విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన
*జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు* తంగళ్ళపల్లి: ప్రతినిధి నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థినిలకు సైబర్ క్రైమ్/ ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ వలన కలుగు నష్టం షీ టీమ్ సేవలపై లపై జిల్లా షీ టీమ్ బృందం,AHTU బృందం, కళాబృందం వారితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.ఐ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ…..
విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా,అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మీరు మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు.మీరు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినట్లుగా గుర్తిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందిస్తే వీలైనంత వరకు మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు 1930 నంబర్ కు ఫోన్ చేసి వుంటే సమీప పోలీసులను తక్షణమే సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మీ మిత్రులకు,కుటుంబసభ్యులకు,గ్రామస్థులకు సైబర్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని అన్నారు..
మహిళలు,విద్యార్థినులు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరుకు 7901132141 ను సంప్రదించాలని తెలుపారు.ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి ,వారి సమస్యలను పరిష్కరించుకొవాలని కోరారు.ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో ఆర్టీసీ బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని, ఎలాంటి వేధింపుల కైన గురయ్యే మహిళలు షీ టీం కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు..అదేవిధంగా షీ టీం పని విధానం, పొక్సో ఆక్ట్, ఈవిటిజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, గుడ్ టచ్, బాడ్ టచ్, అమ్మాయిల వేధింపులు,పై అవగాహన కల్పించారు…
కళాబృందం సభ్యులు ఆటపాటల ద్వారా డయల్ 100 ఉపయోగం,షీ టీమ్ పని విధానం సైబర్ నెరలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిని,వైస్ ప్రిన్సిపాల్ సుధా,షీ టీం ఏ ఎస్.ఐ ప్రమీల కానిస్టేబుల్ శ్రీధర్,ప్రభాకర్,విజేయ్,ఆక్సర్,అధ్యాపకులు పాల్గొన్నారు..