ప్రొ. జి.ఎన్ .సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్ఠు తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను రద్దుచేయాలి.

ఉమ్మడీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ 90శాతం వికలాంగుడైన ఢిల్లీ

యూనివర్సిటీ ప్రొఫేసర్ సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్టు తీర్పు నిలుపుదలకై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపి తదనంతరం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మెమోరాండం

సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య,వి-జాక్ సభ్యులు మరియు అంధనిరుద్యోగులైన

బి.ధనుంజయ్ ,ప్రవీణ్ కుమార్ ,మహేందర్ ,వీరన్న ,నర్సింహా,దిలీప్ ,మహేశ్వరి,అశ్విని,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా తదితరులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేనిన తీర్పుపై సుప్రీం కోర్టు “స్టే” ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్దమని ,వెంటనే బాంబే హైకోర్టు నిర్ధోషులుగా పేర్కొని ప్రకటించిన వారందరిని బేషరతుగా విడుదల చేయాలనీ ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

న్యాయ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాంగంలో భాగం కావడం వల్లనే కుట్రపూరితంగా కక్ష గట్టి ఆగమేఘాలపై తీర్పులు ఇవ్వడం అప్రజాస్వామికం అన్నారు.

ఇప్పటికైనా వెంటనే సుప్రీంకోర్టు మరోసారి నిష్పక్ష పాతంగా పరిశీలించి సాయిబాబాతో పాటు మిగతా నలుగురు ఆదివాసులను విడుదల చేసి

న్యాయ వ్యవస్థ పరువు కాపాడాలని ఉద్భోదించారు.

అక్షర యోధుడికి కన్నీటి నివాళి..

వేములవాడ:ప్రతినిధి నేటిధాత్రి 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం నవ తెలంగాణ సీనియర్ రిపోర్టర్ వినోద్ అన్నకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వినోద్ అన్న ఆయన కథనాలతో విశేషమైన ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. వార్తల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్న అన్న వివరించి చెప్పేవాడు, అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు.. టీయూడబ్ల్యూజేహెచ్143 పక్షాన వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని పెద్దదిగా ఉండి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. ఆయన వార్త కథనాలు తోటి జర్నలిస్టులకు స్ఫూర్తి. వినోదన్న కలం యోధుడని కొనియాడారు .ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి పాశం, మహమ్మద్ రఫీ, సయ్యద్ అలీ ,ఒడియాల వేణు, సిహెచ్ దేవరాజ్, దూస రాజేందర్, ఎస్ వేణు, సంటి రాజేందర్, బండి రజనీకాంత్, సాయి, బండి శ్రీకాంత్, అసీం, వెంకటేష్, షబ్బీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలి

బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను వెంటనే తగ్గించాలి. -లేకుంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడిస్తాం.

-హన్మకొండ అంబేద్కర్ సెంటర్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.

-ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్ డిమాండ్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి:

ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా

ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

 ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ మాట్లాడుతూ

పెంచిన ఇంజనీరింగ్ మరియు వృత్తి విద్యా కోర్సుల ఫీజు పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని,

తెలంగాణ రాష్టంలో ఇంజనీరింగ్, ఫార్మసీ,న్యాయ విద్య మరియు వృత్తి విద్యా కోర్సుల ఫీజు పెంపు 

రాష్ట్రంలో మొత్తం 159 ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులలో ఫీజుల మోత కనిష్టంగా 45,000 లుగా ,గరిష్టంగా 1,60,000 లుగా ప్రభుత్వం పెంచి నిర్ణయించడం జరిగిందని,

ఇందులో ఎంజీఐటి 1.8 లక్షల నుండి 1.60 లక్షల,సీవీఆర్ 1.5 నుండి 1.50 లక్షల వరకు సీబీఐటీ 1.34 నుండి 1.40 లక్షల వరకు వాసవి 1.30 నుండి 1.40 లక్షల వరకు వర్ధమాన 1.25 నుండి 1.40 లక్షల వరకు అనురాగ్ 1.25 నుండి 1.35 లక్షల వరకు ఇలా రాష్ట్రములో ఉన్న మొత్తం కళాశాలలో లక్షకుపై ఫీజులు ఉన్న కళాశాలలు 40 కి పైగా ఉన్నాయన్నారు.గత సంవత్సరం 

