ఇబ్బందుల్లో పలిమెల మండలం, పొలాలు చెన్ లలోకి భారీ నవరద నీరు,
వరద నీటి తాకిడికి తెగిన నాగయ్య కుంట కట్ట బుదేడు గ్రామం చివరి వాడలో ఇండ్లలోకి నీరు.
లక్ష్మి సరస్వతి బ్యారేజ్ కు భారీగా వరద నీరు, 81 గేట్లను ఎత్తివేసిన అధికారులు.
రవాణా ఇబ్బందుల నుండి బయటపడ్డ ఇద్దరు గర్భవతి మహిళలు,విలాస్ రావ్ సేవలు భేష్.
మండలంలో అధికార యంత్రాంగం బాధితుల వెసులుబాటు ముందస్తు అప్రమత్తం చర్యల్లో విఫలం,
మహాదేవపూర్-నేటిధాత్రి:
ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి సరస్వతి బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు చేరడం ఇప్పటికే ఉమ్మడి మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పలిమెల మండలం లోని పలు గ్రామాలు రెడ్ అలర్ట్ పరిగణంలోకి రావడం జరిగింది విద్యుత్ కమ్యూనికేషన్ లాంటి సదుపాయం ఐదు రోజులుగా లేకపోవడం రవాణా సౌకర్యం స్తంభించుకోవడం తో అధికార యంత్రం గానికి వాస్తవ పరిస్థితులు అందకపోవడం మండల ప్రజలకు మరిన్ని ఇబ్బందుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మహదేవ్పూర్ మండలంలోని కాలేశ్వరం అన్నారం తోపాటు బ్రాహ్మణ పెళ్లి గ్రామాల్లో ఒకవైపు గోదావరి మరోవైపు పెద్ద చెరువుల వరదనీరు ఎక్కువ ప్రభావంతో బ్రాహ్మణపల్లి మహాదేవపూర్ రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. అధికార యంత్రాంగం ఇప్పటివరకు గ్రామాలకు సంబంధించిన ప్రజలతోపాటు ప్రస్తుతం తుఫాను ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతుందా ప్రజలకు బాధితులకు భరోసా కలిగించి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం మండలంలో ఎన్ డి ఆర్ ఎఫ్ టీ సేవలు ప్రత్యేకంగా కాలేశ్వరం పెద్దంపేట వాగు వద్ద కేవలం సమాచారం అనంతరం బృందం రావడం అవసరమైన ప్రదేశంలో బృందం ఉండకపోవడం ఇప్పటికీ అధికారులు పునరావస కేంద్రాలు పలిమెల మండల ముంపుకు గురై బాధితుల కొరకు ఏర్పాటు చేయకపోవడం ఇలాంటి సమయాల్లో అధికార నిర్లక్ష్య ధోరణి వహించడం దుర్భాగ్యం అని చెప్పవచ్చు.
*అల్పపీడన ప్రభావం మండలంలో కొనసాగుతున్న భారీ వర్షాలు.*
ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో మండలంలో ఎడతెడపకుండా కురుస్తున్న వర్షాల వలన ఉమ్మడి మండలంలోని పలిమెల మండలం తో పాటు 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది పలివెల మండలం నుండి రాకపోకలు పెద్దంపేట వాగు తెగిపోవడం వలన రాకపోకలు అంతరాయం కలగడం మండలానికి సంబంధించిన ప్రజలు ఒకవైపు రాకపోకలు స్తంభించడం మరోవైపు గత నాలుగు రోజుల నుండి విద్యుత్ సదుపాయం లేక మండలమంతా చీకట్లో సాగిపోతుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం కావడం ఇప్పటికే గోదావరిలో అధిక వరద ఉండడం పలివెల మండలానికి సంబంధించిన గ్రామాల సమీపంలోని పొలాలు చేనుల లోకి వరద నీరు రావడం జరిగింది. మరోవైపు మహాదేవపూర్ మండలానికి సంబంధించి బ్రాహ్మణ పెళ్లి చుట్టుపక్కల వాగు అలాగే మరోవైపు గోదావరి వరద నీరు కొచ్చేరువు దామరచెరువు వరదతో మత్తడి వేస్తున్న క్రమంలో భారీగా వరద నీరు వలన బ్రాహ్మణ పెల్లి గ్రామానికి అతి సమీపంలో వరద నీరు రావడం జరిగింది అలాగే బ్రాహ్మణపల్లి నుండి మహాదేవపూర్ కు వచ్చే దారిలో వరద నీరు ప్రభావం ఎక్కువ కావడం వల్ల గ్రామస్తులకు మండల కేంద్రానికి రావడానికి ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే అన్నారం గ్రామం నుండి కాలేశ్వరానికి వెళ్లే చంద్రుపల్లి వాగు భారీ వరద నీటి ప్రవాహం ఉండడం వలన గులాబ్ తుఫాన్ సమయంలోనే చండ్రుపల్లి మద్దులపల్లి కుంట్లం గ్రామాలకు ఎక్కువ మోతాదులో వరద నీరు వచ్చి విద్యుత్ అంతరాయం కలిగి గ్రామానికి సమీపంలో నీరు రావడం జరిగింది. బంగాళాఖాతం అల్పపీడనం వల్ల కురుస్తున్న వారాలకు ప్రస్తుతం ఆయా గ్రామాలు సైతం వరద నీటి ప్రభావంతో ప్రమాదానికి అతి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మండలంలో ఇప్పటికే 40 నుండి 60 ఇండ్ల వరకు ఉమ్మడి మండలంలో కూలిపోగా ఎవరికి మాత్రం ప్రాణహాని కలగలేదు కేవలం మాదాపూర్ మండల కేంద్రానికి చెందిన ఒక యువకునికి గాయాలు కావడం జరిగింది. మంగళవారం కురిసిన వర్షం ప్రభావం వల్ల ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్ల గోడలు కొన్ని సిసి రోడ్లు కొట్టుకపోవడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
*ఇబ్బందుల్లో పలిమెల మండలం, పొలాలు చెన్ లలోకి భారీ నవరద నీరు,*
గిరిజన బిడ్డలకు బంగాళా అల్పపీడ ప్రభావం ఇబ్బందులు తప్పడం లేదు గత నాలుగు రోజుల నుండి గిరిజన బిడ్డలకు ఒకవైపు వరద నీరు మరోవైపు విద్యుత్ సదుపాయం ఆపదలో వైద్యం లాంటి సదుపాయాల కొరకు రవాణా సౌకర్యం లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. వారి ఇబ్బందులు చెప్పుకొనుటకు మొబైల్ సౌకర్యం లాంటి లేకపోవడం ప్రభుత్వం అప్నా హస్తం అందించే దాతలు చెర లేకపోవడం జరుగుతుంది. ప్రస్తుతం పలిమెల మండల ప్రజలు ఎనలేని ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ మండలానికి రాకపోకలు సత్ సంబంధాలు తెగిపోవడంతో ఒకవైపు అధికారుల సహాయం అందకపోవడం వర్షాల ప్రభావం మరింత ఎక్కువ కావడం ఇప్పటికీ మండలంలోని పలు గ్రామాల సమీపంలోని చేనుల వరకు వరద నీరు రావడం మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రత్యేకంగా మండలానికి సంబంధించి మోదేడు గ్రామానికి సంబంధించి ఒకవైపు భారీ వరద నీరు ప్రవాహం పెద్దంపేట వాగు దిగడం భయం గుప్పెట్లో ఉన్న మోదేడు ప్రజలకు గ్రామానికి ఆనుకొని ఉన్న నాగయ్య కుంట కట్టతెగడం మరింత భయాన్ని కలిగిస్తుంది. నాగయ్య కుంట కట్టతెగి గ్రామంలోని చివరి ఇండ్లలో కొంత వరద నీరు ప్రభావం చూపుతుందని గ్రామస్తులు భయానికి లోనవుతున్నారు. గిరిజన మండలమైన పలివెల ప్రతి తుఫాను సంభవించే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ముంపుకు ప్రమాదమయ్యే గ్రామాలను ముందస్తు చర్యలు చేపట్టకపోవడం ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ మోదేడు గ్రామ ప్రజలు ప్రభుత్వ సాయం కొరకు ఎదురుచూస్తున్న వారిపై కనికరించకపోవడం నేటికీ వారి పరిస్థితుల దృశ్య అధికారులు ఎవరూ కూడా మోదేడు గ్రామానికి వెళ్లకపోవడం బుధుడు గ్రామస్తులకు పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం అలాగే పలివెల మండలంలోని మరికొన్ని గ్రామాలు ముంపుకు గురి అయ్యే వాటిని పరిశీలించి ముందస్తు చర్యల కొరకు అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికార యంత్రాంగం పలిమిల మండలం లోని ముంపుకు గ్రామాలను గుర్తించి వెంటనే ఆయా ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించి వారికి నిత్యవసర సరుకులు అందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.
*వరద నీటి తాకిడికి తెగిన నాగయ్య కుంట కట్ట బుదేడు గ్రామం చివరి వాడలో ఇండ్లలోకి నీరు.*
పలివెల మండలంలోని బుధుడు గ్రామం ప్రస్తుతం రెడ్‌జోన్ లో ఉమ్మడి మండలంలోని మొట్టమొదటి గ్రామంగా చెప్పవచ్చు ఐదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా మోదేడు గ్రామం ప్రమాదానికి పొంచి ఉంది భారీగా వరద నీరు చేరడంతో పెద్దంపేట వంతెన తెగిపోవడం మోదేడు గ్రామానికి సమీపంలో ఉన్న నాగయ్య కుంట కట్ట సోమవారం రాత్రి దిగడంతో బుధుడు గ్రామంలోని చివరి వీధిలో ఉన్న కొన్ని ఇండ్లలో మీరు చేరడంతో గ్రామ ప్రజలు మరింత భయంతో చెందడం జరుగుతుంది. ఇప్పటికే పెద్దంపేట వంతెన తెగడం వరద నీరు ఎక్కువగా గ్రామ సమీపంలోకి రావడం గ్రామానికి అనుకొని ఉన్న నాగయ్య కుంట లో వరద నీరు ఎక్కువ చేరి కట్ట తెగిపోవడం బుధుడు ప్రజలకు ఇప్పటికే నిన్ను ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వర్ష ప్రభావం కొనసాగుతున్న క్రమంలో మరింత వరద నీరు ఎక్కువై గ్రామాన్ని చుట్టుముట్టేస్తుందని గ్రామ ప్రజలు బంధువులను చెందక తప్పడం లేదు ఇప్పటికైనా అధికారులు తక్షణమే మూదేడు ప్రజలకు వారి ప్రస్తుత పరిస్థితులను గుర్తించి వారికి పలిమెల లేదా అంబటిపల్లి గ్రామాల్లో పునరావస కేంద్రాన్ని ఏర్పాటుచేసి గ్రామస్తులకు పునరావస కేంద్రాలకు తరలించే ప్రక్రియలు ప్రారంభించాల్సిన అవసరం ఎంత ఉంది.
