మీ కోరిక మేరకే..!

`త్వరలోనే కేటిఆర్‌ ను సిఎం చేద్దాం!

`కేసిఆర్‌ నేడు చెప్పనున్న మాట?

`నాతో కొందరు జాతీయ

రాజకీయాలకు, 

`కేటిఆర్‌తో తెలంగాణ రాజకీయాలలో…నవతరం నాయకులు.

`టి(బి)ఆర్‌ఎస్‌ మరింత సరికొత్తగా…

`యువకుడు కేటిఆర్‌ ప్రభుత్వ సారధ్యం…

`వివాదాల జోలికి పోకండి

`ప్రజలతో మమేకం కండి.

`టిఆర్‌ఎస్‌ తెలంగాణలో బలమైన పార్టీ.

`ఎంతో బలంగా వుంది.

`బలహీన పర్చే దుశ్చర్యలు వద్దు.

`ఆవేశం వద్దు-ఆలోచన కావాలి.

`ఎమ్మెల్యేలు తొందరపాటు పనికి రాదు.

`తొందరపడి మాటలు జారకండి.

` రెచ్చగొట్టే వారు ఎప్పుడూ వుంటారు.

`సంయమనం ఎంతో అవసరం.

`ప్రతిపక్షాలది దూకుడు కాదు…వింత పోకడ.

`అది కనిపెట్టుకొని వ్యవహరించాలి.

`బిజేపిది బలం కాదు, వాపు కూడా లేదు.

`దానికి రియాక్ట్‌ కావాల్సిన అవసరం లేదు.

` ప్రజలు అడిగేవాటికి సానుకూల స్పందన కనబర్చండి.

`ఎన్నికల ముందు ఇలాంటివి సహజం.

`గత ఎన్నికల ముందు కూడా ఇలాగే చేశారు.

`ప్రజలు మనవైపు వున్నారు.

`ప్రతిపక్షాలు సృష్టించే వివాదాలు నెత్తికెత్తుకోవద్దు.

`ముఖ్యంగా పార్టీ శ్రేణులతో కలివిడిగా వుండండి. 

`మళ్ళీ గెలిచేది మనమే…

`కమలం ఎప్పుడో వాడిపోయింది.

`గులాబీ గుభాలింపు, పరిమళం ఎప్పటికీ వుంటుంది. 

`త్యాగాల పునాదులు మనకే వున్నాయి.

`తెలంగాణ అభివృద్ధి ఘనత టిఆర్‌ఎస్‌ కే దక్కుతుంది.

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు, మంత్రి కేటిఆర్‌కు ప్రమోషన్‌ రానున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం వుంది. అతి త్వరలో కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మాట ఈ రోజు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పార్టీ నాయకులు మందు ప్రస్తావించే అవకాశం వుంది. ప్రతిపాదించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ అనూహ్య సమావేశానికి కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు పార్టీ నాయకులకు ఈ విషయం వెల్లడిరచి, వారి అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం వుంది. ముందు సీనియర్‌ నాయకులైన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులందరి చేత తీర్మాణాలు చేయించే అవకాశం కూడా వుందన్న సంకేతాలు అందుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న కోరిక చాలా మంది మంత్రులు కూడా వ్యక్తపర్చిన సందర్భం చూసిందే…అది ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే విషయం నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటిస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటేనే ఓ సంచనలం. ఆయన తెలంగాణ ఉద్యమం చేపట్టడం ఒక గొప్ప ఘట్టం. సుధీర్ఘంగా తెలంగాణ ఉద్యమం సాగించాల్సి వస్తుందన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం మరో విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక గొప్ప సందర్భం. అది కేసిఆర్‌ కలల రూపంగా ఆవిష్కరింపబడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ కావడం అన్నది తెలంగాణ మలుపుకు గొప్ప సంకేతం.  

