కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులు ఉన్నారు
దేశ రాజధాని న్యూఢిల్లీ వసంత విహార్ లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు బుధవారం సాయంత్రం సందర్శించారు.ఈ సందర్భంగా కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్,వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు తదితరులు ఉన్నారు.కేసీఆర్ ఈనెల 5న దసరా పండుగ రోజు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేస్తూ జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి మంగళవారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై అటు నుంచి ఢిల్లీకి చేరుకోవడం విదితమే.కేసీఆర్ ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించనున్నందున ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం పనులను వేగవంతం చేయిస్తున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు, పర్యవేక్షించారు.పనులను మరింత వేగవంతం చేస్తూ నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఇంజనీర్లకు కేసీఆర్ పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.