కరోనాతో పేద,మధ్యతరగతి కుటుంబాలు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డారు.పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే కుట్ర ప్రభుత్వం చేస్తున్నదని, విద్యార్థులకు స్కాలర్షిప్స్ , ఫీజురీ యింబర్సుమెంట్ పెంచకుండా, ప్రయివేట్ కళాశాలలకు ఫీజులు పెంచుకునేందుకు ఫీ రెగ్యూలేషన్ కమిటీ రెడ్ కార్పెట్ వేసి పెంచుకోమని పరోక్షంగా మద్దతు తెల్పినది.”బి “కేటగిరి సీట్లను ఇష్టం వచ్చిన ఫీజులకు అమ్ముకుంటున్నారు. గతంలో ఉన్న ఫీజులనే కొనసాగించాలి.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్ యాదవ్,జిల్లా సహాయ కార్యదర్శి కాసరబోయిన రవితేజ, 

జిల్లా సమితి సభ్యులు కొయ్యడ కుశల్ , ఎం.రాజు గౌడ్ , శృతి ,సౌందర్య ,వినీత, రాజు, కమల్ ,స్రవంతి, అనురాధ, అనిత, సునీత లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

హైకోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (AGP)గా మన ములుగుజిల్లా వాసి

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది(AGP)గా ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ వాస్తవ్యులు మేకల గౌతమ్ కుమార్ గారు నియామకం అయ్యారు. వీరిని ప్రభుత్వం హోం శాఖ న్యాయ వ్యవహారాల్లో AGPగా నియమించింది. పేద దళిత కుటుంబంలో పుట్టి బాల్యం నుంచి చదువుల్లో చురుకుగా ఉండే గౌతమ్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2007 నుండి 2012 వరకు న్యాయశాస్త్రంలో LLB మరియు మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాలో విద్యార్థి సంఘం నాయకుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు. హైకోర్టులో న్యాయవాదిగా అనేక మంది ప్రశంసలు పొందారు. గౌతమ్ కుమార్ సేవలను, కృషిని గుర్తించిన ప్రభుత్వం హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది(AGP)గా నియమించింది. AGPగా గౌతమ్ కుమార్ నియామకం సందర్భంగా ములుగు జిల్లా ప్రజలు, ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు,మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా AGP మేకల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నా తల్లిదండ్రులు ఎంతో పేదరికాన్ని అనుభవించి కష్టపడి చదివించడం ద్వారా నేను ఈ స్థాయికి వచ్చానని నా తల్లిదండ్రుల రుణం ఎప్పటికి తీర్చుకోలేనని అన్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యులకు ప్రణామములు తెలుపుతూ అభినందించిన గ్రామస్థులకు, పెద్దలకు, బంధుమిత్రులకు, జిల్లావాసులకు, శ్రేయోభిలాషులకు, ఉస్మానియా విద్యార్థిలోకానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ న్యాయం, ధర్మం కోసం తను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.

గోపా రాష్ట్ర కార్యదర్శిని పరామర్శించిన రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట ఆర్ బీ డీఈ గోపా రాష్ట్ర కార్యదర్శి కల్లెపు కిరణ్ గౌడ్ తండ్రి కల్లెపు సమ్మయ్య గౌడ్ అనారోగ్యంతో ఈనెల 10న మరణించారు. కిరణ్ గౌడ్ స్వగృహంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ అధ్వర్యంలో సమ్మయ్య గౌడ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జిఓస్ రాష్ట్ర కార్యదర్శి కోల రాజేష్ గౌడ్, వరంగల్, హనంకొండ గోపా నాయకులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్, బొమ్మేర కుమార్ గౌడ్, తాళ్లపెల్లి సురేష్ గౌడ్, ఆర్. సుధాకర్ గౌడ్, టీ. ప్రకాష్ గౌడ్, పి. మోహన్ గౌడ్, డాక్టర్ తాళ్ల రవిగౌడ్, డాక్టర్ బీ. లష్మినారాయణ గౌడ్,తాబేటీ వెంకన్న గౌడ్, చెల్లమల్ల సత్యనారాయణ గౌడ్, బత్తిని వీరభద్రయ్య గౌడ్, టీ. రమేష్ గౌడ్,ఎన్. లింగమూర్తి గౌడ్,వి.రాజు గౌడ్, ఉపేందర్ గౌడ్, జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుల విధానాలతో ఆగమ్యగోచరంగా మారిన రైతుల పరిస్థితి

తేదీల వారీగా ఏ ఓ కార్యాలయాల్లో వినతులు

ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల విధానాల్లో భాగంగా పెరిగిన పంటల ఉత్పత్తి ఖర్చులతో అధిక వర్షాలతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని దీంతో ఏదో ఒక చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ‌ ఈనెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటల సందర్శనలు జరిపి రైతాంగ సమస్యలపై స్థానిక వ్యవసాయ శాఖ ఏవోలకు 28 29 తేదీల్లో, జేడీలకు ఉన్నతాధికారులకు 31వ తేదీన వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.

  ఈరోజు అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకెఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య అధ్యక్షతన పట్టణంలోని ఓంకార్ భవన్ లో నిర్వహించారు.

  ఈసందర్బంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని బహిరంగంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో దొడ్డిదారిన అమలుకు కోరుకుంటున్నారని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పీఎం ప్రణామ్ పేరిట ఎరువుల సబ్సిడీని ఎత్తివేసేందుకు విధానాల రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మార్కెట్ దోపిడిని విస్తృతపరిచేందుకు కార్పొరేట్ శక్తులకు మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈసమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లేపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగతి సాంబయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి, రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య, రాష్ట్ర నాయకులు సుధీర్, మానయ్య, సింగతి మల్లికార్జున్, నాగేల్లి కొమురయ్య, వరికెల కిషన్, అంజయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్టు వినోద్ రావ్ చిత్రపటానికి ఘన నివాళులు

తంగళ్ళపల్లి నేటిధాత్రి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిన్నటి రోజున అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ నవ తెలంగాణ రిపోర్టర్ కారంగుల వినోద్ రావ్ కు ఘన  నివాళులు అర్పించి, మౌనం పాటించిన విలేఖర్లు. ఈ సందర్భంగా వారు వినోద్ రావ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతుల అంజనేయులు, ఉపాధ్యక్షుడు సిరిపాక ప్రణయ్, ప్రధాన కార్యదర్శి రంగు శ్యామ్, సహాయ కార్యదర్శి దుబ్బాక రాజు, గౌరవ సలహాదారులు పిల్లి శ్రీనివాస్, సామల గట్టు, వెంగల శ్రీనివాస్, క్లబ్ సభ్యులు గుగ్గిల్ల పరమేష్, బర్ల బాలు ఉన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో దళితులను చిన్న చూపు చూస్తున్నవైనం…తెలంగాణ దళిత సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్

ఇల్లంతకుంట:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలములోని దళితులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ నాయకులకు కాదు,ప్రజల పట్ల అధికారుల తీరు మార్చుకోవాలని కోరుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.రెవెన్యూ శాఖలో పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.ఎన్ని ప్రభుత్వాలు మారిన దళితులను చిన్న చూపు చూస్తూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే విధంగా తిప్పుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులకు,పైరవీలు చేసే వారికి మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారు,తప్ప దళిత సామాజిక వర్గం నుండి ఎవ్వరూ వెళ్లిన కూడా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.రెవెన్యూశాఖలో అయితే చెప్పనక్కర్లేదు ఎందుకంటే నిరంతర ప్రక్రియ,భూముల విషయంలో గత దశాబ్దాకాలంగా పెండింగ్ పలు అంశాలు వారి దృష్టికి తీసుకువెళ్లిన ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం అని కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్న రసమయి.మండల కాంగ్రెస్ అద్యక్షుడుపసుల వెంకటి

ఇల్లంతకుంట : నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే రసమయి బాలకిషన్ మానకొండూరు ప్రజల ఓట్లతో గెలిచి మానకొండూరుకు ఏమి చేయలేని నీవు మునుగోడు నియోజకవర్గంలో మానకొండూరు ప్రజల డబ్బును రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తానని తప్పుడు మాటలు చెప్పే నాయకుడా అంటూ మండల కాంగ్రెస్ అద్యక్షుడు పసుల వెంకటి విమర్శించారు.ఇక్కడ ప్రజలు వేసిన ఓట్లు కాదా మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రజలను మరిచిపోయి 170 గజాల జాగా ఉన్న వ్యక్తికి మానకొండూరు ప్రజలు పెట్టిన బిక్షతో వందల ఎకరాల భూమి సంపాదించి నాలుగైదు ఇల్లు కట్టుకొని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సంపాదించి మానకొండూర్ ప్రజల సొమ్ముతో తిరుగుతూ ఈ నియోజకవర్గ ప్రజలను మరచి ఎక్కడో ఉపఎన్నిక వచ్చిన మునుగోడు నియోజకవర్గం ప్రజలకు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి చేస్తామని అనడం అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టు ఉన్నది నీ వ్యవహారం ఇకనైనా మానకొండూరు ప్రజలు గ్రహించాలి.ఇటువంటి ఎమ్మెల్యేలను మనం ఎందుకు ఎన్నుకున్నాను అని ఇప్పుడు బాధ పడుతున్నారు.రాబోయే రోజుల్లో అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే వలస ఎమ్మెల్యేలను తరిమి తరిమి కొట్టాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు.ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవహారం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త భవిష్యత్తులో ఇటువంటి నాయకులను నమ్మి మోసపోవద్దని పసుల వెంకటి ఒక ప్రకటనలో తెలిపారు.రాబోయే రోజుల్లో గడీల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు అని తెలుపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అల్లెపు రజనీకాంత్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమాల్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరణించిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మొగుళ్ళ పల్లి నేటిధాత్రి 

మండల కేంద్రానికి చెందిన చిన్ననాటి మిత్రుడు మాతో కలసి చదువుకున్న స్నేహితుడు మండల కేంద్రానికి చెందిన ఎమ్. డి. హిమావలి కుమారుడు ఎమ్.డి. రజాక్ గారు అనారోగ్యంతో ఇటీవల మరణించగా . అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ చిన్ననాటి నుంచి కలసి ఉన్న స్నేహితులం ఆయన కుటుంబానికి 1985-86వ పదవ తరగతి బ్యాచ్ 24.000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో చుక్క బాలరాజు, గుత్తికొండ నారాయణ, పులి వెంకట్ రెడ్డి, , పుల్ల మల్లయ్య, ఎమ్. డి.రఫీక్ జన్ను నర్సింహ స్వామి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు కలెక్టర్ కె.శశాంక

 

మహబూబాబాద్,నేటిధాత్రి:

రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-

2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.8శాతం తేమ కలిగిన రకానికి క్వింటాలుకు 6380/- రూపాయలు కనీస మద్దత్తు ధర లభించనుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా చూడాలని,అవసరమైన తేమ శాతం నిర్ధారణ,తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు.ప్రతి కేంద్రం వద్ద రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.నాణ్యత ప్రమాణాలను,తేమశాతాన్ని పాటించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.తూనికలు, కొలతలు శాఖ ద్వారా జిన్నింగ్ మిల్లుల తూకపు మిషన్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు.

పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 5 జిన్నింగ్ మిల్లులు, రోజుకు 1250 బేళ్ళ సామర్థ్యం కలవి ఉన్నాయనీ,కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా పత్తికి కనీస మద్దతు ధర, వానాకాలం 2022-23 నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన 

పోస్టర్ ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, 

జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి,సి.సి. ఐ. అధికారి 

ఎం.ఉమామహేశ్వర

రావు,ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి ఎం. లక్ష్మినారాయణ,ఆర్.టి.ఓ. రమేష్ రాథోడ్,అగ్నిమాపక శాఖ అధికారి డి.నాగేశ్వరరావు, లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్ కుమార్, డి.ఎస్.పి. డి.రమణ , తొర్రూరు, మహబూబాబాద్ ఎ.ఎం.సి.చైర్మన్లు పి.శాంత, బి.ఉమ ,కార్యదర్శులు ఎన్.రాజ,

జి.రాజేందర్,జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.జనార్ధన్,రవికిరణ్,

తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెం ఏరియా లోని 37 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ రామవరం లోని 37 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ను సందర్శించినారు. అలాగే రాబోయే రోజుల్లో 2 సోలార్ పవర్ ప్లాంట్స్ క్రొత్త ప్రొజెక్ట్స్ ఉన్నాయి. వాటి సైట్స్ ను కూడా సందర్శించినారు. వాటి కెపాసిటీ ఒకటి 10.5 మెగా వాట్స్ మరియు రెండవది 22.5 మెగా వాట్స్. అవి ఎరెక్షన్ అయి ఒక సంవస్తారము లోపు జనరేషన్ లోకి వస్తాయని జి.ఎం. జక్కం రమేశ్ తెలియ జేసినారు.

 ఈ కార్యక్రమములో కొత్తగూడెం ఏరియా జి.ఎం. జక్కం రమేశ్ , ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి, డి.వై.(ఎస్.ఈ) ఏరియా వర్క్ షాప్ శంకర్ మరియు ఓ & ఎం. ఇంచార్జ్ ఇంజనీర్ ఆదాని గారు పాల్గొన్నారు.

డిజి‌ఎం పర్సనల్, కొత్తగూడెం ఏరియా

ఆదివాసీ ఉద్యమాల వేగుచుక్క కొమురం భీం. -ఎన్నాం వెంకటేశ్వర్లు.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి:

పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం అని హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యులు ఎన్నము వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యుడు దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తను మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు అని అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తునదని బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నదని అన్నారు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించారని, ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోతు రమ మరియు దుర్గ పాల్గొని కొమురం భీమ్ చిత్ర పటానికి పూల మల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు కళ్యాణ్, గౌతమి, సరిత, సుదర్శన్, పిటలి, లక్ష్మీ, విజయ, హరిష, పాశ, సలేమ, సమక్క, హైమ, సురభి, రజిత, తదితరులు పాల్గొన్నారు.

సెలవు రోజుల్లో కాంటాలు

కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన కూడా ట్రేడర్లు నడుచుకోకవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇటీవల సేమ్ డే సేమ్ చెక్ సమస్య మరిచిపోక ముందే ఇలాంటి ఘటనలు జరగడం మార్కెట్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉంటుందని పలువురు బహిరంగనే విమర్శిస్తున్నారు.

పోచారం డ్యాం లో చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి….

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది….

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి….

కొల్చారం ( మెదక్ )నేటి ధాత్రి :

తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె .సి.ఆర్. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఉద్దేశ్యంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం పోచారం ప్రాజెక్ట్ లో 6 లక్షల 28 వేల రొయ్యలు , 12 లక్షల 48 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య కారుల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ,సహాకారాలు అందిస్తు ఉచితంగా చేప పిల్లలను కట్ల,రవ్వు, బొచ్చ వంటి పెంపకానికి అనువుగా ఉన్న చేప పిల్లలను అందజేస్తున్నదని అన్నారు. రాబోయే కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనోత్త్పత్తి చేసి ఇక్కడే చేప పిల్లలను చెరువులో వదులుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.

