బిజేపి మైండ్‌ గేమ్‌ మాయాజాలం…! అబ్రదకబ్ర అబద్దాల ప్రచారం??

`నిజాలు చెప్పలేక అసత్యాలను నమ్ముకున్న కుటిల రాజకీయాలు

`ఫేక్‌ న్యూస్‌ సృష్టించి, నమ్మించేందుకు ఎంచుకున్న బిల్డప్‌ బాబాయిలు.

` అధికారంలో లేకున్నా అవీ ఇవీ అంటూ అచ్చికబుచ్చిక హామీలు….

`వచ్చేది మేమే అంటూ బచ్చకాయల ప్రసంగాలు…

`కాంగ్రెస్‌కు కాసుల కష్టమంటూ చూసినట్లు గందరగోళాలు…

`టిఆర్‌ఎస్‌ కు కమ్యూనిస్టులు దూరమంటూ గోబెల్స్‌ ను మించిన కోతల కూతలు…

` ఇవన్నీ వింటున్న జనం నవ్వుకుంటున్నారు….

`రాజగోపాల్‌ రెడ్డి అత్యాశను ఎండగడుతున్న ప్రజలు….

`బహిరంగంగానే గ్రామాల్లో తిడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అబద్దాలతో రాజకీయాలు చేయొచ్చని, అసత్యాలు ప్రచారం చేయొచ్చని, గెబెల్స్‌ను మించిన అర్ధసత్యాలు ఎన్నికల నాడు విసృతంగా వాడుకోవచ్చని బిజేపి నిరూపిస్తోంది. అదే పంధాను దేశమంతా అమలు చేస్తున్నట్లు వుంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సమయంలో తెలంగాణ మోడల్‌ను చూపించి ప్రచారం చేసుకున్న సంగతి చూసిందే…శ్రీశైలం ప్రాజెక్టును చూపించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రాజెక్టులంటూ ప్రచారం చేసుకున్నారు…సాక్ష్యాత్తు ప్రధాని మోడీ కూడా తెలంగాణలో మిషన్‌ కాకతీయ మూలంగా మళ్లీ కళకళలాడుతున్న వరంగల్‌ చెరువును తామే బాగు చేశామనేలా అర్ధమొచ్చేలా చెప్పుకున్న విషయంకూడా విధితమే…ఇలా ఏడాది పొడవునా అన్నీ ఫేక్‌ వార్తలు సృషించి, ఎన్నికల నాడు విచ్చలవడిగా వాటిని వాడుకోవడం బిజేపికి అలవాటైనట్లుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో ఏంచెప్పాలో అర్ధం కాక, అబ్రకదబ్ర విద్యలు ప్రదర్శిస్తూ రాజకీయం చేస్తున్నట్లుంది. మీడియాను ఎన్నికల సమయంలో తన ఇష్టాను రీతిన వాడుకుంటూ మైండ్‌ గేమ్‌ రాజకీయాలు సాగిస్తోంది. ఇది టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అంటున్న మాటలే కాదు ప్రజలు కూడా చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాసుల లేమితో కొట్టుమిట్టాడుతున్నదన్న ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నిండేలా చేస్తోంది. నాయకులు, కార్యకర్తలు తమ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని, పార్టీ ప్రచారానికి దూరమయ్యే ఎత్తుగడలు బిజేపి వేస్తోంది. నాయకులు, కార్యకర్తలే ప్రచారానికి దూరమైతే, ప్రజలు కూడా ముందుకు వచ్చేందుకు వెనకాడుతారన్నది బిజేపి అంచనా…! కాంగ్రెస్‌పార్టీని డిఫెన్స్‌లో పడేస్తే తప్ప, ప్రజల ఆలోచన దోరణి మారదన్నది బిజేపి కుటిల ప్రయత్నంగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఫేక్‌ వార్తలు సృష్టించి టిఆర్‌ఎస్‌కు వామపక్షాలకు దూరం పెరిగినట్లు కొత్త అసత్య వార్తలు సృష్టిస్తున్నారు. గురువారం మునుగోడులో నామినేషన్‌ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సాగిన ర్యాలీలో మంత్రులు కేటిఆర్‌, జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌లతోపాటు, జీపుపై సిపిఐ, సిపింఎం నాయకులు కూడా వున్నారు. అయినా బిజేపి అబద్దాలైనా ప్రచారం చేసి గెలవాలన్న ఆలోచనతో, ఫేక్‌ స్టోరీలు సృష్టించి, సోషల్‌ మీడియా వేధికగా ఇలాంటి అబద్దాలను నమ్ముకొని ప్రచారం చేస్తోంది. ఎన్నికల వేళ గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యమనుకునే రాజకీయాలు నడుస్తున్న రోజులు. అసలు రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేసినట్లు? అన్నదానిపై జరగాల్సిన చర్చను పక్కదారి పట్టించి, ఉప ఎన్నిక తెచ్చి తన బలం పెంచుకోవడం కోసం బిజేపి వేసిన ఎత్తులను ప్రజలు బాగానే గమనిస్తున్నారు. మూడేళ్ల కిందట రాజగోపాల్‌ ఏం మాట్లాడాడు?

ఏం చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాడు? అన్నది ఓసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడు నియోజవర్గంలోని చండూరు మండల అభివృద్ధి కోసం ఇచ్చిన ఎన్నికల హామీలను ఓసారి పరిశీలిద్దాం…గట్టుప్పల్‌ను ప్రత్యేకంగా మండలం చేయిస్తానన్నాడు. కాని నాలుగేళ్లలో ఆయన చేసిన పోరాటం లేదు. ఉద్యమం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది లేదు. కాని ప్రజలు చేసిన ఉద్యమం మూలంగా ప్రభుత్వం ఇటీవల ఆ మండలాన్ని ప్రకటించింది. ప్రజల కోరిక నెరవేర్చింది. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు కూడా రాజగోపాల్‌రెడ్డి వెనుకాడడం లేదు. ఇక చండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, నిర్మాణం, మోడల్‌ స్కూలు నిర్మాణం అన్నాడు. కాని అదీ చేయలేదు. చండూరు మండలంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయిస్తానన్నాడు. కాని ఆ వైపు అడుగులు వేయలేదు. ప్రభుత్వం దృష్టికి తేలేదు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీని ఎప్పుడో మర్చిపోయాడు…వ్యాపారాలు మాత్రం పెంచకుంటూ వెళ్లాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెండలమ్మ చెరువు మరమ్మత్తులుపూర్తి చేయించి, గొల్ల గూడెం, పుల్లం, బంగారిగడ్డ, తాస్కాని గూడేలంకు సాగునీరు అందిస్తానన్నాడు. కాని వాటి కోసం ప్రభుత్వాన్ని కలిసింది లేదు. వాటి గురించి కొట్లాడిరదిలేదు. ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టింది లేదు. వెంకన్న గూడెం నుంచి కొండా పురం వరకు ఫీడర్‌ చానల్‌ పూర్తి చేసి, కొండాపురం, పుల్లం, బోడంగిపర్తి గ్రామాలకు సాగునీరందిస్తానన్నాడు. శభిలేటి వాగునుంచి కస్తాల చెరువులోకి ఫీడర్‌ చానల్‌ ద్వారా నీరు అందేలా చూస్తానాన్నాడు. గెలిచి తానిచ్చన హమీలు రాజగోపాల్‌రెడ్డి విస్మరించాడు. పనులు గాలికి వదిలేశాడు. ప్రతిపాదనలు ఏనాడు సిద్దం చేసింది లేదు. కనీసం అధికారుల దృష్టికైనా తీసుకెళ్లలేదు. ప్రభుత్వానికి విన్నవించింది లేదు. ఎన్నికల సమయంలో ప్రజలు తాను ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందు వుంచింది లేదు. తన వ్యాపార సామ్రాజ్య వి స్తరణ కోసం మాత్రం పనిచేసుకుంటూ వెళ్లాడన్నది చుండూరు ప్రజల మనోగతం. ఇదిలా వుంటే కొత్తగా ఏర్పాటైన చుండూరు మున్సిపాలిటీని సుందరీకరణ చేస్తానంటూ చెప్పిన మాటలు కూడా ఆయన నిలబెట్టుకోలేదు. చండూరు నుంచి తమ్ముల పల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిపిస్తానన్నారు. కాని అది దిక్కులేదు.దేవుడి మీద కూడా ప్రేమ లేదు. పుల్లెమల నుంచి బోడంగిపర్తి, పుల్లెంనుంచి తస్యానిగూడెం, బోరంగి పర్తి, నుంచి శిర్ధేపల్లి, దోని పాముల నుంచి జోగి గూడెం, అక్కడినుంచి తిమ్మారెడ్డి గూడెం, నెర్మట నుంచి శేరి గూడెం వరకు, ఉడుతల పల్లి నుంచి దుబ్బ గూడెం, రెగట్టే వరకు రోడ్డు నిర్మానం చేస్తానాన్నాడు. అంతే కాకుండా కస్తాల నుంచి, చొప్పది గూడెం, పోచంపల్లి వరకు కూడా రోడ్డు నిర్మాణం చుండూరు మండలానికి రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన హామీలు. సొంత నిధులు వెచ్చించైనా పూర్తి చేస్తానని చెప్పిన మాట. ఈ హమీలలో కొన్ని తాను సొంత నిధులతో చేపడతానని కూడా రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో పనులు చేసే బాద్యత నాది…ఇదీ నా విజన్‌ అని చెప్పి చేతులెత్తేసిన ఘనత రాజగోపాల్‌రెడ్డిది. అచ్చం నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌ కూడా పసుపు బోర్డు ఏర్పాటు గురించి ప్రజలకు బాండ్‌పేపర్‌ రాసిచ్చినట్లే ఇక్కడ కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు తన సొంత నిధులతో మునుగోడు అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేశారు. ప్రజలచేత ఓట్లేయించుకున్నాడు. గెలిచాడు. ఇప్పుడు తన వల్ల కావడం లేదని, ప్రభుత్వం సహకరించడం లేదన్న అపవాదును టిఆర్‌ఎస్‌ మీదకు తోసేసి, 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బిజేపిలో చేరాడు…స్యయంగా ఆయన కూడా ఇటీవల చెప్పుకున్న మాట…ఆయనతోపాటు ప్రజలు చెప్పుకుంటున్న మాట…ఛీ…ఛీ అంటున్న మాట!మునుగోడు ప్రజలను నమ్మించి, బుట్టలో వేసుకొని 2018 ఎన్నికల్లో గెలిచి, కారు జోరులోనూ, బలంగా వీచిన టిఆర్‌ఎస్‌ గాలిని తట్టుకొని గెలుస్తూ వస్తున్నానని చెప్పాడు. తాను బలమైన నాయకుడినని నమ్మించాడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో డిల్లీ పరిచయాలను ఆసరా చేసుకొని బిజేపికి అనుకూలమైపోయాడు. మూడేళ్లుగా బిజేపి వైపు చూస్తున్నాడు. కాంట్రాక్టు ఓకే అయితే గోడ దుంకేందుకు సిద్ధమన్నాడు…అన్నీ కుదిరాయి…కాంట్రాక్టు సొంతమై బిజేపిలో చేరాడన్నది కంటి ముందు కనిపిస్తున్న నిజం. దాంతో మునుగోడు అభివృద్ధి పట్టించుకోలేదు. కాని ప్రభుత్వం సహకరించలేదు. అన్న మాట చెప్పి ప్రజలను మరోసారి ఏమార్చేందుకు, నమ్మించేందుకు, వంచించేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాడు. కాని మరి ఇప్పుడు గెలిచి ఏం చేస్తానన్న మాట మాత్రం రాజగోపాల్‌రెడ్డి చెప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిజేపి అన్న ఒక్క మాట తప్ప మరో మాట చెప్పుకోవడానికి ఏమీ లేదు…ఇదేనా ప్రచారమంటే..ఇంతేనా ఎన్నికలంటే…తాను గెలిచేందుకేనా రాజకీయాలంటే అని ప్రజలు నిలదీస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిని కడిగేస్తున్నారు. తాజాగా ఓ గ్రామ ప్రజలు రాజగోపాల్‌ రెడ్డి రావొద్దని నినాదాలు చేసిన వార్తలు కూడా సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారంలో వున్నాయి.

మునుగోడులో బిజేపికి ముచ్చెమటలే..నా!?

`మూడో ఉప ఎన్నికలో గెలవాలనే ముచ్చట తీరనిదేనా!?

`రాజగోపాల్‌ రెడ్డి మాట విని బిజేపి పెద్దలు తొందరపడ్డారా?

`చేజేతులా తెలంగాణలో పెరిగిన ఆ కాస్త స్పేస్‌ చెరిపేసుకున్నారా?

`గుట్టుగా వున్న నమ్మకం వమ్ము చేసుకుంటున్నారా?

`అసలు వేడిలో ప్రజల నాడి తెలుసుకొని తలలు పట్టుకుంటున్నారా?

`ప్రచారంలో జనం మాటలు విని బిజేపి నేతలు మోసపోయారా?

`రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేమి స్పష్టంగా కనిపిస్తోందా?

`దుబ్బాక వేరు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేరన్నది తెలిసొస్తోందా?

`బ్రాండ్‌ అని చెప్పి రాజగోపాల్‌ రెడ్డి ముగ్గులో పడి బిజేపి గిలగిలలాడుతోందా?

`రాజగోపాల్‌ రెడ్డి గెలుపు కష్టమని తెలిసి, బెంబేలెత్తుతోందా?

`టిఆర్‌ఎస్‌ కు కనబడుతున్న ఆదరణ బిజేపి కేంద్ర పెద్దలకు చేరిందా?

`మునుగోడులో పెద్దమనుషుల మాటలు విని బిజేపికి తోచడం లేదా?

`జనం మాట…ప్రచార బాట.

`ఎక్కుడ వింటున్నా గులాబీ పాటే…కారుకు గెలుపు పరిపాటేనా! 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పలకరించిన వాళ్లంతా పక్కింటి వాళ్లు కాదు…ఎదురొచ్చినవాళ్లంతా ఎదిరింటివాళ్లు కాదు..కనిపించినోళ్లంతా కావాల్సిన వాళ్లు కాదు…రాజగోపాల్‌ రెడ్డి ప్రచారానికి వచ్చిన వాళ్లంతా పొద్దుగూకితే చెప్పే సుద్దులు వేరని మునుగోడులో జనం చెప్పుకుంటున్న మాటలు…ఇవన్నీ బిజేపి తెలుసుకోవాలి. ఇన్ని రకాల మాటలు చెప్పి మాయ చేసిన రాజగోపాల్‌ రాజకీయం పార్టీ పెద్దలు అర్దం చేసుకోవాలి. ఈ మాటలంటున్నది ఎవరో కాదు బిజేపి నాయకులే…? రాజగోపాల్‌రెడ్డిని రాజకీయంగా పెంచి పెద్ద పెద్ద చేసి, పదవులిచ్చి పోషించి, గుర్తింపునిచ్చి, ప్రతి ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇల్లిల్లూ తిరిగి ఓట్లేయించింది కాంగ్రెస్‌ ఫార్టీ. మునుగోడు నాదే..మునుగోడులోనే వుంటా…చచ్చినా బతికినా, మునుగోడులోనే అని రాజగోపాల్‌రెడ్డి నమ్మించి, జనాన్ని ముంచాడు…పార్టీకి టోకరా ఇచ్చాడు… ఓట్లేసినందుకు జనాన్ని వెర్రివెంగలప్పలను చేశాడు.కాంగ్రెస్‌పై పార్టీపై నిందలేస్తున్నాడు. భవిష్యత్తు కాంగ్రెస్‌కు లేదంటున్నాడు. రాజీనామా చేసి కాషాయతీర్ధం పుచ్చుకున్నాడు. పూటకో మాట చెబుతున్నాడు. అవకాశవాదిగా ఎప్పుడో ఒకనాడు బిజేపికి జెల్లకొట్టడన్న నమ్మకమేముందున్న మాటనే బిజేపి నాయకులు మాట్లాడుతున్నారు. మునుగోడులో బిజేపి అన్న పదమే వినిపించని నాటి నుంచి నేటిదాకా పార్టీకోసం పనిచేసిన వారిని కాదని, రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడమే ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదట!పైగా ఇప్పుడు మొదటినుంచి బిజేపిని నమ్ముకొని రాజకీయం చేసి, ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులను రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోవడం లేదట…తన వెంట కాంగ్రెస్‌నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారని బిజేపి నాయకులే అంటున్నారు. ఇదిలా వుంటే రాజగోపాల్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోయే ప్రమాదం వుందా? అన్న మాటలు కూడా బిజేపి పెద్దలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం, రాజకీయం అంతా చూస్తున్న బిజేపి పెద్దలు ప్రజలు రాజగోపాల్‌పై పెద్దఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నట్లు తెలిసి మండిపడుతున్నారని చెప్పుకుంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అనేది బ్రాండ్‌ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు, చేసిన ప్రచారం నమ్మి, ఉప ఎన్నికలు తెచ్చి కోరికోరినష్టాని మూటగట్టుకుంటామా? అన్న ఆందోళనలో బిజేపి పెద్దలున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి చెప్పినంత బలం గ్రౌండ్‌లో లేదని, క్షేత్రస్దాయిలో ఆయన అనుచరులు తప్ప, ప్రజలు ఆయన వైపు లేరన్న విషయం స్పష్టమౌతోందంటున్నారు.

 

అందుకే రాష్ట్ర నాయకులు కూడా ఈ విషయం చెప్పకుండా దాచి, పార్టీని మోసం చేస్తున్నారా? అని కేంద్ర పెద్దలు రాష్ట్ర బిజేపి నాయకులపై గుర్రుగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. హుజూరాబాద్‌కు మునుగోడుకు పోలికే లేదు…ఉప ఎన్నికలను ఓసారి బాగా పరిశీలిస్తే రెండు ఉప ఎన్నికలు మాత్రం ప్రత్యేకం… అవి బిజేపి ఖాతాలో వేసుకోవాల్సినవి కాదు…బిజేపి బలంతో గెలిచినవి కాదు… అవి వారి వారి వ్యక్తిగత సానుభూతి తప్ప, బిజేపిని చూసి జనం ఓట్లేయలేదు. ఓ వైపు పెరుగుతున్న ధరలు…నానాటికీ దిగజారుగుతున్న ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి లేక యువత పడుతున్న ఇబ్బందులు, నిత్యం పెరిగే డీసెల్‌, పెట్రోల్‌ ధరలు, మూడిరతలు పెరిగిన గ్యాస్‌ ధరతోపాటు, ఏడాదికి మూడు సిలిండర్లు చాలవా? కేంద్ర పెద్దలు చెప్పే మాటలపై ప్రజలు ఆగ్రహంతో వున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలుపులు చూసుకొని, పార్టీ బలమనుకుంటే పొరపాటు అని బిజేపి శ్రేణులే చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కారుడిగా ప్రజలకు పరిచయం వున్న రఘనందన్‌ రావు పలు మార్లు పోటీ చేసి, ఓడిపోవడంతో, ఈసారైనా గెలిపించండి అంటూ ఆయన వేడుకోవడంతో దుబ్బాక ప్రజలు గెలిపించారు. అంతే తప్ప దుబ్బాకలో రఘనందన్‌ గెలుపు బిజేపిది కాదు. ఇక హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలుపు అన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత విజయమే… అంతే కాదు ఎన్నికల సమయంలో ఆయన జై మోడీ అన్నది లేదు…జై బిజేపి అని చెప్పుకున్నదిలేదు. ఎక్కడికెళ్లినా ఒంటరి ప్రచారం తప్ప, బిజేపి నేతలను వెంటబెట్టుకుపోయింది లేదు. ఆయన ప్రచారమంతా ఒక్కడే చేసుకున్నాడు. తన విజయం తన ఖాతాలోనే వేసుకున్నాడు. కాని బిజేపి తన గెలపని ప్రచారం చేసుకుంటుంటే ఈటెల అనుచరులే నవ్వుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితులను చూసి, ఇక బిజేపిలో చేరితే చాలని, కాంట్రాక్టులు సొంతమౌతాయని ఆశించి రాజగోపాల్‌రెడ్డి బిజేపిలో చేరిండన్నది ముమ్మాటికీ నిజమన్నది మునుగోడు ప్రజలే చెప్పుకుంటున్న మాట…ఒక్కసారి రాజగోపాల్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆయా సందర్బాలలో రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వూలలో మాటలను జత చేసి, తెరాస చేస్తున్న ప్రచారానికి ప్రజలనుంచి విపరీతమైన స్పందన కూడా వస్తోంది. వాటిని గురించి ఓసారి పరిశీలిస్తే తమది చిన్న వ్యాపారం అన్నాడు. అప్పులు చేసి, వ్యాపారాలు చేస్తామన్నాడు రాజగోపాల్‌రెడ్డి. అంతే కాదు ఇరవై కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా తనకు తెలియదన్నాడు. ఇప్పుడు 18వేల కోట్ల ప్రాజెక్టు దక్కించుకున్నాడు. తామకున్న సంపాదనకు, ఆస్ధికి కారులో కాదు , హెలీకాప్టర్‌లో తిరగాలంటున్నాడు. కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలియదన్నాడు… ఏడు కోట్లు పెట్టికారు ఎలా కొన్నారంటే తనది కాదు…తన కొడుకుదన్నాడు. ఇప్పుడు చిన్న వ్యాపారులం కాదంటున్నాడు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని గతంలో అన్నాడు. ఇప్పుడు 18వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చిన పార్టీకి రుణం తీర్చుకుంటున్నాడు. ఇలా పూటకో మాట చెప్పి రాజకీయం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డిని నమ్మమని ప్రజలే చెబుతున్నారు. మునుగోడులో పెద్ద వయసున్న వాళ్లు చెబుతున్న మాటలు ఎంతో ఆసక్తిగా వుంటున్నాయి.ఎందుకంటే వాళ్లు తెలంగాణలో గోస చూశారు…నీటి గోసలు ఎదుర్కొన్నారు..కరంటులేని బతుకులు చూశారు…సాగుకు నీరందని రోజులు చూశారు… ఏటా ఎండిపోయిన పంటలు చూశారు…చిమ్మచీకట్లు చూశారు…కరంటు లేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేకపోయారు…రూపాయి సంపాదన లేక కూలీలై బతికిన రోజులు చూశారు…ఫ్లోరైడ్‌ మూలంగా ఎదురైన అనార్యోగాలు చూశారు… అన్ని చూసిన కళ్లతో నేడు కళకళలాడుతున్న పల్లెలు చూస్తున్నారు. వెలుగుతున్న చిన్న చిన్న పట్టణాలు చూస్తున్నారు. ఇరవై నాలుగుగంటల కరంటు చూస్తున్నారు…ఏటా పండుతున్నపంటలు చూస్తున్నారు… కరువులు లేని కాలం చూస్తున్నారు…ఇంటింటికీ మంచినీరు చూస్తున్నారు. తమ పిల్లలు చూసుకోకున్నా, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా ఫించన్లతో జీవనం సాగిస్తున్నారు. కేసిఆర్‌ను పెద్ద కొడుకొని మురిసిపోతున్నారు…గత ఎన్నికల ముందు తెలంగాణలో కంటి పరీక్షలు చేసి, చూపు చెప్పించిన దేవుడని పెద్ద మనుషులు కొలుస్తున్నారు…ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ను దీవిస్తున్నారు. ఇదీ ఇప్పుడు మునుగోడులో కనిపిస్తున్న దృష్యం… మునుగోడులో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రచారంలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. విశేషాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే టిఆర్‌ఎస్‌నాయకులకు ఊపునిస్తున్నాయి. గురువారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆసక్తికరమైన సంఘటనను ఎదుర్కొన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఓ ఓటరు ఆయన వద్దకు వచ్చి ప్రజలు ఆలోచనల తీరును ఆవిష్కరించారు. టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెప్పారు. తన బంధువుల చెందిన వివిధ గ్రామాల్లోనూ అదే పరిస్ధితి వుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనపై ప్రజలు సంతోషంగా వున్నారని ఆ పెద్ద మనిషి చెప్పడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. అంతేకాదు అభివృద్ధి చేసిన కేసిఆర్‌ వైపే ప్రజలు నిలబడతారని, ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మరని ఆ పెద్దాయన చెప్పడం కొసమెరుపు. ఇక మరో మహిళ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో సర్కిళ్లలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి. తనకు కళ్లు బాగు కావడానికి కారణం కేసిఆర్‌ అంటూ, తన మద్దతు టిఆర్‌ఎస్‌కే అంటూ చెప్పడం గమనార్హం. ఇలా నిత్యం ప్రచారంలో అనేక పదనిసలు కనిపిస్తున్నాయి.

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో పూల రవీందర్,పుట్టం పురుషోత్తంల నాయకత్వాన చండూరుకు తరలివచ్చిన మున్నూరుకాపులు

టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన ర్యాలీ,సభ దిగ్విజయం

టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్థార్ పుట్టం పురుషోత్తంల నాయకత్వాన మున్నూరుకాపులు చండూరుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఉన్న మున్నూరుకాపులు ఆకుపచ్చని, గులాబీ కండువాలు మెడలో ధరించి మండుటెండలో మోటార్ సైకిళ్లపై తరలి వచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు,సభకు వేలాదిమంది తరలివచ్చి దిగ్విజయం చేశారు.కేటీఆర్ 45 నిమిషాలకు పైగా చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.చండూరుకు తరలి వచ్చిన మున్నూరుకాపు ప్రముఖులలో ఆకుల రజిత్,వాసుదేవుల వెంకటనర్సయ్య, సకినాల రవికుమార్, జెన్నాయికోడే జగన్,సోమ నారాయణ,గంధం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

పేదలకు కొండంత అండ కళ్యాణలక్ష్మీ పథకం : ఎమ్మెల్యే చల్లా

నేటిధాత్రి హనుమకొండ

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని

తెలిపారు. గీసుగొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 63 లబ్దిదారులకు రూ.63 లక్షలకు పైగా విలువచేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు.

 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాదీ ముబారక్‌, కళ్యాణ లక్ష్మీ పథకాల ద్వారా ఒక లక్షా నూటపదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో మండలాల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు గోడు తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్…

నేటిధాత్రి చౌటుప్పల్

 

రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్థంతో ఉప ఎన్నిక.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని 18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి..

ఫ్లోరైడ్ రక్కసిని దూరం చేసిన కేసీఆర్.. కారుగుర్తుకే ఓటేసి గెలిపిద్దాం..

ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వ వార్డ్ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్..

చౌటుప్పల్ లో ఎమ్మెల్యే,చౌటుప్పల్ 14,19 వార్డుల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ ప్రచారం

ఊపందుకుంది..గడగడపను తడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే అభ్యర్థిస్తున్నారు..తమ గోడు తీర్చిన టీఆర్ఎస్ పార్టీకి,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు జై కొడుతున్నారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటువేయాలని 18 వేల కోట్ల కాంట్లాక్ట్ కు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి,మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇదన్నారు. ప్రజలు సరైన తీర్పునివ్వాలి..ఫ్లోరైడ్ రక్కసితో తండ్లాడిన మునుగోడు ప్రజల గోడును మిషన్ భగీరధతో తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు..రాజగోపాల్ రెడ్డికి ఆస్థులు పెంచుకోవడం కావాలని,టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజల మేలు అవసరమన్నారు..మీ ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన వాళ్ళకు బుద్ది చెప్పి,ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు..

ఈ కార్యక్రమంలో ఇంచార్జులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

ఇది కథ కాదు…! ఓసారి చదివి చూడు!!

`అవినీతి ప్రోత్సాహించడమే ఆ సారు డ్యూటీ?

`ఎంతో కొంత ఇచ్చేసి, బిల్లు తీసుకుపో? అని చెప్పడమే ఆయన దృష్టిలో నీతి.

`ప్రతి పనికి రేటు, రిబేటు విధిలో భాగమది?

`గతంలో కలెక్టర్‌ గా వున్నప్పుడే ఓ ఐఏఎస్‌ అధికారి చెప్పిన మాట?

`ఓ బాధితుడు చెప్పిన విషయం వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే?

డెస్క్‌,నేటిధాత్రి:  

ఈ మధ్య నేటిధాత్రి ఓ అవినీతి అధికారి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచురిస్తోంది. అయినా పై స్థాయి అధికారుల స్పందన లేదు. జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా అసలు అవినీతి అధికారి గురించి పట్టించుకున్న వారు లేరు. పుంకానుపుంకాలుగా వస్తున్న ఆరోపణలు రాసి, రాసి జర్నలిస్టులు అలసిపోతున్నారు. కానీ అధికారులలో చలనం లేదు. సంబంధిత అధికారి మీద చర్యలు లేవు. ఒక అధికారి తన ఉద్యోగ పర్యంతం ఇన్ని అన్యాయాలు చేశాడా? ఇంత అవినీతికి పాల్పడ్డాడా? అని ప్రజలు చర్చించుకుంటున్నారే గాని, అధికారులు పట్టించుకోవడం లేదు…కారణం ఎవరకీ బోధపడడం లేదు. సమస్య అంతు చిక్కడం లేదు…ఇంతలో ఓ రోజు అర్థరాత్రి అమెరికా నుంచి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఫోన్‌ కాల్‌ వచ్చింది… తననహ తాను పరిచయం చేసుకున్నాడు. కొంత కాలంగా రోజూ నేను నేటిధాత్రి దినపత్రికను చదువుతున్నాను. ఓ అవినీతి అధికారి గురించి నిత్యం వస్తున్న వార్తలు చూస్తూనే వున్నాను. మీరు ఎంత కాలం వార్తలు రాసినా, ఆ అవినీతి అధికారి మీద ఎలాంటి చర్యలు వుండవని ఆ వ్యక్తి అన్నాడు…అదేంటి ఒక్కసారిగా అంత మాట అనేశారు…? అని కట్టా రాఘవేంద్రరావు అడిగారు…అదంతే…అన్నారు అవతలి వ్యక్తి… ఎందుకో చెప్పగలరా? అని రాఘవేంద్రరావు అడిగారు…నా స్వీయ అనుభవం చెబుతాను వినండి అన్నారు….మాది ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లా. ఆ జిల్లాకు ఓ ఐఏఎస్‌ అధికారి కలెక్టర్‌ గా వుండేవారు. ఆయనే ఇప్పుడు మీరు రాసే శాఖలో కీలక స్థానంలో, పై స్థాయిలో వున్నారు. ఆ అధికారి ఆశీస్సులు ఎంతో మంది అధికారులకు వున్నాయి. ఆయన చెప్పింది చేయడానికి, దోచుకున్న దానిలో వాటాలు పంపడానికి అనేక మంది అధికారులున్నారు. ఎంత చిన్న పని అయినా సరే…ఎంతో కొంత ఇచ్చి పని కానిచ్చేసుకో…అంటారే గాని అధికారులను మాత్రం ఎప్పుడూ మందలించరు అని చెప్పాడు. గతంలో తనకు ఓ ప్రభుత్వ కార్యాలయం ముందు జిరాక్స్‌ సెంటర్‌ వుండేది.

ఆ సమయంలో ప్రభుత్వానికి చెందిన అనేక జిరాక్స్‌ పనులు చేసేవాడిని. అందుకోసం బిల్లులు మంజూరు చేసేవారు. నాకు రూ.10వేలు బిల్లు రావాల్సివుంది. నాకు రావాల్సిన బిల్లు కోసం ప్రభుత్వ కార్యాలయంలో అధికారిని సంప్రదించాను. రూ.4 వేలు ఇస్తే బిల్లు మంజూరు చేస్తానన్నాడు. నాకు ఒక్క సారిగా దిమ్మ తిరిగి పోయింది. జిరాక్స్‌ బిల్లులు ఇవ్వడానికి లంచమా? ఇంత దుర్మార్గమా? ఎంత విడ్డూరం? అనుకున్నాను. రూ.4 వేలు అధికారికే ఇస్తే ఇక నాకు లాభం ఏముంది? నష్టమే మిగులుతుంది. ఎలాగైనా ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లానని నిర్ణయించుకున్నాను. విషయం ముందుగా మా గ్రామ ఎంపిటీసి చెవిలో వేశాను. అతన్ని తీసుకొని కలెక్టర్‌ వద్దకు ఓ రోజు వెళ్లడం జరిగింది. జరిగిన విషయం చెప్పడం జరిగింది. నేను చెప్పిన విషయం విన్న కలెక్టర్‌ ఈ సంగతి చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? ఎంతో కొంత ఇచ్చి సెటిల్‌ చేసుకోక, పిర్యాదు చేసేందుకొచ్చావా? వెళ్లు అని కలెక్టర్‌ పంపించేశాడు. ప్రతిదానికి అధికారుల మీద ఏదొ ఒక పిర్యాదు…ఏదో ఇచ్చి నచ్చజెప్పుకొని పని కానిచ్చుకోక ఇబ్బంది పడడం ఎందుకు? మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకన్నాడు. కలెక్టర్‌ నోటి నుంచి అటువంటి మాటలు విన్నాక, బిల్లు గురించి మర్చిపోయాను. లంచమిచ్చి బిల్లు తెచ్చుకోవడం కన్నా వదిలేసుకోవడం మేలనుకున్నాను. కలెక్టర్‌ అండ చూసుకొనే అప్పుడు అధికారులంతా ప్రజలను పీడిరచుకునేవారు. కలెక్టర్‌ కు వాటాలు పంపేవారు…ఇదీ అప్పుడు అందరూ చర్చించుకున్న మాట…మీ నేటిధాత్రి లో కథనాలు వస్తున్న అధికారికి కూడా అప్పటి కలెక్టర్‌, ఉన్నత స్థానంలో వున్న అధికారి ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి…ఇదీ అమెరికా నుంచి ఓ పాఠకుడు కం బాదితుడు చెప్పిన మాట…అది విని విస్తుపోవడం రాఘవేంద్రరావు వంతైంది.అవినీతి అధికారుల బాగోతాలు ఒక రోజు రాసి వదిలేస్తే మీడియా మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఫాలోఅప్‌ వార్తలేవని పాఠకులే ప్రశ్నిస్తుంటారు. మరి ఇలాంటి అధికారులు, పై స్థాయి అధికారుల ఆశీస్సులతో అవినీతి చేస్తుంటే ఆపేవారుంటారా? మీడియా రాస్తూ పోయినా పట్టించుకుంటారా? అందుకే ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. అవినీతిని ప్రజలే ప్రశ్నించాలి. అవినీతిపై పోరాడుతున్న మీడియా కు తోడ్పాటు కావాలి. అప్పుడు గాని అవినీతి అంతం కాదు. అధికారుల్లో భయం పుట్టదు.

ఇవేం దిక్కుమాలిన కమిటీలు?

`ఎన్ని కమిటీలు వేసి తయారు చేస్తారు నివేదికలు?

`కావాలనే కాలయాపనలు?

`భ్రూణ హత్య కేసులో అధికారుల చిత్రవిచిత్రాలు!

`కాలయాపన తప్ప, కనువిప్పు లేదు…కదిలింది లేదు?

` జిల్లా యంత్రాంగం ఇచ్చిన కమిటీ కలెక్టర్‌ త్రోసిపుచ్చారు?

`తిరిగి ఫైలు పంపించారు?

`మళ్ళీ నివేదిక తయారు చేశారా? కలెక్టర్‌ కు అందజేశారా తెలియదు?

`డిఎంఅండ్‌ హెచ్‌ఓ ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందించరు…సమాధానం చెప్పరు?

`తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ వేసిన కమిటీ ఏం చేసిందో వివరాలు లేవు?

`నివేదిక తయారైనట్లు, మరో కమిటీ నియమిస్తున్నట్లు తెలుస్తోంది?

`ఎన్ని కమిటీలు వేస్తారు?

`ఎంత కాలం సాగదీస్తారు?

`రజిత చనిపోయి వందరోజులౌతోంది!

`వైద్యురాలు సబితను అందరూ కలిసి వెనకేసుకొస్తున్నారా?

`కాపాడుతున్నారా? 

`ఏం జరుగుతోంది? రజితకు న్యాయం జరిగేదుందా?

`అటకెక్కిన ఫైలు దుమ్ము పేరుకుపోవాల్సిందేనా?

నిండు గర్భిణీ రిజత ప్రాణం పోయేందుకు కారణమై, పిల్లలను అనాధలను చేసి, భ్రూణ హత్యలే వ్యాపకంగా, వ్యాపారంగా మార్చుకొని వైద్య వృత్తి ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని దోషులుగా తేల్చేందుకు ఇంత కాలమా…ఇంత కాలయాపనా? వైద్యురాలిగా ప్రచారం చేసుకుంటూ సబిత అనే ఓ మహిళ సాగిస్తున్న అరాచకానికి, ప్రజల ప్రాణాలు తోడేస్తున్న తోడేలు లాంటి వ్యక్తులను అధికారులే వెనకేసుకొస్తున్నారా? కాపాడుతున్నారా? అన్న అనుమానం రాకుండా వుంటుందా? ఎంత కాలం కాపాడుతారు? ఇంకా ఎంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమౌతారు? అభం శుభం తెలియని ఓ అమాయకురాలైన రజితను నమ్మించి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా గర్భం తొలగిస్తామని చెప్పి, ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వుండదని చెప్పి, కళ్లు తెరవని పసిగుడ్డుతోపాటు, ఇద్దరు పసి బిడ్డలున్న తల్లి రజితను కూడా పొట్టనబెట్టుకున్నారు. అబార్షన్‌ పేరుతో రజిత ప్రాణాల మీదకు తెచ్చి సబిత వదిలేసింది. హన్మకొండలోని రుయా ఆసుపత్రికి పంపి చేతులు దులుపుకున్నది. రజిత కు వైద్యం చేస్తామని ఆసుపత్రిలో చేర్చుకొని రుయా ఆసుపత్రి చేతులేత్తేసింది. తమ వల్ల కాదని శ్రీ చక్ర ఆసుపత్రికి ప్రాణాలతో పోరాటం చేస్తున్న రజితను పంపింది. వైద్యం పేరుతో ప్రయోగం చేసి, రజిత ప్రాణాలు పోతుంటే శ్రీ చక్ర వైద్యులు చోద్యం చూశారు…తమకు చేతగాని వైద్యం చేస్తామని చెప్పి ప్రాణాలు రజిత ప్రాణాలు గాలిలో కలిపేశారు. ఓ కుటుంబాన్ని ఆగం చేశారు. పిల్లలను అనాధలను చేశారు. ఆ కుటుంబాన్ని మభ్య పెట్టి మాయ చేశారు. అమాయకుల జీవితాలను వీధినపడేశారు. ఓ అమాయకురాలి ప్రాణం తీశారు. మరి అలాంటి వారిపై చర్యలుండవా? వెలుగులోకి వచ్చిన ఈ ఒక్క సంఘటనే కాదు, అనేకం జరుగుతున్నాయి. ఇదే సబిత అనే వైద్యురాలు గతంలో మూడు సార్లు పట్టుబడిరదన్న సంగతి నేటిధాత్రి చెబుతూనే వుంది. సబిత చేస్తున్న చట్టవ్యతిరేకమైన అబార్షన్లను ఎప్పటినుంచో చేస్తున్న సంగతి కూడా వెలుగులోకి తెచ్చింది. ఆమె చేసే అక్రమ అబార్షన్లను అడ్డుకొని, ఆమెను పోలీసులకు పట్టించిన ప్రభుత్వ వైద్యుడు వెల్లడిరచిన విషయాన్ని కూడా నేటిధాత్రి ప్రచురించింది. ప్రస్తుతం తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన బోర్డులో ఆ వైద్యుడు సభ్యుడుగా వున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే రజిత కుటుంబ సభ్యుల చేత డిఎంఅండ్‌హెచ్‌వో వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆ నివేధికను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్‌ ఆ నివేదికలో లోపాలున్నాయన్నారు. ఫైలు తిరిగి వెనక్కి పంపారు. మళ్లీ ఎంక్వైరీ చేశారా తెలియదు. కలెక్టర్‌కు మళ్లీ నివేధిక ఇచ్చారా? అన్నదాని గురించి సమాచారం లేదు. బాధితురాలికి నాయ్యం జరగింది లేదు. ఆ కుటుంబానికి మేలు జరిగింది లేదు. 

కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. డిఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో నివేధిక కలెక్టర్‌కు చేరింది. తిరిగి ఆ ఫైలు డిఎంఅండ్‌హెచ్‌వో కు తిరిగి పంపబడిరది. అయినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. నేటిధాత్రిలో వస్తున్న వస్తున్న వరుస కథనాలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించి, వివరాలు సేకరించాలని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రేత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అది ముక్కుతూ, మూల్గుతూ, ఇప్పుడు, అప్పుడూ అంటూ ఇంత కాలం ఆగి, ఆగి ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేధికలో ఏం చెప్పిందనేది ఓ బ్రహ్మపదార్ధమే…అయినా చర్యలకు ఉపక్రమించారా అంటే అదీ లేదు. మళ్లీ ఈ నివేదికపై ఓ కమిటీ ఏర్పాటుతో మరింత కాల యాపనకు మరో అస్త్రం అధికారులు సంధించారు. సబితను కాపాడే ప్రయత్నంలో వున్నారు. ఇదేనా ప్రభుత్వాధికారులు నిర్వహించాల్సిన పాత్ర….కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోవడానికి ఇదేమైనా రాజకీయ పరమైన అంశమా? ఓ తల్లి నిండు ప్రాణం. వైద్యం పేరుతో ఓ మహిళ ప్రాణాలు తీసిన విషయం. అయినా దానిపై పెద్దగా స్పందన లేదు. స్పందించేవారు లేరు. కదిలేవారు లేరు. కాలయాపనకు మాత్రం అందరూ కలిసే ఫైలును అడకెక్కించించి, దుమ్ము పట్టిస్తున్నారు. దాన్ని అందరూ మర్చిపోయేలా చేస్తున్నారు. అసలు ఆ ఘోరాన్ని కేసుదాకా కూడా వెళ్లకుండా చేస్తున్నారు. నిందుతురాలుగా మారాల్సిన వైద్యురాలు మళ్లీ తన పని తాను చేసుకుంటూ, అదే పైత్యంలో వున్నారు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా డిఎంఅండ్‌హెచ్‌వో స్పందించరు. కనీసం కాల్‌ లిఫ్ట్‌ చేయరు. విషయం వెల్లడిరచరు. అంటే అదేమైనా తమ స్వంత వ్యవహారమనుకుంటున్నారా? మీడియాకు కూడా స్పందించకపోతే, ఇక ఆ అధికారి ప్రజలకు అందుబాటులోకి వస్తారా? వారిచ్చే పిర్యాధులు స్వీకరిస్తారా? బాధితులకు న్యాయం చేస్తారా? ఓ వైపు ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు బోగోతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వాటిమీద స్పందించాల్సిన అవసరం సాంబశివరావుకు వుంది. కాని ఆయన ఎవరికీ వివరాలు వెల్లడిరచరు. అడిగేందుకు కూడా అవకాశం ఇవ్వరు. జవాబు దారి తనం ఎప్పుడో వదిలేశారు. మరి ఇలాంటి వారి వల్లనే వ్యవస్ధలో ఇన్ని రకాల లోపాలు పొడసూపుతున్నాయన్న అపవాదులు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయినా ఆయనెందుకు స్పందించడం లేదో అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వైద్యశాఖ పర్యవేక్షించాలి. 

ఇంత పెద్ద సంఘటన జరిగి వంద రోజులౌతోంది. చనిపోయిన రజిత ఏడాది కాలం పూర్తయినా నివేదికలు తయారైయ్యేలా లేవు. వెలుగులోకి వచ్చేలా లేవు. సబిత మీద చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదు. మూడు రోజులు జైలు…నాలుగో రోజు బెయిలు…అంతకన్నా నాకేం జరుగుతుందన్నంత ధీమాతో, అహాంకారంతో సబిత మాట్లాడుతోందని చెప్పినా అధికారుల కదలకపోవడం విడ్డూరం. పైగా ఈ ఘటన వల్ల నష్టపోయిన రజిత కుటుంబానికి న్యాయం జరగాలని, సబిత లాంటి వారికి శిక్షపడాలని ఇంత కాలంగా అక్షర పోరాటం చేస్తున్న నేటిధాత్రి మీద కూడా ఇష్టాను రీతిన మాట్లాడుతూ, తమను ఎవరూ ఏం చేయలేరంటున్నారని కూడా సమాచారం. మరి జరిగిన విషయాల మీద నేటిధాత్రి వరస కథనాలు ప్రచురించింది. అంతే కాకుండా ఆయా ఆసుపత్రుల వైద్యులు చెప్పిన వివరాలు కూడా ప్రచురించడం జరిగింది. అవే వివరాలు ప్రభుత్వ కమిటీలకు కూడా వెల్లడిరచే వుంటారు. కాని ఆ మాటలు అధికారులు, కమిటీలు ఏమైనా తారు మారు చేశాయా? ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అన్నది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కమిటీ సభ్యులపై వుంది. అదే ప్రభుత్వ వైద్యులు ఏ పొరపాటు చేసినా వెంటనే చర్యలుంటాయి. కాని అదే ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వైద్యులను ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నదానిపై స్పష్టత రావాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలకు ఎందుకు జాప్యం చేస్తున్నాన్నదానిని ఎవరు పట్టించుకోవాలి. రజితకు జరిగిన అన్యాయం విషయంలో మాత్రం నేటిధాత్రి తన పోరాటం ఆపదు…అక్షర యజ్ఞం ఆగదు…నిండు గర్భిణి ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి శిక్ష పడేదాకా నేటిధాత్రి కథనాలు ఆగవు…

న్యూఢిల్లీలో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్ )కార్యాలయాన్ని పరిశీలిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్

కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులు ఉన్నారు

దేశ రాజధాని న్యూఢిల్లీ వసంత విహార్ లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం సందర్శించారు.ఈ సందర్భంగా కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు తదితరులు ఉన్నారు.కేసీఆర్ ఈనెల 5న దసరా పండుగ రోజు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేస్తూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి మంగళవారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై అటు నుంచి ఢిల్లీకి చేరుకోవడం విదితమే.కేసీఆర్ ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించనున్నందున ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం పనులను వేగవంతం చేయిస్తున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు, పర్యవేక్షించారు.పనులను మరింత వేగవంతం చేస్తూ నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఇంజనీర్లకు కేసీఆర్ పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.

