విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన
*జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు* తంగళ్ళపల్లి: ప్రతినిధి నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలకు సైబర్ క్రైమ్/ ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ వలన కలుగు నష్టం షీ టీమ్ సేవలపై లపై జిల్లా షీ టీమ్ బృందం,AHTU బృందం, కళాబృందం వారితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఐ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ…..
విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మీరు మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు.మీరు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినట్లుగా గుర్తిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందిస్తే వీలైనంత వరకు మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు 1930 నంబర్ కు ఫోన్ చేసి వుంటే సమీప పోలీసులను తక్షణమే సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ మిత్రులకు,కుటుంబసభ్యులకు,గ్రామస్థులకు సైబర్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని అన్నారు..
మహిళలు,విద్యార్థినులు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరుకు 7901132141 ను సంప్రదించాలని తెలుపారు.ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి ,వారి సమస్యలను పరిష్కరించుకొవాలని కోరారు.ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో ఆర్టీసీ బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని, ఎలాంటి వేధింపుల కైన గురయ్యే మహిళలు షీ టీం కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు..అదేవిధంగా షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు,పై అవగాహన కల్పించారు…
కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా డయల్ 100 ఉపయోగం,షీ టీమ్ పని విధానం సైబర్ నెరలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిని,వైస్ ప్రిన్సిపాల్ సుధా,షీ టీం ఏ ఎస్.ఐ ప్రమీల కానిస్టేబుల్ శ్రీధర్,ప్రభాకర్,విజేయ్,ఆక్సర్,అధ్యాపకులు పాల్గొన్నారు..
సీనియర్ పాత్రికేయులు కారంగుల వినోద్ రావు (45) ఇటీవలే అకాల మరణానికి గురయ్యారు. కొనరావుపేట మండలం బావసాయిపేట గ్రామానికి చెందిన కారంగుల వినోద్ రావు నవ తెలంగాణ దినపత్రికకు రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వినోద్ రావు తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస వదిలాడు. శుక్రవారం రాత్రి మృతుని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. కామ్రేడ్ కారంగుల వినోద్ రావు కు వేములవాడ ప్రెస్ క్లబ్ 143 ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ కామ్రేడ్ కారంగుల వినోద్ రావు కుటుంబానికి టీయూడబ్ల్యూజే హెచ్ 143 అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ల నేతృత్వంలో వినోద్ రావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామన్నారు. వినోద్ రావు మరణం జర్నలిస్టులోకానికి తీరని లోటన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహెర్ పాషా, రేగుల రాంప్రసాద్, కొలిపాక నర్సయ్య, సభ్యులు దుర్గం పరశురాం, బూర్ల సందీప్, ప్రదీప్, రజనీకాంత్, అబ్బ గోని రవీందర్ గౌడ్, రాజు తదతరులు పాల్గొన్నారు..
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన 17వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రమణ్యం*
రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హీనా, డాక్టర్ రవి బృందం మరియు 17వ పోలీస్ బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, పోలీస్ ఫ్లాగ్ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది అందరిని ఆయన అభినందించారు. మొత్తం 20 మంది సిబ్బంది రక్తదానం చేశారని తెలియజేశారు.
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుతూ సంఘవిద్రోహ శక్తుల చేతుల్లో బలైన అమర పోలీసులు వీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని విధి నిర్వహణ రక్షకులు పోలీసులు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శైలజ , ఆర్.ఐ లు శ్రీ పి.నారయణ , డి.శంకర్ , పి.రాజేందర్ , బి.శ్రీధర్.అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు…
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంకాపూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. మృతుని బంధువులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తిప్పాపూర్ నరేష్ గౌడ్ 28 అనే యువకుడు తన బంధువుల ఇంటికి సంకాపూర్ వెళ్లినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ ప్లాట్ఫారం దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్లు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయల అలుముకున్నాయి. మృతుని కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.
వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఈ నెల 23 సాయంత్రం జరిగే నరకాసురవధ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు
చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అదికారులకు సూచించారు..ఈ రోజు ఉదయం కార్పోరేటర్ మరుపల్లి రవి,పోలీస్ అదికారులు,మున్సిపాలిటి
మరియు ఇతర అదికారులతో కలిసి ఉర్సు గుట్ట వద్ద నరకాసుర వధ ఏర్పాట్లను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..ఏర్పాట్లపై అదికారులతో చర్చించి పలు సూచనలు చేసారు..
దసరా ఉత్సవాలలాగే ఈ నరకాసురవధకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని,ట్రాఫిక్
జామ్ అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని,భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేయాలన్నారు..అదికారులంతా సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు..
ఈ కార్యక్రమంలో అదికారులు,ఉత్సవ కమిటి ప్రతినిదులు,ముఖ్యనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము కేన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ మంత్ గా నిర్వహిస్తున్నారు.
రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా వాక్, మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన. ఇందులో పాల్గొన్న మీ అందరికీ అభినందనలు.
మారిన జీవిన శైలి, మారిన ఆహార అలవాట్లు తదితర కారణాల వల్ల చిన్న తనంలోనే రోగాల బారిన పడుతున్నారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము కేన్సర్ విషయంలో ఇదే జరుగుతున్నది. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30 – 40 ఏళ్ల వయస్సు వారి లోనూ ఇది కనిపిస్తున్నది.
గత పదేళ్ళలో చూస్తే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ కంటే ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. 40 – 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు.
వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం కారణంగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో నిర్ధారణ జరుగుతున్నది. దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటున్నది. 70 శాతం కేసుల విషయంలో ఇలా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందుగా గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడవచ్చు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షా 80 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని అంచనా ఉండగా, ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందక పోవడం కారణంగా ఇందులో 50 శాతం దాకా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అమెరికాలో అయితే జీవిత కాలంలో ప్రతి 8 మంది మహిళల్లో కనీసం ఒకరు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
బయటికి వెళ్తే జంక్ ఫుడ్, విస్తృతంగా ప్లాస్టిక్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం… ఇలా అనేక అంశాలు కారణం అవుతున్నాయి.
మహిళల్లో కాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు.
తెలంగాణలోని కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయి..
అయితే ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ భయంకరమైన వ్యాధి నుండి మరింత మంది ప్రాణాలను కాపాడటానికి ముందస్తు నిర్ధారణ ఒక్కటే మార్గం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ విషయంలో, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, బిడ్డకు పాలివ్వకపోవడం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, అధిక బరువు కలిగి ఉండటం, దూమపానం, మద్య పానం వంటి చెడు అలవాట్లు కారణంగా మహిళలో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
రొమ్ము కేన్సర్ పై అవగాహనతో ఉండటం, మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవటం, కనీస వ్యాయామం, మంచి జీవన శైలి అలవాటు చేసుకోవటం వల్ల దీని బారి నుండి కాపాడుకోవచ్చు. ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ జరగటం వల్ల త్వరగా చికిత్స పొంది వంద శాతం రోగం నయం చేసుకోవటం సాధ్యం అవుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం కాన్సర్ నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది. ముందుగా గుర్తించడం, క్యాన్సర్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించడం.. వారిని కాపాడుకోవడం లక్ష్యంగా పని చేస్తుంది.
కేన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నది. ఇందులో భాగంగా,
మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. ఒక్కో నెలలో సగటున 6 క్యాంపులు పెడుతూ, సగటున 600 నుండి 800 మందికి పరీక్షలు చేస్తున్నాము. నిర్ధారణ అయినా వారిని మెరుగైన చికిత్స కోసం MNJ ఆసుపత్రికి పంపిస్తున్నాము.
ఇక చికిత్స విషయంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రు. 750 కోట్లు ఖర్చు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల కేన్సర్ లకు సమగ్రమైన కేన్సర్ చికిత్సలు అందిస్తున్నది.
సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజి, బ్లడ్ కేన్సర్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్, పాలియేటివ్, మొబైల్ స్క్రీనింగ్.. ఇలా 10 రకాల కార్యక్రమాలు చేస్తున్నది.
MNJ మరియు నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయి.
కేన్సర్ రోగులకు మెరుగైన, అధునాతనమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది.
ఇందులో భాగంగా MNJ లో కొత్తగా 30 కోట్లతో 8 మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించుకున్నం. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ కావడం విశేషం.
MNJ ఆసుపత్రినీ రు. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
పేషెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో పడకల సంఖ్యను 450 నుండి 750 కి పెంచుకుంటున్నము. నాలుగు ఎకరాల స్థలంలో 5 అంతస్తుల కొత్త భవనం ఏర్పాటు చేసుకున్నము. త్వరలో ప్రారంభించుకోబోతున్నాం.
ప్రైవేటు లో 20 లక్షల దాకా విలువ చేసే బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది. రేడియో థెరపీ, కీమో థెరపీ చికిత్సలను ఉచితంగా అందిస్తున్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ లు ప్రారంభించి అవసాన దశలో ఉన్నవారికి ఆత్మీయంగా సేవలు అందిస్తున్నది. వీరిని తరలించేందుకు ఆలనా వాహనాలను అందుబాటులోకి తెచ్చాము.
తెలంగాణ డయాగ్నొస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయి లోనే కాన్సర్ ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ , బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నాము.
కేన్సర్ పై పోరులో ప్రభుత్వ ప్రయత్నానికి తోడుగా ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా సహకారం అందించాలని కోరుతున్నాను.
కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, ఎం ఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
` రేవంత్ ఒంటరే…అని మొదటి నుంచి చెబుతున్న నేటిధాత్రి…
`ప్రతి సందర్భంలోనూ రేవంత్ ను హెచ్చరిస్తూనే వస్తోంది నేటిధాత్రి…
`సీనియర్లుతో పెట్టుకుంటే సీన్ సితారే అని ఎప్పుడో చెప్పింది…
`చెప్పగా వినకపోతే చెడంగ చూడాలే…అనే సామెత నిజం చేసిన రేవంత్…
`ఐపిఎస్ అని హోం గార్డులాగా కంగారు పడుతున్న రేవంత్..
` ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగేవారేరీ…కలిసివచ్చేవారేరీ..
` సీనియర్లను కాదన్న నాడే కథ కంచికి చేరింది…
` వాళ్లను పక్కకు పెట్టిన నాడే పదవీ గండానికి బీజం పడిరది…
` తెగేదాకా లాగి ఇంత దూరం తెచ్చుకున్నది రేవంతే….
` చంద్రబాబుతో రాజకీయ సంకెళ్లు తెంచుకుంటేనే చాలు..