*లక్ష్మి సరస్వతి బ్యారేజ్ కు భారీగా వరద నీరు, 81 గేట్లను ఎత్తివేసిన అధికారులు.*
మండలంలోని లక్ష్మీ సరస్వతి బ్యారేజ్ లకు సంబంధించి గోదావరిలో వరద నీరు ప్రభావం భారీగా చేరడంతో అధికారులు అప్రమత్తమై లక్ష్మి సరస్వతి బ్యారేజ్ లకు కలిపి 81 గేట్లను ఎత్తివేయడం జరిగింది. బ్యారెల్ లో పెద్ద మొత్తంలో వరదనీరు చేయడంతో గేట్లు ఎత్తేసి అధికారులు 6 కోట్ల 60 లక్షల 580 నీరును దిగువకు పంపించడం జరిగింది. పెద్ద మొత్తంలో గేట్లను ఎత్తివేయడంతో భారీ వరద నీరు దిగువకు వదలడం వలన అన్నారం గ్రామానికి సంబంధించి అలాగే సూరారం తో పాటు ఇతర గ్రామాలలో బ్యారేజ్ వరద నీరు ప్రభావం గ్రామాల్లోకి వచ్చి ప్రస్తుత పరిస్థితి ఉండడం ఇప్పటికే వర్షపు వరద నీరు ఎక్కువ గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండిపోయి ఉన్న క్రమంలో దిగువ వరద నీరు వదలడంతో గ్రామాలు మరింత ప్రమాదంలో పడే సూచనలు కనబడుతున్నాయి అధికార యంత్రాంగం ప్రస్తుతం మండలంలోని గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ కు అనుకొని ఉన్న గ్రామాలకు ముందస్తు చర్యల కొరకు సిద్ధంగా ఉండి గ్రామాల్లో నీరు ప్రవహించకుండా ఒకవేళ గ్రామాల్లో నీరు ప్రవహించిన గ్రామస్తులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండకుండా ముందుగానే వారికి సదుపాయాల ఏర్పాటు కొరకు పునరవస కేంద్రాలను ఏర్పాటుచేసి తరలించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
*రవాణా ఇబ్బందుల నుండి బయటపడ్డ ఇద్దరు గర్భవతి మహిళలు,విలాస్ రావ్ సేవలు భేష్.*
పలివెల మండలంలో రాకపోకలు స్తంభించడం గత ఐదు రోజుల నుండి మండలానికి సంబంధించిన ప్రజలు కేవలం మండలానికి ఆయా గ్రామాల్లో పరిమితమై ఉండడం విద్యుత్ మరియు మొబైల్ సదుపాయం అంతరించి పోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న మండల ప్రజల్లో సోమవారం అలాగే మంగళవారం రోజు మండలానికి చెందిన చెన్నూరి రజిత లింకలగడ్డ కు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే రవాణా సౌకర్యం లేకపోవడంతో పెద్దంపేట వాగు వద్ద గర్భిణీ స్త్రీ తీసుకురావడంతో అంబటిపల్లి సర్పంచ్ విలాస్ రావు మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ సర్పంచ్ గా తన విధి నిర్వహణను ప్రజల కొరకు సొంతంగా గత నాలుగు రోజుల నుండి పెద్దంపేట వాగు వద్ద తన సేవలను అందిస్తున్న విలాస్ రావు ఎన్ డి ఆర్ ఎఫ్ సహాయక బృందాన్ని సమాచారమిచ్చి లింకలగడ్డ కు చెందిన గర్భిణీ స్త్రీకి సహాయక చర్య బృందం ద్వారా వాగులు దాటించి మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అలాగే సోమవారం కూడా ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న క్రమంలో ఎన్టీఆర్ ఎఫ్ టీం సహాయంతో వారి వద్దకు వైద్యులను పంపించి చికిత్స అందించడం జరిగింది. ఎన్ డి ఆర్ ఎఫ్ టీం సహాయం వలన రెండు గర్భిణి స్త్రీల ప్రాణాపాయ స్థితిని ఉన్న వారిని కాపాడడం వాటికి అంబటిపల్లి సర్పంచ్ పూర్తిస్థాయి సహకారం అందించడం నేటి వరకు విలాస్ రావు అధికారులతో ఉండి బ్రిడ్జి ప్రస్తుత మరమ్మతులు విద్యుత్ స్తంభాలు అమరుస్తున్న క్రమంలో వారికి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఒక సర్పంచ్ బాధ్యతలే కాకుండా విలాస్ రావు తన మానవత దృక్పథాన్ని చాటుకోవడం విశేషం.
*మండలంలో అధికార యంత్రాంగం బాధితుల వెసులుబాటు ముందస్తు అప్రమత్తం చర్యల్లో విఫలం,*
ప్రస్తుతం మండలంలో కుండపోత వర్షాల వలన మహదేవ్పూర్ మండలం తో పాటు పలిమెల మండలం ఎనలేని సమస్యల బారిన పడి ప్రభుత్వం అధికారులు సహాయం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో మండలమంతా తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వానలతో తల్లడింల్లి పోతున్న క్రమంలో గ్రామస్తులు పలు మానవత దుప్పడం కలిగిన వ్యక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్న క్రమంలో అధికారులు మాత్రం కేవలం కార్యాలయానికి పరిమితమై నేటి వరకు ఉమ్మడి మండలంలో బాధితులకు సహాయ చర్యలు అందించడంలో విఫలం కావడం జరిగింది. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలకు కేవలం ఒక సూరారం గ్రామంలోని పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం యావత్ మండలంలో ప్రస్తుతం పలిమెల మండలంలోని అనేక గ్రామాల పరిస్థితి దీనంగా మారి ఎందరో పేదలకు రేషన్ బియ్యం కూడా నేటికీ అందకుండా మరోవైపు అల్పపీడన ప్రభావం గ్రామాల్లో రాకపోకలు స్తంభించడం కనీసం వెలుతురుకు కూడా నోచుకోని అడవి బిడ్డలు ఎనలేని ఇబ్బందులు పడుతున్న వరద నీటి ప్రభావం వల్ల ఇక గ్రామాల్లోని ఇండ్లలో వరద నీరు వస్తుందని ఇప్పటికీ మోదేడు ఇతర గ్రామాల్లో పరిస్థితులు తెలియకుండా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం కండ్లున్న కుబేరుల్లా వ్యవహరిస్తూ కాగితాలు కార్యాలయాలకే పరిమితమయ్యారు ఐదు రోజులుగా ఇండ్లు కూలిన ఏ ఒక్క బాధితులకి అధికారులు సహాయమును అందించలేదు కనీసం సహాయం వస్తుందని ఆయా బాధితులను పరామర్శించి భరోసాను ఇచ్చిన దాఖలాలు లేదు. పెద్దంపేట వాగు కాలేశ్వరం గోదావరి అన్నారం వాగు లాంటి అత్యవసర నీటి ప్రవాహం ఎక్కువ ప్రవహించే ప్రదేశాల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయకపోవడం కేవలం జిల్లా కలెక్టర్ వచ్చిన రోజు మాత్రమే ఇండియా సేవలు అందించి తిరిగి వెళ్లడం ఒకవేళ రాత్రి అధిక వ్యాసాలు పడి గ్రామాలు ఉక్కిరిగుక్కి రైతే ఎన్డిఆర్ఎఫ్ సహాయక బృందం జిల్లా కేంద్రం నుంచి వచ్చే వరకు ప్రాణాపాయ పరిస్థితి ఇంతవరకు చేరుతుందో ఊహించవచ్చు. తాజాగా ఓ గర్భిణీ స్త్రీ ఈరోజు పురిటి నొప్పులతో ఎంతో సమయం సహాయక చర్యల కొరకు వేచి చూసిన తర్వాత వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన రెండు గంటలకు పెద్దంపేట వాగు వద్ద ఎన్టీఆర్ బృందం రావడం జరిగిందని ప్రమాదం పొంచి ఉండే ప్రదేశంలో ఎన్ డి ఆర్ ఎఫ్ సేవలు అందించుటకు ఉండవలసి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రానికి పరిమితం కావడం మండల ప్రజలపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల వ్యవహారం ఈ విధంగా కొనసాగితే ప్రజలను ఆదుకుని అధికారులు నిర్లక్ష్యం ముండి వైఖరి నీ వ్యవహరిస్తే ప్రజల పరిస్థితులు ఇలా ఉంటాయో ఊహించవచ్చని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని మహదేవ్పూర్ మండల కేంద్రంలో సదుపాయం తుఫాను ప్రభావం తగ్గే వరకు ఉండేలా ఏర్పాటు చేయాలని తక్షణమే ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించి వారికి నిత్యవసర సరుకులు పునరావసకేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కోరుతున్నారు.