గోడు పట్టని వాళ్లు మునుగోడు ఓట్లకొచ్చారు?

` నలభై ఏళ్లు పాలించి గుక్కెడు మంచి నీళ్లివ్వలేదు కాంగ్రెస్‌

` ఫ్లోరైడ్‌ బాధితులను కళ్ల ముందుంచిన కనికరించలేదు కమలనాధులు.

`జనం చేవలేని జీవచ్చవాలైనా కన్నెత్తి చూడలేదు. 

`అయ్యో పాపమని పది పైసలు విడుదల చేయలేదు.

` నాగార్జున సాగర్‌ నీళ్లు సముద్రపు పాలు చేశారే గాని నల్గొండకియ్యలేదు.

` కాంగ్రెస్‌ వున్నంత కాలం ఫ్లోరైడ్‌ బాధ తీరలేదు.

`మునుగోడు నీళ్ల గోడు ఆనాడు ఏ పార్టీ వినలేదు.

`పులిచింతల ప్రాజెక్టు కోసం అన్న రాజకీయం..

`రూ.18వేల ప్రాజెక్టు కోసం తమ్ముడు పార్టీ మారడం.

`తెలంగాణ వచ్చింది… ఫ్లోరైడ్‌ పీడ విరగడైంది.

`మిషన్‌ భగీరథ మునుగోడు బాధ తీర్చింది.

` ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమింది!

`ఉమ్మడి నల్గొండలో నేడు మంచినీటి పరవళ్లు.

` చెరువులు కళ కళ…ఎత్తిపోతలతో జలజల…

`తీరింది నీటి కటకట…

` ఇదంతా జనం చెబుతున్న మాట…

తెలంగాణ గోస ఒకనాడు రాసుకుంటే రామాయణమంత! చెప్పుకుంటే భారతమంతా!! అరవైఏళ్ల గోస…నీళ్లు లేవు…నిధులు లేవు…కొలువుల్లో తెలంగాణ వారికి చోటు లేదు. నల్లగొండ జిల్లా అంటే ఇప్పటికీ నిద్రలో కూడా ఉలిక్కిపడేలా చేసేది ఫ్లోరైడ్‌ భూతం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పుట్టిన వాళ్లైనా, ఓ ఏడాది పాటు నీళ్లు తాగినా పళ్లమీద గారలు.. పుచ్చిన పళ్లు.కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, చేతి వంకరలు, అక్కడే పుట్టిన వాళ్లకు నడుములు ఒంకరలు, ఎదగని ఎముకలు, శారీరక, మానసిక వైకల్యాలు. ఇవీ నల్లగొండ ప్రజలు అనుభవించిన కష్టాలు. ఒక రకంగా అవి నరకాలు. కొన్నేళ్లుగా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. తనువులు చాలించారు. అయినా ఆనాటి పాలకులకు కనికరం రాలేదు. ఆ జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు ఇష్టపడలేదు. ఆ ప్రాంత నాయకులకు శక్తి లేదు. ఉమ్మడి పాలకులను నిలదీసే ధైర్యం చేయలేదు. పదవులు ముఖ్యమనుకున్నారు. నీళ్ల పేరు చెప్పి ఎన్నికల్లో అనేక సార్లు గెలిచారు. ఎమ్మెల్యేలయ్యారు. మంత్రులయ్యారు. ప్రతిసారి ప్రజలు మభ్యపెట్టారు. మోసం చేశారు. కాని నీళ్ల చుక్క తేలేదు. మరో వైపు నల్లగొండ ఉమ్మడి జిల్లాకు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. కాని నేడు నల్లగొండలో మారింది. దాని రూపు రేఖలు మారాయి. ఊరూరికి సురక్షితమైన మంచినీరు అందుతోంది. అందులో మునుగోడు కూడా వుంది. మునుగోడులో కూడా మంచినీరు ఇంటింటికి వస్తోంది. ప్రజలు ఫ్లోరైడ్‌ బారి నుంచి రక్షించబడ్డారు. ఆరోగ్యవంతమైన రేపటి తరం చూడనున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ జిల్లాలో ఎగువ ప్రాంతంలో నిర్మాణం సాగాల్సిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును సీమాంధ్రకు మేలు చేసేలా దిగువ ప్రాంతానికి తరలించారు. తెలంగాణకు అన్యాయం చేయడం ఆనాడే మొదలుపెట్టారు. నీళ్ల గోస తీరకుండా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్లోరైడ్‌ భూతాన్ని పెంచి పోషించారు. నిజానికి మొదట ప్రతిపాదించిన చోట నాగార్జున సారగ్‌ నిర్మాణం జరిగితే, ఆనాడే ఫ్లోరైడ్‌ బాధ తీరిపోయేది. నల్లగొండ సస్యశ్యామలయ్యేది. నల్లగొండలో సిరులు పండేవి. కాని నాగార్జున సాగర్‌ నిర్మాణం ఆంధ్రకు అనుకూలమైన ప్రదేశాన్ని ఎన్నుకొని, నిర్మాణం పూర్తిచేసి ఆంధ్రకు మేలు జరిగేలా చేసుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. అంతే కాదు ప్రతి ఏటా లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేయడానికైనా సిద్ధపడ్డారేగాని, తెలంగాణకు ఇవ్వడానికి ఆనాటి పాలకులకు మనసు రాలేదు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ అన్న పేరే గాని ఎన్నడూ సక్కగ నీళ్లించ్చింది లేదు. కాలువ పనులు కూడా బాగు చేసింది లేదు. ఆఖరుకు కాలువ పూడిపోతున్నా చూశారే గాని, నల్లగొండ జిల్లా రైతులకు నీరివ్వలేదు. అయినా ఆనాడు ఏ నాయకుడు నోరు మొదలేదు. 

కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందని, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎన్నుకుంటే వాళ్లు చేసింది అదే…తెలంగాణకు అన్యాయం చేసింది కూడా వాళ్లే…! అయితే ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. వారికి పదవులు కట్టబెట్టారు. ప్రతి సారి గెలిపిస్తూవచ్చారు. దాంతో జిల్లాను శాసించే రాజకీయాలు చేసేంత శక్తివంతులుగా కోమటిరెడ్డి సోదరులు ఎదిగారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లా రాజకీయాలను మొత్తం తన గుప్పిట్టో పెట్టుకున్నారు. కాని నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ లేకుండా చేయలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరు ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి అవసరాలు తీర్చేందుకు రూ.8వేల కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అది కూడా నిండు అసెంబ్లీలో ఆ ప్రకటన చేశారు. తెలంగాణ వస్తుందని తెలుసు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్నదని తెలుసు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేదు. చిత్తూరు జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యలేదు. ప్రజలకు ఇబ్బంది లేదు. కాని మా నల్లగొండకు నీళ్లెందుకు ఇవ్వరు? నిధులెందుకు కేటాయించరు? అని ప్రశ్నించలేదు. ఈ ప్రకటన చేసిన సమయంలోనే ఆనాడు హరీష్‌రావు అప్పటి ప్రభుత్వాన్ని ఎండగట్టాడు. అసెంబ్లీలో నిలదీశాడు. తెలంగాణలో నీటికరువు వుందని, ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలు అనేక వున్నాయని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. నల్లగొండ జిల్లాలో ఇలాగే కొనసాగితే, ఏదొ ఒకనాడు ఆ జిల్లాలో జనం బతకాలంటే భయపడతారని అన్నారు. మీ చిత్తూరు జిల్లాకు రూ. 8వేల కోట్లు కేటాయించుకున్నారు. కనీసం మా తెలంగాణకు కనీసం రూ.2వేల కోట్లైనా ఇవ్వండని హరీష్‌రావు అడిగితే, ఒక్క రూపాయి కూడా ఇవ్వను…ఏం చేసుకుంటారో చేసుకోండి? అని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నప్పుడైనా కోమటిరెడ్డి అభ్యంతరం చెప్పలేదు. అదితప్పని నిలదీయలేదు. ఏనాడు కోమటిరెడ్డి నీళ్లకోసం కొట్లాడలేదు. కాని పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టు తీసుకున్నారు. ఒకనాడు పులిచింతల నిర్మాణం జిరిగితే తెలంగాణకు తీరని అన్యాయం జరుతుందని మొసలి కన్నీరు కార్చి, అది ప్రారంభిస్తే అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదే ప్రాజెక్టుకు కాంట్రాక్టరయ్యడు. ఆయన చేతుల మీదుగానే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేశాడు. ఆంధ్రకు నీళ్లందించే పని తన చేతుల మీదుగా పూర్తిచేశాడు. నల్లగొండను గాలికి వదిలేశాడు. సీమాంధ్రులకు మేలు చేసే పని చేపట్టాడు. కాంట్రాక్టు పేరుతో నల్లగొండ జిల్లా ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టారు. ఆర్ధికంగా ఎదిగారు. కోట్లు కూడాబెట్టుకున్నాడు. కాని ప్రజలు గురించి ఆలోచించలేదు. ఆనాడు అన్న చేసిన పనే, ఈనాడు తమ్ముడు చేస్తున్నాడు. అన్న పులిచింతల మీద రాజకీయం చేసి కాంట్రాక్టును దక్కించుకుంటే, తమ్ముడు మునుగోడును ముంచి రూ.18000 కోట్లు ప్రాజెక్టు దక్కించుకున్నాడని రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఓ వైపు తెలంగాణ ఉద్యమకాలంలో ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకోవాలని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ మూలంగా పండే పంటల్లో, తినే ఆహారంలో కూడా ఫ్లోరైడ్‌ వుంటోందని ఆనాడు కేసిఆర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముందుకు ఫ్లోరైడ్‌ బాధితులను తీసుకెళ్లారు. అయినా వారికి జాలి కలగలేదు. నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు ఇచ్చే మనసు రాలేదు. 

ఇక బిజేపి వాళ్లు తక్కువేం కాదు…కాంగ్రెస్‌ ను కాదని 1999లో ప్రజలు కేంద్రంలో బిజేపిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ నాటి ప్రధాని వాజ్‌పాయ్‌కు ఎన్ని సార్లు విజ్ఞాపనలు చేసినా పట్టించుకోలేదు. ఆయన ముందుకు ఫ్లోరైడ్‌ బాధితులను తీసుకెళ్లిచూపించినా కనికరం చూపలేదు. రూపాయి మంచినీటి కోసం విడుదల చేయలేదు. కాని నేడు మునుగోడులో బిజేపి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు రావడాన్ని ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు. వారి ప్రకటనలకు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి నల్లగొండ ఈ పాటికి ఎడారిగా మారేదన్న మాటలే వినిపిస్తున్నాయి. మరింత ఫ్లోరైడ్‌ పెరిగి, ప్రజలు బతికేందుకు కూడా వీలులేకుండాపోయేది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ నల్లగొండ జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టిపెట్టి, చెరువుల పునరుద్దరణ పనులు ఎక్కువగా చేపట్టారు. మిషన్‌ భగీరధ పనులు వేగంగా ఆ జిల్లాలో పూర్తి చేశారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. ఎక్కడిక్కడ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తిచేశారు. ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేశారు. ఫ్లోరైడ్‌ భూతాన్ని నల్లగొండ నుంచి తరిమేశారు. అదే ఉమ్మడి రాష్ట్రం కొనసాగితే మరో వందేళ్లయినా ఫ్లోరైడ్‌ సమస్య తీరకపోయేది. నాయకులు ఆ సమస్యను పట్టించుకోకపోయేవారు. నీళ్ల కోసం సాగిన తెలంగాణ ఉద్యమం మూలంగా, రాష్ట్రం సాధించుకోవడం వల్లనే నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ మహామ్మారిని పారద్రోలడం జరిగింది. ఫ్లోరైడ్‌ నిర్మూలించడ జరిగింది. భూగర్భ జలాలను పెంచుకొని, సురక్షితమైన మంచినీటితోపాటు, ఫ్లోరైడ్‌ లేని పంటు కూడా పండిరచుకుంటున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులయ్యారు. ఇది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విజయం. మా ఆరోగ్యాలకు ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం అని ప్రజలే అంటున్నారు. ఏనాడు నల్లగొండ నీటి గోస గురించి పట్టించుకోని పార్టీలన్నీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. వారికి తగిన గుణపాఠం చెబుతామంటున్నారు.

దివ్యాంగుల సొమ్ము దుబారా చేస్తూ..? దర్జాలు వెలగబెడుతూ!?

` అయ్యో! దివ్యాంగుల మొర వినరా? అని రాస్తే నేటిధాత్రికి నోటీసులిస్తారా..!

` ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు?

`ఎంత కాలం మోసం చేస్తుంటారు?

`అవినీతి సొమ్ముతో లాయర్‌ నోటీసులిస్తే సరిపోతుందా?

` ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేటిధాత్రికి నోటీసులిచ్చే అధికారం ఎవరిచ్చారు?

` ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు లాయర్‌ నోటీసు పంపడం నేరమన్నది తెలుసా?

` ఒక ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేయరాదు?

` ఒకవేళ అవసరమైతే ప్రతిసారీ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో విడుదల చేయాలి?

`మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేస్తే ట్రెజరీ నుంచి జీతం ఆగిపోవాలి?

` అలా అని సర్వీసు రూల్స్‌ పొందుపర్చిన సంగతి తెలియదా?

`దివ్యాంగులు కమీషనర్‌ ను సస్పెండ్‌ చేయాలని ధర్నాలు చేసింది నిజం కాదా?

`దివ్యాంగులు మీడియా ముందు చెప్పిన విషయాలు అబద్దమా?

`అదే నిజమైతే కమీషనర్‌ మీడియా ముందుకు ఎందుకు రాలేదు?

`నేటిధాత్రి కి నోటీసులిస్తే మీడియా భయపడుతుందా?

`నిజాలు దాచేసి, నోటీసులిస్తే సమస్య లు తీరినట్లా?

`దివ్యాంగుల హక్కుల పరిరక్షణలో నేటిధాత్రి వెనుకడుగు వేయదు?

`అవినీతి చేసిన వారిని వదిలిపెట్టదు.

`పరువు నష్టం వ్యక్తిగత జీవితాలకు వర్తిస్తుంది…?

`ఉద్యోగ నిర్వహణలో అవినీతి ,మరకలు పరువు నష్టం కిందకు రావు?

ప్రజలకు జబాబు దారిగా వుండాల్సిన ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధిలు అవినీతి అక్రమాలకు పాల్పడడం అన్నది నేరం. పైసా పైసా పున్నులు చెల్లించి, ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు జీతాలు చెల్లిస్తారు. అటువంటి వారు అవనీతికి పాల్పడడం వాటిని కప్పిపుచ్చుకోవాలని చూడడం మరీ నేరం. వాటిని మీడియా వెలికి తీయొద్దు? ఎవరూ మాట్లాడొద్దు? మాకు అడ్డురావొద్దు? మేం దోచుకునేది దోచుకుంటాం? మీరెవరు ప్రశ్నించేందుకు? వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తాం? ఇదా తీరు…ఇదేనా ఉద్యోగులుగా ప్రజలకు వారధులు…ప్రజలకు మేలు చేస్తామని,సేవ చేస్తామని అధికారం అనే కుర్చీలో కూర్చొని, అవినీతికి పాల్పడతామంటే చట్టం ఒప్పుకోదు. మీడియా చూస్తూ ఉపేక్షించదు. తన పని తాను చేసుకుంటూపోతుంది. ప్రజల ముందు దోషులగా నిలబెడుతుంది. అది మీడియా కర్తవ్యం. అవినీతికి, అక్రమాలకు పాల్పడేవారు చేసే తప్పులను బైట పెట్టి, వారిని దోషులుగా సమాజం ముందు నిలబెట్టే మీడియా గొంతు నొక్కాలని చూడడం అవివేకం. అతికి నిదర్శనం. అక్రమార్కుల చర్యలు వెలికి తీసి, వార్తలు ప్రచురించే మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తాం..వారికి నోటీసులు పంపుతాం..ఆత్మరక్షణలో పడేస్తామని అపోహపడితే అంతకు మించిన అవివేకం మరొకటి వుండదు. మీడియాకు కూడా కొన్ని బాధ్యతలున్నాయి. అవి చట్టంలో కూడా స్పష్టం చేయబడ్డాయి. ప్రెస్‌ కౌన్సిల్‌ అనే వ్యవస్ధ ఒకటుంటుంది. మీడియాకు విధివిధానాలతోపాటు, పరిధులు కూడా నిర్ధేశింబడ్డాయి. ఆర్‌ఎన్‌ఐ అనే వ్యవస్ధలో ఒక పత్రిక రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడే, మీడియా కర్తవ్యం గురించి మార్గదర్శకాలుంటాయి. అందులో ప్రతి మీడియా సమాజంలో జరిగే అన్ని రకాల అవినీతి , అక్రమాలను వెలుగులోకి తెవాలని ఓ క్లాస్‌ వుంటుంది. దానికి కంకణ బద్దులైన తర్వాతే మీడియా తన పని మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవడం తప్పు… రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చలో భాగమైన మీడియా స్వేచ్ఛÛ( ఆర్టికలన్‌ 19(ఎ)ను అడ్డుకున్నట్లే. అది చట్టరిత్యా నేరమే…చట్టం ముందు అందరూ సమానామే…నేను ఉద్యోగిని, నేను ప్రజా ప్రతినిధిని అనే ప్రత్యేక తరతమ బేధాలు లేవు. ఎవరూ ఎక్కువ కాదు..ఎవరూ తక్కువ కాదు. ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడడమే తప్పు. దాన్ని వెలికి తీయడం తప్పన్నట్లు , వాళ్లు చేసిందే మంచిదన్నట్లు భ్రమపడేవారు ఎప్పటికైనా దోషులే…శిక్షార్హులే…మేం వ్యవస్ధను కుదేలు చేస్తాం…అవినీతికి పాల్పడతాం..ఎంతకైనా తెగిస్తాం..అందర్నీ మేనేజ్‌ చేస్తాం..వ్యవస్ధను కూడా గుప్పిట్లో పెట్టుకుంటాం…అనుకుంటే చేసిన మీడియా చూస్తూ ఊరుకోదు…ప్రశ్నించకుండా వుండదు…వార్తల రూపంలో ఎండగట్టడం ఆపదు…సమాజం ముందు దోషులుగా నిలబెట్టకుండా ఉపేక్షించదు. ఏ విషయంలో నోటీసులు పంపాలో కూడా తెలియకుండా, లాయర్లు చేతిలో వున్నారు కదా? అని ఓ నోటీసు పంపించి భయపెడదామని చూస్తే మీడియా వ్యవస్ధ ఊరుకుంటుందా? చేతులు ముడుకొని కూర్చుంటుందా? మీడియాను బెదిరించే రీతిలో లాయర్ల ద్వారా నోటీసులు పంపడం కూడా నేరమే! ముందు ఉద్యోగులు ఈ విషయం తెలుసుకోవడం ముఖ్యం. వందలాది మంది దివ్యాంగులు సంబంధిత కమీషనర్‌ కార్యాలయం ముందు రోజుల తరబడి ధర్నాలు చేశారు. దీక్షలు చేశారు. తమకు అన్యాయం జరుగుతోందని గొంతెత్తారు? కమీషనర్‌ను మార్చాలని డిమాండ్‌ చేశారు. తమకు తీరని అన్యాయం చేస్తున్నారని గళమెత్తారు. తమకు న్యాయంగా అందాల్సిన హక్కులను కమీషనర్‌ హరిస్తున్నారని మీడియా ముఖంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమను కనీసం కార్యాలయంలోకి అనుమతివ్వడం లేదని తమ భాధను వెలుబుచ్చారు. కమీషనర్‌ తనను హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. తమకు పురుగులను చూసినట్లు చూస్తున్నారని విమర్శించారు. కమీషనర్‌ ఎప్పుడూ అందుబాటులో వుండరని అన్నారు. తమకు సమయం కేటాయించరని చెప్పారు. కమీషనర్‌ కార్యాలయంలో సిసి కెమెరాలు కూడా తీసేయించారని చెప్పారు. దివ్యాంగులు చెప్పిన ఈ విషయాలన్నీ దివ్యాంగులు భహిరంగంగా చెప్పిన అంశాలే…ఇందులో దాపరికమేముంది? అవి నేటిధాత్రిలో ప్రచురణ జరగడం పరువుకు నష్టం కలిగినట్లా? దివ్యాంగులు చెప్పిన మాటలు తప్పైతే వాటి మీద స్పందించాల్సిన అవసరం కమీషనర్‌కు వుంది. అవన్నీ అబద్దాలైతే , వాటిని ఖండిరచే హక్కు కమీషనర్‌కువుంది. కాని అవేవీ చేయకుండా, దివ్యాంగులు సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదన్న విషయాన్ని ప్రచురించిన నేటిధాత్రికి దినపత్రికకు నోటీసులు పంపిస్తే నిజాలు అబద్దాలౌతాయా? దివ్యాంగుల సమస్యలు తీరుతాయా? నేటిధాత్రిని భయభ్రాంతులకు గురిచేద్దామని చూస్తే, దివ్యాంగులు ప్రశ్నించడం మానేస్తారా? హక్కుల సాధన కోసం ఉద్యమాలు మానుకుంటారా? నిజానికి నేటిధాత్రిలో వచ్చిన విషయాలపై ఆశాఖలో సమగ్రమైన చర్చ జరగాల్సిన అవరసం వుంది. దివ్యాంగులను పిలిచి కమీషనర్‌ మాట్లాడాల్సింది. వారి సమస్యలు తెలుసుకోవాల్సివుంది. కాని అవేవీ జరగలేదు. జరగడం లేదు. మీడియాకు వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ఎక్కడా వుండవు. సమాజంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలనుంచి ఉద్భవించే ప్రశ్నలే పత్రికల్లో అక్షరాలుగా మారుతాయి. జనం గొంతులకలౌతాయి..ప్రశ్నలు సందిస్తాయి. సమాజాన్ని చైతన్యం చేస్తాయి. అంతే తప్ప వ్యక్తిగతంగా నాపై నేటిధాత్రి వార్తలు రాసిందని కమీషనర్‌ నోటీసులు పంపడం అంటేనే తన డొల్ల తనం బైట పెట్టకున్నట్లు. దివ్యాంగులు సంక్షేమ శాఖలో కమీషనర్‌ కుర్చీలో కూర్చొని, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపైనే మీడియా వార్తలు రాస్తుందే తప్ప, వ్యక్తిగతంగా ఎలాంటి ప్రశ్నలకు తావుండదు. అది తెలిసి కూడా నేటిధాత్రికి నోటీసులు పంపి, ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎంత కాలం దివ్యాంగులను మోసం చేస్తారు? వ్యవస్ధను ఎంత కాలం తమ గుప్పిట్లో పెట్టుకుంటారు? అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు నోటీసులు పంపడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరి దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ నేటిధాత్రికి నోటీసులు పంపడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారో కూడా నోటీసుల్లో వెల్లడిరచాల్సిన అవసరం వుంది. అంతే కాదు ఒక ఉద్యోగి తాను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం అదే పోస్టులో, ఒకే దగ్గర పనిచేయడం అంటే కూడా అధికార దుర్వినియోగమే అవుతుంది. సర్వీసురూల్స్‌ ప్రకారం అఫిడవిట్‌ ధాఖలు చేసిన తర్వాతే ఏ ఉద్యోగి అయినా విధుల్లో చేరుతారు. అలాంటిది దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్‌ ఇంత కాలం ఎలా అదే సీట్లో కొనసాగుతున్నారన్నది కూడా తెలియజేయాలి. మూడు సంవత్సరాల తర్వాత అదే ఉద్యోగి అదే స్ధానంలో కొనసాగాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీవో పొందాలి.

అలాంటి జీవో కమీషనర్‌కు ప్రభుత్వం ఇచ్చిందా? అన్నది కూడా చెప్పాలి. అంతే కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్నట్లు ట్రెజరీకి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా సంబంధిత శాఖపైనే వుంటుంది. ఆ శాఖ అధిపతి కర్తవ్యం కూడా. ఒక ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి జీవో జారీ కాకుండా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఒకే చోట విధులు నిర్వర్తిస్తుంటే ట్రెజరరీకి జీతం ఆపే హక్కు కూడా వుంటుంది. మరి ఇన్ని తప్పులు చేస్తూ,నేటిధాత్రి వార్తలు రాయడం తప్పని నోటీసులు పంపడం నేరం కాదా? అయినా దివ్యాంగులు తమ గోడును నేటిధాత్రికి వెల్లబోసుకున్నాయి. సమాజంలో ఏ వ్యవస్తైనా సరే ముందు మీడియాను ఆశ్రయించడం అన్నది రివాజు. అందులో భాగంగా దివ్యాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతిని గురించి వారు వెల్లడిరచారు. నేటిధాత్రి ప్రచురించింది. అందులో ఏవైనా లోపాలుంటే సూచిస్తే సరిదిద్దుకునేందుకు ఏ మీడియా అయినా క్షణం వెనుకాడదు. అంతే కాని నిజాలను రాయడమే తప్పన్నట్లు నోటీసులు పంపిస్తే మీడియా వెనుకడుగు వేస్తుందా? నేటిధాత్రి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమీషనర్‌కు వుంది. నిధులు గోల్‌ మాల్‌పై వివరణిచ్చుకోవాల్సిన అవసరం కూడా వుంది. ఒక వేళ నిధులు దుర్వినియోగం కాలేదనే చెప్పదల్చుకుంటే, వాటి వివరాలు మీడియాకు అందజేస్తే సరిపోతుంది. దివ్యాంగులు కూడా తమ ఆందోళను విరమించే అవకాశం వుంటుంది. అప్పుడు కమీషనర్‌ నిజాయితీగానే వున్నారన్నది వ్యవస్ధకు తెలిస్తుంది. అంతే కాని చేసిన తప్పులు, జరిగిన అవినీతి అక్రమాలు బైట పడవు అనుకుంటే ఆగతుందా? మీడియాకు నోటీసులు పంపిస్తే జరిగిన తప్పులు ఒప్పులౌతాయా?

శాఖమూరి దుర్గాప్రసాద్ కు ఎంపీ రవిచంద్ర నివాళి

నేలకొండపల్లి, అక్టోబర్, 10:

గుండె పోటుతో మృతి చెందిన గువ్వలగూడెం గ్రామస్తుడు

శాఖమూరి దుర్గాప్రసాద్ కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. సోమవారం ఆయన నివాసానికి వెళ్లి దుర్గా ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దుర్గాప్రసాద్ తనయుడు నవీన్, సోదరుడు మండల టీఆర్ఎస్ నాయకులు శాఖమూరి రమేష్ లను ఎంపీ ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర అక్కడికి విచ్చేసిన గ్రామ టీఆర్ఎస్ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో గువ్వలగూడెం గ్రామ సర్పంచ్ వంగూరి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు, ఎంపిటిసి సభ్యులు వంగూరి ఉషా, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లిక్కి వీరబాబు, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారని, ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి కుటుంబ సభ్యులకు రవిచంద్ర తన సంతాప సందేశంలో ప్రగాఢ సంతాపం,సానుభూతిని తెలియజేశారు.ములాయం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

అయ్యప్పలకు ఎంపీ వద్దిరాజు అన్నప్రసాద వితరణ

ఖమ్మం, అక్టోబర్, 10:

అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో స్థానిక

వీడీవోస్ కాలనీలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని రాజ్యసభ సభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం సందర్శించారు. అక్కడ స్వామి వారి పీఠానికి ప్రత్యేక

పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వాములకు స్వయంగా వడ్డించారు. అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న 

అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా రాంప్రసాద్ గురుస్వామి వద్దిరాజు రవిచంద్ర చేస్తున్న దాతృత్వ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మిక్కిలినేని నరేంద్ర, మండప నిర్వాహకులు పగడాల కిషోర్, నాగరాజు, మడూరి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ చలువతో హైదరాబాద్కు దీటుగా ఖమ్మం అభివృద్ధి చెందుతోంది :ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 23కొత్త జిల్లాలు, పెద్ద సంఖ్యలో మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగింది:ఎంపీ వద్దిరాజు

హైదరాబాద్,వరంగల్ లకు ధీటుగా ఖమ్మం అభివృద్ధి జరుగుతున్నది:ఎంపీ రవిచంద్ర

ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తరు:ఎంపీ వద్దిరాజు

మున్నేరు నదిపై తీగల వంతెనను మంజూరు చేయాల్సిందిగా కేసీఆర్ ను కోరుత:ఎంపీ రవిచంద్ర

రఘునాథ పాలెంలో తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన

మంత్రి పువ్వాడ,లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు తన ఎంపీ నిధుల నుంచి 25లక్షలు మంజూరు చేసిన రవిచంద్ర

అతిథులకు కోలాటం,మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన స్థానికులు

రఘునాథ పాలెం: ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా 23జిల్లాలతో పాటు పెద్ద సంఖ్యలో మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.కొత్తగా ఏర్పడిన మన తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందిందని,ఇంకా ముందుకు సాగుతుందన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండల కేంద్రంలో సోమవారం తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రవిచంద్ర మాట్లాడుతూ,మన పట్టణాలు,పల్లెల పురోభివృద్ధికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అవార్డులు వచ్చాయన్నారు.ఇదే కోవలో ఖమ్మం నగరం,పరిసర ప్రాంతాలు హైదరాబాద్, వరంగల్ లకు ధీటుగా అభివృద్ధి అవుతున్నదని వద్దిరాజు వివరించారు.కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు.అలాగే, ఖమ్మం నగరంలో కొత్త ఫ్లైఓవర్, మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జిలను మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు.రఘునాథ పాలెంలో శంకుస్థాపన జరిగిన తహశీల్దారు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు తన ఎంపీ నిధుల నుంచి 25లక్షలు మంజూరు చేస్తున్నట్లు రవిచంద్ర ప్రకటించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు వద్దిరాజును సభికుల హర్షామోదాల మధ్య ఘనంగా సత్కరించారు.కార్యక్రమానికి వందలాది మంది మహిళలు, యువకులు, స్థానికులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానికులు అతిథులకు కోలాటం,మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ ఛైర్మన్ శేషగిరిరావు, జాయింట్ కలెక్టర్ మధుసూదన్,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, ఆర్డీవో రవీంద్రనాథ్, జడ్పీటీసీ ప్రియాంక,ఎంపిపి గౌరి తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ముంచేందుకే కొడంగల్‌ నుంచి కోడలొచ్చింది!?

`ముంచుడే ఆ కోడలు పని!?

`మునుగోడులో కూడా అంతే! మరో హుజూరాబాద్‌ చేయాల్సిందే!

`తేల్చేడు లెక్కలు లేనట్టే!

`మునుగోడులో గెలుసుడు కాంగ్రెస్‌ కు కష్టమే!

`హుజూరాబాద్‌ రాజకీయం రేవంత్‌ మునుగోడులో ఆడుతున్నట్టే!

`అదంతా చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే!

`మునుగోడులో కాంగ్రెస్‌ ను ముంచడమే గురుదక్షిణే!

`కాంగ్రెస్‌కు రేవంత్‌ నాయకత్వం శాపగ్రస్థమే?

`హుజూరాబాద్‌లో మూడు వేలతో సరి…!

`మునుగోడులో ఆరు వేలు దాటకుండా చూడాలి మరి?

`కోడలుగా కాంగ్రెస్‌ కు కొరివిపెట్టడానికే..నా!?

`కాంగ్రెస్‌ను ఖతం పట్టించడానికే రేవంత్‌ కంకణం!

`చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌ యాక్షన్‌!

`చంద్రబాబు చలవతో మునుగోడులో రేవంత్‌ ప్లాన్‌…

`మునుగోడులో గెలిపించి, బిజేపి కి దగ్గర కావడం చంద్రబాబుకు అవసరం.

`అది అమలు చేయడం రేవంత్‌ కర్తవ్యం.

`స్రవంతికి డిపాజిట్‌ రాకుంటే బిజేపి గెలుస్తుంది?

`స్రవంతికి డిపాజిట్‌ వస్తే టిఆర్‌ఎస్‌ గెలుస్తుంది?

`కాంగ్రెస్‌ కు మునుగోడు ఓడిపోయే సీటే…!

`బిజేపిని గెలిపిస్తే చంద్రబాబుకు మేలే!

`ఈడీ రూపంలో సీనియర్లను మునుగోడుకు దూరం చేసింది రేవంతే?

`చంద్రబాబు సూచన మేరకే ఈడిని ఉసిగొల్పిన బిజేపి ?

`సీనియర్ల దూరంతో స్రవంతిని ఒంటరి చేయడమే రేవంత్‌ లక్ష్యం!

`అంతిమంగా కాంగ్రెస్‌ ఓటమే రేవంత్‌ పుంజీతం!

`తెలంగాణలో కాంగ్రెస్‌ లేకుండా చేయడమే చంద్రబాబు పంతం?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇంటికొచ్చిన కొత్త కోడలు దీపం పెడుతుందనే అందరూ అనుకుంటారు. కాని కొంప తగలెట్టేందుకు వచ్చిందని ఇల్లు కాలిపోతే గాని తెలియదంటారు. ఇది అచ్చంగా కాంగ్రెస్‌లో వినిపిస్తున్న మాట. రాష్ట్ర కాంగ్రెస్‌ను కాపాడేందుకు వచ్చినట్లు చెబుతున్న పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీని పతనం చేసి, పాతాళానికి తొక్కేడానికే వచ్చాడన్న మాట సర్వత్రా వినిపిస్తుంటే నిజమా? అనిపించకమానదు. ఏ సీనియర్‌ నాయకుడిని కదిలించినా ఇదే మాట చెప్పకుండా వుండలేకపోతున్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమతో చేరలేదంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా పార్టీలో చేరలేదనే మాటలే వినిపిస్తున్నాయి. కేవలం చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసమే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, పగ్గాలు అందుకున్నాడని అంటున్నారు. అందుకు అనేక కారణాలు కూడా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాలు ఎంత చెప్పినా పార్టీ అధిష్టానం దృష్టికి పోకుండా, వారు వినకుండా రేవంత్‌నే నమ్ముతున్నారని మధనపడుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్చి మాణిక్యం ఠాకూర్‌ పూర్తిగా రేవంత్‌ మాయలో పడిపోయి, ఆయన కనుసన్నల్లో మాత్రమే పనిచేస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనలను పలు మార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, తమ తప్పులే అక్కడ కనిపించేలా రేవంత్‌ చూసుకుంటూ, తమను వెర్రి వెంగలప్పలను చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఎన్నికల నాటికి పూర్తిగా కాంగ్రెస్‌ను నట్టెట ముంచి కోలుకోకుండా చేసి, సాఫీగా రేవంత్‌ తప్పుకోవడం చూస్తామని సీనియర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాము అధిష్టానానికి ఎంత చెప్పాలని చూసినా, ఎంత మొత్తుకుంటున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అవుతోందని మధనపడుతున్నారు.ఇంతకీ రేవంత్‌కు కాంగ్రెస్‌ మీద కక్షఎందుకు? అన్నదానిపై కూడా కాంగ్రెస్‌లో ఆదినుంచి చర్చే జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సోనియాగాంధీని అనేక రకాలుగా తిట్టిన రేవంత్‌కు ఉన్న ఫలంగా పార్టీమీద ప్రేమ పుట్టుకురావడంపై అనేక అనుమానాలున్నాయి. పక్కాగా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే వ్యూహంలో భాగంగానే చేరాడంటున్నారు. నిజానికి రేవంత్‌ వేసే ప్రతి అడుగు చంద్రబాబు కోసమే అని చెబుతున్నారు. ఆయన ఆనందం కోసమే అంటున్నారు. అందుకు వారు చెప్పే విషయాలు కూడా ఆసక్తికరంగా వుంటున్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి మునుగోడులో చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూర్చుతున్నాయి. తనను కాంగ్రెస్‌లోకి పంపించింది చంద్రబాబే అని రేవంత్‌ స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే తనకు తానుగా స్వయం నిర్ణయం తీసుకోలేని వ్యక్తినని తనే ఒప్పుకున్నట్లైంది. అయినా తన రాజకీయ జీవిత నిర్ణయం అన్నది తన వ్యక్తిగతమైన నిర్ణయం.

అది నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పడం మానేసి, నన్ను చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారని అన్నాడు. అంటే తాను చంద్రబాబుకోసమే రాజకీయం చేస్తున్నానని భహిరంగంగా చెప్పినట్లే లెక్క. మరి చంద్రబాబు కాంగ్రెస్‌పార్టీకే ఎందుకు రేవంత్‌ను పంపారన్నదానిపై కూడా అనేక చర్చలున్నాయి. నిజానికి చంద్రబాబుకు రాష్ట్ర విభజన సుతారం ఇష్టం లేదు. కలలో కూడా ఆయన రాష్ట్ర విభజన కోరుకోలేదు. కాని తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ కోసం ఉత్తరం రాశాడు. తన రాజకీయ జీవితం కోసమే 2009లో టిఆర్‌ఎస్‌తో జతకట్టాడు. ఆ ఎన్నికల్లో గెలిచి తన దృషతరాష్ట్ర కౌగిలిలో టిఆర్‌ఎస్‌ను నలిపేద్దామనుకున్నాడు. కాని చంద్రబాబు గెలవలేదు. తెలుగుదేశంపార్టీని అటు ఆంధ్రాలో నమ్మలేదు..ఇటు తెలంగాణలో నమ్మలేదు. తెలుగుదేశాన్ని గెలిపించలేదు. దాంతో ఆనాడు గూడుకట్టుకున్న కోపం ఆయనకు ఇంకా చల్లారలేదు. ప్రతిసారి ఎలా తెలంగాణను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూనే వున్నారు. కుయుక్తులు పన్నుతూనే వున్నారు. 2009 డిసెంబర్‌9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన వెంటనే అర్ధరాత్రి చంద్రబాబు దుష్టరాజకీయం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ను కూడా తన కుటిల రాజకీయంలో కలుపుకున్నారు. నాటి ఆంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. ప్రకటించిన తెలంగాణను వెనక్కి వెళ్లేలా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇక సాకారం కాదన్న భ్రమల్లోనే ఆయన వుంటూ వచ్చారు. అయినా 2014లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చింది. ఇదే చంద్రబాబుకు నచ్చంది…ఎనాటికైనా మళ్లీ తెలుగుజాతిని ఏకం చేయాలి. తెలుగు రాష్ట్రాలను కలపాలి. అన్నదే చంద్రబాబులో వున్న కుత్సితం. అది నెరవేరాలంటే తెలంగాణలో రాజకీయ అలజడి రేపాలి. ఓటుకు నోటు అన్నదానితో, నాడు ఎమ్మెల్యేను కొని అరాజకీయం చేద్దామనుకున్నాడు. కాలం కలిసిరాలేదు. రేవంత్‌ మాటలు ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ నమ్మలేదు. రేవంత్‌ను అడ్డంగా ఇరికించాడు. జైలుకు పంపించాడు. దాంతో చంద్రబాబులో మరింత కసి పెరిగింది. తెలంగాణ రాజకీయాలను ఎలాగైనా గుప్పిట్లో పెట్టుకోవాలని, తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసిన కాంగ్రెస్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా శపథం పూనాడు. రేవంత్‌ను మరోసారి రంగంలోకి దింపాడు. కొంత కాలం పాటు కాంగ్రెస్‌తో చంద్రబాబు సఖ్యత నటించాడు. బిజేపికి వ్యతిరేకంగా నాటకమాడాడు. రేవంత్‌ను కాంగ్రెస్‌లో హీరోను చేశాడు. ఇప్పుడు ఆ గురుదక్షిణ తీర్చుకునేందుకు రేవంత్‌ కాంగ్రెస్‌ పని పట్టడం మొదలుపెట్టాడు.

అన్నది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల్లో జోరుగా సాగుతున్న చర్చఇదే…తొలి అడుగులోనే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను కనిపించకుండా చేసేశాడు.అందరూ రేవంత్‌ మూలంగా హుజూరాబాద్‌ గెల్చుకుంటామన్న ఓ వైపు ధీమాను వ్యక్తం చేస్తుంటే, మరో వైపు హుజూరాబాద్‌ ఎన్నికపై ఆది లోనే చేతులెత్తేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఒకింత అనుమానాలు వ్యక్తమయ్యేందుకు కారణమయ్యాడు. అయినా కాంగ్రెస్‌ సీనియర్లు ఓర్చుకుంటూనే వచ్చారు. కాని ఒక్కొ అడుగులో ఒక్కొ సీనియర్‌ పని పడుతూ, పార్టీకి వారిని దూరం చేస్తూ, కాంగ్రెస్‌లో సీనియర్‌ అన్న పదం వినిపించకుండా చూస్తూ వస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్‌ అన్నది మర్రి చెట్టులాంటిది. చిన్న ఊడ భూమిని తాకినా మళ్లీ చిగురిస్తుంది. అందుకు సీనియర్లు లేని పార్టీగా చేసి, అప్పుడు నిండా ముంచే ఎత్తుగడ కోసం రేవంత్‌ తన వంతు రాజకీయం ఒక రకంగా సక్సెస్‌గానే చేస్తున్నాడు. కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తున్నాడు. ఇప్పుడు మునుగోడులో నిండా ముంచి కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేసే పనిలో వున్నాడు. ఓ వైపు పాల్వాయి స్రవంతిని రెచ్చగొడుతూ, మరో వైపు సీనియర్ల చేత పట్టుబట్టించి, స్రవంతికి టిక్కెట్‌ వచ్చేలా చేశాడు. అంటే కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా చేసేందుకు ఏత్తేశాడు. మునుగోడులో ఎలాగూ స్రవంతి గెలిచే అవకాశం లేదు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం పట్టుబట్టేందుకు ఆస్కారం లేకుండా చేశాడు. పైగా చంద్రబాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌కు కనీసం ఆరు వేల ఓట్లు దాటకుండా చూసుకోవాలి. అన్నది పక్కాగా అమలు చేస్తున్నాడు. ఇదీ అసలైన లెక్క…

మునుగోడులో టిఆర్‌ఎస్‌( బిఆర్‌ఎస్‌) గెలవాలంటే కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రావాలి. 

కాంగ్రెస్‌కు డిపాజిట్‌ వస్తే టిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే..అవుతుంది. ఈ విషయం రేవంత్‌కు తెలుసు. చంద్రబాబుకు మరీ తెలుసు. అక్కడ బిజేపి గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు రావొద్దు. బిజేపిని గెలిపించే బాధ్యత తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే రేవంత్‌ సీనియర్లు మునుగోడు వైపు రాకుండా చూసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో అమలు చేసిన రాజకీయమే ఇక్కడా అమలు చేస్తున్నాడు. మధుయాష్కీ నేతృత్వంలో మునుగోడు కమిటీ వేసినట్లే వేసి, ఆయనను మునుగోడు వైపు చూడకుండా చేశాడు…ఆయనలో కూడా అసంతృప్తిని రగిలించాడు. ఇదిలా వుంటే కాంగ్రెస్‌ పార్టీకిచెందని నేతలపై ఈడీ కేసులు కొత్త తరహా రాజకీయాన్ని నెరిపేందుకు రేవంత్‌ కుట్ర చేశాడన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మునుగోడు వైపు సీనియర్లుచూడకుండా వారు ఈడీ కేసుల కలకలంలో వుంటే చాలు…కాంగ్రెస్‌ ఓడిపోవడం తధ్యం…? అసలు నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు, రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలుకు ఏం సంబంధం అన్నది ఎంత జుట్టుపీక్కున్నా ఎవరికీ అర్ధం కావడంలేదు. అలా చంద్రబాబు చేత బిజేపిని ఉసిగొల్పి, ఈడిని రంగంలోకి దించి, మునుగోడులో కోలుకోకుండా చేసి, బిజేపికి బలం చేకూర్చడమే రేవంత్‌ లక్ష్యం. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసమే ఈ తతంగం…! పాపం కాంగ్రెస్‌ నేతలు ఈ విషయం అధిష్టానానికి చెప్పలేక, చెప్పినా నమ్ముతారో తెలియక, తమలో తాము చెప్పుకుంటూ కుమిలిపోతున్నారు…కాంగ్రెస్‌ మునిగిపోతుందని మధనపడుతున్నారు…తమ గోడు అరణ్య రోధనౌతుందని ఆవేదన చెందుతున్నారు.