                      తెలంగాణ ప్రగతికి కేసిఆర్‌ ఒక వరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కావడం వల్లే ఇప్పుడున్న వెలుగులు,ప్రగతి పరుగులు, కాలువల్లో నీళ్లు, ప్రాజెక్టులు, నిండు కుండల్లా చెరువులు,ఎక్కడా చూసినా పచ్చదనం, తెలంగాణకే మణిమకుఠం కాళేశ్వరం…ఇలా చెప్పుకుంటూ అధ్భుత తెలంగాణ మన కళ్ల ముందు కదిలే ప్రతి అభివృద్ధి కేసిఆర్‌ కలల రూపం. అలాంటి కేసిఆర్‌ దేశ రాజకీయాలను మార్చే మరో యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట సమితిగా రూపాంతరం చెందుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు మంత్రి కేటిఆర్‌కు అప్పగించడానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పూర్తి స్దాయిలో ఇక దేశ రాజకీయాల మీద దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కేసిఆర్‌ పట్టు అంటే ఎలా వుంటుందో అందరికీ తెలుసు. ఆయన ఒక్కసారి కమిటైతే ఇక దాని అంతు చూడకుండా వుండలేదు. దాన్ని సాధించేదాకా విశ్రమించరు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎవరు ఎన్ని మాట్లాడినా వాటిని గురించి పట్టించుకోలేదు. ఏ ఒక్క సందర్భంలోనూ వెనకడుగు వేయలేదు. పిడికిలి ఎత్తిన నాడే అడుగు మొదలుపెట్టారు. తొలి అడుగు వేసిన నాటి నుంచి తెలంగాణ సాధన విజయాన్ని ముద్దాడేదాకా తన ఉద్యమ ప్రస్ధానంలో ప్రయాణంలో అలుపు లేదు. వెనుదిగిరి చూడలేదు. ఇప్పుడు అదే కసి, అదే లక్ష్యం, అదే అంకితభావంతో మరోసారి దేశ రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. అందుకే ముందు కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసి, ఆ తర్వాత దేశ రాజకీయాలో విప్లవాత్మకమైన మార్పు కోసం బయలుదేరనున్నాడు.  

