ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ లకు 7శాతం రిజర్వేషన్ సరిపోదని పెరిగిన జనాభా ధామాషా ప్రకారం 12 శాతానికి పెంచి రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.తదుపరి మాదిగ ల లక్ష్యసాదనలో భాగంగా జులై 6న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి పాల్గొంటున్నారని ఎంహెచ్ పిఎస్ నాయకులు,మాదిగ జెఏసి నాయకులు తప్పనిసరిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.