చేర్యాల నేటిధాత్రి
తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గా చేర్యాల మండల కేంద్రానికి చెందిన బండకింది అరుణ్ కుమార్ ను యాదగిరిగుట్ట లో ఈ నెల 19నుండి 21 వరకు జరిగిన సంఘం రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ శనివారం తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని కల్లు గీత కార్మికులకు,గౌడ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ జిల్లాలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొన్ని సవత్సరాలుగా అనేక పోరాటాలు,ఉద్యమాలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో సంఘాన్ని బలోపేతం చేస్తూ కల్లు గీత వృత్తి రక్షణ,సమస్యల పరిష్కారం కోసం కార్మికులను ఏకం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు