కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బండకింది అరుణ్       

చేర్యాల నేటిధాత్రి

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గా చేర్యాల మండల కేంద్రానికి చెందిన బండకింది అరుణ్ కుమార్ ను యాదగిరిగుట్ట లో ఈ నెల 19నుండి 21 వరకు జరిగిన సంఘం రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ శనివారం తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని కల్లు గీత కార్మికులకు,గౌడ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ జిల్లాలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొన్ని సవత్సరాలుగా అనేక పోరాటాలు,ఉద్యమాలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో సంఘాన్ని బలోపేతం చేస్తూ కల్లు గీత వృత్తి రక్షణ,సమస్యల పరిష్కారం కోసం కార్మికులను ఏకం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు

విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో విద్యను బోధించాలి..

ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ ఆఫీసర్

కె.ఫ్లోరెన్స్.

చెన్నారావుపేట-నేటిధాత్రి:

మండలం లోని లింగగిరి ప్రాధమిక పాఠశాలను తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్ సందర్శించడం జరిగింది.ఈ సందర్శన లో విద్యార్థుల హాజరు ఉపాద్యాయుల హాజరు వివరాలను మధ్యాహ్నం భోజనం ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ మాట్లాడుతూ తరగతి గధిలో ఉపాధ్యాయులు విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో బోధన అందించాలి అన్నారు ఉపాధ్యా యులు అందరూ విధిగా లెస్సన్ ప్లాన్ ,యూనిట్ ప్లాన్,ఇయర్ ప్లాన్ లతో భోదన కొనసాగించాలి.విద్యార్థుల అభ్యసన ప్రగతి ని స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ యాప్ లోనమోదు చేయాలి అని తెలిపారు. తదితర అంశాలపై చర్చించారు.తొలిమెట్టు కార్యక్రమం ను ఉపాద్యా యులువిజయవంతం చేయాలని కోరారు. ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సరళ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్,ఉపాధ్యాయులు చంద్రభాను రాజు,జయశ్రీ, శారదా,శాంటా కుమారి , అటెండర్ రహిమత్ మెసెంజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ నూతన కార్మిక సంఘం ఎన్నిక 

వీర్నపల్లి: నేటి ధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లావీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటీయు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక నూతన మండల కార్యవర్గం సోమవారము ఎన్నికున్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు భూస రాజం, కార్యదర్శి గా గుంటుకూ నరేందర్, శంకర్, చంద్రయ్య, దేవరాజు, రాజెల్లయ్య, శోభన్, తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపిటిసి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపి కార్మిక సంఘం అభివృద్ది కోసం కార్మికుల పక్షాన ఎల్లప్పుడు సాయ సహాయక సహకార అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దేవయ్య, ఎల్లయ్య, రాజు, సత్తిష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కొమురం భీమ్ ఆశయాలను కొనాసాగించాలి

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోమరంభీమ్ 121వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కొమురం భీమ్ నిజాం పాలకుల నిరoకుశత్వానికి అధికారుల దమన నితికి ఎదురు నిలిచి పోరాడిన ఆదివాసీల వీరుడని అన్నారు.జల్,జంగ్, జామిన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన ధిరోదాత్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాధుల రఘుపతి, కుమార్ రెడ్డి, సిరి మల్లె ప్రవీణ్, చిర్ర శ్రవణ్, మాధారపు ఉదయ్ కిరణ్, మొట్ల శ్రీనివాస్, రాజ్ కుమార్, వెంకటేష్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదు. -డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ విమర్శించారు. శనివారం 

అంబేద్కర్ సెంటర్ లో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా “వేర్ ఇస్ మై జాబ్ మోడీ” అనే నినాదంతో హన్మకొండ జిల్లా కమిటీ నాయకులు ఎన్నాము వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ నేడు మాటమార్చారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వరంగా సంస్థలను కార్పొరేట్ శక్తులకు ముట్టజెప్పి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారన్నారు.  

దేశంలో రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు ఖాళీ అయితే నెల గడవకముందే ఎన్నికలు గుర్తుకొస్తాయి కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రం గుర్తుకువచ్చే పరిస్థితి బీజేపీ ప్రభుత్వనికి లేదని ప్రశ్నించారు. 8 ఏండ్ల మోడీ పాలనలో యువతకు ఒడిగిందేది లేదన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోతె సతీష్, దాసరి నరేష్, సతీష్, వినయ్, శివాని, శ్రావణి, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

అమితాషా 58వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన బెంద్రం తిరుపతిరెడ్డి..

