ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ ఆఫీసర్
కె.ఫ్లోరెన్స్.
చెన్నారావుపేట-నేటిధాత్రి:
మండలం లోని లింగగిరి ప్రాధమిక పాఠశాలను తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్ సందర్శించడం జరిగింది.ఈ సందర్శన లో విద్యార్థుల హాజరు ఉపాద్యాయుల హాజరు వివరాలను మధ్యాహ్నం భోజనం ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ మాట్లాడుతూ తరగతి గధిలో ఉపాధ్యాయులు విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో బోధన అందించాలి అన్నారు ఉపాధ్యా యులు అందరూ విధిగా లెస్సన్ ప్లాన్ ,యూనిట్ ప్లాన్,ఇయర్ ప్లాన్ లతో భోదన కొనసాగించాలి.విద్యార్థుల అభ్యసన ప్రగతి ని స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ యాప్ లోనమోదు చేయాలి అని తెలిపారు. తదితర అంశాలపై చర్చించారు.తొలిమెట్టు కార్యక్రమం ను ఉపాద్యా యులువిజయవంతం చేయాలని కోరారు. ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సరళ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్,ఉపాధ్యాయులు చంద్రభాను రాజు,జయశ్రీ, శారదా,శాంటా కుమారి , అటెండర్ రహిమత్ మెసెంజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.