‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ జేబులో కేయు అధికారులు…!
”ఏమో సమ్మగా, సరీ సప్పుడు కాకుండా నంజుకుతిన్నారేమో…రహస్యంగా ముడుపులెన్ని తీసుకున్నారో… పర్మిషన్లు కాగితాల్లో చూపి సౌకర్యాలు లేకుండా కాలేజీ నిర్వహించుకోవటానికి హక్కులు ఇచ్చారేమో… కాసులకు కక్కుర్తిపడి సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం జేబులో నక్కినక్కి ఉంటున్నారేమో…ఇది చలనం లేకుండా నిద్ర మత్తులో ఉంటూ చర్యలు చేపట్టటానికి వెనుకాడుతున్న కేయు అధికారుల వైఖరి పట్ల కలుగుతలున్న అనుమానాలు..”
హన్మకొండ పొద్దుటూరు కమర్షియల్ కాంప్లెక్స్‌లో అసౌకర్యాలతో, నిబంధనలకు విరుద్దంగా నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ పట్ల కేయు సిడిసి డైరెక్టర్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కమర్షిల్ కాంప్లెక్స్‌లో మహిళా కాలేజీని నిర్వహించుకోవటానికి కేయు అధికారులు పర్మిషన్ ఇవ్వటానికి కారణాలేంటనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. దర్జాగా నిబంధనలను బేకాతర్ చేస్తూ కాలేజీని నిర్వహిస్తున్న యాజమాన్య వైఖరి సైతం కేయు అధికారుల అసమర్థతను తెలుపుతుందని పలువురు వాఖ్యానిస్తున్నారు.
విర్రవీగుతున్న కాలేజీ యాజమాన్యం…చోద్యం చూస్తున్న కేయు అధికారులు…
‘పార్కింగ్ స్థలం లేకున్న…కనీసం మంచినీటి సౌకర్యం లేకున్న…గ్రౌండ్ లేకున్న…ట్రాపిక్ నిబంధనల పర్మిషన్ లేకున్న, వీటితో పాటు విద్యాబోధనకు అనువైన పరిసరాలు లేకున్న యధేచ్ఛగా కాలేజీని మేం నిర్వహిస్తాం… మమ్మల్ని అడిగే వారే లేరు…పత్రికల్లో కథనాలు రాస్తే మాత్రం ఏం ఒరుగుతుంది…పర్మిషన్లు ఇచ్చే అధికారులే మా జేబుల్లోనే ఉన్నారనే విధంగా సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం విర్రవీగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే కాలేజీ యాజమాన్యం బేజులో కేయు అధికారులు బంధీగా ఉండటం మూలంగానే ఆడిందే ఆటగా పాడిందే పాటగా తమను ఎవరూ కదిలంచలేరనే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుందనేది గమనార్హం.
అధికారుల నిర్లక్ష్యానికి ముడుపులే కారణమా…!..?
సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల పర్యవేక్షణ లేకపోవటానికి….కనీస మౌళిక సదుపాయాలు లేకున్న పట్టించుకోకపోవటానికి కారణం ముడుపులు ముట్టడమే కారణమా…అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేయు అధికారులు నిద్రమత్తులో ఉన్నారా…కాసులకు కక్కుర్తిపడి కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారా…అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికైనా కేయు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి ఉంది.
( అనుమతులకు అధికారుల…వాటా…?
త్వరలో… )