ఇల్లంతకుంట :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమితాషా జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి, స్వీట్ల పంపిణీ చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ. మహారాష్ట్రలో అనిల్ చంద్రషా – కుసుమ్ బెన్ షా తల్లితండ్రులకు తేది 22-10-1964 లో జన్మించి వ్యాపార రీత్యా ముంబయి లో స్థిరపడినారు, అయినా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు పొందిన దైర్యశాలి, రాజకీయ శాణిక్యుడు,శత్రు దేశాలకు వణుకు పుట్టించే మగదీరుడు, మన దేశం లో నీ అనేక కీలక సమస్యలను పరిష్కరించిన అభినవా సర్దార్ వల్లభాయ్ పటేల్, దేశ అభివృద్ధి ప్రదాతకి ,ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున అమితాషా కి 58 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూఅమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మన దేశ ప్రజలందరికి వారి సేవలు ఇలాగే ఇంకా అందాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తిని. స్వామి, మండల బీజేపీ తదితరులు పాల్గొన్నారు

చేనేతకు అండగా తెరాస ప్రభుత్వం. -వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి:

కుల వృత్తులను ప్రోస్తహిస్తు

చేనేతకు అండగా ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చండూరు మున్సిపాలిటీ లోని 5వ వార్డులోనీ పద్మశాలి కాలనీలో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోరుతూ ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడే పద్మశాలి ఇంట్లో చదువుకున్న వ్యక్తి. అందుకే ఆయనకి చేనేతల పట్ల ప్రత్యేక ప్రేమ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగం కోసం 5,752 కోట్లు కేటాయించింది. కానీ 70 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఇందులో 10 శాతం కూడా ఖర్చు చేయలేదు, తెరాస ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 40% యార్న్ సబ్సిడీ ఇస్తు చేనేతకు అండగా నిలిచిందన్నారు.ఈ ప్రభుత్వం నేతన్నలు తెచ్చిన ప్రభుత్వం. వారి సంక్షేమం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ,స్థానిక డివిజన్ ఇంఛార్జి రామలింగం,మాజీ సర్పంచ్ మల్లేశం, బొల్లం అశోక్, వెంకటేష్, రమశంకర్, బీరయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన 

జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న 

చెన్నారావుపేట-నేటిధాత్రి:

మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తప్పేట సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న వారి కుటుంబ సభ్యులు అతని కుమారుడు తప్పేట రాజేందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నమిడ్ల సురేష్,మండల మహిళ అధ్యక్షురాలు రాజులపాటి ఉమా అశోక్,ఎంపీటీసీ పసును టి రమేష్,మెరుగు యకయ్య, శ్రీను రాములు,రమేష్, యకయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు 

మంగపేట నేటి ధాత్రి

మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ,పూల మాలలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .. ప్రత్యేక ఆహ్వానితులు గా బాడిశ రామకృష్ణ పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆదివాసులు హక్కుల పోరాట ఆరాధ్యులు , ఆదివాసి మనగడ కోసం అలుపెరగని యుద్ధం చేసిన గొండు బెబ్బులి కొమరం భీమ్.. చూపిన మార్గంలో మనం ఎప్పుడూ పయనించాలని..ఆ మహనీయుడి త్యాగం మనం ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన అన్నారు..ఈకార్యక్రమంలో జీవవైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాం బాబు,కొమరం ధనలక్ష్మి,గుంటపూడి తిరుమల, మదురిమ టీచర్ ,మాధవరావు, కొమరం ఈశ్వరమ్మ, మడకం రాజేశ్వరరావు,కారం సాంబయ్య, ట్రస్ట్ సభ్యులు..బాడిశ ఆది నారాయణ, ఇందారపు రమేష్,చౌలం సాయిబాబు,గట్టిపల్లి అర్జున్,కొమరం రవి,మునిగల మహేష్,బాడిశ నవీన్,జనపట్ల జయరాజు,చీర్ల రమేష్,ఒదేల సుధీర్,కనుకుంట్ల నాగరాజు,జై భీమ్ రామ్మోహన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు..

నేటిధాత్రి కథనానికి స్పందన 

చిన్నారులకు భరోసాను కల్పించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న

భవిష్యత్తు లో అండగా ఉంటా…

పదివేల ఆర్థిక సహాయం అందించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న…

చెన్నారావుపేట-నేటిధాత్రి:

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగమణి అకాల మరణం మృతి చెందగా నేటిధాత్రి కథనానికి స్పందన ఇద్దరు ఆడపిల్లల ఆవేదన తో బాధపడుతున్నారని తెలుసుకుని జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఉప్పరపల్లి గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు అదేవిధంగా ఆడపిల్లలిద్దరికీ ఫ్రీ ఉన్నత విద్య అందించడం కోసం నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీ చెరుకుపల్లి విజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి , మండల కోఆప్షన్ ఎండి రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదాసి కుమారస్వామి, నమిడ్ల సురేష్ టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అన్వేష్ ,యూత్ సభ్యులు గొల్లపెల్లి స్వామి, మధు,కుక్కల సతీష్, మడ్డీ రాజు, కుక్కల రాజు, బోయిని రాజు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి 

మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ 

బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య కి వైద్య ఖర్చులకు గాను (125000)లక్ష ఇరువైఐదు వేల రూపాయల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అందించడంతో బాధితురాలు సౌజన్య మరియు కుటుంబ సబ్యులు శ్రీధర్ బాబు సార్ మీ మేలు మరువం.. మీకు రుణపడి ఉంటాం.. అంటూ బాధిత కుటుంబము చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి సౌజన్య కుటుంబ సబ్యులు ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శీను బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధయక్షులు చొప్పరి సదానందం,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లకు హృదయపూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి 

మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ 

బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య కి వైద్య ఖర్చులకు గాను (125000)లక్ష ఇరువైఐదు వేల రూపాయల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అందించడంతో బాధితురాలు సౌజన్య మరియు కుటుంబ సబ్యులు శ్రీధర్ బాబు సార్ మీ మేలు మరువం.. మీకు రుణపడి ఉంటాం.. అంటూ బాధిత కుటుంబము చేతులెత్తి మొక్కుతూ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి సౌజన్య కుటుంబ సబ్యులు ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శీను బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధయక్షులు చొప్పరి సదానందం,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లకు హృదయపూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

స్థానికులకు ఐఎంఎల్ డిపోలో ఉపాధి కల్పించాలి…

ఐఎంఎల్ డిపో హమాలి ఉద్యమ కమిటీ నాయకులు….

కొల్చారం( మెదక్ ) నేటి ధాత్రి:

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్ పూర్ లో ఉన్న ఐఎంఎల్ డిపో లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐ ఎం ఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు ఐఎంఎల్ డిపో లో పని కల్పించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించామని ఐఎంఎల్ డిపో ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రమేష్ సానుకూలంగా స్పందించారు. ఐ ఎం ఎల్ డిపో సమస్య నా దృష్టికి వచ్చిందని మేనేజర్ తో మాట్లాడి నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని అడిషనల్ కలెక్టర్ రమేష్ హామీ ఇచ్చారని ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఐఎంఎల్ డిపో ముందు శాంతియుతంగా ఐఎంఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు ధర్నా చేశారు. దీనికి స్పందించిన డిపో మేనేజర్ మాట్లాడుతూ సామరస్యంగా పోరాటం చేయండి తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఐఎంఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో. అధ్యక్షులు పులే బోయిన మల్లేశం, ఉపాధ్యక్షులు సోమ నర్సింలు , నేత దాసు, కోశాధికారి లక్ష్మీనారాయణ, కార్యదర్శి కమ్మరి మల్లేశం, ఆర్గనైజర్ కార్యదర్శులు, కుంటి ముత్తయ్య, నర్సింలు , మోతిలాల్, కార్యవర్గ సభ్యులు టి నర్సింలు, బైకరి శ్రీకాంత్, కట్ట నారాయణ, ఇమ్రాన్ బాబా, నాగం శీను, చాకలి మల్లేశం , సందీప్ గౌడ్, ఐఎంఎల్ డిపో ఉద్యమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలి

ధర్మసాగర్, నేటిధాత్రి:- 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి పర్వతాలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం సాంబరాజు అధ్యక్షతన శనివారం జరిగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వందలాది ఎకరాలు వరి పంట, పత్తి పంట, ఇతర పంటలు దెబ్బతిన్నాయని తీవ్రమైన నష్టం రైతులకు వాటిల్లిందని వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులతో సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతులు పంటలను మార్పిడి చేయడం జరుగుతుండడంతో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని లేకుంటే భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అనంతరం బొల్లం సాంబరాజు మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్వహించబోయే తెలంగాణ రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఈ మహాసభకు జిల్లా , రాష్ట్ర నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలుక రాఘవులు, లడ్డునూరి సతీష్, సాంబశివుడు, వెంకటయ్య, రాజు పర్శరాములు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చెప్పట్టాలని తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర

ఇల్లంతకుంట:నేటిధాత్రి

రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

ఎస్ఎఫ్ఐచేపట్టిన పాదయాత్రకు మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు,స్వేరో,సిపిఎం,కాంగ్రేస్ పార్టీలు

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు.

