Headlines

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి/ maoistla daadilo mla mruthi

మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే మృతి

దంతేవాడ, నేటిధాత్రి : చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి విరుకుపడ్డారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా ఐదుగురు పోలీసులు మతి చెందినట్లు సమాచారం. కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది. ఐఈడీని పేల్చిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జరిగే రెండురోజుల ముందే మావోయిస్టులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!