
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల గురించి రామడుగు ఎస్ఐ తోట తిరుపతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జరగాలని, దీనికి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగింది. గణేష్ మండప నిర్వహకులు మండపాలు రోడ్డుకి అడ్డంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న పిల్లలను వెంట తీసుకొని పోకూడదు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ, నిమార్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై చట్టరీత్యా చర్య తీసుకొనబడును. అదేవిధంగా రోడ్లు బ్లాక్ కావడం, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చేసుకోవాలి. గణేష్ మండపం వద్ద ఏదైనా అనుకోని ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరగకుండా వాటర్ డ్రమ్ములు, సాండ్ బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ఈకార్యక్రమానికి వినాయక ఉత్సవాల కమిటీ నాయకులు, సభ్యులు, గణేశ్ మండపాల నిర్వహణ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.