గతంలో మత్స్య సంపంద అంటే ఆంధ్రా లోనే ఉండేదన్న భావన ఉండేదని, కాని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసి వర్షపు నీటిని ఒడిసి పట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపడం, వాటిలో ఉచితంగా చేప పిల్లలను,రొయ్యలను వదలడం ద్వారా మత్స్య సంపదను పెంచి చరిత్రను తిరగ రాశారని అన్నారు. సంపదను సృష్టించి అందరు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, కాబట్టి ఆయా చెరువుల పరిధిలో ఉన్న బెస్తవారు, ముదిరాజ్ లు, నూతనంగా మత్స్య సహాకార సంఘాలు ఏర్పాటు చేసుకొని చేపపిల్లల పెంపకంలో ముందుండాలని అభిలషించారు. 

జిల్లాలో ఘనపూర్, కొంటూర్ , హల్దీ వాగు వంటి చెరువులతో పాటు చెక్ డ్యామ్ లు ఉన్న దగ్గర 5 కోట్ల 4 లక్షల చేప చేప పిల్లలను పెంచడం జరుగుతున్నదని అన్నారు. ఒకప్పుడు చేపలు కనబడని తెలంగాణాలో నేడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికంగా చేపలు ఆహారంగా తీసుకొంటున్నారని, ఇది మత్స్యకారుల అభివృద్ధికి ఊతం ఇస్తున్నదని అన్నారు.  

 ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు రజిని, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య విలువలుపెంచిన నేత ఓంకార్

ఘనంగా అసెంబ్లీ టైగర్ ఓంకార్ వర్ధంతి

నర్సంపేట,నేటిధాత్రి :

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలుపెంచిన నేత మద్దికాయాల ఓంకార్ అని ఎంసిపిఐ యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అన్నారు. ఎంసిపిఐ యు పార్టీ అధినేత దివంగత మాజీ ఎమ్మెల్యే ఓంకార్ 14 వ వర్ధంతి పక్షోత్సవాలలో భాగంగా శనివారం దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో తడుక కౌసల్య అధ్యక్షతన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల రూపశిల్పి,అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్దికాయల ఓంకార్ తన రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్య విలువలను పెంచిన మార్క్సిస్ట్ నేతగా ఎదిగారని, రాజకీయ శిక్షణ తరగతులలో ఉపాధ్యాయునిగా బోధిస్తున్న సమయంలో భారత రాజ్యాంగ ప్రాధాన్యతను, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను కార్యకర్తలకు లిఖితపూర్వకంగా నోట్ పుస్తకాలలో వ్రాయించి వివరించే వారని, తద్వారా ప్రతి కార్యకర్త తన హక్కులను విధులను గురించి అవగాహన చేసుకొని, బూర్జువా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలలో కార్యకర్తలు ప్రజలు ఓంకార్ గారికి మద్దతుగా నిలిచే వారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, గోనె సుదర్శన్ రెడ్డి, ఎలకంటి చిన్న ఎల్లయ్య, నాగేల్లి భాస్కర్, కౌసల్య, కృష్ణవేణి, దండు చిన్న సారయ్య తదితరులు పాల్గొన్నారు.

హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీం. 

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య.

చిట్యాల. నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో కొమురం భీం జయంతి సందర్భంగా ఆ మహానీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా తెలపడం జరిగిందన్నారు,అనంతరం ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ ఆదివాసుల ఆరాద్య దైవమైన అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గొప్ప యోధుడు కొమురం భీం అని అన్నారు. ఆ మహానీయుని సేవలు మరువలేనివన్నారు.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని మల్లయ్య కోరారు. 

         ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, ఎమ్మార్పీఎస్ టి ఎస్ మండల అధ్యక్షుడు అల్లకొండ.కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సరిగొమ్ముల రాజేందర్,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మారేపల్లి మల్లేష్ మారేపల్లి మల్లేష్ మహేందర్ గురుకుంట్ల కిరణ్ కనకం తిరుపతి గుర్రపు.రాజమౌళి మొలుగూరి రాకేష్ మైదం మహేష్, ఆరేపల్లి రాము శనిగరపు శ్రీను, శనిగరపు మహేష్,

తెరాస పార్టీ లో కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు చేరిక

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల సీతంపేట కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు కొండ చంద్రశేఖర్ తెరాస పార్టీ లో చేరారు పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కండువ కప్పి తెరాస పార్టీ లోకి ఆహ్వానించడం జరిగిందీ కొండ చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణా లో 2024 అధికారం లోకి వచ్చేది తెరాస పార్టీ నే అనీ మన మంథని ప్రాంతం అభివృద్ది చెందాలంటే పుట్ట మధన్నా ఎమ్మెల్యే గా గెలవాలని కోరుకుంటూ తెరాస పార్టీ లో చేరుతున్ననని మధన్న గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య సీతంపేట సర్పంచ్ నగేష్ యూత్ అధ్యక్షుడు లక్కెపురం నరేష్ , మాజీ గ్రామ అధ్యక్షులు రాపెల్లి మల్లేష్ పాల్గొన్నారు

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిలో ఒంటరిగా

వున్నవారికి చంపుతామని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడుని సిసిఎస్ మరియు లింగాలఘనపూర్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు.

 ముఠాలోని మిగితా ఏడుగురు సభ్యులు సోను, బడేబాయి, తారీఫ్, నిస్సారుద్దీన్,

రాహుల్ తో పాటు పేర్లు తెలియని మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో వున్నారు.

అరెస్ట్ చేసిన నిందితుడి నుండి మూడు లక్షల పదివేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలతో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు చిక్కిన నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం , బదాయున్ జిల్లాకు చెందిన ఫర్మాన్ ఖాన్ (వయస్సు 22) ముంబైలో పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇదే సమయంలో డబ్బు కోసం స్థానికంగా వుండే మరో నిందితుడితో కలసి ట్రాక్టర్ బ్యాటరీలను చోరీ చేసిన సంఘటనలో జైలుకు వెళ్ళాడు. నిందితుడు ఫర్మాన్ ఖాన్ జైలు నుండి విడుదలైన తరువాత ముఠాలోని సభ్యుడు తారీఫ్ సూచన మేరకు వరంగల్ లో రెడ్డిపాలెంలో నివాసం వుంటున్న మిగితా నిందితులను కలుసుకున్నాడు. నిందితులందరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం గతంలో ఈ ముఠాలోని నిందితుడు సోనుసింగ్ గతంలో పత్తి మిల్లులో పనిచేయడంతో వరంగల్ జిల్లాలోని గ్రామలపై అవగాహన కలిగివున్నాడు. దీనితొ గ్రామాల్లో ఒంటరిగా వున్న మహిళలను చంపుతామని బెదిరించి బంగారం, డబ్బు దోచుకోవడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని ముఠా సభ్యుడు సోనుసింగ్ ఆలోచన మేరకు ఈ ముఠా తమ వద్ద ఉన్న అంబాసిడర్ కారులో వరంగల్ మరియు చుట్టప్రక్కల జిల్లాల్లో రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా ముఠా సభ్యులు గత నెల 23వ తారీఖున సాయంత్రం సమయంలో కారులో హనుమకొండ – హైదరాబాద్ ప్రధాన మార్గంలో రెక్కీ నిర్వహించారు. నిందితులకు లింగాలఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లుట్ల గ్రామంలో మహిళ ఒంటిరిగా వున్న ఇంటిలో చోరబడి సదరు మహిళను చంపుతామని బెదిరించి బీరువాలోని 250గ్రాముల బంగారు అభరణాలతో పాటు, 70వేల రూపాయల నగదు, ఏటియం కార్డులను చోరీ చేసి ఈ ముఠా తిరిగి వరంగల్ రెడ్డిపాలెంలో నివాసం వుంటున్న ఇంటికి చేరుకున్నారు. కొద్ది రోజుల అనంతరం ఈ ముఠా సభ్యులు ఇదే రీతిలో ఆదోనీ, నారాయణపేట జిల్లాల్లో కుడా దోపిడీలకు పాల్పడ్డారు.