ఎస్ఎఫ్ఐ(భారత విద్యార్థి ఫెడరేషన్) జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్ డిమాండ్* మండలంలోని రహీంఖాన్ పేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ నుండి తహసీల్దార్ ఆఫీస్ 07 కిలో మీటర్ వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు,ఆటో యూనియన్ సభ్యులు పాదయాత్ర చెయ్యటం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఏర్పాటు ఐన అనంతరం పాఠశాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అప్పుడు ప్రజాప్రతినిధులు,అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించిన పరిస్థితి.ఇప్పుడు రోడ్డుకి కేటాయించిన భూమి గతంలో నీటి ఒర్రెగా ఉండేది అని సమాచారం,అధికారులు,ప్రజాప్రతినిధులు అప్పటికే పరిమితం అనే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టకుండా చేతులు దులుపుకున్నరన్నారు.గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని 2017 సంవత్సరంలోఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల,ఆటో యూనియన్ సభ్యులను కలుపుకొని రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహిస్తే అప్పుడు ఉన్నటువంటి గ్రామ సర్పంచ్,ఎంపీటిసి జోక్యం చేసుకొని ధర్నా విరమించుకోవాలని ఇబ్బందులు పెట్టినప్పటికి విరమించకపోవటం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎస్ఎఫ్ఐ 6 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టించరు అని ఆవేదన వ్యక్తం చేశారు.అయినప్పటికీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తిసుకెళ్లిన పట్టించుకోవటం లేదు చాలా సార్లు పాఠశాల ప్రిన్సిపాల్,మాజీ పాఠశాల చైర్మన్,ఎస్ఎఫ్ఐ నాయకులు తహసీల్దార్ రాతపూర్వకంగా,వినతి పత్రం లు ఇవ్వడం జరిగింది.కానీ సర్వే చేస్తున్నాం అంటు సమయం వృధా చేస్తున్నారు.వర్షం వస్తే ఆటోలు పోలేని పరిస్థితి కనీసం విద్యార్థులు నడుచుకుంటూ వెల్లలంటేనే బయపడుతున్నారన్నారు.గతంలో రెండు ఆటోలు పోయే అంత స్థలం ఉండేది ఈ సంవత్సరం ఒక్క ఆటో ఇరుకుగా పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.విద్యార్థుల సమస్యలు అంటే ప్రజాప్రతినిధులకు అవసరం లేదు అనుకుంటా ఎందుకంటే వారికి ఓటు హక్కు ఉంటే ఓటు కోసం అయిన పని చేసేవారు ఏమో అనుకుంటున్నామన్నారు.ఇక్కడ అభివృద్ధి చెయ్యలేను వారు వేరే నియోజకవర్గంకు వెళ్ళి ఎం అభివృద్ధి చేసాం అని చెప్పుకుంటరో చెప్పాలని ప్రశ్నించారు.విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాతో పాటుగా రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఉద్యమించటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారన్నారు.ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ రావికాంత్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.ఈ పాదయాత్రతో ఐన ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను,తల్లిదండ్రులనుఆటో డ్రైవర్లులను కలుపుకొని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం,ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో ముందు ధర్నా,రాస్తారోకోలు ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాం అని హెచ్చరించారు.ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పాదయాత్రకు మద్దతుగా సిపిఎం మండల ఇంఛార్జి గన్నేరం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది.వారు మాట్లాడుతూ ఈ మనకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లే ఇక్కడి అభివృద్ధి గురించి పట్టిచుకోకుండా ఇక్కడ అభివృద్ధికి కేటాయించిన నిధులు తీసుకొల్లి మునుగోడులో ఖర్చు చేస్తామని నీతులు చెప్తున్నారన్నారు.700 మంది విద్యార్థులు ఉన్న మోడల్ స్కూల్ కి రోడ్డు వెయ్యనికి నిధులు లేవు కానీ గుండారంలో ఉన్న ఎమ్మెల్యే అతిధిగృహం సిసి రోడ్డు వేసుకుంటానికి ఉంటాయా అని ప్రశ్నించారు, ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టాలని హేంచరించారు.