` చంద్రబాబు కబంద హస్తాలనుంచి బైట పడితే మేలు…
`నీ ఆటను చంద్రబాబు ఆడుతుంటే చూడకు…
`ఇప్పటికీ మించి పోలేదు…సీనియర్లును సిన్సియర్ గా గౌరవించు…
హైదరాబాద్,నేటిధాత్రి:
దిగితే గాని లోతు తెలియని పెద్దలు ఊరికే అనలేదు. పార్టీ నడపడం అంటే పార్టీలో చేరినంత సులువు కాదు. తాను గెలిచినంత మాత్రాన పార్టీని గెలిపించుడు అంత ఆషామాషీ వ్యవహారం అసలే కాదు. తాను అడుగేస్తే అందరూ వేసినట్లు కాదు..తానొక్కడు నడిస్తే దారి పడేది లేదు. ఆ బాట వెంట అందరూ రారు. రాజకీయమంటే బానిసత్వం కాదు…నాయకత్వమంటే పెత్తనం చేస్తే చాలదు. కుర్చీలో కూర్చుంటే అన్నీ జరిగిపోతాయనుకుంటే ఇలాగే వుంటుంది. రేవంత్‌కు అనుభవపూర్వకంగా తెలిస్తే గాని తత్వం బోధపడలేదు. అందుకే దిమ్మతిరిగి బొమ్మ కనిపించినంత పైనైనట్లుంది. నేనొక్కనే…నా దూకుడుకు ఎదురు లేదు…నేను మొదలుపెడితే ఆగేది లేదన్నది నిన్నటి మాట…ఎన్నికలంటే ఏమిటో…పార్టీని గెట్టెక్కించడం అంటే ఏమిటో…పార్టీ కోసం ప్రచారం చేయడం అంటే ఏమిటో…అన్ని బాధ్యతలు భుజాన వేసుకుంటే తెలిసొచ్చినట్లుంది. పార్టీలో అందరికంటే ముందునడవడం అంటే ఏమిటన్నది ఇంత జరిగితే తప్ప తెలిసి రాలేదు. అసలు రాజకీయం అంటే ఇలా వుంటుందా? అన్నది తెలిసిన తర్వాత ఆక్ పాక్ కరివేపాక్ అన్నది గుర్తుకొస్తున్నట్లుంది. హుజూరాబాద్ నాడు చేతులెత్తేసినా ఎవరూ ఏమనలేదు. ఎవరినీ సంప్రదించకుండా అభ్యర్ధిని నిర్ణయిస్తే ఎవరూ ప్రశ్నించలేదు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే కొత్తగా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరికైనా కొంత ఇబ్బందికరమన్న భావన అందరిలో వుండడం మూలంగానే రేవంత్‌కు విమర్శలు ఎదురుకాలేదు. అక్కడ ఓడిపోయినా ఎవరూ వివాదం చేయలేదు. 60వేల ఓట్లు వచ్చిన దగ్గర 3వేల ఓట్లు వచ్చినా ఎవరూ పెద్దగా నిందించలేదు. ఇరుకున పెట్టలేదు. కాని ఇప్పుడే అసలు కథ మొదలైంది. గత ఏడాదికాలంగా రేవంత్‌రెడ్డిని సమయం చూసి, సీన్ సితార చేద్దామనుకుంటున్న సీనియర్లకు అవకాశం అందివచ్చింది. రేవంత్‌కు మునుగోడు ఉప ఎన్నికతో ముచ్చెమటలు పట్టే దశకు పరిస్దితి చేరింది. ఒక్కడినే…నేనొక్కడినే …నాకెదురేది…నాకుఎవరు ఎదురొచ్చినా, నేను ఎవరికి ఎదురెళ్లినా ప్రాబ్లం వారికే, ఇక నేను రంగంలోకి దిగిన రాజకీయమంతా దబిడి దిబిడే అనుకున్నాడు. కాని రేవంత్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి ప్రచారసమయంలో కన్నీళ్లు వస్తున్నాయి. నన్ను ఒంటరి చేస్తున్నారన్న మాటలు రేవంత్ నోట ఇప్పుడిప్పుడు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడినే అనుకున్నప్పుడు ఒంటరి తనం గుర్తుకురాలేదు. ఐపిఎస్‌లు వచ్చి ఎస్పీలైనట్లు, తాను పిపిసి అధ్యక్షుడినయ్యానంటూ, ఇతర సీనియర్లను హోంగార్డులతో పోల్చిన సంగతి గుర్తుకొచ్చి, తానేమిటో…తన పరిస్ధితి ఏమిటో తెలిసి కంటకన్నీరు ఒలికే దాకా వచ్చింది…కలిసి రండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చేదాకా వచ్చింది…ఇది ముందు నుంచే నేటిధాత్రి చెబుతూనే వుంది…హెచ్చరిస్తూనే వుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే అంత సులువు కాదు…సముద్రమైనా ఈదొచ్చేమోకాని కాంగ్రెస్‌లో నెగలగడం అన్నది అందరికీ సాధ్యం కాదు… ఒక్కసారి కాంగ్రెస్‌లో ఒదిగితే చాలు..ఏ పార్టీలోనైనా ఇమిడిపోవచ్చు. అదే కాంగ్రెస్‌లో ఇమడలేకపోతే కష్టం…ఇమిడితేనే అసలైన నాయకత్వం…
రేవంత్‌రెడ్డివి ఎప్పుడూ తంటరి మాటలే…నోరుంది కదా! అని ఏది పడితే అది మాట్లాడొద్దు. అందులోనూ సొంత పార్టీ నేతలను కెలుకొద్దు. వారికి మనస్తాపం కల్గించొద్దు. ఎంత పెద్ద నాయకుడైనా సరే..పార్టీయే సుప్రిం…మిగతా నాయకులంతా కలిస్తేనే నాయకత్వం అనుకోవాలి. అంతే కాని నేనే సుప్రిం…నేను చెప్పిందే వేదమని అనుకుంటే ఆ నాయకుడికి అదును చూసి చెక్ పడడం ఖాయం…తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్‌కే సొంత పార్టీలో పరాభవం. రేవంత్ ఎంత? ఆయన రాజకీయం ఎంత? ఎన్టీఆర్ రాజకీయంలో ఈకంత. అందులోనూ కాంగ్రెస్‌లో నిచ్చెన మీదకు ఎక్కించే వారు ఎవరూ వుండరు… నిచ్చెన ఎక్కేవారిని లాగేయడంలో అందరూ ముందుంటారు. ఎవరైనా జరుతుంటే పట్టుకునేవారు ఎవరూ వుండరు. ఈ విషయంపై పూర్తిగా రేవంత్‌కు అవగాహన లేకే ఇదంతా జరుగుతోంది. గతం నుంచి అందరూ అనుకుంటున్నట్లు కాంగ్రెస్‌లో కోవర్టులు..వారి వల్లనే పార్టీకి అదోగతి పాలు అన్నది వినీ, వినీ..రేవంత్ ఇక నాకు ఎదురు లేదు..కోవర్టులను నేను ఏరి వేస్తాను…పంపిచేస్తాను…పార్టీని ప్రక్షాళన చేస్తాను…నా మర్కు రాజకీయం చూపిస్తాను అని కలలు కన్నాడు. కాంగ్రెస్‌లో కలలు గన్న నాయకుడు అనుకున్న లక్ష్యాలు చేరుకున్నవారు ఎవరూ లేరు. సహజంగా జాతీయపార్టీలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. అందులోనూ కాంగ్రెస్ లాంటి పార్టీలో నాయకత్వం ఎంత మంది చేతుల్లో వుంటుందో… ఎంత మంది కృష్ణులు వచ్చిపోతారో? అన్నది ఎవరూ చెప్పలేరు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చెన్నారెడ్డికే పార్టీలో పెత్తనానికి దిక్కులేకుండాపోయింది. కాంగ్రెస్ చరిత్రలోనే ఉమ్మడిరాష్ట్రంలో మెజార్టీ తెచ్చిన పి.వి. నర్సింహారావు పట్టుమని పదహారు నెలలు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగలేకపోయారు. ఇలా వుంటుంది కాంగ్రెస్ రాజకీయం…నేనేంటే…నేనే..అంతా నేనే అన్నది కాంగ్రెస్‌లో చెల్లదు. కాలం కలిసొస్తే కార్యకర్త కూడా కీలకమౌతాడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రి పదవి నిర్వహించడం తన వల్ల కాదని చేతులెత్తేశాక, ఎంతో రాజకీయ అనుభవం వున్న, ఉత్తమ పార్లమెంటేరియన్ అన్న గుర్తింపు వున్న జయపాల్‌రెడ్డి సిఎం అనుకున్నారు. కాని రాత్రికి రాత్రి ఎలాంటి అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అలా వుంటది కాంగ్రెస్ రాజకీయం…మొదటి నుంచి నేటిధాత్రి పత్రిక హెచ్చరిస్తూనే వుంది.
రేవంత్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక ప్రత్యేక కథనాలు కూడా రాసింది. రేవంత్ తుంటరి మాటలు తగ్గించుకోవాలని నేటిధాత్రి సూచించింది. కాని రేవంత్ మానుకోలేదు. ఆ నోటి దురుసు కూడా ఇంత దాకా తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కలుపుగోలు రాజకీయం.. అందులో అందరూ కలిసి రావొచ్చు…రాకపోవచ్చు..గ్రూపులు కట్టొచ్చు…ఏకంగా పిసిసినే దూరం పెట్టొచ్చు..అట్లుంటది కాంగ్రెస్‌రాజకీయం. అది తెలియక రేవంత్ సీనియర్లందరినీ స్క్రాప్ అనుకున్నాడు. వారిని ఏరి వేద్దామనకున్నాడు. సీనియర్ల గోల లేకుండా చూసుకుందామనుకున్నాడు. తన అనుచరులతో పార్టీని నింపేద్దామనుకున్నాడు. నియోజకవర్గాలలో కుంపట్లు రగిలించిడం మొదలుపెట్టాడు. వైరి వర్గాలు తయారయ్యేందు అవకాశం కల్పించాడు….మొత్తంగా రాజశేఖరెడ్డి ఆడిన రాజకీయం ఆడుదామనుకున్నాడు. కాని రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితమే కాంగ్రెస్‌లో మొదలైందన్న సంగతి రేవంత్ మర్చిపోయాడు… వైఎస్. ముఖ్యమంత్రిగా చెలాయించిన రాజకీయమే చూసి, కాంగ్రెస్‌లో పెత్తనం అలా చేయాలనుకున్నాడు. కాని రాజశేఖరెడ్డి ఎన్ని డక్కామొక్కీలు తిన్నాడో అన్నది తెలుసుకోకుండా కాంగ్రెస్ రాజకీయంలో వేలు పెట్టాడు… పుట్టలో వేలెడితే కుట్టనా అన్నట్లు మంట తగిలే సరికి , తత్వం బోధపడినట్లుంది. కనికరం లేకుండా కోవర్టులు అన్నవారి గురించి తెలిస్తే నిర్ధాక్ష్యిణ్యంగా పార్టీనుంచి పంపిస్తానన్న రేవంత్‌కు అదే కోవర్టులు చూపిస్తున్న చుక్కలను లెక్కబెట్టుకోలేక సతమతమౌతున్నాడు…గింగిరాలు తిరుగుతున్నాడు. మునుగోడులో రేవంత్ ఒక్కడే ప్రచారం చేయలేక, సీనియర్లను ఇప్పుడు పిలువలేక, వారిని భుజ్జగించేంత సమయంలేక, వారి వద్దకు వెళ్లలేక నలిగిపోతున్నాడు. రాహుల్ జోడో, మునుగోడు ఉప ఎన్నిక కోసం ద్విపాత్రాభియనం చేయలేకపోతున్నాడు. రాహుల్ జోడో పాదయాత్ర వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మునుగోడు ప్రచారాన్ని వదిలేస్తే పిసిపి పదవికే గండమొస్తుంది. అటు ప్రచారానికి పూర్తి సమయం కేటాయించలేక, జోడో యాత్రను సమన్వయం ఎలా చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు. తన పనైపోతుందా? అని నిర్ఘాంత పోతున్నాడు…నిట్టూర్పులో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.
కమలం వాడిపోతుంది..చౌటుప్పల్ లో యువత గులాబీ పార్టీకి జై కొడుతుంది.ఈ రోజు చౌటుప్పల్ 14,19 వార్డులకు చెందిన యువత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే చౌటుప్పల్ 14,19 ఇంచార్జ్ నన్నపునేని నరేందర్,మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆద్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ చౌటుప్పల్ అభివృద్ది టీఆర్ఎస్ తోనే సాద్యమన్నారు. రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం..18 వేల కోట్ల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ది చెప్పాలి,సాదించుకున్న తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కే.టీ.ఆర్ మార్గనిర్దేషనంలో రాష్ట్రం అభివృద్దిలో అద్బుతంగా ముందుకు వెలుతుందని,దృష్టరాజకీయ శక్తులు తెలంగాణ ప్రగతిని నిర్వీర్యం చేసే కుట్రజరుగుతుందన్నారు.ఆ కుట్రకు మునుగోడును వేదికగా మలుచుకుని బీజేపీ పావులు కదుపుతుందన్నారు..ప్రజలు వారి కుట్రలను గ్రహించి తెలంగాణ అభివృద్ది చేస్తున్న టీఆర్ఎస్ వైపు నిలబడాలన్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ గారిని బారీ మెజారిటీతో గెలిపించాలన్నారు..
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు, ఇంచార్జ్ లు,స్థానిక నాయకులు,కార్యకర్తలు,యువత పాల్గొన్నారు..
`వారికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం అండగా నిలబడలేరా?
`జంతువులకు వున్న రక్షణ ఆడపిల్లకు లేదా?
`ఆడపిల్లగా పుట్టడమే శాపమా?
`ఆడపిల్ల అంటే కామమేనా?
`స్వేచ్ఛగా సమాజంలో బతనివ్వరా?
`పసిపిల్లలకు రక్షణ లేని విద్యాలయాలెందుకు?
`సమాజాన్ని ఉద్దరిస్తామని చెప్పే రాజకీయ పార్టీలెందుకు?
`సామాజిక సేవ పేరుతో ప్రసంగాలు చెప్పే వాళ్లు ఏమయ్యారు?
`సినిమాలలో నీతులు చెప్పే నటులేమయ్యారు?
`ఓ హీరో జారిపడితే చూపించిన మానవత్వం, పసి పాపల రక్షణలో చూపరా?
`లేనివాడి కుటుంబానికి అన్యాయం జరిగితే కలిసి రారా?
