాము ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలు గంటున్న గ్రూపులు కూడా బిజేపిలో మూడు నాలుగున్నాయంటే ఆశ్చర్యం అక్కర్లేదు.

అక్షరం చెక్కిన నిజాలు నేటిధాత్రి విశ్లేషణలు!

పాఠకుల కోరిక మేరకు అన్ని నియోజకవర్గాల రాజకీయ సమాచారం?

విశ్లేషణలతో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం

ప్రజల్లో చైతన్యం కోసం` రేపటితరం భవిష్యత్తు కోసం…

నిజం నిర్భయంగా ప్రజల ముందుకు 

నియోజకవర్గాలలో పరిస్ధితులు అక్షరావిష్కారం చేస్తాం….

ప్రజాస్వామ్య మేలుకొలుపుకు వారధులౌతాం…

సమాజంలో నిజం అన్న పదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించకుండా పోతున్న తరుణమిది. ఏది నిజం? ఏది అబద్దం? అన్నది తెలుసుకోవడం కష్టమైపోతోంది. హంస క్షణాల్లో పాలు, నీళ్లను వేరు చేసినా, నిజం, అబద్దం తెలుసుకోవడానికి కొంత కాలం పడుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా చెబితే నిజం చెబుతున్నారా? అబద్దం చెబుతున్నారా? అన్నది పసిగట్టేవారు. కాని మహానటులు పెరిగిపోయారు. నిజం అంటే ఎలా ఉంటుందో కూడా కనిపించకుండా చేస్తున్నారు. ఇది వ్యక్తులకు, వ్యవస్ధకు, సమాజానికి మంచిదికాదు. ప్రజలు ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. నిజాన్నే గ్రహించాలి. నిజం వైపే నిలబడాలి. అబద్దాలొచ్చి ఆడాల్సిన ఆటలన్నీ ఆడుతుంటాయి. నిజాన్ని మరుగున పడేస్తుంటాయి. వాటిని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం ప్రపంచంలో ఒక్క అక్షరాలకే వుంది. అందులోనూ మీడియాకే ఉంటుంది. కాకపోతే ఆ మీడియా కూడా అబద్దాల ప్రయాణం చేయడం అలవాటు చేసుకుంటోంది. దాంతో ఏది నిజమో! ఏది అబద్దమో!!తెలియకుండా పోతుంది. 

నిజం చెప్పే మీడియాను కూడా పాఠకులు అనుమానంతో చూడాల్సి వస్తుంది. కాకపోతే నిబద్దత అన్నది ఒక్క రోజులో చెరిగేది కాదు. ఎవరూ చెరిపేస్తే చెరిగిపోదు. అందుకే ఎవరేమనుకున్నా? ఎన్ని అవాంతరాలెదురైనా చెప్పాలనుకున్నదానిని నిజాయితీగా చెప్పడం నేటిధాత్రికి తెలుసు. నికార్సైన అక్షరాలకే నేటిధాత్రిలో స్ధానం. మా వార్తల్లో నిజానికే అగ్రతాంబూలం. నేటిధాత్రి చేసే అక్షర యజ్ఞం పాఠకులకు తెలుసు. అందుకే పాఠకులకు మాత్రమే ఒక్క మాట చెప్పడానికి ముందుకొచ్చాను. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఏమనుకుంటున్నాయి? వాటి ఆలోచనలు ఏమిటి? వాటి అంచనాలు ఏమిటి? ఆ నాయకుల పరిస్ధితి ఏమిటి? పార్టీల పరిస్దితి ఏమిటి? అన్నది ప్రతి ఒక్కరి మదిలోనూ మెదలుతున్న ప్రశ్న. ఏ ఇద్దరు ఒక చోట చేరినా రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోకుండా వుండని పరిస్ధితి.

ప్రపంచం మన కళ్లముందే కాదు, అరచేతిలో నిక్షిప్తమైవుంది. అందుకే దేశంలో ఏంజరుగుతోంది? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రపంచం ఎటు పోతోందన్నది క్షణాల్లో తెలిసిపోతోంది? అయితే అసలైన బురిడీ ఇక్కడే దాగి వుంది. కన కళ్లకు కనిపించేందంతా నిజం కాదు? మన చెవులకు వినపడేదంతా నిజం కాదు? మరి నిజమేమిటి? నిజమంటే ఎలా వుంటుందన్నది తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కొన్ని సార్లు అర్ధం చేసుకోకుండాపోతోంది. అందువల్ల నిజం మాత్రమే చెప్పడం నేటిధాత్రి అభిమతం. నేటిధాత్రిలో వచ్చే ప్రతి విశ్లేషణ ప్రజల ఆలోచనల నుంచి వచ్చేవే…. నేటిధాత్రి యాజమాన్యం కాని, యంత్రాంగం వ్యక్తిగత ఆలోచనలు ఎక్కడా పొందరపర్చదు. క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతోందన్నదానిని సునిశితంగా అధ్యయనం చేసిన తర్వాతే ఏ విశ్లేషనైనా చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ఏఏ పార్టీల బలాబలాలు అన్న విషయాలపై కథనాలు మొదలుపెట్టాం. అయిత ే శ్రేయోభిలాషులైన పాఠకులు చాలా మంది ఈ వరుస కథనాలపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. 

వరుస కథనాలపై వారి వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. అందులో కేవలం కొన్ని నియోజకవర్గాలే కాకుండా, తెలంగాణ మొత్తం నియోజకవర్గాలలో రాజకీయ పరిస్ధితులపై పూర్తి స్ధాయి విశ్లేషణలు కావాలని కోరుతున్నారు. మేం కూడా ఎక్కడైతే ఎమ్మెల్యేలపై విమర్శలున్నాయో అక్కడే కొంత ఫోకస్‌ చేయాలని అనుకున్నాం. కాని పాఠకుల సూచనల మేరకు మొత్తం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో పరిస్ధితులను క్షేత్రస్ధాయి నుంచి అధ్యయనం చేస్తున్నాం. ఇందులో తమ, తర అన్న బేధం లేదు. ప్రజల ఆలోచనలు, జరిగిన అభివృద్ధి, యువత భావాలు, ఆ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు, ఇలా అన్ని రకాల అంశాల మేలవింపుతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. మూడు రోజుల్లో వెలువరించిన మూడు నియోజకవర్గాల పరస్ధితిపై చేసిన విశ్లేషణలు, చెప్పిన క్షేత్రస్ధాయి నిజాలు పాఠకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. నేటిధాత్రి ప్రచురించే విశ్లేషణలు ఎవరి అభిరుచులకు అనుగుణంగావుండవు. పాఠకులకు నిజాలు చేరవేసే అక్షరాలే వుంటాయి. 

ఇందులో రెండో మాటకు తావులేదు. ఏపార్టీకి అనుకూలం ఉండదు. ఏ పార్టీకి వ్యతిరేకం ఉండదు. జనం మాటలు మాత్రమే ఉంటాయి. జరిగిన విషయాలే సూటిగా, స్పష్టంగా ఉంటాయి. ఇవి ఎవరి కోసం సాగవు…ఎవరికీ ఆపాదించబడవు…మొత్తం ప్రజాభిప్రాయం వ్యక్తం చేస్తుంటాయి. నిజాలు మాత్రమే కనిపిస్తుంటాయి. స్పందన చాలా బాగా వుంది…పాఠకుల ఆసక్తి కూడా మరింత పెరిగింది. అందుకు అందరకీ వందనాలు…మా నేటిధాత్రిని ఆదరిస్తున్న పాఠకులకు పేరుపేరునా కృతజ్ఞతలు…ఎప్పుడూ జనహితమే మా అక్షరం…సమాజం కోసం మా ప్రయాణం…సమాజ గతిని మార్చే ప్రగతే మా సంకల్పం…తెలంగాణ సర్వతోముఖాభివృద్దే మా లక్ష్యం…నిప్పు కాలిన తర్వాతే స్పందిస్తారు…? నిజాలు నచ్చని వారే నిందలకు దిగుతారు? నిజం ఎప్పుడూ నిర్భయంగానే వుంటుంది. ధన్యవాదాలు…ఇక తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాల సమగ్ర విశ్లేషణలు ఇకపై మీ నేటిధాత్రిలో మీ కోసం…సమాజం కోసం…!

                                              ఇట్లు

మీ కట్టారాఘవేంద్రరావు.

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.

కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

స్టేషన్‌ మాస్టర్‌ కడియమే!

తాటికొండ ను తప్పించి,కడియానికి స్టేషన్‌ రాసిచ్చినట్లే!!

తాటికొండపై శ్రేణులు వ్యతిరేకమే?

ఆది నుంచి తాటికొండ వివాదాల మరకలే!

ఎంతో నమ్మకంతో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా నిలుపుకోలేకపోయారు?

నమ్మకాన్ని ఆదిలోనే కోల్పోయారు?

గత ఎన్నికలోనే తప్పిస్తారనుకున్నారు?

అప్పుడు అందరి అంచనాలు కేసిఆర్‌ పటాపంచలు చేశారు?

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా చేశారు?

అలా కూడా రాజయ్యను గెలిపించుకున్నారు?

అయినా రాజయ్యలో మార్పు రాలేదు?

తాజాగా తమ్ముడికి దళితబంధు తో రాజయ్యపై విమర్శలు!

రాజయ్య మీద వున్న చిలిపి ప్రచారాలు మరెవరిమీదా లేవు?

అందుకే ఈసారి మార్చక తప్పదనుకుంటున్నారు?

నిజాయితీ పరుడుగా కడియం కు పేరు?

వివాదరహితుడుగా గుర్తింపు?

అజాతశత్రువు గా ఆది నుంచి అందరివాడు..

ఈసారి కడియంతోనే స్టేషన్‌ కు పట్టం..

నాయకులు, కార్యకర్తలు, ప్రజలది ఒకటే మాట…కడియం వస్తే కారుదే విజయం…

ప్రజాసేవ అన్నది ఒక దైవ కార్యం. ఒక రకంగా లక్షల్లో కొందరికి మాత్రమే వరించే వరం. ప్రజల్లో ఒకడిగా, ప్రజలందరికీ ప్రతినిధిగా, వారికి అండగా నిలిచే అదృష్టం అందరకీ వచ్చేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. పది కాలాల పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం. వారి జీవితంలో తరతరాల సుస్ధిర స్ధానం. అప్పుడే పది తరాలైనా ప్రజలు ఆ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకుంటారు. లేకుంటే మలితరం కూడా మర్చిపోతారు. అదేంటో నాయకులు కావడానికి ఎంతో కష్టపడతారు? ఎదురైన ప్రతి వ్యక్తిని పలకరిస్తారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. అండగా వుంటామంటారు. ఇల్లిల్లు తిరుగుతారు… హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తారు…ఇలా అనేక రకాలుగా ప్రలజకు చేరువ కావాలని చూస్తారు. పదవుల కోసం పాకులాడుతారు….కాని ఒక్కసారి ప్రజలు దీవించి ప్రజా ప్రతినిధిని చేస్తే అన్నీ మర్చిపోతారు. ఇలాంటి వాళ్లు కూడా చరిత్రలో చాలా మందే వుంటారు. అందుకే ప్రజల మేలు కోరిన నాయకులు ప్రజల గుండెల్లో నిలవగలుగుతున్నారు. ఎంత కాలమైనా వాళ్లే మాకు నాయకులుగా రావాలని కోరుకుంటారు. ప్రజలను మర్చిపోయేవారు, ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు రాజకీయాలకు దూరమౌతారు. ప్రజా జీవితం దూరం చేసుకుంటారు. అలాంటి రెండు రకాల నాయకత్వాలు కలగలిసి వున్న నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఒకరు కడియం శ్రీహరి, మరొకరు తాటికొండ రాజయ్య. ఇద్దరూ…ఇద్దరే…ఒకే ఒరలో రెండు కత్తులే…భిన్న దృవాలే…గతంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా నువ్వా నేనా అంతగా పోరు సాగిందే…ఇప్పుడూ అంతే…కాకపోతే అప్పుడు వైరి వర్గం…ఇప్పుడు స్వపక్షం…కాని ప్రజల గుండెల్లో వేరు…వేరే…ఒకే గూటిలో వున్నా, ఈసారి కూడా నువ్వా…నేనా…అంతే…ఇలాంటి రాజకీయ రాజీ పరిస్ధితులు చాలా అరుదు. ఎక్కడ జారిపోయిందో అక్కడ వెతుక్కోవాల్సిన దారిలో ఒకరు…దక్కిన చోట వదులుకోవడం ఇష్టం లేని నాయకుడు మరొకరు…కాకపోతే ఈసారి ఎన్నికల పరిస్ధితులు వేరు…అవకాశాలు కొన్ని సార్లు వెత్తుక్కుంటూ వస్తాయి. ఎవరికీ రాని అవకాశాలు మోసుకొస్తాయి…కాని నిలుపుకున్నప్పుడే వాటికి స్ధార్ధకత. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫోన్‌చేసి రాజయ్య నీకు అవకాశం ఇస్తాను…అని చెప్పి మరీ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే కడియం శ్రీహరి విషయంలోనూ ఎవరూ ఊహించని నాయకత్వం ఆయనకు అందిస్తానని కూడా కేసిఆర్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ప్రజలకు చెప్పారు. అది కాకతాలీయంగా జరిగినా ఇద్దరికీ అవకాశం అలా కలిసి వచ్చింది. కడియం శ్రీహరికి తన నాయకత్వ సమర్థతతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజయ్య చేజార్చుకున్నాడు. మంత్రి వర్గం నుంచి తప్పించబడ్డారు. అది స్వయంకృతాపరాధం. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించారు. ప్రతిపక్షాలు రాజయ్యను అడ్డంపెట్టుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేసి, అస్ధిర రాజకీయాలు సృష్టించే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని వారి ఎత్తులు, జిత్తులు చెల్లకుండా, వారి పాచికలు పారకుండా రాజయ్యకు అవకాశమిచ్చారు. రాజయ్య గెలుపు కష్టమే అనుకున్న చోట కడియం శ్రీహరితో సహా, నాయకులంతా కలిసి రాజయ్యను గెలిపించారు. కాని రాజయ్య చిలిపి పనులు తగ్గించుకోలేదు…ఆయన చేసే చేష్టలు ఆపుకోలేదు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మైనస్‌. ఎంత ఎదిగితే అంత ఒదిగి వుండాలన్నది మర్చిపోయాడు…తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాలి.

ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ప్రతి వ్యక్తి చూపును పసిగట్టుకుంటూ సాగాలి. అంతే కాని పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, నన్నెవరూ చూడడం లేదనుకుంటే ఎలా అన్నది..ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నికల ముందు రాజయ్యకు సంబంధించిన ఓ ఆడియో పెద్దఎత్తున వైరల్‌ అయ్యింది. అయినా అది పరువుపోయేంత పెద్దది కాదనుకున్నారో…ఏమోగాని..ఆ పనులు తగ్గించుకోలేదు…ఆ మధ్య ఓ బర్త్‌డే ఫంక్షన్‌లో మరో వివాదాన్ని మూట గట్టుకున్నారు. ఓ స్కూల్‌ విద్యార్ధిని చేత అన్నం తినిపించుకోవడం విమర్శల పాలయ్యారు. నాయకుడి ప్రజా జీవితం, అద్దాల మేడ ఒక్కటే…లోపలి నుంచి రాయి విసిరినా, బైట నుంచి రాయి పడినా అద్దమే పగులుతుంది. నాయకుడే ఇబ్బంది పడుతాడు. ఈ చిన్న లాజిక్‌ మర్చిపోయి, లక్షల్లో కొందరికి వచ్చే అరుదైన అవకాశాన్ని కూడా చేజార్చుకునే పనులే చేస్తూ వస్తున్నారు? అయినా ఇంకా అదృష్టం రాజయ్యకు కలిసి వస్తుందనే చెప్పాలి. తాజాగా రాజయ్య సోదరుడిపై ఓ మహిళ చేసిన పిర్యాధు కూడా రాజయ్యకు మరో ఎదురుదెబ్బనే తెచ్చిపెట్టింది. దానికి తోడు దళిత బంధు ఎంపికలో తన తమ్ముడి పేరును చేర్చి మొత్తం ప్రభుత్వం పరువు తీసినంత పనైంది. గతంలో పారా మెడికల్‌ ఉద్యోగాల అమ్మకాలే పదవిని పోగొట్టినా ఆయనలో మార్పు రాకపోవడం గమనార్హం. తనకు వ్యతిరేకంగా వున్నారన్న ఏకైక కారణంతో సొంత పార్టీకి చెందిన నేతలను, కార్యకర్తలను సైతం రాజయ్య ఇబ్బందులకు గురిచేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. వారిపై కేసులు నమోదు చేయించి, వారి జీవితాలతో ఆడుకున్నట్లు కూడా కొందరు చెప్పుకుంటారు. తన రాజకీయ జీవితంలో ఎన్ని అవకాశాలు వచ్చినా, ప్రజలు ఓ తరం గుర్తుంచుకునేలా పనులు చేయాల్సింది పోయి, చెప్పుకోవడానికి వివాదాలు తప్ప మరేం లేని నాయకుడయ్యాడు…రాజయ్య అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాడు…

ఇదిలా వుంటే ఒక నాయకుడు ఎంతకాలమైనా ఆ ప్రజల్లో గూడు కట్టుకొని వుంటాడని చెప్పడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒక సాక్ష్యమనే చెప్పుకోవాలి. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలు కొన్ని వేలమంది కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని ఒత్తిడి చేసిన సందర్భం చూశాం. రాజకీయంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన నాయకత్వ ప్రతిభను చూపించుకుంటూ ఎదిగిన నాయకుడు కడియం శ్రీహరి. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించిన మంత్రి పదవులు విజయాలు ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేవే…ఒక తరం బాగుపడేందుకు ఉపయోగపడినవే…! ముఖ్యంగా తన సామాజిక వర్గం కోసం కడియం శ్రీహరి తన శక్తి మేరకు, పరిధి మేరకు కూడా ఎంతో చేశాడనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిన రిజర్వేషన్‌ కూడ అమలు జరగడానికి పరోక్ష, కారణం కూడా కడియం శ్రీహరే…సహజంగా సమాజంలో ఎస్సీ, ఎస్టీలను ఒక మెట్టు పైకి ఎక్కించేందుకు అంతకు ముందుగాని, తర్వాత గాని ఎవరూ చేయని పనులు కడియం శ్రీహరి చేశారు. ఎవరూ ఊహించనివి కూడా చేశారు. సాధ్యం కావనుకున్నది సుసాధ్యం చేశారు. ఇంటర్‌, డిగ్రీచేసిన ఎస్సీ, ఎస్టీయువతకు ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలిచే పరిస్ధితులు లేని సందర్భంలో వారికి కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిగా డిఎస్సీ నిర్వహించి సంచలనం సృష్టించారు.

ఆనాడు ఎన్ని అవరోధాలు ఎదరైనా ఆ డిఎస్సీ నిర్వహించారు. ఎంతో మంది జీవితాలల్లో వెలుగులు నింపారు. ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి, వారికి ప్రత్యేక ఉపాద్యాయ శిక్షణలిప్పించారు. దాంతో ఒక తరం ఎస్సీ, ఎస్టీల అడుగు ముందుకు పడిరదని చెప్పడంలో సందేహంలేదు. ఇక ఆయన హయాంలోనే పెద్దఎత్తున సుమారు 42వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయించి, విద్యారంగం పట్టిష్ట పర్చడంలో కడియం పాత్ర చెరిగిపోలేనది. చెరిపేయలేనిది. తెలంగాణలో దేవాదుల ఎత్తి పోతల అన్నది ఒక చరిత్ర. దానికి శ్రీకారం,నాంది, ప్రాస్తవన అంతా శ్రీహరే అని చెప్పకతప్పదు. ఇప్పటికీ స్టేషన్‌ ఘన్‌ఫూర్‌లో కనిపిస్తున్న అభివృద్ధి కడియం శ్రీహరి చేసిందే అన్న మాట ఎక్కడ విన్నా వినిపించేదే… ఇక నాయకుడిగా ఆయన 2004 ఎన్నికల్లో నాటి రాజకీయ పరిస్ధితుల మూలంగా ఓడిపోయారు. మళ్లీ, 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించిన నాయకుడు కడియం శ్రీహరి. ఏ పార్టీలో వున్నా, అంకితభావంతో పనిచేయడమే కాదు, తన శక్తియుక్తులను పార్టీ కోసం వినియోగిస్తారు. అందుకే ఆయనను మాటకారి, చేత కారి అని కూడా చెప్పుకుంటారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ 180 స్దానాలతో గెలిచినా, బలమైన ప్రతిపక్షం కూడా ఏర్పడిరది. నిత్యం ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలని, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రయత్నించేవారు. ప్రతి దాన్ని వివాదం చేస్తూ వుండేవారు. ఈ సందర్భంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా కనీసం ఎలాంటి జంకూ లేకుండా తొంబై మంది సభ్యులు నా వెనక వున్నారని అనుకుంటున్నారు…ఎంత మంది వున్నా మీరు ఏకాకే అంటూ వైఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా నాడు వైఎస్‌ చరిత్రను ఏకరువు పెడుతూ, తూర్పార పట్టారు. ఇలా తనదైన రాజకీయం నెరపడం కడియం తెలిసినంత రాజయ్యకు తెలియదు. రాజకీయంగా విజయాలే కాదు, నియోజకవర్గాన్ని ప్రగతి పధంలో నడిపారు. ఒక దశలో జిల్లాలో, నియోజవర్గంలో అడుగుపెట్టలేని పరిస్ధితులను కూడా ఎదరించి, మావోలనుంచి ముప్పుపొంచి వున్నా, లెక్క చేయకండా అభివృద్ధి కార్యక్రమాలకు హజరయ్యేవారు. ప్రజా జీవితంలో తన ప్రజా సేవను ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్లిన నాయకుడు కడియం శ్రీహరి. అందుకే ఈసారి స్టేషన్‌ ఘన్‌పూర్‌ టిక్కెట్టు కడియంకు ఇస్తే గులాబీ జెండాకు తిరుగుండదు. కడియం గెలుపును ఎవరూ ఆపలేరు…ఇదీ గ్రౌండ్‌ రిపోర్టు…!

రాష్టప్రతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కి తెరాస మద్దతు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో, పాల్గొన్నా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..

NETIDHATHRI జూన్ 27,ఢిల్లీ:

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు.సోమవారం నాడు జరిగిన

యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు,

ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రభాకర్‌ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. కె.ఆర్‌.సురేశ్‌ రెడ్డి హాజరయ్యారు

విధుల నిర్వహణలో వైఫల్యం…ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి స్పస్పెన్షన్

సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ 

ఎంపీఓ పై దాడి చేసిన గ్రామ సర్పంచ్ భర్తపై చట్టపరంగా చర్యలకు తీసుకుంటాం                                   

గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా) నేటి ధాత్రి:* గంభీరావుపేట మండలం లోని ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ సంధ్యారాణి భర్త కొక్కు దేవేందర్ అధికార అండదండలతో గత కొన్ని రోజులుగా ఎం పి ఓ రాజశేఖర్ ను ఒత్తిళ్లకు గురి చేస్తూ అసభ్యకర పదజాలంతో తిడుతూ చంపుతాను అని బెదిరింపులు చేశాడని జూన్ 25. శనివారం రోజున గంభీరావుపేట పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు. గతంలోనూ అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం , సర్పంచ్ గా ఉంటూ సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి పై అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెన్స్ వేటు వేశారు పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించడం, విధుల నిర్వహణలో వైఫల్యం, అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం తో సహా

గ్రామ పంచాయితీ తీర్మానం లేకుండానే చట్ట వ్యతిరేకంగా పనులు చేసి , సంబంధిత గ్రామ సెక్రెటరీ ఎస్ రాజు 

సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లాలోని గంభిరావు పేట

మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ పై 

ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి భర్త దేవేందర్ యాదవ్ భౌతిక దాడులు చేయడం పై

జిల్లా ఎంపీడీవో లు, ఎం పి ఓ , ఏ పి ఓ, సాంకేతిక సహాయకులు, కార్యదర్శుల సంఘాల ప్రతినిధులు నిరసన చేపట్టారు.

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 

మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ లు భౌతిక దాడులకు పాల్పడిన సర్పంచ్ భర్త తో పాటు సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, డి పి ఓ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ మదన్ మోహన్ లకు వినతి పత్రాలు సమర్పించారు.

విధుల్లో సర్పంచ్ కు బదులు ఆమె భర్త దేవేందర్ చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకోవడమే కాకుండా ఉద్యోగులను వేధిస్తున్నాడని తెలిపారు.

దాడుల కు తెగబడిన దేవేందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

స్పందించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సర్పంచ్ కొక్కు సంధ్యారాణి కు బదులు ఆమె భర్త విధుల్లో జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం అన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశామన్నారు. వాటిని స్ట్రిక్ట్ గా అమలు చేయాలని క్షేత్ర అధికారులకు మరోసారి లిఖతపూర్వకంగా ఆదేశాలు ఇస్తామన్నారు.

భౌతిక దాడుల ఘటన పై ఇప్పటికే గంభి రావు పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచిస్తామని తెలిపారు.

అధికారులు, ఉద్యోగుల పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే జిల్లా యంత్రాంగ దృష్టికి తేవచ్చుననీ అన్నారు. అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ లపై ఒత్తిడి తెచ్చిన గంభిరావు పేట మండలం ముస్తాఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి నీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

కూడికలో పోచంపల్లి! తీసివేతలో ముత్తిరెడ్డి!?

ముత్తిరెడ్డికి మూడో సారి టిక్కెట్టు లేనట్లే?

రసకందాయం లో జనగాం రాజకీయం!

నాయకులు సంతృప్తిగా లేరు?

కార్యకర్తలు సంతోషంగా లేరు?

ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు?

కొత్త నాయకత్వంతో టిఆర్‌ఎస్‌ కు తిరుగులేదంటున్నారు?

ఈసారి ముత్తిరెడ్డి ముఖం చూసే ముచ్చటే లేదంటున్నారు?

ముత్తిరెడ్డి కబ్జాలతో జనం లబోదిబోమంటున్నారు?

పోచంపల్లిని జనగామ బరిలో దించాలంటున్నారు?

రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు పక్కాగా వుంటాయి. రాజకీయాల్లో మనుషులు తలకిందులైనా, సరే లెక్కలు ఖచ్చితంగా వుండాలంటారు. కూడాల్సిన చోట కూర్చకుండా, తీసేయాల్సిన చోట తొలగించకుండా వుంటే లెక్కలు తారుమారౌతాయి. అంకెలు ఆగమౌతాయి. సీట్లు గల్లంతౌతాయి. అనుకున్న సమయంలో అనుకున్నట్లు మేలుకోకపోతే మేలుకొలుపు లేకుండాపోతుంది. ప్రపంచమంతా నిద్రావస్ధలో వున్నా, రాజకీయ నాయకుడు కళ్లు తెరిచే నిద్ర నటిస్తాడని సామెత. అందుకే టిఆర్‌ఎస్‌లో ఎవరు ఏకులు, ఎవరు ఏకు మేకులు, ఎవరు అధికులు, ఎవరు లోకులు అన్నది తేలాల్సిన సమయం ఆసన్నమైంది. గత ఎన్నికల్లోనే చాలా మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. కాకపోతే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న నమ్మకంతో ఎమ్మెల్యేలపై వారి అభిప్రాయాలను జనం రుద్దలేదు. అరవై ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ సీమాంధ్రుల చేతిలోకిపోతే మళ్లీ కథ మొదటికొస్తుందని అనుకున్నారు. తెలంగాణలను కాపాడాలంటే మళ్లీ కేసిఆర్‌కే కావాలనుకున్నారు. కేసిఆర్‌ను చూసి మాత్రమే జనం ఓట్లేశారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రసైన ఎమ్మెల్యేలను కూడా మళ్లీ గెలిపించారు. అలాంటి నియోజకవర్గాలలో జనగామ ఒకటి.

అది జనగామ. జైనులు నడయాడిన నేల. వీరులగన్న గడ్డ. పోరాటాల పురిడిగడ్డ. 

రైతాంగ సాయుదపోరాటానికి ఊపిరులూదిన నేల. తెలంగాణ చరిత్రలో జనగామ లేని పేజీ లేదు. పూర్వం జైనులు, తర్వాత శాతవాహనులు, కాకతీయులు, మొగలులను సైతం ఎదిరించిన సర్ధార్‌ సర్యాయిపాపన్న, తెలంగాణ సాయుధ పోరాటం, ముగింపు, మలి దశ తెలంగాణ ఇలా అంతా జనగాంలోనే…అన్నింట్లో జనగామే..అలాంటి జనగామ రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. నూరు శాతం అక్షరాస్యత ముప్పై ఏళ్ల క్రితమే అనేక గ్రామాలు సాధించిన జిల్లా. తెలంగాణ తొలి, మలి దశల తెలంగాణలకు కీలకమైంది. ఎంతో మంది త్యాగధనులకు నెలవైంది. అలాంటి జనగామలో రాజకీయాలు ఎంత గంభీరంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. ఇంత వరకు బాగానే వుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఇష్టారాజ్యం మొదలైందనే మాటలే ఆనాటి నుంచి నేటికీ వినిపిస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో వున్న చెరువు కబ్జా ఆరోపణలతో ఆయన వివాదాలకు మొదలయ్యాయి. జనగామ జిల్లా తొలి కలెక్టర్‌ ఈ విషయంలో ఎమ్మెల్యే తీరును నిరసించిన సందర్భం వుంది. నివేదిక కూడా సమర్పణ జరిగింది. ఎమ్యెల్యే చెరువు కబ్జా విషయం ఆమె భహిరంగంగానే వెల్లడిరచింది. కాకపోతే ఆమె బదిలీ అయ్యింది. అయినంత మాత్రాన ఆయన కబ్జా భాగోతం కనుమరుగు కాలేదు. జనగామలో కొత్తగా నిర్మాణం జరిగిన దుర్గమ్మగుడి స్ధల రిజిస్ట్రేషన్‌ సంగతి సరే సరి…ఇక చేర్యాల చెరువు శిఖం వివాదాం ఇంకా సాగుతున్నదే. 

                      పోలీసులను కాపలా పెట్టి మరీ చేర్యాలలో రాత్రికి రాత్రి ప్రహారి నిర్మాణం భహిరంగ రహస్యమే…

ఇక దెయ్యాల పేరిట ఓ గ్రామంలో ఊరు ఖాళీ అయిన సంగతి తెలిసిందే..దాని వెనుక ఎమ్మెల్యే వున్నట్లు వచ్చిన ఆరోపణలు అలాగే వున్నాయి. నర్మెట్ట మండలంలో ఆయన పామ్‌హౌజ్‌ వివాదం, రోడ్డును సైతం కబ్జా వైనం అందరూ చెప్పుకుంటున్నదే. ఒక ఎమ్మెల్యే అయి వుండి, పట్టణ పర్యటన పేరుతో ఉదయం వేళ షాట్‌ వేసుకొని తిరడాన్ని అప్పటి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే…ఇక గత ఎన్నికల సమయంలో ఓ మహిళా వీర్వోను ఇంటికి పిలిపించుకొని బెదిరించడం, తర్వాత క్షమాపణ చెప్పడం జరిగిందే…జనగామ జిల్లాలో ఏ తెరాస నాయకుడు కూడా ఆయనన గురించి పాజిటివ్‌గా మాట్లాడే సందర్భమే లేకుండా చేసుకున్నారని అంటున్నారు. గత ఎన్నికల మందు కూడా బచ్చన్న పేట మండలానికి చెందిన మహిళలపై కేసులు నమోదు చేయడాన్ని కూడా ప్రజలు తీవ్రంగా ఖండిరచారు. ఇక ఓట్లేయలేదని కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వనని ఎమ్మెల్యే తెగేసి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చిన సందర్భాలు చూశాం? హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలో ఆయనపై వున్న కబ్జాల గురించి వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. ఇక అత్యంత వివాదాస్పదమైన విషయం గురించి చెప్పుకోవాల్సి వస్తే, కొమురవెళ్లి మల్లన్న గుడి వివాదం. ఎమ్మెల్యే ఏకంగా కొత్త విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ప్రజలనుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చీవాట్లు పెట్టడంతో ఆ వివాదం అక్కడితో సర్ధుమణిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వివాదాలు లేకుండా ఏ ఒక్క రోజులేదు. ఆయనకు వ్యతిరేక వర్గమంటూ లేని ఊరు ఒక్కటీ లేదని నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా ముత్తిరెడ్డిని మార్చితే తప్ప, టిఆర్‌ఎస్‌ గెలవడం కష్టమే అని పార్టీ నేతలు మధనపడుతున్నారు. మళ్లీ ముత్తిరెడ్డి పేరు చెప్పిమేం ప్రచారం చేయలేమని, ఆయనపై వున్న ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మార్చలేమని అంటున్నారు. 

జనగామలో ఇప్పటికీ తెరాస ఎంతో బలంగా వుంది.

మిగతా పార్టీలకు ఉనికి కూడా పెద్దగా లేదు. ఆయా పార్టీలలో వున్న రాజకీయ సంక్షోభం మూలంగా ప్రజలకు ఆ పార్టీల మీద నమ్మకం కూడా లేదు. తెరాసలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదం తప్ప, మరేం లేదు. ప్రజలు మొత్తం టిఆర్‌ఎస్‌ వైపే వున్నారు. కాకపోతే పార్టీ ముత్తిరెడ్డిని కాకుండా, ఎవరిని నిలబెట్టినా మళ్లీ గుబాబీ జెండాదే రెపరెపలు అంటున్నారు. కారుకు ఎదురులేదు. ఇలాంటి సమయంలో జిల్లా నాయకుల్లో, కార్యకర్తలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకునే విధానం అందరినీ మెప్పించిందనే అంటున్నారు. ఈసారి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా శ్రీనివాస్‌ రెడ్డికి ఇస్తే జనగామలో కొన్ని దశాబ్దాల పాటు తెరాసకు తిరుగుండకపోవచ్చంటున్నారు. స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా ఆయన జిల్లా మొత్తం నాయకులతో, కార్యకర్తలతో సహా ఏర్పడిన సత్ససంబంధాలు కూడా ఇందుకు కారణమంటున్నారు. పైగా పార్టీపరమైన ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా, జిల్లా సమన్వయకర్తగా ఆయన సేవలకు నాయకులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఇక జిల్లాలోని కొన్ని ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఆయన వ్యక్తిగతంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా అనేకం వున్నాయి. లింగాల ఘనపురం మండలంలోని జీడికల్‌ సీతారామాచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు కోటి రూపాయల వరకు వ్యక్తిగత వితరణ చేసినట్లు చెబతున్నారు. ఆలయ అభివృద్ధికోసం రూ.50 కోట్ల ప్రణాళికలు కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రతి ఎంపిటిసికి కూడా రూ.5లక్షల మేర అభివృద్ధి నిధులు అందించి, వారి చేత కూడా ప్రశంసలు పొందిన నేతగా కొనియాడబడుతున్నారు. జిల్లాలో ఏ ప్రాంత ప్రజలు ఆహ్వానించినా కాదనకుండా హజరౌతున్నారు. బచ్చన్న పేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆయన ఎంతో చేయూతందించినట్లు తెలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ది విషయంలో ఇప్పటికే రూ.కోటిన్నరకు పైగా అందజేసినట్లు సమాచారం. అంతే కుండా ఆలయ పరిసర ప్రాంతామంతా మార్పుల్‌ వేయడానికి అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా ప్రజల్లో వుంటూ, ప్రజలకు అందుబాటులో వుంటూ, జిల్లా అభివృద్ధి కోసం పాటు పడుతున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి జనగామ టిక్కెట్‌ ఇస్తే మాత్రం టిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. పైగా ప్రతిపక్షాలలో వున్న లుకలుకలు కూడా బాగా కలిసి వస్తాయి. ఒక వేళ మళ్లీ ముత్తిరెడ్డికే టికెట్‌ ఇస్తే మాత్రం, కలహాల కాపురమైనా కాంగ్రెస్‌నే ప్రజలు ఆదరించే అవకాశం లేకపోలేదంటున్నారు. అందువల్ల ఆసారి ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్‌ కట్‌ అన్నది దాదాపుగా తేలిపోయినట్లే అంటున్నారు. పికే సర్వేలో కూడా ఇదే తెలినట్లు సమాచారం. ఏది ఏమైనా జనగామలో సరికొత్త రాజకీయాలు కొద్దిరోజుల్లో చూడడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఫస్ట్‌ వికెట్‌…దానం టికెట్‌ కట్‌!?

ఎవరినీ పట్టించుకున్నది లేదు?

సమన్వయం చేసుకొని కలుపుకుపోయింది లేదు?

కార్పోరేటర్లకు విలువిచ్చింది లేదు?

ఉద్యమ కారులకు మేలు చేసింది లేదు?

వ్యాపారం, రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించింది లేదు?

నాయకులను కాపాడుకున్నది లేదు?

పార్టీలోని వారికే పొగపెడుతుంటే పార్టీ పెద్దలు పట్డించుకున్నది లేదు ?

గురువులకు పంగనామాలు కొత్త కాదు?

కారును ముంచుతున్నా చూస్తూ ఊరుకోవడం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు?

ఒక్కొక్కరుగా అందరూ దూరమైతే దానం నిలకడ తెలియంది కాదు?

 పార్టీలో గుసగుసల సారాంశమిదే?

                            అయిన వారిని గుమ్మం ఆవల వుంచి, కాని వారిని కంచాల దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏమౌతుందో అందరకీ తెలిసిందే…! మన వాడు మన మేలు కోరుతాడు…పరాయి వాళ్లను పక్కన పెట్టుకున్నా వాళ్ల మేలే చూసుకుంటారు? ఎంత భుజాల మీద ఎత్తుకున్నా, ఎప్పుడు జారిపోతారో తెలియదు? ఎంత అభద్రతాభావంలో వుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత నమ్మినా అనుమానపు చూపులే చూస్తుంటారు? ఇది జీవిత సత్యం. ఇవే రాజకీయాలకు కూడా అన్వయమౌతాయి. పార్టీలలో కల్లోలం నింపుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని నియోజకవర్గాలలో ఇలాంటి పరస్ధితి నెలకొని వుంది. అందులో మొదటి స్ధానంలో ఖైరతాబాద్‌ వుంది. అని సాక్ష్యాత్తు పార్టీకి చెందిన కార్యకర్తలే అనుకుంటున్నారు. నాయకులు బాధపడుతున్నారు. అందుకే ఈ మధ్య ఏకంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తోనే ఓ ప్రజాప్రతినిధి ఎలాగూ ఓడిపోతున్నావు లే…ఇక తిరగడమెందుకు? దండగ అని ముఖం పట్టుకొని అన్నట్లు పార్టీలో పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఈ మాట విన్న దానం ఒక్కసారిగా షాకైనా, ఔననలేక, కాదనలేక, ఆ ప్రజా ప్రతినిధికి ఎందుకు ఎదురుపడ్డారో అర్ధంకాక తలదించుకొని వెళ్లిపోయారట. లోలోన తిట్టుకుంటూ అక్కడినుంచి జారుకున్నారట. ఇది గడచిన కొద్ది రోజులకే మరో ప్రజాప్రతి కూడా ఇదే మాట దానం మొహం మీదే చెప్పేశారట. ఈ సంగతి ఆనోట, ఈనోట పడి నానుతుండంతో దానం దిద్దుబాటు చర్యలకు దిగాలనుకున్నట్లు కూడా కొందరు చెప్పుకుంటున్నారు. కాకపోతే జరగాల్సినంత నష్టం ఎప్పుడో జరిగిపోయిందనేది చాలా మంది చెబుతున్న మాట. నోరు తెరిస్తే చాలు బూతుల పురాణమే దానంది అంటారు. అలాంటి దానం నోటి నుంచి ఒక్కసారిగా వినయపూర్వక విజ్ఞాపనలు వినిపిస్తుండడం విచిత్రంగా వుందట. పైగా గొర్రెలు కసాయి వాన్ని కూడా ఇలాగే నమ్ముతాయని చెప్పుకోవడానికి కూడా పనికొస్తాయని చెప్పుకుంటున్నారట. ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో వున్నదే లేదని అనేక మంది చెప్పుకుంటున్న మాటే. ఏవరినీ దరి చేjరనీయలేదు. ఎవరికీ మేలు చేయలేదు? ఆఖరుకు కరోనా సమయంలో ఎమ్మెల్యే ఎవరినీ ఆదుకున్నది లేది భహిరంగంగానే నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరినప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటానని, అందరినీ కలుపుకుపోతానని చెప్పినా ఆచరణలో చూపించలేదన్నది నాయకులు అంటున్న మాటే. స్ధానికంగా ఖైరతాబాద్‌ నియోజవర్గ పరిధిలో టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు నలుగురున్నారు. వారిని ఏ ఒక్కనాడు సమన్వయం చేసుకుంటూ, వారి పనులు చేసి పెట్టింది లేదన్న మాటలే చెప్పుకుంటున్నారు. కనీసం కార్పోరేటర్లకు గౌరవం కూడ ఎమ్మెల్యే ఇవ్వరనే తెలుస్తోంది. ఇక ఉద్యమ కారులను ఉద్యమ సమయంలో ఎలా చూశారో, ఇప్పుడూ అలాగే చూస్తారని అంటున్నారు. వారికి కనీసం విలువ కూడా ఎమ్మెల్యే వద్ద వుండదని చెబుతున్నారు? ఎంత సేపు వ్యాపారాలు, రాజకీయాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, వారికి అందుబాటులోవున్నది లేదని ప్రజలంటున్నారు.

                  ఆయన అసలు తెలంగాణ ఉద్యమ కారుడు కాదు..

తెలంగాణ వాది అసలే కాదు…తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న కాలంలో విద్యార్ధులపై లాఠీ రaులిపించిన నాయకుడు. మంత్రిగా వుంటూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడు. తెలంగాణ వద్దని, ఒకవేళ తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌ యూనియన్‌ టెరిటరీ చేయాలని డిమాండ్‌ చేసిన నాయకుడు. 2014లో ఓటమి పాలయ్యాడు. టిఆర్‌ఎస్‌ మీద అనుక్షణం విరుచుకుపడుతూ వుండేవారు. అయినా ఆయనను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. 2018లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు. దానం మళ్లీ గెలిచాడు. కాకపోతే ఆయన పార్టీ నేతలతో అంటకాగింది లేదు. వారిని ఆదరించింది లేదు. పార్టీని బలోపేతం చేసింది లేదు. పార్టీని కంచుకోటగా చేసుకున్నది లేదు. పూర్తిగా ఇది నా పార్టీ అన్న అభిమానం పూర్తిగా నిండలేదు? అందుకే ఎవరికీ కాని నాయకుడయ్యాడు…అందర్నీ దూరం చేసుకున్నాడు…ఎవరూ తనకు ఎదరు లేకుండా చేసుకుంటున్నాన్న భ్రమల్లో పార్టీకి చేటు చేస్తున్నాడు. 

                   ఇక కరోనా కాలంలో ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియలేదని, ఆయన ఎవరికీ ఏ మేలు చేసింది లేదంటున్నారు.

 తెలంగాణలో అనేక నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కరోనా సమయంలో ఎంతో చేస్తే, దానం కనీసం నియోజకవర్గం కూడా కలియ తిరిగింది లేదంటున్నారు. సాక్ష్యాత్తు మంత్రి కేటిఆర్‌ సైతం రెడ్‌ జోన్లలో తిరిగిన సందర్భాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాని దానం తిరిగిన రోజులే లేవంటున్నారు. ఇక సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఎంతో మందికి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సందర్భం గుర్తు చేసుకుంటున్నారు. కాని దానం చేసిన దానమే లేదంటున్నారు. 

        ఇదిలా వుంటే పార్టీలోనే నాయకుల మధ్య చిచ్చుపెడుతూ, ఒకరినొకరికి దూరం చేస్తూ, చివరికి పార్టీకే వారిని దూరం చేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు.

 దానం గురువులకు పంగనామాలు పెట్టడం కొత్త కాదని, ఇది మొదటిది కాదంటున్నారు. గతంలో చేయిచ్చి ఆదుకున్నంత కాలం కాంగ్రెస్‌లో వుండి, ఒక్కసారిగా టిక్కెట్టు దక్కపోతే రాత్రికి రాత్రి సైకిలెక్కి, గెలిపించిని పార్టీని నట్టేట ముంచిన ఘనత దానం రాజకీయం మన కళ్లముందే వుందంటున్నారు. ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ మళ్లీ చేరదీస్తే మంత్రిని చేస్తే, పదవి లేకుండా వుండలేని దానం, కారెక్కారు. ఎమ్మెల్యే అయ్యారు. కాని ఇక్కడా ఎవరినీ కలుపుకుపోయినట్లు ఎవరూ చెప్పుకోవడం లేదు? ఎవరూ సంతృప్తిగా లేదు. దానం ఎమ్మెల్యే కాకముందు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో 6గురు టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు వుండేవారు. దానం ఎమ్మెల్యే అయ్యాక ఆ సంఖ్య నాలుగుకు చేరింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయి వుండి కూడా కార్పోరేటర్లను గెలిపించుకోలేదన్న అపవాదు వుండనే వుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా బిజేపి వున్నప్పుడే టిఆర్‌ఎస్‌ 6 కార్పోరేటర్లను గెల్చుకుంటే, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానంతో ఆ సంఖ్య పదిలం కావాలి. మెజార్టీ మరింత పెరగాలి. కాని అందులో రెండు సీట్లు పోయినవి అంటేనే దానం చతురుత, చాణక్యం, అంకితభావం ఎంతో ఇక్కడే చెప్పేయొచ్చు అంటున్నారు. అంతే కాదు గత జిహెచ్‌ఎంసి ఎన్నికల నుంచి కార్పోరేటర్లతో సఖ్యత అన్నది ఆయన డిక్షణరిలోనే లేదన్నది విజయారెడ్డిపార్టీ మారడంతోనే అర్ధమైందన్న సంగతి చెప్పేయొచ్చు. ఓ వైపు పార్టీలో ఎక్కడ లుకలుకలు అన్న విషయం తెలిస్తే చాలు అక్కడకి చేరుకొని సంబంధిత నాయకులతో మంతనాలు జరుపుతూ పార్టీలో విభేదాలు లేకుండా కేటిఆర్‌ చూసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య ఖమ్మం వెళ్లారు. అక్కడ పరిస్ధితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కొల్లాపూర్‌ వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మంతనాలు జరిపారు. కాని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వున్న అసంతృప్తిని దానం పట్టించుకోలేదు. విజయారెడ్డి పార్టీకి దూరమయ్యే పరిస్ధితి తెచ్చారు. ఆమె ఈ మధ్య మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే దానం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పిందే కాని, ఎక్కడా ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు. విజయారెడ్డి పార్టీని వీడడంతో మరికొంత మంది కార్పోరేటర్లు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నారని సమచారం. వారు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం వుందన్న సంగతైనా ఎమ్మెల్యే పార్టీ పెద్దలకైనా తెలపాల్సివుంది. కాని ఆ పని కూడా చేయడంలేదు. దాంతో వుంటే దానమైనా వుండాలి? లేకుంటే మేమైనా వుండాలన్న పట్టుదలతో కొందరు సీనియర్‌ నాయకులు, కార్పోరేటర్లు వున్నట్లు తెలుస్తోంది. దాంతో దానంను పక్కన పెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునేలా వుందనేది తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం…దానం టికెట్‌ కట్‌ అన్నది తెలుస్తోంది. అదే జరిగితే టిఆర్‌ఎస్‌ నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని కూడా అంటున్నారు…ఏం జరుగుతుందో వేచి చూడాలి?

కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం

నేటిధాత్రి న్యూఢిల్లీ, జూన్, 24:

ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఇరువురు సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావులు శుక్రవారం పార్లమెంట్ భవన్ లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కె. ఆర్. సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత లతో కలిసి కొత్త ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీలందరితో వెంకయ్య నాయుడు కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం ఎంపీలంతా కలిసి కొత్త సభ్యులకు లోక్ సభ, రాజ్యసభ లతో పాటు పార్లమెంటు సెంట్రల్ హాలును చూపించి.. అక్కడ గ్రూప్ ఫొటో దిగారు. పార్లమెంట్ వెలుపల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఎంపీలందరూ..

తెలంగాణ అమరులను స్మరించుకుని, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు తెలంగాణ నేతలు పాల్గొన్నారు.

పిర్యాదుల గుట్ట పేరుకుపోతోంది?

`స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది?

` ఒక్కొక్కరు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా గతంలో పట్టలేదు?

`కొత్త కమీషనర్‌ ఫైళ్లు దులుపుతున్నారని సమాచారం?

 

`పిర్యాదుల కదలికపై సర్వత్రా ఎదురుచూపులు?

`అత్యధికంగా ములుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మీదే పిర్యాదులు?

`ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌ వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త భద్రయ్యను చంపబోయారు?

`ఇలాంటి దుశ్చర్యలకు అడ్డా రిజిస్ట్రేషన్‌ కార్యాలయమే అన్న ఆరోపణలు కోకల్లలు?

`ఇంతకీ కమీషనర్‌ కార్యాలయంలో తిష్ట వేసుకుని అవినీతి పరులను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`పిర్యాదు దస్త్రాలు, కమీషనర్‌ దాకా చేరకుండా చేస్తున్నదెవరు?

`ఏళ్లకేళ్లు తిష్ట వేసుకుని అక్రమార్కులకు అండగా వుంటున్నదెవరు? 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు కమీషనర్లు వస్తున్నారు…పోతున్నారు…కాని ఫైళ్లు కదలడం లేదు…వాటికి మోక్షం రావడం లేదు. పిర్యాధు దారులకు న్యాయం జరగడం లేదు…ఆ శాఖలో అన్యాయాలు ఆగడం లేదు. అవినీతికి అంతు లేదు…చాలా మందికి భయం లేదు…ఎన్ని పిర్యాధులందినా పై స్ధాయి వారి ఆశీస్సులు పుష్కలంగా వుండడంతో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది…ఆఖరుకు ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు కూడా దిగుతున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు? 

                          మొగుళ్ల భద్రయ్య ములుగు జిల్లాలో ఓ సామాజిక కార్యకర్త. 

జిల్లాలో ఎక్కడ అవినీతి జరిగినా సహించలేడు. తన సామాజిక భాద్యతను నిర్వర్తిస్తుంటాడు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తుంటాడు. అలాంటి వ్యక్తిపై కత్తులతో కొందరు దాడి చేశారు. తాము చేస్తున్న అక్రమాలకు భద్రయ్య అడ్డు వస్తున్నాడని కక్ష కట్టారు. ఆయనను తీవ్రంగా గాయపర్చారు. భద్రయ్య తృటిలో ప్రాణాలతో బైట పడ్డారు. ఆయనపై దాడి చేస్తున్న సమయంలో స్ధానిక ప్రజలు చూడడం వల్ల దాడి చేసిన వారు పారిపోయారు. దాంతో భద్రయ్య ప్రాణాలతో వున్నాడు. అలాంటి వ్యక్తి కమీషనర్‌ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాధులకే దిక్కు లేదంటే ఇక రిజిస్ట్రేషన్‌ శాఖ ఎవరికి న్యాయం చేస్తుంది. ఆయనేమైనా తన గురించి కొట్లాడుతున్నాడా? ప్రభుత్వ స్ధలం అన్యాక్రాంతమైంది. రిజిస్ట్రేషన్‌ కార్యాయలం ఆశీస్సుల సాక్షిగా అక్రమంగా రిజిస్రేషన్‌ జరిగిందన్న విషయాన్ని బైటపెట్టాడు. జరిగిన దుర్మార్గాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు పిర్యాధు చేశాడు. మీడియాకు సాక్ష్యాధారాలతో సహా వివరాలు వెల్లడిరచారు. అలాంటి వ్యక్తిని వెంబడిరచి, ఆయన ఇంటిమీదకు వెళ్లి, కత్తులతో దాడి చేశారు. ప్రాణాలు తీయబోయారు. పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాధు చేశారు. దాడి చేసిన వ్యక్తి జైలుకు వెళ్లడం జరిగింది. రేపో మాపో జైలుకు వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చే సమయం ఆసన్నమైంది. అయినా ఆ భూమి ప్రభుత్వ స్వాధీనం కాలేదు. దానిపై ఇంత వరకు దృష్టిపెట్టిన పాపాన పోలేదు. కలెక్టర్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు లేవు. వివరాల సేకరణ జరగలేదు. జరిగిన దాష్టికంపై మాట్లాడిన వారు లేదు. ములుగులో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయలంలో అక్రమ రిజిస్ట్రేషన్లు కోకొల్లలుగా జరుగుతున్నాయన్న పిర్యాధులపై పట్టింపు లేదు. ఒక సామాజిక కార్యకర్త భద్రయ్యకు వున్న సోయి శాఖ పెద్దలకు లేదు. ఉద్యోగులకు లేదు. నిస్వార్ధంగా ప్రభుత్వ భూములను కాపాడుతున్న భద్రయ్యను అభినందించాల్సిన పై స్ధాయి ఉద్యోగులే ఆయనను తిప్పించుకుంటున్నారు. ములుగు నుంచి భద్రయ్య హైదరాబాద్‌ వెల్లడానికి ఎంత శ్రమ పడాల్సివస్తుందో తెలియంది కాదు. ఇప్పటికీ కమీషనర్‌ కార్యాలయంలో రెండుసార్లు పిర్యాధు చేశాడు. కాని ఆ పిర్యాధు ఏమైంది? ఎంత వరకు వచ్చింది? టప్పాల్‌ దాటి కదిలిందా? లేదా? కమీషనర్‌ టేబుల్‌ వరకు ఎందుకు చేరడం లేదు? మధ్యలోనే ఎందుకు మాయమౌతోంది? అక్కడ కూడా వున్న అదృష్య శక్తులు ఎవరన్నదానిపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

           పిర్యాధు దారుడైన భద్రయ్య మరోసారి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం గురించి కొత్త  

          కమీషనర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాలయానికి వెళ్లాడు. 

కాని అక్కడున్న ఓ ఉద్యోగి భద్రయ్య ఓ గదిలో కూర్చోమని చెప్పి, అడిషినల్‌ కమీషనర్‌ వద్దకు పంపకుండా కాలయాపన చేశాడు. చివరికి భద్రయ్య ఒత్తిడి మీరకు తప్పలేదు. అయితే ఈలోపు సదరు ఉద్యోగి ములుగుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి సమాచారం అందించినట్లు తెలిసిందని భద్రయ్య వెల్లడిరచారు. అంటే కింది స్ధాయి నుంచి కమీషనర్‌ కార్యాలయం వరకు ఎంత అవినీతి లింక్‌ బలంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే గతంతో వరంగల్‌లో పనిచేసిన ఓ ఉఓద్యోగి కమీషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నాడు. అతనే ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై వస్తున్న పిర్యాధులన్నీ మాయం చేస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఆ దస్త్రాలు కమీషనర్‌దాకా వెళ్లకుండా చేస్తున్నాడంటున్నారు. లేకుంటే వందలాదిగా వస్తున్న పిర్యాధులు ఒక్కటి కూడా కమీషనర్‌ దాకా ఎందుకు వెళ్లడం లేదన్న అనుమానం అందరిలోనూ మొదలైంది. అంతే కాకుండా జోన్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ డిఐజి కూడా అవినీతి పరులను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సదరు డిఐజీ గత దశాబ్ధ కాలానికి పైగా అదే జోన్‌లో పని చేస్తుండడం అనుమానాలకు బలం చేకూరుతోంది. ఏ శాఖలోనైనా రెండేళ్లకు మించి ఒకే చోట సర్వీసులో పనిచేయనీయరు. కాని సదరు డిఐజి ఏకంగా దశాబ్ధానికిపైగా ఒక చోట ఎలా తిష్టవేసుకొని కూర్చుంటున్నాడు. ఇదెలా సాధ్యమో శాఖ పెద్దలే వెల్లడిరచాలి. వారానికి రెండు సార్లు జోన్‌ పర్యటనలు సాగించి, కమీషనర్‌ కార్యాలయానికి వచ్చిన పిర్యాధులపై మళ్లీ ఉద్యోగులకు సమాచారం అందిస్తూ, అందిన కాడికి అందరూ కలిసి వాటాలు పంచుకుంటున్నారన్న అపవాదులు కూడా వున్నాయి. అందుకే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వారు ఆడిరది ఆటపాడిరది పాటగా మారిందని జనం గగ్గొలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ములుగు లాంటి సబ్‌ రిజిస్రేషన్‌ కార్యాలయం అంటేనే సామాన్యులు భయపడుతున్నారు. 