దోపీడీల అనంతరం ఈ ముఠా చోరీ చేసిన సోత్తులో కొంత బంగారం, డబ్బును ప్రధాన నిందితుడు సోనుసింగ్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా సభ్యుడు ఫర్మాన్ ఖాన్ కు ముట్టజెప్పడంతో నిందితులు వారివారి స్వగ్రామాలకు తిరిగి వెళ్ళారు.

ఈ నెల్లుట్లలో జరిగిన దోపీడీ ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు క్రైమ్స్ అదనపు డిపిపి పుష్పా అదేశాల మేరకు సిసిఎస్ మరియు లింగాలఘన్ పూర్ పోలీసులు సంయుక్తంగా కలసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన పోలీసులు ఈ ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా నిందితులు తిరిగి వరంగల్ నగరంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంలో శనివారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ లో ముఠా సభ్యులకై ఆరా తీస్తుండగా, పోలీసుల చూసి పారిపోవుటకు ప్రయత్నించిన నిందితుడు ఫర్మాన్ ఖాన్ ను పోలీసులు పట్టుకోని అతనిని తనీఖీ చేయడంతో నిందితుడి బంగారు అభరణాలు గుర్తించిన పోలీసులు నిందితుడిని విచారించగా నిందితుడు ముఠాతో పాల్పడిన దోపీడీని అంగీకరించాడు.

ఈ దోపిడీ దొంగల ముఠా సభ్యుడుని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఏసిపి క్రైమ్స్ డేవిడ్ రాజు, సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్ రావు, లింగాలఘన్ పూర్ ఇన్స్ స్పెక్టర్ సంతోష్, సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఏఏఓలు సల్మాన్‌పాషా, ప్రశాంత్ సిసిఎస్ ఎస్.ఐలు రాజేందర్,యాదగిరి, లింగాలఘనపూర్ ఎస్.ఐ రఘుపతి, ఏఎస్ఇ వీరస్వామి, తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్ళు సదయ్య, రవికుమార్, మహమ్మద్ éలీ, జంపయ్య, కానిస్టేబుళ్ళు విశ్వేశ్వర్, చంద్రశేకర్, వంశీ,లింగాలఘనపూర్ కానిస్టేబుల్ భాస్కర్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ పత్రికా సమావేశంలో అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు శాపంగా మారనున్న ఇంజనీరింగ్ ఫీజుల పెంపు

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు

చేర్యాల నేటిధాత్రి..

తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు వేలాదిమంది ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి వారికి అనుకూలంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందని ఈ ఫీజుల పెంపు విద్యార్థులకు శాపంగా మారనుందని ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు 

ఈ సందర్భంగా పుల్లని వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచేందుకు జీవో ఉత్తర్వులు జారీ చేయడం అందులో దాదాపు 40 కళాశాలలో లక్షకు పైగా ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇవ్వడం సరికాదని చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేవని, నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలలు పుట్టగొడుగుల ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని కళాశాలల్లో కూడా ఫీజులు పెంచారని ఈ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కరోనా కష్ట కాలంనుండి విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఇప్పుడు ఫీజుల పెంపు వల్ల పై భారీగా ఆర్థిక బారం పడనుందని 2019 నుండి ఉన్న ఫీజులనే తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంకి ఫీజుల పెంపు మీద ఉన్న శ్రద్ధ ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలు పెంచడంపై అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడంపై లేదని చాలా కళాశాలల్లో పెరిగిన ఫీజు కడితేనే విద్యార్థులకు సీటు కన్ఫర్మేషన్ అయ్యే పరిస్థితి ఉందని ఓ పక్క ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చాలా కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరాలంటే పూర్తిస్థాయి ఫీజు కట్టాలని యాజమాన్యాల విద్యార్థులకు చెపుతున్నాయని చాలా కళాశాలల్లో డొనేషన్ ఫీజు పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల వారికి వత్తాసు పలుకుతూన్నారని వెంటనే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో ఉన్నత విద్యామండలి,విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version