కేసీఆర్ పాలనలో మున్నూరు కాపులకు సముచితం గౌరవం దక్కింది:ఎంపీ రవిచంద్ర

మున్నూరుకాపుల సంపూర్ణ మద్దతు కేసీఆర్,టీఆర్ఎస్ లకే: ఎంపీ రవిచంద్ర

మునుగోడులో ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూరడం ఖాయం:ఎంపీ రవిచంద్ర

చౌటుప్పల్ లో మున్నూరు కాపు ప్రముఖుల సమావేశానికి హాజరైన ఎంపీ రవిచంద్ర

చౌటుప్పల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో తమ మున్నూరుకాపులకు సముచిత గౌరవం దక్కిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపు నాయకులలో ఇద్దరు రాజ్యసభ సభ్యులం, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండగా,వీరిలో గంగుల కమలాకర్ కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఎమ్మెల్సీలు ఇద్దరు, పలువురు జెడ్పీ, మునిసిపల్ ఛైర్ పర్సన్స్ ఉన్నారన్నారు.చౌటుప్పల్ పట్టణంలో శనివారం జరిగిన మున్నూరు కాపు ప్రముఖుల సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం కేసీఆర్ విలువైన ఐదు ఎకరాల భూమి కేటాయించి,ఐదు కోట్లు విడుదల చేయడాన్ని గుర్తు చేశారు.ఈ విధంగా తమ సంక్షేమం, ఉన్నతికి కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ నాయకత్వానికి, టీఆర్ఎస్ కు రాష్ట్రంలోని మున్నూరు కాపులంతా సంపూర్ణ మద్దతునిస్తున్నారని వద్దిరాజు చెప్పారు.మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గంలోని మున్నూరు కాపులందరూ ఏకపక్షంగా ఓట్లేసి అఖండ విజయం చేకూర్చడం తథ్యమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, చౌటుప్పల్ మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు, మున్నూరు కాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,హరిశంకర్,ఆకుల రజిత్,వాసుదేవుల వెంకటనర్సయ్య,సకినాల రవికుమార్,జెన్నాయికోడే జగన్ మోహన్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు 

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యం లో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు,

*** ఈ సంబరాలలో దాదాపు 1200 కి పైగా కెనడా తెలంగాణ వాసులు స్థానిక Oakville Legacy Banquet & Convention centre -Oakville

లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. *** ఈ కార్య్క్రమము మొదట అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజేశ్వర్ ఈద మరియు గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో బతుకమ్మ

ఉత్సవాలను ఘనంగా ప్రారంభించగ శ్రీ మతి దీప గజవాడ, బతుకమ్మ లను సమన్వయ పరిచారు.

*** ఈ కార్యక్రమములో TCA వారు అతిపెద్ద 6ft బతుకమ్మను తయారుచేసి ఆడిన తీరును ప్రజలను ఎంతగానో ఆకట్టుకొన్నది. పలు వంటకాలతో potluck డిన్నర్ ఆరెంజ్ చెయ్యటం విశేషము

*** ఈ సందర్బంగా ప్రస్తుత కమిటి అధ్యక్షడు రాజేశ్వర్, నూతన కమిటి అధ్యక్షడు శ్రీ శ్రీనివాస్ మన్నెం మరియు కొత్త గవర్నింగ్ బోర్డు టీం 2022-24 కు గాను

సభాముఖంగా ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియచేసారు.

*** ఈ సందర్బంగా బతుకమ్మ ఆట సుమారు 6 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో మగువలు , చిన్నారులు బతుకమ్మ ఆడి

చివరగా పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగ నిమజ్జనం చేశారు మరియు సత్తుపిండి, నువ్వులపిండి , పల్లీలపిండి ఫలహారాలు పంపిణి చేసారు 

*** ఈ కార్యక్రమానికి ఈవెంట్ కో స్పాన్సర్స్ పబ్బ రియాల్టీ నుండి శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, Townhill కన్స్ట్రక్షన్, లవ్ ప్రీత్ టీం, మరియు Get-Home Realty నుండి, ప్రశాంత్ మూల, Remax నుండి మానస్వని వేళాపాటి, హోమ్ లైఫ్ లాండ్మార్క్ ఇంక్. బ్రోకరేజ్ రియాల్టీ నుండి రికెల్ హూంగే మరియు బెస్ట్ బ్రైన్స్ లెర్నింగ్ సెంటర్-OAKVILLE లు వ్యవరించగ ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఈద వారిని శాలువాలతో అభినందించి మొమెంటోస్ బహుకరించారు

*** ఈ కార్యక్రమములో బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ శ్రీ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ శ్రీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజ్రెరర్ శ్రీ నవీన్ ఆకుల మరియు కల్చరల్ team శ్రీమతి దీప గజవాడ, మరియు కార్యవర్గసభ్యు లు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి మరియు బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యు లు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి మరియు, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి మరియు శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు.

పాలిటి విజన్‌`పొలిటికల్‌ డైనమిజమ్‌

అందరినీ కలుపుకుపోయే తత్వం…

ఉద్యమపోరాటం ధైర్యం..

కరోనా కాలంలో చూపిన తెగువకు సంకేతం

అవినీతి ఆరోపణలు లేని రాజకీయం..

కేటిఆర్‌ లో వున్న ప్రత్యేకత

విభిన్న శైలి తన సొంతం

ఉద్యమకాలంలో దూకుడు

మంత్రిగా పాలనలో రాజనీతిజ్ఞుడు

మంత్రిత్వ శాఖలలో అనూహ్య విజయాలు

ఐటి రంగంలో రాష్ట్రం పరుగులు

పారిశ్రామిక రంగంలో విప్లవాలు

మున్సిపల్‌ పాలనలో సమున్నతమైన మార్పులు

పట్టణ ప్రగతిలో పరుగులు

పార్టీ పటిష్టతలో తనదైన ముద్రలు

కార్యకర్తలకు భీమా విభిన్నమైన ఆలోచన.

కొందరు తక్కువ వయసులోనే అధ్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంచుకున్న రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఏ రంగం ఎంచుకున్నా విజయాలు సొంతం చేసుకుంటారు. తమదైన శైలిని ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకతను చాటుకుంటారు. పదిమందిలో ఒకరుగా గుర్తింపబడుతుంటారు. తమదైన ముద్రను వేస్తుంటారు. ఆదర్శవంతులౌతారు. స్పూర్తిదాతలౌతుంటారు. యువతకు ఐకాన్‌లా పిలువబడుతుంటారు. మార్గదర్శకులౌతారు. తనను తాను ప్రతిసారి విజేతగా గుర్తింపుపొందుతుంటారు. అందరిచేత అభినందనలు అందుకుంటుంటారు. అధ్భుతాలకే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అందరి తలలో నాలుకలౌతారు. చిరునవ్వులు పూయిస్తుంటారు. ఒత్తిడిని జయిస్తుంటారు. ఎంత శ్రమైనా అవలీలగా ఎదుర్కొంటారు. ఎదుటివారి మీద గౌరవ మర్యాదలకు లోటు రానివ్వరు. పది నిమిషాలు వారితో మాట్లాడితే చాలు వారెంత గొప్పవారో ప్రత్కేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్ధమౌతుంటారు. అలాంటి వారు నాయకులౌతే…ప్రజలకు సేవకులైతే…మేలు చేసే సి ్దతిలో వుంటే…పాలించే స్ధాయిలో వుంటే అది కల్వకుంట్ల తారకరామారావు అవుతారు…ఇలాంటి అనేక సుగుణాలు వున్న ఏకైక యువ నాయకుడు కేటిఆర్‌. అందుకే ఆయనంటే పార్టీలోని నాయకులంతా ఇష్టపడుతుంటారు. అందర్నీ గౌరవిస్తూ పార్టీ కోసం పనిచేసే వారందరినీ కేటిఆర్‌ గుర్తిస్తుంటాడు. అక్కున చేర్చుకుంటాడు. ఆదరిస్తుంటాడు. వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తుంటాడు. అందుకే టిఆర్‌ఎస్‌లో కేటిఆర్‌ను గొప్పగా చూస్తుంటారు. తాను ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుమారుడున్న ఏ కొంచెం గర్వం కూడా కనిపించకుండా,అందరిలో ఒక్కడిగానే సాగుతుంటాడు. అదే ఆయన సింప్లిసిటీ అని అందరూ కొనియాడుతుంటారు. పాలనలో ఆయన చూపించే విజన్‌ సామాన్యమైంది కాదు. విదేశాలలో చదువుకోవడంతోపాటు, ప్రపంచ దేశాలలో పాలనపై పట్టు వుండడంతో తెలంగాణలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా నగరాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే పొలిటికల్‌ డైనమిజమ్‌ నేటి తరంలో ఆయనను మించిన వారు లేరు. ఆయన కోసం రోడ్డుపక్కన అభిమానులు ఆగితే వెంటనే కాన్వాయ్‌ను ఆపి, వారితో మాట్లాడుతుంటాడు. వారి సమస్యలు తెలుసుకుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు తనకు ఐస్‌ క్రీమ్‌ అమ్మిన వ్యక్తి తారసడి, తనకు ఇల్లులేదని చెబితే వెంటనే ఇల్లిచ్చి, తన జ్ఞాపకాలు పంచుకున్నారు. తన బాల్య సృతులు చెప్పుకొచ్చారు. అప్పుడూ, ఇప్పుడూ తాను ఎంత సింప్లిసిటీ అన్నది చెప్పకనే చెప్పారు. ఇక హుస్సేన్‌ సాగర్‌లో సామాజిక సేవ చేసే వ్యక్తిని గురించి తెలుసుకొని, డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చి, ఇంటికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి, తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇక కరోనా సమయంలో ఓ తల్లి తన పిల్లాడికి పాలు లేక ఇబ్బందులు పడుతుందని తెలిసి, డిప్యూటీ మేయర్‌ను పంపించి ఆ పసి వాడి ఆకలి తీర్చిన ప్రజా సేవకుడు కేటిఆర్‌. ఓ వైపు కరోనా అంటే అందరూ భయపడిపోతున్న వేళల్లో, ఇళ్లలో నుంచి ఎవరూ బైటకు కూడా రాకుండా బిక్కు బిక్కుమంటున్న సమయంలో, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో కూడా తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించిన ఏకైక నాయకుడు కేటిఆర్‌. సహజంగా ఆ సమయంలో ఏ నాయకుడు కూడా బైటకు వచ్చేందుకు జంకుతారు. కాని ఆయన ఎక్కడా జంకూ బొంకు లేకుండా ప్రజల మధ్యకు వెళ్లాడు. వారికి కొండంత ధైర్యం నింపాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం వెళ్లాడు. ఇక ఇదిలా వుంటే గత ఏడాది హైదరాబాద్‌లో కుండపోత వాన గుర్తులు ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. ఓ వైపు కరనో భయం, మరో వైపు వర్ష భీభత్సం. వర్షం వల్ల పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, మోకాలు లోతు నీళ్లున్నా బురద కూడా లెక్క చేయకుండా వెళ్లి, ప్రజలు బాగోగులు చూసుకున్న నాయకుడు కేటిఆర్‌. వారికి వసతులు కల్పించాడు. నిత్యావసర వస్తువుల పంపిణీ దగ్గరుండి చేయించాడు.

చీకు చింత లేకుండా, బాదరబందీ లేని అమెరికా జీవితం ఎంతో హాయిగా వుంటుంది. చదువు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లి, ఉద్యోగం చేసుకుంటూ వున్న కేటిఆర్‌ను తెలంగాణ ఉద్యమం కదిలించింది. కోట్లాది మంది ప్రజల ఆశ తెలంగాణ. లక్షలాది మంది ప్రజలు నిత్యం ఉద్యమిస్తుంటే నేను అమెరికాలో వుండి చేసేదేముంది? నా ప్రజల కష్టపడుతుంటే ఇక్కడ సుఖపడుతూ నేనెలా వుండాలి అని అమెరికా నుంచి వచ్చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఎక్కడా తను కేసిఆర్‌ కొడుకు అన్న పెద్దరికాన్ని చూపించలేదు. 2009 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా ఆయన ఫ్లోర్‌ లీడర్‌ కాలేదు. తనకు పదవి కావాలని కోరుకోలేదు. అసెంబ్లీలో కూడా అప్పటి ప్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌లు అనుమతితోనే మాట్లాడుతూ వచ్చేవారు. కాని ఉద్యమంలో మాత్రం ఎంతో క్రియాశీలకంగా వుంటూ వచ్చేవారు. నిజానికి ఆయన మంత్రి అయ్యే వరకు కూడా కేటిఆర్‌లో ఓ వక్త దాగి వున్నాడని ఎవరూ ఊహించలేదు. అనర్గళమైన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకొనే నాయకుడని ఎవరూ అనుకోలేదు…మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఆయనంటే ఏమిటో నిరూపించుకున్నారు. పాలనాపరమైన పట్టు ఆయనకు పరిపాలన మీద ఎంత వుందో నిరూపించి, అందర్నీ ఆశ్చర్యపర్చారు. తెలుగు,హిందీ, ఇంగ్లీషు బాషల్లో వున్న ప్రావీణ్యం ఆయనకు ఎంతో తోడైందనే చెప్పాలి. ప్రజలకు మరింత చేరువ చేసిందనే చెప్పుకోవాలి. ప్రజల వద్దకు వెళ్తే, అచ్చమైన తెలంగాణ యాసతో, విద్యార్దులు, యువత, ఐటి సదస్సులకు,ఇతర పారిశ్రామక సంస్దలు, వేధికల్లో ఇంగ్లీషు, మైనార్టీ సోదరుల సదుస్సులో ఉర్ధూలో మాట్లాడుతూ మెప్పించగలడు. ఒప్పించగలడు. అంతగా మూడు భాషల్లో అధ్భుతమైన ప్రావీణ్యం వున్న ఏకైక నాయకుడు కేటిఆర్‌. ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ఎంతో మంది ఉన్నత విద్యావంతులైన నాయకులున్నప్పటికీ కేటిఆర్‌లా అనర్గళమైన బాషోచ్చరణ వున్న నాయకుడు మరొకరు లేరు. 

రాజకీయంగా కేటిఆర్‌ ఎన్ని ఆరోపణలు ఎదుర్కొనా, అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు ఆయన దరి చేరలేదు. రాజకీయం కోసం ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇదీ సందర్భమనిగాని, ఇక్కడ తప్పు జరిగిందన్న విషయాన్ని ఎవరూ రుజువు చేయలేకపోయారు. అలా తనను ఎవరూ వెలెత్తి చూపించలేని స్ధితిని కూడా ఆయన సృష్టించుకున్నారు. నిజాయితీ పరుడైన నాయకుడుగా గుర్తింపుపొందాడు. విద్యార్ధుల వద్దకు వెళ్తే తాను ఓ చిన్న పిల్లోడౌతాడు. అవ్వల దగ్గరకు పోతే ఆ అవ్వలకు మనవడుగా వారిని చిరునవ్వులౌతాడు. అంతటి గొప్పదనం కేటిఆర్‌ సొంతం. ఇక పాలనా పరమైన విషయాల కొస్తే, మన దేశంలో ఏ మంత్రికి దక్కని అనేక అరుదైన గౌరవాలు , సత్కారాలు అనేక సందర్భాలలో కేటిఆర్‌కు లభించాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా తప్పకుండా కేటిఆర్‌కు ఆహ్వానం అందడం అన్నది ఆనవాయితీగా మారింది. ఆయన చొరవతో తెలంగాణలో ఐటి రంగంలో విప్లవాలు చోటు చేసుకున్నాయి. ఐటి ఎగుమతుల్లో తెలంగాణ మేటి అన్నది సాధించడంలో కేటిఆర్‌ పాత్ర అమోఘమైంది. అనన్యమైంది. ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటే కేటిఆర్‌ చొరవతో ఆవిషృతమైన ఐఎస్‌.ఐ` పాస్‌ అన్నది అందరికీ ఆదర్శమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా టిఎస్‌.ఐపాస్‌ను అనుసరిస్తున్నారంటే అతిశయోక్తికాదు. ఇక మున్సిపల్‌శాఖ విషయానికి వస్తే,నగరాల్లో మౌలిక సదుపాయల కల్పనలో తీసుకుంటున్న చొరవ, జరుగుతున్న అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తోంది. ఈ విజయమంతా కేటిఆర్‌ ఖాతాలోకే వెళ్తుంది. అలాంటి కేటిఆర్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేసిఆర్‌ ప్రధాని కావాలని, కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వద్దిరాజు*

ఖమ్మం, అక్టోబర్, 5:

ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కీలకమైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత పెట్రోలియం, సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియామకం చేస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు చేపట్టిన పునర్నియామకాలలో వద్దిరాజు కు కీలకమైన స్థాయి సంఘం వరించింది. ఆయన ఈ కమిటీ సభ్యుడిగా తన రాజ్యసభ పదవీకాలం వరకు కొనసాగుతారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువు నిక్షేపాలు సంబంధిత అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఉభయ సభలకు ఈ అంశాలపై అవసరమైన సూచనలు కూడా చేస్తుంది. పెట్రోలియం, సహజవాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన వద్దిరాజు రవిచంద్ర ను టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కె. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సహచర పార్లమెంట్ సభ్యులు అభినందించారు.

నవశకానికి చంద్రోదయం!

`ఉదయించనున్న కొత్త జాతీయ రాజకీయం…

`అట్టహాసంగా కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన…

`రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణ రచన.

`విధ్వంసమైన సాగుకు పూర్వవైభవమే ఆచరణ…

`రైతు రాజ్య స్థాపనే ఆలంబన

`తెలంగాణ వాదుల్లో సరికొత్త ఉత్సాహం…

`మళ్ళీ ఉద్యమకారులంతా ఏకమౌతున్న శుభ తరుణం…

`దేశ రైతాంగానికంతా కేసిఆర్‌ పార్టీయే వేధిక…

 `అన్ని రాష్ట్రాల రైతులకు ఒకే విధానం…

`దేశమంతా రైతు బంధు…

`సాగుకంతా ఉచిత కరంటు…

`తరలివచ్చిన రైతు నాయకులు…

`ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ పార్టీలు…

`కేసిఆర్‌ దూరదృష్టిని పసిగట్టి ఏకమౌతున్న వివిధపక్షాలు…

 `కేసిఆర్‌ జాతీయ పార్టీలో భాగస్వామ్యం కోసం ఇతర రాష్ట్రాల నేతలు…

`సరికొత్త రాజకీయ వ్యూహరచన…అన్ని వర్గాల అభ్యున్నతి పయనాన.

`బిఆర్‌ఎస ప్రకటన….దసరా ముహూర్తాన…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది. ముహూర్తం కలిసొచ్చింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోకొత్త జాతీయపార్టీ ప్రకటనకు వేధిక అంతా సిద్దమైంది. పార్టీపేరు జెండాపై పూర్తి స్ధాయి స్పష్టత రానున్నంది. దేశంలోని అనేక రాష్ట్రాల రాజకీయ ప్రతినిధులు, రైతు సంఘాల క్రియాశీలురు, రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంతా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఎప్పుడెప్పుడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన విందామన్న ఎదురుచూపుల్లో గడియారాల వంక పదే పదే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు బుధవారం మధ్యాహ్నామౌతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన , పార్టీ విధివిధానాలు ఎలా వుంటాయన్నదానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన నాడు వున్న ఉత్కంఠకు కొన్ని వేల , లక్షల రెట్లు ఇప్పుడు ప్రజల్లో వుంది. ఆనాడు టిఆర్‌ఎస్‌ ప్రకటనపై ఒక్క తెలంగాణ ప్రజల్లోనే ఆసక్తి కనబడిరది. కాని నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రజలకు ఎం సంకేతాలిస్తారు? ఏం సందేశాలిస్తారు? ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారు…ప్రజల గురించి ఏం చెబుతారు? ప్రగతిని ఎలా విశ్లేషిస్తారు..ఎలా ప్రాస్తవిస్తారు…తాను కలలు కంటున్న దేశ నవశక నిర్మాణం తనదైన వెల్లడిస్తారన్నదానిపై మాత్రం అందరకీ కుతూహలంగానే వుంది. ప్రజలైనా, ప్రతిపక్షాలు కూడా ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేసిఆర్‌ ఏం చెబుతారన్నదానిపై ఎనలేని ఆసక్తిని కనబర్చుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో సరికొత్త విప్లవమే అని చెప్పాలి. స్వాత్యంత్య్రం సిద్ధించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ప్రకటన కోసం దేశమంతా ఎదురు చూడడం అన్నది ఇదే మొదటిసారి. ఇంతగా ఆసక్తిని పెంచిన పార్టీ మరొకటి లేదు. దేశ రాజకీయాలను శాసించే స్ధాయిలో నిర్ణయాలు తీసుకున్న పార్టీ లేదు. అంతగా సంప్రదింపులు చేసిన నాయకుడు కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. తెలంగాణ కోసం గతంలో ఎక్కె గడప, దిగే గడప అన్నట్లు కొన్ని సంవత్సరాల పాటు ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. నాడు కేసిఆర్‌ పాటు పడిన విధం ఇప్పటికీ తెలంగాణ ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా గుర్తుంది. ఇప్పుడు అదే విధంగా కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశంలోని చాలా రాష్ట్రాలు తిరగడమే కాకుండా, అక్కడి నాయకులతో చర్చలు జరిపి, అక్కడి బౌగోళిక పరిస్ధితులను పూర్తిగా అర్ధం చేసుకున్నాడు. వాటిపై అధ్యయనాలు చేశాడు. చివరికి కొత్త పార్టీ ఏర్పాటు వైపు మొగ్గు చూపాడు.

దేశంలో బిజేపి,కాంగ్రెస్‌లకు ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి ఎంతో అవసరం వుందన్న సంగతిని గుర్తించాడు తెలంగాణ సత్తాతో దేశపీఠం అధిరోహించే రాజకీయం మొదలుపెట్టాడు. దేశంలో తొలి దక్షిణాది నాయకుడిగా జాతీయ పార్టీ జెండా ఎగరవేయనున్నాడు. దక్షిణాది నుంచి డిల్లీలో చక్రం తిప్పిన నాయకులున్నారు. ప్రధానులుగా ఇద్దరు పనిచేశారు.కొందరు రాష్ట్రపతులయ్యారు. కాని దక్షిణాధినుంచి జాతీయ నేతలుగా ఎదిగి, పార్టీలు ఏర్పాటు చేసిన వాళ్లు లేదు. ఆయా పార్టీలు జాతీయపార్టీలుగా ప్రచారం చేసుకున్నవారున్నారు. కాని దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పంతో జాతీయపార్టీ ప్రకటించిన వారు లేదు. అందుకే కేసిఆర్‌ ఎప్పుడూ తనదైన శైలిని సాగిస్తారు..తనదైన పంధాలో పురోగమిస్తారు…ఆయన ఎంచుకున్న మార్గంలో వెనుదిగిరి చూడరు…అపజయాలు ఆయన ఎప్పుడూ చూడలేదు. విజయాలు వరించుకుంటూ పోతూనే , సరికొత్త దారులు వేసుకుంటూ సాగుతుంటారు… దేశానికి దిశానిర్ధేశం చేసేందుకు జాతీయ పార్టీతో ముందుకు కదులుతున్నారు. బలమైన అడుగులు వేయడానికి అవసరమైన శక్తియుక్తులు కూడగట్టుకున్నారు…తెలంగాణ ఉద్యమం నాడు ఒక్కడుగా మొదలై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేశాడు…తన ఘనత కేసిఆర్‌ ప్రపంచానికి చాటాడు. ఇప్పుడు కూడా అతనొక్కడే…మరో అడుగుకు శ్రీకారం చుడుతున్నాడు…జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాడు. ఎంతో అట్టహాసంగా అందరూ అనుకుంటున్నట్లు బిఆర్‌ఎస్‌ను ప్రకటించనున్నారు. దాంతో ఇక టిఆర్‌ఎస్‌ కాస్త బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందనున్నది అంటున్నారు. అయితే ఇదే ఒక సంచలన విషయం అనుకుంటే, రైతును రాజకీయ కేంద్రం చేసి, సాగును జాతీయ స్ధాయిలో ఒక చర్చనీయాంశం చేసి, దేశానికి రైతే దిక్కని చెప్పడానికి కేసిఆర్‌ బయలుదేరుతున్నాడు. రైతు అంటే ఏమిటో…రైతు అవసరం ఏమిటో…రైతు మనకు ఎంత అవసరమో ప్రపంచానికి తెలియజేయనున్నాడు. రైతు లేనిదే దేశం లేదు…రైతు లేనిదే ఎవరికీ బతుకు లేదు…కాని ఆ రైతే నేడు నిర్భాగ్యుడౌతున్నాడు.

అందరికీ అన్నం పెట్టే రైతన్న దుఃఖిస్తున్నాడు. సాగు చేయలేక కడుపు మార్చుడుకుంటున్నాడు. పచ్చనిమాగాన బీడుగా మారుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. భూమిని వదలుకోలేక, ఆ భూమిని నమ్ముకొని బతకలేక, దేశం ఆకలితో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. లాభం లేకపోయినా, రాకపోయినా పంటలు పండిరచడం ఆపలేకపోతున్నాడు…కన్నీటి వ్యవసాయం సాగిస్తూ, దేశం కడుపునింపుతున్నాడు…అందుకు ఆ రైతు రుణం అందరూ తీర్చుకోవాలి. పాలకులు పట్టించుకోవాలి. రైతుకు మేలు జరగాలి. సాగులో పాలకులు సాయం కావాలి. రైతుకు కావాల్సిన చేయూతనందించాలి. పెట్టుబడి సాయంతో రైతుకు భరోసా కల్పించాలి. అది తెలంగాణలో అమలౌతోంది. తెలంగాణ రైతును ఆదుకుంటోంది. తొలకరి నాడు దిగులు పడే రైతన్న , తొలి వాన చినుకు భూమిని ముద్దాతున్న నేడు మురిసిపోతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధుతో ధీమాగా వుంటున్నాడు. ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కరంటుతో సాగును పండగ చేసుకున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. అది దేశమంతా అమలు కావాలి. అన్ని రాష్ట్రాలలో రైతు సల్లగుండాలి. ప్రపంచానికి మన ఆహార ఎగుమతులే దిక్కు కావాలి. మన రైతు రాజు కావాలి. మన రైతు సుభిక్షమవ్వాలి. దేశమంతా సరిసంపదలు వెల్లివిరియాలి. ఇలా రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏర్పాటు చేసిన వారు లేరు. రైతు సంక్షేమం కాంక్షిన నాయకుడు లేడు. అదే కేసిఆర్‌ వ్యక్తిత్వం. ఆయన పాలనలో గొప్పదనం. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమానికి నిదర్శనం. ఇప్పుడు ఇదే దేశమంతా కావాలి. అమలు చేయాలి. అది కాంగ్రెస్‌ వల్లకాదు. బిజేపి వల్ల అసలేకాదని తేలిపోయింది. తెలిసిపోయింది. ఒక వేళ పేద వర్గాల మీద బిజేపి పార్టీకి ప్రేమే వుంటే ఈ ధరలు వుండేవి కాదు. రైతుల విద్యుత్‌ సరఫరాకు మోటార్ల ముచ్చట వచ్చేదే కాదు. అసలు రైతు పంటకు మార్కెట్‌ సౌకర్యమే లేకుండా చేసి,రైతులను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను తెవాలని బిజేపి చూసింది. మరో వైపు సాగుకు అవసరమైన యూరియా, పురుగు మందులను విపరీతంగా పెంచింది. అదేంటని ప్రశ్నిస్తే దిగుమతి ధరలను సాకుగా చూపిస్తోంది. అలాంటి బిజేపి ఇక రైతుల గురించి, సామాన్యుల గురించి ఆలోచిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. పైగా ప్రజలకు ఉచితాలు అలవాటు చేయొద్దని స్వయంగా ప్రధాని మోడీ సూచిస్తున్నారు. అలాంటి బిజేపి సంక్షేమ పథకాలపై మాట్లాడి తన ద్వంద్వ నీతితో ప్రజలను తడిగుడ్డతో గొంతు కోయడమే అవతుఉంది. అయినా తన వాదనను బిజేపి ఉపసంహరించుకోలేదు. అలాంటి బిజేపికి మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే, ఇక ప్రజలకు మోతే..ధరల వాతే…! దేశంలో గత ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చిన అనేక సంస్ధలను బిజేపి కేంద్ర ప్రభుత్వం వాటిని అమ్మకమే పనిగా పెట్టుకున్నది. ఇలా మరో కొంత కాలం పోతే దేశంలో ప్రభుత్వానిది అని చెప్పుకోవడానికి ఏమీ వుండదు. రైళ్లు, రోడ్లు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే…ఇక సామాన్యుడు బతకడం కష్టమే…ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు మృగ్యమే..! అన్న ఆరోపణలు వినిస్తున్నవే…ఇలాంటి సమయంలో దేశంలో ఒక వెలుగులాగా, ఒకమార్పులాగా, ప్రజలు ఒక ఆశలాగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించబోయే బిఆర్‌ఎస్‌ వుంటుందని నమ్ముతున్నారు. పేదల పక్షపాతి, రైతు మేలు కోరే కేసిఆర్‌ పాలన వస్తే దేశమంతా సుభిక్షిమౌతుందని, సంతోషం నిండుతుందని, ఆనందం వెల్లివిరస్తుందని, సుఖశాంతులను చూస్తారని అనుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version