                    ఇక మరో వ్యక్తి డోలి శ్రీకాంత్‌. వయసు 6ం సంవత్సరాలపై బడి వుంటాడు.

 అతను కూడా ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధితుడే. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, తనకు జరిగిన అన్యాయం గురించి కమీషన్‌ రెండుసార్లు విజ్ఞాపన పత్రాలిచ్చాడు. కాని పట్టించుకున్నవారేరీ? ఆయనకు న్యాయం చేసే వారేరి? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే…రిజిస్ట్రేషన్‌కు తెచ్చే ప్రతి డ్యాక్యుమెంటుకు సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ ముట్టజెప్సానంత ముట్ట జెప్పకపోవడమే? అంత ఇవ్వలేమని చెప్పడమే? డోలి శ్రీకాంత్‌. డాక్యుమెంటు రైటర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రతి డాక్యుమెంటుకు ప్రభుత్వ డ్యూటికి మించి, సబ్‌ రిజిస్ట్రార్‌కు అందజేస్తే గాని సంతకాలు పెట్టరు. రిజిస్ట్రేషన్‌ చేయరు. కాని కోరినంత ముట్టజెప్పితే ఎక్కడ సంతకమైనా పెడతారు? ఏదైనా రిజిస్ట్రేషన్‌ చేస్తారు? కాని అలా ముట్టజెప్పడం నా వల్ల కాదని చివరకు డాక్యుమెంటు రైటర్‌గా తన పనిని కూడా వదులుకున్నాడు. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే ప్రతి పని గురించి బైటకు డోలి శ్రీకాంత్‌ మూలంగానే తెలుస్తుందన్న అనుమానంతో డోలిశ్రీకాంత్‌ను సబ్‌రిజిస్ట్రార్‌ ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. డోలి శ్రీకాంత్‌కు వారసత్వంగా సంక్రమించిన భూమిని, తన సోదరుడికి సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు? ఇదీ డోలి శ్రీకాంత్‌ ఆందోళన. ఆవేదన. తన అన్న దగ్గర పెద్దఎత్తున సొమ్ము తీసుకోవడమే కాకుండా, తనను మానసికంగా, ఆర్ధికంగా వేధించాలని కక్ష్య కట్టి, తన భూమిని సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసిందన్న విషయాన్ని గత కమీషనర్‌కు పిర్యాధు చేసినా ఇంత వరకు న్యాయం జరగలేదు. జరుగుతుందన్న నమ్మకం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషనర్‌ కార్యాయంలో ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌కు ఎప్పటిప్పుడు ఉప్పందించే ఉద్యోగులు కూడా వుండడం విశేషం. పైగా పై స్ధాయిలో కూడా సబ్‌ రిజిస్ట్రార్‌కు అండదండలు పుష్కలంగా వుండడం వల్లనే ఇప్పటి వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయంటున్నాడు. అయితే కొత్త కమీషనర్‌ దృష్టికి ఈసారైనా దృష్టికి తీసుకెళ్లాలని మరోసారి తన ప్రయత్నం చేశాడు. అడిషినల్‌ కమీషనర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు డోలి శ్రీకాంత్‌ వెల్లడిరచారు. అయితే డోలి శ్రీకాంత్‌ కు జరిగిన అన్యాయం పూర్తిగా చదివిన అడిషినల్‌ కమీషనర్‌ రాజేష్‌ మాత్రం తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పినట్లు చెప్పారు. వివరాలు తెలుసుకుంటానని చెప్పినట్లు డోలి శ్రీకాంత్‌ వెల్లడిరచారు. ములుగు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాయలం సాక్షిగా సాగుతున్న అక్రమాలపై పూర్తి స్ధాయి వివరాలు డోలి శ్రీకాంత్‌ అడిషినల్‌ కమీషనర్‌కు అందజేశాడు. ఆయన చెప్పిన వివరాలు వింటే నిజంగా విస్తుపోవాల్సిందే…సేవా ముసుగులో సాగుతున్న అక్రమ వ్యాపారం వింటే ఆశ్యర్యపోవాల్సిందే…ఆ వివరాలు…మరో సారి…మీ నేటిధాత్రిలో ఎక్స్‌క్లూజివ్‌గా….

రిజిస్ట్రేషన్‌ శాఖలో భారీ ప్రక్షాళన.

 

 

ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నవారికి తప్పదని తేలిన స్థాన చలనం?

దశాబ్దాల కాలానికి పైగా లేని ట్రాన్స్‌ఫర్లు?

ముందే చెప్పిన నేటిధాత్రి!

నేటిధాత్రి వరుస కథనాలుతో కదలిక!

ప్రభుత్వం ఆలోచన ముందే పసిగట్టిన ఉద్యోగులు?

యూనియన్‌ కార్యకలాపాలకు కొత్త కమిటీ ఏర్పాటు?

రాయభారాలకు తెర తీత?

కదల్చకుండా వుండాలంటే ఎంత కావాలి! ఉద్యోగుల ఓపెన్‌ ఆఫర్లు?మంత్రుల స్థాయిలో బేరసారాలు?

కోట్లలో జరుగుతున్నట్లు సమాచారం? 

రంగారెడ్డి, మేడ్చల్‌ హట్‌ కేకులు?

నగర శివారు ప్రాంతాలను వదిలేందుకు ససేమిరా… అంటున్న సబ్‌ రిజిస్ట్రార్లు?

ముందైతే వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లు కానిద్దాం…అందిన కాడికి వెనకేద్దాం?

గుట్టు చప్పుడు కాకుండా మింగేద్దాం?

పరిచయం వున్న రియలర్లు, ప్రజా ప్రతినిధుల పనులు చకచకా?

గత నెల రోజులుగా సాగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై నేటిధాత్రి నజర్‌?

త్వరలో వాటి వివరాలు కూడా…?

దేనికైనా టైం రావాలి. కాలం, ఖర్మం కలిసి రావాలి. మంచికైనా, చెడుకైనా…! అన్నారు పెద్దలు. అదేంటో ఇక మేం ఇక్కడే…మేమంతా ఎక్కడి వాళ్లమక్కడే…ఇదంతే…మేమింతే..అన్నట్లుగా వున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కసారి అలజడి మొదలైంది. ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎక్కడినుంచి ఎక్కడికి పంపిస్తారో అన్న ఆందోళన మొదలైంది. గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంత దిగులు మొదలైంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచే రిజిస్ట్రేషన్‌ శాఖ, జిల్లాల్లో పాతుకుపోయిన సబ్‌ రిజిస్ట్రార్లతోపాటు, సిబ్బందిలో కూడా ఒక్కసారిగా కుదుపు కళ్లముందు కనిపించేసరికి ఏం చేయాలో అర్ధం కాకుండా పోయింది. ఇంత దూరం వచ్చే దాక, తెచ్చేదాక నేటిధాత్రి నిద్రపోదని గతంలో తాటికాయంత అక్షరాలలో వార్తలు రాసింది. అయినా విన్నారా? చలించారా? లేదు…నేటిధాత్రి రాస్తే ఏమౌతుంది? ఎవరేమరి రాసుకుంటే ఏమౌతుంది? అన్నవారు కూడా గుడ్లు తేలేస్తున్నారు. అన్నంత పని అయిందని, అంత దూరం పరిస్ధితి వెళ్లిందని అనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వృధా అన్నది కొందరి వాదనైతే, ఎలాగైనా ప్రక్షాళన ఆపాలన్న ధోరణిలో కూడా ఇంకా కొందరున్నట్లు తెలుస్తోంది.

అందరం వేరు..మేం వేరు…అన్ని వ్యవస్ధలు వేరు..మేం వేరు…ఎవరు మారినా, ఏ పాలకులు వచ్చినా మేమింతే…మమ్మల్ని ముట్టుకోరంతే…ఎవరు మార్చాలని చూసినా, మారింది వాళ్లే కాని, మేం కాదు….అలా ఆలోచనలు చేసిన వారి అడుగులు ఏనాడు ముందుకు పడలేదు. మమ్మల్ని కదిలించే శక్తి ఎవరికీ లేదు? మేమే చెక్‌ మేట్స్‌…? మాకు చెక్‌ పెట్టేవారా? నెవర్‌…? మమల్ని కదిలించేంత ధైర్యం చేస్తారా? ఒక్కసారిగా వ్యవస్ధ అస్తవ్యస్తమైపోతుంది? ఎవరెన్ని చెప్పినా మాకు మేమే…మేమంతా ఏకు మేకులమే? మమ్మల్ని ముట్టుకుంటే అగ్గిమీద గుగ్గలమే…? ఇదంతా నిన్నటిదాక రిజిస్ట్రేషన్‌ శాఖలో కొందరి మాట…బీరాలు పలికిన వాళ్ల ఆట…ఇప్పుడు నోట రాని పూట….

ఇంత కాలం జరుగదు అనుకున్నది జరిగే సమయం ఆసన్నమౌతోంది. అసలు గ్రౌండ్‌ రియాల్టి తెలిసిపోతోంది. కాకపోతే ఏదో ఒకటి చేయాలి? ఎలాగైనా ప్రక్షాళనను అడ్డుకోవాలి. ట్రాన్స్‌ఫర్లు ఆపుకోవాలి…మాటలకు వినకపోవచ్చు….? అభ్యర్ధనలకు కరగకపోవచ్చు…బెదిరింపులకు అదరకపోవచ్చు…కాని నోట్లకు చలించని వాళ్లుంటారా? మంత్రులైనా డబ్బు వద్దంటారా? రిజిస్ట్రేషన్‌ శాఖలో సంపాదన మంత్రులకు తెలియందా? కోట్లు కొడతామంటే మంత్రులు పనిచేసి పెట్టరా? అని చర్చలు జోరుగా సాగుతున్నాయట? పై నుంచి ప్రక్షాళన అనుకుంటూ వచ్చే లోపు కింద నుంచి రాజకీయ భేరాలు మొదలు పెట్టుకుంటే సరిపోదా? ట్రాన్స్‌పర్లనను ఆపుకోలేమా? అనుకుంటున్నారట. ఇప్పుడు తంటంతా ఏళ్ల తరబడి ఆయా కార్యాలయాల్లో తిష్టవేసుకున్నవారికే ఎక్కడలేని బాధ ఏర్పడుతుంది. ఇక్కడంటే పదేళ్లగా పెరిగిన పరిచయాలు? సమకూరిన ఆదాయ మార్గాలు? అందరూ తెలిసిన రియల్టర్లు? ఎలా ముట్టజెప్పాలో వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? నాయకులందరూ తెలుసు? వారికి చేసి పెట్టిన పనులకు ఎప్పటికీ రుణపడి వుంటారు? మరి ఇంత మంది పరిచయస్తులతో కూడిన ఆదాయ సామ్రాజ్యం కూల్చుకోవడం అవసరమా? ఎంత ఖర్చైనా సరే పెట్టుకొని మళ్లీ ఇక్కడే తిష్టవేయలేమా? ఇదీ కొందరు సబ్‌ రిజిస్ట్రార్ల ఆంతరంగిక సమావేశాల్లో సాగుతున్న చర్చ? అని తెలుస్తోంది. 

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమీషనర్‌ను సడెన్‌గా మార్చినప్పుడే శాఖలో ఏదో జరిగే అవకాశం వుందని కొందరు పసిగట్టారు. కాకపోతే ఎక్కడా ఏ చలనం కనిపించడం లేదని కొందరు పనితోపాటు, ఆదాయ సముపార్జనలో మునిగిపోయారు. యాధావిధిగా సంపాదన వెనకేసుకుంటూనే వస్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా ప్రక్షాళన తప్పేలా లేదన్న విషయం చెవిలో పడేసరికి అలజడి మొదలైంది. మూసుకుపోనున్న దారులను ఎలా తెరిపించాలన్న దానిపై దృష్టిపెడుతున్నారు. ఈ సమయంలో అందరికీ కనిపించిన సర్వరోగ నివారణి…మంత్రులతో పరిచయాలు..వారికి కొందరు సబ్‌ రిజిస్ట్రార్‌ల విన్నపాలు…మొదలయ్యాయి? ఏకంగా మంత్రులతోనే నేరుగా బేరసారాలకు దిగినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాదు …మంత్రులను ఏం కావాలని కాకుండా, ఎంత కావాలో చెప్పండన్నంత ఓపెన్‌ ఆఫర్‌ చేస్తున్నారట? అంటే ఏ రేంజ్‌లో ఆ శాఖలో సంపాదన పోగేసి పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. మంత్రులతో ప్రత్యేకంగా అప్పాయింటు మెంట్లు తీసుకుంటూ, మాకు స్ధానం చలనం లేకండా చూస్తే సరి…సిఎస్‌తో ఒక్క మాట చెప్పితే సరి…? మేం కుర్చీ కదలకుండా చూసుకుంటే సరి…అంటూ ముక్తసరితోనే కోట్లు ముందు పెట్టడానికి కూడా వెనకాడేది లేదని అంటున్నారట? ఇలాంటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో టాప్‌లో వున్నాయన్న మాట తెలిసిందే…? ఆ కార్యాలయాలు హాట్‌ కేకులు? వాటిని వదులుకునేందుకు ఉద్యోగులు ఇష్టపడడం లేదు? ఎలాగైనా ట్రాన్స్‌ఫర్లు ఆపాలన్నదానిపై దృష్టిపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నగర శివారులో జరిగే భూ క్రయవిక్రయాల్లో వచ్చే సంపాదన అంతా ఇంతా కాదు? దాచుకోలేనంత? లెక్కబెట్టుకోలేనంత? కోట్లలో వుండే ఆదాయాన్ని వదులుకొని, మారు మూల జిల్లాలకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడడంలేదట? 

ఇదిలా వుంటే ఇంత కాలం స్ధబ్ధుగా వున్న యూనియన్‌ కార్యకలాపాలపై కూడా ఉద్యోగులు దృష్టిపెట్టినట్లు కూడా తెలుస్తోంది. గత కొన్నెళ్లుగా ఎలాంటి ఆడంబారాలులేని యూనియన్‌ కార్యకలాపాలను తెరమీదకు తెచ్చారట. ఎన్నికలను కూడా ఆగమేఘాల మీద నిర్వహించుకున్నారు? ముందు చెప్పిన పనులన్నీ, రాయభారాలు నడిపేందుకు అవసరమైన శక్తియుక్తులున్నవారికి పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది? ప్లాన్‌ ఏ ఫెయిల్‌ అయితే ఫ్లాన్‌ బీ…అన్నట్లు అవసరమైతే యూనియన్‌ను కూడా అడ్డం పెట్టుకొని తమ ట్రాన్స్‌ఫర్లు ఆపుకునేందుకు ఎత్తులు వేస్తున్నారట? ఉద్యోగమన్నాక, ట్రాన్స్‌ఫర్‌ తప్పని సరి…కాని మాకు మాత్రం వద్దన్నంత దోరణిలో సాగుతున్నవారి లిస్టుకూడా శాఖపెద్దలు తయారు చేసినట్లు సమాచారం. అంతే కాదు శాఖలో ఎవరెవరు? ఎక్కడున్నారు? ఎంత కాలం నుంచి ఒకే చోట వున్నారు? వారిపై వున్న విమర్శలెమిటి? ఆరోపణలేమిటి? పట్టుబడిన సందర్భాలేమిటి? అవినీతి కార్యాకలాపాలేమిటి? అన్న వాటిపై శాఖలో పూర్తి స్ధాయి కసరత్తు మాత్రం జరగుతోంది. 

ఈ విషయం ముందునుంచే నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది. రాష్ట్రంలోని జిల్లాల వారిగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అనేక రకాలైన అవినీతి తంతును కొన్ని రోజులుగా వరస కధనాలు ప్రచురించింది. అయినా కొందరిలో చలనం రాలేదు. పైగా నేటిధాత్రి మీద నిందలు వేయాలని చూశారు. కేసులు నమోదు దాకా వెళ్లారు. కాని ఆఖరుకు వాళ్లే ఎలాంటి నిందలు మోస్తున్నారో కూడా చూస్తున్నారు. పైగా వారి అక్రమాలపై మాట్లాడిన వారిపై భౌతిక దాడులు చేసేంత దాకా ఎలా ఎదిగారన్నది? క్రిమినల్‌ చర్యల దాకా ఎలా వెళ్లారన్నదానిపై కూడా అనేక కథనాలు నేటిధాత్రి ప్రచురించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో జరిగిన అనేక రిజిస్ట్రేషన్లపై కూడా సమగ్రమైన కథనాలు అందించింది. ఇలా నేటిధాత్రి చేసిన అలుపెరగని అక్షర పోరాటానికి త్వరలో ఫలితాలు రానున్నాయి. ఇదిలా వుంటే ఎలాగూ తమ తబాదలా తప్పదనుకునే దశలో వున్నవాళ్లు ముందూ, వెనక ఆలోచించుకుండా చేయాల్సిన అక్రమ రిజిస్ట్రేషన్లు అనేకం చేస్తున్నట్లు కూడా నేటిధాత్రి నిఘాలో వెలుగు చూస్తున్నాయి. ఈ నెలలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై త్వరలో సమగ్ర కథనాలు కూడా ప్రచురించడం జరుగుతుంది. ప్రజలకు మేలు చేయాల్సిన కుర్చీలో కూర్చున్నవారు స్వార్ధపరులై, అక్రమార్కులకు కొమ్ము కాస్తే, నేటిధాత్రి వదిలిపెట్టదు. అన్యాయాలను చూస్తూ ఊరుకోదు. అక్రమాలను వెలుగులోకి తేకుండా వుండలేదు. అదే మా నిబద్దత…అక్షర యజ్ఞత…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version