కార్యక్రమంలో స్వేరో నాయకులు జేరిపోతుల సాగర్,తాండ్ర శివగణేష్,ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీకృష్ణ,పెండెల ఆధిత్య, పందుల రాంచరణ్,చిగుర్ల అనిల్ కుమార్, వెంకటేష్,రుద్ర,అభిషేక్,మోడల్ స్కూల్ ఆటో యూనియన్ సభ్యులు రవి,రాములు,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

టిఆర్ఎస్ కే మా ఓటు.

నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం.

దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

మేం టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం…మా కుటుంబ సభ్యులందరి ఓట్లు టిఆర్ఎస్ కే అని మర్రిగూడ మండలానికి చెందిన నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టిఆర్ఎస్ కే అని ప్రకటించారు. నర్సంపేట గ్రామంలో వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్సం పేట గ్రామ టిఆర్ఎస్ ఇంచార్జ్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి తో కలిసి దివ్యాంగులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రకరకాల కారణాలతో దివ్యాంగులైతే మునుగోడు నియోజకవర్గంలో మాత్రం పాలకుల శాపంతో ఈ ప్రాంత ప్రజలు దివ్యాంగులయ్యారని అన్నారు. గతంలో ఇక్కడ ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కాళ్లు, చేతులు వంకర పోయి దివ్యాంగులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం ఎంతో మంది ఫ్లోరోసిస్ బారిన పడి అర్థాంతరంగా తనువు చాలించేవారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతనికి సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలని ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆక్షేపించారు. ఉద్యమ సమయంలో ఆనాటి ఉద్యమ నేత,నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ప్రాంతంలో పర్యటించి పోరుబాట సాగించారని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆనాడే హామీ ఇచ్చారని ఆయన అన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో మునుగోడులో ఫ్లోరోసిస్ మహమ్మారి అంతమైందన్నారు. మిషన్ భగీరథ నీళ్ళతో మునుగోడును ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ విషయంపై సాక్షాత్తు లోకసభలో బీజేపీ పార్టీకి చెందిన మంత్రి రామ్ లాల్ కటారియాగారే ఒప్పుకున్నారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం టివిసిసి చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3016/- పింఛను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పారు. ఒక్క పెన్షన్ నే కాకుండా అనేక సహాయ ఉపకరణాల సైతం ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. సబ్సిడీ రుణాలను ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో 2018 లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి ని పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేశారని ఎద్దేవా చేశారు.అభివృద్ధి చేయడం చేతకాక ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్న అతను రాజీనామా చేసి తిరిగి అదే పార్టీ నుండి పోటీ చేయకుండా మళ్లీ మరొక ప్రతిపక్ష ఎమ్మెల్యే గా పోటీచేస్తుండడం విడ్డూరమన్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని మీ మీ ఓట్లన్నీ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాడుగుల దశరథ, గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కల వెంకటేష్, వికలాంగుల ప్రతినిధులు లక్ష్మయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఔదార్యం.పాఠశాలకు విరాళం అందజేత

ఇల్లంతకుంట:నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కుర్ గ్రామంలో తాము చదువుకున్న పాఠశాల మరమత్తులు మరియు అభివృద్ధి కోసం 1997-98 బ్యాచ్ కీ చెందిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకీ రూపాయలు 13000/-మరీయు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకీ రూపాయలు 15000/- ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 1997-98 చెందిన పూర్వ విద్యార్థులు బతిని విప్లవ్,సిద్దం మహేందర్ మరియు కందికట్కుర్ గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,ఎంపీటీసీదొమ్మటి కిషోర్ గౌడ్, స్కూల్ ఛైర్మన్ లు బుర్ల శ్యామల, రంగు రజిని,మరియు ఎఏంసి డైరెక్టర్ పొన్నం శేఖర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి,కో అప్షన్ మెంబర్ చెన్న లక్షయ్యా,హెడ్మాస్టర్ లు శ్రీనివాస్,లక్ష్మినారాయణ, మరియు వర్డ్ మెంబర్ లతకిరణ్,రోషల్,సావనపెల్లి పర్శరం,ఐలయ్య,కమలాకర్ ఎల్లయ్య,ప్రశాంత్,వేణు తదితులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 5000/- రూపాయలు పాఠశాల అభివృద్ధి కోసం విరాళం చేసిన 1997-98 బ్యాచ్ కీ చెందినా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

టపాసుల మోతకు వేళాయె..

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

దీపావళి పండుగ ఎంత కాంతిని ఇస్తుందో ఒక్కసారి అంతే విషాదాన్ని కూడా నింపుతుంది. ఇంటిల్లిపాది ఆనంద ఉత్సహల మధ్య జరుపుకునే పండుగ రోజు ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. 24న జరగనున్న పండగ సందర్భంగా బాణాసంచా పేలి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

అనుమతి తప్పనిసరి సిఐ చంద్రశేఖర్ రెడ్డి.

హనుమతులు లేకుంటే షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు పోలీస్ నిబంధనలు కఠిన తరం విక్రయదారులు జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే భారీ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం నాణ్యమైన టపాసులు విక్రయించాలని అనుమతి లేకపోతే చర్యలు తీసుకుంటాం.

నాణ్యమైన బాణాసంచా మాత్రమే కాల్చాలి. మందు గుండు సామాగ్రి ఇంట్లో నిల్వ ఉంచకూడదు. టపాసులు కాల్చేటప్పుడు బదులుగా ఉన్న కాటన్, నూన్ దుస్తులు ధరించాలి. కాళ్లకు పాదరక్షలు వేసుకోవాలి. బకెట్ నీళ్లు ఇసుక పక్కన ఉంచుకోవాలి కళ్ళలో మందు గుండు రేణువులు పడకుండా కళ్లద్దాలు ధరించాలి. రాకెట్లు, చిచ్చుబుడ్లు, వంటి వాటిని విశాలమైన ప్రాంతంలో మాత్రమే కాల్చాలి. ఇల్లు వాహనాలు జనావాసాల వద్ద విద్యుత్ తీగలు పెట్రోల్ బంకుల సమీపంలో కాల్చరాదు.

అనుమతి లేకపోతే చర్యలు అమర్నాథ్ గౌడ్ ఎస్ ఎఫ్ ఓ మెదక్.

మెదక్ జిల్లాలో మొత్తం టపాసుల దుకాణాలు 56 పర్మిషన్ ఉన్నాయి. టపాసుల దుకాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి షాపు ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అనుమతులు లేకుండా షాపులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అతిద్వనులు వచ్చే బాణసంచా కాల్చవద్దు సాధారణంగా 60 నుంచి 80 డేసి బుల్స్ ధ్వనితో ఇబ్బంది ఉండదు. 120 డిసిబుల్స్ దాటితే నొప్పి వస్తుంది. అతి ధ్వనులతో కర్ణభేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అధిక పొగ వెలువడే వాటితో ముక్కుకు ప్రమాదం తప్పదు. రసాయన పొగ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

వ్యాపారులు పాటించాల్సినవి తాసిల్దార్ అబ్దుల్ మనోన్.

రెండు దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలి దుకాణాల్లో సిగరెట్టు బీడీ తాగొద్దు విక్రయించవద్దు ప్రతి దుకాణం వద్ద బకెట్లలో ఇసుక రెండు లీటర్ల నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి దుకాణంపై జింక్ లేదా సిమెంట్ రేకులను మాత్రమే వాడాలి టపాసులు గోడకు మీటరు దూరం నుంచి నిల్వ చేయాలి ఫైర్ సేఫ్టీ విద్యుత్ పరికరాలు వాడాలి షాపులో దీపాలు వెలిగించొద్దు కిరోసిన్ డీజిల్ వినియోగించద్దు.

17వ పోలీస్ బెటాలియన్ లో పాఠశాల విద్యార్థులకోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రతినిధి నేటిధాత్రి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా

ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ నందు పోలీస్ ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ శ్రీ కె.సుబ్రమణ్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన ఆయుధములు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల గురించి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పార్థసారథి రెడ్డి , ఆర్.ఐ లు పి.నారాయణ ,డి.శంకర్ , పి.రాజేందర్ , శ్రీ బి. శ్రీధర్ , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.

సైబర్ నేరాల పట్ల రామయంపేట లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

రామాయంపేట పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాల లో షీ టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రామాయంపేట ఎస్సై రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు కచ్చితంగా సైబర్ నేరాలు మోసాలు పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన తమకు సమాచారం ఇవ్వాలని వివరాలు చెప్పిన వారి పేర్లు గోపియంగా ఉంచుతామన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం కానిస్టేబుల్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version