యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటి ధాత్రి
టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు వైన్స్ షాపుల యజమాన్యం సిండికేట్ గా ఏర్పడి ఒక షాపు బెల్టు షాపులకు మందు సరఫరా చేయడానికి మరొక షాపు సిట్టింగ్ రూము ప్రజలకు అమ్మడానికి ఉపయోగిస్తూ ఒక క్వార్టర్ పై 20 రూపాయలు బీరుపై 20 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు బెల్ట్ షాపులకు అమ్ముతూ బెల్టు షాప్ లు మరో 20 రూపాయలు పెంచి అమ్ముతూ సామాన్య ప్రజలను దోసుకుంటున్నారు మోసం చేస్తూ దోపిడీ చేస్తున్నారు యజమాన్యం కోట్లాది రూపాయల సంపాదన కోసం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఏ గ్రామంలో చూసినా ఊరికి ఎనిమిది బెల్ట్ షాపుల కంటే తక్కువ ఏం కనబడలేదు ఇంటి పక్కనే మద్యం దొరుకుతుంది కనీసం మంచినీళ్లు మాత్రం దొరకడం లేదు ఇంత విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న యజమాన్యంపై ఎలాంటి చర్య లు కూడా తీసుకోవడం లేదు జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా మండల అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వారి దందా మూడు పూలు ఆరు కాయలు కాస్త ఉంది వీరి ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన రేట్లు కు అమ్ముకుంటున్నారు వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులను రద్దు చేయాలని బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న వైన్స్ షాపుల యజమాన్యం విచ్చలవిడి దందాను అరికట్టాలని ఎమ్మార్పీ రేట్ల కు అమ్మకుండా దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీళ్లు కోటేశ్వరులు వైన్స్ షాపుల టెండర్ వేసి నిరుపేదల ను దోసుకుంటున్నారు అని అన్నారు