హైదరాబాద్,నేటిధాత్రి:
పుణ్య భూమి, ధర్మ భూమి, ధన్య భూమి, వేదభూమి, ఖర్మ భూమి…ఏం పేర్లు…ఇంత గొప్ప పేర్లు ఏ దేశానికి లేవు…ఆడపిల్లలపై అకృత్యాలు ఇంతగా ఏ దేశంలోనూ జరగడం లేదు…అంత గొప్ప మన గొప్ప మన దేశంలో ఆడపిల్లకు పుట్టే హక్కు లేదు. బతికే స్యేచ్ఛ లేదు…అడిగే హక్కు లేదు. నిలదీసే హక్కు లేదు…పుస్తకాలలో మనం గొప్పగా రాసుకున్న హక్కులు పనికొచ్చేది లేదు…సనాతన ధర్మం అనుసరిస్తున్న గొప్ప దేశం మనది. దేశానికి ఏం దరిద్రం పట్టిందో…ఏమో గాని కొన్ని దశాబ్దాలుగా అత్యాచారం అన్నం పద వినకుండా గుడుస్తున్న రోజు లేదు…అభం శుభం తెలియన పసిపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు..ఎక్కడో అక్కడ గుండెలు పండేసే వార్తలు విని తల్లడిల్లిపోవాల్సివస్తోంది… పసిపాలలపై కామపు చూపులేందిరా? దుర్మార్గుల్లారా..? మదమెక్కిన మృగాళ్లారా? ఆడ పిల్ల అంటే సెక్సేనా…! ఆమె మనిషి కాదా? మనలో సగం కాదా?మనకు జన్మనిచ్చే దేవత కాదా? ఆ మహిళ అంటే మనిషి జాతికి మూలం కాదా…! క్షేత్రం కాదా? ఆమె అసలు మనిషే కాదా? మనిషిగా లెక్కలోకే రాదా? ఒక మహిళ రోడ్డు మీద నడవాలంటే కొన్ని వందల, వేల మంది చూసే కామపు చూపుల నుంచి తప్పించుకొని నడవాలా? ఆడపిల్ల రోడ్డు మీద నడవాలంటే సిగ్గుపడాలా? భయపడాలా? ఆందోళనతోనే అడుగులేయాలా? ఎవడు ఎక్కడినుంచి దాడి చేస్తాడో అని క్షణ, క్షణం భయం, భయంగా బతుకుతూ, గుండె దిటువు చేసుకుంటూ వెళ్లాలా? గడప దాటిని ఆడపిల్ల మళ్లీ ఇంటికొచ్చేంత వరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూనే బతకాలా? ఏం దౌర్భాగ్యమిది…ఎంత దుర్మార్గమిది…ఇంకా ఏ సమాజంలో బతుకుతున్నాం…అడవికన్నా అద్వాహ్నమైన వ్యవస్థలో జీవిస్తున్నాం…బేటీ బచావో..బేటీ పడావో…అనుకుంటే సరిపోతుందా? రక్షణ అవసరం లేదా? ఆడపిల్ల రక్షణ ప్రభుత్వ బాద్యత కాదా? తాజాగా జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనలో స్కూలు విద్యార్ది అయిన ఓ పసిపాపకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది…అక్షరాల్లో రాయలేనింది… సరిగ్గా మాటలు కూడా రాని వయసు..ఏం చెప్పాలో కూడా తెలియని వయసు..ఆకలేసినా, దెబ్బ తగిలినా ఏడుపే సమాదానమయ్యే వయసు..అలాంటి చిట్టితల్లికి అన్యాయం జరిగింది… అమ్మఒడి తర్వాత ఎవరైనా వేసే తొలి అడుగు బడి వైపు…ఆ బడిలో కామాందులా? అసలు అది బడేనా…! రాయడానికి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి…పసిపాపల గోడు విని రౌద్రాలౌతున్నాయి… బడి…గుడి కన్నా పవిత్రమైనది. భవిష్యత్తు తీర్చిదిద్దబడే ఆలయమది. పిల్లల జీవితాలకు అక్షరమనే చైతన్యాన్ని నింపే జ్యోతిలాంటిది. అక్కడ అక్షరాలకు తప్ప, అసమానతలకు, అకృత్యాలకు తావులేనిది. పసిపిల్లలు దేవళ్లుతో సమానం. అన్నెం పుణ్యం ఎరగని కల్మషం లేనిది బాల్యం. ఆ నవ్వుల్లో ప్రపంచం వుంది. ఆ పసి నవ్వుల్లో జీవితమే వుంది.
అలాంటి ఓ పసి నవ్వును ఓ పాపాత్ముడు చిదిమేశాడు…పవిత్రమైన స్ధలంలో పాపపు పనులు చేశాడు…! అందుకు పాఠశాల యాజమాన్యంలో కీలకమైన వ్యక్తి ప్రిన్సిపాల్ ఆ క్రూరుడికి ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం. వాడు చేసిన పాపపు పనికి సమాజం కన్నెర్ర చేస్తోంది. కన్న తల్లిదండ్రుల కడుపుకోతలో నుంచి పెల్లుబికిన శోకం శాపమై వాడిని దహించివేయాలి. శిక్షకు గురిచేయాలి. కాని ఇంతటితో జరిగిన సంఘటన సమాజం మర్చిపోతుంది. వ్యవస్ధ మర్చిపోతుంది. కాని ఎక్కడో అక్కడ మళ్లీ ఏ వెధవో ఇలాంటి పని చేస్తూనే వుంటాడు…అంత దాకా ఎందుకు 2014లో డిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం విషయంలో దేశమే కదిలింది. దేశ రాజధాని అట్టుడికింది. అప్పటి ప్రభుత్వం కఠినమైన చట్టం తెచ్చింది. ఇక దేశంలో అరాచకాలకు, అకృత్యాలకు తావుండదని అనుకున్నాం. కాని జరిగిందా? ఆగిందా? లేదు…ఇంకా అంతకు మించి అనేక సంఘటనలు జరుగుతూనే వున్నాయి. అమ్మాయిల జీవితాలు ఆగమౌతూనే వున్నాయి. ఆడ పిల్లల జీవితాలు చిన్నాభిన్నమౌతూనేవున్నాయి. మృగాడి చేతిలో ఆహుతౌతూనే వున్నాయి. వీటికి అంతం లేదా? ఆడపిల్లను కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తామని పాలకులు చెప్పినా, భయం కల్పించినా ఎందుకు ఆగడం లేదు…దుర్మార్గాలకు అంతు లేదా? ఆఖరుకు దిశ కేసులో ఎన్ కౌంటర్ చేసినా భయం లేకుండాపోతోందా? ఓ వైపు ప్రేమించమని వేధింపులు…మరోవైపు ఎత్తుకెళ్లి పాడు చేయడాలు…ఎన్ని..ఎన్ని… జరుగుతున్నాయి…వరంగల్‌లో ప్రణీత అనే అమ్మాయిని ప్రేమించమని వెంటపడుతూ, వేధిస్తూ, చివరికి తన మాట వినడంలేదుని ఆసిడ్ దాడి చేసిన ఘటనతో ఒక్కసారి సమాజమంతా ఉలిక్కిపడిరది. ఆ దుండగులను చంపేయాలని, తక్షణ శిక్ష పడాలని సమాజామంతా కోరింది. అప్పుడు ఆ ఉన్మాదుల ఎన్‌కౌంటర్ జరిగింది. దాంతో ఇక ఆడపిల్లల వైపు చూడాలంటే ఎవడైనా భయంతో వణిపోతాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత కొద్ది రోజులే విజయవాడలో పరీక్ష రాసేందుకు వెళ్లిన శ్రీలక్ష్మిని పరీక్ష హాల్‌లోనే చంపేశాడు…కత్తి తెచ్చి మరీ శ్రీలక్ష్మిని ఆ ఉన్మాది పెట్టన పెట్టుకున్నాడు. వాడినీ ప్రభుత్వం శిక్షించింది. అయినా మగ మృగాల వేట ఆగడం లేదు… ఆ మధ్య గుంటూరులో ఓ ఐదేళ్ల అమ్మాయిని ఓ అరవై ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసి చంపేశాడు… వరంగల్‌లో తొమ్మిది నెలల పసిపాపపై ఓ దుర్మార్గుడు అగాయిత్య ం చేశాడు…ఆ మధ్య నగరంలోనే సైదాబాద్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్లి ఓ వెదవ అత్యాచారం చేసి చంపేశాడు..! ఆ మధ్య జూబ్లీహిల్స్ పబ్ కేసు…ఇంకా మర్చిపోనేలేదు…! ఇలా ఎన్ని దారుణాలు…ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఆగడంలేదు. విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగే అప్పటికప్పుడు వేసే శిక్షలకు మన దేశంలో అమలు చేసే శిక్షలకు తేడా వుంది.
అదే దుర్మార్గుల పాలటి వరంగా మారుతోంది.జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో నడిచే పాఠశాల అంటే అందరూ ఎంతో గొప్పగా ఊహించుకుంటారు… లక్షలకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే…ఎంతో గొప్ప సౌకర్యాలు..విద్యాబుద్దులు చెప్పేంత గొప్పదని అనుకుంటారు..కాని అలాంటి స్కూల్‌కు ప్రిన్సిపల్ ఓ మహిళ. ఆమె ఆధ్యర్యంలో స్కూల్ నడుస్తుందంటే అందరికీ ఓ భరోసా…ఆ నమ్మకమే విద్యార్థుల పాలిట నరకమైంది. తల్లిదండ్రుల పాలిట శాపమైంది. అసలు ప్రిన్సిపాల్ కారుకు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి తరగతి గదిలో ఏం పని…! ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ,అదే స్కూల్ స్కూల్ బస్సుకు డ్రైవర్ నుంచి ప్రిన్సిపల్ కారుకు డ్రైవర్ గా మారి పసిపిల్లలను పాడు చేసే దాకా ఎలా మారాడు? ఆ విషయం చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రిన్సిపల్‌కు లేదా? పైగా ప్రశ్నించేందుకు వెళ్లిన మహిళలను ప్రిన్సిపల్ కుమారుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తలిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి.తమ పిల్లలు ఎంతపెద్ద స్కూల్‌లో చదివితే తమకు అంత పెద్ద హోదా అనుకుంటున్నారే గాని, ఆ స్కూల్‌లో తమ పిల్లలు ఎలా వుంటున్నారని ఆలోచిస్తున్నారా? పైన పటారం చూసి, అప్పులు చేసి, లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి, పసిపాపల జీవితాలు ఆగమౌతుంటే ఏం చేస్తున్నారు…తల్లిదండ్రులుగా పిల్లలకు ఫీజులు చెల్లిస్తే చాలన్న బాద్యత దగ్గరే ఆగిపోతున్నారా? ఇటీవల జరిగిన సంఘటనకు ముందు కూడా అనేకం వినపడ్డాయంటున్నారు..అప్పుడే ఇతర తల్లిదండ్రులు స్పందిస్తే ఇంత దాకా వచ్చేది కాదు…కదా? ఆ మృగం ఆగడాలు ఆగిపోయేవి కదా? మహిళా రూపంలో వున్న ఆ ప్రిన్సిపల్ ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టేది కాదా? తల్లిదండ్రుల స్పందన ఆలస్యం కారణంగా ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆలోచించండి.
చండూరులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర
చండూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అయివుండి కూడా కేంద్రంలో ఆ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం తీవ్ర విచారకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు.ఆయన పార్టీ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాలకు,పేద సాదలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు.ఆ పార్టీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ,బీసీ,మహిళలపై ప్రతి నిత్యం దాడులు జరుగుతుంటాయని వద్దిరాజు ఆవేదన చెందారు.అటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ కు పొరపాటున కూడా ఓటేయ్యొద్దని,ఒకవేళ వేసినట్టయితే వృధా అవుతుందన్నారు.చండూరులో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ వద్దిరాజు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం గురుతర బాధ్యత మనందరిపై ఉందని రవిచంద్ర వివరించారు.సమ్మేళనానికి అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ, మునుగోడు సమగ్రాభివృద్ధికి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో మున్నూరుకాపు ప్రముఖులు బండి సంజీవ్, విష్ణుజగతి,వాసుదేవుల వెంకటనర్సయ్య,జెన్నాయికోడే జగన్మోహన్, వనమాల ప్రవీణ్,యాద క్రాంతి పటేల్,అనిల్ పటేల్,శ్రీధర్ బాబు, రామస్వామి వెంకటేశ్వర్లు,పాశం కిరణ్,సకినాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు లో మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర: రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
బండి సంజయ్ ఎంట్రీతో ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది
ముందుంది ముసళ్ళ పండగ: సంగప్ప
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మునుగోడులో ప్రచారానికి అడుగుపెట్టగానే టిఆర్ఎస్ వర్గాల్లో వణుకు పుడుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు.
బండి సంజయ్ ప్రచారంలో అడుగుపెట్టగానే తమ ఓటమి తప్పదు అన్న భయంతోనే టిఆర్ఎస్ సంజయ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపించారు. అప్పుడే ఏమైందని, ముసళ్ళ పండగ ముందుంది అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల నిబంధనలకు లోబడే సంజయ్ గారు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
బూతు యూనివర్సిటీ కి వీసీ, డీన్ అన్నీ టీఆరెస్ నేతలే అని సంగప్ప అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంజయ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు టిఆర్ఎస్ దగ్గర సమాధానం లేదని, అందుకే ఆయనను ప్రచారానికి రాకుండా అడ్డుకునేందుకు టిఆర్ఎస్ కుట్ర చేసింది అని సంగప్ప అన్నారు.
అంతేకాకుండా మునుగొడులో టీఆరెస్ మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర చేస్తోందని సంగప్ప విమర్శించారు. రజాకార్ల పార్టీని చంకలో పెట్టుకుని తిరుగుతున్న టీఆరెస్ మాత్రమే అలాంటి ఆలోచనలు చేయగలదని ఆయన అన్నారు. బీజేపీ అధికారం లో ఉన్న 18 రాష్ట్రాల్లో ఒక్క ఘర్షణ జరగలేదని సంగప్ప గుర్తు చేశారు.
అంతే కాకుండా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఎనిమిది చిహ్నాలను తొలగించాలని టిఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా అక్కడ తిరస్కరణకు గురైందని, హైకోర్టు పిటీషన్ కొట్టేయడంతో బిజెపి పై ఎడుస్తున్నారని సంగప్ప అన్నారు. ఆ ఎనిమిది ఎన్నికల గుర్తులు టిఆర్ఎస్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తొలగించాలని కోరడం అర్ధరహితం అని హైకోర్టు టిఆర్ఎస్ పిటిషన్ను కొట్టేసిందని ఆయన చెప్పారు. 20 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని సంగప్ప ప్రశ్నించారు. ముగోడులో తమ ఓటమి ఖాయమని టిఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందని, ఏదో ఒక వంక పెట్టి బండి సంజయ్ ను మునుగోడు రాకుండా అడ్డుకోవాలని, లేకుంటే ఏకంగా ఎన్నికనే వాయిదా వేయాలని టిఆర్ఎస్ కుతంత్రం పన్నుతుందని సంగప్ప విమర్శించారు.
మునుగోడు ప్రజలకి టిఆర్ఎస్ టక్కుటమార విద్యలన్నీ అర్థమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందుకే బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని మునుగోడు ఓటర్లు నిర్ణయించుకున్నారని సంగప్ప జోస్యం చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యల్ని సంగప్ప ఖండించారు. మంత్రి మతి భ్రమించి అవాకులు చాకులు పేలుతున్నారని ఆయన అన్నారు
నరేంద్ర మోడీ గ్రామాలకు ఇస్తున్న నిధులు, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర గురించి చెప్పుకునే తాము ఓటు అడుగుతున్నామని, టిఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా చేసిన మోసాన్ని కుడాచెబుతున్నామని సంగప్ప చెప్పారు.
అన్ని సర్వేలు టీఆరెస్ ఓడిపోతుందనే చెబుతున్నాయని సంగప్ప అన్నారు. అందుకే
ఓటమి భయంతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మకాం వేశారని సంగప్ప అన్నారు. బండి సంజయ్ ప్రచారంతో భయమేసి మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వచ్చారని ఆయన విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లను పార్టీనుంచి సాగనంపే కార్యక్రమం మొదలైనట్లే కనిపిస్తోంది. వారిని పార్టీనుంచి పంపించడం ఖాయంగానే కనిపిస్తోంది. గతంలోలాగా అంతర్గత ప్రజాస్వామ్యంలో కొంత కోత మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో పార్టీ బతికి బట్టకట్టాలంటే సీనియర్లను పార్టీకి దూరం చేయడం ఒక్కటే సరైన నిర్ణయం అనుకుంటున్నారట. దీనిపై పిపిసి. అధ్యక్షుడురేవంత్ వర్గంలో సాగుతున్న గుసగుసగా సమాచారం అందుతోంది. అందుకే సీనియర్లను పొమ్మనలేక పొగ పెట్టే కార్యక్రమం బాగానే జరుగుతోందని అర్ధమౌతోంది. ఇటీవల జరిగిన ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు సీనియర్ల పెద్దరికానికి, అర్హతలకు, అధికారాలకు కోత పెట్టడం జరిగనట్లే కనిపిస్తోంది. తెలంగాణ తొలి పిపిసి అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య లాంటి వారికి కూడా అన్యాయం జరిగిందన్న స్పష్టమౌతోంది. కనీసం ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పొన్నాల తన వర్గానికి ఓటు వున్నా, వినియోగించుకోలేని స్ధితిని కల్పించడం కూడా ఆపరేషన్ వికర్ష్‌లో భాగమే అని తేలుతోంది. అంతే కాడు మాజీ ఉప ముఖ్యమంతి దామోదర రాజనర్సింహకు కూడ ఆవమానం జరగడం అన్నది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయినా దానిపై మాట్లాడేందుకు సైతం ఏ సీనియర్ ముందుకు రాకపోవడం గమనార్హం.
సీనియర్ల ఈగోపై కొడితే వారి దిమ్మ తిరుగుతుందో అదును చూసి మరీ కొట్టడం అంటే ఇదే మరి…
సహజంగా సీనియర్ నేతలందరకీ ఈగో ఎక్కువ. వారు తమకు పదవితోపాటు, పరపతి, గౌరవం, మర్యాద, కీర్తి, ఆహ్వానం కోరుకుంటారు. తమకు ప్రత్యేక ప్రాధన్యత కల్పించకపోతే ఆగమాగం చేస్తుంటారు. గతంలో అంటే సీనియర్ల ఆటలు చెల్లాయి. వారు ఆడిరది ఆట పాడిరది పాటగా వుండేది. ప్రత్యేక ప్రాధాన్యాలు కూడా పొంది తిరుగులేని నేతలుగా, తమ మాట చెల్లుబాటు చేసుకునేవారు. కాని కాలం మారుతోంది. రాజకీయాలు కూడా మారుతున్నాయి. ప్రజల్లో పార్టీలు వుండాలంటే బలమైన నేతలు కావాలి. ప్రజలను ప్రసన్నం చేసుకునే నాయకులు కావాలి. ప్రజలకు ఎంతైనా ఖర్చుచేసే శక్తి యుక్తులున్న నాయకులు కావాలి.
నాయకుడిని చూసి ఓట్లేసే కాలం పోయింది.
పార్టీని నడిపేవారిని చూసి ఓట్లు పడే కాలమొచ్చింది. పార్టీ నిలబెట్టేవాళ్లంతా గెలుపు గుర్రాలు కావాలి. రియలెస్టేట్ కింగ్‌లై వుండాలి. పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేసే ధైర్యం వున్నవారు కావాలి. అవసరమైతే అప్పులు చేసైనా పార్టీకి పది రూపాయలు పంపేవారు కావాలి. ఎన్నికల నాడు ఎంతైనా ఖర్చుకు వెనకడాని వారు మాత్రమే కావాలి. ఇవన్నీ సీనియర్ల నుంచి కావు. అంత డబ్బు వారి దగ్గర లేదు. వున్నా ఖర్చు పెట్టేందుకు మారి మనసొప్పదు. పైగా పార్టీ ఏమిస్తుందా? అని ఎదురు చూస్తారు. అందువల్ల సీట్లిచ్చి, ఎదరు సొమ్మిచ్చి, ఓడిపోవడం కన్నా, గెలుపు గుర్రాలను ప్రోత్సహిస్తే మరో ఇరవైఏళ్ల రాజకీయం పార్టీకి పదిలం. ఇదే ఇప్పటి రాజకీయం…అదే రేవంత్ ఫాలో అవుతున్నాడు..అందుకే ఏఐసిసి అధ్యక్ష ఎన్నికలు వేధికగా చేసుకొని రేవంత్ ఒక రకంగా చెప్పాలంటే రెచ్చిపోయాడు..?సీనియర్లకు రaలక్ ఇచ్చాడు… తన తప్పేం లేదన్నట్లు ఇన్నేసెంట్ స్టేట్ మెంటు ఇచ్చేశాడు…తాంబూలాలిచ్చాను…ఇక మీ సావు మీరు సావండి? అన్నట్లు జరుగుతున్న తమాషా చూస్తున్నాడు…సీనియర్లను ఎక్కడ నొక్కితే గిలగిల కొట్టుకుంటారో అక్కడ రేవంత్ నొక్కి వదిలిపెట్టాడు. దాంతో సీనియర్లు ఊపిరి సలపకుండా పోవడం చూసి స్కెచ్ వర్కవుటైందని రేవంత్ వర్గం ఒకింత సంతోషపడినట్లే తెలుస్తోంది. ఇలా చేస్తే నాలుగు రోజులు తమ అసంతృప్తిని సీనియర్ల వెల్లగక్కుతుంటారు…అది కూడా పార్టీకి మైలేజే తెచ్చిపెడుతుందన్నది ఒక వర్గం వాదన. పైగా పార్టీ గురించి ప్రజల్లో చర్చ జరగుతుంది.
సీనియర్లను ప్రజలే చీదరించుకుంటారు..ఇంకా మీకు పదవులు కావాలా అని దెప్పిపొడుస్తారు.
..ఈ సమయంలో ఓ నాలుగు రోజులు సీనియర్ల మాటలను కవర్ చేసే మీడియా కూడా చేతులెత్తేస్తుంది. వాళ్లు పిలిచినా వెళ్లకుండా తప్పించుకుంటుంది. రోజూ అదే సోది అనుకుంటూ కొత్త వార్తల కోసం మీడియా ఆలోచిస్తుంది. ఇంకే ముంది మీడియా కూడా మొహం చాటేయడంతో పిలుపు లేని, గౌరవం దక్కని గాంధీభవన్‌కు వెళ్లడం ఎందుకని సీనియర్లు వెళ్లడం మానేస్తారు… పిసిసి కూడా పిలవడం మానేస్తుంది. రేవంత్‌రమ్మంటే తప్ప మేం రామని సీనియర్లు రామని మొండికేస్తారు…ఆయన పిలువడు..సీనియర్లు అటు వైపు వెళ్లరు..ఇంకేముంది ఖేల్ ఖతం…సీనియర్ల రాజకీయం ఆగం…ఇలాగే మరో నాలుగు రోజులు గడిస్తే చాలు తాము నాయకులమన్న సంగతే మర్చిపోతారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు విలువ లేదని తిట్టుకుంటూ కాలం గడిపేస్తుంటారు..అయితే రాజకీయాలు వదలుకోలేని వాళ్లు మాత్రం కొత్త దారులు వెతుక్కుంటారు… అవసాన దశలో ఏదో ఒక పదవి దక్కితే చాలు…ఆ తర్వాత సంగతి దేవుడెరుగు అని ఏదో ఒక పార్టీలో చేరి, కొంత కాలం పొద్దుబుచ్చుకుంటారు….జ్ఞాపకాల పందిరిని మీడియాకు పదే పదే గుర్తు చేసుకుంటారు…
అయితే రేవంత్ టార్గెట్ చేస్తున్న నాయకులంతా బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నది బాగా గమనిస్తే అర్ధమౌతుంది.
మూడుదశాబ్దాల పాటు తిరుగులేని నాయకులుగా చెలామాణి అయిన బిసి, ఎస్సీ నాయకులను రేవంత్ పార్టీనుంచి పంపే కార్యక్రమం మొదలుపెటినట్లున్నారని టాక్…! అదే రెడ్డి నేతలు అలిగితే వారి దగ్గరకు వెళ్తున్నాడు..వారిని భుజ్జగిస్తున్నాడు…ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. జగ్గారెడ్డి ఎన్ని సార్లు ఎన్ని మాటలు అన్నా, వాటినిపెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆయనుకు ఎదురెళ్లి మరీ పలకరించే రాజకీయాలుచేశాడు… ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతి చెప్పాల్సిన పనిలేదు. అసలు రేవంత్‌రెడ్డిని సొంత పార్టీనేతైనా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టినన్ని తిట్లు ఎవరూతిట్టలేదు…అయినా మా వెంకన్న అంటూ దగ్గరకు వెళ్తూనే వుంటాడు..ఆయనకు క్షమాపణ చెబుతూనే వుంటాడు…పిలుపులు బాగనే వుంటాయి… కాని ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల నాడు దామోదర రాజనర్సింహ,పొన్నాల తోపాటు మరికొందరు నేతలు ధర్నా చేస్తే కనీసం అటు వైపు కూడా రేవంత్‌రెడ్డి చూడలేదు. ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏఐసిసి ఎన్నికల ఓట్ల విషయంలో పిసిసికి సంబంధం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి, తమ ప్రమేయం లేదన్న మాట వారి వద్దకు వచ్చి చెప్పొచ్చు. కాని ఆ పని చేయలేదు. అంటే ఇదంతా జరగాలనే చేసినట్లు కనిపిస్తోంది. పోతే పోనీ అంటూ గాంధీ భవన్ సాక్షిగా సీనియర్లను,కో వర్టులకు హెచ్చరికలు జారీ చేసిన రేవంత్ తన కార్యాచరణ మొదలుపెట్టారు. సీనియర్లను ఒక్కొక్కరినీ సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లున్నారు. కార్చాచరణ అమలు చేస్తున్నాడు. కాకపోతే తెలంగాణ కోసం కృషి చేసిన సీనియర్లకు విలువివ్వాల్సిన అసవరం వుంది. ఆది విస్మరిస్తే పార్టీకి మరింత నష్టం జరగొచ్చు. నిజంగా రేవంత్ నాయకత్వానికే అంత శక్తి వుంటే ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఓడియే వారు కాదు. గతం కన్నా మంచి మెజార్టీతో గెలిచేవారు. అక్కడ ఓడిపోయినా నోరున్న నేతగా వున్న గుర్తింపుతోపాటు, చంద్రబాబు నాయుడు రాజకీయం మూలంగా మల్కాజిగిరి పార్లమెంటు సీటు ఇచ్చారు…గెలిచారు..అంతే తప్ప రేవంత్ నాయకత్వంలో అద్భుతాలు ఊహించుకోవడం కూడా అత్యాశే అవుతుంది. హుజూరాబాద్‌లో గతంలో 60 వేల ఓట్ల నుంచి పార్టీకి ఒక్కసారిగా 3వేలకు పడిపోయినప్పుడే రేవంత్ రాజకీయం తన కోసమే పనికొస్తుంది తప్ప, ఏ పార్టీలో వున్నా, దానికి పనికి రాదని తేలిపోయింది. ఇక మునుగోడు ఏం చెప్పబోతోందో కూడా అందరికీ అర్ధమౌతూనే వుంది…అంటున్నారు సీనియర్లు…!
