పేదల దేవుడు కేసిఆర్‌: మాలోతు కవిత

`మాలోతు కవితతో కట్టా మాట…మంతి.

`అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ఒక్క కేసిఆర్‌ హయాంలోనే చూస్తున్నాం

`ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ పాలన స్వర్ణ యుగం.

`గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలౌతున్నాయి.

`పోడు సాగుకు కూడా రైతు బంధు అనేది విప్లవాత్మక నిర్ణయం

`గిరిజన ప్రజలకు గిరిజన బంధు అమలుతో ఆ వర్గాల జీవితాలలో వెలుగులు నిండుతాయి.

`రిజర్వేషన్లు పెంచితే విద్య, ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయి.

`ఒక్క తెలంగాణే కాదు దేశమంతా గిరిజన ప్రజల జీవితాలలో మార్పులు రావాలి.

`అందుకు కేసిఆర్‌ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర కావాలి.

`కేసిఆర్‌ ప్రధాని అయితే దేశ రాజకీయాలలో కూడా మార్పులొస్తాయి.

`దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయి.

`ఒక్క మాటలో చెప్పాలంటే దేశం సుభిక్షమౌతుంది.

`అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుంది.

`గుప్తుల కాలం మర్చిపోయి కేసిఆర్‌ కాలం స్వర్ణ యుగమని చెప్పుకుంటారు.

`సమాజం గురించి కేసిఆర్‌ అంత తపన పడే నాయకుడిని ఎక్కడా చూడలేదు.

`దేశం కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడు ఈ తరంలో లేడు…

`అందుకే కేసిఆర్‌ గ్రేట్‌ లీడర్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి ఉదాత్తమైన నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. ఆయన లాంటి ఉత్తమైన నాయకుడు మరొకరు కనిపించరు. ఇది అతిశయోక్తికాదు. ఎంతో దూరదృష్టి వుంటే తప్ప అంతటి నాయకుడు ఎవరూ కాలేరు. సంపూర్ణమైన నాయకుడు అంటే కేసిఆర్‌. ఆయనను చూసి భవిష్యత్తు తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఒక నాయకుడికి ప్రజలంటే ప్రేమ వుండాలి. ప్రజలకు ఏం కావాలో తెలియాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అంచనా వేయగలగాలి. ప్రజలు నాయకులనుంచి ఏ ఆశిస్తారన్నది బాగా తెలిసి వుండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి. నిత్యం ప్రజల గురించే నాయకుడు ఆలోచిస్తూ వుండాలి. ఇలాంటి ఉత్తమైన గుణగణాలన్నీ కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఆయన తెలంగాణ సాధించగలిగారు. అసలు తెలంగాణ ఉద్యమమంటే అందరూ చేసేదేలే…ఇప్పుడు కొత్తగా ఏముంటుందిలే…అన్నవాళ్లే చాలా మంది. కాని తెలంగాణ జెండా ఎత్తి, కొత్త తరం రాజకీయ ఉద్యమ పోరాటాన్ని మిలితం చేసిన కేసిఆర్‌ తెలంగాణ సాధించడం అన్నది ఎవరూ ఊహించింది కాదు…..అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది చరిత్రలో ఒక సువర్ణాక్షరమైతే…కేసిఆర్‌ ఉద్యమ జీవితం ఒక సువర్ణాధ్యాయం. అంటున్న మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితతో ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు మాటా…మంతి! తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు అందరూ తెలంగాణ వస్తే చాలు అనుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఆత్మగౌరవం మాత్రమే వినపడేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యేది. అలా సామాన్య ప్రజలైనా, నాయకులైనా అంతే…సీమాంధ్ర నాయకత్వం ఏదైనా సరే…అందరూ తలూపాల్సిందే…తలొంచాల్సిందే.. తెలంగాణలో వారిని ఎదిరించి మాట్లాడే శక్తి వున్న నాయకులే లేని రోజులవి. అలాంటి సమయంలో తెలంగాణ అనే పదమే మాట్లాడేందుకు వీలు లేని పరిస్ధితి. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేదించారు. వెనుకబడిన ప్రాంతం అనాల్సివచ్చేది. అయితే ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదం చేసింది. తెలంగాణ అనొద్దన్న ఉమ్మడి రాష్ట్ర పాలకులే వెనుకబడిన ప్రాంతం అనొచ్చన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో వెనక్కి నేట్టేబడిన ప్రాంతంగా మనసుల్లో ముద్రపడిపోయింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ జెండా ఎత్తిన కేసిఆర్‌ ప్రజలను కదలించిన విధం మాత్రం అపురూమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంటే చాలు..ముందు నిట్టూర్చేవాళ్లే ఎక్కువ. తర్వాత భయపడేవారు కూడా ఎక్కువే. జై తెలంగాణ అంటే నక్సలైట్‌ అనే ముద్ర వేసే రోజులవి. అలాంటి సమయంలో దిక్సూచీలా మారి, తెలంగాణను ఒక దివిటీగా మారి, చైతన్య దీప్తిగా మారి వెలుగు వైపు ప్రజలను నడిపించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం తెలంగాణ వస్తే చాలనుకున్నాం. 

మన నిధులు మనకే అంటే సరే ఎంతో కొంత మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చు అనుకున్నాం. కాని తెలంగాణ వస్తే ఇంత ప్రగతి సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రూపు రేఖలు ఇంత గొప్పగా ఆవిషృతమౌతాయని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ చరిత్ర తెసిన వారు కూడా ఊహించలేకపోయారు. తెలంగాణ వచ్చిన ఇంత అతి తక్కువ కాలంలో కోటి ఎకరాల మాగాణ అవుతుందని అనుకున్నామా? తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నాం. అందుకు కనీసం ఓ ఇరవై ముప్పై ఏళ్లు పడుతుందేమో అనే అందరూ అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధ్భుతాలు సృష్టించారు. అన్ని వర్గాల అభ్యున్నతి సాధించింది. కేవలం ఆరు నెలల్లో చిమ్మ చీకట్ల నుంచి తెలంగాణలో వెండివెలుగులు ఆవిష్కారమాయ్యయి. ఒకనాటి తెలంగాణ పరిస్ధితి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా అన్నది తెలిసిపోతుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలన్నదానిపై కొన్ని పమితులలోనే ఆలోచన చేశారు. అంతటితో అవే గొప్ప పధకాలు అని ప్రచారం చేసుకున్నారు. కీర్తించుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏక కాలంలో ఇన్ని రకాల పధకాలు అమలు చేసి, తెలంగాణలో సమస్యలు లేని కాలాన్ని సృష్టిస్తాడని ఎవరూ అనుకోలేదు. అసలు దేశంలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు.గత కొన్ని దశాబ్ధాలుగా దేశమంతా అమలౌతున్న రేషన్‌ బియ్యం, వృద్థులకు పెన్షన్‌ ఇవి తప్ప మరే పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ ప్రత్యేకమే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతటి ప్రజా నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో సీలింగ్‌ లేని రేషన్‌ అందిస్తున్నాం. పైగా ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇవ్వడం జరుగుతోంది. వీటికి తోడు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అసలు కళ్యాణ లక్ష్మి అనే పథకం పేదింటి ఆడపిల్ల జీవితానికి ఒక వరంగా మారింది. ఆడ పిల్ల పెళ్లి చేయడం అంటే సగటు తండ్రికి ఎంత కష్టమో! కళ్లారా చూసిన ముఖ్యమర్రతి కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అంటే ఆయన తెలంగాణ వస్తే, అందులోనూ అధికారంలోకి వస్తే ఎలాంటి పధకాలు అమలు చేసుకోవచ్చో అన్నవి ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇంత ముందుచూపు వున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా వున్నారా? ఒక్క కేసిఆర్‌ తప్ప మరెవరూ కనిపించరు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌.తెలంగాణ ప్రజలు గత ఎనమిది సంవత్సరాల కాలంలో అనుభవిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలి.

ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలోవున్న బిజేపి, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసిఆర్‌లా ఆలోచించలేదు. పనులు అమలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన నుంచి తెలంగాణలో ఏమేమి అమలౌతున్నాయో! కేంద్రంలోపాటు, అన్ని రాష్ట్రాలూ చూస్తున్నవే…కాని మన రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలు అనుకోవడం లేదు. దేశం మొత్తం అమలు చేయొచ్చని కేంద్రం అనుకోవడం లేదు. ఈ పార్టీలు అధికారంలో వున్నంత కాలం తెలంగాణ పధకాలు దేశంలో అమలుకావు. అందుకే దేశమంతా తెలంగాణలాగా ప్రగతిని సాధించాంటే, దేశమంతా సస్యశ్యామలం కావాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ నాయకుడు కావాల్సిందే. కేసిఆర్‌ దేశానికి ప్రధాని కావాల్సిందే…! ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు..దేశంలోని కోట్లాది మంది ప్రజలు, వేలాది మంది నాయకులు కోరుకుంటున్న మాట. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎంత సేపు పన్నులెలా వేయాలి. ప్రభుత్వ ఆస్ధులెలా అమ్మాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎలా దోచిపెట్టాలి. సామాన్యుడి నడ్డి ఎలా విరువాలి. ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేయాలి. నల్ల దనం పేరు చెప్పి, నోట్ల రద్దు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు…నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఎంతో గొప్ప పని చేసినట్లు అర్ధరాత్రి పార్లమెంటులో జిఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయని నమ్మించారు. ఇప్పుడు పాలు, పెరుగు మీద కూడ పన్నులేసి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అసలు బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చెప్పుకోవడానికి ఒక్కంటే ఒక్క పధకమైనా ప్రారంభించారా? అమలు చేశారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పాత పధకాలకు పేర్లు మార్చుడం, కొత్త పన్నులు వేయడం తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు…మత రాజకీయాలు తప్ప, మానవత్వాన్ని ప్రదర్శించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. ఆ పరిస్ధితి పోవాలి. కొత్త తరం నాయకత్వం దేశానికి కావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం కావాలి. దేశమంతా సాగునీటితో కళకళలాడాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. దేశంలో అవకాశం వున్న ప్రతీ చోట కాళేశ్వరం ఆలాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. నదుల నీటిని ఒడిసిపట్టాలి. పొలాలకు మళ్లించాలి. అందుకోసం అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. చెరువులు పునరుద్దరన సాగాలి. దేశంలోని ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీరు అందాలి. తెలంగాణలో విజయవంతమైన మిషన్‌ భగీరధ కార్యాక్రమం దేశమంతా అమలు కావాలి. ప్రతి గడపకు మంచినీరు చేరాలి. ఇలా అనేక సంక్షేమకార్యక్రమాలు దేశమంతా అమలుకావాలి. అందుకు కేసిఆర్‌ దేశ ప్రధాని కావాలి. దేశానికి దిశా నిర్ధేకుడై స్వర్ణ యుగం తేవాలి. గుప్తుల కాలం స్వర్ణయుగమని ఇంకా చెప్పుకుంటున్న మనం…కేసిఆర్‌ కాలం మరో స్వర్ణయుగమని చెప్పుకునే రోజులని భవిష్యత్తులో తరతరాలు చెప్పుకోవాలి. కేసిఆర్‌ హయాంలోని అందే దీర్ఘకాలిక ప్రణాళికల ప్రయోజనాలు తరతరాలు అందాలి. దేశం సగర్వంగా తలెత్తుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!