తెలంగాణ అంటే టిఆర్‌ఎస్‌. టిఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ. తెలంగాణలో మరో పార్టీకి తావు లేదు. కాసింత చోటు అంతకన్నా లేదు. ముఖ్యంగా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు ఉనికి లేదు. తెలంగాణకు సహకరించని పార్టీలకు ప్రజలు ఊపిరందించే పరిస్ధితే లేదు. తెలంగాణలో అత్యంత బలమైన పార్టీ టిఆర్‌ఎస్‌. రాజకీయంగా ప్రభల శక్తి. ఎదురులేని,తిరుగులేని రాజకీయ ప్రస్దానం టిఆర్‌ఎస్‌ది. అయితే ఎంత బలవంతమైన పార్టీ అయినా సరైన నాయకత్వం ఖచ్చితంగా వుండాలి. అందుకే కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలి. దేశ రాజకీయాల్లోకి కేసిఆర్‌ ప్రవేశిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఆపార్టీ రక్షణకు, పాలక పగ్గాలు చేపట్టేందుకు సరైన నాయకుడు కేటిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనయుడుగా వారసుడైనా, ఉద్యమ కారుడుగా కూడా కేటిఆర్‌ త్యాగాల పాత్ర కూడా వుంది. తెలంగాణ ఉద్యమంలో కేటిఆర్‌ కీలక భూమిక పోషించారు. కేసిఆర్‌ వెనకుండి ఉద్యమాన్ని ఆయన కూడా లీడ్‌ చేశాడు. ఇక ఎమ్మెల్యేగా ప్రజల అవసరాలు తీర్చాడు. ప్రజలకు సేవ చేస్తున్నాడు. మంత్రిగా పరిపాలనతో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. ప్రగతిని పరుగులుపెట్టించాడు. అందుకే ఎటు చూసినా కేటిఆర్‌లో గొప్ప నాయకుడే వున్నాడు. గొప్ప సామాజిక వేత్త వున్నాడు. సామాజిక సృహను మనసులో నింపుకున్న రామన్నగా గుర్తింపు పొందాడు. అందువల్ల కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే సరైన సమయం. మరో వైపు బిఆర్‌ఎస్‌ దేశ వ్యాప్తం కావాలి. పార్టీ విస్తరణ జరగాలి. అన్ని రాష్ట్రాల్లో ముందు జెండా ఎగరాలి. యంత్రాంగం కావాలి. అందుకు ఎంతో శ్రమ పడాలి. ఎంతో సమయం కేటాయించాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు, ఇప్పుడు కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రం తిరగాలి. ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. తెలంగాణ రాజకీయాలు పదిలంగా కొనసాగాలి. బిఆర్‌ఎస్‌లో కొత్త ఉత్తేజం నెలకొనాలి. అందుకోసం ఇప్పటినుంచే బిఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడిగా కేసిఆర్‌ ప్రయాణం మొదలు కావాలి. పార్లమెంటు ఎన్నికల దాక అలుపెరగని ప్రయాణం కొనసాగాలి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేం కావాలి. తీరిక లేని కాలం చూడాల్సివుంటుంది. అదే సమయంలో తెలంగాణలో అభివృద్ధి ఆగిపోవొద్దు. ప్రగతి కుంటుపడొద్దు. దేశ రాజకీయాలలో తెలంగాణ మోడల్‌ ఒక ఐకాన్‌ కావాలంటే యూత్‌ ఐకాన్‌గా ముద్ర వున్న కేటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి. ఆయన ఆధ్వర్యంలో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా పాలనలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవాలి. ఒకప్పుడు యూత్‌ మొత్తం టిఆర్‌ఎస్‌ జెండా, ఎజెండానే చూపించారు. కాని కొంత మార్పు వచ్చింది. నిన్నటి యువతరం నేడు పెద్ద తరమైపోయింది. ఆ తరం ఎప్పటికీ టిఆర్‌ఎస్‌ వెంటే వుంటుంది. కాని ఇప్పటి తరం టిఆర్‌ఎస్‌ వెంట నడవాలంటే, యువ నాయకత్వం తెలంగాణలో కావాలి. అది కేటిఆర్‌ కావాలి. ఇప్పుడిప్పుడే ఇతర పార్టీల వైపు ఆకర్షితులౌతున్న యువత తిరిగి టిఆర్‌ఎస్‌ వైపు చూసే అవకాశం వుంది. పైగా ఉద్యమ తరం కూడా కేటిఆర్‌తో కలిసి వచ్చేందుకు కూడా ఆసక్తి కనబర్చుతున్నారు. తెలంగాణ కోసం రండి అంటే ఎంతో మంది మళ్లీ టిఆర్‌ఎస్‌వైపు అడుగులేసేందుకు సిద్దంగా వున్నారు. కొత్త నాయకత్వంలో కొత్తకొత్త కొలువులు కూడా వచ్చే అవకాశం వుందన్న నమ్మకం యువతలో బలపడేందుకు దోహదపడుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే కేటిఆర్‌ మాత్రమే సుసాధ్యం చేస్తాడన్న విశ్వాసం కూడా పార్టీలో ఎంతో కనిపిస్తోంది. అందుకే త్వరలో కేటిఆర్‌ ముఖ్యమంత్రి అనే మాట ఈసారి మరింత బలంగా, సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నోట కూడా ఆ మాట వినడానికి అందరూ ఆసక్తిగా కూడా ఎదురుచూస్తున్నారు. కేటిఆర్‌ అనే నేను అనే మాట ఎప్పుడు వింటామా….కేటిఆర్‌ ఎప్పుడు చెబుతాడా? అని యువత కూడా రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తోంది. పార్టీ శ్రేణులనుంచి బలంగా వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!