`ప్రభుత్వాసుపత్రులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడం?
`ప్రజలను భయాందోళనలకు గురిచేయడం?
`మళ్ళీ తమ వ్యాపారం సాగేందుకు ఎంచుకున్న అక్రమ మార్గం?
`ప్రసూతి వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రుల వైపే ప్రజలు.
`ప్రైవేటు వైద్యం వైపు చూడని గర్భిణీలు…
`సాధారణ కాన్పులు ప్రభుత్వాసుపత్రులలో…
`ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్లు ఎక్కువ?
`మోయలేని ఖర్చుతో పాటు సిజేరియన్ వల్ల అనారోగ్యం!
`నెలలపాటు విశ్రాంతి…దీర్ఘకాలిక సమస్యలు…
`ప్రభుత్వాసుపత్రులలో కేసిఆర్ కిట్…నగదు ప్రోత్సాహం… రవాణా సౌకర్యం…
`ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యానికి జనం కరువు…
`వ్యాపారం దివాళా…
`వైద్యసేవను ఏనాడో గాలికొదిలేసిన ప్రైవేటు ఆసుపత్రులు…
`ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో మళ్ళీ భయం కల్పించే కుట్రలు!
`ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందితో సమస్యలు లీక్?
`ప్రభుత్వాసుపత్రులలో చిన్న చిన్న అసౌకర్యాలను విసృతంగా ప్రచారం చేయడం!
`ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని మరీ అసత్య ప్రచారం…
`ప్రభుత్వం దృష్టి సారిస్తేగాని ప్రైవేటు ఆసుపత్రుల దుష్ట పన్నాగం ఆగదు!
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రంలో ఎక్కువ శాతం ప్రైవేటు ఆసుపత్రులు అక్రమ సంపాదనలకు ఎగబడుతున్నాయి. సేవ ఎప్పుడో గాలికి వదిశాయి. ప్రైవేటు ఆసుపత్రుల ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది. వ్యాపార సరళి పెరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వీర్యం లక్ష్యంగా ప్రైవేటు ఆసుపత్రులు కుట్రలు పన్నుతున్నాయి. కుయుక్తులు విసురుతున్నాయి. అడ్డ దారులు తొక్కుతున్నాయి. దొంద దందాలకు తెరలేపుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులను అబాసు పాలు చేసేలా వదంతులు సృష్టించే ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల సౌకర్యాలపై లేని పోనివి ప్రచారం చేస్తున్నాయి. మొత్తం మీద మళ్లీ తమ ప్రైవేటు ఆసుపత్రులు కళకళలాడేందుకు అవసరమైన ఎత్తుగడలు వేస్తున్నాయి. కుతంతాలు పన్నుతున్నాయి.
ఇంతకీ ఏం జరుగుతోంది:
తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వైద్య వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతూ వచ్చారు. సౌకర్యాల కల్పన జరిగింది. కొత్త భవనాలు కూడ అవసరమైన చోట నిర్మాణం జరిగింది. పెద్దఎత్తున డాక్టర్ల నియామకాలు జరిగాయి. పెద్దఎత్తున ఇతర సిబ్బంది నియామకాలు జరిపారు. ఆసుపత్రులకు అవసరమైన ఉపకరణాలు అందించారు. దాదాపు అన్ని రకాల టెస్టులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే చేపడుతున్నారు. వీటికి తోడు మాతా శిశు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెద్ద ఎత్తున పెంచే కార్యాక్రమం చేపట్టారు. ముఖ్యంగా కేసిఆర్ కిట్ ప్రకటించిన తర్వాత, నెల నెల టెస్టులు కూడా గర్భిణీలు ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకుంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పరస్థితి వేరు. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ వైద్యం అన్నది ఎంతో అందుబాతటులోకి వచ్చింది.పేద ప్రజలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించడం జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ ప్రసూతి నిర్వహిస్తే ఎక్కువ బిల్లులు వసూలు చేయడం కుదరదు. దాంతో ఎక్కువగా సిజేరియన్లే చేస్తారు. డెలివరీకి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేసేవారు. బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మనీరు మింగారని, ఇలా రకరకాల కారణాలు చెబుతారు. ఆపరేషన్ చేయకపోతే తల్లి, బిడ్డలకు ప్రాణాలకే ప్రమాదమంటూ హెచ్చరిస్తుంటారు. దాంతో ఎవరైనా ప్రాణాలకన్నా డబ్బు ఎక్కువ కాదనుకోవడం సహజం. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు వరంగా మారింది. కాని ఇటీవల కాలంలో కాన్పుల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చేవారే కరువౌతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెంచిన సౌకర్యాలతోపాటు, అక్కడ నార్మల్ డెలివరీలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో సురక్షితమైన డెలివరీలు చేపడుతున్నారు. రికార్టు స్ధాయిలో కాన్పులు చేస్తూ ప్రభుత్వ వైద్యాన్ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. దాంతో ప్రైవేటు ఆసుపత్రలకు గిరాకీ కరువైంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు సైతం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని తమ ఆసుపత్రులకు పంపించి అక్కడసిజేరియన్ చేస్తుంటుంటారు. కాని ఇప్పుడు అది కుదడం లేదు. పరిస్దితి మారింది.
హరీష్‌రావు ఆరోగ్యశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి నెలా మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులపై డాక్టర్లు శ్రద్ద తీసుకునేలా చూస్తున్నారు. ఆరోగ్య భీమా వున్న వారు తప్ప పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఆగిపోయింది. ఇది మింగుడు పడని ప్రైవేటు ఆసుపత్రులు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన సౌకర్యాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తే తప్ప, తిరిగి తమ ఆసుపత్రులు కోలుకోవని కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తూ, అటు ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వారు కూడా సహకరిస్తూ ప్రభుత్వాసుపత్రులపై దుష్ట ప్రచారం మొదలుపెడుతున్నారు. అందులో భాగంగా కొందరు వైద్య విద్యార్ధులకు కొంత ఆశ చూపించి, ప్రభుత్వాసుపత్రులలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలపై వీడియోలు చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఈ విషయం తెలిసి, ఇలా కూడా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తాయా? అని ముక్కున వేసేసుకునేలా చేస్తున్నారు.
సహజంగా తమ వ్యాపారం పెంచుకోవడం ఒక లక్షణం..
రెండోది ఎదుటి వారి వ్యాపారం దెబ్బతీయడం…ఇందులో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులైతే పోటీ ప్రపంచంలో ఇది కామన్ అనుకోవచ్చు. కాని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై అపోహలు సృష్టించి, ప్రజలను తమ ఆసుపత్రులకు ఆకర్షిచడం అన్నది వ్యవస్ధనే సవాలు చేయడమౌతుంది. వ్యవస్ధను నిర్వీర్యం చేయడమౌతుంది. ప్రభుత్వాన్నే ఎదిరించడం అవుతుంది. ప్రభుత్వ వ్యవస్ధలను కుప్పకూల్చడమౌతుంది. అది మొత్తం సమాజానికే సవాలుగా మారుతుంది. ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల ఇలాంటి దుష్ట కార్యక్రమాలకు తెరలేపిందని తెలుస్తోంది. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కూడ తెలుస్తోంది.
ప్రతి వైద్యుడు ప్రజల ప్రాణాలు కాపాడేందుకే వైద్య అభ్యసిస్తుంటాడని అందరికీ తెలుసు.
ప్రజలకు సేవ చేసేందుకే వైద్య వృత్తి చేపడతారు. వైద్యులుగా సమాజంలో ఒక గౌరవం వుంటుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. గుర్తింపు వస్తుంది. సంపాదన కూడా మిగతా వృత్తులకన్నా ఎక్కువగానే వుంటుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. చీకు చింతలు లేని జీవితం అనుభవించొచ్చు. అని ఆలోచించి తల్లిదండ్రులు ఆలోచించి, తమ పిల్లలను డాక్టర్లు కావాలని కోరుకుంటారు..వారికి అవసరమైన చదువుకు అందిస్తుంటారు. చదువుకునే విద్యార్దులు కూడా ఇంచుమించు ఇలాంటి ఆలోచనలతోనే డాక్టర్ చదవు చదువుకుంటారు. ఇంతవరకు బాగానే వుంటుంది.
కాని వైద్యం మొదలుపెట్టే సమయంలోనే కాసుల కక్కుర్తి చాలా మంది డాక్టర్లకు మొదలౌతుందని అంటున్నారు.
వైద్య వృత్తి మొదలుపెట్టేన నాటినుంచే వ్యాపారులుగా మారిపోతున్నారట. లెక్కటుగట్టి కోట్లకు ఎలా పడగలెత్తాలని చూస్తున్నారట. ఇదే వైద్యులను అబాసుపాలు చేస్తోంది. వ్యవస్ధను నాశనం చేస్తోంది. ప్రభుత్వాసుపత్రులు ఎకరాల కొద్ది స్ధలాల్లో నిర్మాణాలు చేపడతారు. ఒక నగరంలో వున్న ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒక ఎత్తైతే, ఒక్క ప్రభుత్వాసుపత్రి ఒక ఎత్తు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల పెట్టు. అంత మంది స్టాఫ్ వుంటారు. ఎకరాల కొద్ది స్ధలంలో నిర్మాణం చేపడతారు. ఎంత పెద్ద ప్రైవేటు ఆసుపత్రైనా సరే ఇరుకైన గదులు, గాలి ఆడని స్ధలాలో ఊపిరి సలపని స్ధితిలో వుంటాయి.
అదే ప్రభుత్వాసుపత్రులు ఎంతో విశాలంగా వుంటాయి. సౌకర్యాలు కూడ పుష్కలంగా వుంటాయి. వరంగల్ జిల్లాలో వున్న ఎంజిఏం ఆసుపత్రి ఎంత పెద్దదో, ఎంత విశాలమైందో అందరికీ తెలిసిందే..అలాంటి ఆసుపత్రిలో బాత్రూంలు పనిచేయడం లేదన్న వార్తలు ప్రైవేటు ఆసుప్రత్రలు ప్రచారం చేయడం విడ్డూరం. సహజంగా విశాలమైన స్ధలాలలో వున్న ఆసుపత్రుల్లో ఎలుకల బెడద అన్నది సహజంగా ఎదురౌతుంది. వాటిపై ఎంత ఎంత శ్రద్ద తీసుకున్నా ఎక్కడో అక్కడ సమస్యలు ఎదురౌతుంటాయి. పట్ణణానికి దూరంగా వున్న ప్రభుత్వాసుపత్రుల ఆవరణల్లో పాములు కనిపించడం అన్నది కొన్నిసార్లు సర్వసాధారణం. అదే ప్రైవేటు ఆసుపత్రులంటే నగరం నడిబొడ్డున ఏర్పాటుచేస్తుంటారు. అక్కడ ఇలాంటి సమస్యలు ఎదురయ్యే పరిస్దితి వుండకపోవచ్చు. కాని సరైన వైద్యం అందక ప్రాణాలు పోయే ప్రజల సంఖ్య ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఎక్కువ. కాని అవి బైటకు రావు…ఎలుకలు, పాముల గొడవ మాత్రం బైటకు వస్తాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలను ప్రచారం చేసి,ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేమిలాగే వైద్యం కూడా అలాగేవుంటుందని ప్రచారం చేస్తున్నారు… ప్రభుత్వాసుపత్రుల ప్రతిష్టను దిగజార్చే కుట్రలు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించి, ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం కల్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
`ఆస్తులన్నీ అమ్మైనా సరే ప్రజలకు సేవ చేస్తానన్నావు?
`ప్రజల్లో డబుల్ బెడ్ రూంలో వుంటానన్నావు.
18వేల ప్రాజెక్టు కోసం రాజీనామా చేశావు?
`మూడేళ్ల నాడు కాంగ్రెస్ కు తిరుగులేదన్నావు?
` కాంగ్రెస్ ను ముంచి కమలం అందుకున్నావు?
`మునుగోడులో ఇంటింటికీ పెద్దకొడుకౌతానన్నావు?
`మరి ఎంత మందిని ఆదుకున్నావు?
`ఇప్పుడేమో మూడు వేల పెన్షనంటున్నావు?
`ఇప్పుడెట్లిస్తావు…మళ్ళీ నిలబడి ఎవరినుద్దరిస్తావు?
`దుబ్బాకలో నమ్మించారు…`హుజూరాబాద్ లో మాయ చేశారు…
`ఇప్పుడైతే నోటికొచ్చిన అబద్దాలన్నీ చెబుతున్నారు…
బడాయి మాటల బిజేపికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోతలు భలే తోడయ్యాయి…అబద్దాల మూటలు పేరుకుపోతున్నాయి. గత మూడేళ్ల కితం చెప్పిన మాటలు మరిపించేందుకు, కాంట్రాక్టు ఇచ్చిన వారిని మెప్పించేందుకు కొత్త కొత్త కథలు అల్లుతూ…అప్పటికప్పుడు చెబుతున్నాడు. పాతవి మర్చిపోయేలా చేస్తున్నాడు. ఒక్కసారి గతంలో మునుగోడులో 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే నాయకుడంటే ఇలా వుండాలి? అనిపిస్తుంది. కాని ఇప్పుడు అవే మాటలు వింటే నాయకుంటే ఇలా వుంటారా? అనిపిస్తుంది. అంత తేడా వుంటుంది. కాలమే మారింది… నాయకుడు మారలేదు…ఆయన చెప్పిన అబద్దాలు మారలేదు…కొత్తవి మరిన్ని పుట్టకొస్తున్నాయే…గాని నిజాలు ఒక్కటి కూడా రావడం లేదు…నిజాలు చెప్పడానికి ఆయనకు ధైర్యం కూడా లేదు… ఒక రకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి మీడియాతో మాట్లాడినట్లు సర్కిలేట్ అవుతున్న వార్తలోనైనా నిజాలున్నాయి…కాని రాజగోపాల్ చెప్పే మాటల్లో ఒక్కటీ నిజం లేకుండాపోతోందంటున్నారు. ఆమె కొన్ని నిజాలు చెప్పినట్లుంది. ప్రజలకు తమ మీద కోపం వుందన్న సంగతి స్పష్టం చేసింది. కాని రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఆకాశంలో పందిరేసినంత పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడు..అందులో ఓ ఆణిముత్యమటువంటి మాట మాత్రం కడు విచిత్రంగా వుంది. ఫ్రధాని మోడీని ఒప్పించి రెండు వేలు వున్న పెన్షన్‌ను రూ.3వేలు చేయిస్తాడట…మునుగోడులో అమలు చేస్తాడటా…అందిస్తాడట? ఇది నమ్మశక్యంగా వుందా? గుజారాత్ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్‌కి ఇస్తున్న ఫించన్ కేవలం రూ.600 మాత్రమే. కాని తెలంగాణలో వస్తున్న ఫెన్షన్ రూ.2000. మరి అక్కడికి ఇక్కడికి తేడా రూ.1400. ఈ లోటును బిజేపి పాలించే రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు. కాని మునుగోడులో రూ.3వేల ఫెన్షన్ ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పే మాట నమ్మశక్యమైందేనా? సేమ్…ఇలాగే గత 2018 ఎన్నికల్లోనూ రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మాటలు వింటే ఔరా? అని ముక్కున వేలేసుకోవాల్సిందే…వాటిని ఒకసారి పరిశీలిద్దాం… మునుగోడులో 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను గెలిపిస్తే మునుగోడును అద్దం చేసినట్లు చేస్తానన్నాడు.
మునుగోడు నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్తే అక్కడ మునుగోడునుంచి వచ్చారని తెలిస్తే మన గురించి అడిగేలా చేస్తా…మునుగోడును కరంటు వెలుగుల్లో ముంచేస్తా…నాలుగు లైన్ల రోడ్లుతో మునుగోడును మంచి మంచి పట్టణాలను తలదన్నేలా చేసి చూపిస్తా…ఉదయ సముద్రం పూర్తి చేస్తా…? మునుగోడులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తా….ఇలాంటి వరాలతోపాటు మండలాలకు ఆయన ఇచ్చిన వరాలు చూస్తే మతి పోవాల్సిందే… నేనిక్కడే వుంటా…మీలో ఒకడిగా వుంటా…మునుగోడులో ప్రతి ఇంటికి పెద్ద కొడుకునౌతా…సేవ చేస్తా…చెల్లెమ్మలకు అన్ననౌతా…అంటూ అనేకం చెప్పాడు…తన కుమారుడిని కూడా తీసుకొచ్చి ఆస్ధులన్నీ పోయినా ఫరవాలేదు..మునుగోడు బాగు చేస్తా…బంగారుతునక చేస్తా…ఇక ఇక్కడే మకాంపెడతా…ఇక్కడో ఓ ప్లాట్ తీసుకొని ఇళ్లు కట్టుకొని మీ మధ్యే వుంటా…ఇరవై నాలుగు గంటలు అందుబాటులో వుంటా..ఒక వేళ ముఖ్యమంత్రి కేసిఆర్ తనను, తన వ్యాపారాన్ని అణిచివేయాలనిచూస్తే, ఆస్ధులన్నీ పోతే మీ మధ్యే డబుల్‌బెడ్ రూంలో వుంటా…మీకోసమే బతుకుతా… నాకంటూ పెద్దగా కోరికలు లేవు..వ్యాపారం నేను చూసుకోవ డం లేదు… మీకోసమే నా జీవితం…మీ కోసమే ఈ రాజకీయం అంటూ ప్రజల నమ్మించాల్సినంత నమ్మించాడు..ఆడకూడని అబద్దాలన్నీ ఆడాడు..సాధ్యం కాని హమీలన్నీ ఇచ్చాడు..గెలిచాడు..మళ్లీ రాజకీయ భవిష్యత్తు కష్టమని తెలిసి, ఎన్నికల దగ్గర్లో వుండగా కొత్త పల్లవి అందుకున్నాడు…పార్టీ మారినా రాజీనామా చేశానంటూ…మళ్లీ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు…
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్, కరీంనగర్‌లను మించి మునుగోడును అభివృద్ది చేస్తానన్నాడు. కాని ఏ ఒక్క పని ముట్టుకోలేదు. పూర్తి చేయలేదు. తన సొంత నిధులైనా ఖర్చుచేస్తా? అన్నాడు. ఒక్క పైసా తీసింది లేదు. అభివృద్ధి చేసింది లేదు…ఆస్ధులు పెంచుకునేందుకు కొత్త కొత్త కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రూ.18వేల కోట్ల ప్రాజెక్టు దక్కిందని ఆయనే స్యయంగా చెబుతున్నాడు. కాని అది నాది కాదని బుకాయిస్తున్నాడు…! ఒకనాడు మేం పేదవాళ్లమన్నాడు…మాది చిన్న చిన్న వ్యాపారం అన్నాడు…అక్కడా ఇక్కడా అప్పులు చేసి వ్యాపారాలు సాగిస్తామన్నాడు…ఆయన కంపనీల మీద ఈడీ దాడులు అన్న వార్త వినగానే బిజేపికి దగ్గరయ్యాడు…కాంగ్రెస్‌కు దూరమయ్యాడు…ఇక బిజేపిలో తనదే రాజ్యమన్నాడు..ఆఖరుకు బిజేపిలో తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినంటూ కూడా కొంత కాలం కోతలు కోశాడు…! 2018 ఎన్నికల సమయంలో టిక్కెట్టు కోసం నానా తంటాలు పడ్డాడు…కాంగ్రెస్ కనికరించి టిక్కెట్టు ఇస్తే మునుగోడులో కాంగ్రెస్ శ్రేణులు గెలిపిస్తే గెలిచాడు… ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదన్నాడు…బిజేపికి భవిష్యత్తే లేదన్నాడు…! 2018లో గెలవగానే ప్లేటు పిరాయించాడు..కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందన్నాడు…భవిష్యత్తు రాజకీయమంతా బిజేపిదే అంటూ కొత్త రాగం అందుకున్నాడు..అప్పటినుంచే తన కొడుకు భవిష్యత్తుకోసం పెద్ద ప్రాజెక్టుకు ఎసరు పెట్టాడు…మేం పేదవాళ్లమని చెప్పి, రూ.7 కోట్లతో కారు కొని, నాది కాదన్నాడు…ఇప్పుడు మాది కార్లలో తిరగాల్సిన ఫ్యామిలీ కాదు…! అడుగు తీసి అడుగు బైటపెడితే హెలీకాప్టర్లలో తిరగాల్సిన వాళ్లమంటున్నాడు…! ఒక నాయకుడిలో ఇన్ని వేరియేషన్లా..? అంటే ప్రజలు నమ్మినంత కాలం రాజకీయాలను వ్యాపారాలకు ముడిపెట్టి సంపాదిస్తూనే వుంటారు…చేతికంటిన మెతుకులు విధిలిస్తూ దాన ధర్మాలు చేస్తున్నామంటారు…అదే ప్రజాసేవ అని గొప్పలు చెప్పుకుంటారు…అదే కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.
మునుగోడులో ప్రతి ఇంటికి పెద్ద కొడుకునన్నాడు..మూడేళ్లనాడు కాంగ్రెస్ తనకు రాజకీయ బిక్ష పెట్టిందన్నాడు…కాంగ్రెస్‌కు హండిచ్చి, కమలం పంచన చేరారు…పువ్వును చూసి మురిసిపోతున్నాడు… రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకు బిజేపికి రుణం తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు…మునుగోడు గోడును వదిలేసి, తన గోడును చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నాడు…ప్రజలను అడుక్కునేలా చేస్తున్నాడు…! రాజకీయాలలో నైతికత అన్నది తామరాకు మీద నీటిబొట్టు లాంటిదని నిరూపిస్తున్నాడు… మునుగోడును చూసి మురిసిపోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతా అన్న మాటలు ఏనాడో వదిలేశాడు….తనకు నిధులివ్వకుండా ప్రభుత్వం మునుగోడుకు న్యాయం చేయలేకపోతున్నానని చేతులెత్తేశాడు… మరి మళ్లీ ప్రభుత్వం ఎలా నిధులిస్తుంది…? తెలంగాణలో అప్పుడు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఇస్తుందన్నది తెలిసుకోలేనంత అమాయకులా ప్రజలు…! మోసం ఒకసారి చేయొచ్చు..రెండుసార్లు చేయొచ్చు…పదేపదే కుదరదు..! ఎందుకంటే దుబ్బాకలో రఘునందర్ రావు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ, మునుగోడులో ప్రజలు నిలదీస్తున్నారంటే ప్రజలు ఎంత చైతన్యవంతులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…దుబ్బాకలో ఇంటికో బండి,రెండు బండెడ్లు ఇస్తానన్నావు…ఇచ్చావా? అని ప్రజలు అడుగుతుంటే రఘునందన్ నీళ్లు నములుతున్నాడు…మళ్లీ ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని ఇప్పటినుంచే కంగారు పడుతున్నాడు…జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి బిజేపి ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు…ఫలితాల నాడే చేతులేత్తేసిన బిజేపిని ఒక నమ్మకూడదని జనం నిర్ణయించుకున్నారు? ఇక ఇప్పుడు బిజేపి జూటా మాటలు ప్రజలు నమ్మే పరిస్దితి లేదు…మునుగోడులో అసలే నమ్మేలా లేరు…అంటున్నారు ప్రజలు..!
కూసుకుంట్ల గెలుపునకు ఎంపీ వద్దిరాజు చౌటుప్పల్,తుప్రాన్ పేట,దండు మల్కాపురంలలో విస్త్రత ప్రచారం
చౌటుప్పల్ లో మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర
మున్నూరుకాపులతో భోజనం చేసిన ఎంపీ వద్దిరాజు
చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పోతుల యాదగిరి చేత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్
ఉపసంహరింపజేశారు.నకిరేకల్ లో ఉన్న యాదగిరిని ఆగమేఘాల మీద రవిచంద్ర చౌటుప్పల్ కు పిలిపించి ఎమ్మెల్యే భాస్కరరావు, మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజులతో మాట్లాడించి ఒప్పించారు.అటు తర్వాత తన వాహనంలో చండూరు కు పంపి నామినేషన్ ను ఉపసంహరింపజేశారు.చౌటుప్పల్ పట్టణంలోని తంగెడపల్లిలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు, టీఆర్ఎస్ నాయకుడు, మున్నూరుకాపు రాష్ట్ర కో -కన్వీనర్ చల్లా హరిశంకర్ లతో కలిసి మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.తంగెడపల్లిలో గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచారు.అదేవిధంగా తుప్రాన్ పేట, దండు మల్కాపురంలలో కాలినడకన వాడవాడలా తిరిగి ఎన్నికల ప్రచారం గావించారు.తుప్రాన్ పేట మున్నూరుకాపు కుల బంధువులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి,వారందరితో కలసి భోజనం చేశారు.
కార్పోరేషన్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖం
మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో 5 ఎకరాల భూమితో పాటు 5కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పోరేషన్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపుల్లో ఉన్న ఐక్యత, విశ్వసనీయత, సంస్కారాన్ని గుర్తించి తనను రాజ్యసభకు పంపారన్నారు.మున్నూరుకాపులకు చెందిన తొమ్మిది మందిని ఎమ్మెల్యేలను,ఇద్దరిని ఎమ్మెల్సీలను చేశారని,నలుగురికి కార్పోరేషన్ ఛైర్మన్ పదవులిచ్చి సముచిత గౌరవించిన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభాకర్ రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని రవిచంద్ర చెప్పారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, వెన్ రెడ్డి రాజు,చల్లా హరిశంకర్,జెన్నాయికోడే జగన్మోహన్,గుండ్లపల్లి శేషగిరిరావు,చక్రం జంగయ్య,గంధం సతీష్,కేశెట్టి మహేష్,బండి సంజీవ్, వనమాల ప్రవీణ్,యాద క్రాంతి,సకినాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం తథ్యం:ఎంపీ రవిచంద్ర
వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ప్రశంసనీయం: మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపులకు కోకాపేటలో కోట్ల విలువైన భూమి ఇచ్చారు:చల్లా హరిశంకర్
మునుగోడులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు
నమ్మిన ప్రజలను వంచించి బీజేపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాలుగేళ్ల పాటు మునుగోడు ముఖం చూడలేదని, ప్రజలకు ఏనాడు అందుబాటులో లేరని,వాళ్లను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదని రాజగోపాల్ వైఖరిని దుయ్యబట్టారు.మునుగోడులో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నూరుకాపులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఉన్నతికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమందరం సంపూర్ణ మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు.కృత్రిమమైన ఈ ఉప ఎన్నికను తెచ్చిన రాజగోపాల్ కు ఘోరమైన ఓటమి తప్పదని,కేసీఆర్ పంపిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అఖండ విజయం తథ్యమని రవిచంద్ర ధీమాగా చెప్పారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ,వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ప్రశంసనీయమన్నారు.గుళ్లుగోపురాల నిర్మాణాలకు ఎన్నో గుప్త దానాలు చేశారని,పేద విద్యార్థుల చదువులకు, పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు,తన సొంత గ్రామం ఇనుగుర్తి అభివృద్ధికి ఎంతగానో సాయపడ్డారని,అడిగిన సహాయాలు చేస్తూనే ఉన్నారని వివరించారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ,మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ సమ్మేళనంలో మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,వాసుదేవుల వెంకటనర్సయ్య, సకినాల రవికుమార్, రామస్వామి వెంకటేశ్వర్లు,జెన్నాయికోడే జగన్మోహన్,పాశం కిరణ్,మాజీ గుండ్లపల్లి శేషగిరిరావు,పర్వతం సతీష్,భిక్షమయ్య,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జడిగం సతీష్ తాను టీఆర్ఎస్ చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో ఎంపీ రవిచంద్ర ఆయన మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
నగరంలోని ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చిన మంత్రులు కేటీఆర్, గంగుల,ఎంపీ రవిచంద్ర
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నగరానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ నారాయణపురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.పుట్టపాకలో ఆదివారం ఆయన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడగా,టీఆర్ఎస్ నాయకుడు గంధం నాగేశ్వరరావు కారులో వెంటనే నల్లగొండ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ నగరం హస్తినాపురంలోని పయనీర్ ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గత వారం రోజులుగా చురుగ్గా పాల్గొన్న ఆయన వయస్సు 56ఏండ్లు,రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఆయనకు భార్య పద్మజ, కుమారులు సచిత్ కుమార్,,తరుణ్ కుమార్ లు ఉన్నారు.మునుగోడులో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తంలతో కలిసి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు.టీఆర్ఎస్ లో చురుకైన కార్యకర్తగా పేరున్న జగదీష్ అకాల మృత్యువు లోనుకావడం పట్ల మంత్రులు కేటీఆర్,గంగుల కమలాకర్,ఎంపీ రవిచంద్రలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఆయన పెద్ద కుమారుడు సచిన్ ను వెంటనే ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వారు హామీనిచ్చారు.
ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి గుడ్ బై చెప్పిన స్థానిక నాయకులు
వాడవాడలా,గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు కూడగట్టిన రవిచంద్ర, పూల రవీందర్
తుప్రాన్ పేట: చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేటలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్,
ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి చెందిన స్థానిక నాయకులు పలువురు టీఆర్ఎస్ లో చేరారు.తుప్రాన్ పేట రచ్చబండ వద్ద ఆదివారం ఉదయం ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే
మల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ రవీందర్ లు స్థానికులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా అక్కడే ఉన్న గంధం
సత్యనారాయణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన తాను బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.ఎంపీ రవిచంద్ర వెంటనే ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా
ఆహ్వానించారు.ఆ తర్వాత వద్దిరాజు, రవీందర్ లు గ్రామంలో కాలినడకన వాడవాడలా తిరిగి మున్నూరుకాపుల గడప గడపకు వెళ్లి అందరిని ఆత్మీయంగా పలకరించారు.అనారోగ్యానికి గురైన వర్కూరి బాలకృష్ణను పరామర్శించారు,ఈ సందర్భంగా ఆయన సోదరులు మల్లేష్,రాజేందర్ లు బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువాలు కప్పుకున్నారు.అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు కేశెట్టి సత్తయ్య, బీజేపీకి చెందిన కేశెట్టి జంగయ్య,కంకణాల వెంకటయ్య, పగడాల చిన్న మల్లయ్య, పగడాల కృష్ణ, పగడాల శ్రీనివాస్,వర్కూరి జంగయ్య,ఆయన కుమారులు భానుచందర్,భరత్ కుమార్,సిపిఎంకు చెందిన పగడాల భిక్షపతి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భాలలో ఎంపీ రవిచంద్ర వెంట తుప్రాన్ పేట,ఇనుగుర్తి సర్పంచ్ లు చక్రం జంగయ్య, రాంమూర్తి, మున్నూరుకాపు ప్రముఖులు ఆర్.వి.మహేదర్,కేశెట్టి మహేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా “వర్థిల్లాలి వర్థిల్లాలి టీఆర్ఎస్ వర్థిల్లాలి”, “జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ నాయకత్వం జిందాబాద్”,”జై మున్నూరుకాపు జై జై మున్నూరుకాపు”,”కారు గుర్తుకే మన ఓటు” అనే నినాదాలు హోరెత్తాయి.
`ఎంపి. అయిన తొలి వారంలోనే ఇనుగుర్తిని వద్దిరాజు రవిచంద్ర మండలం చేయించుకున్నాడు?
`ఉద్యోగుల సంఘం నేత పదవులు దక్కకపోయినా పార్టీకి సేవలు చేస్తున్నాడు?
`ఉద్యమ నాయకులెందరికో పదవులు అందలేదు…అయినా వారు ఉద్యమ త్యాగాన్ని పదవులకు ముడిపెట్టడం లేదు?
`కోదండరాం లాంటి వారికే టిక్కెట్ రాలేదు…భువనగిరి అవకాశం మీకు వచ్చింది?
`ప్రజలు గెలిపిస్తే బిబి నగర్ నిమ్స్ కు ఏం చేశావు?
`ఎంత మంది గౌడ సామాజిక వర్గ ప్రజలకు ఉచిత వైద్యం చేశావు?
`పదవులుంటేనే పార్టీ గొప్పదా?
`కండువా మార్చుకోగానే ప్రభుత్వానివి తప్పులా?
`రాత్రికి రాత్రే పార్టీకి జెల్లకొట్టి పత్తిత్తు మాటలా?
హైదరాబాద్,నేటిధాత్రి:
నిత్య అసంతృప్తి వాది ఎక్కడున్నా అంతే..ఎంత కాలం ఏ పార్టీలో వున్నా అంతే అని సామెత…ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్ ఉద్యమ కాలంలో రాజకీయ నాయకులతో సఖ్యతతక్కువ. తెలంగాణ రాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసిఆర్ పిలిచి భువనగిరి ఎంపి సీటిచ్చి, బిసీ నేతగా గుర్తింపు వ చ్చేలా చూసుకున్నారు. కాని చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహదేవా! అన్నట్లు ఎంపిగా వున్నంత కాలం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వరెడ్డితో ఏనాడు సఖ్యత లేదు. ఇప్పటికీ ఆయనతో గిట్టడం లేదు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖరరెడ్డితో ఏనాడు పడలేదు. ఆలేరుఎమ్మెల్యే గొండిగి సునీతను కలుపుకొని పోయింది లేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి సాగింది లేదు. ఆ నాయకులతో ఎప్పుడూ గిల్లికజ్జాలే…ఆనాడు వాళ్లెవరూ నాకు పిలిచి పీటేయడం లేదు? నాకు గౌరవం ఇవ్వడం లేదని నిత్య అసంతృప్తితోనే ఐదేళ్లు పదవి పుణ్యం కాలం పూర్తి చేసుకున్నాడు. పదవిలో వున్నంత కాలం ప్రజలకు అందుబాటులో వున్నది లేదు. ప్రజలకు పెద్దగా మేలు చేసింది లేదు. ఎంత సేపు ఎమ్మెల్యేలతో చిక్కులు…చింతలు తప్ప, ప్రజల సంగతి ఏనాడు పట్టలేదు. ఎంపిగా పెద్దగా పనితనం చూపింది లేదు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ రెండోసారి కూడా ఎంపిగా అవకాశం ఇచ్చారు. కాని బూర నర్సయ్య గౌడ్ ఓడిపోయాడు. కారణం ఆయన స్వయం కృతాపరాధం….ప్రజలతో మమేకం కాలేని తనం… అయినా మళ్లీ పిలిచి పీటెయ్యలేదు…నాకు సీటు సీటివ్వడం లేదు…మునుగోడు సీటు అడుగుడు తప్పా…మా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ…! అంటూ కొత్త పల్లవి అందుకున్న నాడే బూరనర్సయ్యగౌడ్ కోవర్టు అవతారం ఎత్తిండన్న సంగతి టిఆర్‌ఎస్ శ్రేణులకు అర్ధమైపోయింది. గతంలో అసంతృప్తి నేతలు కూడా ఇలాగే చాలా మంది చేశారు. టిఆర్‌ఎస్ కాదంటే బిజేపిలో చేరారు..టిఆర్‌ఎస్ టిక్కెట్టు ఇయ్యకుంటే బిజేపికి తీర్ధం పుచ్చుకున్నారు…..టిఆర్‌ఎస్ నుంచి తీసేస్తే బిజేపిలో చేరారు? మొత్తం మీద టిఆర్‌ఎస్‌కు పనికి రానివారంతా బిజేపిలో చేరిపోయారు… పని తనం లేని వాళ్లంతా బిజేపి గుంపులో చేరుతారన్నది సుస్పష్టమైంది. బిజేపికి క్యాడర్ లేదు…లీడర్లు లేరు…సహజంగా ఏ పార్టీ అయినా క్యాడర్‌ను తయారు చేస్తే లీడర్ తయారౌతాడని అనుకుంటుంది. కాని బిజేపి లీడర్లను తీసుకొని క్యాడర్ లేకపోయినా ఫరవాలేదనుకుంటోంది. టిఆర్‌ఎస్‌లో పనికి రాని స్క్రాప్ అంతా బిజేపిలో నిండుతోంది. టిఆర్‌ఎస్‌లో ఔట్‌డేటెడ్ నాయకులంతా బిజేపిలో చేరి చేతులు కాల్చుకుంటున్నారు. కోవర్టు ఆలోచనలు వున్న నేతలు టిఆర్‌ఎస్‌లో ఎంత ప్రాధాన్యత వున్నా నచ్చడం లేదు..బిజేపిలో చేరి మూలన కూర్చొని దిగులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్లు పైకి చెప్పుకోలేక..బైటకు ఏడ్వలేక..పిలిచేవ వారులేక సతమతమౌతున్నారు…ఎందుకొచ్చామా? అని దిగులు పుడుతున్నారు….వారి సరసన ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్‌చేరిపోయాడు..అయిన కాడే ఇలాంటి నేతల పెత్తనం.. బైటకు పోతే ఉత్తదే మనం..
అని ఇప్పటికే అనేక మందినేతలు నిరూపించారు. ఎందుకంటే అయినోడు భుజాల మీదకు ఎక్కించుకున్నా చాలదు…కాని వాడు కాళ్ల కింద వేసుకుంటే గాని తత్వం భోధ పడదు…ఇప్పుడు బైటకు పోతే బాగానే వుంటుంది. నాలుగు రోజులైన తర్వాత అక్కడ గుంపులో గోవిందయ్య కూడా కాలేకపోతే గాని పోగొట్టుకున్నదేమిటో అర్ధమౌతుంది. బూరది ఇంత పచ్చి అవకాశ వాదమా? పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగడం అంటే ఇదే! మూడు రోజుల క్రితం నా అవసరం జాతీయ రాజకీయాల్లో వుందని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పాడు. మా పార్టీ అభ్యర్ధి గెలుపుకోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి రెండు రోజులు కాలేదు…కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కూడా తన చేతుల మీదుగా వేసిన బూర నర్సయ్య గౌడ్… పార్టీకి రాజీనామా! దీనిని ఏమంటారు? అవకాశ వాదమనరా? మోసమనుకుండాఏంటారు? గతంలో ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోతే ఆఖరు నిమిషంలో ఇతర పార్టీలలో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నవారు వున్నారు.
బాజాప్తా వాళ్లు వెళ్లిపోయేవారు. కాని బూర నర్సయ్య గౌడ్‌లాగా మాత్రం గతంలో ఏనాయకుడు వ్యవహరించలేదు. ఇది నీతి మాలిన తనానికి పరాకాష్ట కాదా? తాను బిజేపిలో చేరిపోవడం అన్నది స్వయం కృతాపరాధం అని తెలియడానికి బూర నర్సయ్య గౌడ్‌కు ఎంతో కాలం పట్టదు. ఏగేసేవారు….ఎగదోసే వారు…ఎటూ కాకుండా చేయాలని చూసేవారు చాల మంది వుంటారు…అలాంటి వారి మాటలు నమ్ముకుంటే ఇలాగే అవుతుంది. ఇప్పటికే బిజేపిలో చేరిన వారి పరిస్ధితి బూర నర్సయ్య గౌడ్ చూస్తూనే బిజేపి వైపు అడుగులేయడం అంటేనే నమ్మకాన్ని అమ్ముకున్నట్లు…ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు…!పదవులిచ్చిన టిఆర్‌ఎస్‌ను నిండా ముంచిపోతే బిజేపిలో సముచిత స్ధానం ఇస్తారని అనుకోడం వెర్రితనమే అవుతుంది. 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపిగా అవకాశం కల్పించింది పార్టీ. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి కేసిఆర్ టిక్కెట్టు ఇచ్చారు. కాని బూర నర్సయ్య గౌడ్ ఓడిపోయాడు. దానికి పార్టీ భాధ్యత కాదు…ఆయన నాయకత్వ లేమి తనం? బూర నర్సయ్యకు వుంటే ఎంతకు ఓడిపోయినట్లు? ప్రజాభిమానం చూరగొననట్లే కదా? సరే…ఆనాడు ఎవరి చేతిలో ఓడిపోయాడో…బూర నర్సయ్య గౌడ్‌ను ఎవరు దగ్గరుండి ఓడిరచారో…ఆ నాయకుడైన రాజగోపాల్ రెడ్డి ఎన్నికకే మునుగోడులో సపోర్టు చేసేందుకు కమలం గూటికి చేరితే…నమ్మకం అన్న పదానికి అర్ధముంటుందా? విశ్వాసమన్నది బూర నర్సయ్య గౌడ్‌లో వుందని అనుకునేందుకు అవకాశం వుందా? బూర నర్సయ్య ఓడిపోవడానికి ప్రధాన కారకుడైన రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చేయడం అంటే ఆత్మాభిమానం చంపుకోవడం కదా? ఇంత పేరు కు కారణమైన టిఆర్‌ఎస్ తాను ఏమిచ్చానని ఏనాడైనా ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు.
సరే మునుగోడు మీద బూర నర్సయ్య గౌడ్‌కు ఎంతో ప్రేమ వుందనే అనుకుందాం…
మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏనాటినుంచో గట్టుప్పల్ మండలం కావాలని డిమాండ్ చేస్తూ వున్నారు. దానిని ఏనాడైనా భుజాన వేసుకున్నావా? గట్టుప్పల్ ప్రజల కోరిక తీర్చమని ఏనాడైనా ముఖ్యమంత్రి కేసిఆర్‌నొ కోరావా? ఒత్తిడి తెచ్చావా? ఖచ్చితంగా మండలం చేయాలని అడిగావా? ఇటీవల రాజ్యసభ సభ్యుడైన వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే సమయంలో తన గ్రామమైన ఇనుగుర్తిని మండలం చేయాలని కోరారు…ప్రకటిస్తేగాని ఇక్కడినుంచి కదలనని కోరాడు…నా గ్రామ ప్రజల కోరిక నెరవేచ్చిన ఘనత నాకు దక్కాలన్నాడు. మండలం ప్రకటిస్తే ఇనుగుర్తిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నాడు. ప్రజల కోరిక నెరవేర్చిన నాయకుడిగా తన గౌరవం పెరుగుతుందని చెప్పి, ఇనుగుర్తిని మండలం చేయించుకున్నాడు. అదీ నాయకుడికి వుండాల్సిన లక్షణం. కాని అలాంటి పనులు ఏమైనా బూర నర్సయ్య గౌడ్ చేశాడా? అంటే ఒక్కటికూడా కనిపించదు. అలాంటి సంఘటనలు కూడా భువనగరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వున్నాయి. జిల్లాల ఏర్పాటు సమయంలో గుండాల మండలాన్ని భువనగిరి నియోజక వర్గంలో కలిపితే ప్రజలు ఆక్షేపించారు. వారి అభీష్టాన్ని ఆలేరు ఎమ్మెల్యే తీర్చి తిరిగి ఆ గుండాల మండలాన్ని ఆలేరు నియోజకవర్గంలో కలిపించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి గుండాలను ఆలేరులో కలిపారు. కాని ఆ సమయంలోబూర నర్సయ్య పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇక ఆయన పార్లమెంటు పరిధిలోని చేర్యాలలో గత ఐదారేళ్లుగా రెవిన్యూ డివిజన్ చేయాలని కోరుతూ పెద్దఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ డిమాండ్‌ను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంపిగా వున్న సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసి, చేర్యాల సమస్య తీర్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాయకుడిగా నర్సయ్య గౌడ్‌ది ఫెయిల్యూర్ స్టోరీయే…తనకు తాను లీడర్‌ను అనుకుంటే చాలా…ప్రజలు కూడా అనుకోవాలి. గుర్తించి ఎన్నికల్లో గెలిపించాలి…నర్సయ్య గౌడ్ బిజేపిలో చేరితే వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి టిక్కెట్టు ఇచ్చే అవకాశం వుంటుందా? ఇప్పుడు ఇన్నికోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడుతున్న రాజగోపాల్ రెడ్డిని కాదని బిజేపి టిక్కెట్టు ఇస్తుందా? అందులోనూ జనరల్ సీట్లలో రెడ్డీని కాదని బిసికి ఇచ్చేంత సమర్ధవంతమైన నాయకుడివా…అదీ కాకపోతే వచ్చే ఎన్నికల్లో బిజేపి భువనగిరి నుంచి ఎంపిగా అవకాశం ఇస్తుందన్న గ్యారెంటీ ఏమైనా వుందా? ఇక్కడున్నా కనీసం మళ్లీ భువనగిరి టిక్కెట్టైనా దక్కేది….ఇప్పుడు అదీ లేదు…ఇదీ లేదు…రెంటికీ చెడ్డ రేవడి కావడం ఖాయం కాదా? నిన్నటిదాకా పార్టీలో వుండి…రాత్రికి రాత్రి రాజీనామా చేయగానే పత్తిత్తు మాటలు మాట్లాడితే చాలా…సచ్చీలుడివైపోతావా? టిఆర్‌ఎస్ కండువా తీసేయగానే ప్రభుత్వం తప్పులు గుర్తుకొస్తున్నాయా…ముఖ్యమంత్రి కేసిఆర్ ఎప్పుడూ ఒళ్లో కూర్చోబెట్టుకుంటే తప్ప పార్టీలో కొనసాగలేవా? పదవులంటేపార్టీ గొప్పది? లేకుంటే కాదా? ఇలా పదవుల కోసం మాత్రమే పని చేసే నాయకులను ఏ పార్టీ క్షమించదు. పార్టీ కోసం పనిచేసే నాయకులే పార్టీ పట్టుగొమ్మలౌతారు…పార్టీకి నిజమైన కార్యకర్తలౌతారు..! సామాజిక వర్గంపేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తాం…అనుకుంటే సరిపోదు…ఒక వైద్యుడిగా తన సామాజిక వర్గానికిచెందిన ఎంత మందికి ఉచిత వైద్యం చేశాడో చెప్పగలడా? సామాజిక వర్గం కేవలం పదవుల కోసమేనా?…గౌడ సామాజిక వర్గానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత, వారి వృత్తికి గైరవం దక్కుతున్నది ఇప్పుడు మాత్రమే…టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూలంగానే…అది మర్చిపోయి…తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది…అన్నట్లు కమలం గూటికి చేరుతున్నాననుకొని బూర నర్సయ్య బురద రుద్దుకుంటున్నాడన్నది మాత్రం నిజం…అని ప్రజలు అంటున్నారు.
తీసుకుంటున్నరు,దీంతో మునుగోడు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతది:ఎంపీ రవిచంద్ర
చౌటుప్పల్, తంగెడపల్లి,వాయిలపల్లి, లచ్చమ్మగూడెం,అంతంపేట,మర్రిగూడెంలో వద్దిరాజు విస్త్రత ప్రచారం
మునుగోడు: బిజెపి అభ్యర్థి రాజగోపాల్ పచ్చి స్వార్థపరుడని,5 ఏళ్ల కోసం గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి 18వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగ అని
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.నమ్మిన మునుగోడు ప్రజలకు ద్రోహం చేసి కృత్రిమ ఎన్నికను తెచ్చారని బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్,విష్ణు జగతిల నాయకత్వాన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని
గెలిపించేందుకు మున్నూరుకాపులు శనివారం ఊరారా, వాడవాడలా వ ప్రచారం నిర్వహించారు.నారాయణపురం మండలం వాయిలపల్లిలో జరిగిన సభలో రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ నియోజకవర్గ ప్రజలు గతంలో ఫ్లోరోసిస్ తో
బాధలు పడుతుండడాన్ని కళ్లారా చూసిన కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా పరిశుద్ధమైన తాగునీరందిస్తూ ఆ మహమ్మారిని శాశ్వతంగా తరమికొట్టారని వివరించారు.నిన్న కాక మొన్న చుండూరులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.గత ఎన్నికల్లో ఓడినా కూడా ప్రభాకర్ రెడ్డి ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఇటువంటి నాయకుడిని గెలిపించినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల సంపూర్ణ సహకారంతో మరింత గొప్పగా అభివృద్ధి చేస్తారని రవిచంద్ర వివరించారు.నారాయణపురం మండల కేంద్రంలో ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్,తంగెడపల్లిలలో వాడవాడలా తిరిగి టీఆర్ఎస్ ఓట్లేసి ఘన విజయం చేకూర్చాల్సిందిగా కోరారు. అదేవిధంగా లచ్చమ్మగూడెం, అంతంపేటలలో ఇంటింటా తిరిగి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం గావించారు. మర్రిగూడెం మండల కేంద్రంలో మున్నూరుకాపులతో సుమారు 3 గంటల పాటు సమావేశమై టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దతునిచ్చి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీ వద్దిరాజు వెంట సకినాల రవికుమార్,పర్వతం సతీష్,జెన్నాయికోడే జగన్మోహన్,గంధం నాగేశ్వరరావు,సోమనారాయణ,ఆర్.వి.మహేందర్,పుస్తె శ్రీకాంత్,కోట్ల వినోద్,కౌశెట్టి మహేష్,గాదె మోహన్,నాయిని నరేష్,పొనుగోటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.