ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు గత అయిదు రోజుల నుండి ఈరోజు వరకు వరంగల్ నగరంలోని 1000 మంది చేనేత కార్మికులకు, మహిళా చేనేత కార్మికులు, కండెలు చుట్టే మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర మంత్రి కేటిఆర్ లు అండగా ఉంటారని, లాక్ డౌన్ వలన పేద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండడం కొరకు దేశం లోనే అందరి ముఖ్యమంత్రుల కంటే ముందే కేసిఆర్ స్పందించి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలతో పాటు ప్రతీ వ్యక్తికి 12 కిలోల బియ్యం అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచి పోయారన్నారు.
ఈరోజు కార్యక్రమంలో కుడా డైరక్టర్ యెలుగం శ్రీనివాస్, 29వ డివిజన్ కార్పోరేటర్ కావేటి కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *